విలన్ హస్బెండ్-30
కుమారి అమర్ ను చూసి సిగ్గు పడుతూ కిచెన్ లోకి పరిగెత్తడం చూసిన ఆద్య నవ్వుకుంటూ ప్లాన్ సక్సెస్ పాప సో ఇపుడు నువ్వు హ్యాపీనా అంటూ మాన్య వైపు చూస్తుంది…. హ్యాపీ అని చిన్నగా అడుగుతావ్ ఏంటి అమ్ము పిచ్చ హ్యాపీగా ఉన్నాను లెట్స్ డ్యాన్స్ అంటూ పిచ్చిగా ఎగురుతూ తమ హ్యాపీనెస్ ను అలా సెలెబ్రేట్ చేసుకుంటారు…..
ఏంట్రా ఇది ఆ పిల్ల ఏంటి నాకు ఇచ్చిన సాసర్ లో ఐ లవ్ యూ అని రాసుంది పైగా అది పర్టికులర్ గా నాకే ఇచ్చింది అని వెర్రి మొహం వేసుకుని అడుగుతున్న అమర్ ను చూసి నాకు అదే అర్థం కావడం లేదు అమర్ అని తల తిప్పి చూసిన జై కి ఆద్య, మాన్య డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు…. రేయ్ డౌబ్ట్ లేదు ఆ దెయ్యాలే ఏదో చేశాయి ఆగు దాని పని చెప్తా అని కోపంగా ఆద్య వైపు వెళ్తాడు వెనుకే అమర్ కూడా ఫాలో అవుతాడు….
ఏయ్ వాడేంటి మన వైపే అంత కోపంగా వస్తున్నాడు కొంప దీసి మ్యాటర్ లీక్ అయిందా అని కంగారు పడుతూ మాన్య తో ఏదో ఒకటి మాట్లాడుతూ జై దగ్గరకు వచ్చినా తన వైపు చూడను కూడా చూడదు…. యూ సీ మాన్య మనం ఇక్కడ 2 వీక్స్ ఉండడం లేదు కాబట్టి పెండింగ్ ఫైల్స్ అన్ని రేపు క్లియర్ చేయాలి & ఎల్లుండి నువ్వు నేను మాయ షాపింగ్ కి వెళ్దాం & అలాగే పార్లర్ అపాయింట్మెంట్ కూడా తీసుకో అని తన వైపు డౌబ్ట్ గా చూస్తున్న జై వైపు ఓరగా చూసి వీడికి ఇంకా డౌబ్ట్ తగ్గినట్టు లేదు పంది వెధవ ఎలా చూస్తున్నాడో చూడు అని జై ను తిట్టుకుంటూ మాన్య తో ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటుంది….
చేసిన ఓవర్ యాక్షన్ ఆపి ఇటు తిరగవే అని ఆద్య చెయ్ పట్టుకుని తన మీదకు లాక్కుని నిజం చెప్పవే ఆ పని అమ్మాయికి ఏం చెప్పారు ఇప్పటి వరకు ఏడ్చింది కాస్త సడెన్ గా ఇపుడు అమర్ ను చూసి సిగ్గు పడుతుంది ఏం చెప్పారు తనతో??? అంటూ ఇద్దరి వైపు చూసి సీరియస్ గా అడుగుతాడు…..
యూ స్టుపిడ్ వదలరా అంటూ జై నుండి దూరంగా జరిగి వాట్ డు యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ హా 🤨?? ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అమ్మాయి ఏంటి అమర్ ను చూసి సిగ్గు పడడం ఏంటి??? నాకేం అర్థం కావడం లేదు….. మాన్య నీకేమైనా వీడు చెప్పింది అర్తం అవుతుందా??
వాడు వీడు అంటే మాడు పగలకొడతాను అని ఆద్య తల మీద కొడుతూ నీ వేషాలు నా దగ్గర కాదు ఎమ్ తెలియనట్టు మహానటి రేంజ్ లో యాక్ట్ చేయకు నాకు తెలుసే నువ్వు పెద్ద కంచు వని చెప్పవే ఆ అమ్మాయికి ఎమ్ చెప్పారు???
రేయ్ నీకేమైనా లూసా?? ఆ అమ్మాయి అమర్ ను చూసి సిగ్గు పడితే నాకేం సంబంధం అనవసరంగా నన్ను గెలకద్దు చెప్తున్నా అంటూ ఆద్య కూడా సీరియస్ అవుతుంది….
వీడేదో సిగ్గు లేని పని చేసుంటాడు అమ్ము అందుకే ఆ అమ్మాయి సిగ్గు పడుతుంది అని అంటున్న మాన్య మాటలకు కోపంగా చూస్తూ నా చేతిలో చచ్చావే ఇవాళ అని అమర్ మాన్య వైపు వస్తూ అడ్డుకుంటున్న జై ను ఆద్య మీదకు తోసి తను మాన్య ను పట్టుకోవడానికి పరుగులు పెడతాడు….
అమర్ తోయడం తో జై సడన్ గా వెళ్ళి ఆద్య మీద పడ్డం తో ఇద్దరూ అప్పటికీ గార్డెన్ లోనే ఉండడం వల్ల స్లిప్ అయి ఒకరి మీద ఒకరు దొర్లుతూ వెళ్ళి ఒక చోట ఆగిపోతారు…. జై గడ్డి మీద ఉంటే ఆద్య జై మీద ఉంటుంది తన నడుమును జై చేతులు బలంగా చుట్టేయడం తో అలా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ ఉంటారు….
అప్పుడే అక్కడికి రీచ్ అయ్యి ఇంట్లోకి ఫాస్ట్ గా అడుగులు వేస్తున్న మాదేష్ – శ్వేత లకు గార్డెన్ లో ఒకరి మీద ఒకరు దొర్లుతున్న వీళ్ళను చూసి షాక్ అవుతూ వాళ్ళ దగ్గరకు నడుస్తారు…. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి క్షణం కూడా పడదు కానీ ఈ క్షణం ఇద్దరికి తమ మధ్య ఉన్న గొడవ, పగ ఎదీ గుర్తు రావడం లేదు ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలా చూసుకుంటూ కళ్ళతోనే ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు….
ప్రతీ హృదయానికి ఎవరికీ చెప్పుకోలేని ఏదో ఒక బాధ ఉంటుంది …. ఆ బాధ ను వేరే హృదయం మాత్రమే గుర్తించ గలదు…. ఇప్పుడు కూడా ఎవరి హృదయం లో వాళ్ళు మోస్తున్న బరువు, బాధ ఒకరి కళ్ళల్లో ఒకరికి స్పష్టంగా తెలుస్తోంది…. అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూనే జై ఆధ్య నుదుటిన పడుతున్న హెయిర్ ను చెవి వెనుక పెడుతూ ఆద్య తల వెనుక భాగంలో పట్టుకుని తన మొహాన్ని ఆద్య మొహానికి దగ్గరగా తీసుకుని వెళ్తున్నాడు ఇంకొక్క క్షణం ఉంటే ఇద్దరికీ పెదవులు కలిసెంత దగ్గర్లో ఉండగా అలెర్ట్ అయిన మాదేష్ అల్లుడు అని పిలుస్తాడు ఇన్ఫ్యాక్ట్ అరుస్తాడు 🫣🫠……
మాదేష్ పిలుపుకు కాన్షియస్ లోకి వచ్చిన జై – ఆద్య వెంటనే దూరం జరిగి ఇద్దరూ ఫాస్ట్ గా లేచి నుంచుంటారు…. ఆద్య కి అక్కడ నుంచోవడానికి కూడా ఎంబారిసాంగ్ గా అనిపిస్తూ ఉంటే జై వైపు సీరియస్ గా చూస్తూ లోపలికి పరిగెడుతుంది…..
ఓహ్ గాడ్ 🤦🤦 ఏమవుతుంది జై నీకు అది దగ్గరలో ఉంటే చాలు నీకు తెలియకుండానే నువ్వు దాని కంట్రోల్ లోకి వెళ్ళిపోతున్నావ్ అది నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది రా దానికి దూరంగా ఉండు అని తనను తాను మోటివేట్ చేసుకుని మాదేష్ ను చూసి చిన్నగా స్మైల్ ఇస్తాడు….
హాయ్ జై ఇక్కడేం చేస్తున్నావ్?? ఆ అమ్మాయి ఎవరు అని తన మొహం లోని కోపాన్ని చూపించకుండా ఫేక్ స్మైల్ తో అడుగుతాడు మాదేష్….
హాయ్ మావయ్య సో లాంగ్ టు సీ యూ & వెల్కమ్ టు ఇండియా అని మాదేశ్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ యాక్చువల్లి మావయ్య తను స్లిప్ అయి పడిపోతూ ఉంటే సేవ్ చేద్దాం అని పట్టుకున్నా ఈ లోగా మీరు వచ్చారు….
సేవ్ చేయాలని పట్టుకున్నావా లేక సరసం ఆడడానికి పట్టుకున్నావా అని సర్కాస్టింగ్ గా అంటున్న మాదేష్ వైపు యాంగ్రీ లుక్ ఇస్తూ మీరు ఇది అనుకుంటే అది అని అంతే సీరియస్ గా అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తున్న జై ను చూసి వీడి పొగరు,బలుపు అంతా ఆ వినయ్ దే….. చెప్తా చెప్తా వన్స్ రెండు పెళ్ళిళ్ళు అయ్యాక నిన్ను నీ బాబు ని లెఫ్ట్ లెగ్ తో తన్ని బయటకు గెంటేస్తా అని కన్నింగ్ గా అనుకుని ఎవరే ఆ పిల్ల మన బేబీ ( హరిణి) కంటే అందంగా కనిపిస్తుంది?? మహిదర్ కి రిలేటివ్ ఆ???
హా అవును బాగా దగ్గర చుట్టం వరసకు కూతురు అవుతుంది అని చెప్తున్న శ్వేత వైపు చూసి అదిరిపడి వాట్ అంటే ఈ అమ్మాయి ఆ మహిదర్ గాడి కూతురా చంపేశావ్ కదే 😖😖 వీళ్ళ ఇద్దరి వాలకం చూస్తుంటే లవ్ లో పడ్డట్టు ఉన్నారు…. ఇంత షార్ట్ పిరియడ్ లో జై లో ఇంత చేంజ్ ఎంటే?? అదే జరిగితే నా కొంప కొల్లేరే అయినా ఇక్కడ ఇంత సినిమా జరుగుతుంటే రేణుక ఏం చేస్తుంది పదా చూద్దాం అంటూ ఇద్దరూ లోపలికి నడుస్తారు….
🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️
ఒసేయ్ ఆగవే నీ పని చెప్తా అని ఫాస్ట్ గా పరిగెడుతున్న మాన్య ను వెనుక నుండి నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని పక్కనే ఉన్న చెట్టుకు లాక్ చేసి తను ఎటు వెళ్లకుండా తన రెండు రెండు చేతులు అడ్డు పెట్టి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటాడు….
అమర్ తప్పుకో నాకు నీతో గొడవ పడే మూడ్ కొంచెం కూడా లేదు….. నేను తిన్నది కాస్త ఈ రన్నింగ్ వల్ల అరిగిపోయింది తప్పుకో రా దున్న నేను వెళ్ళి ఏదైనా తినాలి అంటూ అరుస్తూ అమర్ జుట్టు పీకుతూ ఉంటుంది…..
ఏయ్ దెయ్యం ఎంటే నా జుట్టు వదులు నాకు అసలే ఒక సారి కూడా పెళ్లి అవ్వలేదు…. జుట్టు ఉంటేనే ఎవరు దేకట్లేదు జుట్టు లేకపోతే నన్ను నేను కూడా మిర్రర్ లో చూసుకోలేను వదలవే అంటూ మాన్య చేతుల్లో నుండి తన జుట్టు ను విడిపించుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు….
నీకు పెళ్ళే కదరా కావాలి ఆగు నేను చేస్తా అంటూ అమర్ చెప్పేది వినకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తున్న మాన్య వైపు చూస్తూ ఇది మామూలుగా చెప్తే ఎందుకు వింటుంది అనుకుని ఒక్క సారిగా మాన్య నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు….
మాన్య స్లీవ్లెస్ క్రాప్ టాప్ వేయడం వల్ల అమర్ చేతులు డైరెక్ట్ గా తన నడుమును టచ్ అవుతూ ఉంటే అప్పటి వరకు శివంగి లా ఊగిపోయిన మాన్య ఒక్క సారిగా మ్యూట్ అయిపోతుంది….
మాన్య అరుపు ఆపించడానికి అమర్ అలా పట్టుకున్నాడే కానీ సడెన్ గా మాన్య అలా సైలంట్ అయిపోవడం & తనను అంత దగ్గరగా చూసిన అమర్ కి మాన్య కి వెంటనే కిస్ ఇవ్వాలి అనిపిస్తుంది….
మీనాల్లాంటి కాటుక కళ్ళ తో తన వైపు చూస్తూ తన కింద పెదవిని పంటితో నలుపుతూ తన వైపు చూస్తున్న మాన్య మరింత ముద్దుగా కనిపిస్తూ ఉంటే మాన్య ను కిస్ చేయడానికి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన అమర్ ఒక్క సారిగా కింద పడి పొట్ట పట్టుకుని ఓరి దేవుడా…. ఇది నన్ను చంపేసింది అని గట్టి గట్టిగా అరుస్తాడు….
అసలేం జరిగింది అంటే మన అమర్ బాబు ముద్దు మైకం లో పడి మాన్య ఎక్స్ప్రెషన్ గమనించలేదు కానీ అమర్ చేస్తున్న ఓవర్ యాక్షన్ కి మాన్య అమర్ కోలుకోలేని విధంగా గట్టిగా పిడికిలి బిగించి మరీ గట్టిగా రాత్రి కొట్టిన చోటే కడుపు మీద పంచ్ ఇస్తుంది దాంతో అమర్ చెట్టు నుండి పడ్డ కాయ లా కింద పడి కొట్టుకుంటూ ఉన్నాడు…..
ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతూ అదే గార్డెన్ లో ఉన్న మాయ అమర్ అరుపుకి అదిరిపడి కాల్ యూ బ్యాక్ అని కాల్ కట్ చేసి అమర్ దగ్గరకు వచ్చి చూడగా అమర్ కింద పడి దొర్లుతూ కనిపిస్తాడు….. అన్నయ్య ఏమైంది అంటూ పిలుస్తున్నా రియాక్ట్ అవ్వకుండా ఇంట్లోకి ఫాస్ట్ గా వెళ్తున్న మాన్య వైపు చూస్తూ అయోమయంగా అడుగుతుంది…..
🤍💙🤍💙🤍💙🤍💙🤍💙🤍💙
రుద్రాన్ష్ తన వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉంటే భయం భయంగా పైకి లేచి నుంచున్న శ్రియ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఐ ఆమ్ సారి రుద్ర్ అంటూ ఇంకేదో అనబోతున్న శ్రియ మాటను గాల్లోనే ఆపేస్తూ కాల్ మీ రుద్రాన్ష్ డ్యామిడ్ అంటూ చేతికి అందిన షో పీస్ వాల్ కి వేసి కొడుతూ మరింత రౌద్రంగా చేంజ్ అవుతుంది తన ఫేస్….
రుద్రాన్ష్ ను అలా చూసిన శ్రియ గుటకలు మింగుతూ సారి రుద్రాన్ష్ నీ పర్మిషన్ లేకుండా అలా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేయడం తప్పే బట్ ఐ రియల్లీ లవ్ యూ 🥹🥺 టుడే కాకపోయినా టుమారో అయినా నా లవ్ యాక్సెప్ట్ చేస్తావ్ అన్న ట్రస్ట్ తోనే మన పిక్స్ అప్లోడ్ చేసాను…..
నువ్వంటే నాకు ఎంత భయం ఉందో అంతకు మించిన ప్రేమ ఉంది వై కాంట్ యూ అండర్స్టాండ్ మై లవ్ రుద్రాన్ష్ అంటూ తన వైపు చూస్తూ ఏడుస్తూ అడుగుతుంది…..
హేయ్ యూ జస్ట్ స్టాప్ దిస్ యాక్టింగ్ ఒకే!! నువ్వేంటో నీ చీప్ మెంటాలిటీ ఎలాంటిదో నిన్న రిసార్ట్ లోనే తెలిసింది ఇంకా..ఇంకా నా దగ్గర ట్రిక్స్ ప్లే చేయాలి అని చూడకు….. ఐ డోంట్ ట్రస్ట్ యూ మోర్ ఓవర్ ఫ్రెండ్షిప్ అన్న మాస్క్ లో నువ్వు నన్ను లవ్ చేయడం ఐ కాంట్ డైజెస్ట్…..
రుద్ర కామ్ డౌన్ షి ఇస్ అవర్ ఫ్రెండ్ ఎందుకంత హార్ష్ గా బిహేవ్ చేస్తున్నావ్?? తను షివర్ అవుతుంది రుద్ర అంటూ శ్రియ ను దగ్గరకు తీసుకుని ఇట్స్ ఒకే శ్రియ కూల్ అంటూ తనను కన్సోల్ చేస్తూ వాట్స్ యువర్ ప్రాబ్లెమ్ రుద్ర…
శ్రియ లవ్ ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావ్ యూ నో మీరు ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారని అందరితో పాటు నేను కూడా అనుకున్నాను అలా ఉండేది మీ బాండ్…….
ఆల్ ఆఫ్ సడెన్ ఎందుకు తనను ఎనిమి లా చూస్తున్నావ్?? నువ్వు ఇంతలా కోప్పడ్డా స్టీల్ షి లవ్స్ యూ ఒక్క సారి శ్రియ గురించి థింక్ చెయ్ రుద్ర??
విల్ యూ షట్ అప్ యువర్ మౌత్ ఆనంద్!!! నేను శ్రియ ను మాత్రమే కాదు ఈ ఆస్ట్రేలియా లో ఉన్న ఏ అమ్మాయిని నేను లవ్ చేయను…. బికాస్ ఐ ఆమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ సమ్వన్ యూ బోథ్ గాట్ ఇట్ అంటూ కుండ బద్దలు కొట్టేసాడు….
వాట్??? ఒక్కసారిగా ఇద్దరి నుండి వచ్చిన సేమ్ రియాక్షన్ కి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు రుద్ర ఎందుకంటే వాళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతారు అని తను ముందే గెస్ చేశాడు అందుకే ఇద్దరి వైపు చూస్తూ యస్ మీరు విన్నది & నేను అన్నది నిజమే నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నాను తను ఒక ఇండియన్ గర్ల్ అంతే కాదు నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటా ఇస్ ఇట్ క్లియర్ 🤷 అంటూ ఇద్దరి వైపు చూస్తాడు….
నీ మనసులో వేరే అమ్మాయి ఉన్నప్పుడు ఆ విషయం ముందే నాకు ఎందుకు చెప్పలేదు…. నీతో ఎంత క్లోజ్ అవుతున్నా ఎందుకు రెసిస్ట్ చేయలేదు టెల్ మీ రుద్రాన్ష్ అప్పుడే నువ్వు అప్పోస్ చేసుంటే ఇది ఇంత దూరం వచ్చేదా అని ఏడుస్తూ క్వశ్చన్ చేస్తుంది….
గర్ల్ & బాయ్ ఫ్రెండ్షిప్ ఇక్కడ కామన్ అండ్ వాళ్లకు ఎలాంటి బౌండరీస్ ఉండవు నిన్ను కూడా నేను ఫ్రెండ్ లా ఒక ప్యూర్ సోల్ లా లైక్ చేసా బట్ ఎపుడైతే నువ్వు నన్ను ఫ్రెండ్ లా చూడ్డం ఆపేశావో అపుడే నిన్ను దూరం పెట్టాను అది నువ్వు అర్థం చేసుకోకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది….
బట్ రుద్రాన్ష్ ఐ రియల్లీ…..!
గెట్ అవుట్ అంటూ డోర్ వైపు చెయ్ చూపిస్తున్న రుద్రాన్ష్ ను చూసి శ్రియ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోవడం చూసి ఆనంద్ కూడా కామ్ గా వెళ్ళిపోతాడు….. అది చూసిన రుద్ర సీట్ లో వెనక్కి వాలి కళ్ళు మూసుకోగానే తన కళ్ళ ముందు హర్ష హోల్డ్ మై హ్యాండ్ అంటూ ముద్దుగా అడుగుతున్న మాయ రూపం కనిపించగానే రుద్ర కళ్ళల్లో తెలియని పెయిన్….