విలన్ హస్బెండ్ – 25
రుద్రాన్ష్ తన చేతిలో బొకే పెట్టిన శ్రియ వైపు లెఫ్ట్ ఐ బ్రో రైస్ చేసి తన వైపు బొకే వైపు మార్చి మార్చి చూస్తూ కాసేపటికి తన చూపు తిప్పేసి బొకే టేబుల్ మీద పెడుతూ తన టేబుల్ మీద ఉన్న మెనూ కార్డ్ తీసుకుని ఎమ్ ఆర్డర్ చేయాలా అని చూస్తూ ఉంటాడు…. రుద్రాన్ష్ చూసిన చూపుకు అంత ఏ. సి లో కూడా చమటలు పట్టిన తన ఫేస్ ను చీర కొంగు తో తుడుచుకుంటూ రుద్రాన్ష్ తనకు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇస్తాడేమో అని ఆశగా ఎదురుచూస్తూ కూర్చున్న శ్రియ కి రుద్రాన్ష్ తన వైపు కూడా చూడకపోవడం తో ఎక్కడలేని ఉక్రోషం పుట్టుకొస్తుంది…..
రుద్ర్ నా గురించి ఎమ్ థింక్ చేస్తున్నాడు తన కోసమే కదా నేను ఇంత బ్యూటీఫుల్ గా రెడీ అయి వచ్చాను ఎట్ లీస్ట్ నా వైపు చూసి బావున్నావ్ అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను …. తన కోసం 2 అవర్స్ కష్టపడి రెడీ అయితే నా వైపు 2 మినిట్స్ కూడా చూడ్డం లేదు ఈ రోబో కి నా లవ్ గురించి ఎలా కన్వే చేయాలి చేసినా యాక్సెప్ట్ చేస్తాడా?? ఆంటీ ఏమో రుద్ర్ కి ఇండియన్ ట్రెడిషన్ అంటే ఇష్టం సో నువ్వు ఇండియన్ గర్ల్ లా రెడీ అయితే పక్కా ఇంప్రెస్ అవుతాడు అంది బట్ ఇక్కడ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు 😤😖
రుద్రాన్ష్ కాసేపు మెనూ కార్డ్ చూసి వెయిటర్ అని పిలవగానే ఒక అబ్బాయి వినయంగా వచ్చి రుద్ర ముందు నుంచుని రుద్రాన్ష్ ఇస్తున్న ఆర్డర్ ను నోట్ చేసుకుంటాడు…. వెల్ ఐ వాంట్ పన్నీర్ టిక్కా,బటర్ నాన్ విత్ కాజు & వెజ్ స్ప్రింగ్ రోల్ అని తనకు కావలసినవి చెప్పి శ్రియ వైపు చూస్తాడు తను తనకు నచ్చిన నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేసాక అవి తీసుకుని రావడానికి వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు….
మొబైల్ లో సీరియస్ గా ఇన్వాల్వ్ అయిన రుద్రాన్ష్ వైపు చూస్తూ నాతో డిన్నర్ కి వచ్చి మొబైల్ చూస్తూ కూర్చోకపోతే ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా అని రుద్రాన్ష్ వైపు చూస్తూ 😏😏 ప్చ్ లాభం లేదు నేనే కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి లేకపోతే ఇలాగే మా డిన్నర్ ఎండ్ అయ్యేలా ఉంది అని నిట్టూర్చి రుద్ర్ ఈ ప్లేస్ చాలా బావుంది కదా యూ నో మన ఫస్ట్ డిన్నర్ చాలా స్పెషల్ గా ఉండాలని చాలా ప్లేసెస్ సెర్చ్ చేసి ఇది ఫిక్స్ చేసాను యూ లైక్ ఇట్ రుద్ర్??? అని ఎక్స్సైటింగ్ గా అడుగుతుంది శ్రియ
యాహ్ ఇట్స్ గుడ్ ఇంకో సారి రావాలి అనిపిస్తుంది అని చెప్పిన రుద్రాన్ష్ ను చూసి శ్రియ నవ్వుతూ వావ్ నీకు నచ్చింది ఐ ఆమ్ సో హ్యాపీ రుద్ర్ నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వద్దాం….
వాట్?? ఇంకో సారి రావాలి అన్నాను కానీ నీతో వస్తాను అని చెప్పలేదే ఇంకో సారి వస్తా అన్నది మామ్, డాడ్ లతో కలసి అని అంటున్న రుద్రాన్ష్ ను చూసి శ్రియ మొహం ఎర్రగా మారుతుంది….
తన మొహం లోని కోపాన్ని పైకి కనిపించకుండా స్మైల్ క్యారీ చేస్తూ ఐ ఆమ్ అల్సో యువర్ ఫ్యామిలీ కదా రుద్ర్ అందుకే నన్ను కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాను…..
శ్రియ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ నువ్వు నాకు ఫ్రెండ్ ఐ అగ్రీ దట్ బట్ నా ఫ్యామిలీ లో ఒక మెంబర్ గా నిన్ను నేను ఎపుడు అనుకోలేదు నాకు ఇక్కడ మామ్ డాడ్ తర్వాత ఫ్యామిలీ అంటే గుర్తొచ్చేది ఆనంద్….. యాహ్ నా యాంగర్ ను కంట్రోల్ చేయాలి అన్నా దాన్ని బేర్ చేయాలి అన్నా అది ఆనంద్ వల్లే అవుతుంది దట్ టూ హి ఇస్ మై చైల్డ్ బడ్డీ అని చెప్తూ ఉండగానే ఫుడ్ రావడం తో వెయిటర్ ఎవరి ఫుడ్ వాళ్ళకు ప్లేట్ లో సర్వ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాక శ్రియ రుద్ర్ వైపు చూస్తూ కెన్ ఐ అస్క్ యూ సమ్థింగ్ రుద్ర్??
యాహ్ టెల్ మీ శ్రియ అంటూ వైపు చూస్తున్న రుద్ర ను చూస్తూ మన పరిచయం అయినప్పటి నుండి చూస్తున్నా వై డోంట్ యూ ఈట్ నాన్ వెజ్?? ఆంటీ, అంకుల్ నాన్ వెజ్ తింటారు బట్ నువ్వు ఎందుకు దాన్ని ట్రై చేయాలి అనుకోలేదు??
రుద్ర నవ్వుతూ యాక్చువల్లీ నాకు ఇష్టమైన వ్యక్తి కి నాన్ వెజ్ నచ్చదు సో అందుకే నేను కూడా వాళ్ళ కోసం నాన్ వెజ్ తినడం ఆపేశాను ఎప్పుడో నా చైల్డ్ హుడ్ లో తిన్నాను ఆ తరువాత ఆ వ్యక్తి కోసం అన్ని వదిలేసాను
నిన్ను ఇంతలా ఇంప్రెస్ చేసిన ఆ పర్సన్ ఎవరో నేను తెలుసుకోవచ్చా రుద్ర్ మన గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుండి నిన్ను ఇంప్రెస్ ట్రై చేస్తున్నా బట్ స్టీల్ సక్సెస్ అవ్వలేదు నేను 😑😔
హహ టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇంట్రడ్యూస్ చేస్తాను అని చిన్న స్మైల్ వదిలి రుద్ర డిన్నర్ ఫినిష్ అయ్యే వరకూ శ్రియ చెప్పేది ఓపికగా విని తన ఫుడ్ ఫినిష్ అయ్యాక ఒకే శ్రియ ఐ ఆమ్ డన్ ఇట్స్ ఆల్రెడీ 11 ఐ హ్యావ్ టు గో అని శ్రియ వద్దు అంటున్నా బిల్ పే చేసి లేవడానికి పైకి లేచిన రుద్రాన్ష్ చెయ్ పట్టుకుని ఆపేస్తూ ఐ వాంట్ టు టాక్ విత్ యూ రుద్ర్ అంటూ ప్లీసింగ్ గా అడుగుతుంది
ఇప్పటి వరకూ మాట్లాడుతూనే ఉన్నాం కదా శ్రియ ఒకే ఫైన్ నీ కోసం ఇంకో 10 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తున్నా ఏంటో చెప్పు అని మొబైల్ లో టైం చూస్తూ శ్రియ వైపు చూస్తాడు….
శ్రియ పైకి లేచి రుద్ర వైపు చూసి గట్టిగా ఊపిరి వదిలి రుద్ర్ నువ్వంటే నాకు ఇష్టం… ఇష్టం అనే వర్డ్ కూడా చాలా చిన్నది నీ మీద నాకు ఉన్నది పిచ్చి మన కాలేజ్ డేస్ నుండి నువ్వంటే నాకు క్రష్ ఫీల్ ఉండేది అందుకే ఏ అమ్మాయి నీకు ప్రపోజ్ చేయకుండా నీ చుట్టూనే తిరుగుతూ ఉండే దాన్ని…. నాతో పాటు నా ప్రేమ కూడా పెరిగి నీతో పెళ్లి వరకు వచ్చేలా చేసింది & నేను నిన్ను లవ్ చేస్తున్నట్టు అంటీ కి కూడా చెప్పాను షి ఫెల్ట్ వెరీ హ్యాపీ…. నా లవ్ గురించి నీకు చెప్పాలి అనే ఇవాళ నీకు నచ్చేలా రెడీ అయి వచ్చాను …..
నా మనసులో ఏముందో చెప్పేశాను ఇక నువ్వు నీ డెసిషన్ చెప్పాలి ఐ నో యూ ఫీల్ లిటిల్ ఆక్వార్డ్ బట్ లవ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైమ్ కదా సో అందుకే నా లవ్ నీకు కన్వే చేయడానికి ఇదే రైట్ టైం అనిపించింది చెప్పాను నువ్వు వెంటనే నీ డెసిషన్ చెప్పాలి అని నేను కూడా చెప్పట్లే రుద్ర్ టేక్ యువర్ ఓన్ టైం బట్ నో అని చెప్పకు నేను తట్టుకోలేను 🥹🥹 అని రుద్ర వైపు చూస్తూ ఒకే రుద్ర్ యూ మే గో నౌ & నేను కూడా స్టార్ట్ అవుతాను అని తన బ్యాగ్ తీసుకుని వెళ్లడానికి ముందుకు వెళ్తున్న శ్రియ కి చిటికె వేసిన సౌండ్ వినిపించడం తో వెనక్కి తిరిగి రుద్ర వైపు చూస్తుంది….
నీ మనసులో ఏముందో చెప్పావ్ మరి నా మనసులో ఏముందో కూడా విను శ్రియ అంటూ శ్రియ ముందుకు వచ్చి నుంచుని నాకు నువ్వంటే ఇష్టం లేదు అనగానే శ్రియ రుద్రాన్ష్ వైపు నీళ్ళు నిండిన కళ్లతో చూస్తూ వై రుద్ర్ వై డోంట్ యూ లవ్ మీ?? నాకు ఎమ్ తక్కువ అందం, స్టేటస్, క్వాలిఫికేషన్ అన్నీ నీతో పాటు ఈక్వల్ గా ఉన్నాయి నాలో ఎమ్ తక్కువ అంటూ ఉక్రోషం తో అరుస్తుంది…..
హహ అన్ని ఉన్నాయి శ్రియ ఉండాల్సిందే లేదు అందుకే నువ్వు నాకు ఎప్పటికీ నచ్చవ్ బెటర్ నువ్వు నన్ను మర్చిపోతేనే అది నీకు నాకు ఇద్దరికీ మంచిది & ఇంకో సారి ఈ చెత్త గురించి నాతో మాట్లాడాలి అంటే మాత్రం నన్ను మీట్ అవ్వకు ఎందుకంటే నేను చాలా బిజీ ఎవ్రీ మినిట్ నాకు చాలా ఇంపార్టెంట్….
రుద్ర్ యూ ఆర్ ఇన్సల్టింగ్ మై లవ్ మనం 7 ఇయర్స్ గా ఒకరికి ఒకరు తెలుసు నిన్ను చూసిన నెక్స్ట్ మినిట్ నుండి లవ్ చేస్తున్నా అలాంటి నా ప్రేమ ను చెత్త అంటూ ఇన్సల్ట్ చేస్తే ఐ కాంట్ బేర్ ఇట్….. నాలో ఏదైనా ఎర్రర్ ఉంటే చెప్పు నేను చేంజ్ చేసుకుంటాను అంతే కానీ ఇలా నో చెప్పి నన్ను ఇన్సల్ట్ చేయకు ఐ రియల్లీ లవ్ యూ అని ఏడుస్తూ రుద్రాన్ష్ ను హగ్ చేసుకుంటూ కిస్ చేయడానికి ట్రై చేస్తుంది….
శ్రియ లీవ్ అసలేం చేస్తున్నావ్ అంటూ రుద్ర ఎంత దూరం జరపాలి అని చూస్తుంటే రుద్ర అంటే పిచ్చి ప్రేమ పెంచుకున్న శ్రియ మాత్రం రుద్ర ను దూరం అవ్వకుండా గట్టిగా పట్టుకొని రుద్రాన్ష్ లిప్స్ మీద డీప్ కిస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది…. పేషెన్స్ కోల్పోయిన రుద్రాన్ష్ శ్రియ ను విసురుగా వెనక్కి నెట్టి చంప చల్లుమనిపిస్థాడు………
బిహేవ్ యువర్ సెల్ఫ్ 🤨🤨 అమ్మాయిలా బిహేవ్ చెయ్ డోంట్ బిహేవ్ లైక్ బిచ్ అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న రుద్రాన్ష్ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ డోంట్ లీవ్ మీ రుద్ర్ ఐ రియల్లీ లవ్ యూ నువ్వు లేకుండా నన్ను నేను ఇమాజిన్ చేసుకోలేను ప్లీస్ రుద్ర్ ట్రై టు అండర్స్టాండ్ అంటూ కాళ్ళు రెండు తన రెండు చేతులతో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది….
శ్రియ వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దిస్ ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ అంటూ శ్రియ ను విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అసహనంగా అరుస్తాడు…. బికాస్ ఆఫ్ యూ నువ్వు నాకు దూరం అవుతావు అన్న థాట్ కూడా నేను బరించలేను రుద్ర్ ప్లీస్ లవ్ మీ అంటూ సైకిక్ గా బిహేవ్ చేస్తున్న శ్రియ ను చూసి సహనం కోల్పోయిన రుద్ర శ్రియ ను విసురుగా వెనక్కి నెట్టి తన చెయ్ పట్టుకుని కిందకు తీసుకుని వచ్చి తన కార్ లో శ్రియ ను తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి తన ఇంటికి స్టార్ట్ అవుతాడు…..
రుద్ర్ అంటూ తన ఇంటి ముందు నుండి వెళ్తున్న కార్ ను చూసి ఐ డోంట్ లీవ్ యూ అని రుద్రాన్ష్ కి వినిపించేలా అరచి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతుంది శ్రియ…. స్టీరింగ్ మీద తన రెండు చేతులు బిగుసుకోవడం తో రుద్రాన్ష్ సీరియస్ గా డ్రైవ్ చేస్తూ తన ఇంటి ముందు కార్ ఆపి ఇంట్లోకి వెళ్ళేసరికి హాల్ లో తన కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తుంది తన మదర్ అపర్ణ…..
🤍🤎🤍🤎🤍🤎🤍🤎🤍🤎🤍🤎
అబ్బా జై ఎందుకలా సీరియస్ గా కూర్చున్నావ్ కొంచెం నవ్వు అని బ్రేక్ఫాస్ట్ చేస్తూ అడుగుతున్న నాన్సీ ను చూసి ఇరిటేట్ చేయకుండా ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చెయ్ నాన్సీ ఐ వాంట్ టు గో అని తన ముందున్న కాఫీ తాగుతూ సీరియస్ లుక్స్ ఇస్తాడు జై….
ఈ కోపం ఇందాక నేను నవ్వినందుకా లేక సౌరబ్ కి జాబ్ ఇచ్చినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఇరిటేట్ అవుతున్నావా అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది నాన్సీ….
నాకు ఎవరి మీద కోపం లేదు ఒకే…. ఇక ఆ ఇడియట్ సౌరబ్ అంటావా వాడికి ఆల్రెడీ ఊస్టింగ్ ఆర్డర్స్ మెయిల్ చేశా వాడికి ఇంకెక్కడ జాబ్ కూడా రాకుండా చేశా ఇవాళ వాడు చేసిన పనికి వాడితో కలిపి నన్ను కూడా తిట్టుకుంటున్నారు అందుకే ఇలా పగ తీర్చుకుంటున్నా అయినా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ముందే వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు బుద్దిగా పెళ్లి చేసుకోవచ్చు కదా ఇలా లివిన్ లో ఉంటూ అమ్మాయిని ట్రాప్ చేసి ఇంకో అమ్మాయిని ఎందుకు మోసం చేయాలి???
అచ్ఛా వాడికి బానే లెక్చర్ ఇస్తున్నావ్ మరి నువ్వు కూడా మీ డాడ్ కోరుకున్నట్టు హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవ్వకుండా ఎందుకు అమ్మాయిలతో ఇలా ఫ్లాట్ లో ఎంజాయ్ చేస్తున్నావ్??
నా విషయం వేరు 🤦 అన్ని తెలిసి కూడా నువ్వు ఇలా అడిగితే ఇంకేం చెప్పను నా లైఫ్ నా చేతుల్లో నుండి ఎప్పుడో వెళ్ళిపోయింది నేను ఇందులో నుండి బయటకు వెళ్ళాలి అనున్నా వెళ్లలేని పరిస్థితి అని ఎదో ఆలోచిస్తూ చెప్తున్న జై వైపు చూస్తూ నిన్ను చూస్తే సముద్రం గుర్తొస్తుంది జై సముద్రం లో ఎంతో ఖజానా ఉంటుంది అలాగే ఎన్నో రహస్యాలు, ఎన్నో బాధలు, సంతోషాలు మనకు తెలియని ఎన్నో విషయాలు దాగుంటాయి అలాగే నిన్ను చూస్తే పైకి సరదాగా కనిపించే నీలో ఎన్నో బాగోద్వేగాలు దాగున్నాయి అని ఎమోషనల్ అవుతూ నువ్వే లేకపోతే ఇవాళ నేను ఎక్కడ ఉండే దాన్నో తలచుకుంటే భయం వేస్తుంది జై….
నాన్సీ జరిగిపోయిన నీ గతాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నావ్?? నీకు ఎవరు ఉన్నా లేకపోయినా నేనున్నా ఒకే నా అంటూ తన కన్నీళ్ళు తుడిచి నాన్సీ వద్దు అంటున్నా తను ఆర్డర్ చేసినవి అన్నీ తినిపించాక బిల్ క్లియర్ చేసి లెట్స్ మూవ్ అంటూ నాన్సీ తో కలిసి బయటకు వస్తున్న జై, నాన్సీ లకి ఎదురు అవుతారు ఒక ఫ్యామిలీ ??
(ఆ ఫ్యామిలీ ఎవరు, ఏంటి అని కామెంట్స్ లో చెప్పండీ 😌 🫣 అలాగే నాన్సీ పాస్ట్ ఏమై ఉంటుందో కూడా గెస్ చేయండి )
🤍💚🤍💚🤍💚🤍💚🤍💚
నైట్ డ్రెసెస్ లో ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్ళిన ఆద్య, మాన్య ఆఫ్టర్నూన్ ఇంట్లోకి వస్తూ కనిపించడం తో అంత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళారు అమ్ము పిలుస్తున్నా అర్జంట్ వర్క్ అంటూ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా వెళ్ళారు….. కాల్స్ చేసిన ఇద్దరూ లిఫ్ట్ చేయరు అసలు ఎక్కడికి వెళ్లారే ఇద్దరూ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు అని అయినా ఉందా ఇద్దరికి అని ఇంట్లోకి రావడం ఆలస్యం తిట్ల దండకం స్టార్ట్ చేస్తుంది శైలజ….
శైలు ఇప్పుడే కదా వచ్చారు ముందు ఇద్దరినీ ఫ్రెష్ అవ్వనివ్వు అని అమ్ము, మాన్య వెళ్ళి ఫ్రెష్ అయి రండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తున్న మహిదర్ ను చూసి నవ్వుతూ లవ్ యూ డాడ్ అని మహీదర్ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గన కిస్ చేసి శైలు ను వెక్కిరిస్తూ మాన్య, ఆద్య పైకి వెళ్ళడం చూసి శైలు సీరియస్ గా మహిదర్ వైపు చూస్తుంది…..
అలా చూడకు శైలు ఏంటో నువ్వు ఎలా ఉన్నా నా కళ్ళకు ఇంకా మన మ్యారేజ్ టైమ్ లో ఎలా ఉన్నావో దాని కంటే ఇంకా అందంగా కనిపిస్తావ్…. ఎలా శైలు ఇంకా అలా అంతే క్యూట్ గా ఉన్నావ్ నాకు కూడా కొన్ని టిప్స్ చెప్పచ్చు కదా అంటూ ఇన్నోసెంట్ గా శైలు ను ఆద్య టాపిక్ నుండి డైవర్ట్ చేస్తాడు….
చాల్లే ఆపండి మీరు మీ అల్లరి రోజు రోజుకి చిన్న పిల్లాడు అయిపోతున్నారు అని సిగ్గు తో తల వాల్చి కిచెన్ లోకి వెళ్తున్న శైలు ను చూసి మహిదర్ నవ్వుకుంటూ గార్డెన్ లో కూర్చున్న వినయ్ దగ్గరకు వెళతాడు…..
త్వరగా ఫ్రెష్ అయ్యి రావే బాగా ఆకలిగా ఉంది అని ఆద్య తన రూమ్ కి వెళ్తే ఒకే అని చెప్తూ అప్పటికే 20 సార్లు కాల్ చేసిన తన మదర్ కి రిటర్న్ కాల్ చేస్తూ తన రూమ్ అనుకుని అమర్ ఉన్న రూమ్ కి వెళ్ళి అక్కడ అప్పుడే బాత్ ఫినిష్ చేసి టవల్ కట్టుకుంటూ ఉన్న అమర్ ను చూసి కెవ్వున అరుస్తుంది ఆ ప్రాసెస్ లో అమర్ టవల్ ను వదిలేస్తాడు….
TO BE Continueed…………….