విలన్ హస్బెండ్-29
నా ఫేస్ లో ఏమైనా మూవీ కనిపిస్తుందా అని ఆనంద్ వైపు సీరియస్ గా చూస్తూ అడుగుతున్న రుద్ర ను చూసి అసలేం జరుగుతుంది రుద్ర ఇక్కడ దాన్ని ఎందుకలా బయటకు నెట్టావ్ శ్రియ రాగానే ఎందుకంత ఫైర్ అయ్యావ్ మీరు బానే ఉన్నారు కదరా సడెన్ గా ఇలా బిహేవ్ చేస్తున్నావ్ ఏంటి నైట్ డైనర్ కి కూడా వెళ్ళారు ఆల్ ఆఫ్ సడెన్ నువ్వెందుకు ఇంత వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నావ్???
వెయిట్… వెయిట్….. నేను శ్రియ తో డిన్నర్ కి వెళ్తున్నట్టు నీతో చెప్పలేదు మరి నేను తను డిన్నర్ కి వెళ్ళినట్టు నీకెలా తెలిసింది… ఒకే ఫైన్ అర్థం అయింది ఆ దెయ్యం నే చెప్పుంటుంది కదా అని గ్లాస్ డోర్ నుండి శ్రియ వైపు సీరియస్ గా చూస్తూ చెప్తాడు….
శ్రియ నాకు మాత్రమే కాదు మొత్తం ఆస్ట్రేలియా లో ఉన్న మన ఫ్రెండ్స్ అందరినీ ట్యాగ్ చేసి మరీ ఇన్స్టా లో పోస్ట్ చేసింది & మీ ఇద్దరి పిక్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి కదా నేను దీని గురించి అడగాలి అనే నైట్ నీకు కాల్ చేసాను బట్ నువ్వు లిఫ్ట్ చేస్తే కదా 😑😑
వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ ఆనంద్ 🤨🤨 నైట్ నేను నీ కాల్ లిఫ్ట్ చేసాను కదా వర్మ ప్రాజెక్ట్ ఫైనల్ చేయమని సీరియస్ గా కూడా చెప్పాను అప్పుడు ఎందుకు నువ్వు దీని గురించి నాతో చెప్పలేదు అంటూ కోపంగా ఆనంద్ కాలర్ పట్టుకుని అడుగుతాడు….
రుద్ర నేను చెప్పేది విను అంటూ రుద్ర చూపుకు బయటపడుతూ నాకు తెలిసింది అప్పుడు కాదు మిడ్ నైట్ 2 కి శ్రియ పోస్ట్ చేసింది & నేను వర్క్ లో పడి కాస్త లేట్ గా పడుకున్నాను…. వర్క్ ఫినిష్ చేసి పాడుకుందాం అనుకుంటూ ఉండగా నోటిఫికేషన్స్ ఆగకుండా వస్తూ ఉంటే అపుడు చూసాను ఈ పోస్ట్ వెంటనే నీకు కాల్ చేసాను బట్ నువ్వు లిఫ్ట్ చేయలేదు ట్రస్ట్ మీ అంటూ ఉన్నది ఉన్నట్టు చెప్పిన ఆనంద్ వైపు చూస్తూ విసురుగా ఆనంద్ ను కాస్త వెనక్కి తోసి షో ద పిక్స్ అంటూ సీరియస్ గా చూస్తాడు…..
రుద్రాన్ష్ గొంతు లోని బేస్ కి ఆనంద్ కి చమటలు పడతాయి దాంతో వెంటనే పాకెట్ లో ఉన్న మొబైల్ తీసుకుని ఇన్స్టా ఓపెన్ చేసి శ్రియ అకౌంట్ రుద్ర కి చూపిస్తాడు…. అందులో శ్రియ టోటల్ గా సిక్స్ పిక్స్ అప్లోడ్ చేసినట్టు కనిపిస్తుంది ఫస్ట్ 2 పిక్స్ బొకే తో తనే పోస్ ఇచ్చినా మిగిలిన 4 పిక్స్ లో తను శ్రియ ఫుడ్ తింటున్నప్పుడు , బొకే తనకి ఇస్తున్నప్పుడు పిక్ ఇంకా తను నవ్వుతూ శ్రియ వైపు చూస్తున్న పిక్ ఇంకొకటి శ్రియ తను పక్క పక్కన నుంచున్న పిక్ అన్ని కూడా శ్రియ చాలా తెలివిగా రుద్ర కి ఏమాత్రం డౌబ్ట్ రాకుండా తీయించిన పిక్స్….
ఆ పిక్స్ చూసిన ఎవరైనా ఇద్దరినీ లవర్స్ అనుకోవడం కన్ఫర్మ్ అలా ఉన్నాయి ఆ పిక్స్ & దాని కింద క్యాప్షన్ చూస్తున్న రుద్ర దవడ కోపంగా బిగుసుకుంటుంది…. Our Love shines brighter at night ❤️ ❤️ అని రెండు హార్ట్ సింబల్స్ పెట్టి ఐ ఫౌండ్ మై ఫరెవర్ అని రాసుంది…..అది చూసిన రుద్ర కామెంట్స్ కూడా చూస్తాడు అవన్నీ చూస్తూ కోపంగా వెళ్ళి దాన్ని లోపలికి పిలువు అని సీరియస్ గా చూస్తూ మొబైల్ ఆనంద్ కి ఇచ్చేస్తాడు…..
రుద్ర వదిలేయ్ రా శ్రియ కి అర్థం అయ్యేలా నేను చెప్తాను అంటూ రుద్ర ను కన్విన్స్ చేయడానికి చూస్తున్న ఆనంద్ వైపు సీరియస్ గా చూడగానే సైలెంట్ గా వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే శ్రియ నవ్వుతూ లోపలికి వస్తుంది……
ఐ నో రు రుద్ర్ నువ్వు డోర్ ఓపెన్ చేస్తావ్ అని నాకు తెలుసు అందుకే బయటే వెయిట్ చేసాను…. ఫ్రెండ్స్ అందరూ మన లవ్ సక్సెస్ పార్టీ అడుగుతున్నారు ఎపుడు ప్లాన్ చేద్దాం రుద్ర్ ఐ నో యూ ఆర్ బీసీ అందుకే నీ ఫ్రీ టైం చూసి పార్టీ ప్లాన్ చేస్తాను అని చెప్పాను & ఆనంద్ ఆ అరేంజ్మెంట్స్ నువ్వే చూడాలి ఎలాగో రుద్ర్ పి. ఏ. గా అది నీ డ్యూటీ నే కదా వాట్ డు యూ సే రుద్ర్…..
ఇది చావడానికే ఇక్కడికి వచ్చినట్టు ఉంది 🤦 అక్కడ వాడి ఎక్స్ప్రెషన్స్ చూసైనా ఆ వాగుడు కాసేపు ఆపచ్చు కదా ఓ… ఇంజన్ లేని బైక్ లా తెగ హీట్ ఎక్కిపోయి వాగుతుంది ఇప్పుడు వీడేం చేస్తాడో ఏంటో అని రుద్ర మొహాన్ని చూసి కంగారుగా చూస్తూ ఉంటాడు ఆనంద్….
ఏంటి రుద్ర్ అప్పటి నుండి నేనే మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవు ఏంటి అని అంటున్న శ్రియ వాయిస్ అక్కడితో ఆగిపోతుంది కారణం శ్రియ గొంతు రుద్ర చేతుల్లో చిక్కి ఊపిరి ఆడక గిల గిలా కొట్టుకుంటూ ఉంటుంది…. వాల్ కి శ్రియ ను లాక్ చేసిన రుద్ర తన వైపు పళ్ళు నూరుతూ నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా నా పిక్స్ ఇన్స్టా లో పోస్ట్ చేసే ధైర్యం వచ్చేసిందా నీకు అని అరవగానే రుద్ర వాయిస్ కి శ్రియ గుండె ఆగినంత పనవుతుంది…..
రుద్ర వదులు అని శ్రియ కళ్ళల్లో నీళ్ళు కష్టంగా ఊపిరి తీసుకుంటూ కనిపిస్తున్న తన అవస్థ ను చూసి ఆనంద్ కంగారుగా రుద్ర చెయ్ పట్టుకుని వెనక్కి లాగడానికి ట్రై చేస్తాడు…..
ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని ఒక్క మాట ఆనంద్ కి చెప్పి చెప్పవే నేను నిన్ను లవ్ చేస్తున్నానా?? ఎందుకలా అందరికీ తెలిసేలా పోస్ట్ పెట్టావ్ ఫస్ట్ ఆ పోస్ట్ డిలీట్ చెయ్ అనగానే రుద్ర చెప్పినట్టు చేయకపోతే ఎక్కడ చంపేస్తాడో అని భయం వేసి తన జీన్స్ పాకెట్ లో నుండి మొబైల్ తీసుకుని వెంటనే పోస్ట్ డిలీట్ చేస్తుంది…..
డిలీట్ చేసింది కదా వదిలేయ్ రుద్ర తను చచ్చిపోయేలా ఉంది రా ప్లీస్ వదులు అంటూ ఆనంద్ బలవంతంగా రుద్ర ను దూరం జరపగానే శ్రియ కష్టంగా ఊపిరి తీసుకుంటూ ప్రాణ భయం తో రుద్ర వైపు చూస్తూ ఉంటుంది…..
🤍💜🤍💜🤍💜🤍💜🤍💜🤍
డాడ్ ఏమైంది అక్కడే ఆగిపోయావ్ అని నడుస్తూ సడెన్ గా ఆగిన మాదేష్ చేయ్ పట్టుకుని అడుగుతున్న హరిణి వైపు చూస్తూ ఆ…. ఎమ్ లేదు రా నువ్వు హరీష్ వెళ్ళండి నేను మీ మామ్ అర్జంట్ గా ఒక ప్లేస్ కి వెళ్లాలి….. మేము అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాం నువ్వు హరీష్ జాగ్రత్తగా వెళ్ళండి అని తన కంగారు తగ్గించుకుంటూ చెప్తాడు….
అదేంటి డాడ్ సడెన్ గా అయినా ఇపుడే గా వచ్చారు పైగా ఇంటికి కూడా రాలేదు అపుడే ఎక్కడికి వెళ్తారు…. జెట్ లాగ్ ఉంటుంది కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత కావాలంటే వెళ్ళండి
లేదు హరిణి ఇది చాలా ఎమర్జెన్సీ నాకు ఇపుడే గుర్తొచ్చింది మీరు వెళ్ళండి మేము వస్తాం కదా హరీష్ తీసుకు వెళ్ళు అని కొడుకు కి సైగ చేయగానే హరీష్ మాదేష్ సైగ లను అర్థం చేసుకుని హరిణి డాడ్ వర్క్ అంటున్నాడు కదా వాళ్ళని వెళ్ళనివ్వు మనం వెళ్దాం పదా నీ కోసం చాలా గిఫ్ట్స్ తీసుకుని వచ్చాను
అవునా సరే పదా అంటూ సంబరంగా చెప్తూ డాడ్ మీరు వర్క్ అవ్వగానే వచ్చేయండి అని చెప్పి హరీష్ తో అక్కడి నుంచి లగేజ్ కలెక్ట్ చేసుకుని ఇద్దరూ ఇంటికి స్టార్ట్ అవుతారు….
ఏమైంది మాదేష్ సడెన్ గా ఎందుకలా టెన్షన్ పడుతున్నారు.?? పిల్లలను పంపేసి మనం అంత అర్జంట్ గా ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్న శ్వేత చెయ్ పట్టుకుని ముందు నువ్వు ఇలా రా అని అక్కడే ఉన్న క్యాంటీన్ కి తీసుకుని వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఇప్పుడు చెప్పు ఇందాకా ఏదో నేమ్ చెప్తున్నావ్ అని టెన్షన్ గా శ్వేత వైపు చూస్తూ అడుగుతాడు….
మాదేష్ వైపు విచిత్రంగా చూస్తూ మహిదర్ అని చెప్పగానే తల మీద చేతులు వేసుకుని 🙆🙆 అయిపోయింది అంతా అయిపోయింది ఇన్నాళ్లు ఎవడికి అయితే ఆ వినయ్ ను దూరంగా ఉంచాలి అనుకున్నానో వాడే వినయ్ ను వెతుక్కుంటూ వచ్చాడు…. ఇక వాళ్ళను విడదీయడానికి నాకు ఈ జన్మ మొత్తం సరిపోదు అయినా వైజాగ్ లో ఉండాల్సిన వాడు ఇక్కడికి ఎందుకు వచ్చి చచ్చాడు అంటూ కోపంగా అరుస్తున్న మాదేష్ బిహేవియర్ కి వాడు ఎవడో వస్తే నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావ్ అసలేం జరిగింది మాదేష్???
హా 😏😏 నా పిండా కూడు జరిగింది 😬😬 ఒసేయ్ పిచ్చి మొహమా ఆ మహిదర్ గాడు సామాన్యుడు కాదు వాడికి నాకు ముందు నుండి పడదు అంతే కాదు ఆ సంధ్య అంటే మహీదర్ కి చాలా ఇష్టం…. సంధ్య చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు దాన్ని హస్పిటల్ కి తీసుకుని వచ్చింది వాడే అంతే కాదు ఆ సంధ్య దానికి యాక్సిడెంట్ అయ్యేలా చేసింది నేనే అని చెప్పడానికి చాలా ట్రై చేసింది కానీ దానికి మాట్లాడడానికి స్కోప్ లేక బతికిపోయారు లేకపోతే ఈ పాటికి జైల్ లో ఉండే వాడ్ని….
అప్పట్లో వాడు సంధ్య చెప్పింది అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేసాడు కానీ వాడిని ఆది ఆలోచించకుండా డైవర్ట్ చేయడానికి నేను వినయ్ వర్మ అమ్మ ను చంపాల్సి వచ్చింది….
ఏంటి మీరు చెప్పేది అని షాక్ అవుతూ ఆ శారద ( ప్రతాప్ వర్మ వైఫ్) హార్ట్ ఎటాక్ తో కదా చనిపోయింది మరి మీరు చంపారు అంటారేంటి ??
నీ మొహం ఆ మహీదర్ సంధ్య చెప్పింది ఆలోచిస్తూ ఎక్కడ నన్ను కనిపెట్టేస్తాడో అని భయం వేసి వాడ్ని ఆ విషయం నుండి డైవర్ట్ చేయడానికి నాకు ఆ ముసల్దాన్నీ చంపక తప్పలేదు…. అందుకే కదా ఎవరు లేని టైమ్ చూసి ఆ ముసల్ది నిద్రపోతున్న టైమ్ లో మొహానికి దిండు పెట్టి నొక్కి చంపేసి అందరికీ హార్ట్ ఎటాక్ తో చచ్చింది అని కలరింగ్ ఇచ్చాను…..
అయినా ఆ మహిదర్ గాడు వదిలిపెట్టలేదు పోస్ట్ మార్టం చేయించాలి అని పట్టు పట్టాడు కానీ నేను బెదిరించి ఆ డాక్టర్ తో హార్ట్ ఎటాక్ అని చెప్పి అక్కడితో ఎలాంటి క్లూస్ లేకుండా చేసాను…. ఎలాగోలా మహిదర్ గాడిని మ్యానేజ్ చేసి వాడిని డైవర్ట్ చేసాను అక్కడే ఉంటే వాడు ఎప్పటికైనా నా కొంప కొల్లేరు చేస్తాడని ఇక్కడ వినయ్ తో బ్రాంచ్ ఓపెన్ చేయించి మెల్లగా ఫ్యామిలీ ను ఇక్కడికి షిఫ్ట్ చేయించాను….
అంతా నేను అనుకున్నట్టు జరుగుతుంది అనే టైం కి మళ్ళీ వీడు శని లా దాపరించాడు కదే అని తల పట్టుకుని వాడి కొడుకు మాయ తో ఎక్కువ తిరుగుతున్నాడు అనే ఒక్క కారణం తో వాడికి జీవితాంతం కొడుకు ను దూరం చేసాను అని కసిగా చెప్తున్న మాదేష్ ను చూసి శ్వేత షాక్ అవుతుంది
మాదేష్ నువ్వు మహిదర్ కొడుకు ను దూరం చేయడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు అనగానే మాదేష్ శ్వేత వైపు చూస్తూ నీకు నా గురించి తెలిసింది సగమే శ్వేత నువ్వు నన్ను వెధవ, కంత్రీ అనుకుంటున్నావ్ కదా 😌 ……..
నేను అంతకు మించి అని వికృతంగా నవ్వుతూ ఆ మహిదర్ కొడుకు తెలిసీ తెలియని ఏజ్ లో కార్ డ్రైవ్ చేస్తూ ఒక యాక్సిడెంట్ చేశాడు వాడిని హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్న మహిదర్ కళ్ళు కప్పి ఐ. సి. యూ. లోకి డాక్టర్ గెట్ అప్ లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాడి ఆక్సీజన్ మాస్క్ తీసేసి వాడు చచ్చేలా చేసాను…..
అంతటితో ఆగకుండా ఆ చచ్చిన వాడి ఫ్యామిలీ ను కావాలని రెచ్చకొట్టి మహీదర్ ఇంటి మీద రాళ్ళు వేయించా అది భరించలేని మహీదర్ కొడుకు వల్ల తన పరువు పోయిందని వాడి కొడుకును తిట్టి కొట్టాడు దాంతో వాడు భయపడి తండ్రి కొట్టాడు అని కోపం పెంచుకుని ఇంటి నుండి పారిపోయాడు …..
ఆ తర్వాత మహిదర్ కొడుకు కోసం పడే బాధ చూసి బాగా నవ్వుకున్నా అలా నా పగ, ప్రతీకారం వాడి మీద తీర్చుకున్నాను …… అక్కడితో అయిపోయింది అనుకున్న వాడి క్యారెక్టర్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ కి ఎందుకు ఓపెన్ అయిందో అర్థం కావడం లేదు అని అలోచిస్తూ లాభం లేదు అక్కడేం జరుగుతుందో ముందు తెలుసుకోవాలి శ్వేత…..
మహిదర్ చాలా తెలివైన వాడు అక్కడ ఈ పాటికి వినయ్ తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి జై బిహేవియర్ గురించి ఈ పాటికి వాడికి చెప్పే ఉంటాడు…. అక్కడేం జరుగుతుందో ముందు చూడాలి నువ్వు పదా ఇప్పుడే అక్కడికి వెళ్దాం అంటూ షాక్ లో ఉన్న శ్వేత ను అలాగే కార్ లోకి తోసి రేణుక ను అడిగి అడ్రస్ షేర్ చేయించుకుని మరీ అక్కడికి స్టార్ట్ అవుతాడు…..
🤍💙🤍💙🤍💙🤍💙🤍💙🤍💙
కుమారి సిగ్గు పడుతూ ఇంట్లోకి వస్తూ హాల్ లో ఒక వైపు కూర్చుని ఇందాక మాన్య ను అందరి ముందు ఇరికించింది గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటున్న జై, అమర్ ను చూసి సిగ్గు పడుతూ కిచెన్ లోకి వెళ్ళి ఇద్దరి కోసం టీ తీసుకుని వచ్చి ట్రే జై ముందు పెడుతుంది….
ట్రే వైపు చూసిన జై కామ్ గా టీ కప్ తీసుకుంటూ ఉంటే అయ్యో సార్ అని గట్టిగా పిలవగానే అమర్, జై కుమారి వాయిస్ కి ఉలిక్కిపడి హేయ్ ఏమైంది ఎందుకలా అరిచావ్ అంటూ కుమారి వైపు చూస్తారు….
ఈ కప్ అమర్ గారి కోసం దాని పక్కన కప్ మీది అని చెప్తున్న కుమారి వైపు విచిత్రంగా చూస్తునే ఇద్దరూ ఎవరి కప్స్ వాళ్ళు తీసుకుని సిప్ చేస్తూ ఉండగా జై అమర్ తో మాట్లాడుతూ అమర్ పట్టుకున్న సాసర్ వైపు చూసి షాక్ అవుతాడు …..
ఏంట్రా ఏమైంది అలా ఉన్నావ్ అని ఒక చేత్తో కప్ మరో చేత్తో సాసర్ పట్టుకున్న అమర్ మొహాన్ని సాసర్ వైపు తిప్పి చూపిస్తాడు జై….. వైట్ సాసర్ లో రెడ్ కలర్ లిప్స్టిక్ తో I ♥️ U అన్న లెటర్స్ చూసి ఇద్దరూ షాక్ అయ్యి కుమారి వైపు చూడగా కుమారి సిగ్గు పడుతూ కిచెన్ లోకి పారిపోవడం చూసి ఇద్దరికీ పిచ్చి ఎక్కుతుంది అది చూసిన ఆద్య, మాన్య హై – ఫై ఇచ్చుకుని నవ్వుకుంటారు…..
ఈ అప్డేట్ లో మీకు స్టోరీ లోని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రిలీస్ చేసాను అవేంటో గెస్ చేయండి & ఇప్పటి నుంచి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది…. సో మీరు ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడాలి లేదా లాజిక్ మిస్ అయ్యి కన్ఫ్యూస్ అవుతారు 😌 సో స్టే ట్యూన్ టు బ్రోకెన్ హార్ట్స్ 💔