Login with OTP

విలన్ హస్బెండ్-43

aashyatech

Author

జై, రుద్ర ఒకరిని ఒకరు హగ్ చేసుకోగానే బాబోయ్ నాకేంటి కుడి కన్ను ఇలా అదురుతోంది అని తన కన్ను ను చేత్తో రుద్దుకుంటూ నుంచున్న చారి ఇద్దరి వైపు చూస్తూ జై సర్ నే అనుకుంటే రుద్ర సర్ కూడా యాటిట్యూడ్ బాస్ లానే కనిపిస్తున్నారు….. ఎందుకైనా మంచిది ఈయన తో కూడా కేర్ఫుల్ గా ఉండాలి అనుకుంటూ తాను రుద్రాన్ష్ కోసం తెచ్చిన బొకే ను చేత్తో పట్టుకుని ఎక్స్సైటింగ్ గా రుద్ర తన వైపు ఎపుడు చూస్తాడా ఎపుడు విష్ చేద్దామా అని వెయిట్ చేస్తుంటాడు……

జై నుండి దూరం జరిగిన రుద్ర ఆనంద్ ను జై కి ఇంట్రడ్యూస్ చేస్తూ జై దిస్ ఇస్ ఆనంద్ మై వన్ అండ్ ఓన్లీ బెస్ట్ బడ్డీ అంటూ పరిచయం చేయగానే హాయ్ ఆనంద్ అంటూ జై ఆనంద్ ను హగ్ చేసుకుంటాడు….. హలో జై రుద్ర నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు నా బాస్ కూడా అంటూ నవ్వగానే షట్ అప్ మ్యాన్ అంటూ రుద్ర ఆనంద్ కడుపున పంచ్ ఇస్తూ తనను చూసి 32 పళ్ళు కనిపించేలా నవ్వుతున్న చారి వైపు చూస్తాడు……

 

క్రీమ్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ఫార్మల్ ప్యాంట్ టక్ చేసుకుని నుదుటిన కుంకుమ దాని మీదుగా చిన్నగా విభూది పెట్టుకుని భూతద్దాలు లాంటి స్పాట్స్ పెట్టుకుని కొంచెం విచిత్రంగా ఉన్న చారి వైపు చూస్తున్న రుద్ర ను చూసి రుద్ర దిస్ ఇస్ చారి నా పీ. ఏ. అంటూ చారి ను ఇంట్రడ్యూస్ చేయగానే ఓహ్ అని చిన్నగా చెప్పి ఇక వెళ్దామా అంటూ ఇంటికి వెళ్ళడానికి తొందర పెడతాడు ( ఓహ్ హో 😉 మన రుద్ర జై విల్లా కి వెళ్ళడానికి ఎందుకు అంత తొందర పెడుతున్నాడో నాకు అర్థం అయింది 😜 మరి మీకు 🥱🫣)

వెల్కమ్ టు ఇండియా సర్ అని బొకే ఇస్తూ హగ్ చేసుకోవడానికి రాబోతున్న చారి ను కళ్ళతోనే కంట్రోల్ చేసి జై తో ఆఫీస్ విషయాలు డిస్కస్ చేస్తూ వెళ్తున్న రుద్ర ను చూసి చారి మొహం వాడిపోతుంది ☹️😶……..

ఏంటి చారి గారు మా వాడి బిహేవియర్ కి ఫీల్ అయ్యారా అని చారి ఫేస్ చూసి కన్సర్న్ చూపిస్తూ అడుగుతాడు అక్కడే ఉన్న ఆనంద్…… గారు అంటూ అంత రెస్పెక్ట్ ఇవ్వకండి సర్ పొట్ట రావడం వల్ల ఏజ్డ్ లా కనిపిస్తాను కానీ నాకు 30 ఇయర్స్ నే అండి మీరు నన్ను చారి అని పిలవచ్చు……

హహ 😅 అలా చూసినా మీరు నా కంటే 5 ఇయర్స్ సీనియర్ చారి గారు ఒకే మీ రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా మీరు కూడా నన్ను ఆనంద్ అని పిలవండి చాలు అంటూ ఆనంద్ షేక్ హ్యాండ్ ఇవ్వగానే చారి నవ్వుతూ నైస్ టు మీట్ యూ ఆనంద్ అని చిరు నవ్వుతో చెప్తూ మీరు ఇంత కూల్ గా కనిపిస్తున్నారు మరి మీ ఫ్రెండ్ ఏంటి ఆనంద్ అంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు…..??

ఓహ్ అదా రుద్ర కి నార్మల్ యాటిట్యూడ్ కాదు అంతకు మించిన యాటిట్యూడ్ ఉంది నువ్వు చూసింది ఇంత చూడాల్సింది ఎంతో ఉంది…… అయినా తినబోతూ రుచి దేనికి చారి కమ్ అంటూ చారి ను జై, రుద్ర ల వెనుకే వాళ్ళ లగేజ్ ప్యాక్ తో ఫాలో అవుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ కార్ దాకా వెళతారు…..

చారి లగేజ్ మొత్తం నీ కార్ కార్ లోకి జాగ్రత్తగా షిఫ్ట్ చేసి మాన్షన్ కి తీసుకుని వచ్చెయ్ అని చెప్పిన జై రుద్ర, ఆనంద్ లను తీసుకుని తన కార్ లో మాన్షన్ కి స్టార్ట్ అవుతాడు….. ఆనంద్ చారి తో వస్తాను అని చెప్తున్నా వినకుండా తనతో పాటు తీసుకుని వెళ్తున్న జై ను చూసి నిట్టూర్చి జన్మమెత్తితిరా అనుభవించితిరా బతుకు సమయములో నలిగిపోయితిరా అని ఆర్ …ఆర్ …. వేసుకుంటూ నన్ను పి. ఏ. అనుకున్నాడా మీ ఇంట్లో పని చేసే వాడిని అనుకుంటున్నారా సర్ 😬😬 అంతా నా కర్మ చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అన్నారా 🤷🤦

వెళ్తున్న జై ను తిట్టుకుంటున్న చారి పాకెట్ లో మొబైల్ రింగ్ అవ్వడం తో హలో అంటూ కాల్ లిఫ్ట్ చేసిన చారి తో ఫీల్ అయింది నన్ను తిట్టుకుంది చాలు కానీ లగేజ్ తీసుకుని స్టార్ట్ అవ్వు నేను మాన్షన్ రీచ్ అయ్యేసరికి నువ్వు అక్కడ ఉండాలి…..

ఇది అన్యాయం సర్ మీరు వెళ్ళి ఆల్రెడీ 5 మినిట్స్ అవుతుంది మీ కంటే ముందు నేను ఉండగలను అక్కడ….. ఏంటిది సౌండ్ వినిపించడం లేదు సర్…. సర్….. అంటున్న చారి కి బీప్ సౌండ్ రావడం తో కట్ చేశాడని అర్థం చేసుకుని ఈయన గురించి తెలిసి కూడా ఇక్కడ పిచ్చోడిలా తిట్టుకుంటున్నా చూడు నన్ను అనుకోవాలి 🤦…… అమ్మో టైమ్ లేదు త్వరగా స్టార్ట్ అవ్వాలి అని లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసి షార్ట్ కట్స్ లో సందుల్లో తిప్పి తిప్పి ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ జై మాన్షన్ కి రీచ్ అయ్యే 2 మినిట్స్ ముందుగానే తనే రీచ్ అవుతాడు చారి…..

వావ్ చారి మా కంటే లేట్ గా స్టార్ అయినా ఫాస్ట్ గా వచ్చేసావ్ అని కార్ నుండి దిగుతూ అంటున్న ఆనంద్ ను చూసి చారి ఎడ్వలేక నవ్వుతాడు 🥲….. నందు కమ్ అని సీరియస్ గా పిలుస్తూ జై పక్కనే నడుస్తున్న రుద్ర వాయిస్ కి యాహ్ కమ్ చారి అంటూ ఆనంద్ చారి ను పిలవగానే నువ్వెళ్ళు ఆనంద్ నేను లగేజ్ మెయిడ్స్ తో పంపించి వస్తాను అని అందరినీ పంపేశాక మెయిడ్స్ తో లగేజ్ ఒక్కోటి జాగ్రత్తగా లోపల పెట్టించి ఆఖరిగా చారి లోపలికి వెళతాడు…..

ప్లీస్ కమ్ రుద్ర అంటూ నవ్వుతూ లోపలికి ఇన్వైట్ చేస్తూ ఇదే మా హోమ్ అని నవ్వుతూ ఇద్దరికీ తన అందమైన మాన్షన్ చూపిస్తూ హాల్ లో కూర్చున్న ప్రతాప్, వినయ్ వర్మ లను చూసి ఇద్దరినీ తీసుకుని వాళ్ళ వైపు నడుస్తాడు…..

గుడ్ ఈవెనింగ్ తాతయ్య అన్న జై వాయిస్ కి తల పైకి ఎత్తిన ఇద్దరూ జై పక్కన కొత్తగా కనిపిస్తున్న రుద్ర, ఆనంద్ లను ఎవరు అన్నట్టు చూస్తూ ఉన్నారు ….. మార్నింగ్ చెప్పాను కదా మన ఇంటికి ఈవెనింగ్ గెస్ట్స్ వస్తారు ఇక్కడే మనతో పాటు వన్ మంత్ స్టే చేస్తారు అని వాళ్లే వీళ్ళు రుద్ర & ఆనంద్…….

రుద్ర తను మా తాతయ్య ప్రతాప్ వర్మ & ఈయన నా ఫాదర్ వినయ్ వర్మ అని ఒకరిని ఒకరికి పరిచయం చేస్తాడు….. హలో తాతయ్య అని రుద్ర ప్రతాప్ బ్లెస్సింగ్స్ తీసుకోగానే అరే గాడ్ బ్లెస్ యూ బాబు అని ప్రతాప్ బ్లెస్ చేసాక వినయ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని ఆనంద్ తో పాటు సోఫా లో సెటిల్ అయ్యి మాట్లాడుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు…..

ఈ లోగా రేణుక కూడా అందరికీ టీ తీసుకుని రాగానే జై రేణుక ను రుద్ర కి పరిచయం చేస్తాడు…. బేసిక్ గా రేణుక మీద గుడ్ ఒపీనియన్ లేని రుద్ర హలో ఆంటీ అని చిన్న విష్ పడేసి టీ సిప్ చేస్తూ ఉండగా అపుడే మాయ అన్నయ్య వచ్చేసావా అంటూ ఎంట్రీ ఇవ్వగానే రుద్ర తన వైపే రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండిపోయాడు 😍🤩

బ్లాక్ స్లీవ్లెస్ క్రాప్ టాప్ బ్లూ కలర్ షార్ట్ డెనిమ్ లో హెయిర్ లీవ్ చేసుకుని లైట్ మేకప్ తో క్యూట్ డాల్ లా కనిపిస్తున్న మాయ ను చూసి 🤩🤩 నే… పడిపోయా… పడిపోయా నీకే నే పడిపోయా అని బ్యాగ్రౌండ్ లో సాంగ్ వేసుకుంటూ ఉంటాడు……

ఎంత సేపు అవుతుంది అన్నయ్య వచ్చి అని అడుగుతూ జై మెడ చుట్టూ చేతులు వేసి ఏంటి స్పెషల్ ఇవాళ త్వరగా వచ్చేసావ్ అని అడుగుతూ ఉంటుంది……… ఇందాకే రా అంటూ రుద్ర కి మాయ ను తన చెల్లిగా పరిచయం చేస్తాడు….

మన రుద్ర బాబు ఇక్కడ ఉంటే కదా మాయ పాప తో ఫారెన్ లోకేషన్స్ డూయెట్ వేసుకుంటూ జై మాటలు పట్టించుకోడు….. వీడి కొంప వీడే ముంచుకునేలా ఉన్నాడు అని పక్కనున్న ఆనంద్ టెన్షన్ పడుతూ రేయ్ అంటూ రుద్ర బుజం పట్టుకుని గిల్లగానే స్పృహ లోకి వచ్చిన రుద్ర హా…. హలో అంటూ పైకి లేచి మాయ ను హగ్ చేసుకోబోతాడు…..

రుద్ర బిహేవియర్ కి తన వైపు వియర్డ్ లుక్ ఇస్తూ హాయ్ అంటూ ఒక్క మాట చెప్పి ఒకే అన్నయ్య ఫ్రెష్ అయి వస్తాను అని ఆనంద్ ను చూసి పలకరింపుగా నవ్వి స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోతుంది…..

రుద్ర కమ్ మీకు రూమ్స్ చూపిస్తాను అని ఇద్దరినీ పైకి తీసుకుని వెళ్ళి చెరొక రూమ్ చూపించడం తో ఇద్దరూ ఫ్రెష్ అవ్వడానికి వెళతారు వాళ్ళు వెళ్లాక జై కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు…..

రూమ్ లోకి వచ్చిన మాయ ఏంటిది ఇందాక ఆ రుద్ర నా దగ్గరకు వచ్చేసరికి నా హార్ట్ అంత స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంది అని ఆలోచిస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది……

🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍

ఇపుడే కదా అమ్ము ఆఫీస్ నుండి వచ్చావ్ మళ్ళీ ఎక్కడికి రెడీ అయి వెళ్తున్నావ్ అని కిందకు వచ్చిన కూతురికి కాఫీ కప్ ఇస్తూ ఆరాగా అడుగుతుంది శైలు…… మామ్ ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళే వాళ్లను ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగకూడదు అని మీ మమ్మీ ఎప్పుడు చెప్పలేదా??

మా మమ్మీ కి ఎలాగో బుద్ధి లేదు మరీ మీ మమ్మీ కి అయినా ఉండాలి కదా ఇలాంటివి అన్నీ చెప్పకుండా ఎమ్ చేస్తుంది….. ఏంటో చిన్న పాప కి చెప్పినట్టు అన్ని నేనే చెప్పాల్సి వస్తుంది అని వేదాంతం చదివిన దానిలా అంటున్న ఆధ్య చెవి మెలి పెడుతూ నన్ను అంటున్నది చాలదా మా అమ్మ ను ఎందుకే లాగుతున్నావ్???

అబ్బా మమ్మీ వదులు ఇట్స్ పెయినింగ్ అంటూ శైలు చెవి వదలగానే లేకపోతే ఏంటి మమ్మీ ఎప్పుడు బయటకు వెళ్తున్నా సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తూ చిరాకు తెప్పిస్తున్నావ్……

నువ్వు బయటకు వెళ్తున్నావ్ అంటే చాలే గుండె దడగా ఉంటోంది ఎపుడు ఎమ్ గొడవ చేస్తావో అని పైగా నీకు తోడు ఆ మాన్య ఒకటి ఇద్దరూ రౌడిల్లా తయారు అయ్యారు అని అంటూ ఉండగానే సిగ్గేస్తుంది నిను చూస్తుంటే……సిగ్గేస్తుంది నీ మాట వింటే ……సిగ్గేస్తుంది నీతో ఉంటే ….. అంటూ సాంగ్ సింగుతూ ఎంటర్ అవుతుంది మాన్య……

మీరు ఎందుకు సిగ్గు పడతారే మిమ్మల్ని చూసి మేము కదా సిగ్గు పడాలి అని నడుము మీద చెయ్ పెట్టుకుని ఎక్కడికే ఇద్దరూ కట్ట కట్టుకుని రెడీ అయ్యాయి మళ్ళీ ఎవరి పెళ్ళి ఆపడానికి వెళ్తున్నారు….??

చాలు ఆపు మమ్మీ…..!! మాకు ఇంకేం వర్క్ లేదు అనుకున్నావా ఏంటి ఒక పెళ్లి ఆపాం అంతే అది కూడా మా ఫ్రెండ్ కోసం దాన్ని పట్టుకుని నువ్వు ఆంటీ డైలీ సీరియల్ సాగదీసి నట్టు ఎపిసోడ్స్… ఎపిసోడ్స్ వాయిస్తున్నారు…..

 

మేము అది ఆపడం వల్లే ఇద్దరు అమ్మాయిల లైఫ్స్ సేఫ్ గా ఉన్నాయి దానికి కొంచెం కూడా నువ్వు గ్రాటిట్యూడ్ చూపించక పోగా ఫుల్ గా తిడుతున్నావ్ అదే ఏదైనా సినిమా హీరోయిన్ చేస్తే మాత్రం క్లాప్స్ కొడతావ్ సొంత కూతురు చేస్తే మాత్రం వాతలు పెడతావ్ 🤦😏…..

 

అయిపోయిందా నీ వాదన టాపిక్ డైవర్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి ఇళ్ళు కదలండి అని సీరియస్ గా అంటున్న శైలు ను చూసి ఇద్దరు 🤦🤦 తల కొట్టుకుంటూ మమ్మీ స్ అందరినీ కట్ట కట్టేసి పైన పడేయాలి అని అరచి సండే అందరం విలేజ్ కి వెళ్తున్నాం కదా………

 

సో షాపింగ్ కి వెళ్తున్నాం మాయ కూడా వస్తుంది చాలా అని అరచి మాన్య ను లాక్కుని వెళ్తున్న కూతురుని చూసి ఇది చెప్పడానికి నాతో ఇంత డిబేట్ ఎందుకు అదేదో ముందే చెప్పొచ్చు కదా అనుకుంటూ ఆద్య, మాన్య ల వల్ల వచ్చిన తల నొప్పికి మెయిడ్ తో కాఫీ తెప్పించుకుని తాగుతుంది…….

 

🤍💗🤍💗🤍💗🤍💗🤍💗🤍

మాయ మీ మాన్షన్ ముందు బయట వెయిట్ చేస్తున్నాం నేను మాన్య నువ్వు త్వరగా రా ఇప్పటికే ట్రాఫిక్ లో బాగా లేట్ అయింది అని జై మ్యాన్షన్ ముందు కార్ ఆపి మాయ కి కాల్ చేస్తుంది ఆద్య…… ఇంటి ముందు ఏంటి వదిన లోపలికి రా నేను ఎ డ్రెస్ వేసుకోవాలి అని కన్ఫ్యూషన్ లో ఉన్నాను ప్లీస్ వచ్చి హెల్ప్ చెయ్……

ఇంట్లో మీ గున్న అదే మీ అన్న ఉంటాడు వాడ్ని చూస్తే నా మూడ్ స్పాయిల్ అవుతుంది ఎదోటి వేసుకుని రా మాయ మనం వెళ్తుంది షాపింగ్ పెళ్ళి చూపులకు కాదు…..
అన్నయ్య తన రూమ్ లో ఉన్నాడు నిన్ను అన్నయ్య ఎమ్ అనకుండా నేను చూసుకుంటా నువ్వు ఫస్ట్ రా అంటూ మాయ కాల్ కట్ చేస్తుంది…. హుష్ సరిపోయింది 🙆 ఈ అన్నా చెల్లెళ్ళు చెప్పేది పూర్తిగా వినరు అనుకుంటా అని నిట్టూర్చి పదవే వెళ్దాం అంటూ మాన్య చెయ్ పట్టుకుని లాగుతుంది…..

నాకు ఓపిక లేదు నువ్వు వెళ్ళి తీసుకుని రా అమ్ము అని సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ చెప్తున్న మాన్య ను చూసి సర్లే అని ఆద్య ఒకటే లోపలికి వెళ్తుంది….. మాయ రూమ్ ఎపుడు ఆద్య చూడక పోవడం తో ఒక్కో రూమ్ చూసుకుంటూ వెళ్తున్న ఆద్య జై రూమ్ లోకి వెళ్ళి మాయ….. మాయ అని పిలుస్తూ ఉండగా బాల్కనీ లో నుండి ఓన్లీ బాక్సర్ తో లోపలికి వచ్చిన జై ను చూసి షాక్ అవుతూ రేయ్ నువ్వెంట్రా ఇక్కడ అంటూ వెనక్కి తిరుగుతుంది…..

 

ఏయ్ మెంటల్ నువ్వేంటి నా రూమ్ లో అని అడుగుతూ ఆద్య ముందుకు వచ్చి నుంచుంటాడు…… ఇది నీ రూమ్ ఆ సారి అని వెళ్ళబోతున్న ఆధ్య చెయ్ పట్టుకుని మీదకు లాక్కుని నా రూమ్ లోకి నా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావ్ అని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు…..

మాయ రూమ్ అనుకుని వచ్చాను వాంటెడ్ గా కాదు వదులు అని జై చేతులు ఎక్కడ ఎక్కడో తాకుతూ ఉంటే జై ను విసుగ్గా వెనక్కి నెడుతూ అంటుంది….. ఏమో వాంటెడ్ గానే వచ్చావేమో ఎవరికి తెలుసు అసలే నేనంటే నీకు బోల్డంతా లైకింగ్ కదా అంటూ కన్ను కొడుతున్న జై ను చూసి ఓవర్ యాక్షన్ చేయకు నువ్వంటే నాకు చిరాకు తప్పా ఇంకో ఫీలింగ్ లేదు అని అరుస్తూ వదలరా దొంగ సచ్చినోడా అని తిడుతూ ఉంటుంది…..

ఏంటి వదులుగా పట్టుకున్నానా ఇప్పుడు ఓకేనా అంటూ ఆధ్య ను మరింత గట్టిగా తన కౌగిలి లో చుట్టేస్తాడు జై….. రేయ్ నిన్ను అని అరవబోతున్న ఆద్య డోర్ సైడ్ ఉండడం తో అపుడే ఎవరో డోర్ ఓపెన్ చేయగానే ఆద్య ను వాల్ వైపు మార్చి తను డోర్ వైపు వచ్చిన జై కావాలని ఆద్య నడుము మీద చేతులు పెడుతూ అక్కడికి వచ్చిన ఆనంద్ తో మాట్లాడుతూ ఉంటాడు…..

ఇప్పుడు అరిస్తే తను ఇక్కడ ఎందుకు ఉందో చెప్పాలి & జై వంటి మీద షార్ట్ తప్పా ఇంకేం లేదు దాని కోసం సైలెంట్ గా జై చేతులని నెడుతూ భరిస్తూ ఉన్న ఆద్య కి జై చేతులు నడుము మీదుగా పైకి వెళ్ళడం చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది…… ఈ లోగా వాళ్ళు వెళ్ళిపోవడం ఆద్య జై ను వెనక్కి నెడితే అంతే ఫోర్స్ కి ముందుకు వచ్చిన జై ఆద్య మీద పడ్డం తో ముచ్చటగా ఇద్దరి మధ్య మూడో ముద్దు కూడా జరిగిపోతుంది……

జై, ఆద్య ల మధ్య అనుకోని ముద్దు నెక్స్ట్ ఎమ్ జరగబోతుంది?? ఆధ్య తన అన్నయ్య రుద్ర ను డైరెక్ట్ గా చూడబోతుందా చూస్తే తనే తన అన్నయ్య అని గుర్తు పడుతుందా??