విలన్ హస్బెండ్-24
ఆద్య సడన్ గా బుద్దిగా పీటల మీద కూర్చుని పూజ చేస్తున్న పెళ్ళి కొడుకుని అందరి ముందు చంప పగల కొట్టడం చూసిన జై దీనికేమైనా మెంటల్ హా…!! అని షాక్ అవుతూ దీనికి పెళ్ళి అంటే ఇష్టం లేకపోతే ఎవరికి పెళ్ళి జరగనివ్వదా ఏంటి అని ఆద్య వైపు అసహనంగా చూస్తూ ఒక పక్క నుంచుని చూస్తూ ఉంటాడు….
అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్ళిని చూస్తున్న అక్కడున్న అందరూ కూడా ఆద్య చేసిన పనికి షాక్ అవుతూ పైకి లేచి నుంచుంటూ ఆద్య ఎవరు ఏంటి అని ఒకరిని ఒకరు అడుగుతూ ఏవేవో గాసిప్స్ క్రియేట్ చేస్తారు…. పెళ్ళి కూతురు కూడా సౌరబ్ ను అలా కొట్టగానే షాక్ అవుతూ పైకి లేచి చూస్తూ ఉంటుంది….
సౌరబ్ చంప మీద చెయ్ పెట్టుకుని హలో ఎవరు మీరు నన్ను ఎందుకు కొట్టారు అసలు నేను ఎవరో తెలుసా?? హే యూ నోరు తెరిచావో నేను ఉన్న కోపం లో నిన్ను చంపేసిన చంపేస్తా అంటూ సౌరబ్ కాలర్ పట్టుకుని ఏంట్రా నీకు పెళ్ళి కావాలా పదరా …. నీ పెళ్ళి నేను జరిపిస్తాను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి తనను అన్ని రకాలుగా యూస్ చేసుకుని ఇపుడు మరో అమ్మాయితో మ్యారేజ్ కి రెడీ అవుతావా నిన్ను అంత ఈజీ గా వదలను అంటూ కోపంగా అరుస్తుంది….
ఆద్య మాటలకు షాక్ అవుతూ ఏ…. ఎమ్ మాట్లాడుతున్నారు మీరు నేను వేరే అమ్మాయిని ప్రేమించడం ఏంటి అని అప్పటికే పెళ్లి కూతురు తన వైపు డౌబ్ట్ గా చూస్తూ ఉండడం గమనించి కంగారుగా అడుగుతాడు….
తెలుగు లోనే కదా మాట్లాడుతున్నా ఎమ్ అర్థం అవ్వడం లేదా అయినా నీతో నాకు డిస్కషన్ అనవసరం అంటూ అందరి వైపు చూస్తూ ఐ ఆమ్ సో సారి ఆల్ మీరు నిండు మనసుతో వీడిని బ్లెస్ చేయడానికి వచ్చారు బట్ వీడు పెద్ద చీటర్ పెళ్ళి చేసుకోకుండానే నా ఫ్రెండ్ తో లివిన్ లో ఉంటూ తనను తల్లిని చేసి ఇదిగో ఇప్పుడు ఎమ్ తెలియనట్టు మరో అమ్మాయితో మ్యారేజ్ కి రెడీ అయ్యాడు అనగానే అందరూ షాక్ అవుతారు….
చూడమ్మా నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ మా వాడు అలాంటి వాడు కాదు ….. ఎందుకంటే వాడికి ఒక చెల్లి ఉంది ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేంతలా నేను వీడని పెంచలేదు అలాగే నా కొడుకు అంత నీచానికి ఎప్పుడూ దిగజాడు అంటూ కోపంగా ముందుకు వస్తాడు సౌరబ్ ఫాదర్….
అరే వాహ్ ఈ సీన్ బలే ఇంట్రెస్టింగ్ గా ఉందే అని జై ఎక్స్సైటింగ్ గా చూస్తూ పక్కకు చూడగా ఎప్పుడు వచ్చిందో కానీ నాన్సీ కూడా పక్కనే నుంచుని ఆద్య డేరింగ్ ను అడ్మైరింగ్ గా చూస్తూ ఉంటుంది…. హేయ్ నువ్వేంటి ఇక్కడ నిన్ను కార్ లో కూర్చోమని చెప్తే ఇక్కడికి ఎందుకు వచ్చావ్ నీకు వన్ వీక్ రెస్ట్ కావాలని శ్రావణి చెప్పింది కదా అయినా నిన్ను కాదు నువ్వు అడగ్గానే బయటకు తీసుకుని వచ్చాను చూడు నన్ను అనాలి ఫస్ట్ వెళ్ళి కార్ లో కూర్చో నాన్సీ అంటూ సీరియస్ గా చెప్తాడు జై….
అబ్బా వెళ్తాలే జై అరవకు నాకు ఆద్య బలే నచ్చేసింది ఎంత డేర్ కదా తనకు ఇంత మందిలో అలా ఒక అబ్బాయిని అది కూడా పెళ్లి కొడుకుని కొట్టడం అంటే మామూలు విషయం కాదు అంటూ ఎంతో ఎక్స్సైటింగ్ గా చెప్తున్న నాన్సీ ను చూసి వెటకారంగా నవ్వుతూ 😏దాని డేరింగ్ ఇప్పుడేం చూసావ్ ముందు ముందు ఇంకా చూపిస్తుంది ఇక కొట్టడం అంటావా అది ఎక్కడ కొట్టకూడదో అక్కడే కొడుతుంది అని తనను బెడ్ రూమ్ లో చెప్పుకోలేని చోట తన్నడం గుర్తొచ్చి తన వైపు కోపంగా చూస్తూ చెప్తాడు….
వావ్ రియల్లీ తను ఓన్లీ క్యూట్ మాత్రమే కాదు షి ఇస్ రియల్లీ ఇన్స్పిరేషన్ టు ఆల్ ది గర్ల్స్ లైక్ మీ అంటున్న నాన్సీ ను చూసి జై పక్కనే ఉన్న గోడకు తల బాదుకుంటాడు…. ( అయ్యో పాపం జై 🤣😂 తను ఒకలా చెప్తే నాన్సీ కి ఇంకోలా కన్వే అయింది 😜😆)
ఆద్య సౌరబ్ ఫాదర్ వైపు చూస్తూ వీడి గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నారు వీడి గురించి మీ కంటే నాకు బాగా తెలుసు కొంచెం వెయిట్ చేయండి వీడి ఒరిజినల్ క్యారెక్టర్ మీ అందరికీ చూపిస్తాను అంటూ సౌరబ్ వైపు చూస్తూ చెప్పరా లాస్య ను ప్రేమించా అని వెంటపడి తనను చీట్ చేసావా లేదా అని అందరి ముందు మరో చంప పగల కొడుతుంది….
అమ్మాయి చూస్తున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు చేయకు మా వాడికి తెలియదు అంటుంటే ఈ దౌర్జన్యం ఏంటి ఇప్పటికే నువ్వు చేసిన గొడవకి మా పరువు మొత్తం పోయింది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లకపోతే పోలీస్ లను పిలిపించి నెట్టించాల్సి వస్తుంది అని సౌరబ్ రిలేటివ్స్ లో ఒకరు సీరియస్ గా ఆధ్య కి వార్నింగ్ ఇస్తారు..
ఆహా మీకు అంత శ్రమ ఎందుకు అని నేనే పిలిపించాను ఏక్ బార్ ఆప్నే లెఫ్ట్ సైడ్ దేకో అంటూ యాటిట్యూడ్ గా అంటున్న ఆద్య వైపు చూస్తూ లెఫ్ట్ సైడ్ చూసిన అందరికీ పోలీస్ లు వస్తూ కనిపించగానే అది చూసిన సౌరబ్ కి వొళ్ళంతా చమటలు పడతాయి అది చూసిన ఆద్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది….
నమస్తే మేడం అంటూ సి. ఐ. రావడం రావడమే ఆద్య కి విష్ చేయడం తో ఆద్య నార్మల్ అమ్మాయి కాదు బాగా డబ్బున్న అమ్మాయి అని అక్కడున్న అందరికీ అర్థం అవుతుంది….
చూడండి సర్ ఈ అమ్మాయి ఎవరో ఎందుకు నా కొడుకు మీద ఇన్ని నిందలు వేస్తుందో మాకు అర్థం కావడం లేదు ఈ అమ్మాయిని మేము ఎన్నడూ చూసింది కూడా లేదు మా అబ్బాయి సౌరబ్ చాలా మంచోడు వాడికి ఎప్పుడూ ఆఫీస్, ఇల్లు తప్పా మరో లోకం తెలియదు మీరే మాకు న్యాయం చేయాలి సర్ అంటూ సౌరబ్ తల్లీ ఏడుస్తూ సి. ఐ ను కన్నీళ్లతో వేడుకుంటుంది
సి. ఐ. సౌరబ్ ఫ్యామిలీ వైపు చూస్తూ చూడండి మీ బాధ మాకు అర్థం అవుతుంది ఇలా సడెన్ గా పెళ్లి ఆపాల్సి వస్తున్నందుకు మాకు చాలా బాధగా ఉంది బట్ ఇద్దరు ఆడపిల్లల లైఫ్ స్పాయిల్ అవుతూ ఉంటే చూస్తూ ఉండలేక ఇలా వచ్చాం & మేడం చాలా మంచి వారు మీ వాడి మీద మాకు ఎలాంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు సౌరబ్ మేడం ఫ్రెండ్ ను చీట్ చేసాడు అని మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి దయచేసి కాసేపు ఎవరు మాట్లాడకండి అని చెప్పి సౌరబ్ ను సూటిగా చూస్తూ నీ పేరు & ఏం చేస్తూ ఉంటావ్ అంటూ తన ముందు నుంచుని అడుగుతాడు….
అప్పటికే భయం తో వణికిపోతున్న సౌరబ్ మెల్లగా గొంతు విప్పుతూ నా పేరు సౌరబ్ సర్ నేను ఒక MNC company లో జాబ్ చేస్తున్నాను నిజంగా నాకు లాస్య ఎవరో తెలియదు అని అంటూ ఉండగానే ఆద్య తన మొబైల్ లో లాస్య, సౌరబ్ కలిసి ఉన్న పిక్స్ స్క్రోల్ చేస్తూ చూపించడం తో సౌరబ్ కి ఇక మాట్లాడే ఛాన్స్ ఉండదు….
ఆద్య చూపిస్తున్న పిక్స్ చూస్తున్న అందరికీ పెద్ద షాక్ నే తగులుతుంది దాంతో అందరూ సౌరబ్ వైపు చూస్తే సౌరబ్ ఇంకేం చేయలేక తల వంచుకుని నిల్చోవడం చూసి ఆద్య చెప్పింది నిజమే అని అందరికీ కన్ఫర్మ్ అవుతుంది అది చూసిన పెళ్లి కూతురు తన లైఫ్ తలచుకుంటూ ఏడుస్తూ ఉండడం చూసి పెళ్లికి వచ్చిన అందరూ సౌరబ్ వైపు కోపంగా ఆ అమ్మాయి వైపు జాలిగా చూస్తూ ఉంటారు….
చూసావా జై వాడు నిజంగా చీటింగ్ చేసి ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నాడు ఆద్య కరెక్ట్ టైమ్ కి వచ్చి తన ఫ్రెండ్ లైఫ్ మాత్రమే కాదు ఇక్కడ ఈ అమ్మాయి లైఫ్ కూడా సేవ్ చేసింది అంటూ జై వైపు చూస్తూ అంటున్న నాన్సీ ను చూసి హ్మ్మ్ 😏 ఏదో చేసింది లే దాన్ని అంతలా పొగడకు నాకు మండుతుంది ఇక్కడ అయినా ఇలాంటి వాడికి జాబ్ ఇచ్చిన వాడిని తన్నాలి వీడే ఇలా ఉన్నాడంటే వాడి బాస్ ఇంకెంత వెధవో అర్థం అవుతుంది సర్లే పదా నువ్వు ఆ బ్రేక్ఫాస్ట్ ఏదో త్వరగా చేస్తే నేను ఆఫీస్ కి స్టార్ట్ అవ్వాలి నాకు మీటింగ్ కి కూడా టైం అవుతుంది అంటూ తర్వాత ఎమ్ అవుతుందో చూద్దాం అంటున్నా నాన్సీ చెయ్ పట్టుకుని పార్కింగ్ దగ్గరకు లాక్కుని వస్తాడు జై…..
కార్ అన్లాక్ చేసి కూర్చుంటున్న జై కి హలో సర్ గుడ్ మార్నింగ్ అన్న వాయిస్ కి అటుగా చూసిన జై కి అక్కడ తన ఆఫీస్ ఎంప్లాయ్ నవ్వుతూ విష్ చేస్తూ కనిపించడం తో మార్నింగ్ అంటూ కార్ ఎక్కబోతున్న జై ను చూసి సర్ మీరు సౌరబ్ మ్యారేజ్ కి వచ్చారా అని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతాడు జై ఎంప్లాయ్ ( వీడికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు అందుకే నామకరణం చేయలేదు 😜🫣)
వాట్ నేను వీడి పెళ్లికి రావడం ఏంటి ఊర్లో ప్రతీ అడ్డమైన వాడి పెళ్లికి వచ్చేంత కాళిగా కనిపిస్తున్నానా అంటూ సీరియస్ అవుతున్న జై ను చూసి భయపడుతూ సా…. సారి సర్ నేను ఆ ఉద్దేశం తో అనలేదు సౌరబ్ ఎంతైనా మీ ఆఫీస్ లో ఒక ఎంప్లాయ్ కదా ఆ కర్టసీ తో మ్యారేజ్ కి వచ్చారు అనుకున్నాను
ఏంటి వాడు వర్క్ చేసేది నా ఆఫీస్ లోనా అని షాక్ అవుతూ నాన్సీ వైపు చూస్తాడు ఆల్మోస్ట్ నాన్సీ కూడా అంతే షాక్ అవుతూ అంటే ఇందాక నువ్వు చెప్పిన వెధవ నువ్వేనా అని నవ్వు ఆపుకుంటూ అడుగుతుంది అది చూసిన జై షట్ అప్ నాన్సీ అంటూ కోపంగా కార్ లో కూర్చుని నాన్సీ కార్ ఎక్కగానే అక్కడి నుండి వెళ్లిపోవడం చూసిన ఆ అబ్బాయి ఉఫ్ 🤦 ఈయన ఈ జన్మకు అర్థం అవ్వడు పెళ్లికి వచ్చారా అని అడిగితే ఏదో అనకూడని మాటలు మాట్లాడినట్టు అలా చూస్తాడెంటీ అని తిట్టుకుంటూ హుషారుగా లోపలికి వెళతాడు….
♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍
ఏడుస్తున్న పెళ్ళి కూతురి వైపు చూడమ్మా ఎందుకు ఏడుస్తున్నావ్ ఇలాంటి ఇడియట్ తో నీ మ్యారేజ్ ఆగినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి…. ఇవాళ లాస్య కంటే నువ్వు బెటర్ గా కనిపించావు రేపు నీ కంటే బెటర్ గా మరో అమ్మాయి కనిపిస్తే నిన్ను కూడా వదిలేసే టైప్ వీడు అని సౌరబ్ వైపు సీరియస్ గా చూస్తూ చెప్తాడు…..
ఆద్య, మాన్య లకు కూడా పెళ్లి కూతురు అలా ఏడుస్తూ ఉంటే బాధగా ఒకరిని ఒకరు చూసుకుని సి. ఐ. గారు చెప్పినట్టు యూ ఆర్ వెరీ లక్కీ మ్యారేజ్ కి ముందే వీడి క్యారెక్టర్ బయట పడ్డది అయినా ఇలాంటి రోగ్ కోసం నీ కన్నీటిని వేస్ట్ చేయకు అని ఆ అమ్మాయి పేరెంట్స్ వైపు చూస్తూ చూడండి అమ్మాయికి మ్యారేజ్ చేయాలి అంటే చూడాల్సింది అబ్బాయి జాబ్ కాదు తన క్యారెక్టర్……
తొందర పడి మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీ కూతురి లైఫ్ స్పాయిల్ అయ్యేది అని వాళ్ళతో కాసేపు మాట్లాడి మీరు పెళ్ళికి ఖర్చు పెట్టిన అమౌంట్ నేను ఇస్తాను అని స్పాట్ లో చెక్ ఇస్తూ ఇది ఇస్తుంది నా స్టేటస్ చూపించడానికి కాదు తనను నా సిస్టర్ లా అనుకుని ఇస్తున్నా నెక్స్ట్ టైం అయినా మంచి మ్యాచ్ చూసి చేయండి అనగానే అక్కడున్న అందరూ ఆద్య మంచితనానికి ఇంప్రెస్ అవుతూ తన వైపు చూస్తూ ఉంటారు….
అప్పటికే పెళ్లికి వచ్చిన వాళ్లు ఆ గొడవను చూసి సగానికి పైగా వెళ్లిపోవడం తో మిగిలిన వాళ్ళను అక్కడి నుంచి పోలీసులు క్లియర్ చేస్తారు…. ఆద్య పెళ్ళి కూతురు ఫ్యామిలీ ను కూడా అక్కడి నుండి పంపిస్తుంది….. పెళ్ళి కూతురు వెళ్తూ వెళ్తూ సౌరబ్ కి స్ట్రాంగ్ గా చంప దెబ్బ ఇచ్చి మరి వెళ్ళడం చూసి మాన్య ఆద్య చిన్నగా నవ్వుకుని వాళ్ళు వెళ్ళే వరకూ వెయిట్ చేస్తారు…..
ఇప్పుడేం చెప్తారు మీ అబ్బాయి గురించి అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వాళ్ళ వైపు చూస్తూ ఇప్పుడు కూడా మీ అబ్బాయి శ్రీరామ చంద్రుడు అనే అంటారా అనగానే సౌరబ్ పేరెంట్స్ ఆద్య వైపు చూస్తూ వీడు ఇంత నీచుడు అని మేము నిజంగా అనుకోలేదు అమ్మా…. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం మమ్మల్ని క్షమించి సౌరబ్ ను వదిలేయండి ప్లీస్ ఇప్పటికే నలుగురిలో మేము తల ఎత్తుకోకుండా చేశాడు వీడు అని సౌరబ్ చెంపలు వాయించి వెళ్ళి ఆ అమ్మాయికి సారి చెప్పు అంటూ అరుస్తాడు సౌరబ్ ఫాదర్…..
చూడండి అంకుల్ నాకు కావాల్సింది సారి కాదు సౌరబ్ మారి లాస్య ను పెళ్ళి చేసుకోవడం & మీ అబ్బాయి చేసిన మోసాన్ని భరించలేక అక్కడ నా ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసింది టైమ్ కి తన తమ్ముడు చూసాడు కాబట్టి లాస్య ఇవాళ ప్రాణాలతో ఉంది లేకపోతే తను ఇవాల్టికి చచ్చిపోయి ఉండేది….. నిజంగా లాస్య చనిపోయి ఉంటే మీ అబ్బాయిని ఊరికే వదిలే దాన్ని కాదు లాస్య కి ఏమైనా జరిగితే నేను చూస్తూ ఊరుకోను సో అందుకే మీకు చెప్తున్నా మీ అబ్బాయికి ఎలాంటి గడ్డి పెట్టి చేంజ్ చేస్తారో మీ ఇష్టం బట్ మీ అబ్బాయి ఇష్టంగా లాస్య ను పెళ్ళి చేసుకోవాలి …..
అలాగే లాస్య పేరెంట్స్ కి ఈ విషయాలేవీ తెలియకూడదు మీ సంబంధం బయట వాళ్ళు చూసినట్టే ఉండాలి ఎలాంటి డౌబ్ట్ రాకుండా వీళ్ళ పెళ్ళి వన్ వీక్ లో అయిపోవాలి తనను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎలాంటి కష్టం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇందులో ఏ చిన్న చేంజ్ వచ్చినా నెక్స్ట్ మినిట్ మీ ఎంటైర్ ఫ్యామిలీ జైల్ లో ఉంటారు గాట్ ఇట్ ఇక మీరు వెళ్ళచ్చు అని చెప్పగానే సౌరబ్ ను కొడుతూ తన ఫాదర్ అక్కడి నుంచి తీసుకుని వెళతాడు
ఏంటి మేడం అలా పంపేశారు వాడ్ని స్టేషన్ లో పడేసి నా స్టైల్ లో చెప్పుంటే వాడే పెళ్ళికి ఒప్పుకునే వాడు కదా అంటున్న సి. ఐ. తో మీరు చెప్పినట్టు చేస్తే వాడు పెళ్ళి చేసుకుంటాడు కానీ తర్వాత మాటలతో లాస్య ను టార్చర్ చేస్తాడు అందుకే వాడ్ని ఇలా లాక్ చేసా…. తన ఫాదర్ ను చూస్తుంటే చాలా జెన్యూన్ గా అనిపిస్తున్నారు వాడికి ఎలా చెప్పాలో ఆయనే చూసుకుంటారు పిలవగానే వచ్చినందుకు థాంక్స్ అంటూ సి. ఐ. తో పాటు పార్కింగ్ వైపు వెళ్ళి ఎవరి వెహికల్ లో వాళ్ళు వెళ్ళిపోతారు…..
తన కార్ లో వెళ్తున్న ఆద్య ను చూసి నవ్వుతూ బాగా ఎక్కేసావ్ ఆద్య ఇక ఈ లైఫ్ నీతోనే ఫిక్స్ అయిపో అని ఆద్య వెళ్ళిన వైపే మైమరపుగా చూస్తూ తనకు మీటింగ్ కి టైమ్ అవ్వడం తో ఎప్పటిలా ఆద్య ను ఫాలో అవుతూ అప్డేట్స్ ఇస్తూ ఉండమని నితీష్ కి చెప్పి అతను కూడా తన ఆఫీస్ కి వెళ్తే నితీష్ కూడా అక్కడి నుండి వెళతాడు…..
🤎🤍♥️🤎🤍♥️🤎🤍♥️🤎
రుద్రాన్ష్ కోసం అందంగా రెడీ అయ్యి తాను బుక్ చేసిన రిసార్ట్ కి రీచ్ అవుతుంది శ్రియ… తమ ప్రైవసీ కోసం టాప్ ఫ్లోర్ మొత్తం శ్రియ నే బుక్ చేస్తుంది దాన్ని అందంగా శ్రియ చెప్పినట్టే డెకరేట్ చేసిన రిసార్ట్ మ్యానేజర్ కి పెద్ద ఎత్తున అమౌంట్ టిప్ గా ఇచ్చి రుద్రాన్ష్ వస్తే ఎలా మాట్లాడాలి ఏంటి అని ప్రాక్టీస్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శ్రియ….
సర్ వచ్చేశారు మేడం అని ఒక రిసార్ట్ లో వర్క్ చేస్తున్న పర్సన్ వచ్చి ఇన్ఫామ్ చేయడం తో తను రుద్రాన్ష్ కోసం స్పెషల్ గా చేయించిన రెడ్ & వైట్ కలర్ రోస్ బొకే చేత్తో పట్టుకుని తన హిప్ కనిపించేలా శారీ అడ్జస్ట్ చేసి మరో వైపు సైడ్ నుండి నడుము కూడా కనిపించేలా శారీ ప్లీట్ అడ్జస్ట్ చేసాక చిరు నవ్వుతో రుద్రాన్ష్ కోసం వెయిట్ చేస్తూ రుద్ర ఎంత సేపటికి రాకపోయేసరికి వెళ్ళి చైర్ లో కూర్చుంటుంది…..
ఎంటైర్ ఫ్లోర్ మొత్తం నిశబ్దంగా ఉంది తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంటే తన టెన్షన్ తగ్గించుకుంటూ కూర్చున్న శ్రియ కి రుద్రాన్ష్ అడుగుల చప్పుడు విని బొకే ను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని తల పైకి ఎత్తి చూసిన తనకు చాక్లెట్ కలర్ షర్ట్ విత్ బ్లాక్ జీన్స్,కళ్ళకు షేడ్స్ & చేతికి వాచ్ మరో చేత్తో స్టైల్ గా కాల్ మాట్లాడుతూ గ్రీకువీరుడు లా ఎంట్రీ ఇస్తాడు రుద్ర 😍….
తనను చూసిన శ్రేయ వావ్ అంటూ నోరు తెరిచి చూస్తూ అలాగే తనకు తెలియకుండానే పైకి లేచి రుద్ర వైపు కళ్ళు కూడా బ్లింక్ చేయకుండా చూస్తూ ఉంటుంది…. రుద్ర రావడం కూర్చోవడం ఆనంద్ ను చెప్పిన వర్క్ చేయనందుకు తిట్టడం అన్ని జరిగిపోయినా శ్రియ మెరిసే కళ్లతో రుద్ర ను చూస్తూ అలాగే నుంచుంటుంది…..
రేపటికి వర్క్ అవ్వకపోవాలి అప్పుడు చెప్తా అని సీరియస్ గా కాల్ కట్ చేసి తన వైపు 😍🤩 మతాబుల్లా వెలిగిపోతున్న కళ్లతో చూస్తున్న శ్రియ ముందు చిటికె వేస్తూ హలో మేడం ఏంటి అలా నోరు తెరిచి చూస్తున్నావ్ మౌత్ క్లోజ్ చెయ్ లేకపోతే దోమలు వెళ్తాయి అని సర్కాస్టింగ్ గా అంటున్న రుద్ర ను చూసి మూతి తిప్పుతూ రుద్ర ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుంటూ రుద్ర దిస్ ఇస్ ఫర్ యూ అంటూ బొకే రుద్ర చేతిలో పెడుతుంది
దాన్ని చూసిన రుద్ర లెఫ్ట్ ఐ బ్రో రైస్ చేసి బొకే వైపు శ్రియ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు…..
To Be Continueed…………….