Login with OTP

విలన్ హస్బెండ్-27

aashyatech

Author

అరే ఎంతైనా బాత్ చేసి ఇలా హాయిగా టవల్ కట్టుకుని సాంగ్స్ వింటూ ఉంటే ఎంత పీస్ఫుల్ గా ఉందో అయినా నా డెవిల్ ఇంట్లో లేదుగా అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది అని హాయిగా సాంగ్స్ వింటూ వాటికి తగ్గ స్టెప్స్ వేస్తున్న అమర్ కి తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి తనను చూసి కెవ్వున అరిచిన మాన్య అరుపుకి కట్టుకున్న టవల్ కూడా ఊడి కింద పడిపోవడం తో మాన్య ఇంకొద్దిగా సౌండ్ పెంచి అరవడం చూసి కింద పడ్డ టవల్ చుట్టుకుని ఒసేయ్ డెవిల్ నోరు మూయవే అని ఫాస్ట్ గా మాన్య నోరు తన చేత్తో మూస్తాడు…..

మాన్య కోపంగా అమర్ చెయ్ కొరికేయడం అమర్ కెవ్వున కేక పెట్టడం చూసి మాన్య అమర్ నోరు చేత్తో మూసి కళ్ళు ఎగరేస్తుంది ( సరిపోయారు ఇద్దరికీ ఇద్దరు 🤦🤣) ……

 

మానిటర్ లా తయారు అయ్యావ్ ఎంటే పిచ్చి కానీ పట్టిందా అలా అరుస్తున్నావ్ & చూడు ఎలా కొరికావో అని గాట్లు పడ్డ తన చేతి వైపు చూసుకుంటూ అడుగుతాడు అమర్…..

నిన్ను కొరకడం కాదు రా చంపేయాలి ఒక అమ్మాయి ముందు ఇలా ఎక్స్పోజింగ్ చేయడానికి సిగ్గు లేదా అయినా నేను లేని టైమ్ లో నా రూమ్ లో ఏంట్రా నీకు పని జస్ట్ గెట్ అవుట్ అని అరుస్తున్న మాన్య ను కింద నుండి పై దాకా చూస్తూ ఐస్ ప్రాబ్లెమ్ గా ఉంటే LV Prasad EYE హాస్పిటల్ లో చూపించుకో ఇది నీ రూమ్ కాదు నాది అంటున్న అమర్ ను చూసి నీదా అంటూ రూమ్ మరో వైపు మరో సారి చూసిన మాన్య కి తను చూడకుండా అమర్ రూమ్ లోకి వచ్చింది అని అర్థం అవుతుంది 🙆🙆

హా…. నీ రూమ్ అయితే ఏంటి ఇలా డోర్ లాక్ చేయకుండా ఎక్స్పోజింగ్ చేయమని చెప్పారా నీకు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉండాలో నేర్చుకో అని అమర్ ను దూరంగా నెట్టి మళ్ళీ తన మొబైల్ రింగ్ అవ్వడం తో లిఫ్ట్ చేస్తూ మమ్మీ ఏంటి అన్ని టైమ్స్ కాల్ చేసావ్ అని మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్తున్న మాన్య వైపు పిచ్చి చూపులు చూస్తూ దీనికి నిజంగా లూస్ 😏నేనేమన్నా న్యూడ్ గా ఉన్నానా లోపల షార్ట్ ఉంది కదా దానికే ఎక్స్పోజింగ్ అంటుందా అని మాన్య బిహేవియర్ కి తల కొట్టుకుంటూ డోర్ లాక్ చేసి జై కి కాల్ చేస్తాడు…..

🤍💙🤍💙🤍💙🤍💙🤍💙

 

రుద్రాన్ష్ తన తల్లి వైపు చూస్తూ లిసన్ మామ్ నాకు నువ్వు డాడ్ అంటే చాలా ఇష్టం మీ కోసం నేను ఎమ్ చేయడానికి అయినా రెడీ బట్ నాకు ఇష్టం లేని పర్సన్ తో నా ఎంటైర్ లైఫ్ షేర్ చేసుకోమని చెప్తే మాత్రం నేను వినను…..

 

శ్రియ నే కాదు ఇంకెంత మంది అమ్మాయిలు వచ్చినా నాకు నచ్చరు ఎందుకంటే నా మనసులో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది తనను రీప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదు….. సో నువ్వు కూడా ఇక ఇలాంటి థాట్స్ చేయకుండా ఉంటే అది ఇద్దరికీ బావుంటుంది మామ్ & నువ్వు అనుకున్నట్టు ఇండియన్ గర్ల్ ను చేసుకుంటే నేను ఇండియా లో సెటిల్ అవ్వాలి అని లేదు నేను ఎప్పటికైనా నీ కొడుకునే ఒకె అంటూ అపర్ణ వైపు చూస్తాడు…..
రుద్ర ఎప్పటికీ తనతోనే ఉంటాడు అన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ రుద్ర ఒక్క సారి శ్రియ గురించి థింక్ చెయ్…. శ్రియ కి ఎమ్ తక్కువని తనను రిజెక్ట్ చేస్తున్నావ్?? తను నీ కోసం చాలా చేంజ్ అయింది ఇంకా అవుతుంది కూడా వై డోంట్ యూ థింక్ అబౌట్ హర్

నాకు చిన్నప్పుడే ఒక అమ్మాయితో ఆ గాడ్ ముడి పెట్టేశాడు ఇన్ని ఇయర్స్ అయినా నా మనసు తననే ప్రేమిస్తుంది…. సో ఎంత మంది శ్రియ లు వచ్చినా నేను ప్రేమించిన అమ్మాయి అందం ముందు సరిపోరు నీకు ఆ శ్రియ పిచ్చి పట్టింది కాబట్టి నేను ఎంత చెప్పినా అర్థం అవ్వదు నాకు ఆఫీస్ కి టైమ్ అవుతుంది బై అంటూ రుద్రాన్ష్ విసుగ్గా అక్కడి నుంచి వెళ్లిపోవడం చూసిన అపర్ణ ఆలోచన లో పడుతుంది……

🖤🤍🖤🤍🖤🤍🖤🤍🖤🤍

 

గార్డెన్ లో వంటరిగా కూర్చుని మొబైల్ లో ఏదో చూస్తున్న వినయ్ వర్మ ను చూసి నవ్వుతూ ఏంట్రా వంటరిగా కూర్చున్నావ్ అవును అంకుల్ ఎక్కడ కనిపించడం లేదు అని అడుగుతూ వినయ్ పక్కన సెటిల్ అవుతాడు మహిదర్….

ఇంపార్టెంట్ మీటింగ్ అని ఆఫీస్ కి వెళ్ళారు మహి లంచ్ కి వచ్చేస్తారు అని చెప్తూ ఆద్య, మాన్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉండగానే అక్కడికి రేణుక వస్తుంది…..

ఏమండీ ఇక మనం స్టార్ట్ అవుదామా అన్నయ్య , హరీష్ ఇవాళ స్టేట్స్ నుండి వస్తున్నారు రిసీవ్ చేసుకోవడానికి మనం వెళ్లకపోతే ఎమ్ బావుంటుంది చెప్పండి పైగా హరీష్, మాయ కూడా ఒకరిని ఒకరు మీట్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది …..  వదిన ఇందాకే కాల్ చేసింది ఇంకో వన్ అవర్ లో స్టార్ట్ అవుతాం అని చెప్పాను డైరెక్ట్ గా లంచ్ కి అక్కడికే రమ్మని వదిన చెప్పింది సో ఇక మనం వెళ్దామా అని వినయ్ వర్మ వైపు చూస్తుంది….

రేణు వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా ఎపుడైనా వెళ్ళి చూడచ్చు & మనం వెళ్ళి రిసీవ్ చేసుకోకపోతే వాళ్లేం ఫీల్ అవ్వరు మనం బిజీగా ఉన్నాం అని అర్థం చేసుకుంటారు…. మాయ లంచ్ కూడా ఇక్కడే చేద్దాం అంటుంది అందుకని లంచ్ అయ్యాక వెళ్దాం నువ్వెళ్ళి శైలు కి కుకింగ్ లో హెల్ప్ చెయ్…..

అవును రేణుక మన రెండు ఫ్యామిలీస్ చాలా ఇయర్స్ తర్వాత మీట్ అయ్యాయి కదమ్మా లంచ్ చేసి వెళ్ళండి అని మహిదర్ కూడా చెప్పడం తో రేణు అసహనంగా అక్కడి నుంచి లోపలికి వెళ్లి శ్వేత కి కాల్ చేస్తుంది….

హలో రేణుక స్టార్ట్ అయ్యారా అని అడుగుతున్న శ్వేత తో ప్చ్ లేదు వదిన లంచ్ ఇక్కడే చేసి వెళ్దాం అని మాయ, ఆయన పట్టు పట్టారు & నేను చాలా ట్రై చేశాను బట్ కుదరలేదు డిన్నర్ కి డెఫినెట్ గా వస్తాం వదిన ప్లీస్ అన్నయ్య కి నువ్వే చెప్పు అని రిక్వెస్టింగ్ గా అడుగుతుంది….

ఇప్పుడు ఇది రాకపోయినా కొంపలు ఎమ్ మునిగిపోవు ఆ ఇంట్లో మాకు ఉన్న సపోర్ట్ రేణుక ఒకటే కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకూడదు అనుకుంటూ అయ్యో పర్లేదు రేణుక అన్నయ్య లంచ్ అక్కడే చేద్దాం అన్నప్పుడు నువ్వు మాత్రం ఎమ్ చేస్తావ్ ఇట్స్ ఒకే మీ అన్నయ్య తో నేను చెప్తాను లే మీరు డిన్నర్ కి మాత్రం మిస్ అవ్వకండి అని చెప్తున్న శ్వేత తో తప్పకుండా అందరం వస్తాం వదిన అని నవ్వుతూ కాల్ కట్ చేసి అయిష్టంగానే కిచెన్ లోకి నడుస్తుంది రేణుక….

🤍💜🤍💜🤍💜🤍💜🤍💜

జై నాన్సీ మూడ్ చేంజ్ చేసి తనను తన ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి అటు నుండి డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళి మీటింగ్ కి అటెండ్ అవుతాడు….. వన్ పాటు ఉన్న ఆ మీటింగ్ ఫినిష్ అవ్వగానే క్లయింట్స్ ను మీట్ అయ్యి ప్రాజెక్ట్ డిటైల్స్ ఎక్స్ప్రెషన్ చేస్తూ బిజీ అవుతాడు అది కూడా ఫినిష్ అయ్యాక పెండింగ్ ఫైల్స్ మీద సైన్ చేస్తున్న జై క్యాబిన్ లోకి ఎంటర్ అవుతాడు తన పి. ఏ. చారి….

సైన్ చేస్తూనే చారి వైపు చూస్తూ ఏంటి చారి బాగా టెన్షన్ గా కనిపిస్తున్నావ్ ఏంటి మ్యాటర్ అని చారి టెన్షన్ పడ్డం చూసి అడుగుతాడు…. సర్…. అదీ మీకు చెప్పాను కదా ఒక ప్రాజెక్ట్ విషయం మీద మిత్ర కంపెనీ సి. ఇ. ఓ. ఇండియా కి వస్తున్నారు & వాళ్ళు మనతో కొలాబ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని వాళ్ళ మ్యానేజర్ కాల్ చేసి నెక్స్ట్ వీక్ వాళ్ళ బాస్ ఇండియా వస్తున్నాడని ఇక్కడే కంపెనీ పెడుతున్నాడని చెప్పారు మీరు ఒకే చెప్తే నేను ఈ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసి అగ్రిమెంట్ ఫాక్స్ చేస్తాను….

ఓహ్ యాహ్ చెప్పావ్ కదా నేను మర్చిపోయా ఒకే యూ కెన్ డు వన్ థింగ్ వాళ్ళ కంపెనీ కి చాలా గుడ్ విల్ ఉంది & టెక్ అప్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా అన్ని సక్సెస్ అయ్యాయి అలాంటి కంపెనీ తో కొలాబ్ అవ్వడానికి నాకే ప్రాబ్లెమ్ లేదు ప్రాజెక్ట్ ఫైనల్ చేసినట్టు వాళ్ళకు ఫాక్స్ పంపించు అలాగే మిత్ర కంపెనీ సి. ఇ. ఓ. కి అకామిడేషన్ మా ఇంట్లోనే అని కూడా చెప్పు….

జై ఎక్కడ నో అంటాడో అని భయపడ్డ చారి కి అకామిడేషన్ కూడా తన ఇంట్లోనే అని చెప్పడం తో వామ్మో నేను చూస్తుంది జై సర్ నేనా 🤷😳 ఈయనలో ఇంత మార్పు ఏంటో అని ఆలోచిస్తూ ఇందులో ఈయనకు డెఫినెట్ గా ప్రాఫిట్ ఉండే ఉంటుంది లేకపోతే తన ఇంట్లోకి ఎవరో ఏంటో తెలియని వ్యక్తిని ఎందుకు అలో చేస్తారు???

నాకు ప్రాఫిట్ ఉందా లేదా అని తీరిగ్గా మళ్ళీ థింక్ చెయ్ కానీ ముందు నేను చెప్పింది చెయ్ అంటూ విసుగ్గా సైన్ చేసిన ఫైల్స్ చారి చేతిలో పెట్టగానే ఈయన గురించి తెలిసి కూడా ఆలోచిస్తున్నా చూడు నన్ను తిట్టుకోవాలి అనుకుని ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ తిడతాడో అని పరుగు లాంటి నడకతో బయటకు వెళ్తున్న చారి ను చూసి ఇడియట్ అని తిట్టుకుంటూ వర్క్ చేస్తున్న జై కి అమర్ నుండి కాల్ వస్తుంది…..

ఏంట్రా తెల్లారిందా అని వెటకారంగా అడుగుతున్న జై ను చూసి నవ్వుతూ హి హి ఎపుడో లేచా జై నువ్వు ఏంట్రా నాకు చెప్పకుండానే ఆఫీస్ అంటూ పరిగెత్తావ్ వెళ్ళే ముందు నాకు కూడా చెప్పుంటే నేను వచ్చే వాడ్ని కదా….. నిన్ను నిద్ర లేపడం అంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఎన్ని సార్లు లేపానో తెలుసా పంది లా పడుకున్నావ్ 😏 ఇప్పుడు కాల్ చేసి నిద్ర లేపలేదు అని అడుగుతున్నావా స్టుపిడ్ 😤

అబ్బా మహానుభావా ఎవరి మీదో కోపంగా ఉన్నావని అర్థం అయింది కాన్ ఇప్పుడు నేను కాల్ చేసింది నీతో తిట్లు తినడానికి కాదు లంచ్ కి వస్తున్నావా లేదా అని అడగడానికి ఇక్కడ అందరూ ఉన్నారు తమరు తప్పా??

లంచ్?? అని వాచ్ లో టైమ్ చూస్తూ ఇంతకీ ఆ దెయ్యం వచ్చిందా లేదా అని ఆద్య గురించి అడుగుతున్న జై కి వచ్చారు జై అదే కదా చెప్తున్నా నువ్వు ఒక్కటే మిస్సింగ్ లంచ్ అయ్యాక అందరం ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు నువ్వు కూడా రా జై నువ్వు ఇపుడు రాకపోతే కావాలని రాలేదు అని అంకుల్ ఫీల్ అవుతాడు….

ఒరేయ్ నాకు డాడ్ అంటే ఇష్టమని పదే పదే ఆయనను అడ్డు పెట్టుకుని నన్ను లాక్ చేసావో గొయ్యి తీసి పాతేస్తా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి చస్తున్నా ఇంకో 20 మినిట్స్ లో అక్కడ చస్తా అని చిరాగ్గా కాల్ కట్ చేసిన జై బిహేవియర్ కి వీడు మారడు అన్న లుక్ ఇచ్చి డ్రెస్ అప్ అయ్యాక కిందకు వెళతాడు…..

మాయ ను వేరే రూమ్ లో పడుకోమని చెప్పినా కావాలని హర్ష రూమ్ లో పడుకుని హర్ష తో ఉన్న మెమోరీస్ గుర్తు చేసుకుంటూ పడుకున్న మాయ కి 10 కి కానీ మెలకువ రాదు…. నిద్రలేచి ఫ్రెష్ అయి వచ్చిన తనకు ఆద్య, మాన్య బయటకు వెళ్ళారు అని తెలిసి అందరితో పాటు బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెండ్ ను మీట్ అయి వస్తాను అని బయటకు వెళ్ళి ఆద్య వాళ్ళు వచ్చిన 10 మినిట్స్ కి తను కూడా వస్తుంది…..

జై చెప్పినట్టు గానే లంచ్ కి ఆద్య ఇంటికి వస్తాడు…. అందరూ హాల్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే జై కూడా వాళ్ళతో జాయిన్ అవుతాడు…. శైలు, రేణుక వాళ్ళు అందరి కోసం చేసిన స్పెషల్స్ తో డైనింగ్ టేబుల్ నింపేసి అందరినీ లంచ్ కి పిలుస్తారు….

ప్రతాప్ వర్మ తో మాట్లాడుతున్న అమర్ శైలు పిలుపుకు రండి తాతయ్య అంటూ ప్రతాప్ చెయ్ పట్టుకోబోతూ ఉంటే ఎల్లేహే అని అమర్ ను మళ్ళీ తను ముందు పడేసిన మెయిడ్ మీదకే పడేసి ప్రతాప్ వర్మ తో కలసి డైనింగ్ ఏరియా కి వెళ్తూ మెయిడ్ మీద వెళ్ళి పడ్డ అమర్ ను చూసి నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది…..

రేయ్ లేవరా అంటూ అమర్ ను ఆ అమ్మాయి మీద నుండి పైకి లేపి బుద్ధి లేకుండా అలా ఎలా పడ్డావ్ రా స్టుపిడ్ చూడు పాపం తను ఏడుస్తుంది అంటూ ఆ అమ్మాయి వైపు చూపిస్తాడు జై…. అయ్యో నేను కావాలని పడలేదు రా ఆ రాక్షసి నెట్టింది అని మాన్య ను తలచుకుంటూ ఐ ఆమ్ సారి అని అమర్ చెప్తున్నా వినకుండా ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోవడం చూసి అమర్ – జై ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు…..

అదేంట్రా నేను సారి చెప్తున్నా వినకుండా అలా వెళ్ళిపోతుంది కొంపదీసి సూసైడ్ కాని చేసుకుంటుందా ?? నీ మొహం ఇంత చిన్న దానికి సూసైడ్ చేసుకుంటారా పదా నువ్వు కావాలని ఎమ్ పడలేదు & సారి కూడా చెప్పావ్ ఇంకేంటి చూస్తున్నావ్ పదా అని అమర్ ను డైనింగ్ ఏరియా వైపు లాక్కెళ్లతాడు జై…..

జై, అమర్ లను చూసి నవ్వుకుంటున్న ఆద్య, మాన్య లను చూసి ఇద్దరూ వీళ్ళ వైపు కోపంగా చూస్తూ కూర్చుంటారు…. శైలు నవ్వుతూ అందరి ప్లేట్స్ చికెన్ బిర్యానీ తో లెగ్ పీస్ కూడా వేస్తుంది మాన్య లెగ్ పీస్ వైపు చూస్తూ వావ్ 😋😋 ఎన్ని డేస్ అయింది ఆంటీ మీ చేతి బిర్యాని తిని అంటూ లెగ్ పీస్ చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకోబోతూ ఉండగా అమర్ మాన్య చెయ్ పట్టుకుని ఆపేస్తూ ఎంత అపచారం జరగబోయేది మాన్య అసలు నువ్వేం చెప్తున్నావో తెలుస్తుందా నువ్వు చికెన్ తింటున్నావా అయ్యయ్యో భగవంతుడా ఈ పాపిష్టి దాన్ని క్షమించు స్వామీ అంటూ డ్రమాటిక్ గా చెప్తాడు….

రేయ్ చేయి విరిచేస్తాను చెప్తున్నా ఎవర్రా పాపిష్టి ముందు నా చెయ్ వదులు అంటున్న మాన్య ను చూసి తన చేతిలోని చికెన్ లాగేసి తన ప్లేట్ కూడా తీసి పక్కన పెడుతూ ముందు లెంపలు వేసుకో అని పనిలో పనిగా మాన్య రెండు చెంపలు వాయించి నువ్వు చికెన్ తినడం ఎంత పాపమో తెలుసా మాన్య అని అందరి వైపు చూస్తూ మీకు తెలుసా మహిదర్ అంకుల్, శైలు ఆంటీ ఆద్య మ్యారేజ్ గురించి బాధ పడుతున్నారు అని మాన్య ఆద్య మ్యారేజ్ కి ఒప్పుకునే వరకు నాన్ వెజ్ తినను అని మొక్కుకుంది అట…..

కానీ ఆ విషయం మర్చిపోయి చికెన్ తింటుంటే నాకు గుర్తొచ్చి ఆపేశాను….. నేను చేసింది తప్పైతే నన్ను మన్నించండి తప్పు లేదు అనుకుంటే మాన్య కోసం తోట కూర కట్ట, వేపాకు ఫ్రై, కాకరకాయ బజ్జి, బంగాలు దుంపలు, కషాయం ఇచ్చి మాన్య చేస్తున్న గొప్ప త్యాగాన్ని గుర్తించండి అని చెప్తున్న అమర్ ను చూసి జై నవ్వు ఆపుకుంటూ ఉంటే మాన్య అమర్ వైపు 😳🤐🤨😬🙄😒😲 రక రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కోపంగా పైకి లేస్తుంది….

 

To BE CONTINUED……..