విలన్ హస్బెండ్-47
మాట్లాడవేంటి అభీర్ మా ఇంటి అడ్రస్ నీకెలా తెలుసు అంటూ మరో సారి అడుగుతున్న ఆద్య వాయిస్ లోని సీరియస్నెస్ కి దేవుడా ఇప్పుడు ఎదోటి చెప్పి కవర్ చేయకపోతే నా బతుకు బస్టాండ్ అయ్యేలా ఉంది కమాన్ అభి థింక్….. థింక్….. యస్ ఐలా చెప్తే ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు అనుకుంటూ నువ్వు మరీ టూ మచ్ ఆద్య ఇదేమైనా గండికోట రహస్యమా ఏంటి తెలియక పోవడానికి మొన్న నువ్వే కదా మీ హౌస్ బాంజాహిల్స్ రోడ్ నంబర్ 21 బిసైడ్ రెయిన్బో పార్క్ అని చెప్పావ్ అప్పుడే మర్చిపోయావా?
వాట్?? నేను మా ఇంటి అడ్రస్ చెప్పానా లేదే నాకు నీకు చెప్పినట్టు గుర్తు రావడం లేదు?? ఆధ్య డోంట్ బీ సిల్లీ నువ్వు చెప్పక పోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు నేనేం అయినా కాల జ్ఞానం తెలిసిన బ్రహ్మం గారిని అయితే కాదు కదా మొన్న నువ్వే చెప్పావ్ అయినా ఇంత చిన్న విషయానికి నేను ఇంత ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలా నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా….??
చ చా ఐ డిడ్ న్ట్ మీన్ దట్ అభీర్ జెనరల్ గా అడిగాను అంతే ఫీల్ అయ్యుంటే సారి అభీర్…. ఈ టైమ్ లో నేను బయటకు రాను అభీర్ సారీ యార్ మనం మళ్ళీ ఎప్పుడైనా మీట్ అవుదాం అండ్ ప్రెసెంట్ మా మావయ్య ఫ్యామిలీ కూడా మా ఇంట్లోనే ఉన్నారు సో నేను బయటకు రాలేను ప్లీస్ డోంట్ మైన్ అభీర్
ఓహ్ దట్స్ ఒకే ఇఫ్ యూ డోంట్ మైన్ ఒక సారి నీ బాల్కనీ లోకి రావా బై చెప్పేసి వెళ్ళిపోతా చాలా సేపటి నుండి నీ కోసం వెయిట్ చేస్తున్నాను అది కూడా నీకు ప్రాబ్లెమ్ అనిపిస్తే ఒకే ఐ విల్ లీవ్ నౌ…..!!
అభీర్ గర్ల్స్ తో మింగిల్ అవ్వడానికి చాలా టైమ్ తీసుకుంటాడు అన్న విషయం ఆద్య కి ఈ ఫ్యూ డేస్ పరిచయం లోనే అర్థం అయింది…… తనతో అభీర్ చాలా కంఫర్ట్ & కూల్ గా ఉంటాడు ఎట్ ది సేమ్ టైమ్ చాలా జెంటిల్ గా బిహేవ్ చేస్తాడు అందుకే అభీర్ తో ఇంత ఫ్రీగా ఉంటోంది….. ఇప్పుడు బాల్కనీ లోకి రాను అని చెప్పి అభీర్ ను డిజప్పాయింట్ చేయలేక యాహ్ సూర్ అభీర్ ఇప్పుడే వస్తాను అని కాల్ కట్ చేస్తుంది…..
ఇదేంటి ఎక్కడికో వస్తాను అంటుంది ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్తుంది అని ఆద్య వైపు చూసిన జై కి ఆద్య బాల్కనీ వైపు వెళ్ళడం చూసి ఇదేంటి టవల్ తో అలాగే వెళ్తుంది ఒసేయ్ డెవిల్ టవల్ తో ఉన్నావే అని అరవబోయి లాస్ట్ లో ఆగిపోతాడు…… ఓహ్ నో ఇప్పుడు నేను అరిస్తే కావాలని దీని రూమ్ కి వచ్చానని అరిచి గోల చేస్తుంది మరెలా అని ఆలోచిస్తూ కావాలని తన పక్కనున్న వాటర్ బాటిల్ కింద పడేసి కర్టెన్ పూర్తిగా కవర్ చేసుకుంటాడు…..
వాటర్ బాటిల్ సౌండ్ కి వెనక్కి తిరిగిన ఆద్య కి మిర్రర్ లో తను టవల్ తో ఉన్నది చూసుకుని ఓహ్ షట్ అంటూ ఫాస్ట్ గా వాడ్రాబ్ నుండి బ్లాక్ షాట్ విత్ వైట్ స్లీవ్లెస్ షర్ట్ వేసుకుని బాల్కనీ లోకి వెళుతుంది…..
ఆద్య డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి టవల్ తీస్తున్నప్పుడే అటు తిరిగిన జై బాల్కనీ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ కి ఇది బాల్కనీ లోకీ వెళ్ళింది ఇదే కరెక్ట్ టైమ్ అనుకుని ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళిపోతాడు…..
టైమ్ గాడ్ కాస్త లో మిస్ అయ్యాను ఇవాళ ఇది నన్ను బాగా డిస్టర్బ్ చేసింది ఇక నాకు నిద్రొస్తుందా 🙆🤷 అబ్బబ్బా ఏమాటకి ఆ మాట ఇది నిజంగా బలే ఉంటుంది 😍 స్కిన్ ఉంటుంది అలా ముట్టుకుంటే చాలు జారిపోయేలా అంత సాఫ్ట్ గా ఉంటుంది అని ఆద్య ను టవల్ లో చూసిందే గుర్తు చేసుకుంటూ అలా ఏదో ట్రాన్స్ లో నడుచుకుంటూ తన రూమ్ ఎపుడు చేరాడో అటు నుండి వాష్ రూమ్ కి వెళ్ళి షవర్ ఆన్ చేసి ఆద్య ను చూడ్డం వల్ల పుట్టిన వేడిని కూల్ వాటర్ తో తగ్గించుకుంటూ ఉంటాడు…..
బాల్కనీ లోకి వెళ్ళి రోడ్ వైపు చూసిన ఆద్య కి తన కార్ కి ఆనుకుని బ్లాక్ హుడి తో తన రూమ్ బాల్కనీ వైపు చూస్తున్న అభీర్ ఫేస్ చీకట్లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది…. ఆధ్య ను చూసిన అభీర్ నవ్వుతూ చెయ్ ఊపగానే ఆద్య నవ్వుతూ హ్యాండ్ మూవ్ చేస్తూ తన మొబైల్ నుండి అభీర్ కి రీ డైల్ చేస్తుంది…..
ఆధ్య వైపు చూస్తూనే కాల్ లిఫ్ట్ చేసిన అభీర్ థాంక్స్ ఫర్ కమింగ్ ఆద్య అని చిరు నవ్వుతో చెప్పగానే ఆద్య చిన్న స్మైల్ ఇస్తూ ఇంకో సారి ఇలా నాకు చెప్పకుండా రాకు అభీర్ ఒకే చూసావ్ గా ఇక వెళ్ళు ఇట్స్ టూ లేట్ & మా సెక్యూరిటీ చూస్తే ప్రాబ్లెమ్ అవుతుంది……..
ప్లీస్ గో అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉండడం తో ఒకే కూల్ ఐ ఆమ్ గోయింగ్ గుడ్ నైట్ ఆద్య అని అభీర్ తన కార్ లో కూర్చుంటూ కాల్ కట్ చేయగానే ఆద్య నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి తన రూమ్ లోకి వెళ్లి బాల్కనీ డోర్ లాక్ చేస్తూ ఇటు వైపు తిరగగానే తన రూమ్ డోర్ కాస్త ఓపెన్ అయ్యి కనిపిస్తుంది…..
ఏంటిది నేను ఇందాకే కదా లాక్ చేసాను మళ్ళీ ఎలా ఓపెన్ అయింది?? అని ఆలోచిస్తూ డోర్ లాక్ చేసి హెయిర్ డ్రయ్యర్ తో తల ఆర్పుకుంటూ సాంగ్స్ పాడుతూ కాసేపటికి నైట్ స్కిన్ కేర్ కంప్లీట్ చేసుకుని లైట్ ఆఫ్ చేసి డీప్ స్లీప్ లోకి వెళ్తుంది……
🤍💞🤍💞🤍💞🤍💞🤍💞🤍
అమర్ తన లిప్స్ ను మాన్య లిప్స్ దగ్గరకు తీసుకుని వెళ్ళి తన మొహం వైపు చూస్తాడు….. ఆకాశం లో నక్షత్రాలు ఎన్నో ఉన్నా మనకు చందమామ మాత్రమే స్పెషల్ అలాగే ఈ హైదరాబాద్ లో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు బట్ నువ్వే నా స్పెషల్ మాన్య అని చిరు నవ్వుతో చెప్తూ ఒకరి ఊపిరి ఒకరికి తగులుతున్న వేళ తన లిప్స్ తో మాన్య లిప్స్ ను కలుపుతాడు…..
చుట్టు ఎవరు లేని ఆ క్షణం రూమ్ మొత్తం నిశబ్దంగా ఉంది….. అమర్ గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది మాన్య మీదకు కాస్త వంగి కళ్ళు మూసుకుని ఎర్రటి గులాబీ వంటి తన లిప్స్ వైపు చూస్తూ తన రెండు పెదాల మధ్య లోకి మాన్య పెదవిని తీసుకున్నాడు……
మాన్య మెత్తని పెదవుల తాకిడికి గాలిలో కూడా ఏదో పరిమళం అనిపిస్తూ ఉంటే తన ప్రేమకు మొదటి సంతకం ఈ ముద్దే అనిపిస్తూ ఉంది….. ఈ క్షణం ఇక్కడే ఆగిపోయినట్టు , మాటలు కూడా రావడం లేదు కేవలం కళ్ళు మాత్రమే మాట్లాడుతున్నాయి…..
ఒక్క సారిగా కళ్ళు తెరచిన మాన్య ఆయాస పడుతూ చుట్టూ చూస్తూ ఉంది….. తన రూమ్ లో తను తప్పా ఎవరు లేరు నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ చీ……! ఇలాంటి డ్రీమ్ వచ్చిందేంటి ఆ వచ్చేది ఏదో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, సిద్దార్థ్ మల్హోత్రా లాంటి హ్యాండ్స్ హీరోస్ వచ్చున్నా నా డ్రీమ్ కి ఒక మీనింగ్ ఉండేది….. పోయి పోయి వీడే రావాలా నా కర్మ కాకపోతే అని భారంగా శ్వాస తీసుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తాగి తన బ్రీతింగ్ నార్మల్ కి వచ్చాక చుట్టు మరో సారి చూసి కళ్ళు మూసుకుని నిద్రపోతుంది…….
మై గుడ్ నెస్ జెర ఉంటే చచ్చిపోతుంటి ( శ్రీహరి డైలాగ్ ఫ్రమ్ కింగ్ మూవీ 🥱) అనేలా ఉంది నా స్థితి…. పరిస్థితి….. 😑 వామ్మో ఇది నన్ను చూసుంటే నా పరిస్థితి ఏమో కానీ గ్రహస్థితి మాత్రం మార్చేసేది….. దీనికి అసలే కరాటి, కుంఫు వచ్చు అందుకే పెళ్లికి ముందు కకృతి పడకూడదు అని ఇందాక తను కిస్ చేసేటపుడు మాన్య కి మెలకువ రావడం చూసి ఫాస్ట్ గా బెడ్ కింద దూరడం గుర్తు చేసుకుంటూ మెల్లగా బెడ్ కింద నుండి తల బయటకు పెట్టి చూస్తాడు……
మాన్య టెడ్డి బేర్ ను హాగ్ చేసుకుని డీప్ స్లీప్ లో ఉండడం చూసి ఉఫ్ ఇది పడుకుంది మెల్లగా ఎస్కేప్ అవ్వాలి అనుకుని సౌండ్ రాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి జాగ్రత్తగా డోర్ ముందుకు వేసి ఎమ్ తెలియనట్టు తన రూమ్ కి వెళ్ళి మాన్య తో జరిగిన ఫస్ట్ కిస్ తలచుకుంటూ ఏవేవో ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతాడు……
🤍💜🤍💜🤍💜🤍💜🤍💜🤍
తన మొబైల్ లో పెట్టుకున్న అలారం రింగ్ అవ్వడం తో బద్దకంగా నిద్ర లేచి ఫ్రెష్ అయి బయటకు వచ్చిన రుద్ర కి గార్డెన్ లో యోగా చేస్తూ కనిపిస్తుంది మాయ…… దీనికి ఇంత మార్నింగ్ లేచే అలవాటు కూడా ఉందా అని తన వాచ్ లో టైమ్ 4:45 అవుతూ ఉండడం గమనించి మాయ వైపు వెళతాడు…..
హాయ్ గుడ్ మార్నింగ్ అని చిరు నవ్వుతో విష్ చేస్తున్న రుద్ర ను చూసిన మాయ ట్రీ పోస్ నుండి స్ట్రెయిట్ గా నుంచుంటూ హేయ్ హాయ్ గుడ్ మార్నింగ్ మీరేంటి ఇంత త్వరగా లేచారు అని అడుగుతూ పోనీ ముడి వేస్తుంది……
మీరు అని అంత రెస్పెక్ట్ ఇవ్వకు మాయ కాల్ మీ ఆర్య అని క్యూట్ స్మైల్ తో చెప్తూ యాక్చువల్లీ నాకు డెయిలీ జాగింగ్ కి వెళ్ళడం అలవాటు బట్ నాకు హైదరాబాద్ పెద్దగా తెలియదు ఇఫ్ యూ డోంట్ మైన్ నాతో జాగింగ్ కి వస్తావా…..?
సూర్ ఆర్య పదా వెళ్దాం అంటూ ఇద్దరూ జాగింగ్ చేస్తూ పక్కనే పార్క్ వైపు వెళ్తూ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ త్వరగానే మంచి ఫ్రెండ్స్ అవుతారు…. రుద్ర ఫ్రెండ్లీ బిహేవియర్ మాయ ను బాగా ఇంప్రెస్స్ చేయడం తో మాయ త్వరగానే రుద్ర తో ఫ్రీగా మూవ్ అవుతుంది…………. అలా ఇద్దరూ జాగింగ్ ఫినిష్ చేసుకుని 7 గంటలకు ఇంటికి వచ్చి అలసటగా సోఫా లోకి పడిపోయి టీ అంటూ ఇద్దరూ ఒకే సారి మెయిడ్ ను పిలిచి ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు…..
మెయిడ్ తీసుకుని వచ్చిన గ్రీన్ టీ ను చూసి మాయ నవ్వుతూ వావ్ సేమ్ పించ్ అని చిన్న స్మైల్ ఇచ్చి గ్రీన్ టీ తాగుతూ రుద్ర తో జనరల్ టాపిక్స్ మాట్లాడుతూ ఒకే ఆర్య ఫ్రెష్ అయ్యి వచ్చాక నీకు సరదాగా సిటీ చూపిస్తా ఎలాగో ఈవెనింగ్ కదా మనం విలేజ్ కి స్టార్ట్ అయ్యేది అని మాయ ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కి వెళ్తుంది…..
రుద్ర కూడా ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కి వెళ్తూ దేవుడి గది నుండి వినిపిస్తున్న గంట సౌండ్ కి అటుగా వెళ్ళిన తనకు శైలు పూజ చేస్తూ త్వరగా నా కొడుకు వచ్చేలా చెయ్ స్వామి అని కోరుకుంటూ కనిపించడం తో రుద్ర కి కాస్త గిల్టీ గా అనిపిస్తుంది….. ఎదురుగా ఉన్న నేనే మీ కొడుకుని అని చెప్పలేని సిచియేషన్ కి తన మీద తనకు కోపం వస్తూ ఉంటే కాసేపు అలాగే శైలు ను చూస్తూ ఉండిపోతాడు….
పూజ ఫినిష్ చేసిన శైలు హారతి ప్లేట్ తీసుకుని దేవుడి గది నుండి బయటకు వస్తూ జాగింగ్ డ్రెస్ లో ఉన్న రుద్ర ను చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ ఆర్య అంటూ నుదుటిన కుంకుమ పెడుతూ హారతి ప్లేట్ ముందుకు పెట్టగానే హారతి కళ్ళు అడ్డుకుని శైలు కాళ్ళకు నమస్కారం చేస్తూ మా మామ్ లాంటి వారు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటీ అనగానే శైలు చిరు నవ్వుతో గాడ్ బ్లెస్ యూ ఆర్య అని తల మీద చేత్తో నిమరగానే రుద్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి…..
శైలు చూడకుండా వాటిని తుడుచుకుంటూ పైకి లేచి చిన్న స్మైల్ ఇవ్వగానే రుద్ర చంప నిమిరి శైలు ఇల్లంతా ధూపం వేస్తూ ఉంటే రుద్ర శైలు తో ఏదో ఒకటి మాట్లాడుతూ శైలు తో ఇన్నాళ్లు మిస్ అయిన మాటలు అన్ని చెప్తూ ఉంటే శైలు చిరు నవ్వుతో రుద్ర చెప్పేవి వింటూ ధూపం వేయడం పూర్తి చేసి రుద్ర ను అడిగి మరీ తనకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తో పాటు అందరికీ నచ్చేవి కూడా చేయడం స్టార్ట్ చేస్తుంది…..
♥️💚♥️💚♥️💚♥️💚♥️💚
మాన్య తో డ్రీమ్స్ వేసుకుని ఎప్పటికో నిద్రపోయిన అమర్ బద్దకంగా కళ్ళు తెరిచి చూసే సరికి తన ఎదురుగా రెడ్ కలర్ లంగా వోని లో చేత్తో కాఫీ కప్ పట్టుకుని బొటన వేలితో నేల మీద ముగ్గు వేస్తూ సిగ్గు పడుతూ కనిపిస్తున్న కుమారి ను చూసి దడుచుకుని కూర్చుంటూ ను…. నువ్వేం చేస్తున్నావ్ పాప మా రూమ్ లో అని కుమారి వైపు పిచ్చి చూపులు చూస్తూ అడుగుతాడు…..
నా పేరు పాప కాదు కుమారి మీరు ముద్దుగా కుమ్ము అని పిలవచ్చు అని సిగ్గు పడుతూ చెప్పి గుడ్ మార్నింగ్ అండి అని తెగ మెలికలు తిరుగుతూ అయ్యబాబోయ్ నాకు సిగ్గేస్తుంది అని చేత్తో పట్టుకున్న కాఫీ కప్ అమర్ చేతిలో పెడుతుంది…..
ఏంటమ్మాయి ఇది 🤦 అసలు ఎందుకు వచ్చావ్ ఎందుకు సిగ్గు పడుతున్నావ్ ఎవరు రమ్మన్నారు నిన్ను ఇక్కడికి??
అది కూడా తెలియదా అండి Bru కాఫీ చాలా బావుంటుంది మీ కోసమే స్పెషల్ గా పెట్టాను అని తన రెండు చేతులతో మొహాన్ని దాచుకుని చెప్తుంది………..
ఇపుడు నువ్వు ఎందుకు సిగ్గు పడుతున్నావ్ పాప ఫస్ట్ ఆ మెలికలు తిరగడం ఆపి చక్కగా నుంచో 🤷🤷
మిమ్మల్ని ఇలా నిక్కర్ లో చూస్తుంటే బలే బావుందండి మీరు చాలా అందంగా ఉన్నారు 😍
ఏంటి నిక్కర్ ఆ….?? హలో పాప దీన్ని షార్ట్ అంటారు ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళు అని బెడ్ షీట్ తో కవర్ చేసుకుంటున్న అమర్ ను చూసి సిగ్గు పడుతూ అక్కడి నుంచి పరిగెడుతున్న కుమారి మాన్య కి డాష్ ఇచ్చి తనను కింద పడేలా చేస్తుంది……
అమర్ రూమ్ నుండి కుమారి ఎందుకలా సిగ్గు పడుతూ పరిగెత్తింది?? రుద్ర మాయ మధ్య బాండింగ్ దేనికి దారి తీస్తుంది??