Login with OTP

విలన్ హస్బెండ్{2}-5

aashyatech

Author

తన రెగ్యులర్ అలారం తో నిద్ర లేచిన ఆద్య బెడ్ పక్కనున్న టేబుల్ మీద టీ కప్ కనిపించగానే కప్ మీదున్న కోస్టర్ తీస్తుంది …… !! వేడి వేడిగా పొగలు కక్కుతున్న టీ ను చూసి దాన్ని చేతిలోకి తీసుకున్న ఆద్య మెల్లగా సిప్ చేస్తూ మొబైల్ స్క్రోల్ చేస్తూ అలాగే 10 నిమిషాలు గడిపేస్తుంది….. !! తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి నీట్ గా ఫ్రెష్ అయి శారీ కట్టుకుని కిందకు వెళ్తుంది….. !! ఆద్య కిందకు వెళ్ళేసరికి హాల్ లో న్యూస్ పేపర్ చదువుతూ కనిపిస్తున్న ప్రతాప్, వినయ్ లను చూసి గుడ్ మార్నింగ్ అని చెప్తూ వెళ్ళి ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుంటుంది…… !!

మావయ్య మీకు ఇంకా కాఫీ ఇవ్వలేదా అని అడుగుతూ ఏయ్ రేణు….. రేణు అని పిలవగానే కిచెన్ లో డిషెస్ క్లీన్ చేస్తున్న రేణుక ఆద్య వాయిస్ కి హ్యాండ్ వాష్ చేసుకుంటూ పరుగున హాల్ లోకి వస్తుంది…… !! రేణుక నార్మల్ చీర కట్టుకుని మెడలో పసుపు తాడు & చేతికి మట్టి గాజుల తో జుట్టు ముడి పెడుతూ అక్కడికి వచ్చిన రేణుక ను చూసిన ఆద్య మావయ్య, తాతయ్య లేవగానే టీ ఇవ్వాలని తెలియదా ……. ?? వాళ్ళు నిన్ను అడిగే వరకూ ఇవ్వవా అంటూ రేణుక మీద సీరియస్ అవుతుంది….. !!

అది కాదు ఆద్య నైట్ బాగా వర్క్ ఎక్కువైందని డిషెస్ క్లీన్ చేయలేదు అందుకే లేవగానే ఇల్లు క్లీన్ చేసి నీకు టీ పెట్టేసి ఫాస్ట్ గా డిషెస్ క్లీన్ చేస్తున్న….. !! వీళ్ళు లేచారని నాకు తెలియదు ఇదిగో ఇప్పుడే టీ పెట్టీ తీసుకొస్తాను….. !!

లేచారా లేదా అని వచ్చి చూడాలి పో ఫస్ట్ వెళ్ళి టీ పెట్టి అందరి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయ్ క్విక్….. !! జై కి ఆఫీస్ కి కూడా లేట్  అవుతుంది వెళ్ళు అనగానే ఆధ్య ను పైకి తిట్టే ధైర్యం లేక లోపల తిట్టుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది….. !?

రేణుక అందరికీ టీ తీసుకుని వచ్చాక అందరూ తాగుతూ ఉంటే రేణుక సైలెంట్ గా పక్కన నుంచుని దీనంగా అందరి వైపు చూస్తుంది….. !! అమ్మా ఆద్య నాకు పెసరట్టు ఉప్మా తినాలని ఉంది బంగారం అని చెప్తున్న ప్రతాప్ వర్మ ను చూసి ఒకే తాతయ్య అని ఏయ్ రేణు తాతయ్య కోసం పెసరట్టు ఉప్మా ప్రిపేర్ చేయ్….. !!

మావయ్య మీకేం కావాలి అని వినయ్ వర్మ వైపు చూస్తూ అడగ్గానే ఆయన మసాలా దోశ కావాలని చెప్తాడు…. !! మావయ్య కోసం మసాలా దోశ, జై కోసం తెలుసుగా ఓట్స్ ప్రోటీన్ స్మూతీ & 4 బాయిల్డ్ ఎగ్స్ విత్ ఓట్స్ పోహా & మాయ కి ఇడ్లీ విత్ గారెలు & నా కోసం పూరి చాలు వెళ్ళి ఇవన్నీ 1 అవర్ లో రెడీ చెయ్….. !!

ఇదేమైనా హోటల్ ఆ…..?? ఇన్ని ఐటమ్స్ కుక్ చేయడానికి వీళ్ళు నన్ను ఇంటి కోడలిని అన్న విషయం ఎప్పుడో మర్చిపోయారు…… ?? కనీసం మనిషిని అన్న జాలి కూడా లేకుండా ఒక్కొక్కరు ఒక్కో ఐటమ్ చెప్తే నేను ఒక్క దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి 😒…… !! ఇంట్లో వర్క్ చేస్తున్న మెయిడ్స్, కుక్స్ అందరినీ తీసేసారు ఒక్క దాన్ని అన్ని వర్క్స్ బ్యాలెన్స్ చేయలేక చస్తుంటే మళ్ళీ ఈ వంట ఒక్కటి 🤦…… !!

కుక్ చేయమంటే అలా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లా నుంచుంటావెంటి వెళ్ళి కుకింగ్ ఫినిష్ చెయ్ ……….. ?? తన బాధ చెప్పినా అక్కడ ఎవరు పట్టించుకోరు అని రేణుక కి బాగా తెలుసు ఇన్ఫాక్ట్ తన కడుపున పుట్టిన కూతురు కూడా తనంటే ఇష్టం పడ్డం లేదు….. !!

అందుకే రేణుక ఇంకేం మాట్లాడలేక కామ్ గా అందరూ తాగిన కాప్స్ కిచెన్ లోకి తీసుకుని వెళ్ళి కింద మీద పడి అందరికీ కావలసినవి అన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది….. !! అందరూ వచ్చి కూర్చున్నాక బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయగానే నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న అందరినీ తిట్టుకుంటూ వాళ్ళు తిన్న ప్లేట్స్ తీసి కిచెన్ లోకి వెళ్ళి డిషెస్ క్లీన్ చేస్తుంది….. !!

ఇల్లంతా ఒక్కటే మాప్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్న రేణుక కి తినే టైమ్ కూడా ఇవ్వకుండా లంచ్ ప్రిపేర్ చేయమని చెప్తుంది ఆద్య…… !! నో అంటూ ఒక్కసారిగా అరిచిన రేణుక తనను తాను చూసుకుంటుంది తను జై రూమ్ లోనే ఉంది & ఇదంతా తన భ్రమ అని అర్థం అవ్వగానే ఉఫ్ అని మొహాన పట్టిన చెమట తుడుచుకుంటూ మెల్లగా అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళిపోతుంది….. !?

రేణుక తన రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటూ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తాగేసి భారంగా శ్వాస తీసుకుంటూ బెడ్ మీద కూర్చుంటుంది…… !! జై ఆద్య లకు పిల్లలు పుడితే ఇప్పుడు నాకు వచ్చిన ఊహే నిజం అవుతుంది కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు…… !!

ఫస్ట్ నైట్ ఎలాగో ఆపలేక పోయా ఎట్లిస్ట్ మిగిలిన టు నైట్స్ అయినా అవ్వకుండా ఆపాలి ….. !! ముందు ఇవి జరగకుండా ఆపితే తర్వాత ఎలా ఇద్దరినీ దూరం చేయాలో ఆలోచించచ్చు అనుకుని రేణుక కాసేపటికి నార్మల్ అవుతూ కిందకు వెళుతుంది…… !!

✨✨✨✨✨✨✨✨

 

ఆధ్య  దేవుడి దీపం పెట్టిన తర్వాత హాల్ లోకి వచ్చి మహిదర్ పక్కన కూర్చోగానే మహిదర్ కూతురి వైపు చూసి చిన్నగా నవ్వి వినయ్ తో మాట్లాడుతూ ఉంటాడు….. !! ఆధ్య తనకు ఇటు వైపు కూర్చున్న మాయ తో నవ్వుతూ మాట్లాడుతూ అపుడే కిందకు వచ్చిన రేణుక ను చూసి నవ్వుతూ తనకు ఎదురు వెళుతుంది….. !!
ఆధ్య ను చూసి కోపంగా మొహం తిప్పుకుని వెళ్తున్న రేణుక ముందుకు వచ్చి అరే ఆగండి అత్తయ్య ఎంటలా వెళ్ళిపోతున్నారు ….. ?? అవును మొహం ఎందుకు అలా ఉంది …… ?? అని ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి హో అర్థం అయింది లేండి నేను చెప్పింది నిజమా అబద్దమా ……. ?? అని మా రూమ్ కి వెళ్లి చెక్ చేశారా…….. ?? అంటూ కళ్ళు ఎగరేస్తూ అడుగుతున్న ఆద్య ను రేణుక కంగారుగా ఆధ్య వైపు చూస్తుంది….. !!

ఆ….. అదేం లేదు అయినా నేను ఎందుకు మీ రూమ్ కి వెళ్ళి చెక్ చేస్తాను ….. ?? నాకేంటి అవసరం అయినా అదంతా నువ్వు అందరినీ నమ్మించడానికి అలా చేశావేమో ఎవరికి తెలుసు …… ?? అంటూ వెటకారంగా అంటున్న రేణుక ను చూసి నవ్వుతూ ఆహా అవునా సర్లేండి అలానే అనుకోండి నష్టమేమీ లేదు….. !! అయినా రిజల్ట్ ఇంకో 3 మంత్స్ లో మీరే చూస్తారు కదా అంత కూడా అవసరం లేదు అనుకుంటా 😜 …… !! ఎంతైనా మీ అబ్బాయి టూ ఫాస్ట్ అత్తయ్య ఎలా వేగాలో ఏంటో అరే 10 మినిట్స్ కూడా ఊపిరి తీసుకొనివ్వడు అంటూ సిగ్గు పడుతుంది…… !!

ఏయ్ ఇక చాలు ఆపేయ్ అత్తగారితో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి కొంచెం కూడా సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావ్ ….. ?? తప్పేం ఉంది అత్తయ్య ఇవన్నీ మీకు తెలియనివి కాదు కదా ఏదో నా ఎక్స్పీరియన్స్ చెప్తే మీరు కూడా మీకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారని చెప్తున్నా….. !!

సిగ్గు లేకుండా బెడ్ రూమ్ విషయాలు అందరితో షేర్ చేసుకునే అడ్డమైన అలవాటు నాకు లేదు అడ్డు లే ఫస్ట్…. !! ఆగండాగండి ఎందుకంత తొందర అని మళ్ళీ రేణుక కి అడ్డుగా నుంచుని మీరు నాకో హెల్ప్ చేయాలి అత్తయ్య ప్లీస్ …… !!

అబ్బా ఎంటే నాకు ప్రొద్దున్నే నీ గోల అని చిరాకు పడుతూ…… !! ఏం హెల్ప్ చేయాలి నీ రూమ్ డెకరేషన్ చేయాలా లేక నిన్ను అందంగా రెడీ చేయాలా…….. ?? అంటూ కోపంగా అడుగుతున్న రేణుక ను చూసి హహ అదేం కాదు అత్తయ్య మీరు మావయ్య ను ఎలా మీ కొంగు కు కట్టేసుకున్నారో చెప్తే……. ?? నేను కూడా మిమ్మల్నే ఫాలో అవుతూ మా ఆయన్నీ నా చుట్టూ తిప్పుకుంటాను …… !!

ఏయ్ నిన్ను అని కొట్టడానికి వస్తున్న రేణుక ను చూసి ఆద్య నవ్వుకుంటూ కిచెన్ లోకి పరిగెత్తడం చూసిన రేణుక…… !! ఛా అసలేం అనుకుంటుంది ఇది దీని గురించి అందరూ వెళ్ళాక చెప్తా దీని పని అంటూ అసహనంగా అక్కడి నుండి మాయ వైపు వెళ్తుంది…… !!

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

మమ్మీ నాకు బూస్ట్ కావాలి అని శైలు మెడ చుట్టూ చేతులు వేస్తూ ముద్దుగా అడుగుతున్న ఆద్య చెయ్ మీద శైలు చిన్నగా కొట్టగానే…… !! ఆవ్చ్ మమ్మీ ఎంటలా కొట్టావ్ అని చెయ్ రుద్దుకుంటున్న ఆధ్య చెవి మెలి పెడుతూ నైట్ ఎమ్ చెప్పా నీకు….. ?? ఇప్పటి నుంచి మన ఇంట్లో లా కాకుండా కొంచెం మెర్చ్యుర్డ్ గా బిహేవ్ చేయమని చెప్పా కూడా ఇంత లేట్ గా లేస్తే ఎలా …… ??

ఓహ్ అదా నీ కోపం అబ్బా మమ్మీ కొంచెం కూడా ఆలోచించవా నువ్వు ……… ?? నైట్ మాకు ఫస్ట్ నైట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఎలా లేస్తాను చెప్పు అరే నువ్వే అర్థం చేసుకోవాలి మమ్మీ ఇవన్నీ…… !! అన్ని చిన్న పిల్ల కి చెప్పినట్టు చెప్తే కానీ నీకు అర్థం అవ్వదు పాపం నీతో ఎలా వేగుతున్నాడో ఏంటో పూర్ డాడ్….. !! అంటూ మహిదర్ మీద జాలి చూపిస్తున్న కూతురు వైపు సీరియస్ లుక్స్ ఇస్తుంది శైలు….. !?

హ్మ్మ్!! ఇలా కంటి చూపు తోనే చంపేయ్ ….. !! సర్లే ఇదంతా కాదు కానీ ఒక స్ట్రాంగ్ టీ పెట్టు అసలే నైట్ అంతా నిద్ర లేదు వొళ్ళంతా నొప్పులు మమ్మీ టీ తాగితే తప్పా నేను సెట్ అవ్వలేను….. !! చీర నలుపుకుని బొట్టు చెరిపేసి సిగ్గు పడుతూ బానే మ్యానేజ్ చేసావ్ అంటూ తనకు టీ కప్ ఇస్తున్న శైలు ను చూసి ఆద్య నోరు తెరిచి షాక్ అవుతుంది….. !!

ఏంటీ అలా చూస్తున్నావ్….. ?? అని అడుగుతున్న శైలు మాటలకు మ…. మమ్మీ రూమ్ లో నాకు తెలియకుండా కెమరాస్ కానీ పెట్టలేదు కదా అని అటు ఇటు చూస్తూ నెమ్మదిగా అడుగుతుంది….. !! నేను నీ అమ్మని ఆద్య నీ గురించి ఆ మాత్రం తెలియదా నాకు ……… ?? నేను గొంతు చించుకుని చెప్పా అన్నీ వదిలేసి జై తో న్యూ లైఫ్ స్టార్ట్ చేయమని అయినా నా మాట ను కూర లో కరివేపాకు లా తీసేసావ్….. ??

నీకు నువ్వు అన్నీ ఊహించుకోకు మమ్మీ మా ఫస్ట్ నైట్ అయిపోయింది అంతలా డౌబ్ట్ ఉంటే డాక్టర్ తో చెక్ చేయించు కొంచెం కూడా నీ కూతురి మీద నమ్మకం లేదు నీకు హు …… !! 😏 అని మూతి తిప్పేస్తూ ఈ టీ నా కోసం కాదు మా ఆయన కోసం అడిగాను అని  కప్ పట్టుకుని వెళ్తున్న ఆద్య ను చూసి నిజంగా ఫస్ట్ నైట్ అయిందా……. ??  అని ఆలోచనలో పడుతుంది శైలు…… !!

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

వామ్మో జస్ట్ మిస్ అని గుండెల మీద చెయ్ వేసుకుని నా మమ్మీ కి ఎందుకు దేవుడా ఇంత బ్రెయిన్ ఇచ్చావ్ 😒 …… ?? అని వెనక్కి తిరిగి కిచెన్ లో ఉన్న శైలు వైపు చూస్తూ హమ్మయ్య నేను చెప్పింది నమ్మినట్టే ఉంది….. !! ఇంకో సారి మమ్మీ కి ఇలాంటి డౌబ్ట్ రాకుండా చూడాలి అనుకుని ఆ కప్ తీసుకుని తన రూమ్ కి వెళ్తుంది…… !!

రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసిన ఆద్య కి బెడ్ మీద ప్రపంచం తో సంబంధం లేకుండా ఫుల్ స్లీప్ లో పడుకున్న జై ను చూసి నవ్వుకుంటూ అక్కడే ఉన్న కౌచ్ లో కూర్చుని టీ సిప్ చేస్తూ కాల్ లో మాట్లాడుతూ ఉంటుంది….. !!

తన కాల్ ఫినిష్ చేసిన ఆద్య కాలి కప్ టేబుల్ మీద పెడుతూ తలకు చుట్టుకున్న టవల్ తీస్తూ బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తూ అడ్డుగా కర్టెన్స్ ను కూడా క్లోజ్ చేసి తల ఆర్పుకుంటూ బాల్కనీలోకి నడుస్తుంది….. !!

వెచ్చని సూర్యుని కిరణాలు తన మొహం మీద పడగానే మెల్లగా కళ్ళు తెరుస్తాడు జై…… !! డైరెక్ట్ గా తన మొహం మీద పడుతున్న వెలుగుకి కళ్ళకు చేతిని అడ్డు పెట్టుకొంటూ బద్దకంగా లేచి కూర్చుంటాడు జై…… !!

ఓహ్ గాడ్ ఏంటిది నాకు ఇంత డ్రౌజీగా ఉంది అని కళ్ళు నులుముకుంటూ వాల్ క్లాక్ వైపు చూసిన జై కి టైమ్ 11 దాటినట్టు కనిపించి ఒక్క సారిగా నిద్ర మత్తు వదిలేలా చేస్తుంది….. !! ఏంటిది ఇవాళ ఇంతలా నిద్రపోయాను అని పైకి లేచి నుంచుని మిర్రర్ ముందుకు వెళ్ళి తనను తాను చూసుకుని అదిరి పడతాడు…… !!

వాట్ ఇస్ దిస్ ……. ?? డ్యామిడ్ అసలు నైట్ ఎమ్ జరిగింది….. ?? ఇది నిద్రపోయాను అనుకుని నిద్రలో నన్ను ఏదో చేసినట్టు ఉంది…… ?? కానీ నాకేం గుర్తు లేదు ఏంటీ అని జుట్టు పీక్కుంటూ తలలో నుండి ఒక్కొక్కటిగా రాలుతున్న రోస్ పేటల్స్ కి ఇరిటేట్ అవుతూ ఆ…… ఆ……. ఆధ్య అంటూ గట్టిగా అరుస్తాడు …… !!

బాల్కనీ లో తల తుడుచుకుంటున్న ఆధ్య జై అరుపుకి వీడు నిద్రలేచినట్టు ఉన్నాడు కాసేపు వీడి గోలను భరించాలి అనుకుంటూ రూమ్ లోకి వస్తుంది….. !! హా ఏంటి ప్రొద్దున్నే కాకి లా అరుస్తున్నావ్ అని చిరాగ్గా అడుగుతున్న ఆద్య మీదకు కుషన్ విసురుతూ అసలేం జరిగిందే నైట్ …… ??

నేను పడుకునే ముందు నార్మల్ గానే కదా పడుకున్న మార్నింగ్ లేచే సరికి ఏంటీ ఇలా ఉన్నాను అసలు నన్నేం చేసావ్ నైట్…. ?? అంటూ కోపంగా ఆద్య ను వాల్ కి లాక్ చేస్తూ అడుగుతాడు…. !!

నువ్వో సూపర్ స్టార్ మహేష్ బాబు అని నిద్రలో రేప్ చేసాను అని వెటకారంగా చెప్పి వదులు అని జై ను వెనక్కి తోస్తుంది….. !! అడిగినా దానికి తిన్నగా ఆన్సర్ ఇవ్వు అసలు ఎమ్ జరిగింది నైట్…. ??

బాబు నీకో నమస్కారం నిన్ను ఏదైనా చేయాలన్న ఇంటెన్షన్/ ఇంట్రెస్ట్ రెండు నాకు లేవు…… !! మన మధ్య అంతా బావుందని & ఫస్ట్ నైట్ జరిగిందని అందరినీ నమ్మించడానికి నీకు మేక్ అప్ చేసాను అంతే…… !! అంతకు మించి ఇంకేం లేదు….. !! మనల్ని ఇలా చూసి మన మమ్మీస్ ఇద్దరూ ఫస్ట్ నైట్ జరిగింది అనుకుంటున్నారు …… !! నువ్వు కుడా అదే మెయింటెయిన్ చెయ్ అంటూ అక్కడి నుండి ముందుకు వెళ్తున్న ఆధ్య చెయ్ పట్టుకుంటాడు జై….. !!

మళ్ళీ ఏంటి….. ?? వెనక్కి తిరిగి అడుగుతున్న ఆద్య వైపు చూసి మార్నింగ్ మన రూమ్ డోర్ ఎవరైనా నాక్ చేశారా….. ?? ఐ మీన్ నువ్వు నిద్ర లేచి చాలా సేపు అయినట్టు ఉంది…….. ??

అవును మమ్మీ నే వచ్చి డోర్ నాక్ చేసి నిద్ర లేపింది అంటూ సింపుల్ గా చెప్పిన ఆధ్య వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ మరి నాకు ఎందుకు మెలుకువ రాలేదు……. ?? అంటూ ఆద్య నడుము పట్టుకుని మీదకు లాక్కుంటూ కోపంగా చూస్తూ అడుగుతాడు….. !!

ఆ…. ఆ…… ఇది మరీ బావుంది నీకు మెలకువ రాకపోతే దానికి నేనేం చేయను…. !! ముందు నన్ను వదులు నేను బయటకు వెళ్ళాలి అని జై నుండి దూరం జరగడానికి ట్రై చేస్తూ ఉంటుంది….. !!

నిజం చెప్పవే మిల్క్ లో ఎమ్ కలిపావ్ అది తాగాక నైట్ నాకు అసలు మెలకువ రాలేదు & ఎప్పుడూ ఎర్లీ మార్నింగ్ లేచే నేను ఇవాళ ఆఫ్టర్ నూన్ దాకా మెలకువ లేకుండా పడుకున్నా….. ?? ఇందాక నిద్ర లేచినప్పుడు కూడా తలంతా తిరుగుతూ చాలా బద్దకంగా ఉంది….. ??

జై మాటలకు ఆద్య నైట్ జరిగింది గుర్తు చేసుకుంటుంది….. !! మాన్య తనను రెడీ చేసాక వాటర్ తాగి వస్తానని మాన్య కి చెప్పి రూమ్ నుండి బయటకు వచ్చిన ఆద్య ఎవరి కంట పడకుండా జాగ్రత్తగా కిచెన్ లోకి వెళ్తుంది….. !! అక్కడున్న కుక్స్ ను రేణుక పిలుస్తుందని వాళ్ళను బయటకు పంపేసి ……. !? గ్యాస్ కౌంటర్ మీదున్న మిల్క్ గ్లాస్ లో తన చీర కొంగు లో జాగ్రత్తగా దాచిన స్లీపింగ్ పిల్స్ కలిపేసి స్పూన్ తో డౌబ్ట్ రాకుండా మిక్స్ చేస్తుంది….. !!

తరువాత స్పూన్ అక్కడుంటే మళ్ళీ లేని పోనీ డౌబ్ట్ క్రియేట్ అవుతుందని దాన్ని షింక్ లో పడేసి మిల్క్ గ్లాస్ ను చూసి నవ్వుతూ కోస్టర్ తో క్లోజ్ చేస్తుంది….. !! అప్పుడే ఎవరో వస్తున్న అలికిడి వినిపించగానే ఫ్రిడ్జ్ లోని వాటర్ బాటిల్ తీసుకుని కామ్ గా తన రూమ్ కి వెళ్ళిపోతుంది….. !!

అదంతా గుర్తు చేసుకుని ఆద్య నవ్వుకుంటూ జై వైపు చూస్తూ ఏమో నాకు తెలియదు….. !! అని చెప్పి లోలోన నవ్వుకుంటున్న ఆధ్య బుగ్గలు నొక్కి పట్టుకుని నిజం చెప్పవే అందులో స్లీపింగ్ పిల్స్ కలిపావ్ కదా….. ??

సీరియస్ గా అడుగుతున్న జై వాయిస్ కి హు 😏 అవును కలిపా అయితే ఏంటీ…… ?? నీ గురించి తెలిసి కూడా అంత అజాగ్రత్తగా ఎలా ఉంటాను ……. ?? అందుకే నా ఎరేంజ్మెంట్స్ లో నేనున్నా జాగ్రత్త పడ్డం లో తప్పు లేదు కదా…… !! ఫస్ట్ నైట్ డెకరేషన్ కి టెంప్ట్ అయ్యి నువ్వు ఏదైనా చేస్తే అప్పుడు నేనేం చేయాలి అందుకే స్లీపింగ్ పిల్స్ కలిపిన మిల్క్ నీతో తాగించి ప్రశాంతంగా నిద్రపోయాను…. !!

రోజూ అలా చేస్తానేమో అని వర్రీ అవ్వకు నిన్న ఫస్ట్ నైట్ కదా అందుకే ఇచ్చాను….. !! నువ్వు కంట్రోల్ లో ఉండకపోతే మాత్రం నేను చెప్పలేను అని చెప్తున్న ఆద్య ను చూసి జై కి కోపం కిలో మీటర్ దాటుతుంది….. !!

అనుకున్నానే ఇలాంటిది ఏదో చేసే ఉంటావ్ అని 😏 నాకు మిల్క్ అలా బలవంతంగా తాగించినపుడే డౌబ్ట్ రావాల్సింది …….. !! అని పళ్ళు నూరుతూ అయిపోయావే నా చేతుల్లో అని ఆద్య ను పట్టుకోవడానికి వస్తున్న జై ను పక్కకు నెట్టి రూమ్ బయటకు పరిగెడుతుంది ఆధ్య…… !!

ఆగవే పాగల్ నిన్ను చంపేస్తానే ఇవాళ అని కనీసం షర్ట్ కూడా వేసుకోకుండా ఆద్య ను పట్టుకోవడానికి అలాగే పరుగులు పెడతాడు….. !! జై…..నో అబ్బా ప్లీస్ వదిలేయ్ అని హాల్ మొత్తం పరిగెడుతూ జై చేతికి చిక్కకుండా అటు ఇటు జింక పిల్లలా పరిగెడుతున్న ఆద్య ను జై ఎలాగోలా పట్టుకుని తన నడుము పట్టుకుని పైకి లేపి ఇప్పుడు ఎటు వెళ్తావే…… ?? అని గట్టిగా పట్టుకుంటాడు….. !!

అబ్బా జై వదులు…… ఆ…..!! నన్ను వదులు జై అంటూ జై నుండి తప్పించుకోవడానికి కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆపసోపాలు పడుతూ ఉంటుంది….. !! వీళ్ళ ను బ్రేక్ఫాస్ట్ కి పిలవడానికి పైకి వస్తున్న రేణుక వీళ్ళను చూసి షాక్ తో నోరు తెరుస్తుంది….. !! చిచీ వీళ్ళకు పగలు రాత్రీ తేడా లేదా పట్టపగలు అందరూ ఇంట్లో ఉన్నారు అని కూడా లేకుండా పోయింది వీళ్ళకు….. ?? అని వీళ్ళను చూసి హాల్ లో సరసాలు ఆడుతున్నారు అనుకుంటుంది రేణుక 😜🤭…… !! జై ❤️ ఆద్య కూడా అప్పుడే అక్కడ రేణుక చూసి షాక్ అవుతూ ఒకరిని ఒకరు చూసుకుంటారు……. ??