విలన్ హస్బెండ్-50
రేయ్ జై వాళ్ళను షాపింగ్ కి పంపించి మనం ఎక్కడికి రా వెళ్తున్నాం అని 100 స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్న జై ను చూసి కంగారుగా అడుగుతాడు అమర్….. కొంచెం వర్క్ ఉంది అది ఫినిష్ అయ్యాక మన షాపింగ్ కూడా చూసుకుని గర్ల్స్ దగ్గరకు వెళ్దాం అని యూ టర్న్ తీసుకుంటూ చెప్తాడు…..
వీడి డ్రైవింగ్ తో నాకు చచ్చే చావొచ్చింది అని భయంగా సీట్ బెల్ట్ పెట్టుకొంటూ ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు అని జై పక్కన సీట్ లో కూర్చున్న రుద్ర బుజం మీద చేయి వేసి పిలిచి బయ్యా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో నీకేం అయినా హింట్ ఇచ్చాడా అని మెల్లగా అడుగుతాడు….
బెస్ట్ ఫ్రెండ్ అయిన నీకే చెప్పలేదు ఇక నాకేం చెప్తాడు అని రుద్ర బుజాలు ఎగరేస్తూ చెప్పడం చూసి హు 😏 బెస్ట్ ఫ్రెండ్ ఇదొకటి ఏడ్చింది పేరుకి 🤦 జై కి ఎమ్ అనిపిస్తే అది చేయడం తప్పా అటు వైపు వాళ్ళ ఫీలింగ్స్ ను అర్థం చేసుకుంటే వాడు జై ఎందుకు అవుతాడు అని నిట్టూర్చి కార్ ఆగడం తో ఎక్కడికి తీసుకుని వచ్చాడు అని తల తిప్పిన అమర్ కి పోలీస్ స్టేషన్ ను చూసి ఇక్కడికి ఎందుకు వచ్చాం అని ఆలోచిస్తూ జై తో పాటు లోపలికి నడుస్తాడు……
జై డైరెక్ట్ గా సి. ఐ. క్యాబిన్ కి వెళ్ళి కూర్చోగానే వెనుకే ఫాలో అయిన ఇద్దరూ కూడా సి.ఐ. ముందు కూర్చోగానే జై డైరెక్ట్ గా కమల్ గురించి చెప్పి వాడు 4 ఇయర్స్ బ్యాక్ అరెస్ట్ అయ్యాడు అది కూడా రేప్ కేస్ లో అండ్ వాడికి కోర్ట్ కూడా లైఫ్ లాంగ్ జైల్ లో చిప్ప కూడు తింటూ ఉండేలా తీర్పు వచ్చింది…..
అలాంటి వాడు ఆల్ ఆఫ్ ది సడన్ ఎలా బయటకు వచ్చాడు……?? వాడికి బెయిల్ ఎలా వచ్చింది అన్ బెయిలబుల్ కేస్ లో వాడు ఎలా బయటకు వచ్చి ఇంత ధైర్యంగా తిరుగుతున్నాడు …… ఐ వాంట్ టు నో ది అన్సర్ టు ఆల్ మై క్వశ్చన్స్ అంటూ సీరియస్ గా అడుగుతాడు……
గివ్ మీ 10 మినిట్స్ సర్ ఐ విల్ బీ బ్యాక్ అంటూ సి. ఐ. మొబైల్ తీసుకుని ఎవరెవరికో కాల్స్ చేస్తూ పక్కకు వెళ్ళి కమల్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ తెలుసుకుని వచ్చి జై ముందు కూర్చుంటాడు…
మీరు అడిగిన అతని గురించి అన్ని డిటైల్స్ తెలిసాయి మిస్టర్ జై అతని పేరు కమల్ శర్మ మినిస్టర్ విజయకాంత్ శర్మ కి ఒక్కగానొక్క కొడుకు….. ఈ కమల్ పక్కా పోకిరి చదువుకునే డేస్ నుండే డ్రగ్స్ అలవాటు అవ్వడం తో ఎవరి మాట వినకుండా తనకు నచ్చింది చేసేవాడు….. పైగా వీడి ఫాదర్ కి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉండడం వల్ల వీడిని ఎవరు ఎం చేయరు అన్న పొగరు తో వీడు ఎంతో మంది అమ్మాయిల లైఫ్స్ స్పాయిల్ చేశాడు…….
ఒక రోజు వీడితో పాటు చదువుకుంటున్న అమ్మాయిని కూడా కాలేజ్ లోనే రేప్ చేసి చంపేశాడు అది చూసిన ఒక అమ్మాయి కోర్ట్ లో చెప్పడం తో వీడికి శిక్ష పడి జైల్ కి వెళ్ళాడు ఇప్పటి వరకూ ఇదంతా మీకు తెలిసిన విషయం…. కానీ తెలియని విషయం ఏంటంటే వీడు జైల్ కి వెళ్ళిన ఫ్యూ డేస్ కే ఏ అమ్మాయి అయితే కోర్ట్ కి వెళ్ళి వీడికి అగ్నెస్ట్ గా సాక్ష్యం చెప్పిందో ఆ అమ్మాయి ను యాక్సిడెంట్ పేరుతో చంపేసారు…..
అది చూసిన ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కొందరు వాళ్ళ దగ్గరున్న మరి కొన్ని ఎవిడెన్సెస్ కోర్ట్ కి సబ్మిట్ చేసి వాళ్ళ ఇద్దరి ఫ్రెండ్స్ కి న్యాయం కావాలి అని అడిగారు అందుకు తగ్గట్టుగా కమల్ కి శిక్ష కూడా పడ్డది….. యాస్ ఎ పొలిటిషన్ గా విజయకాంత్ శర్మ తన పవర్ ను యూస్ చేసి కమల్ ఉన్న జైల్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యి చాలా మంది చనిపోయేటట్టు ప్లాన్ చేసి తెలివిగా కమల్ ను తప్పించారు…..
ఇన్ని రోజులు ఆ కమల్ అండర్ గ్రౌండ్ లోనే ఉండి ఈ మధ్యే హైదరాబాద్ వచ్చాడు….. సో వాడికి మహిదర్ గారి డాటర్ ఆద్య & తన ఫ్రెండ్ మాన్య మీద గ్రడ్జ్ ఉందని మా స్టైల్ లో అడిగితే వాడే చెప్పాడు అంటూ మొత్తం క్లియర్ గా ముగ్గురుకి చెప్తాడు సి. ఐ. స్వామి…
సి . ఐ . స్వామి చెప్పింది విన్న ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆద్య, మాన్య కి కమల్ వల్ల థ్రెట్ గట్టిగానే ఉందని ఫిక్స్ అవుతారు….. జై ఊపిరి వదిలి తన ఇండెక్స్ ఫింగర్ ను నుదుటిన రాసుకుంటూ ఏదో డీప్ గా ఆలోచిస్తూ కూర్చోడం చూసిన అమర్ కంగారు పడుతూ ఇప్పుడు ఎవడికి మూడింది వీడు ఇలా చేస్తున్నాడు అంటే గట్టిగా ఎవడికో నరకం స్పెల్లింగ్ చూపించడానికి రెడీ అవుతున్నట్టే కానీ అది ఎవరు అని ఆలోచిస్తూ జై వైపు చూస్తూ ఉంటాడు…..
మిస్టర్ జై మీరు టెన్షన్ అవ్వకండి ఆ కమల్ శర్మ ను ఎలా డీల్ చేయాలో అలా చేస్తాం మీరు జస్ట్ ఒక కంప్లైంట్ రాసివ్వండి అని కానిస్టేబుల్ ను పిలిచి వైట్ పేపర్ & పెన్ తెప్పించి జై ముందు పెడుతూ కంప్లైంట్ రాయండి అంటూ జై వైపు చూస్తాడు…..
జై క్రాస్ లెగ్స్ వేసుకుని పెన్ చేతిలోకి తీసుకుని వేళ్ల మధ్య తిప్పుతూ కంప్లైట్ రాస్తే దాన్ని వీడి బాబు చింపి డస్త్బిన్ లో వేయడం వాడికి క్షణం కూడా పట్టదు…. నేను ఇలా కేస్ రాసి జైల్ కి పంపినా వాడు నెక్స్ట్ అవర్ నే బయటకు వస్తాడు మళ్ళీ ఆద్య, మాన్య ల మీద ఎటాక్ ట్రై చేస్తాడు…..
వీడు ఎప్పుడు వచ్చి ఎటాక్ చేస్తాడా అని టెన్షన్ పడుతూ కూర్చోవాలా అని కోపంగా పైకి లేచి టేబుల్ మీద రెండు చేతులు ఆనించి వాడి కారణంగా నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోయింది తెలిసి తెలిసి ఇంకో ప్రాణం పోనివ్వను వాడిని వెంటనే రిలీజ్ చేయండి అనగానే సి. ఐ. తో పాటు రుద్ర, అమర్ కూడా షాక్ అవుతూ పైకి లేచి నుంచుంటారు…….
జై వాడు ఆద్య, మాన్య మీద పగతో ఉన్నాడు అలాంటి వాడిని రిలీస్ చేయమంటావ్ ఏంట్రా అని అడుగుతున్న అమర్ ను చూసి సైడ్ స్మైల్ వదిలి క్రాస్ గా చూస్తూ కానిస్టేబుల్ ను దగ్గరకు రమ్మని చేతి వేళ్ళతో సైగ చేస్తాడు…..
జై గురించి అప్పటికే న్యూస్ పేపర్స్, టివి లలో చూసి తెలుసుకున్న కానిస్టేబుల్ జై పిలవగానే చెప్పండి సర్ అని వచ్చి నుంచోగానే ఓపెన్ ది సెల్ అని యాటిట్యూడ్ గా చెప్పగానే కానిస్టేబుల్ సి. ఐ. వైపు చూస్తాడు……
ఇక్కడ అడుగుతుంటే అటుగా చూస్తావేంటి పదా అని కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని కమల్ ఉన్న సెల్ ఓపెన్ చేయించి తన వైపు కోపంగా చూస్తున్న కమల్ కాలర్ పట్టుకుని బయటకు లాక్కెలుతూ తనకు అడ్డుగా నుంచున్న సి. ఐ. వైపు చూస్తూ నేను వెళ్ళాక వీడి బాబు ఎలాగో ఇక్కడికి వచ్చి నా గురించి అడుగుతాడు…..
వాడికి చెప్పు నీ కొడుకును జై దీర్ వర్మ తీసుకుని వెళ్ళాడు అని అలాగే ఇంకో 10 డేస్ నా కాల్ షీట్స్ కాళిగా లేవు ఆఫ్టర్ దట్ అపాయింట్మెంట్ ట్రై చేయమను అంటూ పొగరుగా చెప్పి కమల్ ను తీసుకుని బ్యాక్ సిట్ లో కూర్చుంటూ అమర్ అని అరవగానే అమర్ డ్రైవింగ్ సీట్ లో రుద్ర అమర్ పక్కన కూర్చోగానే కార్ దుమ్ము లేపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది……
తన వైపు చూస్తున్న కమల్ ను చూసి ఏంట్రా నా నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలా అని చూస్తున్నావా నా దగ్గరకు రావడమే నీ చేతుల్లో ఉంది నా నుండి తప్పించుకుని పోవాలంటే పైకి తప్పా పారిపోలేవ్ అని చెప్తున్న జై ను చూసి నవ్వుతూ నేను ఎవరో తెలియక నాతో పెట్టుకున్నావ్ రేపు ఈ టైం కి నాతో ఎందుకు పెట్టుకున్నానా అని నువ్వు ఏడుస్తూ నా కా…..
కమల్ మాట కంప్లీట్ అవ్వకముందే జై తను షూ కాలితో కమల్ ను బలంగా తన్నగానే కమల్ వెళ్ళి సీట్ చివరకు పడి పైకి లేవబోతున్న కమల్ గుండె మీద కాలు పెట్టి నా కొడక నాకే వార్నింగ్ ఇస్తావా చూస్తా నీ కోసం ఎవడు వస్తాడో వచ్చి నన్ను దాటి నిన్ను ఎవడు తీసుకు వెళ్తాడో నేను చూస్తా అంటూ తన వైపు బుసలు కొడుతూ చూస్తూ పైకి లేవడానికి ట్రై చేస్తున్న కమల్ తలకు తన పాకెట్ లో నుండి గన్ తీసి ఎయిమ్ చేస్తూ కదిలావో కుక్క ను కాల్చినట్టు కాలుస్థా …….
ఇది లైసెన్స్ రివాల్వర్ కాల్చినా ఎవడు అడగడు చెప్పు కాల్చనా అంటూ జై కోపంగా అరువగానే వాడు భయం తో నోరు కూడా తెరవకుండా జై ఎక్కడ కాలుస్తాడో అని గుటకలు మింగుతూ చూస్తూ ఉంటాడు……. రేయ్ అమర్ కార్ ను మన ఓల్డ్ ఫాక్టరీ గోడౌన్ వైపు పోనివ్వు అని సీరియస్ గా చెప్తూ సిగరెట్ తాగుతూ మధ్య మధ్యలో కమల్ మొహం మీద కాలుస్తూ వాడి ఏడుపును చూసి నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్న జై ను చూసి అమర్ కి చమటలు పడితే రుద్ర మాత్రం జై కి ఆద్య మీద ఉన్న ఇష్టాన్ని మాత్రం చూస్తూ ఉంటాడు…..
జై చెప్పినట్టు గానే గో డౌన్ దగ్గర కార్ ఆపగానే అక్కడ వర్క్ చేసే మనుషులు జై కార్ ను చూసి ఫాస్ట్ గా వచ్చి కార్ డోర్ ఓపెన్ చెయ్యగానే జై అందులో నుండి యాటిట్యూడ్ గా దిగుతూ వాడికి కాళ్ళు చేతులు కట్టేసి ఎత్తుకుని రండి అని చెప్పి లోపలికి నడుస్తాడు…..
జై ఫ్యాక్టరీ లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక్కొక్కరూ బాడీ లను హాంక్స్ లా ఉండడం చూసి రుద్ర లోపలికి నడిస్తే పారిపోవడానికి ట్రై చేస్తున్న వాడి కాళ్ళు, చేతులు కట్టేసి లోపలికి ఎత్తుకుని వెళ్ళి జై ముందు మూట లా పడేస్తారు….
తనను ఎక్కడ చంపేస్తాడో అని కమల్ లో అప్పటికే భయం స్టార్ట్ అవ్వడం తో టెన్షన్ నిండిన కళ్ళతో జై వైపు చూస్తూ నన్నేం చేయకు నేను ఆద్య, మాన్య ల వైపు చూడను ప్లీస్ లీవ్ మీ అని భయం తో కమల్ గొంతు నుండి బయట కు మాట కూడా వినిపించక పోవడం చూసి జై బిగ్గరగా నవ్వుతాడు అది చూసిన కమల్ కి టాప్ టు బాటమ్ అదురుతూ గజ గజా వణుకుతూ ఉంటాడు…..
నువ్వు ఆల్రెడీ ఆద్య ను చంపడానికి ట్రై చేసి తప్పు చేసావ్ రా నేను ఏదైనా ఒక్క సారే క్షమిస్తా అని సిగరెట్ తన షూ కింద వేసి నలుపుతూ రేయ్ వాడికి బట్టలు మొత్తం విప్పేయండి సింగిల్ కర్చీఫ్ కూడా వాడి వంటి మీద ఉండకూడదు అని చెప్పగానే కమల్ షాక్ అయితే రేయ్ జై ఎమ్ చేస్తున్నావ్ నువ్వు అని అడ్డు పడుతున్న అమర్ ను ఒక్క చూపుతో కంట్రోల్ చేసి కానివ్వండి అని తన వర్కర్స్ వైపు చూస్తాడు……
జై ఎమ్ చెప్తే అది చేసేలా ఉంటారు తన కింద వర్క్ చేసే వాళ్ళు సో జై చెప్పినట్టే కమల్ న్యూస్ గా మార్చి జై ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు….. కమల్ దిగంబర స్వరూపం చూడలేని అమర్ ఈ సీన్ నేను చూడలేను మీ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని రండి అని కార్ దగ్గరకు వెళ్ళి ఏ. సి. ఆన్ చేసుకుని ఫుల్ గా సాంగ్స్ వింటూ సౌండ్స్ ఎం వినిపించకుండా విండోస్ అన్ని లాక్ చేస్తాడు…..
స్టీల్ రాడ్స్ తో వాడి వంటి నుండి బ్లడ్ వచ్చే వరకు కమల్ ను కొట్టించి దాని మీదే ఎర్రటి కారం కూడా పూయించాక కమల్ ను గ్లాస్ కంటైనర్ లోకి వదిలి అందులోకి వాడి భుజాల వరకూ వాటర్ ఫిల్ చేసాక….. రోజూ అందులోకి సాల్ట్, ఇస్, చిల్లీ వాటర్ ఇలా మార్చి మార్చి వదులుతూ 3 డేస్ కి ఒక సారి ఫుడ్ పెడుతూ ఉండండి……
నేను వన్ వీక్ వరకూ ఇక్కడికి రాలేను సో నేను వచ్చే వరకు వాడు బ్రతికే ఉండాలి…… ఎట్ ది సేమ్ టైమ్ ఎందుకు బ్రతుకున్నా అని ఎవ్రీ మినిట్ వాడు నరకం చూడాలి అని అప్పటికే నొప్పికి గట్టి గట్టిగా కేకలు పెడుతున్న కమల్ ను చూసి ఎంజాయ్ అని కన్ను కొడుతూ అక్కడి నుండి రుద్ర ను తీసుకుని కార్ వైపు వెళ్ళి కార్ ఎక్కుతూ ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు…… ఇన్ కేస్ వాడు మిస్ అయితే నెక్స్ట్ మినిట్ మీరు కూడా ఎవరికీ కనిపించకుండా మిస్ అవుతారు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి తనే డ్రైవింగ్ సీట్ లో కూర్చొంటాడు…..
జై వార్నింగ్ కి అందరూ భయపడుతూ ఒకే సర్ అని చెప్పి జై వెళ్లగానే తిరిగి లోపలికి వెళ్లి కమల్ ను ఎలా టార్చర్ చేయాలా అని మాట్లాడుకుంటూ డిస్కషన్ పెడతారు…..
ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాలో సొంతం అని పాటను హమ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్న జై ను చూసిన రుద్ర ఇప్పటి వరకు అంత వైల్డ్ గా కనిపించావ్ సడెన్ గా ఇంత కూల్ గా ఎలా సాంగ్ పాడుతున్నావ్ జై అని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతున్న రుద్ర ను చూసి జై చిన్నగా నవ్వి ఊరుకుంటే అమర్ నవ్వలేక ఏడుస్తూ అదే జై లోని స్పెషల్ క్వాలిటీ నీకు కొత్త కదా అందుకే కొంచెం షాకింగ్ గా ఉంది బట్ నాకు ఇలాంటివి బాగా అలవాటు అందుకే పెద్దగా షాక్ అవ్వను……
అమర్ మాటలకు రేయ్ ఎక్కువ వాడితే రోడ్ మీద నువ్వు నీ మీద కార్ ఉంటుంది సో 🤫 మూసుకుని కూర్చో అంటూ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఆద్య వాళ్ళు ఉన్న షాపింగ్ మాల్ కి రీచ్ అవుతారు…..
అదేంట్రా మన షాపింగ్ ఫినిష్ చేసి ఇక్కడికి వద్దాం అనుకున్నాం కదా అని అడుగుతున్న అమర్ ను చూసి మనం షాపింగ్ చేస్తే ఆనంద్ కి ఎలా అందుకే ఇక్కడే షాపింగ్ చేద్దాం అని ఆద్య వాళ్ళ దగ్గరకు వెళ్లి జెంట్స్ తమ షాపింగ్ గర్ల్స్ తమ షాపింగ్ ను ఫినిష్ చేస్తారు…..
అందరి కంటే ముందుగా షాపింగ్ చేసిన జై కేఫెటెరిటా లో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ ఉండగా తన షాపింగ్ కూడా ఫినిష్ చేసుకుని అక్కడికి వచ్చిన అమర్ జై ఎదురుగా కూర్చుంటూ మొత్తానికి నువ్వు కూడా ప్రేమలో పడ్డావ్ ఇప్పటి నుండైనా ఈ తిరుగుళ్ళు ఆపరా ఆద్య కి ఇవన్నీ తెలిస్తే ఫీల్ అవుతుంది…..
అది ఫీల్ అవుతుందని నా ఎంజాయ్మెంట్ కి నేను ఎందుకు దూరం అవ్వాలి నా లైఫ్ నాకు నచ్చినట్టు లీడ్ చేస్తాను అదేవరు నన్ను క్వశ్చన్ చేయడానికి…??
అదేంటి జై నువ్వు ఆద్య ను లవ్ చేయడం లేదా అని జై అన్సర్ కి షాక్ అవుతూ అడుగుతాడు…..??
వాట్ 🤷😂 నేను ఆ మిర్చి ను లవ్ 🤦😂 ఓహ్ మై గాడ్ దిస్ ఇస్ ది బెస్ట్ జోక్ అమర్ అని గట్టిగా నవ్వుతున్న జై ను చూసిన అమర్ కోపంగా చూస్తూ జోక్ చేయకు జై నువ్వు ఆద్య ను ఇష్టపడ్డం లేదా??
రేయ్ జోక్ చేస్తుంది నేను కాదు నువ్వు…… నాకు దానికి క్షణం కూడా పడదు అలాంటిది నేను దాన్ని లవ్ చేయడం ఏంటి….. నీకేమైనా చిప్ దొబ్బిందా…..??
లవ్ కాక ఇప్పటి వరకు నువ్వు చేసింది ఏంటి మార్నింగ్ నుండి ఆద్య మీద నువ్వు చూపిస్తున్నది ప్రేమ కాక మరేంటి?? ఆధ్య బుల్లెట్ సౌండ్ కి భయపడితే గట్టిగా హగ్ చేసుకుని నువ్వు అడ్డుగా నుంచుని ధైర్యం చెప్పావ్ దాన్నేం అంటారు & వాడెవడో ఆద్య ను షూట్ చేయబోయాడు అని వాడికి నరకం చూపించావ్ దాన్నేం అంటారు…..??
ఏంటి దాన్ని నువ్వు లవ్ అనుకున్నావా అని చెప్పి నవ్వుతూ సరే చెప్తా విను ఆద్య బాధ పడితే నా వల్లే బాధ పడాలి…… అది ఏడిస్తే నా వల్లే అయ్యుండాలి కానీ ఎవడో వచ్చి దాన్ని చంపేస్తే దాని మీద నాకున్న పగ ఎలా రా తీరేది అందుకే అలా బిహేవ్ చేశా అంతే కానీ లవ్ లేదు తొక్కా లేదు అని నవ్వుతాడు……..
తనను అదే పనిగా చూసి నవ్వుతున్న అమ్మాయిని చూసి జై నవ్వుతూ ఆ అమ్మాయి వైపు వెళ్ళడం చూసి నువ్వు మారిపోయావ్ అనుకుని ఎంతో ఆనంద పడ్డా కదరా అయినా నువ్వు చేంజ్ అవుతావ్ అనుకోవడం నా పిచ్చి అని జై వైపు సీరియస్ గా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళడానికి పైకి లేచిన అమర్ వెనుక వ్యక్తి ను చూసి షాక్ అవుతాడు……
అమర్ ఎవరిని చూసి అంతలా షాక్ అయ్యాడు?? జై లోని మార్పు నిజంగా నిజం కాదా లేదా జై కావాలనే అలా చెప్పాడా??