Login with OTP

విలన్ హస్బెండ్-28

aashyatech

Author

అమర్ చెప్పింది విన్న మాన్య కోపంగా పైకి లేచి రేయ్ ఫాల్తూస్ అసలేం చేస్తున్నావో తెలుసా అంటూ అమర్ వైపు గుడ్లు ఉరిమి చూస్తున్న మాన్య బుజం పట్టుకుని వెనక్కి లోగి ఓ ఓ… హీరోయిన్ లా రెచ్చిపోకే పిచ్చి మొహమా ఒక సారి మహీదర్ అంకుల్ శైలు ఆంటీ ను చూడు నీ వైపు ఎంత ప్రేమగా చూస్తున్నారో ఇప్పుడు నేను చెప్పింది అబద్దం అని చెప్పావ్ అంటే వాళ్లకు నీ మీదున్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది…..

వాళ్ళు మాత్రమే కాదే ఇక్కడున్న అందరూ నీ వైపు చూడు ఎంత ఆప్యాయంగా చూస్తున్నారో ఇది నిజం కాదు అని తెలిస్తే ఎమ్ అవుతుందో నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా 😏😏 ముందు ఆ మొహం లో ఎక్స్ప్రెషన్ చేంజ్ చెయ్ కాస్త నవ్వవే ఎట్ లీస్ట్ మనిషిలా అయినా కనిపిస్తావ్ ఎపుడు చూడు మంకీ ఫేస్ వేసుకుని ఉంటావ్ అని సర్కాస్టింగ్ గా అంటున్న అమర్ ను చూసి మాన్య పళ్ళు నూరుతూ అడ్డంగా బుక్ చేసావ్ కదా చెప్తా రా నీ పని అంటూ అమర్ వైపు సీరియస్ గా చూస్తూ అందరూ తననే చూస్తూ ఉండడం గమనించి నవ్వలేక ఇబ్బందిగానే నవ్వుతుంది…..

మాన్య అమర్ చెప్తుంది నిజమా అని అడుగుతున్న ప్రతాప్ వర్మ వైపు చూస్తూ 😒😒 నిజమే తాతయ్య నిన్న ఆఫ్టర్ నూన్ మనసులో కోరుకున్నాను అది అమర్ కి మాత్రమే తెలుసు 😬😬 నేను ఆ విషయం మర్చిపోయి చికెన్ తింటుంటే దేవుడిలా వచ్చి కాపాడి చచ్చాడు అనగానే అమర్ సీరియస్ గా చూస్తాడు అది చూసిన మాన్య అదే దేవుడిలా కాపాడడానికి వచ్చాడు అని క్లారిటీ ఇస్తుంది….

ఇన్నాళ్లు ఆద్య నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నా మాన్య బట్ ఆద్య కోసం ఇంత చేస్తున్నావ్ అంటేనే తెలుస్తుంది మీరు మోర్ దాన్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్షిప్ అంటూ ఆద్య వైపు చూసి యూ ఆర్ సో లక్కీ ఆద్య నీ లైఫ్ లో మాన్య లాంటి ఫ్రెండ్ ఉన్నందుకు అని చెప్పగానే ఆద్య మాన్య వైపు చంపేసేలా చూస్తూ ఉంటుంది…..

చచ్చాన్ రా బాబు 🙆🙆 ఇది చూపు తోనే చంపేసేలా ఉంది ఇది అబద్దం అని చెప్దాం అంటే ఈ కంత్రి వెధవ అందరి ముందు బుక్ చేసాడు అని అమర్ ను తిట్టుకుంటూ అందరి వైపు చూసి ఎడవలేక నవ్వుతుంది……

మాన్య నువ్వు మా బాధ చూడలేక నీకు ఇష్టమైన నాన్ వెజ్ ను త్యాగం చేసావా నువ్వు నిజంగా బంగారం రా అంటూ మహిదర్, శైలు హగ్ చేసుకుంటూ చూసావా ఆద్య నీ కోసం మాన్య తన ఫుడ్ ను కూడా సాక్రిఫైజ్ చేస్తుంది దాని కోసం అయినా నువ్వు మ్యారేజ్ గురించి థింక్ చెయ్ అని చెప్తున్న తన పేరెంట్స్ మాటలకు ఆద్య మాన్య వైపు 🤨🤨 చూస్తూ లంచ్ అవ్వనివ్వు తర్వాత చెప్తా నీ సంగతి అన్నట్టు ఉన్న ఆద్య చూపులను చూసి మాన్య తల బాదుకుంటుంది ….

అన్నయ్య నిజం చెప్పు మాన్య అలా నిజంగా మొక్కు కోలేదు కదా అని అమర్ పక్కన కూర్చున్న పూజ మెల్లగా అమర్ ను అడుగుతుంది….

అదేంట్రా అలా అడుగుతున్నావ్ మాన్య నే చెప్తుంది కదా తనే అలా మొక్కుకున్నా అని అయినా అది నిజం కాదు అని నీకు ఎందుకు అనిపిస్తుంది??

ఎందుకంటే మాన్య నీ వైపు సీరియస్ గా చూస్తుంది & తను ఏదీ హార్ట్ఫుల్ గా చెప్పట్లేదు నిజం చెప్పు నువ్వే కావాలని మాన్య ను ఇరికించావ్ కదా అని అడుగుతున్న మాయ వైపు చూసి హహ 😁 కనిపెట్టేసావా యూ ఆర్ రైట్ మాయ ఇదంతా నా ప్లాన్ అయినా దాన్ని బలే ఇరికించేసా అని నవ్వుతూ ఆద్య ఈ జన్మకి మ్యారేజ్ కి ఒప్పుకోదు దాంతో ఈ పిశాచి లైఫ్ లాంగ్ నాన్ వెజ్ కి దూరంగా ఉంటుంది ఇలా అయినా నాకు దాని మీదున్న కోపం కాస్త అయినా తగ్గుతుంది అంటూ నవ్వుతూ చెప్తాడు….

ఏంటి అన్నయ్య మీ ఇద్దరూ ఇప్పుడు చిన్న పిల్లల్లా కొట్టుకుంటూనే ఉంటారు ఇలా అయితే మాన్య కి నీ మీద ప్రేమ పట్టేసరికి మీరు పెళ్ళి కాదు ఒకే సారి షష్టిపూర్తి చేసుకోవాలి అని వెటకారంగా అంటున్న మాయ ను చూసి నేను ఎంత మంచిగా ఉందాం అనుకున్నా అది నన్ను ఉందనివ్వదు మాయ ఇందాక ఎమ్ చేసిందో తెలుసా అంటూ తనను మెయిడ్ మీదకు తోయడం గురించి చెప్పగానే మాయ అమర్ మాటలకు నవ్వుకుంటూ మాన్య కష్టంగా తనకు పెట్టిన ఫుడ్ తినడం చూసి అయ్యో పాపం అనుకుంటుంది…..

ఒసేయ్ ఆగవే చంపేస్తా నిన్ను అని మాన్య ను కొట్టడానికి వస్తున్న ఆద్య కు అందకుండా పరిగెడుతున్న మాన్య ఆయాసం తో రొప్పుతూ అమ్ము ప్లీస్ నేను చెప్పేది వినవే నేను నిజంగా అలా మొక్కలేదే అని చెప్తూనే ఇక పరిగెత్తలేక గార్డెన్ లో ఉన్న బెంచ్ మీద కూర్చుని ఆద్య వైపు కంగారుగా చూస్తుంది…..

 

ఇప్పుడు దొరికావే ఆగు నీ పని చెప్తా అని మొక్కలకు పైప్ తో వాటర్ పడుతున్న వెంకట్ చేతిలోని పైప్ లాక్కుని నా పెళ్ళి గురించి నీకెందుకే అంత ఇంట్రెస్ట్ నువ్వు పెట్టిన పెంట వల్ల మళ్ళీ మామ్, డాడ్ మ్యారేజ్ అంటూ గోల మొదలు పెట్టారు…. నాకు పెళ్ళి మీదున్న ఒపీనియన్ తెలిసి కూడా అనవసరంగా ముక్కి చచ్చావ్ నేను ఈ లైఫ్ లో పెళ్ళికి యస్ చెప్పను అని కోపంగా చెప్తున్న ఆద్య ను చూసి ఎహె ఆపు అని ఆద్య చేతిలోని పైప్ లాక్కుని దూరంగా విసిరి నీ గురించి తెలిసి కూడా నేను ఎందుకు అలాంటి పిచ్చి మొక్కు ముక్కి నా కడుపు మాడ్చుకుంటాను ……

ఎంటే నువ్వు చెప్పేది మరి ఇందాక లంచ్ చేసేటపుడు అమర్ నువ్వు నా కోసం ముక్కు కోరావ్ అని దానికి నాన్ వెజ్ తినకూడదు అని చెప్పాడు నువ్వు కూడా అందరితో అవును అని చెప్పావ్ ఇపుడేంటి ఇలా అంటున్నావ్?? అబ్బా ఆద్య ఆ అమర్ నన్ను అందరి ముందు అడ్డంగా బుక్ చేశాడే అందుకే నేను కూడా అవును అనే చెప్పాను అని విసుగ్గా చెప్తున్న మాన్య ను చూసి తొక్కలో నీ క్రెడిట్ కోసం నన్ను బుక్ చేస్తావా పోవే నాతో మాట్లాడకు అంటూ అసహనంగా వెళ్ళి బెంచ్ మీద కూర్చుంటుంది…..

నేనేదో కావాలని చేసినట్టు నా మీద అరుస్తావ్ ఎందుకే?? నీకు,నాకు పీస్ లేకుండా చేసిన ఆ అమర్ ను ఒక ఆట ఆడుకుంటా ముందు నువ్వు పదా అని ఆద్య ను లోపలికి తీసుకుని వెళ్ళి అమర్ ను ఎలా ఏడిపించాలి అని ప్లాన్స్ వేస్తున్న ఇద్దరికీ అమర్ తన మీద పడ్డందుకు ఇంకా ఏడుస్తున్న మెయిడ్ కనిపించి ఇద్దరికీ ఒకే ఐడియా వస్తుంది 😍😍 దాంతో ఇద్దరు నవ్వుకుని ఆ మెయిడ్ ను తీసుకుని ఎవరు చూడకుండా గార్డెన్ లోకి వెళతారు….

ఆధ్య ను చూసిన ఆ మెయిడ్ తన మొహాన్ని తుడుచుకుంటూ ఏంటి అమ్మాయి గారు ఇక్కడికి తీసుకుని వచ్చారు ఏమైనా పనుందా అని తన చున్నీ ను నడుముకు చుట్టుకుంటూ అడగడం చూసి అబ్బా అదేం లేదు కానీ ముందు నువ్వు చెప్పు ఎందుకు ఇలా డల్ గా ఉన్నావ్ ఎమ్ లేదు అని మాత్రం అబద్దం చెప్పకు నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా దీని గురించో బాగా డిస్టర్బ్ అయ్యావ్?? అని అడుగుతుంది ఆద్య….

మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అమ్మాయి గారు మన ఇంటికి వచ్చిన అమర్ గారి పద్ధతి నాకేం నచ్చలేదు….. ఆయన కావాలని నా మీద పడుతున్నాడు అమ్మాయి గారు ఒక సారి అంటే అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు ఇందాక కూడా కావాలనే పడ్డాడు నేను ఇది అమ్మ గారితో ( శైలజ) చెప్పాలి అనుకుంటున్నాను అమ్మాయి గారు….

హేయ్ వద్దు అయినా నువ్వేంటి ఇంత చిన్న విషయానికి మమ్మీ వరకు ఎందుకు అయినా అమర్ నీ మీదే ఎందుకు పడుతున్నాడో ఆలోచించావా అనగానే ఆ మెయిడ్ అర్థం కాబట్టి ఆద్య వైపు చూస్తుంది…. అర్థం కాలేదా అమర్ నిన్ను లవ్ చేస్తున్నాడు అంట అనగానే ఆ మెయిడ్ మొహం దీపావళి చిచ్చు బుడ్డిలా 😍😍 వెలిగిపోతుంది….

ఏంటి అమ్మాయి గారు మీరు చెప్పేది నన్ను అమర్ గారు ప్రేమించడం ఏంటి??? ఆయన ఎక్కడ నేను ఎక్కడ లేదు మీరు నన్ను ఏడిపిస్తున్నారు కదా???

అయ్యో కుమారి నేను చెప్పేది నిజం అయినా ఈ జనరేషన్ లో కూడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చూసి ప్రేమిస్తున్నారా ఏంటి అమ్మాయి నచ్చడమే లేట్ తను ఎవరు ఏంటి అని ఆలోచించకుండా పెళ్ళి చేసుకుంటున్నారు ఎమ్ అంటావ్ మాన్య 😜😜

కరెక్ట్ అంటాను అమ్ము ఇదిగో కుమారి నీకో ఎక్సాంపుల్ చెప్పనా నువ్వు రజినీకాంత్ మూవీ నరసింహ చూసావా అందులో సౌందర్య కూడా నీలాగే అందమైన పనిమనిషి అనగానే కుమారి సిగ్గు పడుతూ పోండి అమ్మాయి గారు మీరు మరీ ఎక్కువ పొగుడుతున్నారు అని సిగ్గు పడడం చూసి ఆద్య, మాన్య ఓసి దీని వేషాలో 😏🙄 అనకుండా ఉండలేకపోయారు…..

అబ్బా ముందు నేను చెప్పేది విను తర్వాత సిగ్గు పడు అని కుమారి చేతులను తన మొహం మీద నుండి తీస్తూ ఆ సినిమా లో పనిమనిషి గా ఉన్న సౌందర్య ను కోటీశ్వరుడు అయిన రజనీకాంత్ పెళ్లి చేసుకుని తను లైఫ్ ఎలా ఇచ్చాడో ఇక్కడ కూడా కోటీశ్వరుడు అయిన అమర్ నిన్ను చేసుకుని నీకు లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నాడు అందుకే చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని చెప్పాడు

నిజమా మాన్య గారు 😍🤩 అంటూ చిరు సిగ్గుతో అడుగుతున్న కుమారి ను చూసి నవ్వు ఆపుకొంటూ నిజమే కుమారి యూ నో నిన్ను చూసినప్పటి నుండి నీతో లవ్ లో పడుతూ ఉన్నాడట అందుకే అనుకోకుండా పడ్డట్టు నీ మీద 2 టైమ్స్ పడి నీ టచ్ ను ఫీల్ అవుతున్నాడు నువ్వే తన ప్రేమను అర్థం చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే అమర్ లైఫ్ సెట్ అవుద్ది ఇప్పుడు చెప్పు అమర్ తో నీకు పెళ్ళికి ఒకే నా అని అడుగుతున్న మాన్య ను చూసి సిగ్గు పడుతూ అయ్యబాబోయ్ నాకు సిగ్గేస్తుంది అని నవ్వుకుంటూ వెళుతున్న కుమారి ను చూసి ఇద్దరూ నవ్వుకుంటూ జరిగేది చూడ్డానికి లోపలికి వెళతారు……

🤍💙🤍💙🤍💙🤍💙🤍💙🤍💙

 

మామ్ నేను రెడీ ఎయిర్ పోర్ట్ కి లేట్ అవుతుంది పదా నేను ఆఫ్టర్ నూన్ రాహుల్ దగ్గరకు వెళ్ళాలి నాకు మళ్ళీ లేట్ అవుతుంది అని హాల్ లో నుండి అరుస్తున్న హరిణి వాయిస్ కి అరవకే వస్తున్నా కదా అని హాల్ లోకి వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్లక్కర్లేదు ఆఫ్టర్నూన్ నువ్వు ,నేను పార్లర్ కి వెళ్తున్నాం ఎందుకంటే నైట్ డిన్నర్ కి నీ అత్త ఫ్యామిలీ తో పాటు వస్తుంది అందులో జై కూడా ఉన్నాడు కాబట్టి వాడి కళ్ళకు అందంగా కనిపించాలి అంటే నువ్వు పార్లర్ కి వెల్లి ఇంకొంచెం అందంగా రెడీ అవ్వాలి కాబట్టి ఇవాళ ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకు…..

అబ్బా మామ్ వాళ్ళు ఇవాళే డిన్నర్ కి రావాలా అని నీరసంగా మొహం పెట్టుకుని సర్లే రేపు వెళ్తా ముందు పదా ఎయిర్ పోర్ట్ కి వెళ్దాం మనం వెళ్ళేసరికి ఫ్లయిట్ ల్యాండ్ అవుతుంది అని శ్వేత ను తొందర చేసి ఇద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్ కి వెళతారు….

మాదేష్, హరీష్ కోసం వెయిట్ చేస్తున్న వీళ్ళకు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిన 40 మినిట్స్ కి ఇద్దరూ వీళ్ళ వైపు వస్తూ కనిపిస్తారు…. ఇద్దరినీ చూసిన హరిణి డాడ్ అంటూ ఆనందంగా వెళ్ళి మాదేష్ ను హగ్ చేసుకుంటే శ్వేత హరీష్ ను హత్తుకుని మాట్లాడుతూ ఉంటుంది…..

మాదేష్ కూతురి తల నిమురుతూ మిస్ యూ హరిణి అని చెప్తూ తనకు ఫోర్హెడ్ కిస్ పెడుతూ కనిపించని రేణుక కోసం చుట్టూ చూస్తూ ఉంటాడు….
డాడ్ ఎవరి గురించి చూస్తున్నారు అని మాదేష్ చూపులను అర్థం చేసుకుని అడుగుతున్న హరిణి వైపు చూస్తూ మీరు మాత్రమే కనిపిస్తున్నారు రేణు ఎక్కడ హరిణి పార్కింగ్ లోనే వెయిట్ చేస్తుందా అని అడుగుతాడు మాదేష్….

 

అంత సినిమా లేదు డాడ్ మీ చెల్లికి ఇపుడు మీ కంటే ఇంపార్టెంట్ పర్సన్స్ దొరికారు అందుకే నిన్నటి నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా మావయ్య ఫ్రెండ్ హోమ్ లోనే టైమ్ స్పెండ్ చేస్తున్నారు అని వెటకారంగా చెప్తుంది హరిణి…..

ఏంటి ఇంకా అక్కడే ఉన్నారా?? అంటే రేణుక నేను వస్తున్నాను అని తెలిసి కూడా రాలేదా అని శ్వేత వైపు చూస్తూ ఈ విషయం గురించి నాకు ఎందుకు చెప్పలేదు శ్వేత రేణుక కి మన కంటే వాళ్ళే అంత ఇంపార్టెంట్ ఆ అని సీరియస్ గా చూస్తూ అడుగుతాడు మాదేష్…..

మీరు కూడా ఏంటి మాదేష్ రేణు కు ఎవరైనా మీ తర్వాతే దాని మాటలు మీరు పట్టించుకోకండి రేణుక మీ కోసం రావాలి అనుకున్నా వినయ్, మాయ రానివ్వ లేదు అట అందుకే నైట్ డిన్నర్ కి ఫ్యామిలీ తో వస్తాం అని చెప్పింది….

అలాగ సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని ముందుకు నడుస్తూ ఇంతకీ వినయ్ వర్మ కి అంత క్లోజ్ ఫ్రెండ్ ఎవడు అని అడుగుతూ శ్వేత వైపు చూస్తాడు ….. 10 ఇయర్స్ తర్వాత మీట్ అయ్యారు మాదేష్ వాళ్ళు వైజాగ్ లో ఉండే వారట ఈ మధ్యే ఫ్యామిలీ తో ఇక్కడికి వచ్చారు….

శ్వేత చెప్పింది విన్న మాదేష్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వాడి పేరు ఏంటి అని అడగ్గా మహిదర్ అని చెప్తున్న హరిణి ను చూసి మాదేష్ అడుగులు అక్కడే ఆగిపోయాయి…..

🤍💜🤍💜🤍💜🤍💜🤍💜🤍

 

ఎప్పుడు తాము విష్ చేసినా నవ్వుతూ తమ వైపు చూసే బాస్ ఇవాళ తల కూడా తిప్పకుండా సీరియస్ గా క్యాబిన్ లోకి వెళ్ళడం చూసిన స్టాఫ్ ఒకరిని ఒకరు చూసుకుంటూ తిరిగి తమ సీట్ లో సెటిల్ అవుతారు…. ఏమైందే సర్ కి ఎందుకంత కోపంగా ఉన్నారు అని ఒకరు సర్ మూడ్ బాలేదు అని క్లియర్ గా కనిపిస్తూ ఉంది

 

సో మనం ఇవాళ ఎక్స్ట్రా మాట్లాడకుండా మన వర్క్ మనం చేయడం బెటర్ అని మరొకరు, మే బీ సర్ గర్ల్ ఫ్రెండ్ కి సర్ కి గొడవ జరిగిందేమో అందుకే కోపంగా ఉన్నారు అని ఇంకొకరు ఇలా స్టాఫ్ ఎవరికి తోచింది వారు గాసిప్స్ చెప్పుకుంటూ ఉండడం చూసిన ఆనంద్ సైలెన్స్ అంటూ టేబుల్ ను తన అర చేత్తో టాప్ చేసి డు యువర్ వర్క్ అని సీరియస్ గా చెప్పగానే అందరూ కామ్ గా ఎవరి వర్క్స్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు…..

అందరి వైపు ఓ సారి చూసి ఏమైంది రుద్ర కి ఇవాళ ఎపుడు ఆఫీస్ కి వచ్చినా స్మైలింగ్ ఫేస్ తో వచ్చేవాడు ఇవాళ ఏంటి కోపం, చిరాకు పడుతూ వచ్చాడు అని ఆలోచిస్తూనే రుద్ర క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూస్ మీ సర్ అనగానే ముందే విస్సుగా ఉన్న రుద్రాన్ష్ కి ఆ పిలుపు చిరాకు పుట్టిస్తుంది …..

చిరాకు తెప్పిస్తున్న ఆనంద్ వాయిస్ కి
కోపంగా తన టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ క్రిస్టల్ ను కోపంగా ఆనంద్ మీదకు విసరగానే అది చూసిన ఆనంద్ వామ్మో అంటూ పక్కకు తప్పుకోగానే అది నేరుగా వెళ్ళి గోడకు తాకడం నాలుగు ముక్కలు అవ్వడం క్షణాల్లో జారిపోతుంది….

పేపర్ వెయిట్ వైపు జాలిగా చూస్తూ రుద్ర ఏంట్రా అంత కోపం ఏమైంది నీకు అని అడుగుతూ తన
ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుంటూ అడుగుతున్న ఆనంద్ వైపు చూస్తూ అందరికీ నేను వెధవ లా కనిపిస్తున్నానా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు?? ఇపుడు ఎలా పిలిచావో అలాగే పిలువు అలా కాకుండా సార్ అంటూ మళ్ళీ మొదలు పెట్డావో ఆ పేపర్ వెయిట్ ప్లేస్ లో నీ తల ఉంటుంది అని సీరియస్ గా చూస్తూ చెప్తాడు….

ఏంటి సర్ అని పిలిచినందుకు తల పగల కొడతావా ఇలాంటి బాస్ ఎక్కడ ఉండడు రా బాబు 🤦🤦 అది సర్లే కానీ ఎందుకంత కోపంగా ఉన్నావ్ ఎవరి మీద నీ కోపం అని అడుగుతాడు ఆనంద్….

హాయ్ రుద్ర్ అంటూ క్యాబిన్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తున్న శ్రియ ను చూసి కోపంగా చైర్ నుండి పైకి లేచి స్టాప్ దేర్ అంటూ శ్రియ మెడ పట్టుకుని తన క్యాబిన్ నుండి బయటకు తోసి డోర్ లాక్ చేస్తున్న రుద్ర బిహేవియర్ ను ఆనంద్ విచిత్రంగా చూస్తూ ఉంటాడు 🙄🤷 అడిగితే తనను కూడా ఎక్కడ బయటకు నెడతాడో అని కామ్ గా కూర్చుని రుద్ర వైపు చూస్తూ ఉన్నాడు ఆనంద్ మరో వైపు డోర్ బాదేస్తున్న శ్రియ ను చూసి దేవుడా ఇప్పుడేం జరుగుతుందో ఏంటో అని కోపంతో ఎర్రబడ్డ రుద్ర మొహం వైపు కంగారుగా చూస్తున్నాడు …..

TO BE CONTINUEEd…