విలన్ హస్బెండ్-26
జై నాన్సీ చేతిని హోల్డ్ చేసి ముందుకు నడుస్తూ లుక్ బేబీ పాస్ట్ ఇస్ పాస్ట్ దాన్ని నీ హార్ట్ లోకి తీసుకుని ఇలా డల్ అవ్వకు యూ నో నువ్వు ఇలా మూడీగా ఉంటే అచ్చం మంకీ లా ఉంటావ్ అదే స్మైల్ చేస్తే బ్యూటిఫుల్ ప్యారెట్ లా ఉంటావ్…. నాకు ప్యారెట్ అంటే ఇష్టం సో ఇప్పుడు చెప్పు ఎలా ఉంటావ్ అనగానే తనను మంకీ అంటున్న జై వైపు సీరియస్ గా చూస్తూ ఎక్కువ సేపు జై వైపు సీరియస్ గా చూడలేక చిన్నగా నవ్వేస్తుంది….. నాన్సీ స్మైల్ చూసి తను కూడా ఇప్పుడు చూడు ఎంత బ్యూటీఫుల్ గా ఉన్నావో అని నవ్వుతూ నాన్సీ తో తన ఫ్యూచర్ ట్రయల్స్ ఎంత వరకు వచ్చాయా అని అడుగుతూ వెళ్తున్న ఇద్దరికీ ఒక ఫ్యామిలీ అదే రెస్ట్రాంట్ లోకి వస్తూ వీళ్ళకు ఎదురు అవుతారు….
ఆ ఫ్యామిలీ వైపు జై ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా చూస్తూ ఉంటే ఆ ఫ్యామిలీ ను చూస్తున్న నాన్సీ కళ్ళల్లో నీళ్ళు 🥹🥹 అది చూసిన జై కంట్రోల్ అంటూ నాన్సీ చేతిని ప్రెస్ చేస్తూ వాళ్ళ వైపు చూస్తాడు…. అందులో ఉన్న మిడిల్ ఏజ్డ్ పర్సన్ నాన్సీ వైపు అసహ్యంగా చూస్తూ ఒహో బాగానే సెటిల్ అయ్యావ్ సిగ్గు ఎగ్గు వదిలేసి పరాయి మగాడితో ఇలా తిరుగుతున్నావ్ సిగ్గు లేదా నీకు?? అయినా ఇంకా ఎందుకే బ్రతికున్నావ్ నువ్వు బ్రతికి మమ్మల్ని చంపుతున్నావ్ ఎందుకే నీకు ఈ సిగ్గు లేని జన్మ ఎటైనా పోయి చావు అప్పుడైనా మేము మనశ్శాంతిగా బ్రతుకుతాం అని చీదరింపుగా చూస్తూ ఆరుస్తాడు ……
చూడండి అనవసరంగా నాన్సీ గురించి వ్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వకండి అలాంటి అమ్మాయి మీ కూతురు అయినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి…. అయినా నిజా నిజాలు తెలియకుండా అలా ఎలా జడ్జ్ చేస్తారు మీరు?? నాన్సీ చెప్పాలి అని చూసిన వినరు & ఇదిగో ఇలా ఎదురు పడ్డప్పుడు తనను మీ మాటలతో ఏడిపిస్తూ ఉంటారు నాకు అర్థం అవ్వక అడుగుతాను మీ చిన్న కూతురు అంటే అంత ప్రేమించే మీరు మీ పెద్ద కూతురును మాత్రం ఎందుకు శత్రువు లా చూస్తున్నారు??
ఏంటి ఇలాంటి కూతురు ఉన్నందుకు సంతోషించాలా అని కోపంగా నాన్సీ వైపు చూస్తూ దీన్ని కన్నందుకు ప్రతీ రోజూ నాకు నా కుటుంబానికి అవమానాలే దక్కాయి…. దాంతో ఊరు విడిచి నా కూతురు, అల్లుడి దగ్గరకు వచ్చేశాం నేను ఎప్పుడూ ఇద్దరినీ వేరుగా చూడలేదు నిజానికి మంజు కంటే నాన్సీ మీదే నాకు ఎక్కువ ప్రేమ ఉండేది…. కానీ ఇది మా అందరినీ కాదని ఒక బజా…. అంటూ ఉండగా నాన్న ప్లీస్ అక్క ను ఎమ్ అనకు తను చాలా మంచిది తన మీద మీ కోపాన్ని వదిలేయండి అందరం ముందులా సంతోషంగా ఉందాం ప్లీస్ నాన్న అంటూ నాన్సీ ఏడుపు చూడలేక తన తండ్రి వైపు బాధగా చూస్తూ అడుగుతుంది మంజు….
మంజు అది చేసిన పని మర్చిపోయావా అది మనల్ని ఎంత అవమానం పడేలా చేసిందో మన పరువు ఎలా తీసిందో అప్పుడే ఎలా మర్చిపోయావ్ ?? అయినా దాన్ని అక్క అని పిలవద్దు అని చెప్పాను కదా మనం అందరం దూరం అయ్యామన్న బాధ దానిలో ఏమాత్రం అయినా కనిపిస్తుందా దానికి కావాల్సింది అది వెతుక్కుంది ఇక దానికి మన అవసరం లేదమ్మా
మావయ్య గారు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వదిన మొహం లో మీ మీదున్న ప్రేమ, బెంగ రెండు కనిపిస్తున్నాయి ఇక అన్ని విషయాలు వదిలేయండి నా కోసం వదిన కోసం మంజు చాలా బాధ పడుతూ ఉంది….
వద్దు బాబు దూరంగా ఉన్న శని ను అక్కడే ఉండనివ్వండి అది దగ్గరకు వస్తే ఆ శని మనకు కూడా అంటిస్తుంది ఆ రాక్షసి….. ఛా!! అనవసరంగా ఇక్కడికి వచ్చాం ఇది కాలు పెట్టిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను వెళ్దాం పదండి అని అక్కా…. అంటూ ఏడుస్తున్న మంజు చెయ్ పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తే వెనుకే ఇంకేం చేయలేక కదులుతాడు మంజు హస్బెండ్ భరత్
తన వైపు బాధగా చూస్తున్న తల్లిని హత్తుకోబోతున్న నాన్సీ కి అడ్డుగా వచ్చి తన తల్లిని కూడా అక్కడి నుండి తీసుకుని వెళ్తున్న 5తన తండ్రి వైపు చూస్తూ ఏడుస్తూ నేల మీద కు జారుతున్న నాన్సీ ను జాగ్రత్తగా పట్టుకుంటూ నాన్సీ అంటున్న జై ను చూసి నాకే ఎందుకు ఇలా4జరుగుతుంది అని ఏడుస్తూ జై గుండెల్లో తల దాచుకుంటుంది అది చూసిన జై నాన్సీ తల నిమురుతూ ఇట్స్ ఒకే నాన్సీ వినే వారికి ఏమైనా చెప్పచ్చు బట్ నీ ఫాదర్ కి మూర్ఖత్వం తో కళ్ళు క్లోజ్ అయ్యాయి అవి ఓపెన్ అయితే తప్పా రియాలిటీ తెలుసుకోలేడు అని నాన్సీ ను ఓదార్చి అక్కడి నుంచి పార్కింగ్ వైపు తీసుకుని వెళతాడు…..
🤍🧡🤍🧡🤍🧡🤍🧡🤍🧡🤍
తన ఇంటి ముందు కార్ ఆపిన రుద్రాన్ష్ కోపంగా కార్ డోర్ ఓపెన్ చేసుకుని తనతో శ్రియ బిహేవ్ చేసింది గుర్తు చేసుకుంటూ ఇంట్లోకి వచ్చిన తనకు సోఫా లో కూర్చుని తన కోసం 12 అయినా వెయిట్ చేస్తూ కనిపిస్తుంది తన మదర్ అపర్ణ…. తన వైపు ఒక సారి చూసి గట్టిగా ఊపిరి తీసుకుంటూ తన రూమ్ కి వెళ్లబోతున్న రుద్ర కి రుద్ర అన్న తన తల్లి వాయిస్ కి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెనక్కి తిరిగి అపర్ణ వైపు చూస్తాడు….
ఏంటి కన్నయ్య ఇంత లేట్?? డిన్నర్ చేస్తూ నువ్వు శ్రియ టైం కూడా మర్చిపోయారా ఏంటి అని నవ్వుతూ అడుగుతున్న అపర్ణ ను చూసి హా మామ్ ఆ ప్లేస్ చాలా బావుంది అందుకే టైం కూడా తెలియలేదు అది సరే నువ్వేంటి ఇంకా పడుకోకుండా నా కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నావ్
నువ్వు ఇంకా రాకపోయేసరికి నీ కోసమే చూస్తూ కూర్చున్నాను రుద్ర నువ్వు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావ్ ఎందుకు రుద్ర ఆర్ యూ ఒకే??
నేను ఏదో థింక్ చేస్తూ నిన్ను చూడలేదు గెట్టింగ్ లేట్ వెళ్ళి పడుకో మామ్ గుడ్ నైట్ అని మరో మాట మాట్లాడకుండా తన రూమ్ కి వెళ్తున్న రుద్ర ను చూసి ఏంటిది రుద్ర సీరియస్ గా కనిపిస్తున్నాడు ?? అక్కడ ఎమ్ జరిగి ఉంటుంది శ్రియ తన మనసులో మాట చెప్పిందా లేదా?? అది లవ్ ప్రపోజ్ చేసినందుకే కోపంగా ఉన్నాడా అని ఆలోచిస్తూ శ్రియ కి కాల్ డయల్ చేస్తుంది ఎన్ని సార్లు చేసినా శ్రియ లిఫ్ట్ చేయకపోయేసరికి రేపు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటూ అపర్ణ కూడా తమ రూమ్ కి వెళ్తుంది….
మార్నింగ్ 9 అవుతూ ఉండగా ఆఫీస్ కి రెడీ అయి కిందకు వచ్చిన రుద్ర, కమల్ ( అపర్ణ హస్బెండ్) లకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉంటుంది అపర్ణ…. అపర్ణ పెట్టింది కామ్ గా తింటూ తండ్రి అడిగే వాటికి పొడి పొడిగా ఆన్సర్ ఇస్తున్న రుద్ర ను చూసి తనకు గ్లాస్ లో వాటర్ ఫిల్ చేస్తూ ఉంటుంది అపర్ణ….
డాడ్ నాకు ఇక్కడి అమ్మాయితో మ్యారేజ్ చేయాలని మీరేమైనా నాకు తెలియకుండా మ్యాచెస్ చూస్తున్నారా అని సడెన్ గా రుద్ర అడిగిన క్వశ్చన్ కి అపర్ణ చెయ్ వణుకుతుంది అది చూసిన రుద్ర కళ్ళు పైకి ఎత్తి అపర్ణ వైపు చూసి చూపు తిప్పేస్తాడు…..
ఆల్ ఆఫ్ సడెన్ ఇలాంటి క్వశ్చన్ అడిగావ్ ఏంటి రుద్ర?? నీ డెసిషన్ గురించి నువ్వు ఎప్పుడో చెప్పావ్ కదా & నీ లవ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ అమ్మాయి మీదే ఉంది నీలో ఫిజికల్ గా ఎన్ని చేంజెస్ వచ్చినా మెంటల్ గా షి ఇస్ యూర్స్ అని ఎప్పుడో ఫిక్స్ అయ్యావ్ దట్ టూ ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది…. అలాంటప్పుడు ఈ ఇంటికి ఇండియన్ గర్ల్ కోడలు కావాలి అని రాసినప్పుడు నేను ఎందుకు వేరే మ్యాచెస్ చూస్తాను అవును సడెన్ గా ఎందుకలా అడిగావ్??
రుద్ర తన తల్లి వైపు చూస్తాడు అప్పటికే తన తల్లి టెన్షన్ తో చేతులు నలుపుకుంటూ నుంచోవడం చూసి నథింగ్ డాడ్ జస్ట్ అడగాలి అనిపించింది అంతే & మీరు చెప్పినట్టు ఎప్పటికైనా సరే నా పక్కన నేను ప్రేమించిన మనిషి మాత్రమే ఉంటారు అని చెప్పడం తో అపర్ణ కి సీన్ ఫుల్ క్లారిటీ వస్తుంది….
ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బోర్డ్ మీటింగ్ ఉందని కమల్ ఫాస్ట్ గా తన ఆఫీస్ కి స్టార్ట్ అయితే కమల్ వెళ్లగానే రూమ్ లోకి వెళ్ళబోతున్న తల్లిని పిలిచి పక్కనే కూర్చో బెట్టుకుని అపర్ణ వైపు చూస్తూ మామ్ నీకు నా లవ్ గురించి తెలుసా తెలియదా అని స్ట్రెయిట్ గా అడుగుతాడు….
ఇప్పుడు వాటి గురించి ఎందుకు కన్నయ్య నీకు ఆఫీస్ కి టైమ్ అవుతుంది కదా ఇక స్టార్ట్ అవ్వు అంటూ పైకి లేవబోతున్న అపర్ణ ను ఆపి అడిగిన దానికి అన్సర్ చెయ్ మామ్ చాలా తొక్కలో ఉన్నాను బట్ కస్టంగా కంట్రోల్ చేసుకుంటూ అడుగుతున్నా సో అన్సర్ చెయ్….
రుద్ర వాయిస్ లోని కోపాన్ని చూసి కొంచెం తగ్గుతూ తెలుసు కన్నయ్య నువ్వు మా లైఫ్ లోకి వచ్చినప్పుడే దీని గురించి మాకు చెప్పావ్ & దీనికి యాక్సెప్ట్ చేస్తేనే మాతో వస్తాను అని కండిషన్ కూడా పెట్టావ్ అని గుర్తు చేసుకుంటూ చెప్తుంది అపర్ణ….
సో యూ నో ఎవ్రీ థింగ్ అని అపర్ణ వైపు చూస్తాడు ఏమైంది కన్నయ్య ఇవాళ ఎందుకు ఎప్పుడూ లేనిది కొత్తగా బిహేవ్ చేస్తున్నావ్ నైట్ కూడా ఇలాగే స్ట్రేంజ్ గా బిహేవ్ చేసావ్??
మామ్ ప్లీస్ స్టాప్ ఆల్ దీస్ యాక్టింగ్ అని అసహనంగా పైకి లేచి యూ నో ఎవ్రీ థింగ్ అబౌట్ మై పాస్ట్ దెన్ వై ఆర్ యూ మేకింగ్ ఆల్ దీస్ డ్రామా?? లిటరల్లీ ఇట్స్ ఇరిటేటింగ్ మీ ఏ లాట్ ఇక చాలు మామ్ ప్లీస్ ఎండ్ దిస్ నౌ…. !!
డ్రామా ఏంటి రుద్ర అసలేం జరిగిందో చెప్పకుండా ఇలా మాట్లాడితే నాకు ఎలా తెలుస్తుంది?? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్?
అచ్ఛా ఫైన్ లిసన్ మామ్ నా మనసులో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది అని తెలిసి కూడా శ్రియ ను ఎందుకు నా లైఫ్ లోకి తీసుకుని రావడానికి ట్రై చేస్తున్నావ్ ?? తను నాకు ఫ్రెండ్ అంతే అలాంటి అమ్మాయితో నేను ఎలా లైఫ్ షేర్ చేసుకుంటాను అనుకున్నావ్ & తనకు నా ఇష్టాలు చెప్పి తనను ఇండియన్ గర్ల్ లా ఎందుకు చేంజ్ చేయాలి అని చూస్తున్నావ్??
రుద్ర నుండి ఈ క్వశ్చన్ ఎక్స్పెక్టె చేయని అపర్ణ షాక్ అవుతూ నే… నే…. నేను శ్రియ ను నీ లైఫ్ లోకి తీసుకుని రావాలి అనుకోవడం ఏంటి రుద్ర నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు….
ఇంకా తప్పించుకోవడానికి ట్రై చేయకు మామ్ నువ్వు శ్రియ డెయిలీ కాల్స్ లో మాట్లాడుతూ వీకెండ్స్ మీట్ అవుతూ తనతో నా మ్యారేజ్ గురించి నువ్వు డిస్కస్ చేయడం దగ్గర నుంచి సీక్రెట్ గా నన్ను ఫాలో అవ్వడం వరకు ఎవ్రీ థింగ్ నాకు తెలుసు బట్ మీరు భయపడే దాక నేను ఈ విషయం గురించి మాట్లాడకూడదు అని ఇంత వరకూ నీతో డిస్కస్ చేయలేదు చెప్పు మామ్ నీ ప్రాబ్లెమ్ ఏంటి???
రుద్ర దగ్గర ఇక హైడ్ చేసి యూస్ లేదు అనుకున్న అపర్ణ తన వైపు చూస్తూ నా ప్రాబ్లెమ్ ఏంటి అని అడిగావ్ కదా రుద్ర చెప్తా విను ఒక ఇండియన్ గర్ల్ నా డాటర్ ఇన్ లా అవ్వడమే నా ప్రాబ్లెమ్…. నువ్వు ఇండియా వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఐ నో నేను కొంచెం సెల్ఫిష్ బట్ నువ్వు ఇప్పటి దాకా ఎలా అయితే కమల్ సన్ లా నువ్వు లైఫ్ లీడ్ చేసావో ఇక మీదట కూడా అలాగే చేయాలి కానీ నీ ఓన్ పేరెంట్స్ దగ్గరకు నువ్వు వెళ్తాను అంటే నేను ఒప్పుకోను….
నువ్వు ఎప్పటికీ నాకు మాత్రమే కొడుకువి & ఇండియన్ గర్ల్ ను మ్యారేజ్ చేసుకుంటే నువ్వు డెఫినెట్ గా ఇండియా లో సెటిల్ అవుతావ్ అందుకే ఇక్కడి అమ్మాయితో మ్యారేజ్ చేస్తే ఎప్పటికీ మాతోనే ఉంటావ్ అందుకే శ్రియ ను సెలెక్ట్ చేసుకున్నాను ….. శ్రియ కి కూడా నువ్వంటే ఇష్టం తన మదర్ నేను ఒకే క్లబ్ లో మెంబెర్స్ సో నాకు శ్రియ బెటర్ ఆప్షన్ గా కనిపించింది రుద్ర….
అపర్ణ మెంటాలిటీ రుద్ర కి తెలుసు తను ఎప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచించేంత సెల్ఫిష్ బట్ తన మనసులో ఇలా అనుకుంటుంది అని మాత్రం రుద్ర ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే అపర్ణ వైపు షాకింగ్ గా చూస్తూ హౌ కెన్ యూ సే లైక్ దట్ మామ్ నీకు నా మీద ప్రేమ ఉండచ్చు బట్ అది నా ఓన్ పేరెంట్స్ ను ఎప్పటికీ నాకు దూరం చేయాలి అనుకునేంత ఉంటే అది ప్రేమ అవ్వదు మామ్ సెల్ఫిష్నెస్ అవుతుంది అది చాలా తప్పు మామ్ ఐ డిడ్ న్ట్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫ్రమ్ యూ….
అపర్ణ రుద్ర వైపు చూస్తూ ఇది నీకు సెల్ఫిష్ లాగే అనిపించొచ్చు రుద్ర బట్ నాకు ప్రేమ లాగే అనిపిస్తుంది పిల్లలు లేని నన్ను అమ్మ అని మొదట సారి పిలిచింది నువ్వే కన్నా… ఆ పిలుపు ఇంకా నా చెవుల్లో వినిపిస్తూ ఉంది అందుకే నువ్వు నీ పాస్ట్ చెప్పి మాతో రావడానికి ఒప్పుకున్న తరువాత నువ్వు అక్కడే ఉంటే ఎక్కడ మాకు దూరం అవుతావో అన్న భయం తో నిన్ను శాశ్వతంగా ఇక్కడికి తీసుకుని వచ్చేసాం….
ఎక్కడ నువ్వు నీ పేరెంట్స్ దగ్గరకు వెళ్తావో అని ఎన్ని నిద్రలేని నైట్స్ గడిపానో నాకు మాత్రమే తెలుసు రుద్ర…. నువ్వు వచ్చాక కంప్లీట్ గా నా వరల్డ్ చేంజ్ అయిపోయింది మీ డాడీ లేకుండా అయినా ఉండగలనేమో కానీ నువ్వు లేకుండా ఉండలేను రుద్ర…. ఎక్కడ ఇండియన్ గర్ల్ ను మ్యారేజ్ చేసుకుని ఇండియా వెళ్ళిపోతావేమో అని భయమే నాకు శ్రియ ను దగ్గర చేసింది…. నా మాట విను రుద్ర శ్రియ చాలా మంచిది నీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆ అమ్మాయిని మర్చిపోయి శ్రియ ను పెళ్ళి చేసుకుని ఇక్కడే మాతో పాటు హ్యాపీగా ఉండండి అని నీళ్ళు నిండిన కళ్లతో అడుగుతున్న అపర్ణ ను చూసి రుద్ర కి ఎమ్ చెప్పాలో తెలియని పరిస్థితి….??
(రుద్ర ఎమ్ డెసిషన్ తీసుకుంటాడో ఎవరైనా గెస్ చేయండి?? ఒక వైపు చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్న అమ్మాయి మరో వైపు తననే ప్రాణంగా చూసుకునే తల్లి రుద్ర అడుగులు ఎటు వైపు పడుతాయి 🤔🫣 మీరు ఆలోచిస్తూ ఉండండి అలాగే కరెక్ట్ అన్సర్ కోసం ట్రై చేయండి నేను నెక్స్ట్ అప్డేట్ లో మిమ్మల్ని కలుస్తాను ☺️♥️)
TO BE CONTINUED……