Login with OTP

విలన్ హస్బెండ్-42

aashyatech

Author

బుల్లెట్ లా సంధ్య క్యాబిన్ లోకి దూసుకుని వచ్చిన ఆద్య ను చూసిన జై షాక్ అవుతూ ఏయ్ నువ్వేంటే ఇక్కడ?? అని అడుగుతూ ఆద్య ముందుకు వచ్చి నుంచున్నాడు….. ఏంట్రా నీ సీక్రెట్స్ ఎక్కడ బయట పడతాయో అని నన్ను చూసి షాక్ అవుతున్నావా??  ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నన్ను!! అని నవ్వుతూ ఇంకా ఎన్ని డేస్ ఇలా నీకు మ్యారేజ్ అవ్వలేదు అని అందరినీ నమ్మిస్తావ్ ఇవాళ నీకు మ్యారేజ్ అయిందన్న విషయం అందరికీ తెలిసేలా చేసి కానీ ఇక్కడి నుండి వెళ్ళను చెప్పరా నీ వైఫ్ కి ఎమ్ అయింది??

ఏంటి వైఫ్ ఆ?? ఎమ్ మాట్లాడుతున్నావ్ ఫస్ట్ యూ గెట్ అవుట్ సంధ్య దీన్ని ఎందుకు లోపలికి తీసుకుని వచ్చావ్ చాలా చిరాగ్గా ఉంది దాన్ని బయటకు నెట్టేయ్…….

 

అది ఇదీ అన్నా వంటే మాడు పగలకొడతాను అసలు నన్ను వెళ్ళు అని చెప్పడానికి నువ్వు ఎవర్రా?? అయినా ఇప్పుడు ఇది కాదు మ్యాటర్ నీ వైఫ్ కి ఎమ్ జరిగిందో చెప్తావా లేదా తనను ఎందుకు హస్పిటల్ లో అడ్మిట్ చేసావ్?? ఇంకా ఎన్ని రోజులు ఇలా అందరికీ తెలియకుండా దాస్తావ్??
పిచ్చా నీకేమైనా నాకు వైఫ్ ఏంటి?? తనను హాస్పిటల్ లో జాయిన్ చేయడం ఏంటి?? మోకాలికి దెబ్బ తగిలి గతం కాని మర్చిపోలేదు కదా??

చెత్త జోక్స్ వేయకు నువ్వు ఒక అమ్మాయిని స్ట్రెచర్ మీద హస్పిటల్ లోకి ఎత్తుకుని రావడం నేను చూసా….. అంతే కాదు ఆ అమ్మాయి నీ వైఫ్ అని ఇక్కడ వర్క్ చేస్తున్న సిస్టర్ కూడా కన్ఫర్మ్ చేశాకే వచ్చి అడుగుతున్నా…… నౌ టెల్ మీ ఏమైంది తనకు?? నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుంది కదూ??
షట్ అప్ నోరు తెరిచావో నువ్వు అనుకుంటున్నట్టు తను సూసైడ్ చేసుకోవడం కాదు నేను నిన్ను మర్డర్ చేస్తాను అని ఆద్య వైపు సీరియస్ గా చూస్తూ తెలిసి తెలియకుండా పిచ్చిగా వాగితే చంప పగల కొడతాను జాగ్రత్తా !!…..

ఎదీ పగల కొట్టు చూద్దాం అని ఆద్య కూడా జై మీద మీదకు వెళ్ళడం చూసిన సంధ్య ఇద్దరి మధ్య లోకి వచ్చి ఇద్దరినీ ఆపుతూ జై నువ్వు బయటకు వెళ్ళు…..

అది నాకు కాదు దానికి చెప్పు

అది…. ఇది ఏంట్రా ముచ్చు మొహమోడ

నీదేనే కుచ్చిపోయిన క్యారెట్ మొహం

నీది వంగిపోయిన వంకాయ మొహం రా ఫాల్తూ

హు 😏 నీది కుళ్ళిపోయిన కాకరకాయ మొహమే పిస్తర్

పోరా పాచిపోయిన పన్నీర్

పోవే మాడిపోయిన మంచ్కిన్

 

రేయ్….. ఒసేయ్….. అంటూ మాటలతో ఒకరిని ఒకరు తిట్టుకుంటున్న ఇద్దరినీ చూసిన సంధ్య తల బాదుకుంటూ స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరవగానే ఒకరి మీద ఒకరు కాలు దువ్వుకుంటున్న ఇద్దరూ సంధ్య అరుపుకి టక్కున ఆగిపోయి తన వైపు చూస్తారు…..

దీన్ని హస్పిటల్ అనుకుంటున్నారా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా అని ఒకరి చేతుల్లో ఉన్న సిరంజ్ ఇంజెక్షన్స్ ఇంకొకరి చేతుల్లో ఉన్న షార్ప్ సీసర్స్ , నైఫ్ చూసి వాటిని లాక్కుని బోథ్ ఆఫ్ యూ గెట్ అవుట్ అని అసహనంగా అరవగానే మళ్ళీ చెప్తానే నీ సంగతి అని వెళ్తూ వెళ్తూ గట్టిగా ఆద్య నడుము గిల్లి తనతో అరిపించి ఆద్య రియాక్ట్ అయ్యే లోపే అక్కడి నుండి వెళ్ళిపోతాడు……

రేయ్ ఆగరా చంపేస్తా నిన్ను అని అరుస్తూ వెళ్తున్న ఆద్య చెయ్ పట్టుకుని తన క్యాబిన్ లోనే అటాచ్ అయ్యున్న తన పర్సనల్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేసి రిలాక్స్ అండి ఫస్ట్ కూల్ అవ్వండి అని చిల్డ్ వాటర్ బాటిల్ మినీ ఫ్రిడ్జ్ నుండి తీసి ఇవ్వగానే జై తో గొడవ పడి అలసిపోయిన ఆద్య థాంక్ యూ అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని తాగుతుంది…..

సంధ్య చిన్నగా నవ్వి ఆద్య సెట్ అయ్యాక ప్లీస్ కూర్చోండి అని ఆద్య కి సోఫా ఆఫర్ చెయ్యగానే ఆద్య ఇబ్బందిగానే కూర్చుని చిన్న స్మైల్ ఇస్తుంది……

హాయ్ ఐ ఆమ్ సంధ్య ఈ హాస్పిటల్ లో డాక్టర్ గా వర్క్ చేస్తున్నా అంతే కాదు ఇది నా హాస్పిటల్ టు బీ ఫ్రాంక్ ఇది జై చేసిన హెల్ప్ వల్లే నేను ఇంత పెద్ద హస్పిటల్ రన్ చేస్తున్నా పేరుకి మాత్రమే ఇది నా హాస్పిటల్ బట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ నుండి మెడిసిన్స్ వరకూ అన్ని జై నే చూసుకుంటాడు …….

వాట్??? ఆ సాంబార్ ఫేస్ కి అంత మంచి హార్ట్ ఉందా?? నమ్మలేక పోతున్నాను ….. ఐ థింక్ ఇందులో వాడికి ప్రాఫిట్ గట్టిగానే వస్తూ ఉంటుంది అందుకే అంత హెల్ప్ చేస్తున్నాడు లేకపోతే వాడు ఎందుకు హెల్ప్ చేస్తాడు  నా పిచ్చి కాకపోతే 🤦🤷

హ హ యూ ఆర్ మిస్టేకెన్ అంటూ ఆద్య వైపు తన పేరు ఏంటి అన్నట్టు చూస్తుంది…..??

హో సారి నా పేరు చెప్పలేదు కదా మై సెల్ఫ్ ఆద్య ఐ ఆమ్ డూయింగ్ బిసినెస్ జై అంత నేమ్ & ఫేమ్ అయితే రాలేదు కానీ ఇపుడిపుడే బిజినెస్ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యాను అని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది…..

ఆధ్య ఇంట్రడక్షణ్ కి చిన్న స్మైల్ ఇస్తూ సీ ఆద్య నీకు జై కి మధ్య ఎమ్ ఉందో నాకైతే తెలియదు కానీ నువ్వు జై ను టోటల్లీ మిస్ అండర్స్టాండ్ చేసుకుంటున్నావ్ అని మాత్రం గట్టిగా చెప్పగలను….

ఏంటి నేను వాడిని అపార్థం చేసుకుంటున్నానా 🤣😂 హౌ సిల్లీ నాకు కాదు నీకు వాడి గురించి తెలియదు అనుకుంటా చూడు డాక్టర్ పాప వాడిని రాముడు అనుకుంటున్నావేమో వాడు కృష్ణుడి టైప్ యూ నో వాడికి లెక్క లేనంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని సీక్రెట్ చెప్పినట్టు చిన్నగా చెప్తుంది …..

ఆద్య మాటలకు జై కి గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు చాలా మంది తో ఎఫైర్  ఉందని కూడా నాకు తెలుసు…. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా తన ఆఫీస్ స్టాఫ్ & తన మరదలు హరిణి తో కూడా జై కి ఎఫైర్ ఉంది…..

వాట్?? ఇంత మంది తో ఎఫైర్ పెట్టుకున్నాడు అని తెలిసి కూడా వాడు నీకు మంచోడిలా కనిపిస్తున్నాడా?? వాడిని ఇలాగే వదిలేస్తే హైదరాబాద్ లో ఉన్న ప్రతీ అమ్మాయితో ఎఫైర్ మెయింటైన్ చేసేలా ఉన్నాడు….. అవును నాకో డౌబ్ట్?? ఇంత మంది తో ఎఫైర్ పెట్టుకునే బదులు హ్యాపీగా పెళ్లి చేసుకుని తన వైఫ్ తో హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి వాడికేం మాయ రోగం??

జై కనిపించిన ప్రతీ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోలేదు ఆద్య….. తమకు తాముగా జై ను చూసి ఎట్రాక్ట్ అయిన అమ్మాయిలతోనే జై ఫిజికల్ గా మూవ్ అవుతాడు & ఆ అమ్మాయిలకు కావల్సిన నీడ్స్ కూడా జై నే చూసుకుంటాడు….
వాట్ ఎవర్ ఎఫైర్ అయితే ఉంది కదా సంధ్య తన ఫాదర్ జి బిహేవియర్ కి ఎంత బాధ పడుతున్నారో తెలుసా వీడు అది కొంచెం కూడా థింక్ చేయకుండా వాడికి నచ్చినట్టు లైఫ్ లీడ్ చేస్తున్నాడు…… నువ్వే చెప్పు వినయ్ మావయ్య కి సొసైటీ లో ఎంత గుడ్ నేమ్ ఉంది జై బిహేవియర్ వల్ల ప్రతీ ఒక్కరూ ఆయనను క్వశ్చన్ చేస్తూ ఉంటే ఆయన ఎలా ఫీల్ అవుతారు??

ఆద్య ఇప్పటి వరకూ జై మీద కోపం చూపెట్టిన నువ్వేనా ఇలా మాట్లాడుతుంది??

నాకు జై అంటే కోపం అది మాత్రమే కాదు అసహ్యం కూడా ఎట్ ది సేమ్ తన ఫ్యామిలీ అంటే చాలా చాలా ఇష్టం….. అందుకే వాడి మీద ఎంత కోపం ఉన్నా జై గురించి మావయ్య పడుతున్న పెయిన్ చూడలేక పోతున్నాను ….

జై ఎందుకలా తన ఫాదర్ వర్డ్స్ కూడా కేర్ చేయకుండా అమ్మాయిలతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడో నాకు కూడా తెలియదు ఆద్య దానికి అన్సర్ జై నే చెప్పాలి బట్ జై నువ్వు అనుకున్నంత చెడ్డ వాడు మాత్రం కాదు…… అలాగే నువ్వు అనుకుంటున్నట్టు జై మార్నింగ్ తీసుకుని వచ్చింది తన వైఫ్ ను కాదు తన క్లోజెస్ట్ ఫ్రెండ్ నాన్సీ ను అమర్ తర్వాత జై ఇష్టపడే పర్సన్స్ లో తనే ఫస్ట్ ఉంటుంది……

నాన్సీ?? హు ఇస్ షి తన నేమ్ ఇప్పుడే వింటున్నా ఎమ్ అయింది తనకు??

జై వల్ల నాన్సీ ఈ పొజిషన్ లో ఉందని చెప్పలేక ఫుడ్ సరిగ్గా తినక సిక్ అయింది అది తెలిసి జై తనను తీసుకుని వచ్చాడు దాని గురించే ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఆద్య…..

నిజామా 😱😱 అనవసరంగా నేనే తొందర పడ్డానా అని ఆలోచిస్తూ ఓహ్ అలాగా సారి నేనే ఏదేదో ఇమాజిన్ చేసుకున్నాను అని చెప్పి మీట్ యూ లేటర్ సంధ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్తున్న ఆద్య ను చిరు నవ్వుతో చూస్తూ మా జై పక్కన నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటావ్ ఆద్య మీ ఇద్దరూ చాలా క్యూట్ గా ఉన్నారు అని తనలో తానే అనుకుంటూ నాన్సీ రూమ్ వైపు వెళ్తుంది…..

ఆధ్య?? ఎక్కడికి వెళ్ళిపోయావ్ క్యాబిన్ లోకి వచ్చి ఎలా ఎలా మాయం అయ్యావ్ అని నేను మొత్తం చెక్ చేస్తున్నా అని కారిడార్ మొత్తం ఆద్య కోసం వెతుకుతున్న అభీర్ ఆద్య క్యాబిన్ బయటకు రాగానే అడుగుతాడు…..

లోపలే ఉన్నా అభీర్ నువ్వు చెప్పినట్టు ఆ అమ్మాయి జై వైఫ్ కాదు తన ఫ్రెండ్ ఆ నర్స్ మనకు అబద్దం చెప్పింది అని ఏదో ఆలోచిస్తూ చెప్తుంది…..

అవునా నేను చెప్పాను కదా ఆద్య నువ్వు అనుకుంటున్నట్టు జై మరీ అంత బ్యాడ్ కాదు…..

మీరు వాడి గురించి ఎంత పాజిటివ్ గా చెప్పినా నా మనసు యాక్సెప్ట్ చేయడం లేదు వాడిలో ఏదో సీక్రెట్ దాగుంది అని అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఒకే అభీర్ నేను నా ఫ్రెండ్ ను మీట్ అవ్వాలి బై అంటూ అభీర్ మొబైల్ నంబర్ తీసుకుని తన ఫ్రెండ్ లాస్య ఉన్న ఫ్లోర్ వైపు వెళ్తున్న ఆద్య ను చూసి నవ్వుతూ అభీర్ కూడా తన ఆఫీస్ కి స్టార్ట్ అయి వెళ్ళిపోతాడు…..

🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️

 

నాన్సీ మెలకువ లోకి వచ్చే దాకా పక్కనే కూర్చుని వెయిట్ చేసిన జై తను స్పృహ లోకి వచ్చాక సారి చెప్పి తనతో ఈవెనింగ్ దాకా టైం స్పెండ్ చేసి ఈవెనింగ్ తన మొబైల్ కి వచ్చిన నోటిఫికేషన్ చూసి రేపు వచ్చి మీట్ అవుతాను నాన్సీ నిన్ను కేర్ చేయడానికి నర్స్ ను అపాయింట్ చేశా టేక్ కేర్ అని తన హ్యాండ్ ప్రెస్ చేసి వదులుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు…..

వెళుతున్న జై ను చూసి నీరసంగా కళ్ళు మూసుకున్న నాన్సీ కి ఎవరో తనను చీకట్లో తరమడం తను ఒక పెద్ద బంగ్లా నుండి మిడ్ నైట్ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా భయంగా పరిగెడుతూ వెళ్తూ ఉంటే తన వెనుక పందుల్లా ఉన్న నలుగురు రౌడీలు తరుముతూ వస్తున్నారు…..

అసలే చీకటి తను ఎక్కడుందో కూడా నాన్సీ కు తెలియదు సహాయం చేయడానికి తనకు ఇక్కడ ఎవరు తెలియదు…… ఎలా వెళ్తుందో ఎటు వెళ్తుందో కూడా తెలియని స్థితిలో వెళ్తున్న నాన్సీ ముందున్నది ఒక్కటే ఈ రౌడీ ల నుండి ఎలాగైనా తప్పించుకోవాలి……

వంట్లో శక్తి లేకపోయినా ఎలా అయినా ఈ నరకం నుండి బయట పడాలి అన్న గట్టి కోరికే నాన్సీ ను ఆ చీకట్లో రౌడీలకు దొరకకుండా పరిగెత్తేలా చేస్తోంది….. అలా పరిగెడుతున్న నాన్సీ ఎవరో తాగి డ్రైవ్ చేస్తున్న ఒక డబ్బున్న వ్యక్తి కార్ కి డ్యాష్ ఇవ్వడం తో స్పృహ లేకుండా పడిపోతుంది…..

రేయ్ అదిగో రా అది అన్న రౌడీల గొంతు వినగానే నాన్సీ కంట్లో నీళ్ళు కాళ్ళల్లో వణుకు మొదలవుతూ మెల్లగా స్పృహ తప్పుతోంది…… తనకు మళ్ళీ నరకం తప్పదని ఈ యాక్సిడెంట్ లో చచ్చిపోయినా బావుండేది అని అనుకుంటున్న నాన్సీ కి ఎవరివో అరుపులు & కొడుతున్న శబ్దాలు వింటూ పూర్తిగా స్పృహ కోల్పోతుంది……

నో….. అంటూ ఒక్క సారిగా మగత నిద్ర నుండి లేచిన నాన్సీ చుట్టూ చూస్తుంది తను హాస్పిటల్ లో ఉన్నది గుర్తు చేసుకుంటూ మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ ఆ రోజు నువ్వు లేకపోయింటే నేను ప్రాణం లేని శవం లా బ్రతికే దాన్ని జై అని ఏడుస్తూ తన గతాన్ని తలచుకుని ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది……….

 

🤍💗🤍💗🤍💗🤍💗🤍💗

 

హాస్పిటల్ నుండి తన ఫ్లాట్ కి వెళ్ళి ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే ఎయిర్ పోర్ట్ కి స్టార్ట్ అయిన జై దారిలో 5ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఆపి ఒక బొకే తీసుకుని ఇంకెక్కడా ఆగకుండా డైరెక్ట్ గా ఎయిర్ పోర్ట్ కి రీచ్ అవుతాడు……

కార్ పార్క్ చేసి చేతిలోని బొకే తో ఎయిర్ పోర్ట్ లోకి నడిచిన జై వెయిటింగ్ లాంజ్ లో కూచుని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు…. కాసేపటికి ఫ్లయిట్ ల్యాండ్ అయిందని ఎనౌన్స్మెంట్ వినిపించగానే తన పక్కనున్న చారి వైపు చూస్తాడు….

అప్పటికే 2 గంటల ముందే ఎయిర్ పోర్ట్ కి వచ్చిన చారి జై చూపుకు బొకే చేతిలో పట్టుకుని రెడీగా ఉండగానే జై బ్లేజర్ సరి చేసుకుంటూ పైకి లేచి ముందుకు నడవగానే వెనుకే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చారి ఫాలో అవుతాడు…..

10 మినిట్స్ వెయిటింగ్ తర్వాత జై వెయిట్ చేస్తున్న పర్సన్స్ కనిపించగానే సర్ వాళ్ళు వచ్చేస్తున్నారు అని చారి చెప్పగానే కాల్ కట్ చేసి ఎదురుగా చూసిన జై కి బ్లాక్ సూట్ లో కళ్ళకు ఉన్న గాగుల్స్ తీస్తూ రాయల్ వాక్ చేస్తూ వస్తూ కనిపిస్తాడు రుద్రాన్ష్ ……

హ్మ్మ్…… పర్లేదు బానే ఉన్నాడు బట్ నా అంత హ్యాండ్సం గా లేడు అని జై రుద్ర వైపు చూస్తూ ఉంటే జై ను చూసిన రుద్ర కూడా ఫోటోస్ లో కంటే నా బావ గాడు డైరెక్ట్ గానే బావున్నాడు ఎంతైనా నా పొట్టి అన్న కదా ఆ మాత్రం ఉంటాడు లే అయినా నా అంత అందంగా అయితే లేడు లే అని ఒకరిని చూసి ఒకరు అనుకుంటూ ఉంటారు…..

మా సర్ నే అందగాడు అనుకుంటే ఈయన కూడా అంతే అందంగా ఉన్నాడు ఏంటి వీళ్లలో ఎవరిని చూడాలో నాకే అర్థం కావడం లేదు ఇక ఫిమేల్ స్టాఫ్ పరిస్థితి ఏంటో 🤷🤷 …… హు 😏 బాస్ లు ఇంత అందంగా ఉంటే ఇక మమ్మల్ని ఎందుకు చూస్తారు ☹️ నేనే ఇలా ఫీల్ అయితే ఆఫీస్ లో అమ్మాయిలు ఇక వర్క్ మీద కాన్సంట్రేట్ చేస్తారా నా పిచ్చి కాకపోతే??

హలో బొకే ఇచ్చింది నిన్ను పట్టుకోమని కాదు అని చారి చేతుల్లో నుండి బొకే లాక్కుని తినేసేలా ఎందుకలా చూస్తున్నావ్ అని చారికి గడ్డి పెడుతూ రుద్రాన్ష్ దగ్గరగా వచ్చేసరికి హాయ్ రుద్రాన్ష్ వెల్కమ్ టు ఇండియా అంటూ బొకే ఇస్తూ హగ్ చేసుకోగానే రుద్రాన్ష్ కూడా నవ్వుతూ జై ను హగ్ చేసుకుంటాడు……

కాలేజ్ లో ఉన్న మాయ హార్ట్ బీట్ అమాంతం రైస్ అవ్వడం తో ఏంటిది ఇలా కొట్టుకుంటుంది అని హార్ట్ పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది……

 

చూడండి గాయ్స్ నేను జై ను నెగెటివ్ గా ఎక్కడ చూపించడం లేదు….. తన క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశామో అలాగే ప్రెసెంట్ చేస్తున్నాం & స్టోరీ ఎలా అనుకున్నామో అలాగే ఉంటుంది మీరు అసలు టెన్షన్ తీసుకోకండి హ్యాపీగా స్టోరీ రీడ్ చేస్తూ వీడియో కి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి చాలు ☺️😌 ఇంత కష్టపడి మేము మీకు నచ్చినట్టు రాస్తున్నాం కదా సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పడం పెద్ద కష్టం కాదు కదా సో చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి గాయ్స్ స్టే ట్యూన్ టు బ్రోకెన్ హార్ట్స్ 💔 💔

 

జై గురించి సంధ్య చెప్పిన మాటలకు ఆద్య మనసు మారబోతుందా ?? నాన్సీ ను ఇంతలా భయపెడుతున్న తన గతం ఏంటి??