Login with OTP

విలన్ హస్బెండ్-32

aashyatech

Author

రేణుక చెప్పింది విన్న మహిదర్, శైలు వినయ్ వర్మ వైపు షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ తో చూస్తూ వినయ్ ఏంట్రా రేణుక చెప్తుంది నిజమా మాదేష్ కొడుకు తో మన మాయ కి మ్యారేజ్ ఫిక్స్ చేసారా అంటున్న మహీదర్ ను చూసి యాక్చుయల్లీ రేణు హరీష్ మాయ లకు పెళ్లి చేయాలి అని ఎప్పటి నుండో అనుకుంటుంది మహి & హరీష్ కి కూడా మాయ అంటే ఇష్టం సో అందుకే రేణు వాళ్లకు మ్యారేజ్ చేయాలి అనుకుంటుంది…..
వాట్ అబౌట్ మాయ?? తనకు కూడా హరీష్ అంటే ఇష్టమేనా…. ఈ విషయం గురించి నాతో ఎప్పుడు నువ్వు చెప్పలేదు ఎందుకు రా??

మర్చిపోయి ఉంటారు మహిదర్ గారు నిజం చెప్పాలి అంటే జై హరిణి & మాయ హరీష్ ల మ్యారేజ్ ఒకే రోజు చేయాలి అని కూడా ప్లాన్ చేస్తున్నాం….. సో చూడాలి మాయ స్టడీస్ అయ్యాక మ్యారేజ్ చేస్తాం బట్ ఎంగేజ్మెంట్ మాత్రం కాస్త ముందే చేయాలి అని చూస్తున్నాం అంటూ నవ్వుతూ చెప్తుంది రేణుక….

మాయ మ్యారేజ్ గురించే షాక్ అవుతున్న వీళ్ళకు జై మ్యారేజ్ గురించి తెలిసి మరింత షాక్ అవుతారు…. వీళ్ళు ఇలా ఉండగానే మాదేష్,శ్వేత లను తీసుకుని డైనింగ్ ఏరియా కి వెళ్ళిన రేణుక ఇద్దరికీ దగ్గర ఉండి లంచ్ సర్వ్ చేస్తూ ఉంటుంది…..

నేను అడిగిన దానికి అన్సర్ ఇవ్వవేంటి వినయ్ నిజంగా వాళ్లకి మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నావా మరి జై కి మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు అని. చెప్పావ్ ఏంట్రా ఈ కన్ఫ్యూషన్??

మహి నిజంగా నా కొడుకు, కూతురు కి మ్యారేజ్ చేయాలి అనుకుంటే దాని గురించి నీతో చెప్పకుండా ఉంటానా!! కేవలం రేణు కి మాత్రమే మాయ మ్యారేజ్ హరీష్ తో జరగాలి అని ఇష్టం తప్పా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు మెయిన్ గా మాయ కి కొంచెం కూడా ఇష్టం లేదు అదే విషయాన్ని ఇపుడు చెప్పి రేణు తో ఆర్గ్యూ చేసి గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మనం చాలా ఇయర్స్ తర్వాత మీట్ అయ్యాం ఈ హ్యాపీనెస్ ను నేను స్పాయిల్ చేయాలి అనుకోవడం లేదు సో లీవ్ ఇట్…..

రేణు ను చూస్తుంటే వాళ్లకు మ్యారేజ్ జరిపించే దాకా ఊరుకునేలా లేదు వినయ్….. నువ్వు ఒక సారి గట్టిగా చెప్పాల్సింది అయినా హరీష్ మీద నాకు గుడ్ ఒపీనియన్ కూడా లేదు వాడు చిన్నప్పుడే రౌడీ లా ఉండే వాడు అలాంటి వాడితో మాయ పెళ్లేంట్రా??

మనిషిని ఒక సారి చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయకూడదు మహి హరీష్ చిన్నప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అన్నీ దగ్గరుండి వాడే చూసుకుంటున్నాడు బట్ జై చిన్నప్పుడు ఎంత మంచిగా చదివే వాడు ఇల్లు , స్కూల్ తప్పా ఎమ్ తెలియదు అనుకునే వాళ్ళం బట్ నౌ అంటూ ఆపేసిన వినయ్ ను చూసి జై గురించి వినయ్ ఏదో హైడ్ చేస్తున్నాడు అదేంటో అంకుల్ ను అడగాలి అనుకుని అక్కడితో టాపిక్ డైవర్ట్ చేస్తాడు మహిదర్….

🤍💙🤍💙🤍💙🤍💙🤍💙🤍

 

రేయ్ అన్నయ్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ అంటే చెప్పకుండా ఆడపిల్లలా ఈ ఏడుపు ఏంట్రా అని అమర్ ను 26 వ సారి ఏమైందో చెప్పు అని అడిగి విసిగిపోయిన మాయ విసుగ్గా అమర్ వైపు చూస్తూ అరుస్తుంది…..

నా ఏడుపు నీకు కామెడీ అయిపోయింది కదా అని ముక్కు చీదుతూ అంతా ఆ రాకాసి వల్లే నాకు ఈ దుస్థితి వచ్చింది దాని పని నేను లేచాక చెప్తా దెబ్బ మీద దెబ్బ కొట్టింది అది అని మాన్య ను తిట్టుకుంటూ మాయ హెల్ప్ తో అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటాడు…..

నువ్వు మాన్య ఏమైనా మళ్ళీ గొడవ పడ్డారా?? నీకు అసలు బుద్ధి లేదు అన్నయ్య ఒక వైపు మాన్య ను లవ్ చేస్తూ మరో వైపు ఎప్పుడు చూడు తనతో గొడవ పడుతూ ఉంటావ్ ఇలా అయితే మీ మధ్య పుట్టేది ప్రేమ కాదు పగ 🤦 ఎన్ని సార్లు చెప్పాలి నీకు మాన్య తో గొడవ పెట్టుకోవద్దు అని అయినా వినవేంటి నువ్వు ??

అబ్బా ఆపు మాయ నేను కావాలని ఆ డెవిల్ తో పెట్టుకోలేదు అదే నన్ను గెలికింది & యూ నో వాట్ ఆద్య వాళ్ళ ఇంట్లో మెయిడ్ ఉంది కదా తనను నేను లవ్ చేస్తున్నా అని ఆ అమ్మాయికి ఏదో స్టోరీ చెప్పి తనను నా మీదకు డైవర్ట్ చేసి ఇది మూవీ చూసినట్టు చూస్తోంది….. అది అడగడానికి వచ్చిన నన్ను ఇదిగో ఇలా కొట్టి పడేసింది ఆ రాక్షసి ఎక్కడ కొట్టకూడదో అక్కడే కొట్టింది దెయ్యం దాన్ని నేను ఊరికే వదలను అని పళ్ళు నూరుతూ చెప్తాడు అమర్…..

నిజంగా ఆ విషయం అడగడానికే వచ్చావా అన్నయ్య 😏 నాకు ఎందుకో తేడాగా ఉంది 🤷 నిజం చెప్పు మాన్య తో ఎమ్ అన్నావ్ అసలు మీ మధ్య ఎమ్ జరిగింది?? అబద్దం మాత్రం చెప్పకు?? చెప్తే మాత్రం నీ లవ్ కి నేను అసలు హెల్ప్ చేయను తర్వాత నీ ఇష్టం??

చీచీ!! అందరూ నన్ను బ్లాక్ మెయిల్ చేసే వాళ్లే ఇంట్లో కుక్క ఉంది నేను ఉన్నాను అని తనను తాను మనసులో తిట్టుకుంటూ కూర్చున్న అమర్ మొహం ముందు చిటికె వేస్తూ హలో సర్ మిమ్మల్నే మాన్య కొట్టే వరకూ ఎందుకు తీసుకుని వచ్చావ్?? తనతో ఎలా బిహేవ్ చేశావో అది చెప్పు??

నీకు అన్ని నీ అన్న జై క్వాలిటీస్ నే వచ్చాయి మాయ నా కర్మ కొద్దీ అనగానే మాయ సీరియస్ లుక్స్ ఇవ్వడం చూసి 😁😁 హిహి అదే మాయ నా లక్ కొద్దీ ఇక్కడ ఉన్నారు కానీ లేదా సి. బీ. ఐ. లో ఉండే వాళ్ళు…..!!

సోప్ వేయకుండా విషయం చెప్పు అన్నయ్య అంటున్న మాయ ను చూసి కనీసం కవర్ చేయడానికి కూడా నాకు ఇవ్వరు మీ అన్నా చెల్లెళ్ళు నా కర్మ 🤦😬 అనుకుని నిజానికి దాన్ని అడగడానికే వచ్చాను మాయ కానీ మాన్య ను అంత దగ్గరగా చూసేసరికి నా హార్మోన్స్ నాలో తిలానా డాన్స్ చేసి మాన్య ను కిస్ పెట్టే వరకూ తీసుకుని వెళ్ళాయి…..

సిగ్గు పడుతూ చెప్తున్న అమర్ ను చూసి మాయ షాక్ అవుతూ నోరు తెరిచి చూస్తూ అంటే కిస్ పెట్టేసావా?? కిస్ ఒకటేనా ఇంకా అడ్వాన్స్ అయిపోయావా ప్రపోజ్ కూడా చేయలేదు అపుడే చాలా దూరం వెళ్లినట్టు ఉన్నారు 😏

నీ ఓన్ స్క్రిప్ట్ నువ్వు రాయకుండా నేను చెప్పేది కాస్త వింటావా 🤦 నువ్వు అనుకున్నంత సినిమా అక్కడేం జరగలేదు…. నా బ్రతుక్కి కిస్ కే దిక్కులేదు ఇంకా అడ్వాన్స్ కూడానా 🤧 అయినా అక్కడుంది అమ్మాయి కాదు అమ్మోరు దాంతో సరసం కూడా సాహసమే అంటూ చెప్తున్న అమర్ ను చూసి మాయ చెయ్ అడ్డు పెట్టుకుని నవ్వుతుంది…..

అబ్బా నవ్వుకు మాయ అని ఉడుక్కుంటూ అయినా చూస్తూ ఉండు ఇంతకు ఇంతా దాని మీద రివెంజ్ తీర్చుకోక పోతే నా పేరు అమర్ నే కాదు…..

హు 😏 నీ లైఫ్ మొత్తం రివేంజ్ ల తోనే అయిపోయేలా ఉంది అన్నయ్య 🤷 నీ ప్రేమ పేజ్ ను ఎపుడు స్టార్ట్ చేస్తావ్ దాన్ని పెళ్ళి వరకూ ఎలా లాక్కుని వెళ్తావు??

దానికి మా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అని నవ్వుతున్న అమర్ వైపు డౌబ్ట్ గా చూస్తూ ఏంటిది అని అడుగుతున్న మాయ కి తన ప్లాన్ చెప్పే లోపే ఆద్య, మాన్య రావడం తో మళ్ళీ చెప్తా అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు అమర్….

హేయ్ మాయ ఇక్కడేం చేస్తున్నావ్?? నీ కోసం మొత్తం వెతుకుతున్నా మార్నింగ్ నుండి నీతో మాట్లాడడానికి కూడా టైం కుదరడం లేదు పదా కాసేపు మాట్లాడుకుందాం అని అడుగుతుంది ఆద్య…..

అలాగే వదిన అంటూ అన్నయ్య నువ్వు కూడా లోపలికి పదా అంటూ అమర్ చెయ్ పట్టుకుని మాయ లోపలికి నడుస్తూ ఉంటే మాన్య అమర్ ను చూసి నవ్వుకుంటూ ఆద్య, మాయ తో నవ్వుతూ మాట్లాడుతూ హాల్ లోకి వస్తుంది….

హాల్ లో కనిపించని జై గురించి అమర్ ఆద్య ను అడగ్గానే ఏదో అర్జంట్ వర్క్ అని మోషన్ వస్తున్న వాడిలా వెళ్ళిపోయాడు అని నవ్వుకుంటూ చెప్పి మాన్య, మాయ లతో సోఫా లో సెటిల్ అవుతుంది ఆద్య…..

అంత అర్జంట్ వర్క్ ఏంటి అని ఆలోచిస్తూ జై కి కాల్ చేసిన అమర్ కి జై మొబైల్ స్విచ్ ఆఫ్ రావడం తో ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అని నుదురు రుద్దుకుంటూ వెంటనే నాన్సీ కి కాల్ చేస్తూ బయటకు నడుస్తాడు…..

ఆద్య తో నవ్వుతూ మాట్లాడుతూ వదిన టుమారో ఈవెనింగ్ షాపింగ్ కి వెళ్దాం నా కాలేజ్ అవ్వగానే డైరెక్ట్ గా మాల్ కి వచ్చేస్తా మీరు కూడా డైరెక్ట్ గా షార్ప్ 6 కి వచ్చేయండి షాపింగ్ తర్వాత డిన్నర్ కూడా బయటే చేద్దాం….

సరే వస్తాను కానీ నువ్వు మాత్రం నీ గున్న ని అదే నీ అన్న ను తీసుకుని రాకు వాడు వచ్చాడు అంటే నా మూడ్ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది….

హహా ఒకే వదిన నేను ఒక్కటే వస్తాను & మాన్య నువ్వు కూడా కన్ఫర్మ్ గా రావాలి ఎలాగో విలేజ్ కి అందరం వెళ్తున్నాం కాబట్టి కాస్త ట్రెడిషనల్ వేర్ షాప్ చేయాలి అని మాట్లాడుతూ ఉన్న మాయ సడెన్ గా రేణుక తో అక్కడికి వస్తున్న మాదేష్ ను చూసి షాక్ అవుతూ పైకి లేచి వెళ్ళి ప్రతాప్ పక్కన కూర్చుని తాతయ్య వీళ్ళు ఎపుడు వచ్చారు అని అసహనంగా & అంతే షాకింగ్ గా అడుగుతుంది….

చాలా సేపే అవుతుంది అని అంతే మెల్లగా అన్సర్ చేసి మీ మావయ్య ఇపుడు నిన్ను చూడగానే తెగ యాక్ట్ చేస్తాడు చూడు అని చెప్తున్న ప్రతాప్ ను చూసి మాదేష్ వైపు చూస్తూ ఉంటుంది మాయ….

మాదేశ్ కూడా అప్పుడే మాయ ను చూసి అరే చిట్టి తల్లీ నా బంగారం ఎలా ఉన్నావ్ రా అంటూ మాయ ను పైకి లేపి మరీ హగ్ చేసుకుంటూ తల నిమురుతూ ప్రతాప్ చెప్పినట్టు యాక్టింగ్ లా కాకుండా క్యారెక్టర్ లో జీవిస్తూ మరీ తెగ ప్రేమ కురిపిస్తున్న మాదేష్ నుండి దూరం జరుగుతూ ఫైన్ మావయ్య హౌ ఆర్ యూ?? ఎపుడు వచ్చారు ఇండియా అని నార్మల్ గా విష్ చేస్తూ అడుగుతుంది…..

ఇవాళే వచ్చాను మాయ యూ నో ఇండియా లో ల్యాండ్ అవ్వగానే మా ఇంటికి కూడా వెళ్లకుండా మీ అందరినీ చూడాలి అని డైరెక్ట్ గా ఇటే వచ్చేసాను మీరంటే నాకు అంత ఇష్టం……

ఇష్టమా తొక్కా ఎక్కడ మమ్మీ కూడా చేంజ్ అవుతుందో అని భయపడి వచ్చుంటావ్ అనుకుని పైకి మాత్రం చిన్న స్మైల్ వదిలి సైలెంట్ గా ప్రతాప్ పక్కన కూర్చుంటుంది…..

మాయ ఇగ్నోరెన్స్ కి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ పక్కనే ఉన్న సోఫా లో కూర్చుని మాయ నీ కోసం ఇంటి దగ్గర హరీష్ వెయిట్ చేస్తూ ఉంటాడు పదా అందరం మా ఇంటికి వెళ్దాం ఇవాళ అక్కడే అందరికీ డిన్నర్ ప్లాన్ చేశాను అంటూ రేణుక స్టార్ట్ అవుదామా అని తనకు సైగ చేయగానే రేణుక అందరినీ తొందర పెడుతూ వెంటనే మాదేష్ ఇంటికి స్టార్ట్ అయ్యేలా చేస్తుంది…..

మాదేష్ వెళ్ళడానికి పైకి లేస్తూ ఫార్మాలిటీ కోసం మహిదర్ ఫ్యామిలీ ను కూడా తన ఇంటికి ఇన్వైట్ చేస్తాడు మహిదర్ కి ఇష్టం లేకపోయినా వినయ్ కూడా రిక్వెస్ట్ చేయడం తో డిన్నర్ కి వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు దాంతో ఆద్య , మాన్య కూడా వాళ్ళతో వెళ్ళడానికి తప్పక కదులుతారు…..

వీళ్ళను ఏదో ఫార్మాలిటీ కి పిలిస్తే వీళ్లేంటి నిజంగానే వస్తున్నారు 🤦 అయినా ఇది కూడా మంచిదేలే నా స్టేటస్ మహీదర్ కి చూపించడానికి ఇదే కరెక్ట్ టైమ్ డిన్నర్ టైం లో రేణుక తో మాయ ను మ్యారేజ్ కి ఒప్పించాలి అని మనసులో కన్నింగ్ ప్లాన్ అప్పటికి అప్పుడు రెడీ చేస్తాడు మాదేష్…..

మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అంకుల్ అని మెసేజ్ పంపిన మహిదర్ వైపు చూస్తూ ఒకే అని తిరిగి రిప్లై ఇచ్చి తనకు ఆఫీస్ లో వర్క్ ఉందని డైరెక్ట్ గా డిన్నర్ కి వస్తానని ప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోయాక అందరూ మాదేష్ ఇంటికి స్టార్ట్ అవుతారు….

కార్ ఎక్కబోతున్న మహీదర్ తన సెకండ్ మొబైల్ నుండి ఫస్ట్ మొబైల్ కి కావాలనే రింగ్ ఇచ్చి ఆఫీస్ లో అర్జంట్ వర్క్ ఆ!!! ఒకే ఇప్పుడే వస్తున్నా అని 5 మినిట్స్ ఫేక్ కాల్ మాట్లాడి మీరు వెళ్ళండి నేను నా వర్క్ అయ్యాక మీతో జాయిన్ అవుతాను & లోకేషన్ నాకు షేర్ చేయండి అని అందరినీ అక్కడి నుండి పంపేసి ప్రతాప్ కోసం హాల్ లో వెయిట్ చేస్తూ కూర్చుంటాడు…..

త్వరగా వర్క్ కంప్లీట్ చేసి వచ్చేయమని చెప్పి అందరూ కూడా 3 కార్స్ లో మాదేష్ ఇంటికి స్టార్ట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు…..

🤍💜🤍💜🤍💜🤍💜🤍💜🤍💜

తన ఫ్లాట్ లో తన పేరెంట్స్ గురించి & తన పాస్ట్ తలచుకుంటూ బాధ పడుతున్న నాన్సీ కి అమర్ నుండి కాల్ రావడం తో బుగ్గల మీద కు జారిన కన్నీటి చుక్కలను తుడుచుకుంటూ గట్టిగా బ్రీత్ తీసుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది….

హాయ్ అమర్ హౌ ఆర్ యూ?? సో లాంగ్ టైం తర్వాత కాల్ చేసావ్?? ఏంటి విషయం అని ఎప్పటిలాగే తన బాధ ను తనలోనే సమాధి చేసుకుని పైకి హుషారుగా నవ్వుతూ మాట్లాడుతుంది నాన్సీ…..

గుడ్ నాన్సీ నువ్వెలా ఉన్నావ్…. విషయం అంటూ ఎమ్ లేదు జస్ట్ ఊరికే అలా కాల్ చేసాను హౌ ఇస్ యువర్ లైఫ్??

హ హా… డోంట్ లైస్ టు మీ అమర్ నువ్వు రీసన్ లేకుండా నాకు కాల్ చేయవు సో టెల్ మీ ఎందుకు కాల్ చేసావ్??

టు బీ హానెస్ట్ నేను జై గురించి అడగడానికి కాల్ చేసాను నాన్సీ బట్ నీ మాటలు చూస్తుంటే వాడు నీ దగ్గర లేడు అని అర్థం అయింది అందుకే ఇక ఆ విషయం అడగకూడదు అనుకున్నా జై నీకు ఏమైనా కాల్ చేసాడా నాన్సీ!!

లేదు అమర్ మార్నింగ్ బయట బ్రేక్ఫాస్ట్ చేసాక నన్ను ఫ్లాట్ లో వదిలి అర్జంట్ మీటింగ్ ఉందని హడావిడిగా వెళ్ళిపోయాడు తర్వాత నాకు టెక్స్ట్ కూడా చేయలేదు మే బీ బీసీ గా ఉన్నాడు అనుకుని నేను కూడా డిస్టర్బ్ చేయలేదు…. వాట్ హ్యాపెండ్ అమర్ ఎనీ థింగ్ రాంగ్???

నథింగ్ లైక్ దట్ నాన్సీ అర్జంట్ వర్క్ అని ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు అట సో ఐ థాట్ నీ దగ్గరకు వచ్చాడు అనుకుని నీకు కాల్ చేసాను….

ఓహ్ అవునా!! బట్ నా దగ్గరకు రాలేదు మే బీ ఆఫీస్ కి వెళ్ళాడేమో తన పి. ఏ. కి కాల్ ట్రై చెయ్ అమర్??

యాహ్ ఇపుడే చేస్తాను ఒకే కాల్ యూ లేటర్ అని జై పి. ఏ. కి కాల్ చేసినా జై అక్కడికి రాలేదు అని చెప్పడం తో జై వాళ్ళ ఇంటికి ఇంకా తన క్లోజ్డ్ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తాడు బట్ ఎవరూ రాలేదు & మాకు తెలియదు అని అన్సర్ ఇవ్వడం తో అమర్ మెదడులో వెంటనే తన ఫ్లాట్ స్ట్రైక్ అవ్వడం తో లేట్ చేయకుండా తన కార్ లో అక్కడికి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ గా జై ఫ్లాట్ కి వెళతాడు…..

జై మెయిన్ డోర్ లాక్ చేయకుండా ముందుకు అలా వేయడం వల్ల అమర్ ఓపెన్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది….. పార్కింగ్ ప్లేస్ లో జై కార్ చూసే పైకి వచ్చిన అమర్ కి ఫ్లాట్ లో లేడీస్ హీల్స్ తో ఒక అమ్మాయి మినీ డ్రెస్ ఫ్లోర్ మీద పడి కనిపించడం తో అమర్ కి కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడ జై ఒంటరిగా లేడని దాంతో మొహాన్ని అసహ్యంగా పెట్టుకుని జై ఎప్పుడు బయటకు వస్తాడా అని హాల్ లోనే వెయిట్ చేస్తున్న అమర్ కి 3 గంటల తర్వాత బెడ్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని ఓన్లీ బాక్సర్ మీద సిగరెట్ తాగుతూ హాల్ లోకి వస్తూ కనిపిస్తాడు జై!!