Login with OTP

విలన్ హస్బెండ్-58

aashyatech

Author

డిన్నర్ కంప్లీట్ చేసిన మాన్య తన రూమ్ కి వెళ్ళి అమర్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది…… ఇన్ని రోజుల పరిచయం లో అమర్ ఎప్పుడు తనతో మిస్ బిహేవ్ చేయలేదు అలాగే తనను ప్రేమిస్తున్నట్టు కూడా ఎప్పుడు అమర్ చెప్పలేదు & ప్రేమను చూపించలేదు…….. తను ఎప్పుడు కనిపించినా తనతో కావాలని రీసన్ లేకుండానే గొడవ పడే అమర్ సడెన్ గా తనను లవ్ చేస్తున్నా అని చెప్పేసరికి మాన్య మైండ్ అంతా గజిబిజిగా ఉంది….. ఇందాక డిన్నర్ చేసేటపుడు కూడా అమర్ చూపులు ముందులా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అందుకే మాన్య సరిగ్గా డిన్నర్ కూడా చేయకుండా వచ్చేసింది…..

బెడ్ మీద కూర్చుని అమర్ గురించి ఆలోచిస్తున్న మాన్య కి తన రూమ్ డోర్ ఓపెన్ అవ్వడం తో అటుగా చూసిన మాన్య కి అమర్ మిల్క్ గ్లాస్ చేత్తో పట్టుకుని లోపలికి రావడం చూసి పైకి లేచి నుంచుంటుంది…… మరీ అంత రెస్పెక్ట్ అక్కర్లేదు మేడం అని నవ్వుతూ వచ్చి బెడ్ మీద కూర్చుంటూ మాన్య ను ఎదురుగా కూర్చో పెట్టుకుని ఎందుకంత కంగారు పడుతున్నావ్ అంటూ చాలా స్మూతీ వాయిస్ తో అడుగుతాడు…..

నేనా….?? నేను ఎందుకు కంగారు పడతాను లేదు నేను నార్మల్ గానే ఉన్నాను అని మొహాన్ని తిప్పుకుని ఎటో చూస్తూ చెప్తున్న మాన్య మొహాన్ని తన వైపు తిప్పుకుని ఇప్పుడు చెప్పు అంటూ తన వైపు సూటిగా చూస్తున్న అమర్ ను చూసి ప్చ్…..!! అమర్ ఎందుకలా చూస్తున్నావ్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది……. నువ్వు నాతో ముందులా ఉండరా ఇలా కొత్తగా బిహేవ్ చేయకు నాకు ఇదంతా డైజెస్ట్ చేసుకోడానికి అవ్వట్లేదు లిటరల్లీ పిచ్చి పడుతుంది తెలుసా …..!! నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు నువ్వు జోక్ కానీ చేయట్లేదు కదా…..??

ఏయ్ స్టుపిడ్ ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా….?? నేను నిన్ను ఫస్ట్ టైమ్ చూసినప్పుడే లవ్ లో పడిపోయా బట్ మనం ఎప్పుడు కలిసినా మన మధ్య ఏదో ఒక గొడవ జరిగేది & నాకు కూడా ఆ గొడవలు చాలా ఫన్నీ గా నీతో అవి నాకు మంచి మెమోరీస్ అనిపించేవి అందుకే కావాలని నీతో గొడవ పడే వాడిని……   సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ నువ్వు డిన్నర్ సరిగ్గా చేయలేదు అని మిల్క్ తీసుకుని వచ్చాను అని మాన్య వద్దు అంటున్నా మిల్క్ తాగించి ……

 

మాన్య పడుకున్న తర్వాత బెడ్ షీట్ కప్పుతూ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం అంటూ తన పెదవులు జస్ట్ టచ్ అయ్యేలా మాన్య ఫోర్హెడ్ మీద కిస్ ఇచ్చి గుడ్ నైట్ మాన్య అంటూ గ్లాస్ పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు………

డోర్ లాక్ చేసి వెళ్ళిపోయిన అమర్ ను చూసిన మాన్య కి అమర్ తనను కిస్ చేయడం గుర్తొచ్చి తనలో తానే నవ్వుకుంటూ ఫస్ట్ టైమ్ వీడు కొత్తగా కనిపిస్తున్నాడు అని అమర్ ను తలచుకుంటూ అమర్ తన కోసం రిస్క్ చేసి నీళ్లలోకి దూకడం & తను కళ్ళు తెరిచినప్పుడు అమర్ కళ్ళల్లో తన గురించి బెంగ, భయం తనకు ఏమైందో అన్న కంగారు ఇప్పుడు అమర్ మాటల్లో నిజాయితీ మొత్తం ఇలా గుర్తు చేసుకుంటూ మాన్య ఎప్పటికో పడుకుంటుంది……

🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍

రుద్ర తన రూమ్ కి వెళ్ళబోతూ ఓపెన్ లో ఉన్న మాయ రూమ్ లో లైట్ వెలుగుతూ ఉండడం  చూసి నా పొట్టి పిచ్చుక ఇంకా పడుకోకుండా ఎమ్ చేస్తుంది??? అని ఆలోచిస్తూ మాయ రూమ్ డోర్ కాస్త ఓపెన్ చేసి చూసేసరికి మాయ మొబైల్ లో ఏదో చూస్తూ కనిపిస్తుంది….. ఎమ్ చేస్తుంది ఇది అని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ డోర్ నాక్ చేయగానే మాయ వెంటనే మొబైల్ ఆఫ్ చేసి డోర్ వైపు చూస్తుంది…..

ఆర్య…..!! నువ్వా ఏంటి ఇంకా పడుకోలేదా ప్లీస్ కమ్ అని నవ్వుతూ పిలుస్తున్న మాయ వైపు చూస్తూ అది నేను అడగాలి ఇంకా పడుకోకుండా ఎమ్ చేస్తున్నావ్ మాయ మార్నింగ్ ఫంక్షన్ ఉంది త్వరగా పడుకోమని తాతయ్య వాళ్ళు చెప్పారు కదా….??

అవును బట్ నిద్ర రావడం లేదు అందుకే ఊరికే అలా కూర్చున్నా నువ్వేంటి ఇలా వచ్చావ్….??

నా రూమ్ కి వెళ్తూ నీ రూమ్ లో లైట్ ఇంకా ఆన్ లో ఉండడం చూసి ఇలా వస్తున్నా & అవును ఏంటి మొబైల్ లో అంత సీరియస్ గా చూస్తున్నావ్….??

నథింగ్ అంటూ కంగారుగా మొబైల్ ను గట్టిగా పట్టుకున్న మాయ ను చూసి నవ్వుతూ నువ్వు లేదు అనడం లోనే ఏదో ఉందని క్లియర్ గా కనిపిస్తుంది….. నాతో కూడా చెప్పినంత సీక్రెట్ నా మాయ…..!!

అలాంటిదేం లేదు ఆర్య అంటూ తన మొబైల్ లాక్ ఓపెన్ చేస్తూ రుద్ర చిన్నప్పటి పిక్ చూపిస్తుంది అది చూసిన రుద్ర లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం ఎమ్ తెలియనట్టు ఎవరు మాయ ఈ అబ్బాయి అంటూ క్యూట్ స్మైల్ తో అడుగుతాడు……

నేను లవ్ చేస్తున్న అబ్బాయి పేరు హర్ష అంటూ సిగ్గు పడుతూ చెప్తున్న మాయ ను చూసి రుద్ర కి తెగ ముద్దొస్తోంది కస్టంగా తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని వాట్…..?? ఇంత చిన్న అబ్బాయిని లవ్ చేస్తున్నావా…..???  మీ మ్యారేజ్ ను ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు మాయ అంత దాకా ఎందుకు మీ మ్యారేజ్ ను మీ అన్నయ్యే ఒప్పుకోడు….?? అంత చిన్న ఏజ్ అబ్బాయితో లవ్ ఏంటి మాయ….!!

అబ్బా ఆపు ఆర్య అది తన చిన్నప్పటి పిక్ ఇప్పుడు తనకు 25 పైనే ఉంటాయి 😶😌…..

ఓహ్ అలాగా అయితే ప్రాబ్లెమ్ లేదు అదేదో ఇప్పటి పిక్ నే చూపించచ్చు కదా….??

తను ఇప్పుడు ఎలా ఉన్నాడో నాకు తెలిస్తే కదా నీకు చూపించడానికి తను నాకు నా చిన్నప్పుడే దూరం అయ్యాడు….. కొన్ని రీసన్స్ వల్ల నా హర్ష నాకు దూరంగా వెళ్ళిపోయాడు ఎప్పటికైనా తను వస్తాడు అన్న ఆశ తోనే వెయిట్ చేస్తున్నాను……

ఒకవేళ హర్ష మనసులో ఎవరైనా ఉంటే అప్పుడేం చేస్తావ్ మాయ…..??

తన సంతోషమే నాకు ఇంపార్టెంట్ అని తన లాగా దూరంగా అయితే వెళ్ళను దాన్ని చంపి దాని ప్లేస్ లోకి నేను వెళ్తాను హర్ష చేతులు విరిచేసి అయినా నా మెడలో తాళి కట్టించుకుంటాను అని చెప్తున్న మాయ ను చూసి రుద్ర కి నవ్వొస్తుంది……

వామ్మో నువ్వు ఇన్నోసెంట్ అనుకున్నా కాదు అని ప్రూవ్ చేసావ్ గా ఎప్పటికైనా నీ ట్రూ లవ్ నే నిన్ను హర్ష ను కలుపుతుంది అని చిన్న స్మైల్ తో చెప్తూ బాగా లేట్ అయింది పడుకో మాయ అంటూ చిన్న స్మైల్ తో చెప్పగానే గుడ్ నైట్ ఆర్య అని చెప్పి బెడ్ మీదకు వెళ్ళబోతూ బెడ్ షీట్ కాళ్ళకు అడ్డుపడి పడబోతున్న మాయ నడుము పట్టుకుని మీదకు లాక్కుంటూ తను పడకుండా ఆపుతాడు……

మెడ దగ్గర రుద్ర షర్ట్ ను గట్టిగా పట్టుకుని సపోర్ట్ తీసుకున్న మాయ కి రుద్ర గుండె దగ్గర షర్ట్ పక్కకు జారి తన టాటూ కనిపించబోయే టైమ్ కి రుద్ర తనను సరిగ్గా నుంచో పెట్టడం తో మాయ అది చూడదు…… కేర్ఫుల్ మాయ గుడ్ నైట్ అని చెప్పి రుద్ర ఫాస్ట్ గా బయటకు వచ్చి గాడ్ కొంచెం లో మిస్ అయ్యాను అని వడి వడిగా తన రూమ్ కి వెళ్ళిపోతాడు…..

( మాయ మెహందీ పెట్టుకుంది కదా మొబైల్ ఎలా పట్టుకుంది & ఇప్పుడు షర్ట్ కాలర్ ఎలా పట్టుకుంది అని మీకు డౌబ్ట్ రావచ్చు 🫣 మెహందీ ఆల్రెడీ ఆరిపోయింది అందుకే మాయ అంత ఫ్రీగా మొబైల్ పట్టుకుంది 😜☺️)

🤍💚🤍💚🤍💚🤍💚🤍💚🤍

మంచి డీప్ స్లీప్ లో ఉన్న ఆనంద్ కి పదే పదే మొబైల్ రింగ్ అవుతూ ఉంటే మత్తుగా కళ్ళు తెరిచి తన పక్కనే బెడ్ ఎడ్జ్ లో పడున్న మొబైల్ పీక నొక్కి కాల్ అటెండ్ చేసిన ఆనంద్ హలో హు ఇస్ దిస్ అంటూ నిద్ర మత్తులో అడుగుతాడు….. నందు అంటూ తన ఇయర్ డ్రమ్స్ పగిలి పోయేలా అటు వైపు నుండి అరిచిన శ్రియ వాయిస్ కి ఉలిక్కిపడి ఆ…..!! అంటూ లేచి కూర్చుని అబ్బా శ్రియ పిచ్చి కానీ పట్టిందా ఏంటి ఒక్క క్షణం గుండె ఆగిపోయింది తెలుసా ఎందుకలా అరుస్తున్నావ్…..??

అరవడం కాదు నిన్ను ఉతికి ఆరేయాలి నందు ఎన్ని సార్లు కాల్ చేసినా పిక్ చేయవేంటి ఎక్కడ చచ్చావ్…..?? నా కాల్ కూడా పిక్ చేయనంత బిజీగా ఎమ్ చేస్తున్నారు…..???

నీ కాల్ నేను పిక్ చేస్తే ఇక్కడ రుద్ర నా పీక కట్ చేసేలా ఉన్నాడు 🤦 మీ ఇద్దరి మధ్య నేను శాండ్విచ్ అయిపోతున్నా 🙆 శ్రియ ఈ కాల్ ఏదో వాడికే చేసి నా దగ్గర ఏడ్చే ఏడుపు రుద్ర దగ్గర ఎడవచ్చు కదా మధ్యలో నాకు దేనికి ఈ టార్చర్ చెప్పు…..??

రుద్ర్ నా నంబర్స్ బ్లాక్ చేసాడు నందు ప్లీస్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్పు నందు నేను అర్జంట్ గా తనను చూడాలి ప్లీస్ ఆంటీ కి కూడా తను ఎక్కడున్నాడో చెప్పలేదట

నీకెలా చెప్పాలి శ్రియ రుద్ర తను లవ్ చేస్తున్న అమ్మాయిని మీట్ అయ్యాడు & ఆ అమ్మాయి కూడా రుద్ర ను లవ్ చేస్తోంది….. నువ్వు ఇంకా పిచ్చిగా ప్రేమించడం లో అర్థం లేదు ప్లీస్ శ్రియ అర్థం చేసుకో …..!!

రుద్ర తను లవ్ చేసిన అమ్మాయిని కలిశాడు అన్న దగ్గరే శ్రియ ఆగిపోయి ఏడుస్తూ కాల్ కట్ చేస్తుంది……  బట్ ఆనంద్ కి మాత్రం కోపంగా కాల్ చేసింది అని అర్థం అవ్వడం తో తను సెట్ అవ్వడానికి టైం కావాలి అని తను కూడా శ్రియ కి కాల్ బ్యాక్ చేయడు……

🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍

జై మెహందీ ఆర్టిస్ట్ నడుము పట్టుకుని రూమ్ లోకి డోర్ లాక్ చేయడం చూసిన ఆద్య కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ షాక్ అవుతుంది….. వాట్ ద హెల్ 😬😬 అసలు వీడు ఎమ్ అనుకుంటున్నాడు కొత్త ప్లేస్ & కొత్త ఇల్లు…. కొత్త మనుషులు ఎంత డీసెన్సీ గా ఉండాలి రిలేటివ్స్ ఇంట్లో స్టే చేస్తున్నప్పుడు బట్ వీడు వీడి ఇష్టానికి బిహేవ్ చేస్తున్నాడు అని పళ్ళు నూరుతూ చీచీ…..!! తలచుకుంటేనే అసహ్యంగా ఉంది వీడికంటూ క్యారెక్టర్ లేదు ఇలాంటి వాడు మామ కి ఎలా పుట్టాడు అని తిట్టుకుంటూ అదే హాల్ లో కూర్చుంటుంది…..

జై రూమ్ లోకి వెళ్ళిన మెహందీ ఆర్టిస్ట్ కావ్య జై మెడ చుట్టూ చేతులు వేస్తూ జై నీతో ఇలా ఇంత త్వరగా ఇంత లోన్లీ టైం స్పెండ్ చేస్తానని ఐ నెవెర్ ఎక్స్పెక్టెడ్ టుడే నైట్ ఐ ఆమ్ యూర్స్ అని మత్తుగా చెప్తున్న కావ్య ను చూసి జై సైడ్ స్మైల్ ఇస్తాడు…..

నాకు కూడా ఇంత రెడ్ కలర్ లిప్స్ లేవు జై ఈ ఎర్రటి పెదాలతో ఓ ఫ్రెంచ్ కిస్ ట్రై చేద్దామా అంటూ జై నుండి దూరం జరుగుతూ తన డ్రెస్ ను జై ముందే ఎలాంటి బిడియం లేకుండా రిమూవ్ చేస్తున్న కావ్య ను చూసి జై కూడా తన డ్రెస్ తీస్తూ ఉంటాడు…..

కావ్య జై లిప్స్ ను కిస్ చేయబోతూ ఉంటే అప్పటికే తనకు ఫీలింగ్స్ స్టార్ట్ అవ్వడం తో బెడ్ మీద కు కల్పన ను ఎత్తి పడేస్తూ తను కావ్య మీదకు చేరి నడుము దగ్గర నుండి ఒక్కో ముద్దు పెడుతూ లిప్స్ దగ్గరకు వచ్చి ఇద్దరి లిప్స్ కలపబోయే టైం కి నవ్వుతున్న వినయ్ వర్మ రూపం తన కళ్ళ ముందు కనిపించడం తో జై ఒక్క సారిగా పక్కకు జరిగి లేచి కూర్చుంటూ తల పట్టుకుంటాడు……

వాట్ హ్యాపెండ్ డియర్ ప్లీస్ కమ్ అంటూ మత్తుగా తనను వెనుక నుండి హగ్ చేసుకున్న కావ్య ను విసురుగా వెనక్కి నెట్టి హౌ డేర్ యూ టు టచ్ మీ అని ఎర్రటి కళ్ళతో కావ్య వైపు చూస్తూ టచ్ చేస్తే నేనే చేయాలి కానీ ఏ అమ్మాయి నన్ను టచ్ చేయడానికి నేను ఒప్పుకోను అని అప్పటికే వినయ్ వర్మ మాటలు మైండ్ లో తిరుగుతూ ఉంటే గెట్ లాస్ట్ అంటూ కోపంగా అరుస్తూ కింద పడ్డ షాట్ తీసుకుని వేసుకుంటాడు…..

ఐ ఆమ్ సారి జై నేను టచ్ చేయను ఇలా మిడిల్ లో వదిలేయకు ప్లీస్ కమ్ అంటున్న కావ్య వైపు తన డ్రెస్ విసిరి కొట్టి 2 మినిట్స్ లో డ్రెస్ అప్ అయ్యి నా రూమ్ నుండి వెళ్ళిపో లేదా ఇలాగే నిన్ను నెట్టేస్తా అంటూ జై కోపంగా చెప్పి వాష్ రూమ్ డోర్ ధబేల్ మంటూ క్లోజ్ చేసుకుంటాడు…..

వీడి మూడ్ బావున్నట్టు లేదు ఎస్కేప్ అవ్వడం బెటర్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడ్ని మీట్ అవ్వడం బెటర్ అనుకుని ఫాస్ట్ గా డ్రెస్ అప్ అయ్యి బయటకు వస్తున్న కావ్య కి అదే ఫ్లోర్ హాల్ లో కూర్చున్న ఆద్య ను చూసి కావాలని బై డార్లింగ్ గుడ్ నైట్ అంటూ రూమ్ లో లేని జై కి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సిగ్గు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది……

కావ్య పెదవి దగ్గర జై కొట్టడం వల్ల పెదవి చిట్లి రక్తం వస్తూ ఉంటే ఆద్య కి మరోలా అర్థం అయ్యి కావ్య వైపు అసహ్యంగా చూస్తూ అయిదు నిమిషాలు ఆగి రూమ్ లోకి వెళ్ళిన ఆద్య బెడ్ మొత్తం చిందర వందరగా జై వేసుకున్న డ్రెస్ ఫ్లోర్ మీద అక్కడక్కడ పడి వాష్ రూమ్ నుండి వాటర్ సౌండ్ విని ఇద్దరి మధ్య ఇంటిమేషన్ అయిపోయింది అనుకుని జై ను అపార్థం చేసుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది…..

మరో వైపు వాష్ రూమ్ లో ఉన్న జై చల్లని బాత్ టబ్ లో పడుకుని రిలాక్స్ అవుతూ డాడ్ మీరు నా వల్ల పడుతున్న పెయిన్ నాకు తెలుస్తున్నా ఇందులో నుండి బయటకు రాలేక పోయేవాడిని బట్ ఫస్ట్ టైమ్ మీ కోసం నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా అంటూ చమటలు పట్టిన తన మొహాన్ని బాత్ టబ్ లో ముంచేస్తాడు……

ఈ కావ్య వల్ల ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లెమ్ రానుందా…..??? ఆధ్య జై ల మధ్య ఎమ్ జరగబోతుంది…….?? శ్రియ నెక్స్ట్ స్టెప్ ఏంటి…..?? అమర్ లవ్ ను మాన్య యాక్సెప్ట్ చేస్తుందా…..?? మాయ కి రుద్ర ఎవరో తెలియనుందా…..??