విలన్ హస్బెండ్-45
మాయ నవ్వుతూ డిన్నర్ చేస్తున్న అందరి వైపు చూస్తూ తనకు కాల్ వచ్చినట్టు యాక్ట్ చేస్తూ హలో హా చెప్పవే ఏంటి నిజామా!! ఎపుడు….? ఎక్కడ?? వన్ సెకండ్ నీ వాయిస్ బ్రేక్ అవుతుందే జస్ట్ హోల్డ్ ఆన్ అంటూ కాల్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళడం పక్కనే కూర్చున్న రుద్ర చూసి ఏదో సెన్స్ చేస్తూ జై తో మాట్లాడుతూ ఉంటాడు…..
హమ్మయ్య ఎవరికి డౌబ్ట్ రాలేదు అని దూరం నుండి అందరి వైపు చూస్తుంది…… ఎవరి గోల లో వాళ్ళు ఉండి ఎవరు తనను పట్టించుకోలేదు అని మరో సారి కన్ఫర్మ్ చేసుకుని హరిణి నంబర్ కి వీడియో కాల్ కనెక్ట్ చేస్తుంది….. అప్పుడే డిన్నర్ చేయడానికి నలుగురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటున్న హరిణి తన మొబైల్ కి మాయ నుండి వీడియో కాల్ రావడం చూసి ఏంటిది ఎపుడు లేనిది ఇది కాల్ చేస్తుంది….??
ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ హరిణి? మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయకుండా ఏంటి అంత కోపంగా దాని వైపు చూస్తున్నావ్?? ఎవరు అక్కడ కాల్ చేస్తోంది అని అడుగుతూ ప్లేట్ లో ఉన్న లెగ్ పీస్ తింటూ అడుగుతాడు మాదేష్…..
మాయ డాడ్ నేను కాల్ చేస్తే మాట్లాడడానికే చిరాకు పడేది అలాంటిది తనే కాల్ చేస్తుంటే కొంచెం షాకింగ్ గా ఉంది…..
మే బీ నీకు సారి చెప్పడానికి కాల్ చేస్తుందేమో మొన్న జరిగిన గొడవ వల్ల మనం దూరంగా ఉన్నాం కదా సో సారి చెప్పడానికి చేస్తూ ఉంటుంది ఫస్ట్ నువ్వు కాల్ పిక్ చెయ్ హరిణి….
నువ్వు మాయ గురించి ఇంత పాజిటివ్ గా థింక్ చేయకు మామ్ అది ఇన్నోసెంట్ గా కనిపించే కన్నింగ్ క్యాండిడేట్ కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తా ఆగు అంటూ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తున్న మాయ కాల్ ను అటెండ్ చేస్తుంది……
హాయ్ హరిణి ఎలా ఉన్నావ్ అని నవ్వుతూ అడుగుతున్న మాయ ను చూసిన హరిణి ఏంటి దీని మొహం వైజాగ్ లైట్ హౌస్ లా వెలిగిపోతోంది అని డౌబ్ట్ గా చూస్తూ ఎందుకు కాల్ చేసావ్ మాయ ఇంకా నన్ను నా ఫ్యామిలీ ను తిట్టాల్సిన తిట్లు బ్యాలెన్స్ ఉన్నాయా అంటూ బాధగా అడుగుతుంది……
అరే సమ్థింగ్ ఏదో మిస్ అయింది హరిణి యాహ్ గుర్తొచ్చింది నువ్వు డైలాగ్ తో పాటుగా కాస్త ఏడుపు కూడా నీ డ్రామా లో యాడ్ చేసుంటే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది ప్చ్ ….. సర్లే నెక్స్ట్ టైం అలా ట్రై చెయ్ హరిణి డెఫినెట్ గా నీ మాటలు నమ్మేస్తాం
నా ఏడుపు నీకు డ్రామా లా ఉంది కదా మాయ అంటూ డల్ గా ఫేస్ పెట్టుకుని యూ నో ఆ రోజు నుండి ఇవాల్టి వరకు నేను సరిగ్గా ఫుడ్ తినడం లేదు & నిద్ర కూడా రావడం లేదు హరీష్ అయితే నిన్నే కలవరిస్తూ ఎవరితో మాట్లాడడం లేదు ఇప్పటికైనా వాడి లవ్ అర్థం చేసుకో మాయ…..
వావ్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నావ్ హరిణి యూ నో నీలో ఒక గొప్ప నటి ఉంది మూవీస్ లోకి వెళ్తే నంది అవార్డ్ కాకపోయినా ఎట్ లీస్ట్ పంది అవార్డ్ అయినా ఇస్తారు అంటూ ఒక్క సారిగా సీరియస్ గా చూస్తూ ఈ పుల్కా డైలాగ్స్ అన్నీ నిన్ను నీ ఫ్యామిలీ ను గుడ్డిగా నమ్మేస్తుంది కదా మా పిచ్చి మమ్మీ తనకు చెప్పు నాకు కాదు 😏
మీరు మా ప్రేమను అర్థం చేసుకుని మేము కావాలి అనుకునే టైం కి మేము శవాలుగా కనిపిస్తాం అప్పుడు కానీ మీకు మా ప్రేమ అర్థం అవ్వదు 🥲
అచ్ఛా ఆ పని చేయండే బాబు మాకు పట్టిన శని, దరిద్రం, దుష్ట గ్రహం అన్నీ వదులుతాయి….. సర్లే నీ యాక్టింగ్ లైవ్ లో చూడ్డానికి కాదు నీకు కాల్ చేసింది నీకో సూపర్ సీన్ చూపించడానికి కాల్ చేశాను అది చూసి బాగా ఏడువు ఎలాగో నీ కన్నింగ్ ఫ్యామిలీ కూడా నీ దగ్గరే ఉన్నారు అని అర్థం అవుతుంది సకుటుంబ సపరి వారి సమేతంగా మా ఆనందాన్ని చూసి ఎటైనా పడి చావండి అని సర్కాస్టింగ్ గా అంటూ ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి డిన్నర్ చేస్తున్న తన ఫ్యామిలీ ను చూపిస్తుంది…..
జై ఫ్యామిలీ తో ఆద్య ఫ్యామిలీ ఇంకా మాన్య, అమర్, రుద్ర, ఆనంద్ ఇలా అందరూ ఒకే చోట కూర్చుని సరదా కబుర్లతో డిన్నర్ చేస్తున్నారు….. షాకింగ్ గా అనిపిస్తుంది ఏంటంటే రేణుక అందరికీ నవ్వుతూ సర్వ్ చేస్తూ ఎవరికి ఎమ్ కావాలో అడిగి మరీ వడ్డిస్తోంది…..
పక్క పక్కన కూర్చుని తింటున్న ఆద్య, జై లను చూసి హరిణి కి మండిపోతూ ఉంటుంది…… చూసావా అందరం ఎంత హ్యాపీగా ఉన్నామో ఈవెన్ మామ్ కూడా చేంజ్ అయిపోయింది నువ్వే చూసావు కదా ఎంత బాగా అందరితో కలిసి పోయి సర్వ్ చేస్తుందో మీరు ఉన్నారు అన్న విషయం కూడా గుర్తు రావడం లేదు తనకు అని నవ్వుతున్న మాయ ను హరిణి కోపంగా మాయ అంటూ పళ్ళు నూరుతూ కోపంగా అరుస్తుంది…..
హుష్ అరవకే నీకు ఈ సీన్ లో డైలాగ్స్ లేవు నేను చెప్పేది మాత్రం అన్ని మూసుకుని విను ఎంత ఫోజ్ కొట్టావే నా మందు ఇన్ని డేస్ చూసావా నువ్వు కన్న డ్రీమ్స్ మొత్తం ఎలా స్పాయిల్ అయ్యాయో అని వెటకారంగా నవ్వుతూ నువ్వు ఎంత గుర్రుగా చూసిన నువ్వేం పీ…. వద్దులే ఎంతైనా ఆడపిల్లవి నిన్ను ఇలా అనడం బాగోదు……..
మాయ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ నాకు కనుక కోపం వస్తే ఎమ్ చేస్తానో నాకే తెలియదు అనవసరంగా నన్ను రెచ్చకొట్టకు….??
హహ కుక్క అరుపులు నేను పెద్దగా కేర్ చేయను హరిణి నీ గుండె బద్దలయ్యే ఒక న్యూస్ చెప్పనా అంటూ మళ్ళీ ఫ్రంట్ క్యామ్ ఆన్ చేస్తూ అదిగో అక్కడ జై అన్నయ్య పక్కన కూర్చుందే తన పేరు ఆద్య మా అన్నయ్య కి కాబోయే వైఫ్ వాళ్ళ ఇద్దరికీ మ్యారేజ్ చేయాలని అందరం డిసైడ్ అయ్యాం సో నువ్వు బుద్దిగా సైడ్ అయిపోయి నీ రేంజ్ కి సరిపోయే రోడ్ మీద అడుక్కునే వాడినో చెత్త పేపర్స్ ఏరుకునే వాడినో చేసుకుని సెటిల్ అవ్వు ఒకే అంటూ నవ్వుతూ కాల్ కట్ చేసిన మాయ మాటలకు హరిణి కోపంగా తన మొబైల్ నేల మీదకు విసరగానే అది నాలుగు ముక్కలు అవుతుంది…..
హరిణి ఏంటి నువ్వు చేస్తోంది అది 3 లాక్స్ మొబైల్ అలా పడేశావ్ ఏంటి అని అరుస్తున్న శ్వేత మాటలు కేర్ చేయకుండా ఆ మాయ చేతిలో నేను ఓడిపోతున్నా మామ్ అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్ని డిషెస్ బౌల్స్ కింద పడేస్తూ పిచ్చిగా బిహేవ్ చేస్తున్న హరిణి ను మాదేష్ కష్టంగా కంట్రోల్ చేస్తూ తన రూమ్ కి తీసుకుని వెళ్తాడు……
కామ్ డౌన్ హరిణి మాయ నిన్ను కావాలనే తన మాటలతో నీకు కోపం వచ్చేలా మాట్లాడింది తను చెప్పినంత మాత్రానా జై కి ఆ మహిదర్ కూతురి తో మ్యారేజ్ జరగదు ఆ ఫ్యామిలీ మొత్తం మ్యారేజ్ చేయాలి అనుకున్నా కూడా జై దానికి చచ్చినా ఒప్పుకోడు ……
ఎందుకు ఒప్పుకోడు జై ఎప్పుడూ కూడా ఫ్యామిలీ కి దూరంగా ఉంటూ తన వరల్డ్ లో తను ఉండే వాడు బట్ నౌ ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు అందరితో షాపింగ్, అవుటింగ్ & ఇప్పుడు అందరితో పాటు 1 వీక్ వేరే విలేజ్ కి వెళ్తున్నాడు…….
ఇంత చేంజ్ జై లో ఎపుడైనా చూసామా?? అలాగే ఆ ఆధ్య ను మ్యారేజ్ చేసుకోడు అని గ్యారెంటీ ఏంటి పైగా అది చాలా అందంగా ఉంది అదే జరిగితే ఆ మాయ నాతో చేసిన ఛాలెంజ్ విన్ అవుతుంది అది నేను బేర్ చేయలేను డాడ్ ప్లీస్ డు సమ్థింగ్ అంటూ మాదేష్ ను పట్టుకుంటూ ఆవేశంగా అడుగుతుంది……
రిలాక్స్ హరిణి మాయ చెప్పింది ఎదీ నాకు నమ్మాలి అనిపించడం లేదు మెయిన్లీ రేణుక చేంజ్ అవ్వడం అనేది జరగదు
స్టాప్ ఇట్ డాడ్ అత్త ను నమ్ముకుంటే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్టే గేమ్ ఆ మాయ స్టార్ట్ చేసింది బట్ ఫినిషింగ్ మనం ఇవ్వాలి దాని వేలితో దాని కన్నే పొడుచుకునే కన్నింగ్ ఐడియా ఇవ్వండి అని హరిణి అడగడం తో కాసేపు ఆలోచించిన మాదేష్ హరిణి వైపు చూస్తూ 5 నిమిషాల పాటు ఎదో చెప్పగానే పర్ఫెక్ట్ డాడ్ మీరు చెప్పినట్టు ఇప్పుడే రెక్కలు వచ్చాయి కదా ఎంత దూరం ఎగురుతారో ఎగరనివ్వండి ఎప్పుడు ఎక్కడ రెక్కలు కట్ చేయాలో అక్కడ కట్ చేద్దాం అని కోపంగా అనుకుంటూ జై ఫ్యామిలీ పతనానికి పునాదులు వేస్తుంటారు…….
🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍
ఫైనల్లీ దీనికి మనశ్శాంతి లేకుండా చేసాను ఇప్పుడు వెళ్ళి ఫుల్ గా లాగించాలి అని నవ్వుకుంటూ కామ్ గా వెళ్ళి తన చైర్ లో కూర్చుంటూ ఆపిన డిన్నర్ ను కంటిన్యూ చేస్తుంది…… ఎక్కడికి వెళ్ళావ్ అని అడుగుతున్న మాన్య తో అర్జంట్ కాల్ వదిన అని చెప్పి డిన్నర్ చేస్తున్న మాయ పిలుపు ను చూసి పోల మారి దగ్గుతూ ఉంటే అయ్యో వదిన మెల్లగా అంటూ వాటర్ గ్లాస్ అందిస్తుంది…..
వాటర్ తాగాక కాస్త సెట్ అయిన మాన్య మాయ వైపు చూస్తూ కొత్తగా వదిన అంటున్నావ్ ఏంటి మాయ ఆద్య ను మాత్రమే గా వదిన అని పిలుస్తావ్??
వదిన అని పిలవకూడదు అని రూల్ ఏమైనా ఉందా ఏంటి అని అమర్ ను చూసి కన్ను కొడుతూ ఏమో పిలవాలి అనిపించింది నువ్వు వద్దు అంటే పిలవను లే అని ఫీల్ అయినట్టు ఫేస్ పెడుతుంది…..
ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది మాయ నీ ఇష్టం అని చెప్పి తిరిగి ఆద్య తో మాటల్లో పడిన మాన్య ను చూసి మాయ నవ్వుతూ అమర్ వైపు చూస్తుంది అమర్ కూడా నవ్వుకుని డిన్నర్ చేస్తూ ఉంటాడు…..
అదేంటి బాబు అందరూ నాన్ వెజ్ తింటుంటే నువ్వేంటి వెజ్ ఐటమ్స్ తింటున్నావ్ కాస్త ఈ కాజు ఫిష్ ఫ్రై ట్రై చెయ్ చాలా బావుంటుంది అంటూ అభిమానంగా అడుగుతూ రుద్ర ప్లేట్ లోకి ఫిష్ ఫ్రై వేయబోతున్న శైలు ను ఆపి లేదు ఆంటీ నేను నాన్ వెజ్ తినను అని చెప్తున్న రుద్ర ను చూసి మాయ , ఆద్య కళ్ళు పైకి ఎత్తి క్షణం పాటు చూసి చూపు తిప్పేస్తారు…..
అందరి డిన్నర్ కబుర్లతో కంప్లీట్ అయ్యాక మెయిడ్స్ అందరికీ గులాబ్ జామ్ బౌల్స్ లో సర్వ్ చేస్తూ ఉంటే వావ్ జామూన్ ఐ లవ్ ఇట్ అని బౌల్ తీసుకుంటూ జామూన్ కి కాంబినేషన్ గా ఇస్ క్రీమ్ ఉంటే సూపర్ గా ఉంటుంది కాస్త ఇస్ క్రీమ్ తీసుకుని రండి అని చెప్పి జామున్ తో పాటు ఐస్ క్రీమ్ తింటున్న రుద్ర ను చూసి మాయ, ఆద్య అలాగే చూస్తూ ఉంటే శైలు కూడా మహిదర్ తో మన రుద్ర కూడా ఇలాగే తినేవాడు కదా మహి జామున్ చేస్తే వాడికి ఇస్ క్రీమ్ కూడా ఉంటేనే తినేవాడు అని చెప్తున్న శైలు వాయిస్ కి తింటున్న రుద్ర కి జామున్ గొంతు కి అడ్డు పడి దగ్గుతూ ఉంటాడు……
పక్కనే ఉన్న మాయ అయ్యో కేర్ఫుల్ అంటూ తల మీద చిన్నగా తడుతూ ఎవరో తలుచుకున్నట్టు ఉన్నారు అని వాటర్ బాటిల్ ఇవ్వగానే థాంక్ యూ అని చిన్నగా చెప్పి కామ్ గా తినేసి తననే డౌబ్ట్ గా చూస్తున్న ఆద్య ను చూసి కామ్ గా అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు రుద్ర……
ఆ ఆర్టిస్ట్ డ్రా చేసిన ఫీచర్స్ కి ఈ ఆర్యన్ ఫీచర్స్ చాలా వరకు మ్యాచ్ అవుతున్నాయి & టేస్ట్ లు కూడా ఒకటే గా ఉన్నాయి ఏంటి అని ఆలోచిస్తున్న ఆద్య ను ప్రతాప్ పిలవడం తో హా చెప్పండి తాతయ్య అంటూ అప్పటికి ఆ విషయాన్ని వదిలేసి మాటల్లో ఎంగేజ్ అవుతుంది…..
🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍
నాన్సీ తో కాల్ మాట్లాడి కాసేపు గార్డెన్ లో వాక్ చేసి తన రూమ్ కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతున్న జై కి ఆద్య రూమ్ లో లైట్ ఆన్ లో ఉండడం చూసి వాచ్ వైపు టైం చూస్తాడు 11 అవుతూ కనిపించడం చూసి అందరి రూమ్స్ లో లైట్ ఆఫ్ లో ఉన్నాయి ఈ పాటికి అందరూ పడుకుని కూడా ఉంటారు….. ఇదేంటి అర్ద రాత్రి తిరిగే మోహిని దెయ్యం లా ఇంకా మేలుకునే ఉంది అని అనుకుంటూ ఆద్య రూమ్ వైపు వెళ్లి డోర్ కాస్త మూవ్ చేయగానే ఓపెన్ అవుతుంది…..
డోర్ కూడా లాక్ చేసుకోకుండా ఎమ్ చేస్తుంది ఈ రెడ్ మిర్చి అనుకుంటూ రూమ్ లోకి వచ్చి చూసిన జై కి రూమ్ మొత్తం కాళిగా కనిపించడం తో రూమ్ లో లేదెంటి అని బాల్కనీ వైపు వెళ్తున్న జై కి వాష్ రూమ్ లో వాటర్ సౌండ్ వినిపించడం తో ఓహ్ బాత్ చేస్తుందా అని అనుకుంటూ ఉండగా వాటర్ సౌండ్ ఆగిపోవడం వాష్ రూమ్ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినిపించడం తో ఇది ఇపుడు కానీ నన్ను ఇక్కడ చూస్తే కాకి లా అరిచి కోతి లా గెంతి దెయ్యం లా అరుస్తుంది…..
దీనికి కనిపించకుండా ఉండడమే బెటర్ అనుకుంటూ ఫాస్ట్ గా వెళ్ళి కర్టెన్స్ వెనుక దాక్కుని ఆ కర్టెన్స్ సందుల్లో నుండి చూస్తూ ఉంటాడు….. క్రీమ్ కలర్ టవల్ గుండెల దాకా చుట్టుకుని తన హెయిర్ చేత్తో తుడుచుకుంటూ వాష్ రూమ్ లో నుండి బయటకు వస్తున్న ఆద్య ను చూసిన జై హార్ట్ జెట్ స్పీడ్ లో కొట్టుకుంటూ ఉంటుంది…..
మాములుగానే ఎలాంటి మేకప్ లేకపోయినా అందంగా ఉండే ఆద్య ఇప్పుడే ఫ్రెష్ అవ్వడం వల్ల తన మొహం అప్పుడే విరిసిన రోజా లా ఎంతో అందంగా అక్కడక్కడ నీటి బిందువులతో తడిసి ఎంతో ముద్దుగా ఉంది….. ఇదేంటి ఇంత క్యూట్ & హాట్ గా ఉంది ఎందుకే పదే పదే ఇలా ఎదురు పడి నా నిగ్రహానికి పరీక్ష పెడుతున్నావ్ అని ఆద్య ను కళ్ళతోనే తడిమేస్తూ ఉంటాడు…..
అయ్యో ఏంటిది డోర్ ఓపెన్ లో ఉంది బాత్ కి వెళ్ళే ముందు లాక్ చేయడం మర్చిపోయినా ఏంటి అనుకుంటూ డోర్ లాక్ చేస్తున్న ఆద్య ను చూసి జై తల పట్టుకుంటే జై రూమ్ లో ఉన్నాడు అని తెలియని ఆద్య రూమ్ లో అలానే టవల్ తో తిరుగుతూ సాంగ్స్ పెట్టుకుని తన వంటికి మాయిశ్చరైజర్ రాస్తూ ఉండగా ఆద్య మొబైల్ రింగ్ అవుతుంది…..
జై తన రూమ్ లో ఉన్నాడని ఆద్య కి తెలిస్తే ఆద్య ఎమ్ చేస్తుంది అంటారు?? ఆధ్య కి ఈ టైమ్ లో కాల్ చేసింది ఎవరు??