Login with OTP

విలన్ హస్బెండ్ – 23

aashyatech

Author

లాస్య ఇద్దరి వైపు చూసి ఏడుస్తూ తను జై ధీర్ అంటూ ఉండగానే వాట్ అంటూ ఇద్దరు షాక్ అయ్యి పైకి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు…. మాన్య కి ప్రెసెంట్ ఎలా ఉందంటే బుర్ర గిర్రున తిరుగుతూ ఉన్నట్టు ఫీల్ అవుతూ అసలేం మాట్లాడుతున్నావ్ లాస్య నువ్వు చెప్పేది వర్మ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ సి. ఈ. ఓ. జై ధీర్ గురించా 🤷🤷 ఓహ్ గాడ్ నాకు నిజంగా బుర్ర వర్క్ అవ్వట్లేదు మీ ఇద్దరికీ ఎలా పరిచయం?? ఇంత వరకు ఎలా వచ్చింది & ఇంత జరుగుతున్నా మాకు ఒక్క మాట కూడా చెప్పాలి అనిపించలేదా నాకు నిజంగా ఇదంతా కలలా ఉందే అని తల పట్టుకుంటూ చెప్తుంది….

అది ఏడుస్తూ వాడి పేరు కూడా క్లియర్ గా చెప్తుంటే ఇంకా డ్రీమ్ అంటావేంటి పాప నీకేమైనా పిచ్చా….?? నేను వాడిని చూసినప్పుడే అనుకున్నా వాడు అమ్మాయిలను ఏడిపించే ఆవారా, పోకిరి , జులాయి, కాంత్రీ, కథర్నాక్ అని 😬😬 వాడికి ఎంత ధైర్యం ఉంటే ఆద్య ఫ్రెండ్ తోనే పెట్టుకుంటాడు అని మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని లాస్య యూ డోంట్ వర్రీ ఇప్పుడే నేను వెళ్ళి వాడి కాలర్ పట్టుకుని ఈడ్చుకొని వచ్చైనా సరే నీతో వాడికి పెళ్ళి జరిపిస్తా అని అరుంధతి సినిమా లో అనుష్కా లా చెప్తుంది….

ఇది దీని ఓవర్ యాక్షన్ 🤦🤦 జై ను చూస్తేనే సగం టైం తిట్టుకోవడానికే సరిపోతుంది అయినా జై ధీర్ పక్కన నుంచుంటే బుజాల వరకూ ఉండవు ఇంత బారి డైలాగ్స్ అవసరమా అని విసుక్కుంటూ….. పాప ఆద్య కొంచెం ఎక్కువైనట్టుంది అని వెటకారంగా అంటున్న మాన్య ను చూసి షట్ అప్ నీకు నా ఎమోషన్ వెటకారంగా ఉందా నేను చెప్పిందే చేస్తాను చేసేదే చెప్తాను యూ గాట్ ఇట్..??

హా…. బాగా అర్థం అయింది నువ్వు ఈ మధ్య మూవీస్ బాగా చూస్తున్నావని నీ మాటలు వింటేనే తెలుస్తుంది ఇంతకీ ఇది ఏ మూవీ లో డైలాగ్ 😏😏 యూ ఆ జై గాడి పెళ్ళి చేసాక చెప్తా నీ పని ముందు పదా వాడు పంది లా ఇంకా ఇంట్లోనే నిద్ర పోతున్నాడు వెళ్ళి ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్పి లాస్య, జై ల పెళ్లి జరిపిద్దాం ఇలా అయినా వాడికి పెళ్ళి చేయాలి అనుకున్న అంకుల్ డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతుంది….

విల్ యూ ప్లీస్ స్టాప్ ఇట్ అని ఒక్కసారిగా అరిచిన లాస్య అరుపుకి పెళ్లి షాపింగ్ గురించి డిస్కస్ చేస్తున్న ఇద్దరు ఉలిక్కిపడి లాస్య వైపు చూస్తారు….. యూ బోట్ ఆర్ డిస్గస్టింగ్ నేను చెప్పేది కూడా పూర్తిగా వినకుండా మీకు మీరే అన్ని డిసైడ్ చేస్తున్నారు & నేను కన్సీవ్ అవ్వడానికి రీసన్ జై ధీర్ వర్మ కాదు అంటూ అసహనంగా అంటుంది….

వాట్??? జై కాదా ఇందాక నువ్వే కదా లాస్య జై ధీర్ అంటూ అపేసావ్ సడెన్ గా వాడు కాదు అంటావ్ ఏంటి??? ఓహ్ అర్తం అయింది వాడు నిన్ను ఏమైనా చేస్తాడేమో అని భయపడుతున్నావా… నువ్వేం భయపడకు జై ఫాదర్ వినయ్ వర్మ మామ నాకు బాగా తెలుసు & ఆయన డాడ్ కి క్లోజ్ ఫ్రెండ్ నీ లైఫ్ లో ఎమ్ జరిగిందో నేను ఆయనకు చెప్తాను అంకుల్ చాలా మంచి వారు మనకు డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు….

స్టాప్ ఇట్ ఆద్య ఫస్ట్ నేను చెప్పేది విను నేను ప్రేమించింది జై ధీర్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్న సౌరబ్ అనే వ్యక్తి ని అర్థం అవుతుందా తను కూడా నా లాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాడు…. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా సౌరబ్ నాకు తెలుసు & త్వరగానే క్లోజ్ అయ్యాం వుయ్ ఆర్ సీయింగ్ ఈచ్ అదర్ మా రిలేషన్ షిప్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకుని వెళ్లాలి అని తనే ఒక ప్రపోజల్ తెచ్చాడు….

నేను ఫస్ట్ లో బయటపడ్డాను బట్ సౌరబ్ మీదున్న ట్రస్ట్ తో తను పెట్టిన లివిన్ ప్రపోజల్ ను డీప్ థింకింగ్ తర్వాత యాక్సెప్ట్ చేసాను…. మా లివిన్ గురించి కానీ, లవ్ లో ఉన్నట్టు కానీ & మా ఫ్లాట్ అడ్రస్ కానీ ఎవరికి తెలియకూడదు అని సౌరబ్ నాతో ప్రామిస్ చేయించుకున్నాడు …. అందుకే నేను నా లవ్ గురించి మీతో ఎప్పుడూ షేర్ చేయలేదు….

ఆద్య అసహనంగా లాస్య వైపు చూస్తూ అంతా బానే చచ్చింది కదా ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నావ్??? నీకు అంతలా వాడితో లైఫ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే వాడిని చంపాలి కానీ నువ్వు చావాలి అనుకోవడం ఎంటే మెంటల్???

ఆద్య మాటలకు మాన్య తల కొట్టుకుంటే తను ఓవర్ గా రియాక్ట్ అవ్వడం తో లైట్ గా స్టార్ట్ అయిన అబ్డామినల్ పెయిన్ కి లాస్య బెడ్ పక్కనున్న టేబుల్ మీద ఉన్న టాబ్లెట్ షీట్ నుండి టాబ్లెట్ వేసుకుంటూ నాకు సౌరబ్ అంటే చాలా ఇష్టం తనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకున్నాను…. బట్ సౌరబ్ బిహేవియర్ 2 మంత్స్ గా చాలా చేంజ్ వచ్చింది నాతో సరిగ్గా టైమ్ స్పెండ్ చేసే వాడు కాదు నేను కాల్ చేసినా బిజీ అని చెప్పి కట్ చేసే వాడు… నాకు డౌబ్ట్ వచ్చి సౌరబ్ ను ఫాలో చేస్తే సౌరబ్ కి నా కంటే బెటర్ అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చేసరికి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని తెలుసుని అదే విషయాన్ని అడిగితే నేను బోర్ కొట్టేసాను అని నన్ను నా క్యారెక్టర్ ను రాంగ్ వే లో చూపెట్టి నాతో బ్రేక్ అప్ చేసుకున్నాడు….

ఆ క్షణం టోటల్లీ నేను మెంటల్లీ చచ్చిపోయాను…. ప్రేమ అని సౌరబ్ నా లైఫ్ లోకి రాగానే నా ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా సౌరబ్ తో లివిన్ లో ఉన్నందుకు నా మీద నాకే కోపం వచ్చింది … నా మ్యారేజ్ గురించి నా పేరెంట్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్లకు నా ప్రెగ్నెన్సీ గురించి తెలిస్తే వాళ్లకు నేను ఎలా మొహం చూపించాలి?? అందుకే నాకు బ్రతకాలి అని లేదు అందుకే అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాక చచ్చిపోవాలి అని డిసైడ్ అయ్యి పాయిసన్ తాగేసాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది 🥹🥹

లాస్య చెప్పింది మొత్తం విన్న లాస్య లవ్ చేయడానికి వచ్చిన ధైర్యం వాడు చీట్ చేసాక నాలుగు పట్టుకుని పీకడానికి రాలేదా నీకు?? నువ్వు చచ్చిపోతే వాడు హ్యాపీగానే ఉంటాడు బట్ నీ పేరెంట్స్ నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న నీ తమ్ముడు లైఫ్ లాంగ్ నిన్ను తలచుకుని ఏడుస్తూనే ఉంటారు… చచ్చిపోయే ధైర్యం ఉంది కానీ వాడిని క్వశ్చన్ చేసే ధైర్యం లేదు అంతేనా అని ఆద్య సీరియస్ గా అడగ్గానే లాస్య ఏడుస్తూ తల దించుకుంటుంది….

లుక్ ఎట్ మీ లాస్య ప్రేమ అంటే రెండు శరీరాలు కలవడం కాదు రెండు మనసులు కలవడం… వాడు నీ శరీరాన్ని ఇష్టపడ్డాడు కానీ నీ మనసును కాదు అందుకే నీతో అవసరం తీరగానే బ్రేకప్ చెప్పేసి వాడు ఇంకో దానితో తిరుగుతున్నాడు… పిల్లలు ఇలా మోసపోకూడదు అనే మన పేరెంట్స్ తల కొట్టుకుంటూ ఉంటారు ఈ జనరేషన్ లో లవ్ మనసును చూసి కాదు మనీ ను చూసి లేదా బాడీ స్ట్రాక్చర్ ను చూసి పుడుతుంది అని కానీ మనం వింటేగా అని అప్పటికే ఏడుస్తున్న లాస్య ను చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఒకే…. ఒకే…. ఏడవకు నీ పేరెంట్స్ కి ఈ విషయం గురించి తెలియకుండా వాడితో నీ మ్యారేజ్ నేను జరిపిస్తాను అని లాస్య కన్నీళ్ళు తుడుస్తూ చెప్తుంది….

ఎలా జరిపిస్తావ్ ఆద్య సౌరబ్ కి ఇవాళే 11 గంటలకు శరణ్య కళ్యాణ  మండపం లో పెళ్లి అందుకే వాడి పెళ్ళి జరిగే లోగా నేను చావాలి అనుకున్నది అని ఏడుస్తూ అంటున్న లాస్య ను చూసి కొట్టానంటేనా అన్నిటికీ చావే సొల్యూషన్ అనుకుంటే ఈ లోకం లో అసలు మనిషి అనే వాడు ఉండే వాడు కాదు…. ఎందుకంటే సమస్య లేని మనిషి ఉండడు ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లెమ్… చస్తుందట చస్తుంది ఇంకో సారి ఆ మాట అన్నావో నువ్వు చావడం కాదు నేనే చంపేస్తా అని సీరియస్ గా చెప్తూ వాడి పెళ్ళి నేను చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ప్రవీణ్ అక్క ను జాగ్రత్తగా చూసుకో నేను ఇప్పుడే వస్తాను అని మాన్య తో కలసి బయటకు నడుస్తుంది….

డోర్ బయట నుంచుని జరిగేది మొత్తం చూస్తున్న అతను ఆద్య మాటలకు తనకు మరింత ఇంప్రెస్ అవుతూ ఇందుకే ఆద్య నువ్వంటే నాకు డే బై డే ఇష్టం బ్యాంక్ లో ఇంట్రెస్ట్ లా పెరుగుతూ వెళ్తుంది అని నవ్వుకుంటూ ఆద్య వైపు చూస్తూ ఉంటాడు…. ఆద్య బయటకు రావడం చూసి నితీష్ తో సహా పక్క రూమ్ లోకి వెళ్లి హైడ్ అవుతాడు…

 

మాన్య మనం వెంటనే లాస్య చెప్పిన అడ్రస్ కి వెళ్లాలి & యూ కెన్ డు వన్ థింగ్ వెంటనే నువ్వు వన్ టౌన్ సి. ఐ. కి కాల్ చేసి కళ్యాణ మండపం అడ్రస్ షేర్ చెయ్ అంటూ ఎమ్ చేయాలో మాన్య కి చెప్తూ వెళ్తున్న ఆద్య కి అక్కా… అంటూ ఏడుస్తూ పిలిచిన ప్రవీణ్ వాయిస్ కి ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు….

ప్రవీణ్ వెళ్ళి ఆద్య ను హగ్ చేసుకుంటూ గట్టిగా ఏడ్చేస్తాడు నీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు అక్కా….. మా ఫైనాన్సియల్ స్టేటస్ తెలిసి మా అక్క ను ఇంటర్వ్యూ కి ఇన్వైట్ చేసి అందులో సెలెక్ట్ అవ్వకపోయినా అక్క కి జాబ్ ఇచ్చి మాకు ఎంతో హెల్ప్ చేసావ్… డాడ్ హస్పిటల్ కి లాక్స్ లో ఇచ్చావ్, నాకు కాలేజ్ ఫీ పే చేయడమే కాకుండా నా స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకూ నువ్వే చదివిస్తా అని చెప్పావ్ & ఇప్పుడు అక్క లైఫ్ ను నిలబెట్టడానికి ఎంతో చేస్తున్నావ్ నీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు అక్క 🥹🥹…..

ప్రవీణ్ ఏంట్రా ఇది కామ్ డౌన్ అంటూ ప్రవీణ్ ను దూరం జరిపి యూ ఆర్ లైక్ మై ఫ్యామిలీ & మీ డాడ్ మా ఇంట్లో డ్రైవర్ గా చాలా ఇయర్స్ వర్క్ చేసారు…. మీ ఫ్యామిలీ అంటే నాకు ఎప్పటికీ స్పెషల్ అందుకే కదా మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మిమ్మల్ని కూడా తీసుకుని వచ్చేసాం…. అంకుల్ కి యాక్సిడెంట్ అయ్యాక మీరు డబ్బు కోసం ఇబ్బంది పడుతూ ఉంటే నేను జస్ట్ నార్మల్ గా హెల్ప్ చేసా అంతే & లాస్య అది నా క్లాస్మేట్ ప్రవీణ్ దాని కోసం ఈ మాత్రం చేయకపోతే నేను ఫ్రెండ్ ఎలా అవుతాను చెప్పు అని కన్నీళ్ళు తుడుస్తూ చెప్తుంది….

అక్క నీతో పాటు అంత పెద్ద కాలేజ్ లో చదివింది అంటే అది నీ బిక్షే కదా అక్కా అందుకే మా ఫ్యామిలీ మొత్తం ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాం అంటున్న ప్రవీణ్ వైపు చూసి రేయ్ బాగా ఎక్కువ ఎమోషనల్ అవుతున్నావ్ ఇట్స్ ఒకే అంతా సెట్ అవుతుంది… వెళ్ళి ఆ పిచ్చి దాన్ని జాగ్రత్తగా చూసుకో అంకుల్, ఆంటీ రిటర్న్ వచ్చే లోగా నేను అంతా 5సెట్ చేస్తాను అని ప్రవీణ్ తల నిమిరి మాన్య తో కలసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆద్య ను చూసి నవ్వుతూ గుండె మీద చెయ్ పెట్టుకుని బాగా నచ్చేస్తున్నావ్ ఆద్య ఈ లైఫ్ కు నిన్ను వదలను అని ప్రేమగా తన వైపు చూస్తూ ఆద్య వెనుకే డౌబ్ట్ రాకుండా ఫాలో అవుతాడు…..

 

♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍

 

నైట్ గార్డెన్ గేమ్ ఆ తర్వాత ఫ్యామిలీ తో డిన్నర్ అది అయ్యాక హాల్ లో ముచ్చట్లు పెట్టుకుని ఎప్పుడో మిడ్ నైట్ పడుకున్న జై కి ఆగకుండా తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటే మండుతున్న కళ్ళను కష్టంగా తెరిచి మొబైల్ ఎక్కడుందో చూసి దాన్ని తీసుకుని స్క్రీన్ మీద బ్లింక్ అవుతున్న నేమ్ ను చూసి కాల్ లిఫ్ట్ చేసి హాయ్ బేబీ గుడ్ మార్నింగ్ అంటూ ఆవలిస్తూ విష్ చేస్తాడు….

వెరీ గుడ్ మార్నింగ్ జై అని నవ్వుతూ నువ్వు ఇంకా లేవలేదా ఓహ్ సారి జై నీ వేక్ అప్ టైం 5 నే కదా అందుకే కాల్ చేసాను… ఒకే నువ్వు లేచాక నాకు కాల్ బ్యాక్ చెయ్ నేను వెయిట్ చేస్తాను అని కాల్ కట్ చేయబోతున్న నాన్సీ ను ఆపుతూ హే నాన్సీ ఒక్క సారి నా స్లిప్ డిస్టర్బ్ అయితే నాకు మళ్ళీ నిద్ర రాదు కానీ ఏంటి ఇంత మార్నింగ్ కాల్ చేసావ్ హెల్త్ ఒకే నా??

యాహ్ జై ఐ ఆమ్ ఒకే బట్ నాకు చాలా ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నాయి…. కుక్ నేను అడిగింది చేసింది బట్ నాకు నచ్చలేదు సో నువ్వు ఫ్రీ ఉంటే బయట బ్రేక్ఫాస్ట్ చేద్దాం జై నాకు బాగా బోర్ కొడుతుంది…. మార్నింగ్ నుండి బెడ్ మీదే ఉన్నాను అలా ఫ్రెష్ ఎయిర్ కి వెళ్లాలి అనుంది…. చెప్పకుండా వెళ్తే క్లాస్ తీసుకుంటావ్ అందుకే కాల్ చేసా నువ్వు బిజీగా ఉంటే నేను ఒకటే వెళ్తాను నో ప్రాబ్లెమ్ ఎట్ ఆల్…..

జై వాచ్ లో టైమ్ చూస్తూ ఒకే ఇంకో హాఫ్ ఆన్ అవర్ లో నీ ముందు ఉంటాను 12 కి నాకు మీటింగ్ ఉంది ఆ లోగా నీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది సో రెడీ అవ్వు ఐ ఆమ్ కమింగ్ అని కాల్ కట్ చేసి పైకి లేచి బాడీ స్ట్రెస్ చేస్తూ అదే బెడ్ మీద కుంభ కర్ణుడి కసిన్ బ్రదర్ లా పడుకున్న అమర్ ను చూసి రేయ్ అమర్…. అమర్…. వేక్ అప్ బ్రేక్ఫాస్ట్ కి వెళ్తున్నా వస్తావా అంటూ తన బుజం పట్టుకుని లేపడానికి ట్రై చేస్తాడు…..

మన వాడు ఇంచ్ కూడా కదలకుండా కోమా స్టేజ్ లో ఉండిపోయాడు అది చూసిన జై ఉఫ్ 🤦 వీడు నిద్రపోతే అచ్చం శవం నిద్రపోయినట్టే అని అమర్ ను వెనుక నుంచి తన్ని మరీ అదే డ్రెస్ తో ఫ్రెష్ అయి నాన్సీ ఫ్లాట్ కి వెళ్తాడు….

( జై వెనుక నుండి తన్నినా మన అమర్ లేవలేదు అంటే జస్ట్ ఇమాజిన్ మన వాడు ఎంత అదృష్టవంతుడో 😌🤭)

నాన్సీ ఫ్లాట్ కి వెళ్ళి అక్కడే ఉన్న తన డ్రెసెస్ నుండి ఒక పెయిర్ తీసుకుని ఫ్రెష్ అయి నాన్సీ ఫేవరెట్ రెస్టారంట్ కి వెళ్తున్న జై కి ట్రాఫిక్ సిగ్నల్ పడ్డం తో ట్రాఫిక్ లో ఆగి అటు ఇటు చూస్తున్న జై కి లెఫ్ట్ సైడ్ ఆద్య కార్ కనిపించగానే ఇది ఎప్పుడూ లేచింది అని తన వైపు చూస్తాడు…..

వాట్??? వాట్ డిడ్ యూ సే జై అని తను అన్నది అర్థం అవ్వక జై వైపు చూస్తూ అడుగుతున్న నాన్సీ వైపు చూస్తూ నేను చెప్పాను కదా ఆద్య గురించి దేర్ షి ఇస్ అని ఆద్య కార్ ను చూపిస్తాడు…. వావ్ షి లుక్స్ వెరీ బ్యూటిఫుల్ కదా 😍😍 అని నైట్ డ్రెస్ లో విత్ అవుట్ మేకప్ న్యాచురల్ గా కనిపిస్తున్న ఆద్య ను నాన్సీ నవ్వుతూ తన వైపు చూస్తుంది….

హు 😏 ఎంత బ్యూటీఫుల్ గా ఉంటుందో అదే బలుపు, కొవ్వు కూడా దానికి ఉన్నాయి నాన్సీ అని చెప్తూ అవునా దీని వాలకం చూస్తుంటే పాచి మొహం కూడా కడుక్కున్నట్టు లేదు ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తుంది???

మే బీ ఏమైనా ఎమర్జెన్సీ అయ్యుంటుంది జై అంటున్న నాన్సీ వైపు చూస్తూ ఏంటి అంత ఎమర్జెన్సీ నాకేదో డౌబ్ట్ గా ఉంది అని నాన్సీ వద్దు అంటున్నా ఆద్య ను ఫాలో అవుతూ కళ్యాణ మండపం వరకూ వెళతాడు…. ఇదేంటి వెడ్డింగ్ హాల్ లోకి వెళ్తుంది కొంపదీసి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంటుందా ఏంటి అయినా దీనికి పెళ్ళి ఇష్టం లేదు కదా అని రకరకాలుగా అలోచిస్తూ నాన్సీ ను కార్ లో వెయిట్ చేయమని చెప్పి ఆద్య కి కొంచెం డిస్టెన్స్ లో ఫాలో అవుతాడు….

మరో వైపు అతను కూడా ఆద్య ను ఫాలో అవుతూ ఉంటాడు వీళ్ళు వెళ్ళేసరికి మండపం లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తో పూజ చేయిస్తూ కనిపిస్తారు అది చూసిన ఆద్య ఫాస్ట్ గా మండపం ఎక్కి పెళ్ళి కొడుకు షర్ట్ పట్టుకుని లాగి పైకి లేపి అందరి ముందు చంప పగల కొడుతుంది…… అది చూసిన జై, అతని తో పాటు పెళ్ళి మండపం లో ఉన్న ప్రతీ ఒక్కరూ షాక్ తో నోరు తెరిచి పైకి లేచి నుంచుంటారు…..

 

TO BE CONTINUEED…