Login with OTP

విలన్ హస్బెండ్-38

aashyatech

Author

మాదేష్ కి సారి చెప్పడానికి తన ఇంటికి కి వెళ్లాలి అనుకున్న రేణుక అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరి వర్క్స్ మీద వాళ్ళు వెళ్ళాక ఫాస్ట్ గా వెళ్ళి ఎవరు విల్లా కి రాకముందే వచ్చేయాలి అని బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసి ఫాస్ట్ గా ఫ్రెష్ అయి మాదేష్ ఇంటికి స్టార్ట్ అవుతుంది….. మాదేష్ ఇంటి ముందున్న పార్టీకో లో కార్ పార్క్ చేసి అన్నయ్య కు ఎదోటి చెప్పి కన్విన్స్ చేయాలి నిన్న ఎట్లిస్ట్ అన్నయ్య కి సారి చెప్పడానికి కూడా అన్నయ్య కి కుదరలేదు అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెడుతున్న రేణుక కి హాల్ లో కనిపించిన సీన్ కి ఒక్క క్షణం కళ్ళ ముందు జరుగుతున్నది చూసి షాక్ తో ఉన్న చోట నే అడుగు ముందుకు పడక ఆగిపోతుంది……

 

హాల్ లో నుండి వస్తున్న సౌండ్స్ కి షాక్ నుండి తేరుకున్న రేణుక అన్నయ్య అని అరుస్తూ ఫాస్ట్ గా వెళ్ళి మాదేష్ చేతిలో ఉన్న రివాల్వర్ ను పైకి ఎయిమ్ చేయగానే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్న చాండిలియర్ లైట్ గల్లున్న సౌండ్ చేస్తూ పగిలిపోవడం తో ఆ సౌండ్ కి అందరూ చెవులు మూసుకుని మరీ జరిగింది చూసి షాక్ అవుతున్నట్టు రియాక్షన్ ఇస్తారు అది చూసిన మాదేష్ కన్నింగ్ గా నవ్వుకుంటూ ఇందాక జరిగింది గుర్తు చేసుకుంటాడు…..
నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తున్న మాదేష్ కి పోర్టికోలో ఆగిన రేణుక కార్ సౌండ్ విని తన మెదడులో కన్నింగ్ ప్లాన్ రావడం తో వెంటనే తన రూమ్ కి వెళ్ళి తన లైసెన్స్ రివాల్వర్ తీసుకుని హాల్ లోకి వచ్చి ముగ్గురికి తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు……

హాల్ లో కూర్చుని కాఫీ సిప్ చేస్తున్న ( శ్వేత , హరీష్, హరిణి) లతో హేయ్ లిసన్ రేణుక వస్తోంది మే బీ నాకు సారి చెప్పడానికి వస్తూ ఉంటుంది తన మనసుని ఆల్రెడీ ఆ జై, వినయ్ లు మార్చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు నన్ను నేను షూట్ చేసుకుని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాను & మీరు కూడా ఆపడానికి ట్రై చేస్తున్నట్టు యాక్ట్ చేసి రేణుక రాగానే తనను సెంటిమెంట్ తో లాక్ చేయండి అని వాళ్లకు రేణుక తో ఎమ్ మాట్లాడాలో చెప్పి సరిగ్గా రేణుక హాల్ లోకి వచ్చేసరికి తనకు తాను రివాల్వర్ గురి పెట్టుకుని చస్తున్నట్టు డ్రామా ప్లే చేస్తాడు…….

మాదేష్ చేస్తున్నది డ్రామా అని తెలియని రేణుక మాదేష్ ను అలా చూసి అన్నయ్య అంటూ ఫాస్ట్ గా వెళ్ళి ట్రిగ్గర్ నొక్కుతున్న మాదేష్ చేతిని పట్టుకుని ఆపి పైకి గురి పెట్టగానే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్న చాండిలియర్ పగిలిపోయి హాల్ మొత్తం గాజు ముక్కలు పరుచుకుంటాయి…..

అసలేం చేస్తున్నావ్ అన్నయ్య?? ఏంటీ పిచ్చి పని నేను రావడం 2 మినిట్స్ లేట్ అయ్యుంటే ఎమ్ జరిగేదో తెలుసా అయినా ఎందుకు ఇంత ఆవేశం అంటూ మాదేష్ చేతి నుండి రివాల్వర్ తీసుకుని కంగారుగా చూస్తూ అడుగుతుంది……

మహా అయితే నా ప్రాణం పోయేది అంతే కదా రేణుక నాకు జరిగిన అవమానం కంటే నా ప్రాణం పెద్దది కాదు….. ఇన్నాళ్లుగా నీ కొడుకు, కూతురు ను ప్రాణంగా ప్రేమిస్తున్న నా పిల్లలకు వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళతో ఎట్లిస్ట్ మ్యారేజ్ కూడా చేయలేక పోతున్నాను అన్న ఈ బాధ భరించడం కంటే చావడమే బెటర్……

అన్నయ్య నువ్వు ముందు ఇలా రా అంటూ మాదేష్ ను సోఫా లో కూర్చో పెడుతూ తను పక్కనే కూర్చుని నిన్న జరిగింది నేను కూడా డైజెస్ట్ చేసుకోలేక పోతున్నాను అన్నయ్యా…… నువ్వే కాదు హరీష్,హరిణి లను నా పిల్లలకు ఇచ్చి చేయాలని నాకు చాలా ఆశగా ఉండేది కానీ ఏం చేస్తాం అన్నయ్య మాయ హరీష్ పేరు చెప్తే చాలు మండి పడుతుంది & దానికి ఇష్టం లేకుండా ఆ ఇంట్లో ఎదీ జరగదు పైగా జై కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు ఇంకో సారి మ్యారేజ్ టాపిక్ తీస్తే బాగోదని అందుకే మనం కస్టంగా ఉన్నా రియాలిటీ ను యాక్సెప్ట్ చేయాలి అన్నయ్య అంటూ తల వంచుకుని బాధగా చెప్తుంది…..

మాదేష్ చెప్పినట్టే జై రేణుక మనసు పూర్తిగా చేంజ్ చేశాడు అని నలుగురు ఒకరిని ఒకరు చూసుకుని రేణుక వైపు చూస్తారు…… నాకు ఈ విషయం గురించి చెప్పడానికి చాలా బాధగా ఉంది అన్నయ్య బట్ నువ్వు ఎలా నేను ఇష్టపడ్డ వినయ్ ను నా లైఫ్ లోకి తీసుకుని వచ్చావో సేమ్ వే నా కూతురు ఇష్టపడ్డ పర్సన్ నే తన లైఫ్ లోకి తీసుకుని రావాలి అనుకుంటున్నా ఎందుకంటే నాకు మాయ హ్యాపీనెస్ కంటే ఏది ఎక్కువ కాదు……

ఓసి నా పిచ్చి చెల్లి ఆ వినయ్ ను నీకు ఇచ్చి పెళ్ళి చేసింది నువ్వు ఇష్టపడ్డావ్ అని కాదే వాడి వెనుక ఉన్న ఆస్తి కోసమే అని కన్మింగ్ గా అనుకుంటూ మాయ కి హరీష్ అంటే ఇష్టం లేనప్పుడు నువ్వు మాత్రం ఎమ్ చేస్తావ్ రేణుక మాయ లాంటి మంచి అమ్మాయి ను కోడలిగా చేసుకునే అదృష్టం మాకు లేదు అంటూ బాధ నటిస్తాడు మాదేష్……

 

అయ్యో అన్నయ్య బాధ పడకు ఆ అదృష్టం మీకు కాదు మాకు లేదు అందుకే ఇలా గొడవ జరిగి మన రెండు ఫ్యామిలీస్ మధ్య డిస్టెన్స్ వచ్చింది అని డల్ గా చెప్తూ ఇంకో వన్ వీక్ లో అందరం శారద అత్తయ్య ఊరికి వెళ్తున్నాం మీరు కూడా రావచ్చు కదా అన్నయ్య ప్లీస్……

వద్దు లే రేణుక మేము రావడం జై , మాయ లకు ఇష్టం లేదు అయినా వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టాలి అనుకుంటున్నారు & హ్యాపీగా మీ ఫ్యామిలీ మొత్తం కలిసి టైం స్పెండ్ చేయడానికి వెళ్తుంటే మధ్యలో మేము రావడం మమ్మల్ని చూసి వాళ్ళు డిజప్పాయింట్ అవ్వడం నాకు ఇష్టం లేదు మీరు సంతోషంగా వెళ్ళి రండి రేణు నువ్వు ఎక్కడున్నా ఈ అన్నయ్య కోరుకునేది నీ హ్యాపీనెస్ మాత్రమే రేణుక  ….

మ్యారేజ్ జరగనంత మాత్రానా మీరు నా ఫ్యామిలీ అవ్వకుండా పోతారా అన్నయ్య నేను వినయ్ కి వైఫ్ కాకముందే నేను నీ చెల్లిని అది నేను నా ఊపిరి ఉన్నంత వరకూ మర్చిపోను & మాయ విషయం అంటావా దానికి అర్థం అయ్యేలా నేను చెప్తాను కానీ మీరు ఇంకేం చెప్పకుండా మాతో పాటు రండి అయినా ఆ విలేజ్ కి మేము మాత్రమే వెళ్ళడం లేదు మాతో పాటు మహీదర్ ఫ్యామిలీ & జై ఫ్రెండ్స్ అమర్ అండ్ ఇంకా ఎవరో ఇద్దరూ క్లోజ్డ్ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు

హరీష్ రేణుక ముందు నీస్ మీద కూర్చుని అత్తయ్య నాకు చిన్నప్పటి నుంచి మాయ అంటే చాలా ఇష్టం ఎంత అంటే మాయ హ్యాపీనెస్ కోసం తనకు మళ్ళీ కనిపించనంత దూరం వెళ్ళిపోవాలి అనిపించేంత అందుకే నేను మళ్ళీ మాయ ముందుకు రావాలి అనుకోవడం లేదు ఐ ఆమ్ సారి అత్త అని రేణుక పిలుస్తున్నా ఆగకుండా వెళ్తున్న హరీష్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది రేణుక………

అత్త నేను హరీష్ అంత గొప్పగా ప్రేమించక పోవచ్చు బట్ బావనే నా ప్రపంచం అనుకుంటూ వచ్చాను ఆల్ ఆఫ్ సడెన్ బావ నాకు ఇలా దూరం అవ్వడం నేను తట్టుకోలేక పోతున్నా అందుకే నేను కొన్ని డేస్ అందరికీ దూరంగా వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పి ఏడుస్తూ వెళ్తున్న హరిణి ను చూసి రేణుక మనసు వెన్నె లా కరగడం చూసిన మాదేష్ కన్నింగ్ గా నవ్వుకుంటూ రేణుక వైపు చూస్తాడు….

🤍💗🤍💗🤍💗🤍💗🤍💗🤍

తన ఫ్యామిలీ గురించి అలోచిస్తూ డీప్ థింకింగ్ లో ఉన్న నాన్సీ కి కాలింగ్ బెల్ సౌండ్ వినిపించగానే సోఫా లో నిండి పైకి లేచి డోర్ ఓపెన్ చేయగా ఎదురుగా జై ను చూసి ముందు ఆశ్చర్య పోయినా తర్వాత నవ్వుతూ హాయ్ జై ఏంటి మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లకుండా ఇలా వచ్చా……

నాన్సీ మాట కంప్లీట్ అవ్వకముందే జై నాన్సీ నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుని ఇంటెన్స్డ్ గా కిస్ చేయడం చూసిన నాన్సీ కి జై కిస్ నే చెప్తుంది జై చాలా స్ట్రెస్ లో ఉన్నాడని అందుకే జై నుండి దూరం జరగడానికి ట్రై చేస్తున్న నాన్సీ జుట్టు పట్టుకుని మరింత దగ్గరగా లాక్కుని కాస్త గ్యాప్ ఇచ్చి కోపరేట్ చెయ్ నాన్సీ ఐ కాంట్ బేర్ ది స్ట్రెస్ అని చెప్పి మళ్ళీ లిప్స్ అందుకుని తనను అలాగే ఎత్తుకుని బెడ్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద కు విసిరినట్టే వేసి తన వంటి మీదున్న డ్రెస్ ను ఒక్కోటి విప్పుతూ ఉంటాడు……

జై స్ట్రెస్ లో ఉన్నప్పుడు తనతో రొమాన్స్ ఎంత ఆడ్ & వైల్డ్ గా ఉంటుందో నాన్సీ కంటే బాగా ఎవరికి తెలియదు అందుకే ఇపుడిపుడే సెట్ అవుతున్న తన హెల్త్ ను గుర్తు చేసుకుని ఆ రూమ్ నుండి పారిపోవడానికి ట్రై చేస్తున్న నాన్సీ నడుము పట్టుకుని తనకు అదుముకుంటూ నా నుండి దూరంగా వెళ్ళడానికి ట్రై చేయకు నాన్సీ ఐ వాంట్ యూ రైట్ నౌ ఇన్ మై బెడ్ అంటూ తను వేసుకున్న మాక్సీ ను చించినట్టే తన వంటి నుండి దూరం చేసి ఇన్నర్స్ తో తన ముందు నుంచున్న నాన్సీ వైపు చూసి ఐ ఆమ్ సారి నాన్సీ అని చెప్పి నాన్సీ తో సహా బెడ్ మీద పడిపోయాడు……

తన వంటిని జై కి వదిలేసి కన్నీళ్ళు కారుస్తూ కళ్ళు మూసుకున్న నాన్సీ కి జై ఇస్తున్న పెయిన్ కి వంద గుండు సూదిలు లోయర్ పార్ట్ లో ఒకే సారి పొడిస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ అనిపిస్తుంది దానికి తోడు పంటి గాట్లు కూడా పెడుతూ జై తన స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వడం కోసం నాన్సీ కి పెయిన్ అందిస్తాడు……

జై కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్న నాన్సీ జై పూర్తిగా తన స్ట్రెస్ నుండి రిలీఫ్ అయ్యేవరకు ఎంత పెయిన్ గా ఉన్నా జై ను దూరం జరపదు & దాదాపు నాలుగు గంటల ఇంటిమేషన్ తరువాత జై నాన్సీ నుదుటిన ముద్దు పెట్టి థాంక్ యూ బేబీ అంటూ తన మీద నుండి పక్కకు దొర్లి కళ్ళు మూసుకుని భారంగా శ్వాస తీసుకుంటూ ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది…..

ఐ నో నా కోసం నువ్వు చాలా పెయిన్ బరించావ్ బట్ ట్రస్ట్ మీ బేబీ నెక్స్ట్ టైమ్ ఇది రిపీట్ చేయను…… నన్ను ప్రెసెంట్ నువ్వు మాత్రమే బేర్ చేయగలవు అందుకే నిన్ను హార్ట్ చేయాల్సి వచ్చింది సారి రా….. ఏంటి ఒక మాట కూడా మాట్లాడడం లేదు నా మీద కోపమా అని తల పక్కకు తిప్పి చూసే సరికి నాన్సీ ఆ పెయిన్ బేర్ చేయలేక ఎప్పుడో అన్ కాన్షియస్ అయ్యుంటుంది…..

నాన్సీ ను అలా చూసిన జై నాన్సీ బుగ్గలు తడుతూ పిలుస్తున్నా నాన్సీ లో ఎలాంటి చలనం ఉండదు దాంతో కంగారు పడ్డ జై వెంటనే తన డ్రెస్ ఎక్కడ పడిందో వెతుకుని మరీ డ్రెస్ అప్ అయి వెంటనే తన ఫ్రెండ్ కమ్ డాక్టర్ అయిన డాక్టర్ సంధ్య కి కాల్ చేస్తాడు…..

 

🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️

నీతో టెంపుల్ కి రావాలి అంటే పెద్ద తల నొప్పి అయిపోయింది మమ్మీ ఎమ్ జీన్స్ లో వస్తే దేవుడు గుడి నుండి గెంటేస్తాడా అని విసుక్కుంటూనే పర్పుల్ కలర్ డిజైన్ శారీ కట్టుకున్న ఆద్య కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటూ గయ్యుమని అరుస్తుంది…..

 

అబ్బబ్బా ఏంటే నీ గోల రెండు గంటల నుండి అరుస్తూనే ఉన్నావ్ టెంపుల్ కి అయినా అమ్మాయిలా రావడం నేర్చుకో ఎప్పుడు ఆవే జీన్స్ లు వేసుకుని తిరుగుతావ్ ఇలా అయినా నన్ను ఆనంద పడనివ్వు….ఇక నోరు తెరవకుండా టెంపుల్ కి పదా అని పక్కన కూర్చున్న శైలు కూడా అంతే సీరియస్ గా చూస్తూ అంటుంది…..

హు 😏 అని మూతి తిప్పుతూ దీన్ని క్యారీ చేసే వాళ్ళకు తెలుస్తుంది నొప్పి 😬 అని ఇరిటేట్ అవుతూ టెంపుల్ వైపు డ్రైవ్ చేస్తున్న ఆద్య కి మాన్య నుండి కాల్ రావడం తో బ్లూ టూత్ ఆన్ చేసి స్పీకర్ లో పెడుతూ డ్రైవ్ కంటిన్యూ చేస్తుంది……

ఏయ్ ఎక్కడున్నావే ఇవాళ మనకు ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉంది అది గుర్తుందా నీకు 10 అవుతున్నా ఇంకా ఆఫీస్ కి రాలేదు ఏంటి ఎక్కడ ఉన్నావ్ అంటూ విసుగ్గా అరుస్తుంది మాన్య …..

ఎక్కడుంటా కార్ లో ఉన్నానే 😌

ఆ కార్ ఎక్కడుంది 😬

రోడ్ మీద ☺️

అదే ఇటు వైపు వెళ్తుంది 🤷

నేను ఎటు వెళ్తే అటు వెళ్తుంది 😜

నీ….. తిట్టడానికి భూతులు కూడా రావడం లేదు ఎక్కడున్నావే ఇరిటేట్ చేయకుండా చెప్పు

మమ్మీ తో టెంపుల్ కి వెళ్తున్నా దర్శనం అయ్యాక బతికే ఉంటే ఇంకో వన్ అవర్ లో అక్కడ ఉంటాను అని కాల్ కట్ చేసిన ఆద్య బిహేవియర్ కి ఈ తిక్కల్ దాన్ని ఎవడు చేసుకుంటాడో కానీ వాడి జీవితం మొత్తం అంతేగా…. అంతేగా అంటూ బ్రతికేయాలి అని నిట్టూర్చి తన క్యాబిన్ కి వెళ్తుంది మాన్య……

నాకు ఆఫీస్ కి టైమ్ అవుతుంటే సడన్ గా ఈ టెంపుల్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టావ్ మమ్మీ అని అడుగుతూ టెంపుల్ లోకి తన మదర్ తో పాటు నడుస్తున్నాడు అతను …….

ఇవాళ చాలా మంచి రోజు కన్నా ఆ శివయ్య దీవెన నీ మీద ఎప్పటికీ ఉండాలి అని ఇక్కడికి తీసుకుని వచ్చాను….. ఈయన చాలా పవర్ఫుల్ మనం మనసులో ఏదైనా కోరిక కోరితే కచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్తూ గర్భ గుడిలో ఉన్న దేవుడి వైపు అపురూపంగా చూస్తూ చెప్తుంది అతని తల్లి……

అచ్ఛా నిజమా ఒకే లెట్స్ ట్రై అంటూ అతను కూడా భక్తి శ్రద్ధలతో కళ్ళు మూసుకుని కాసేపటికి తెరిచి గోప్యమానంగా వెళ్ళిపోతున్న శివయ్య ను చూసి రెండు చేతులతో నమస్కారం చేస్తూ నాకు ఇప్పుడే ఆద్య ను చూడాలి అనుంది స్వామీ ప్లీస్ ఒక సారి చూపించవా అని తన కోరిక కోరుకుని ఎదురుగా చూడగా పర్పుల్ కలర్ డిజైన్ శారీ లో తన ఎదురుగా వచ్చి నుంచున్న ఆద్య ను చూసి అతనికి ఆశ్చర్యంగా, ఆనందం ఒకే సారి కలిగాయి…….

ఓహ్ మై గాడ్ యూ ఆర్ మమ్మీ ఆద్య ను చూడాలి అనుకోగానే చూడు ఆద్య ఎదురుగా వచ్చి నుంచుంది అనగానే అతని మదర్ కూడా ఆద్య ను చూసి నవ్వుతూ తన వైపు చూస్తూ వెళ్ళి మాట్లాడరా మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు అంటూ అతన్ని ఆద్య వైపు నెడుతుంది……

అమ్మో నా వల్ల కాదు అంటూ అక్కడి నుంచి పిల్లర్ వెనక్కి వెళ్ళి దాక్కున్న అతన్ని చూసి తల బాదుకుంటూ ఎక్స్క్యూస్ మీ అంటూ ఆద్య ను అతని తల్లి పిలవగానే అతను టెన్షన్ గా చూస్తూ మమ్మీ నా కొంప ముంచేలా ఉన్నావ్ అని టెన్షన్ గా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు……

అతని మదర్ ఆద్య తో అతను ఆద్య ను లవ్ చేస్తున్న విషయం చెప్పేస్తుందా?? అపుడు ఆద్య రియాక్షన్ ఏంటి అంటారు 😌😌