Login with OTP

విలన్ హస్బెండ్-48

aashyatech

Author

అమర్ ను అలా అంత దగ్గరగా చూస్తున్న కుమారి సిగ్గు పడుతూ అమర్ ను వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ ఎదురుగా ఉన్న మాన్య కి డ్యాష్ ఇచ్చి తన నడుము విరిగేలా చేసి కింద పడేస్తుంది….. అయ్యో సారి మేడం అంటూ కంగారుగా మాన్య చెయ్ పట్టుకుని పైకి లేపి నిజంగా చూసుకోలేదు మేడం అంటూ మరో సారి సారి చెప్తున్న కుమారి ను చూసి అబ్బబ్బా ఏంటి కుమారి చూసుకుని రావచ్చు కదా……

 

అయినా దేనికి అంత తొందర 🤷 ఇట్స్ ఒకే ఇక నీ సారి లు పక్కన పెట్టి ఇంకెవరినీ కింద పడేయకుండా చూసుకుని నడువు అని చెప్తూ అవును ఏంటీ వాడి రూమ్ నుండి అలా పరిగెడుతూ వస్తున్నావ్ వాడేమైనా చేసాడా ఏంటి?? ఏమైనా చేసుంటే చెప్పు తోలు వోలిచేస్తాను అని అంటూ కుమారి ను పై నుండి కింద దాకా చూస్తూ ఏంటి కుమారి ఇవాళ స్పెషల్ ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యావ్??

అదేం కాదు మేడం ఇది మొన్న వినాయక చవితి కి ఆద్య మేడం కొని పెట్టారు నాకు ఇది చాలా బాగుందని కూడా చెప్పారు అందుకే వేసుకున్నాను అని సిగ్గు పడుతూ చెప్తుంది….. అది చెప్పడానికి ఇంత సిగ్గు పడాలా కుమారి 🤦😂 హ్మ్మ్ నిజమే చాలా అందంగా ఉన్నావ్ అది సరే వాడి రూమ్ లో ఎమ్ జరిగిందో ముందు అది చెప్పు…..!!

ఎమ్ జరుగుతుంది మేడం అమర్ సర్ కి కాఫీ ఇచ్చ వస్తున్నా అని చెప్తూ అక్కడి నుంచి బొంగరం లా తిరుగుతూ కిందకు వెళ్తున్న కుమారి ను చూసి క్రేజీ గర్ల్ అని నవ్వుకుంటూ ఆద్య రూమ్ వైపు వెళ్తుంది…..

ఈ కుమారి కి బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయదా ఏంటి ఓహ్ గాడ్ అని కుమారి వల్ల ఇరిటేట్ అయిన అమర్ చిరాగ్గా కాఫీ కప్ పక్కన పెట్టేసి బాల్కనీ లోకి వెళ్ళి వ్యూ చూస్తూ కాసేపు అక్కడే టైమ్ స్పెండ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు…..

🤍💗🤍💗🤍💗🤍💗🤍💗🤍

అమ్ము ఏంటి ఇంకా పడుకున్నావ్ గెట్ అప్ యార్ అని లేపుతున్న మాన్య వాయిస్ కి అబ్బా కాసేపు ఆగి లేస్తా నన్ను డిస్టర్బ్ చేయకు అని మరో వైపు తిరిగి పడుకుంటుంది….. అమ్ము ఇట్స్ ఆల్రెడీ 9 ఇంకా ఈ మొద్దు నిద్ర ఎంటే నీకు పైగా ఇక్కడ వినయ్ అంకుల్ ఫ్యామిలీ కూడా ఉన్నారు నువ్విలా ఇంత సేపు నిద్ర పోతే ఎమ్ బావుంటుంది చెప్పు అంటూ ఆద్య ను బలవంతంగా నిద్ర లేపి వాష్ రూమ్ లోకి తోస్తుంది……

ఆద్య 15 మినిట్స్ కి ఫ్రెష్ అయ్యి చాలా డేస్ తర్వాత అది కూడా వినయ్ వర్మ ఫ్యామిలీ అక్కడే ఉండడం వల్ల వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉన్న ఫుల్ గోల్ అనార్కలి వేసుకుని చెవిలో వైట్ కలర్ డైమండ్ ఇయర్ రింగ్స్ పెయిర్ చేసి మెడలో ఎలాంటి చైన్ వేయకుండా సింపుల్ మేక్ అప్ తో హెయిర్ లీవ్ చేసి చాలా స్పెషల్ గా రెడీ అవుతుంది……

డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వస్తున్న ఆద్య ను చూసిన మాన్య 😱😧 ఎంటే ఇది ఇంత పద్ధతిగా అమ్మాయిలా కనిపిస్తున్నావ్ నా కళ్ళకు ఎమ్ ప్రాబ్లెమ్ రాలేదు కదా అని కళ్ళు నులుముకుని మరీ చూస్తుంది……

ఆధ్య మిర్రర్ లో తనను తాను చూసుకుంటూ మాన్య వాయిస్ కి కోపంగా చేతిలోని కూంబ్ మాన్య మీదకు విసిరి షట్ అప్ అని అరిచి తన బటర్ఫ్లై వేవ్ హెయిర్ కట్ ను స్టైల్ గా బుజం మీద కు వేసుకుంటూ వావ్ ఈ న్యూ హెయిర్ స్టైల్ నాకు బలే సెట్ అయింది కదా అని మిర్రర్ లో చూసుకుంటూ వెనక్కి తిరిగే సరికి మాన్య కనిపించదు……

ఎక్కడికి వెళ్లింది ఇది అని మాన్య కోసం చూస్తూ ఉంటే మాన్య కూడా తను వేసుకున్న జంప్ సూట్ నుండి ఆద్య లాగే రెడ్ కలర్ అనార్కలి వేసుకుని దానికి సెట్ అయ్యేలా రెడీ అయి వస్తుంది…… మాన్య ను అలా చూసిన ఆద్య 😏 నన్ను ఏదో అమ్మాయిలా రెడీ అయ్యావ్ అన్నావ్ మరి తమరు ఎందుకు రెడీ అయ్యారు మేడం 😐

హు నిన్ను ఇలా చూసి మీ అమ్మ సైలెంట్ గా ఉంటుందా 🤷 నా బంగారమే, నా బుజ్జి తల్లీ, నా గోల్డ్, డైమండ్ అంటూ డైలాగ్స్ వేసి అంతటితో ఆగకుండా మా మమ్మీ కి నీ ఫోటోస్ పెడుతుంది…… అది చూసిన మా అమ్మ చంద్రముఖి లా మారి నాకు క్లాస్ పీకుతుంది ……..

అవసరమా అందుకే ఈ గెట్ అప్ పడితే ఇద్దరికీ తిట్లు పడాలి మునిగితే ఇద్దరం మునగాలి 😜 దిస్ ఈజ్ ట్రూ ఫ్రెండ్షిప్ 🥱 ఏదో మూవీ లో విన్నాను ఆద్య ధం బిర్యాని ఎవడైనా షేర్ చేసుకుంటాడు దరిద్రాన్ని కూడా షేర్ చేసుకునే వాడే ట్రూ ఫ్రెండ్ అని సో నేను నీకు ట్రూ ఫ్రెండ్ కదా అంటూ ఆద్య బుగ్గ మీద గట్టిగా కిస్ ఇచ్చి పదా కిందకు వెళ్ళి అందరికీ షాక్ ఇద్దాం అంటూ ఆద్య చెయ్ పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తుంది…….

ఆధ్య మాన్య మాటలకు నవ్వుకుని మాన్య తో కలిసి కిందకు వెళ్తూ ఏయ్ ఆగవే మాయ ఎమ్ చేస్తుందో చూద్దాం పదా మళ్ళీ నన్ను పట్టించుకోవడం లేదు అని అలుగుతుంది అంటూ ఇద్దరూ మాయ రూమ్ వైపు అడుగులు వేస్తారు……

🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍

జై మార్నింగ్ నిద్రలేచి కిందకు వెళ్ళేసరికి అపుడే ఫ్రెష్ అయి కిందకు వచ్చిన ఆనంద్, రుద్ర, అమర్ మాట్లాడుకుంటూ కనిపించడం తో వాళ్ళతో జై కూడా జాయిన్ అవుతాడు…. గుడ్ మార్నింగ్ అంటూ ఒకరికి ఒకరు విష్ చేసుకుంటూ టేబుల్ మీద ఉన్న పేపర్ ను చదువుతూ ఉండగా రేణుక అందరి కోసం స్పెషల్ ఇరాని చాయ్ చేసుకుని వచ్చి అందరికీ ఇస్తుంది……

నీ చేతి టీ చాలా మిస్ అవుతున్నా మామ్ అని చెప్తూ చిరు నవ్వుతో టీ కప్ తీసుకుంటున్న జై ను చూసి నవ్వుతూ అందరికీ టీ సర్వ్ చేసి వాళ్ళకు ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుంటూ తను కూడా టీ సిప్ చేస్తూ ఉంటుంది….. అరే బావ బాగా బోర్ కొడుతుంది సరదాగా ఎక్కడికైనా వెళ్దాం రా ఎలాగో మన ప్రయాణం ఈవెనింగ్ కదా అప్పటి వరకు ఇంట్లో కూర్చుని మాత్రం ఎమ్ చేస్తాం…….

అంతలా బోర్ కొడితే ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ ఉంది అది ఫినిష్ చెయ్ అని సైడ్ స్మైల్ తో చెప్తున్న జై ను చూసి పళ్ళు నూరుతూ నీకు చెప్పాను చూడు నన్ను కొట్టుకోవాలి అంటూ ఆనంద్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మనం ఇద్దరం సరదాగా హైదరాబాద్ మొత్తం చక్కర్లు కొడదాం ఏమంటావ్ అనగానే అప్పటికే మాయ తో రుద్ర బయటకు వెళ్తున్నట్టు ఇన్ఫార్మ్ చేయడం తో షూర్ అమర్ అంటూ ఇద్దరూ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ప్లాన్ చేస్తూ ఉంటారు…….

జై మా క్లబ్ లో త్వరలో ఎలెక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు ఎప్పటిలానే నేను పార్టిసిపేట్ చేస్తున్నా సో నాకు కొంచెం క్యాష్ ఎమర్జెన్సీ ఉంది…… నా కార్డ్ లో లిమిట్ అయిపోయింది ఒక 75 లాక్స్ అరేంజ్ చేయగలవా అంటూ మెల్లగా జై ను మాటల్లో పెట్టి తను ఎందుకు జై అడగకపోయినా టీ తీసుకుని వచ్చిందో అది అడుగుతుంది……

ఎప్పటిలోపు కావాలి మామ్ అని అడుగుతూ రేణుక అడిగిన అమౌంట్ కంటే 10 లాక్స్ ఎక్కువే చెక్ రాస్తూ దాన్ని రేణుక చేతిలో పెట్టగానే థాంక్ యూ జై అని నవ్వుతూ చెప్పి ఆ చెక్ వైపు హ్యాపీగా చూస్తూ అక్కడి నుండి వెళ్తున్న రేణుక వైపు అసహనంగా చూస్తాడు రుద్ర…….

ఈవిడ మీద కొంచెం కూడా నాకు పాజిటివ్ ఒపీనియన్ రావడం లేదు…… నా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అంతే కన్నింగ్ గా ఉంది జై ను ఓన్లీ మనీ పర్పస్ యూస్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది తప్పా ఎక్కడ జై మీద కేర్ చూపించదు అని రేణుక వెళ్లిన వైపే ఆలోచిస్తున్న రుద్ర కి ఎక్స్క్యూస్ మీ సర్ అన్న డెలివర్ బాయ్ వాయిస్ వినిపించగానే గుమ్మం దగ్గరకు వెళతాడు…..

యాహ్ ఎవరు కావాలి అని అడుగుతున్న రుద్ర వైపు చూస్తూ సర్ ఈ బొకే ఆద్య అన్న నేమ్ మీద వచ్చింది….. దీన్ని ఇక్కడ డెలివర్ చేయమని చెప్పారు అని వైట్ తులిప్స్ బొకే ను రుద్ర చేతిలో పెడుతూ ఇక్కడ సైన్ చేయండి అని పెన్ ఇవ్వగానే రుద్ర సైన్ చేస్తూ ఎవరు పంపారు అని అడుగుతాడు……

అభీర్ అన్న నేమ్ ఉంది సర్ థాంక్ యూ అని చెప్పి డెలివర్ బాయ్ వెళ్ళిపోయాక రుద్ర ఆ బొకే వైపు చూస్తూ ఎవరు ఈ అభీర్? ఆధ్య కి ఎందుకు బొకే పంపాడు అని ఆలోచిస్తూ ఆ బొకే పట్టుకుని తిరిగి హాల్ లోకి వచ్చి బొకే టేబుల్ మీద పెట్టేసి కూర్చుంటాడు…..

హు సెండ్ దిస్ బొకే అని చాలా రేర్ గా దొరికే ఆ ఫ్లవర్స్ వైపు చూస్తూ అడుగుతాడు జై…… అభీర్ అంట జై ఫర్ ఆధ్య అని చెప్తూ డు యూ నో హిం అని క్వశ్చన్ చేస్తాడు….. అభీర్ ఈ పేరు ఎక్కడో విన్నానే అని ఆలోచిస్తున్న జై కి నవ్వుతున్న ఆద్య వాయిస్ వినిపించగానే ప్రొద్దున్నే కాకి గొంతు వేసుకుని ఏంటి ఇది ఇలా నవ్వుతుంది అని చిరాగ్గా స్టెప్స్ వైపు చూసిన అలా చూస్తూ తనకు తెలియకుండానే పైకి లేచి నుంచుంటాడు 😍♥️……

గాడ్ బ్లూ కలర్ కూడా ఇంత బావుంటుందా లేక ఇది వేసుకోవడం వల్ల ఆ బ్లూ కలర్ నాకు ఇంత స్పెషల్ గా కనిపిస్తుందా….? ఇది ఒక్కో అడుగు స్టెప్స్ దిగుతూ ఉంటే నా హార్ట్ కూడా అదే రిదం లో కొట్టుకుంటూ ఉందేంటి…… దీని బాడీ స్ప్రే కన్నా నీ స్కిన్ స్మెల్ నన్ను డేంజరస్ గా అదొక అడిక్షన్ లా అయిపోయింది అనుకుంటూ ఆద్య వైపే మైమరచి చూస్తూ ఉంటాడు……

ఏమైంది వీడికి ఇలా స్తంభం లా నుంచున్నాడు అని జై చూసిన వైపుకు చూసిన అమర్ కి మాన్య ను రెడ్ కలర్ డ్రెస్ లో చూడగానే టైమ్ ఒక్కసారిగా అయిపోయినట్టు అనిపించింది….. రెడ్ కలర్ మాన్య కి పెర్ఫెక్ట్ గా సెట్ అయినట్లు అనిపించింది …… మాన్య ను అలా చూస్తూ ఉంటే అమర్ కి తన హార్ట్ మొత్తం రెడ్ పెయింట్ వేసుకున్నట్టు ఫీల్ అవుతున్నాడు……

 

ఒక్క క్షణం మాన్య తన వైపు చిరు నవ్వుతో చూస్తే చాలు అనుకున్న అమర్ కి మాన్య ఎట్ లీస్ట్ తల కూడా తిప్పక పోయేసరికి దీనికి ఫీలింగ్స్ పెట్టడం దేవుడు మర్చిపోయాడా ఏంటి 😑☹️ అని వెర్రి మొహం వేసుకుని చూస్తుంటాడు…..

వీళ్ళేంటి టీచర్స్ ను చూసిన స్టూడెంట్స్ లా అలా ఫ్రీజ్ అయ్యారు అని అటుగా తల తిప్పిన రుద్ర చివరగా వస్తున్న మాయ వైపు చూస్తాడు…… మాయ కి ఈ కలర్ ఎంత బావుందంటే తనే ఒక అందమైన చిలుక లా అందానికే అసూయ పుట్టేలా ఉంది…… మాయ దగ్గరకు వచ్చే కొద్ది రుద్ర హార్ట్ స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంది & తనకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది….. నా పొట్టిది ఏంటి ఇంత క్యూట్ గా ఉంది అని చేత్తో గాలి ఊదుకుంటూ కాసేపటికి నార్మల్ అవుతూ నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటాడు…….

ముగ్గురు అమ్మాయిలు స్టెప్స్ దిగి మాట్లాడుతూ వస్తూ వీళ్ల వైపు చూసి వీళ్ళేంటి ఇలా ఫ్రీజ్ అయ్యారు అని ఒకరిని ఒకరు చూసుకుని హెలో అంటూ ముగ్గురు చిటికె వేయగానే అబ్బాయిలు ముగ్గురు చూపును తిప్పేసి వాట్ అంటూ బుజాలు ఎగరేస్తూ సోఫా లో కూర్చుంటారు…..

ఏమైంది వీళ్ళకు అని ఒకరిని ఒకరు వియర్డ్ గా చూసుకుని వీళ్ళకు ఎదురుగా కూర్చుంటూ మధ్యలో ఉన్న టేబుల్ మీద బొకే వైపు చూస్తూ ఎవరు తెచ్చారు ఆ బొకే అంటూ చూడగానే నచ్చేలా ఉన్న ఆ బొకే వైపు చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకుంటూ అడుగుతుంది మాయ…..

అధ్య కోసం వచ్చింది అని చెప్పిన అమర్ మాటకి ఏంటి వదిన కోసమా ఎవరు పంపారు అని అడుగుతూ వదిన ఇక్కడేదో కార్డ్ ఉంది అని దాన్ని తీసుకుంటున్న మాయ చేతిలో నుండి లాక్కుని దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు జై…..

రేయ్ నా కార్డ్ ఇటివ్వు అని కార్డ్ తీసుకోవడానికి వస్తున్న ఆద్య ను చూసి ఆ కార్డ్ తీసుకుని బయటకు పరిగెడతాడు జై….. నాది నాకు ఇవ్వరా అని అరుస్తూ వెనుకే వస్తున్న ఆద్య ను ఏడిపించడానికి పరిగెడుతూనే ఆ కార్డ్ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ గార్జియస్ ఐ కాంట్ వెయిట్ టు సి యూ ఇన్ దిస్ బ్యూటీఫుల్ మార్నింగ్ అంటూ కింద అభీర్ అని ఉన్న నోట్ ను చూసి అబ్బో చాలా ఫీల్ అయి రాసాడే అని నవ్వుతూ ఆద్య కి అందకుండా పరిగెడుతూ అలా గార్డెన్ మొత్తం తిప్పించి బయటకు పరిగెడతాడు……….

ఇడియట్ నాకు ఆయాసం వస్తుంది ఆగరా అని అరుస్తూ బయటకు పరిగెత్తిన ఆద్య మీదకు స్పీడ్ గా వస్తూ కనిపిస్తున్న కార్ ను వెనక్కి తిరిగి చూసిన చూసి ఏయ్ మిర్చి తప్పుకో అని అరుస్తూ ఆద్య నడుము పట్టుకుని పక్కకు లాగగానే ఆ కార్ స్పీడ్ గా అక్కడి నుండి ఆగకుండా దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోతుంది……

ఆ కార్ వచ్చిన స్పీడ్ ను చూస్తే అది కచ్చితంగా ఆద్య ను చంపడానికే వచ్చినట్టు అనిపిస్తుంది….. ఒక్క క్షణం గుండె ఆగి కొట్టుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటే అలాగే షాక్ అయ్యి నుంచున్న ఆద్య బుజం పట్టుకుని ఏయ్ మిర్చి ఆర్ యూ ఆల్రైట్ అని అడుగుతున్న జై ను భయం తో గట్టిగా హగ్ చేసుకుంటుంది……

వీళ్ళను వెతుక్కుంటూ బయటకు వచ్చిన పిల్ల గ్యాంగ్ వీళ్ళను అలా చూసి 😧😧 ఎప్పుడూ పాము ముంగిసా లా కొట్టుకునే ఇద్దరూ అలా అంత క్లోజ్ గా ఉండడం చూసి వాళ్లకు డైజెస్ట్ చేసుకోడానికి టైం పట్టింది…… ఆధ్య బాగా భయపడింది అని వణుకుతున్న తన హ్యాండ్స్ చెప్తూ ఉంటే ఫస్ట్ టైమ్ ఆద్య ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వీపు నిమురుతూ ఇట్స్ ఒకే మిర్చి ఎమ్ అవ్వలేదు యూ ఆర్ ఒకే నౌ అని ధైర్యం చెప్తూ ఉంటాడు…..

జై గుండె తనకు తెలియని ధైర్యాన్ని ఇస్తూ ఉంటే కాసేపటికి నార్మల్ అయిన ఆధ్య తను ఎక్కడుందో చూసుకుని ఫాస్ట్ గా జై నుండి దూరం జరిగి నుంచుంటుంది….. థాంక్ యూ అని చెప్పి వెళ్తూ ఆగి వెనక్కి వచ్చి జై దగ్గరున్న కార్డ్ లాక్కుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్న ఆద్య వైపు చూస్తూ ఏదో ఆలోచనలో పడతాడు జై…..

కాసేపటికి అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు…. పెద్ద వాళ్లకు కార్ గురించి చెప్పి టెన్షన్ పెట్టడం ఇష్టం లేక ఆద్య చెప్పదు జై కూడా ఏదో సెన్స్ చేస్తూ ఆద్య వైపు చూస్తూ ఎదురుగా కూర్చుంటాడు……

ఆధ్య ను చంపాలి అనుకున్నది ఎవరు?? జై వాళ్ళెవరో కనిపెడతాడా అసలు జై మనసులో ఏముంది???