విలన్ హస్బెండ్ – 36
మాదేష్ ఎందుకలా సైలెంట్ గా ఉన్నావ్ నేను మన పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించే నా డెసిషన్ చెప్పాను & నాన్న చెప్పినట్టు పెళ్ళంటే ఇద్దరు మనుషులు కలవడం కాదు రెండు కుటుంబాలు కలవడం అండ్ ఇక్కడ నీ కొడుకు, కూతురు మాత్రమే మాయ జై లను పెళ్ళి చేసుకోవాలని ఆశ పడుతున్నారు బట్ మాయ, జై లు క్లియర్ గా చెప్పారు వాళ్ళంటే ఇష్టం లేదని , అలా మొహం మీదే ఇష్టం లేదు అని చెప్తుంటే మనం మాత్రం ఎలా పెళ్ళి చేస్తాం చెప్పు??
ఇప్పుడు తను ఆవేశ పడ్డం అసలు కరెక్ట్ కాదు అనుకుని తనకు వచ్చే ఆవేశాన్ని , కోపాన్ని అణుచుకుంటూ బావ వాళ్ళకు మ్యారేజ్ చేయాలని మనం ఇప్పుడు అనుకున్నది కాదు కదా వాళ్ళు చిన్నగా ఉన్నపుడే అనుకున్నాం మీరు కూడా ఒకే అన్నాకే నేను వీళ్ళ మ్యారేజ్ గురించి చాలా హోప్స్ పెట్టుకున్నా & హరిణి జై ను ఎంతలా లవ్ చేస్తుందో మన అందరికీ తెలుసు సేమ్ వే హరీష్ కూడా మాయ కోసం 3 ఇయర్స్ ఇంటికి దూరం అయ్యి తనేంటో ప్రూవ్ చేసుకుని ఇండియా వచ్చాడు ఇప్పుడు సడెన్ గా పెళ్లి జరగదు అంటే వాళ్ళు ఎంత బాధ పడతారో మీరు ఒక్క సారి థింక్ చేయండి అంటూ బాధ నటిస్తాడు మాదేష్……
మాదేష్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ ఇప్పుడు నీ పిల్లలు బాధ పడుతున్నారు అని నా పిల్లలకు నేను బలవంతంగా మ్యారేజ్ చేయను & చేయలేను ఎందుకంటే ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుని మన పిల్లలు మన కళ్ళ ముందు బాధ పడుతూ ఉంటే మనం మాత్రం ఎలా హ్యాపీగా ఉంటాం?? సో లైఫ్ లాంగ్ ఇష్టం లేని రిలేషన్ లో బాధ పడ్డం కంటే ఇప్పుడు బాధ పడ్డ కొంచెం ట్రై చేస్తే వీళ్ళు త్వరగానే మూవ్ అవుతారు సో మ్యారేజ్ గురించి వీలైనంత త్వరగా మర్చిపోండి అది మన అందరికీ మంచిది….
మీరు చాలా ఈజీగా చెప్పేశారు బావ ప్రేమించిన మనిషిని మర్చిపోవడం అంత సులభంగా ఎమ్ ఉండదు అయినా దీని గురించి మీకు మాత్రం తెలియదా?? సంధ్య చనిపోయి ఇన్ని ఇయర్స్ అవుతున్నా ఇప్పటికీ తనను గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాంటిది వీళ్ళు ఎలా మర్చిపోగలరు చెప్పండి??
మాదేష్ నువ్వు కూడా ఏంటి నా విషయం వేరు తను నా భార్య ప్రాణానికి ప్రాణం గా ప్రేమించిన అమ్మాయి అందులోనూ తనతో నేను ఎంతో సంతోషంగా లైఫ్ లీడ్ చేసాను బట్ వీళ్ళు అలా కాదు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు కాబట్టి తీరగానే మర్చిపోతారు….. పిల్లలు పుట్టాక చాలా అనుకుంటాం అన్ని మనం అనుకున్నట్టు జరగాలి అని లేదు ఇక్కడితో ఈ టాపిక్ వదిలేయండి అని రేణుక వైపు చూసి లెట్స్ మూవ్ రేణు అంటూ రేణుక ను బలవంతంగా అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఆగి అందరి వైపు చూస్తాడు…..
అందరూ చాలా డల్ గా ఉండడం గమనించి ఇంకో వీక్ లో మేము అందరం అమ్మ విలేజ్ కి వెళ్తున్నాం మహి కూడా తన ఫ్యామిలీ తో వస్తున్నాడు కావాలంటే మీరు రావచ్చు కొంచెం మీకు కూడా చేంజ్ కావాలి కదా ఈ టెన్షన్స్ అన్నీ వదిలి హ్యాపీగా విలేజ్ ను ఎక్స్ప్లోర్ చేస్తూ కొన్ని రోజులు అన్ని మర్చిపోదాం లెట్స్ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి మాదేష్ , రేణుక అక్కడి నుండి తమ ఇంటికి స్టార్ట్ అవుతారు….
వాళ్ళు వెళ్ళే వరకూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న మాదేష్ వాళ్ళు వెళ్లగానే హాల్ లో ఉన్న క్యాస్ట్లీ ఫర్నీచర్ మొత్తం నేల కేసి కొడుతూ ఇన్ని ఇయర్స్ నేను దేని గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నానో అది నా చేతికి వచ్చేసరికి ఆ జై దాన్ని అందకుండా దూరం చేశాడు వాడు నాకు ప్రతీ విషయం లో అడ్డొస్తూ నన్ను అవమిస్తున్నాడు వాడ్ని చంపేస్తే తప్ప నాకు మనశ్శాంతిగా ఉండదు అని ఆవేశంగా అరుస్తాడు మాదేష్…..
డాడ్ ఏంటిది అని మాదేశ్ కోపాన్ని ఆపడానికి ట్రై చేస్తున్న హరీష్, హరిణి లను పక్కకు తన కోపాన్ని మొత్తం ఫర్నీచర్ మీద చూపిస్తూ దాన్ని ముక్కలు ముక్కలు చేసి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ కోపంగా కౌచ్ లో కూర్చున్న మాదేష్ వైపు చూసిన శ్వేత ఏంటండీ ఈ ఆవేశం వాళ్లకు ఇష్టం లేదు అని మొహం మీదే చెప్తుంటే సిగ్గు లేకుండా సంబంధం గురించి ఎలా మాట్లాడతాం జరిగింది ఏదో జరిగింది ఇక మీరు కూడా దాని గురించి వదిలేయండి అంటూ మాదేష్ ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది…..
షట్ అప్ శ్వేత అసలేం మాట్లాడుతున్నావ్ నువ్వు అని ఆవేశంగా పైకి లేచి అంత ఈజీగా మర్చిపోవడానికా నేను ఇంత కష్టపడింది నా 27 సంవత్సరాల కష్టం ఇది ఆ జై వల్ల నా కలలు అన్ని కలలుగా మిగిలిపోతున్నాయి అంటే దీనికి నేను ఎప్పటికీ ఒప్పుకోను …… ఆ అస్థి మొత్తం నా చేతికి రావాలి అప్పుడే ఇన్నాళ్లూ నేను పడ్డ కష్ట పడడానికి ప్రతిఫలం ఉంటుంది అయినా చూస్తూ చూస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలను ఎలా వదులుకోమంటావ్ ఇందుకేనా నేను ఇన్ని ప్లాన్స్ వేసింది అంటూ శ్వేత వైపు కోపంగా చూస్తూ ఈ ఆస్తి కోసమే సొంత బావ అని కూడా చూడకుండా ఆ వినయ్ కి యాక్సిడెంట్ జరిగి చైర్ లో పెర్మనెంట్ గా కూర్చునేలా చేసాను ఆస్తి కోసం బావ నే రేణుక ను చంపడానికి కూడా నేను రెడీ అనగానే ముగ్గురూ షాక్ అవుతూ వాట్ అంటూ ఒకే సారి రియాక్ట్ అవుతారు…….
ఏంటీ షాక్ అయ్యారా అని ముగ్గురి వైపు చూస్తూ అసలు రేణుక కి వినయ్ తో మ్యారేజ్ చేసిందే వాడి ఆస్తి కోసం ఇన్నాళ్లు కుక్క లా వాడు చెప్పిన ప్రతీది చేస్తూ మాటకు ముందు మాటలు చివరా బావ గారు…… బావ గారు…… అని రెస్పెక్ట్ ఇస్తూ వాడికి భజన చేస్తోంది వాడి మీదున్న గౌరవం తో కాదు వాడి వెనుక ఉన్న ఆస్తి కోసం…… వాడి ఆస్తి మీద నా కన్ను పడ్డప్పుడే డిసైడ్ అయ్యాను ఎలాగైనా అది నా సొంతం కావాలని అందుకే మాస్టర్ ప్లాన్ వేసి మరీ ముందు ఆ సంధ్య ను యాక్సిడెంట్ పేరు తో చంపేసి పాట్నర్ ర్షిప్ పేరు తో వాడి ఫ్యామిలీ కి దగ్గర అయ్యి రేణుక తో పెళ్ళికి ఒప్పించి నాకు ప్రతీ విషయం లో అడ్డొస్తున్న ఆ మహిదర్ కాన్సంట్రేషన్ డైవర్ట్ చేయడానికే ప్రతాప్ వైఫ్ శారద ను హార్ట్ ఎటాక్ పేరుతో చంపేశాను……
వినయ్ విషయం లోనూ అంతే నాకు అడ్డొస్తున్నాడు అనే చంపేయాలి అనుకున్నా కానీ లాస్ట్ మినిట్ లో ప్లాన్ లో కొన్ని చేంజెస్ చేసి వాడ్ని వీల్ చైర్ కి పరిమితం చేసా అని క్రూరంగా నవ్వుతూ ఇంత మందిని మోసం చేసింది ఆ అస్థి కోసం అలాంటి అస్థి ని నేను వదులుకోవడమా నెవెర్ ఎమ్ చేసైనా సరే ఆ ఇద్దరినీ ( జై, మాయ) నా ఇంటికి కోడలు, అల్లుడి గా చేసుకోవాలి చేసుకుంటాను అని స్థిరంగా చెప్తాడు…..
మాదేష్ ఎప్పుడు తను పాస్ట్ లో చేసిన విషయాల గురించి హరిణి , హరీష్ ల ముందు డిస్కస్ చేయకపోవడం తో మాదేష్ గురించి తన మాటల్లో తెలుసుకున్న వీళ్ళకు 5 నిమిషాలు పడుతుంది షాక్ నుండి తేరుకోవడానికి ముందుగా తేరుకున్న హరీష్ బట్ డాడ్ వాళ్ళకు మేము అంటే ఇష్టం లేదు అని క్లియర్ గా చెప్పారు కదా మరి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలా మ్యారేజ్ చేసుకుంటారు??
మిమ్మల్ని చేసుకోను అని చెప్పిన వాళ్ళ నోటి తోనే మీతో మ్యారేజ్ కి ఒప్పుకునేలా నేను ప్లాన్ చేస్తాను అప్పటి వరకు మీ ఇద్దరూ ఆ ఇద్దరితో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళతో జస్ట్ ఫ్రెండ్స్ లా మూవ్ అవ్వండి చాలు…… మీరు చేంజ్ అయ్యారు అని పూర్తిగా వాళ్ళు నమ్మాలి ముఖ్యంగా ఆ జై వాడు చాలా ఇంటెలిజెంట్ కాబట్టి వాడ్ని మనం నమ్మిస్తే చాలు ఆ ఫ్యామిలీ ను మ్యానేజ్ చేయడం పెద్ద కష్టం కాదు…..
మీరు వాళ్లకు సారి చెప్పి జస్ట్ ఫ్రెండ్స్ లా ఉందాం అని మీరు మారిపోయినట్టు కలరింగ్ ఇవ్వండి చాలు మిగతా కథ మీ వెనుక నుండి నేను నడిపిస్తాను అని సైకిక్ గా నవ్వుతూ రేయ్ జై నన్నే దూరం పెట్టాలి అని చూస్తావా చూస్తూ ఉండు నిన్ను నీ ఆస్తి ని ఎలా నా గుప్పిట్లోకి లాక్కుంటానో నా నుండి ఎవడ్రా మిమ్మల్ని సేవ్ చేసేది అని క్రూరంగా నవ్వుతూ తన ప్లాన్ ముగ్గురికి క్లియర్ గా ఎక్స్ప్లైన్ చేస్తాడు మాదేష్…..
🤍💚🤍💚🤍💚🤍💚🤍💚🤍
ఎవడో ఎందుకు రా నేనున్నా కదా నీకు ఇష్టం లేకుండా మ్యారేజ్ జరగదు ఒకే….!! నువ్వు ఇంకేం థింక్ చేయకు జస్ట్ కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ ఇంట్లో ఇంకెప్పుడు మ్యారేజ్ టాపిక్ తీయకుండా నేను చూసుకుంటాను వెళ్ళి రెస్ట్ తీసుకో మాయ 2 డేస్ నుండి ఆ దెయ్యాలతో తిరిగి బాగా టైడ్ అయ్యావ్ నీ ఫేస్ లో ఆ టైర్డ్నెస్ క్లియర్ గా కనిపిస్తుంది అని మాయ తన రూమ్ కి వెళ్ళమని చెప్తాడు జై….
మాయ కి కూడా ఇందాక జరిగిన గొడవకు & 2 డేస్ నుండి స్లీప్ కూడా బాగా తక్కువ అవ్వడం తో బాగా హెడ్ ఏక్ గా అనిపించడం తో యాహ్ అన్నయ్య ఫీలింగ్ స్లీపీ గుడ్ నైట్ అని సోఫా నుండి లేస్తూ తన రూమ్ కి వెళ్ళడానికి పైకి వెళ్తున్న మాయ కి ఆగు అంటూ ఇంట్లోకి రావడం తోనే గట్టిగా అరుస్తూ వస్తుంది రేణుక……
రేణుక వాయిస్ కి మొబైల్ చూసుకుంటున్న జై, తన రూమ్ వైపు వెళ్తున్న మాయ ఇద్దరూ గుమ్మం వైపు చూడగా వినయ్ ను వీల్ చైర్ లో లోపలికి తీసుకుని వస్తూ సీరియస్ గా చూస్తూ కనిపిస్తున్న రేణుక ను చూసి ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని రేణుక వైపు చూస్తారు…..
వినయ్ ను తీసుకుని వచ్చి హాల్ లో వదులుతూ హరీష్ అంటే ఇష్టం లేదు అని ఎందుకు చెప్పావ్ వాడు నీ కోసం ఎంత చేంజ్ అయ్యాడో తెలిసి కూడా వాడ్ని ఎలా బాధ పెట్టాలి అనిపించింది మాయ అని సీరియస్ అవుతూ మాయ ను కొట్టబోతున్న రేణుక ను చూసి ఇద్దరి మధ్యలోకి అడ్డుగా వచ్చి నుంచుంటాడు జై….. !
జై అని అసహనంగా పిలుస్తూ అడ్డు తప్పుకో దీనికి మొండితనం డే బై డే పెరిగిపోతోంది….. నా మాట కొంచెం కూడా కేర్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది….. అరే లైఫ్ మీద కొంచెం కూడా సీరియస్నెస్ లేదు మీ అందరి గారాబం వల్లే ఇది ఇలా బిహేవ్ చేస్తుంది నాలుగు దెబ్బలు పడితే తప్పా మాట వినేలా లేదు అంటూ మాయ వైపు కోపంగా చూస్తూ అంటుంది…..
రేణు మాయ ను ఎమ్ అనకు అని కార్ లో వస్తున్నప్పుడే చెప్పాను ఎందుకలా అనవసరంగా తనను హర్ట్ చేస్తావ్ ఇందులో తన తప్పేం ఉంది చెప్పు……?
ప్లీస్ వినయ్ మీరు మాట్లాడకండి మీ అందరూ ఇలా సపోర్ట్ చేసి నెత్తికి ఎక్కించుకోవడం వల్లే ఇలా తయారు అయింది అని మాయ వైపు చూస్తూ ముందుకు వెళ్తున్న రేణుక ను ఆపుతూ అమ్మా ప్లీస్ కామ్ డౌన్ ఎంత సేపు మీ అన్నయ్య మీద ప్రేమతో కాదు నీ కూతురి భవిష్యత్తు గురించి కూడా కొంచెం థింక్ చెయ్ అంటూ రేణుక చెయ్ పట్టుకుని సోఫా లో కూర్చోపెట్టి తను కూడా పక్కనే కూర్చోపెట్టుకుని మాయ వైపు చూసే సరికి తను కోపంగా స్టెప్స్ ఎక్కుతూ వినయ్ పిలుస్తున్నా ఆగకుండా తన రూమ్ కి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది…..
చూస్తున్నావా జై నీ చెల్లి పొగరు అంటూ మాదేష్ ఇంట్లో మాయ హరీష్ కి నో చెప్పడం గుర్తు చేసుకుంటూ కోపంగా అంటున్న రేణుక చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని అమ్మా మాయ తో పాటు నేను కూడా హరిణి కి నో చెప్పాను మరి నన్నేం అనడం లేదు మాయ ను మాత్రమే ఎందుకు అంటున్నావ్?? నేను నీ సొంత కొడుకు ను కాను అనా అని సూటిగా అడుగుతున్న జై వైపు చూస్తారు వినయ్, రేణుక…..
చెప్పమ్మా మాయ ను మాత్రమే అలా నో చెప్పిందని తన బిహేవియర్ రాంగ్ అంటూ అరుస్తున్నావ్ & తిడుతున్నావ్ మరి నేను మీ అన్నయ్య మాదేష్ ను తిట్టాను కూడా మరి నన్ను ఒక్క మాట కూడా ఎందుకు నువ్వు అనడం లేదు??
జై ఇంకెప్పుడు నువ్వు, హరిణి నాకు వేరు వేరు అని చెప్పకు మీ ఇద్దరూ నా ప్రాణం ఇన్ఫాక్ట్ దాని కంటే నువ్వంటేనే నాకు ప్రేమ ఎక్కువ అని జై చేతి మీద తన మరో చెయ్ వేస్తూ నేను ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ చూపించానా చెప్పు….. ఐ నో జై నువ్వేం చేసినా కరెక్ట్ గానే చేస్తావ్ అందుకే నిన్ను క్వస్చన్ చేయలేదు తప్పా నువ్వు ఎలా వెళ్తే నాకు ఏంటి అని కాదు అంటూ బాధ నటిస్తూ చెప్తుంది……
నా మీద ఇంత ట్రస్ట్ పెట్టుకున్నావ్ మరి మాయ ను ఎందుకు నీ మాటలతో హర్ట్ చేస్తావ్…. మాయ కి హరీష్ అంటే ఇష్టం లేదు తను అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే నువ్వు ఫోర్స్ చేయడం నాకు ఏమాత్రం నచ్చడం లేదు అమ్మా మాయ కి ఇష్టం లేనిది ఏది కూడా ఈ ఇంట్లో జరగకూడదు అని ఎప్పుడో చెప్పాను అలాంటిది మాయ లైఫ్ గురించి నేను ఇంకెంత కేర్ఫుల్ & క్లారిటీ గా ఉంటాను నువ్వే చెప్పు…..
తనకే కాదు నాకు కూడా ఈ మ్యారేజ్ ప్రపోజల్ నచ్చలేగు ఇంకెప్పుడు ఈ ఇంట్లో ఈ ప్రపోసల్ గురించి నేను వినకూడదు అని అప్పటి వరకూ కూల్ గా మాట్లాడుతున్న జై వాయిస్ లో బేస్ తో కూడిన సీరియస్ నెస్ కనిపించడం తో రేణుక తనకు తెలియకుండానే సరే అన్నట్టు టీచర్ కి బయపడ్డ స్టూడెంట్ లా తల వూపడం చూసిన వినయ్ ఎవరికి కనిపించకుండా తనలో తానే నవ్వుకుంటాడు…..
గుడ్….!! జరిగిన చెత్త గురించి మర్చిపోయి వెళ్ళి పడుకోండి గుడ్ నైట్ అమ్మా అని పైకి లేచి వినయ్ ముందు నీల్ డౌన్ చేసి కూర్చుని తన కళ్ళల్లోకి చూస్తాడు ఎప్పటి లాగే వినయ్ తనను చూసి మొహం తిప్పుకోవడం తో అది ముందే ఎక్స్పెక్ట్ చేసిన జై పెద్దగా రియాక్ట్ అవ్వకుండా నేను మీకు ఇష్టం లేని కొడుకునే అవ్వచ్చు బట్ బాధ్యతలు గాలికి వదిలేసి తిరిగే బేవర్స్ ను మాత్రం కాదు మీ కూతురి లైఫ్ గురించి మీరు టెన్షన్ అవ్వకండి మాయ ఇష్టపడ్డ పర్సన్ నే తన లైఫ్ లోకి తీసుకుని వస్తాను ట్రస్ట్ మీ…..!!
లోలోపలే మాయ ఫ్యూచర్ గురించి టెన్షన్ పడుతున్న వినయ్ కి జై మాటలు తెలియని ధైర్యం ఇవ్వడం తో మనసులో జై లో చేంజ్ కి హ్యాపీగా అనిపిస్తున్నా అది బయటకు చూపించకుండా రేణు ఇరిటేటింగ్ గా ఉంది నన్ను రూమ్ లోకి తీసుకుని వెళ్ళు అని గంభీరంగా చెప్తాడు…..
అప్పటి వరకు ఊపిరి బిగబట్టుకుని ఇద్దరి వైపు చూస్తున్న రేణుక ఏంటిది తండ్రీ – కొడుకు కలిసిపోయేలా ఉన్నారు అని టెన్షన్ గా చూస్తూ ఉంటుంది…… వినయ్ జై మాటలు వినడానికి కూడా ఇష్ట పడ్డం లేదని వినయ్ బిహేవియర్ ను చూసి లోలోన నవ్వుతూ పైకి మాత్రం ఆది కాదండి జై మీతో మాట్లాడుతున్నాడు కదా….. మీరు కూడా మీ పంథాన్ని వదిలి తనతో మాట్లాడండి ??
చెప్పింది చెయ్ రేణు అని సీరియస్ గా అంటున్న వినయ్ వాయిస్ కి జై నే పైకి లేచి అమ్మా వెళ్ళి ఫ్రెష్ అయి పడుకోండి గుడ్ నైట్ అని చెప్పి ఫాస్ట్ గా తన రూమ్ కి వెళ్ళిపోతాడు అది చూసిన రేణుక కన్నింగ్ గా నవ్వుకుంటూ మీ ఇద్దరినీ జన్మ లో కలవనివ్వను జై నువ్వు ఎప్పటికీ మీ నాన్న దృష్టిలో చెడ్డ వాడి లానే ఉండాలి అని నవ్వుకుంటూ ఏదో ఆలోచనలో ఉన్న వినయ్ ను రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది……
తన రూమ్ లోకి వెళ్ళిన జై బెడ్ మీద కూర్చుని తల లోకి వేళ్ళు దూర్చి కళ్ళు మూసుకున్న జై కి వినయ్ తో ఉన్న బ్యూటిఫుల్ మెమోరీస్ తో పాటు తను ఇలా చేంజ్ అవ్వడానికి కారణం అయిన డేస్ కూడా గుర్తు రాగానే జై కళ్ళు ఎర్రగా మారుతాయి…… ఉన్నట్టుంది జై కి చమటలు పట్టడం తో పాటు నరాలు పైకి ఉప్పొంగుతూ ఫుల్ ఏ. సీ లో ఉన్నా కూడా జై కి చాలా సఫోకేటింగ్ గా అనిపిస్తుంది…..
గాడ్ ఏంటిది అని తన కళ్ళ ముందు మొత్తం బ్లర్ గా కనిపిస్తూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకుని తన బెడ్ పక్కనున్న టేబుల్ మీద ఉన్న వాటర్ మగ్ తీసుకుని తల మీద పోసుకుని తలను గట్టిగా విదిలించి కష్టంగా పైకి లేచి ఒక్కో అడుగు వేస్తూ తన సీక్రెట్ వాడ్రాబ్ లో దాచిన ఒక బాక్స్ తీసుకుని అందులో నుండి ఒక చిన్న క్యూబిక్ బాక్స్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న మెడిసిన్ వేసుకుని దాన్ని క్లోజ్ చేసి జాగ్రత్తగా లాక్ చేశాక అలాగే వాడ్రాబ్ కి ఆనుకుని అక్కడే నేల మీద కూర్చుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న జై కి తెలియకుండానే లెఫ్ట్ ఐ నుండి నీళ్ళు కారడం తో జై ఆ సిచుయేషన్ లో కూడా తన ఫేస్ ను గంభీరంగా మార్చి కన్నీళ్ళు తుడుచుకుంటూ నైట్ మొత్తం ఏవేవో ఆలోచనలతో గడిపేస్తాడు……
జై ఎందుకలా బిహేవ్ చేశాడో ఎవరైనా చెప్పగలరా ఎనీ గెస్సెస్ 🥱