Login with OTP

విలన్ హస్బెండ్-31

aashyatech

Author

కళ్ళు మూసిన రుద్రాన్ష్ కి తన కళ్ళ ముందు మాయ రూపం కనిపించగానే బాధగా కళ్ళు తెరిచి తన మొబైల్ లో ప్రెసెంట్ మాయ పిక్స్ స్క్రోల్ చేస్తూ ఐ నో నువ్వు కూడా నా లాగే ఇక్కడ నేను నిన్ను ఎలా మిస్ అవుతున్నానో అక్కడ నువ్వు కూడా అలాగే మిస్ అవుతూ ఉంటావ్ కదా పొట్టి ( మాయ చిన్నప్పుడు బాగా పొట్టిగా ఉండేది అందుకే రుద్ర మాయ ను ముద్దుగా అలా పిలిచే వాడు ప్రెసెంట్ కూడా మాయ ఆద్య తో కంపార్ చేస్తే కాస్త పొట్టిగానే ఉంటుంది అందుకే రుద్ర మాయ కి ఆ నేమ్ నే ఫిక్స్ అయ్యాడు) ……

కొన్ని సిచుయేషన్స్ వల్ల ఇన్ని ఇయర్స్ మీకు దూరంగా ఉన్నాను ఇక ఎవరి కోసం నేను ఆగిపోను మాయ…. మనం టీనేజ్ లో మిస్ అయిన లవ్ స్టోరీ ను నేను కొత్తగా క్రియేట్ చేసి నీతో మెమోరీస్ కలెక్ట్ చేసుకుంటాను అని మాయ పిక్ ను కిస్ చేస్తూ చిన్నప్పటి కంటే ఇప్పుడు ఇంకా క్యూట్ గా కనిపిస్తున్నావ్ 🤩🤩

నిన్ను డైరెక్ట్ గా చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నీకు ముద్దు పెట్టిన పెట్టేస్తాను అని శ్రియ వల్ల ఆఫ్ అయిన మూడ్ ను మాయ పిక్స్ చూస్తూ తనను తాను కాసేపటికి డైవర్ట్ చేసుకుని ఆనంద్ క్యాబిన్ కి కాల్ చేసి ఆనంద్ ను తన క్యాబిన్ కి రమ్మని కాల్ కట్ చేస్తాడు…..

రుద్రాన్ష్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూస్ మీ సర్ అని ‘ సర్ ‘ అన్న వర్డ్ స్ట్రెస్ చేసి పిలుస్తూ రుద్రాన్ష్ ముందు నుంచుని చెప్పండి సర్ అంటూ మళ్ళీ మామూలుగా పిలుస్తున్న ఆనంద్ వైపు యారోగెంట్ లుక్ ఇస్తూ ఇందాక ఎమ్ చెప్పానో అపుడే మర్చిపోయావా అని పేపర్ వెయిట్ ను టేబుల్ మీద రౌండ్ గా తిప్పుతూ సీరియస్ గా చూస్తూ అడుగుతాడు…..

( మీరు అనుకోవచ్చు ఇందాక ఆనంద్ మీద కోపంతో పేపర్ వెయిట్ ను వాల్ కి విసిరి కొట్టి ముక్కలు చేసాడు కదా అని 🥱 బట్ ఆనంద్ వెరీ సిన్సియర్ ఎంప్లాయ్ కాబట్టి రుద్రాన్ష్ కి తన క్యాబిన్ లో ఒక్కటి మిస్ అయినా ఆ చిరాకు, కోపం ఎంటైర్ ఆఫీస్ లో ఉన్న ప్రతీ ఒక్కరి మీద పడుతుంది అని ముందు జాగ్రత్త తో అలాంటి పీస్ నే ఆర్డర్ చేసి విత్ ఇన్ హాఫ్ ఆన్ అవర్ లో ఎక్సాక్ట్ ప్లేస్ లో పెట్టేస్తాడు…..)
సారి సర్ నేను మీకు ఎంప్లాయ్ ను మాత్రమే అందుకే మిమ్మల్ని అమర్యాదగా పిలిచి ఇన్సల్ట్ చేయలేను & మీరు కూడా నన్ను ఎంప్లాయ్ లాగే చూస్తున్నారు అని మీరు నాతో మీ పర్సనల్స్ షేర్ చేసుకొనపుడే నాకు అర్థం అయింది అందుకే నా లిమిట్స్ లో నేను ఉండాలని డిసైడ్ అయ్యాను…..

నార్మల్ వాయిస్ తో మాట్లాడుతున్నా అని ఆనంద్ అనుకుంటున్నాడు కానీ తన వాయిస్ లోని పెయిన్ స్పాట్ లో కనిపెట్టేసిన రుద్ర తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ పైకి లేచి ఆనంద్ ను ఒక్క సారిగా గట్టిగా హగ్ చేసుకోగానే ఎంత వద్దు అనుకుంటున్నా రుద్ర ఫ్రెండ్షిప్ ముందు ఓడిపోక తప్పలేదు ఆనంద్…..

రుద్రాన్ష్ వీపుకు చుట్టుకున్న ఆనంద్ చేతులను చూసిన రుద్ర నీ దగ్గర వాంటెడ్ గా దాచాలి అని నేను ఇది దాయలేదు ఆనంద్…. నీకు తెలిస్తే మన బ్యాచ్ మొత్తానికి నా సీక్రెట్ లవ్ రివీల్ చేస్తావ్ అది నాకు ఇష్టం లేదు అందుకే నేను ప్రేమిస్తున్న అమ్మాయి గురించి ఎక్కడ ఎవరికి ఎలాంటి క్లూ తెలియకుండా చాలా జాగ్రత పడుతూ వచ్చాను….. ఈవెన్ నా పేరెంట్స్ కి జస్ట్ ఒక్క సారి అది కూడా 3 ఇయర్స్ బ్యాక్ చూపించాను…..

వాళ్లకు తన నేమ్ తప్పా ఇంకే డిటైల్స్ చెప్పలేదు చెప్పాల్సిన సిచుయేషన్ వచ్చినా డాడ్ కి మాత్రమే చెప్తాను ఎందుకో నీకు కూడా తెలుసు & నీకు చెప్పకూడదు అని నేను అనుకోలేదు ఆనంద్ అలా అనుకుంటే నా ఇండియా ప్రోగ్రామ్ గురించి డాడ్ తర్వాత తెలిసింది నీకు మాత్రమే…..

నీకు తెలియకూడదు అని నేను నిజంగా అనుకుని ఉంటే నా వెంట నిన్ను ఇండియా తీసుకుని వెళ్ళను ఇప్పటికీ నేను నీ దగ్గర దాచి తప్పు చేశాను అనుకుంటే నన్ను సర్ అనే పిలువు అంటూ ఆనంద్ నుండి దూరం జరిగి దూరంగా వెళ్తున్న రుద్ర చెయ్ పట్టుకుని ఐ ఆమ్ సారి రుద్ర సడెన్ గా నువ్వు నీ లవ్ విషయం చెప్పేసరికి నా మైండ్ వర్క్ చేయలేదు ……

 

మొహాన్ని డల్ గా పెట్టుకుని చెప్తున్న ఆనంద్ ను చూసి చిన్న స్మైల్ ఇచ్చి కాసేపు ఆఫీస్ విషయాలు డిస్కస్ చేసాక హైదరాబాద్ వర్మ బ్రాంచ్ నుండి తమకు వచ్చిన కాల్ గురించి ఆనంద్ చెప్పగానే రుద్రాన్ష్ నవ్వుతూ గుడ్ వెంటనే టికెట్స్ బుక్ చేయ్ ఎల్లుండే మనం హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం అంటూ సడెన్ గా హైదరాబాద్ జర్నీ గురించి చెప్తున్న రుద్ర ను చూసిన ఆనంద్ షాక్ అవుతాడు…..

అదేంటి రుద్ర సడెన్ గా ఈ జర్నీ ఏంటి మనం వెళ్ళడానికి ఇంకా 5 డేస్ టైం ఉంది దట్ టూ ఇక్కడ మనం క్లియర్ చేయాల్సిన వర్క్స్ కూడా చాలా ఉన్నాయి….

అవన్నీ ఇవాళ, రేపు కంప్లీట్ అవ్వాలి ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ డాడ్ చూసుకుంటాడు…. 2 డేస్ ఇంటికి వెళ్లకపోయినా నష్టం లేదు 1 మినిట్ కూడా టైం వెస్ట్ చేయకుండా పెండింగ్ వర్క్ ఫినిష్ చేయి….

తను చెప్పాల్సింది చెప్పి సీట్ లో కూర్చుని వర్క్ చేస్తున్న రుద్ర ను చూసి తను ఏదైనా ఫిక్స్ అయితే ఇక ఎవరు చెప్పినా వినడు అని తెలుసు కనుక ఇంకేం మాట్లాడకుండా కామ్ గా తన క్యాబిన్ కి వెళ్ళి ఆనంద్ కూడా వర్క్ స్టార్ట్ చేస్తాడు…..

🤍💙🤍💙🤍💙🤍💙🤍💙🤍

జై తిరిగి హాల్ లోకి వచ్చేసరికి ఆద్య కూర్చున్న సోఫా లో తప్పా ఇంకెక్కడ ప్లేస్ లేకుండా రేణుక, శైలు శారీస్ చూస్తూ అన్ని సోఫాస్ లోనూ సారీ కవర్స్ పెట్టేసి ఉండడం చూసి విసుగ్గానే వెళ్ళి ఆద్య పక్కన సెటిల్ అవుతాడు జై ధీర్….

ఇందాక గార్డెన్ లో జరిగింది గుర్తు చేసుకుని జై ను చూసి నెర్వస్ ఫీల్ అవుతూ కామ్ గా కూర్చుంటుంది తప్పా ముందులా జై ను చూడగానే అరవకుండా సైలెంట్ అయిపోయిన ఆద్య ను చూసి ఏంటిది ఎప్పుడు నన్ను చూసినా కారం తిన్న కోతి లా ఎగురుతూ చెట్టు మీద వాళ్ళే కాకి లా కావ్… కావ్ అంటూ అరిచేది ఇప్పుడేంటి ఇంత సైలెంట్ గా కూర్చుంది అని ఆద్య వైపు చూస్తూ ఉంటాడు…..

జై ను గమనిస్తున్న ప్రతాప్ కి జై చూపులు మరోలా అర్థం అవ్వడం తో జై ఆద్య ను ఇష్టపడుతున్నాడు అని బ్రమ పడి వాళ్ళ వైపు సంతోషంగా చూస్తూ వీళ్ళను ఆ మిడిల్ గ్యాప్ కూడా వదలకుండా అతుక్కుని కూర్చునేలా చేయాలి కానీ ఎలా అంటూ ఆలోచిస్తున్న ప్రతాప్ కి తన పక్కనే కబోర్డ్ లో ఆయిల్ కనిపిస్తుంది….

ఆయిల్ బాటిల్ చూసిన ప్రతాప్ కి బుర్ర లో ఏదో ఆలోచన రాగానే ఈ వయసులో ఇలా చేయడం తప్పే కానీ నా మనవడి జీవితం కోసం తప్పడం లేదు స్వామి నన్ను క్షమించు అనుకుని ఎవరు చూడకుండా ఆ బాటిల్ తీసుకుని కామ్ గా అక్కడి నుండి కిచెన్ వైపు వెళతాడు…….

ప్రతాప్ అటు ఇటు చూసి కిచెన్ లో పాటలు పాడుతూ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్న కుమారి ను పిలిచి తన చేతిలో 10 తౌసండ్ రూపిస్ పెడుతూ ఎవరు చూడకుండా ఆద్య కాళ్ళ దగ్గర ఈ ఆయిల్ వేయమని చెప్పగానే డబ్బును చూసిన ఆనందం లో సరే సర్ అని చెప్పి తిరిగి కిచెన్ లోకి వెళ్ళి స్నాక్స్ ట్రే ను పట్టుకుని హాల్ లోకి వస్తుంది ఈ లోపే ఎవరికి డౌబ్ట్ రాకుండా ప్రతాప్ కూడా వచ్చి తను కూర్చున్న ప్లేస్ లో మళ్ళీ సెటిల్ అవుతాడు…….

కుమారి అందరికీ స్నాక్స్ ఇస్తున్నట్టు గానే ఆద్య, జై లకు కూడా ఇచ్చి ఎవరు చూడకుండా ఆద్య కాళ్ళ దగ్గర తను చీర కొంగులో దాచిన ఆయిల్ పోసి అక్కడి నుండి కామ్ గా వెళ్ళిపోతుంది…..

వీడేంటి వచ్చినప్పటి నుండి నన్నే చూస్తున్నాడు అని జై తనకు సైట్ కొడుతున్నాడు అని తిట్టుకుంటూ అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళడానికి పైకి లేచిన ఆద్య కరెక్ట్ గా ఆయిల్ మీద కాలు వేసి స్లిప్ అయ్యి పక్కనే ఉన్న జై మీద పడుతుంది….

నా చెల్లికి ఏదో ఒక స్టోరీ చెప్పి ఇక్కడి నుండి వీలైనంత త్వరగా అందరినీ తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం అని శ్వేత మాట్లాడుతూ ఇంట్లోకి అడుగు పెట్టిన మాదేష్, శ్వేత వాళ్లను చూసి నోరు తెరిచి చూస్తూ ఉంటారు 😳😲 మిగిలిన అందరిదీ కూడా అదే పరిస్థితి….

అబ్బా మంచి సీన్ మాయ మిస్ అయింది ఎక్కడ ఉంది మాయ అని చుట్టు మాయ కోసం చూస్తూ సోఫా లో ఒకరి మీద ఒకరు పడ్డ ఆద్య, జై లను ప్రతాప్ ఒక్కటే నవ్వుతూ చూస్తూ ఉంటాడు…. అమర్ కి తన స్టైల్ లో బుద్ధి చెప్పి ఇంట్లోకి వచ్చిన మాన్య కూడా వీళ్ళను చూసి షాక్ అవుతూ చూస్తుంటే ఇక్కడేదో కుచ్ కుచ్
హోతాహయ్ స్టార్ట్ అయ్యేలా ఉందే అనుకుంటూ ఇద్దరినీ చూస్తూ ఉంటుంది…..

ఎంటే నేనేమైనా నీకు బెడ్ లా కనిపిస్తున్నానా ఏంటి?? ఎపుడు పడితే అపుడు వచ్చి ఇలా మీద పడుతున్నావ్ !! నాకు కానీ పడిపోలేదు కదా అంటూ తన మీద పడ్డ ఆద్య వైపు కళ్ళు ఎగరేస్తూ అడుగుతున్న జై ను చూసి మరీ ఎక్కువ ఇమాజిన్ చేసుకోకు జస్ట్ స్లిప్ అయ్యాను అంతే అని జై మీద నుండి లేచి అందరి వైపు చూసి ఇబ్బందిగా నవ్వి జై కి దూరంగా జరిగి నుంచుంటుంది…..

తన వైపు చూస్తున్న అందరి వైపు చూసి అదీ స్లిప్ అయి పడ్డాను అని తన పాదానికి జిడ్డు అంటుకోవడం చూస్తూ అరే ఏంటిది ఆయిల్ లా ఉంది ఆయిల్ లఅయినా ఇక్కడ ఆయిల్ ఎవరు వేశారు అనుకుంటూ అదే విషయాన్ని శైలు ను అడుగుతుంది…..

శైలు కూడా అవును ఆయిల్ ఎలా పడింది అక్కడ మార్నింగ్ నే కదా ఇల్లు మొత్తం మాప్ పెట్టించాను అంటూ అనడం చూసిన ప్రతాప్ తీగ లాగితే డొంకంతా కదిలినట్టు వీళ్ళ వాలకం చూస్తుంటే ఆ పని అమ్మాయిని పిలిచి గట్టిగా అరిగారు అంటే ఆ అమ్మాయి భయపడి నేనే వేయించా అని చెప్పినా చెప్పేస్తుంది జాగ్రత్తగా కవర్ చేయాలి అనుకుని ఎలాగోలా పడుంటది ముందు అది క్లీన్ చేయించు శైలు దీనికి కూడా ఈ డిస్కషన్ దేనికి అని అక్కడితో టాపిక్ కట్ చేస్తాడు……
తన మీద పడ్డ ఆద్య ఫ్రాగ్రాన్స్ ఇంకా తన వంటిని వదిలి వెళ్ళక జై లో  వేడి ఆలోచనల్ని రప్పిస్తూ ఉంటే జై తన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నా తన వల్ల కావడం లేదు…… జై మొహం ఎర్రగా మారి చమటలు పడుతూ ఉంటే ఇక అక్కడ ఉండలేక టీ పాయ్ మీదున్న కీస్ తీసుకుని అంకుల్ అర్జెంట్ వర్క్ ఉంది ఐ వాంట్ టు గో బాయ్ అని శైలు కు కూడా చెప్పి అక్కడి నుండి ఫాస్ట్ గా వెళ్తున్న జై ను ఆద్య వియర్డ్ గా చూస్తూ ఉంటుంది……

ఆగకుండా వెళ్తున్న జై ను చూసిన మాదేశ్ మెదడు పాదరసం లా వర్క్ చేయడం తో వెనక్కి తిరిగి జై వైపు కన్నింగ్ స్మైల్ వదులుతూ పక్కకు వెళ్ళి 5 నిమిషాలు ఎవరికో కాల్ చేసి మాట్లాడి గెలిచిన గర్వం తో మళ్ళీ శ్వేత పక్కకు వచ్చి నుంచుని పదా వెళ్దాం అని లోపలికి తీసుకుని వస్తాడు…..

ఏమైంది వినయ్ సడెన్ గా జై ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నాడు ఇప్పటి వరకూ బానే ఉన్నాడు కదా అంటూ పక్కనే కూర్చున్న వినయ్ వైపు చూస్తూ అడుగుతున్న మహిదర్ ను చూసి ఆద్య మీద పడ్డందుకు ఏమైనా సీరియస్ అయ్యాడా అన్నయ్య అంటూ శైలు కూడా అడుగుతుంది…..

అయ్యో అదేం లేదు మహి నిజంగా వర్క్ ఉండే ఉంటుంది లేకపోతే అలా వెళ్ళడు కదా అని కొడుకు బిహేవియర్ చిరాకు తెప్పిస్తున్న అది కనిపించకుండా కవర్ చేస్తున్న వినయ్ వర్మ ను చూసి నవ్వుకుంటూ నమస్తే బావ గారు అని ఎంట్రీ ఇస్తాడు మాదేశ్ 🚫

సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన మాదేష్ ను చూసిన ప్రతాప్ వీడేంటి సడెన్ గా ఇక్కడికి వచ్చాడు అయినా మేము ఇక్కడ ఉన్నట్టు వీడికి ఎలా తెలిసింది….. ఓహ్ రేణుక ఉంది కదా వీడికి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది పని కట్టుకుని ఇక్కడికి వచ్చాడు అంటే ఏదో ఉంది అనుకుని మాదేష్ వైపు చూస్తూ ఉంటాడు…..

మాదేష్ ను చూసిన వినయ్ కూడా అంతే ఆశ్చర్యంగా చూస్తూ అరే మాదేష్ నువ్వు ఎప్పుడు వచ్చావ్ అని నవ్వుతూ రా…రా …. అక్కడే నుంచున్నావ్ ఏంటి అని శ్వేత ను చూసి నవ్వుతూ శ్వేత నువ్వు కూడా వచ్చావా కమ్ అంటూ ఇద్దరినీ నవ్వుతూ విష్ చేసి ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తాడు….

వినయ్ చూపించిన సోఫా లో కూర్చుంటున్న మాదేష్ ను అన్నయ్య అంటూ రేణుక వెళ్ళి హగ్ చేసుకుంటూ నవ్వుతూ తనతో మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన వినయ్ ఇది దీని పిచ్చి 🤦 అని అసహనంగా చూస్తూ అన్నట్టు మహి వాళ్ళు రేణుక అన్నయ్య, వదిన నీకు తెలుసు కదా??

ఆఫ్కోర్స్ వినయ్ వీళ్ళను ఎలా మర్చిపోతాను చెప్పు అని మాదేష్ వైపు చూస్తూ ఏంటి మాదేష్ ఎలా ఉన్నావ్ చూస్తుంటే బానే ఉన్నట్టు ఉన్నావ్ పైగా అప్పటికి ఇప్పటికీ కాస్త లావు కూడా పెరిగావ్ అని సర్కాస్టింగ్ గా అంటున్న మహీదర్ ను చూసి పైకి కోపంగా ఉన్నా అది కనిపించకుండా నవ్వుతూ మీరు మాత్రం అలాగే ఇప్పటికీ ఫిట్ గా ఉన్నారు మహిదర్ మిమ్మల్ని ఇక్కడ చూడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఏదైతే ఏంటి ఫ్రెండ్స్ ఇప్పటికీ కలిశారు అని నవ్వుతూ చెప్తాడు…..

హహ కలవడం మాత్రమే కాదు మాదేష్ ఇక ఎప్పటికీ విడిపోనంత దగ్గర కూడా ఉండాలి అనే కదా ఇక్కడికి వచ్చాను…. ఇక ఎప్పటికీ వినయ్ కి దూరంగా వెళ్ళను అని వినయ్ చేతిని చేతుల్లోకి తీసుకుని చెప్తున్న మహిదర్ అంతర్గతం తెలిసిన మాదేష్ పళ్ళు నూరుతూ చూస్తూ కూర్చున్నాడు…..

అది సరే మాదేష్ ఇంతకీ నీ కొడుకు ఇప్పటికీ కూడా గాలి తిరుగుళ్ళు తగ్గించుకుని మంచిగా జాబ్ చేస్తున్నాడా లేక ఇంకా బేవర్స్ గానే ఉన్నాడా?? ఇలా అంటున్నానని ఫీల్ అవ్వకు మాదేశ్ అని ఎర్రగా మారిన మాదేష్ మొహాన్ని చూస్తూ కావాలని అంటాడు మహిదర్……

ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది మహిధర్ ఉన్నదే కదా నువ్వు చెప్పింది వాడు అప్పట్లోనే సిగరెట్, మందు తాగుతూ ఉండే వాడు అలాంటి వాడు సడెన్ గా మారాడు అంటే నమ్మడానికి నీకు కూడా కష్టంగానే ఉంటుంది కానీ వాడు ముందులా లేడు వాడిలో చాలా చేంజెస్ వచ్చాయి అంతే కాదు మాదేష్ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాడే చూసుకుంటున్నాడు అని ముందు తిట్టి తర్వాత పొగిడి మాదేష్ ను కన్ఫ్యూస్ చేస్తాడు ప్రతాప్…..

అవునా అంకుల్ పర్వాలేదే బానే బుద్ధి వచ్చింది ఇంతకీ నీ కొడుకు కి పిల్లలు ఎంత మంది మాదేష్?? నీకు కూతురు కూడా ఉంది కదా మొన్న పార్టీ లో చూసాను తనకు మ్యాచెస్ చూస్తున్నారా??

వీళ్ళ కాన్వర్జేషన్ వింటున్న ఆద్య, మాన్య ఉఫ్ 🤦 ఎంటే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు ఇంతకీ మాయ ఎక్కడ?? మార్నింగ్ నుండి తనతో సరిగ్గా టైమ్ స్పెండ్ చేయలేదు పదా తన దగ్గరకు వెళ్దాం అని మాన్య ను లాక్కుని ఆద్య గార్డెన్ వైపు వెళ్తుంది…..

హరీష్ కి అపుడే మ్యారేజ్ అవ్వడం ఏంటి మహిదర్ గారు వాడిది ఇంకా జై ఏజ్ నే & హరీష్ కి మాయ కి త్వరలో మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నాం అని చెప్తున్న రేణుక ను చూసి మహిదర్ , శైలు షాక్ అవుతూ వినయ్ వైపు చూడగా ప్రతాప్ ఏదో అనబోతు ఉంటే వినయ్ ఇక్కడ గొడవ వద్దు నాన్న అని మెల్లగా చెప్పడం తో తన కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేస్తాడు ప్రతాప్….

జై స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ తన ఫ్లాట్ కి వెళ్తూ తన ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసి తను ఫ్లాట్ కి వెళ్ళేసరికి తనను రమ్మని కాల్ కట్ చేసి కార్ స్పీడ్ మరింత పెంచి వాచ్ మెన్ దగ్గర కీస్ తీసుకుని తన ఫ్లాట్ కి వెళ్ళి తన గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ వైన్ సిప్ చేస్తూ ఉంటాడు….

హాఫ్ ఆన్ అవర్ తర్వాత తన కాలింగ్ బెల్ సౌండ్ వినిపించి చేతిలో గ్లాస్ అలాగే పట్టుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన జై కి షోల్డర్ స్టాప్స్ బ్లాక్ మినీ డ్రెస్ లో సెక్సీ గా కనిపిస్తుంది హరిణి…. తనను చూసిన జై ఏయ్ నువ్వేంటే ఇక్కడ అని అడుగుతున్న జై ను బావా అంటూ వచ్చి హగ్ చేసుకుంటూ యూ నో వాట్ ఆ రోజు మిస్ అయ్యావ్ బట్ ఇవాళ అసలు అవ్వనివ్వను అని జై కి ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వకుండా జై ఏదో చెప్తుంటే నో టాక్స్ బావా ఓన్లీ రొమాన్స్ అని జై షర్ట్ బటన్స్ ఒక్కోటి తీస్తూ షర్ట్ పక్కకు విసిరి జై హార్ట్ మీద కిసెస్ ఇస్తూ జై లో తాపాన్ని పెంచుతుంది…..

ముందే హై ఫీలింగ్స్ లో ఉన్న జై కి హరిణి ఇస్తున్న కిసెస్ కి బ్లడ్ ఒక్క సారిగా బాయిల్ అవ్వడం తో లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ తో డోర్ లాక్ చేసి రైట్ హ్యాండ్ తో తనను లిఫ్ట్ చేసి బుజం మీద వేసుకుని లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న వైన్ గ్లాస్ ఫినిష్ చేసి హరిణి ను ఎత్తుకుని డైరెక్ట్ గా బెడ్ రూమ్ లోకి వెళ్ళి తనను బెడ్ మీద కు విసరగానే హరిణి నవ్వుతూ జై వైపు చూస్తూ ఉంటుంది…… జై తన డ్రెస్ రిమూవ్ చేసి బెడ్ రూమ్ డోర్ లాక్ చేసి ఇవాళ నీకు నరకమే అని సైడ్ స్మైల్ తో చెప్పడం చూసి అప్పటి వరకు నవ్వుతున్న హరిణి కి భయం పుట్టి బెడ్ దిగబోతున్న తనను ఆపి హరిణి మీదకు చేరి ఇద్దరికీ బెడ్ షీట్ కప్పేశాడు జై…..

హీరో – హీరోయిన్ మధ్య లవ్ పుట్టడానికి టైమ్ పడుతుంది 🫠🫠 మన హీరో లో నెగెటివ్ షేడ్స్ ఎక్కువ సో అవి పోవాలి అంటే కాస్త వెయిట్ చేయాలి & జై ఎప్పుడు చేంజ్ అవుతాడు అంటే అది మీరు పేషెన్స్ తో వెయిట్ చేయాలి అనే చెప్తాను…. హీరోయిన్ ఎంటర్ అవ్వగానే జై చేంజ్ అయితే క్యారెక్టర్ కి పెద్ద ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే అక్కడ ఉన్నది జై 😈 హోప్ మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా 🥱🫣 స్టే ట్యూన్ టు బ్రోకెన్ హార్ట్స్ 💔💔