Login with OTP

విలన్ హస్బెండ్-52

aashyatech

Author

మాయ రుద్ర పడుతున్న టెన్షన్ ను చూసి కూల్  ఆర్య నీ గురించి నేనేం వ్రాంగ్ గా అనుకోవడం లేదు అని రెండు అడుగులు ముందుకు వేసి ఆగి థాంక్ యూ అని చెప్పి వెళ్తున్న మాయ ను చూసి ఊపిరి తీసుకుంటూ టైం గాడ్ మాయ కి ఎక్కడ డౌబ్ట్ రాలేదు అని రిలాక్స్ అవుతూ హరీష్ మాయ ను అన్నది మళ్ళీ రీల్ లా గుర్తు రాగానే పైకి లేచి బయటకు వెళ్ళడానికి చూస్తున్న హరీష్ నోరు మూసి వాల్ కి లాక్ చేసి అలాగే నోటి మీద చెయ్ అడ్డు పెట్టి ఆపకుండా అరడజను సార్లు పొట్ట మీద స్ట్రాంగ్ పంచెస్ తో మూతి మీద బ్లడ్ వచ్చేలా కొట్టి ఆఖరున రెండు కాళ్ళకు మధ్యన స్ట్రాంగ్ కిక్ ఇచ్చి హరీష్ రెండు నెలల పాటు పైకి లేవకుండా పడుకోపెట్టేస్థాడు……

నొప్పికి అరవడానికి కూడా నోరు రాక పొట్ట మీద చేతులు పెట్టుకుని మూలుగుతున్న హరీష్ కి మరో స్ట్రాంగ్ కిక్ తన షూ తో ఇచ్చి హాయ్ రే హాయ్ జాంపండు రోయ్ కళ్ళ ముందు తిరుగుతుంది రోయ్ అని సాంగ్ పాడుకుంటూ వెళ్ళిపోతాడు……

వీడెబ్బా ఎవర్రా వీడు చంపేశాడు దుర్మార్గుడు అని వెళ్తున్న రుద్ర ను తిట్టుకుంటూ కష్టంగా మొబైల్ తీసుకుని తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఒరేయ్ ఎవడో నన్ను ఫుల్ గా కొట్టి ఒక మూలన పడేసాడు వచ్చి తీసుకుని వెళ్ళండ్రా అని మూలుగుతూనే కాల్ కట్ చేసి అమ్మా….. చావు దెబ్బ కొట్టాడు వీడిని వదలకూడదు అని తిట్టుకుంటూ మరో వైపు నొప్పికి ఏడుస్తూ ఉంటాడు…….

♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️

అందరూ షాపింగ్ కంప్లీట్ చేసి బిల్ కూడా చేయించేసి ఎవరి షాపింగ్ బ్యాగ్స్ వాళ్ళు పట్టుకుని జై కోసం వెయిట్ చేస్తూ ఉంటే తీరిగ్గా పదిహేను నిమిషాల తరువాత తను వేసుకున్న బ్లేజర్ సరి చేసుకుంటూ తన షాపింగ్ కవర్స్ తో వస్తూ కనిపిస్తాడు జై…..!!

జై ను చూస్తున్న ఆద్య కి ఇందాక జై ను టీనా తో అలా చూడ్డం గుర్తొచ్చి జై తో గొడవ పడడానికి కూడా చిరాకు & అసహ్యం పుడుతూ ఉంటే విసుగ్గా వెళ్ళి కార్ లో కూర్చుని కళ్ళు మూసుకుని ఇయర్ పోడ్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉంటుంది…. అందరూ ఇక్కడ ఉన్నారా కమ్ బాగా లేట్ అయిపోయింది కదా బయటే లంచ్ చేసి ఇంటికి స్టార్ట్ అవుదాం అంటూ కార్ లో కూర్చోబోతున్న జై ను నువ్వు హైదరాబాద్ వచ్చాక మీట్ అవుదాం బాయ్ జై అంటూ హగ్ ఇచ్చి వెళ్ళిపోతున్న టీనా ను చూసిన మాయ అంటే దీని తోనే అన్నయ్య క్లోజ్ గా ఉన్నప్పుడు వదిన చూసినట్టు ఉంది అనుకుంటూ వెళ్ళి కార్ ఎక్కుతుంది……

మినీ స్కర్ట్ లో క్లీవేజ్ షో చేస్తూ చాలా పోష్ గా ఉన్న టీనా ను చూసిన రుద్ర ఎవరు ఈ అమ్మాయి జై ఫ్రెండ్ ఆ?? అలా అనిపించడం లేదే అని ఆలోచిస్తూ కార్ లో కూర్చోగానే 2 కార్స్ రెస్టారెంట్ ముందు ఆగుతాయి…..
ఆధ్య తనకు ఆకలిగా లేదు అని చెప్పినా మాన్య, మాయ బలవంతంగా లోపలికి లాక్కుని వెళ్ళడం తో ఏదో తిన్నాను అంటే తిన్నాను అని లైట్ గా తిని కామ్ గా కూర్చుని గేమ్స్ ఆడుకుంటున్న ఆద్య ను చూసిన జై ఏమైంది దీనికి ఇంత డల్ గా ఉంది అనుకుంటూ మళ్ళీ అదెలా ఉంటే నాకు ఎందుకు అని అమర్ తో మాట్లాడుతూ లంచ్ ఫినిష్ చేస్తాడు…..

అందరూ తమ లంచ్ ఫినిష్ చేసి రెస్టారెంట్ లోని యాంబియన్స్ నచ్చి అక్కడే కాసేపు టైమ్ స్పెండ్ చేసి తీరిగ్గా ఊరికి స్టార్ట్ అయ్యే టైమ్ కి ఇంటికి రీచ్ అయ్యి ఫాస్ట్ గా తీసుకున్న డ్రెస్సెస్ ప్యాక్ చేసేసి వాటిని మెయిడ్స్ తో పంపేసి ఫ్రెష్ అయి హాల్ లోకి వస్తారు…..

ఫస్ట్ టైమ్ విలేజ్ కి వెళ్ళడం అవ్వడం తో అందరూ చాలా ఎక్స్సైటింగ్ గా ఉన్నారు మెయిన్లీ అమ్మాయిలు…. ఆద్య చాలా వరకు ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ నే ప్యాక్ చేసింది ఇప్పుడు ఎలాగో వెళ్ళేసరికి నైట్ అవుతుంది కాబట్టి తనకు కంఫర్ట్ ఉండేలా నావీ బ్లూ వన్ షోల్డర్ డ్రెస్ వేసుకుని క్యూట్ గా రెడీ అయ్యి హాల్ లోకి వస్తుంది…..

ఇది నాకు డే బై డే అందంగా కనిపిస్తుందా లేక నా కళ్ళకు ఏమైనా ప్రాబ్లెమ్ వచ్చిందా అని ఆద్య వైపు చూస్తూ మొహం తిప్పుకుంటాడు….. ఆధ్య జై వైపు తల కూడా తిప్పకుండా వెళ్ళి మహిదర్ పక్కన కూర్చుని డాడ్ లగేజ్ ఆల్ సెట్ ఐ ఆమ్ వెరీ ఎక్స్సైటెడ్ అని నవ్వుతూ చెప్తూ కిందకు వస్తున్న మాయ, మాన్య లను చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది……

నీ ఎక్స్సైట్మెంట్ మొత్తం నీ ఫేస్ లోనే కనిపిస్తుంది రా అని అందరూ రెడీ అయ్యి వచ్చాక ఒకే ఇక స్టార్ట్ అవుదాం వుయ్ ఆర్ గెట్టింగ్ లేట్ అంటున్న ప్రతాప్ వర్మ వాయిస్ కి తాతయ్య నేను, మాయ & మాన్య ఒక కార్ లో వస్తాం అని ఆద్య చెప్పిన నెక్స్ట్ మినిట్ అలా అయితే నేను అమర్, ఆర్య, ఆనంద్ నా కార్ లో వస్తాం తాతయ్య అని కావాలని చెప్తాడు జై…..

ఆధ్య జై వైపు సీరియస్ లుక్ ఇస్తూ ఏదో అనబోతు ఉంటే ప్రతాప్ మధ్యలో నుంచుని ఎవరు ఏ కార్ లో రావాలో నేను చెప్తాను ఫస్ట్ అందరు పదండి అని ఫస్ట్ కార్ లో మహీదర్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న తర్వాత పక్కనే వినయ్ వెనుక శైలు, రేణుక సెటిల్ అవుతారు…. సెకండ్ కార్ లో ఆద్య డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే పక్కనే మాన్య వెనుక రుద్ర, మాయ సెటిల్ అవుతారు…… థర్డ్ కార్ లో జై డ్రైవింగ్ సీట్ పక్కన ప్రతాప్ వెనుక అమర్, ఆనంద్ సెటిల్ అవుతారు……

అందరూ కార్స్ లో కూర్చున్న తర్వాత 3 కార్స్ మొబైల్ లో రూట్ మ్యాప్ ను ఫాలో అవుతూ దాదాపు 5 గంటల సమయం తర్వాత డెస్టినేషన్ కి రీచ్ అవుతారు….. వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న జగదీశ్వర్ ( శారద గారి తమ్ముడు ఆవిడ ఎవరు అనుకుంటున్నారా ఏంటి 🤷 అయ్యో అదేనండి ప్రతాప్ గారి వైఫ్ ఇప్పుడు గుర్తొచ్చిందా) తన ఇంటి ముందు ఆగిన కార్స్ ను చూసి నవ్వుతూ కార్ పార్క్ చేసి ఇంట్లోకి వస్తున్న అందరినీ నవ్వుతూ ఇంట్లోకి తీసుకుని వెళతాడు……

మూవీస్ లో తప్పా ఎప్పుడు విలేజ్ చూడని వీళ్ళకు అక్కడున్న ప్రతిదీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటే జాగ్రత్తగా ఆ పాత కాలపు ఇంటినీ అబ్జర్వ్ చేస్తూ హాల్ లో సోఫా లో సెటిల్ అవుతారు….. ఎలా ఉన్నారు బావ ఇన్ని సంవత్సరాల తరువాత మీరు ఇలా రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అంటూ ఆత్మీయంగా ప్రతాప్ చెయ్ పట్టుకుని చెప్తున్న జగదీశ్వర్ ను చూసి ప్రతాప్ చిన్నగా నవ్వుతూ ఎలా ఉన్నావ్ జగదీష్ అని ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు…..

హాల్ లో కనిపిస్తున్న ఉడెన్ స్వింగ్ ఇండోర్ జూల ను చూసిన ఆద్య కి అది బాగా నచ్చడం తో వావ్ బలే ఉంది కదా అది అంటూ ముగ్గురు అమ్మాయిలు దాని మీద కూర్చుని ఊగుతూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు….

ఈ మిర్చి కి కొత్త ప్లేస్ కి వచ్చినప్పుడు డీసెన్సీ గా ఉండాలి అని కూడా తెలియదు దీనితో జాయిన్ అయ్యి మాయ కూడా కిడ్ లా బిహేవ్ చేస్తుంది అని వాళ్ళ వైపు విసుగ్గా చూస్తూ కూర్చుంటాడు జై….. అరే జాగ్రత్త బంగారాలు అని అంటున్న ప్రతాప్ అందరినీ జగదీశ్వర్ కి పరిచయం చేసాక ఏంటి ఇంట్లో ఎవరు లేరా ఎవరి మాటలు వినిపించడం లేదు అని అడుగుతాడు…..

బాగా లేట్ అయింది కదా బావ నా భార్య తన రూమ్ లో నిద్రపోతోంది ఇక నా కొడుకు కోడలు టౌన్ కి వెళ్ళారు షాపింగ్ కోసం ఇంకా వాళ్ళు రాలేదు ఇక నా మనవరాళ్లు ముగ్గురూ గుడి దగ్గర జాతర కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉంటే వాటిని చూడ్డానికి వెళ్లారు….. మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి ఉదయాన్నే అందరినీ పరిచయం చేస్తాను……

 

సీతాలు అందరికీ భోజనం వడ్డించూ అని పని మనిషి ను పిలుస్తూ ఉంటే వద్దు జగదీష్ అందరం మధ్యలో ఆగి తినే వచ్చాం అనగానే అలాగా సరే అని ముగ్గురు పని వాళ్ళను పిలిచి ఎవరికి ఏ రూమ్ చూపించాలో జగదీష్ చెప్పడం తో అందరూ ఫుల్ గా టైడ్ అవ్వడం తో ఎవరికి ఇచ్చిన రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు……

రూమ్ కి వెళ్లగానే బాగా టైడ్ అవ్వడం వల్ల ఫ్రెష్ అయ్యి అందరూ కూడా ఎర్లీ గా పడుకుంటారు….. డెయిలీ ఎర్లీ గా లేచే జై, రుద్ర లకు 5 కే కోడి కూతలకు మెలకువ వస్తుంది….. బాడీ ను అటు ఇటు స్ట్రెచ్ చేసి పైకి లేచి కూర్చుంటూ ఫ్రెష్ అయ్యి వాళ్ళ రూమ్స్ నుండి బయటకు వచ్చి చూడగా అప్పటికే ఇంట్లో లైట్స్ ఆన్ అవ్వడం చూసి ఇదేంటి అప్పుడే అందరూ లేచారు ఇక్కడ ఇంత ఎర్లీ గా లేచి ఎమ్ చేస్తారు అని జై తొలి వెలుగు రేఖల్లో అందంగా ఉన్న ఇంటిని చూస్తూ ఉంటాడు…..

ఇల్లు తగలబడి పోతున్నట్టు పొగ ఏంటి ఇలా వస్తుంది అని దగ్గుతూ చేత్తో మొహం మీద ఊపుకుంటూ ముందుకు చూసిన రుద్ర కి గ్రీన్ & రెడ్ కలర్ లంగా వోని లో తలకు టవల్ చుట్టుకుని ఒక చేత్తో ధూపం వేస్తూ మరో చేత్తో దుపాన్ని చేత్తో అన్ని రూమ్స్ కి వేస్తూ తన అందమైన గొంతు తో వెంకటేశ్వర సుప్రభాతం పాడుతుంది ఒక అమ్మాయి……

 

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సండ్యా ప్రవర్తతే ।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥

 

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥

మాతః సమస్త జగతాం మధుకైటభారే
వక్షోవిహారిణి మణిప్లవగాయమానే ।
శ్రీ వెంకటేశదయితే తవ సుప్రభాతం
మేఘావళీ చ మకరందమహా ప్రవాహః ॥

 

ఆ అమ్మాయి వాయిస్ విన్న రుద్ర ఒక్కో స్టెప్ దిగుతూ ఆఖరి మెట్టు మీద నుంచుని ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంటాడు….. అమ్మాయి గొంతే కాదు ఆ అమ్మాయి కూడా ఎంతో అందంగా ఉంది అలా పాడుతూ వస్తున్న అమ్మాయి రుద్ర ను చూసి కంగారుగా లోపలికి పరిగెత్తడం చూసి రుద్ర నవ్వుకుంటూ ఉంటే వెనుక స్టెప్స్ దిగుతూ వచ్చిన జై హాయ్ రుద్ర గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేయగానే గుడ్ మార్నింగ్ జై అంటూ ఇద్దరూ బయటకు నడుస్తారు…..

ఇద్దరూ గుమ్మం బయటకు వచ్చి ఇంకా మంచు కురుస్తున్న ఆ ఉదయాన్ని చూస్తూ వావ్ ఎంత ప్లెజెంట్ గా ఉంది కదా ఈ మార్నింగ్ & వెదర్ కూడా చాలా బావుంది అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు చూడగా ఒక అమ్మాయి ముగ్గు వేస్తూ ఉంటే ఇంకో అమ్మాయి వాటికి కలర్స్ వేస్తూ కనిపిస్తుంది…..

వావ్ ముగ్గు చాలా ప్రెట్టీ గా వేస్తున్నారు కదా అంటూ జై ఇద్దరి వైపు చూస్తూ విలేజ్ లో కూడా అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారా అనుకుని హాయ్ గర్ల్స్ అంటూ వాళ్ళ ముందుకు వచ్చి నుంచుని విష్ చేస్తాడు….. జై వాయిస్ కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసిన అమ్మాయిలు జై ను చూసి బావ అని నవ్వుతూ చెప్పి జై ను ఇద్దరూ హగ్ చేసుకోవడం ఆవలిస్తూ నిద్ర కళ్ళతో అక్కడికి వచ్చిన మాయ చూసి పళ్ళు నూరుతుంది…..

రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదని ఎక్కడికి వెళ్లినా ఈ గోలేంటి నాకు 😬😬 అన్నయ్య ను వేరే అమ్మాయిల వైపు చూడకుండా చేయడమే నా పని అయిపోయింది అని తిట్టుకుంటూ ఉహ… ఉహ్….. అని దగ్గుతూ జై దగ్గరకు వెళ్లగానే ఆ అమ్మాయిలు జై ను వదిలి మాయ ను చూసి నువ్వు మాయ కదా అని నవ్వుతూ హగ్ చేసుకుంటారు. ….

ఏయ్ ఎవరు మీరు అని దూరం జరిగిన మాయ వైపు చూస్తూ మాయ మమ్మల్ని గుర్తు పట్టలేదా నేను సింధు ఇది నా చెల్లి ఇందు మేము మీకు మావయ్య కూతుర్లు అవుతాం మనం అందరం చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం గుర్తొచ్చామా…..?

ఏంటి ఆడుకునే వాళ్ళమా నాకేం గుర్తు రావడం లేదు మిమ్మల్ని చూడ్డం ఇదే ఫస్ట్ టైమ్ మీ నేమ్స్ కూడా తెలియదు మాకు అంటున్న మాయ ను చూసి నవ్వుతూ మీకు మేము తెలియక పోయినా మాకు మీరు బాగా తెలుసు ప్రతాప్ తాతయ్య మీ పిక్స్ మాకు పంపించే వాడు మిమ్మల్ని మేము డెయిలీ పిక్స్ లో చూసే వాళ్ళం అని నవ్వుతూ ఇందు జై, రుద్ర లకు ఇల్లు చూపించడానికి తీసుకుని వెళ్తే ఇంట్లోకి వెళ్తున్న సింధు ను పిలుస్తుంది మాయ…..

సింధు మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తున్నారు అందుకే అడుగుతున్నా మీ ఫ్యామిలీ కి మా ఫ్యామిలీ కి గొడవ ఏంటి అసలు ఇన్ని ఇయర్స్ ఎందుకు అందరం దూరంగా ఉన్నాం అని అడుగుతుంది…… మాయ క్వశ్చన్ కి అప్పటి వరకు నవ్వుతున్న సింధు మొహం డల్ గా మారుతుంది అవన్నీ ఇప్పుడు ఎందుకు లే మాయ ఫ్రెష్ అయ్యి రా నీ కోసం నేను వేడి వేడి గా ఫిల్టర్ కాఫీ తీసుకుని వస్తాను…..

టాపిక్ డైవర్ట్ చేయకుండా స్ట్రెయిట్ గా చెప్పు సింధు ఎందుకు మనం దూరం గా ఉన్నాం తాతయ్య ను అడిగితే మమ్మీ కి ఇష్టం లేదు అని చెప్పాడు ఇన్ని ఇయర్స్ ఒప్పుకొని మమ్మీ సడెన్ గా ఎందుకు ఒప్పుకుంది…..??

ఎందుకంటే మా ముగ్గరికి మ్యారేజ్ ఫిక్స్ అయింది మేము ఎవరం జై బావ లైఫ్ లోకి రాము అని తను నమ్మింది కాబట్టే ఈ ఊరు రావడానికి ఒప్పుకుంది మాయ…. మీ మమ్మీ కి హరిణి ను తన కోడలిగా చేసుకోవాలి అని ఇష్టం అందుకే మేము ఎక్కడ అడ్డుగా వస్తామో అని చిన్నప్పుడే మా అమ్మ ను అవమానించి గొడవ చేసి మా అక్క చందు ను కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది…..

ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుండి మా అక్క కి ఎవరైనా అబ్బాయిలు కనిపించినా భయం తో పారిపోయేది ఇప్పటికీ అంతే….. ఇదంతా మీ మమ్మీ వల్లే మేము ఇన్నాళ్లుగా అందరికీ దూరంగా ఉన్నాం ఇప్పుడు కూడా ప్రతాప్ తాతయ్య కోసం మేము పెళ్ళిళ్ళకు ఒప్పుకున్నాం అని కోపంగా చెప్పి వెళ్తున్న సింధు ను చూసిన మాయ కి బుర్ర గిర్రున తిరుగుతుంది…..

తన చిన్నప్పుడు తనకు తెలియని పాస్ట్ ఏదో ఉందని క్లియర్ గా అర్థం అవ్వడం తో తల పట్టుకుని అక్కడే స్టెప్స్ మీద కూర్చుని రేణుక కి వీళ్ళ మీద కోపానికి జై పెళ్ళి ఒకటే కారణమా లేక ఇంకేమైనా ఉందా అని ఆలోచిస్తూ కూర్చుంటుంది……