విలన్ హస్బెండ్-55
రుద్ర ఏడుస్తున్న ఆధ్య ను దూరం జరిపి తన కన్నీళ్ళు తుడుస్తూ అమ్ములు నా బంగారం కదా ఏడవకు రా నేను వచ్చేసాను కదా ఇంకా ఈ కన్నీళ్లు దేనికి 3 మంత్స్ వరకూ నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను సరేనా అని అంటున్న రుద్ర ను చూసి అంటే 3 మంత్స్ తరువాత వెళ్ళిపోతావా అని ఏడుస్తూ పైకి లేచి చాలు అన్నయ్య ఇన్నాళ్లు మమ్మల్ని ఏడిపించింది చాలు ప్లీస్ ఇక నీ కోసం ఏడ్చే ఓపిక మాలో ఎవరికి లేదు….
మామ్ నీ కోసం ఎన్ని సంవత్సరాలు నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడ్చేదో తెలుసా స్టిల్ ఇప్పటికీ నీ కోసం ఏడుస్తూనే ఉంది 🥹 & వాట్ అబౌట్ మాయ…..?? అది నీ కోసం పిచ్చిది అయిపోతుంది అన్నయ్య నిన్నే ప్రేమిస్తే నీ అలవాట్లే తన అలవాటుగా మార్చుకుని ప్రాణంగా ప్రేమిస్తుంది…..
డాడ్ చెప్పడం లేదు కానీ తనలో తనే నీ కోసం చాలా బాధ పడుతున్నారు కేవలం ఆయన వల్లే నువ్వు ఇంటికి దూరం అయ్యావ్ అన్న బాధ డాడ్ ను వెంటాడుతూ ఉంది…… అదే ఇంట్లో నీతో ఉన్న మెమోరిస్ తలచుకుంటూ మామ్ హెల్త్ పాడవుతుంది అన్న రీసన్ తో హైదరాబాద్ వచ్చాం బట్ అలా రావడం వల్లే ఇవాళ నిన్ను కలుసుకోగలిగా అని ఆనందంగా చెప్తూ ఇక నిన్ను దూరంగా వెళ్లనివ్వను అన్నయ్య పదా ఇప్పుడే అందరికీ ఈ విషయం చెప్దాం అంటూ రుద్ర చెయ్ పట్టుకుంటుంది…..
రుద్ర సున్నితంగా ఆద్య చెయ్ విడిపించుకుని వద్దు అమ్ములు ఇప్పుడే నేను ఎవరు ఏంటి అని ఎవరికి చెప్పాలి అనుకోవడం లేదు అందుకే కదా నేను ఇండియా కి వచ్చినా మీ ముందుకు రాలేదు…… నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయాక నా లైఫ్ లో చాలా జరిగాయి & నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అవన్నీ నేను మిడిల్ లో వదిలేయలేను……
నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయాక వారం రోజులు ఎట్ లీస్ట్ ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఫుట్ పాత్ మీద పడుకున్నాను……. రోజు లాగే ఆ రోజు కూడా ఫుట్ పాత్ మీద పడుకుని నిద్రపోతున్న నన్ను ఇద్దరు మంచి మనుషులు చూసి చలికి వణుకుతున్న నన్ను వాళ్ళతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళి నా హెల్త్ క్యూర్ అయ్యే వరకూ చాలా జాగ్రత్తగా వాళ్ళ సొంత బిడ్డ లా చూసుకున్నారు…..
నేను నార్మల్ అయ్యాక వాళ్ళ ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే ఇవ్వమని అక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటాను అని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా అమ్ములు….??
రుద్ర చెప్పేది చాలా కేర్ఫుల్ గా వింటున్న ఆధ్య హా….!! ఎమ్ అన్నారు అన్నయ్య అంటూ రుద్ర వైపు చూస్తుంది…..
నీది స్కూల్ కి వెళ్ళి చదువుకోవాల్సిన ఏజ్ కానీ పని చేసే ఏజ్ కాదు రా నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది నీకు ఎవరు లేరని పోనీ మాతో వచ్చేస్తావా నిన్ను సొంత కొడుకులా చూసుకుంటాం అని అడగ్గానే నేను క్షణం పాటు ఆలోచించి వాళ్ళతో పాటు స్టేట్స్ కి వెళ్ళిపోయి వాళ్ళ కొడుకు లా ఇన్ని ఇయర్స్ పెరిగాను……..
నన్ను ఇద్దరూ చాలా బాగా అసలు నేను వాళ్ళ కొడుకు ను కాదు అన్న థాట్ కూడా రాకుండా ఎంతో ప్రేమగా చూసుకున్నారు…… అపర్ణ మామ్ కి నేనంటే చాలా ఇష్టం ఎక్కడ నా రియల్ పేరెంట్స్ వస్తే నేను వెళ్ళిపోతానో అని ఇండియా అన్న పేరు కూడా నా చెవిన పడకుండా జాగ్రత్త పడేది నేను ఎంత మీ అందరికీ దూరంగా ఉన్నా నేను ఎవరినీ మర్చిపోలేదు అందుకే నా పాస్ట్ మామ్ కి చెప్పలేక పోయినా భార్గవ్ డాడ్ కి మాత్రం చెప్పాను ఆయన కూడా నా ఇష్టాయిష్టాలకు ఎప్పుడూ అడ్డు చెప్పకుండా సపోర్ట్ చేస్తూ వచ్చారు…..
నా లైఫ్ నాకు నచ్చినట్టు ఎంతో సంతోషంగా వెళ్తుంది అనుకున్న టైమ్ కి నాకు కొన్ని విషయాలు తెలిసాయి అవేంటో తెలుసా ********* ( రుద్ర ఆద్య కి ఎమ్ చెప్పాడో మనకు ఫ్యూచర్ లో టైం వచ్చినప్పుడు రివీల్ అవుతాయి ☺️)
జై చెప్పింది విన్న ఆద్య షాక్ అవుతూ వాట్….?? మరి ఇంత తెలిసి ఎందుకు అన్నయ్య సైలెంట్ గా ఉన్నావ్ అంటూ కోపంగా అడుగుతుంది…..
అమ్ములు నాకు ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలిసింది బట్ నాతో ఎలాంటి ప్రూఫ్స్ లేవు అందుకే సైలెంట్ గా ఉన్నాను & నేను తిరిగి వచ్చాను అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకూడదు నేను అనుకున్నది జరిగే వరకూ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పను అని ప్రామిస్ చెయ్…..
ఆద్య తన ముందు ఉన్న రుద్ర చేతిని చూసి నాకు ఇష్టం లేకపోయినా సిచుయేషన్ నా కంట్రోల్ లో లేదు కాబట్టి ప్రామిస్ చేస్తున్నా వన్స్ నువ్వు అనుకున్నది ఫుల్ ఫిల్ అయ్యాక నువ్వు ఎమ్ చెప్పినా ఆగను అన్నయ్య అంటూ రుద్ర చేతిలో చెయ్ వేసి ప్రామిస్ చేస్తూ నువ్వు నా సొంత అన్నయ్య వి అన్న విషయం ఎవరికి చెప్పను ప్రామిస్ అంటూ ఏడుస్తూ రుద్ర గుండె ల తల పెట్టుకుంటుంది……
అమ్ములు నీ పెయిన్ నాకు అర్థం అవుతుంది బట్ ప్లీస్ రా ఇదంతా మన కోసమే కదా జస్ట్ ఫ్యూ డేస్ అంటూ ఆద్య కి మాటలు చెప్తూ కాసేపటికి ఆద్య ఏడుపు ఆపించి సరే వెళ్దాం పదా ఈ పాటికి మన గ్యాంగ్ మనల్ని వెతుకుతూ ఉంటారు ఇంకా ఎక్కువ సేపు కనిపించక పోతే అందరికీ డౌబ్ట్ వస్తుంది…..
మాయ గురించి ఎమ్ ఆలోచించావ్ అన్నయ్య అది చిన్నప్పటి నుండి నిన్నే ఇష్టపడుతూ పిచ్చిగా ప్రేమిస్తుంది మరి నువ్వు….??
రుద్ర చిన్నగా మాయ కంటే ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నా ఎప్పటికైనా అదే నా పెళ్ళాం ఇప్పుడు హ్యాపీ నా ☺️……!!
చాలా హ్యాపీ అన్నయ్య ఈ విషయం అది వింటే ఆనందం తో అన్నం కూడా తినడం మర్చిపోతుందేమో అని నవ్వుతున్న ఆద్య ను చూసి రుద్ర కూడా చిన్నగా నవ్వుతాడు….. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ జామ తోట దగ్గరకు వచ్చే సరికి అప్పటికే ఇద్దరి కోసం తలో వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు యంగ్ బ్యాచ్…… ముందుగా వీళ్ళను చూసిన జై చేతిలో చెయ్ పట్టుకుని నవ్వుకుంటూ వస్తున్న వీళ్ళను చూసి పళ్ళు నూరుతూ చూస్తూ ఉంటాడు…….
అమ్ము అంటూ ఆద్య ను చూసిన మాన్య ఎటెల్లి పోయారు అని ఫాస్ట్ గా పరిగెడుతూ వస్తున్న మాన్య ను చూసి రుద్ర ఆద్య చెయ్ వదిలి దూరం జరిగితే ఆద్య రుద్ర వైపు ఒక సారి చూసి ఎమ్ లేదే అదిగో అక్కడ సినరీ నచ్చి అటుగా వెళ్ళాను అంతే దానికే ఇంత కంగారా పదా అంటూ మాన్య ను తీసుకుని అందరూ ఉన్న వైపుకు వెళ్తుంది….
వెనుక ఫాలో అవుతున్న రుద్ర కు అడ్డుగా నుంచుని ఏంటీ బాస్ ఆద్య చెయ్ పట్టుకుని బాగా నవ్వుకుంటూ వస్తున్నారు అని కొంచెం సీరియస్ లుక్స్ ఇస్తూ అది ఈ జై గాడిది యూ జస్ట్ కీప్ అవే ఫ్రమ్ హర్ ఒకే అని చెప్పి వెళ్ళిపోతున్న జై ను చూసి అబ్బో జెలస్ హా…!! అని నవ్వుకుంటూ జై వైపు చూస్తాడు…..
( ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి రుద్ర జై ఆద్య ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు & జై క్యారెక్టర్ గురించి కూడా రుద్ర కి పూర్తిగా తెలియదు అందుకే జై ను కూడా ఆద్య ఇష్టపడితే ఇద్దరికీ మ్యారేజ్ చేయాలని అని అనుకుంటున్నాడు దీన్ని మీరు మర్చిపోకండి 🫣)
అందరూ కాసేపటి వరకూ ఆ తోట లోనే తిరిగి మల్లయ్య ఎడ్ల బండ్లు తీసుకుని వచ్చాక 3 ఎడ్ల బండ్ల ల్లో అందరూ సెటిల్ అయ్యి అలా వాటి మీద నే ఊరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు….. అలా ఊరు చూస్తూ వెళ్తున్న వాళ్ళకు ఒక చోట చాలా మంది జనం కనిపించడం & అక్కడి నుంచి ఏవేవో అరుపులు, కేకలు వినిపించడం చూసి మాన్య అదే విషయాన్ని ఇందు ను అడుగుతుంది…….
ఓహ్ అదా అక్కడ ఎవ్రీ ఇయర్ మా ఊరిలో అమ్మ వారి జాతర జరిగే రెండు రోజుల ముందు కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు….. ఇప్పుడు అక్కడ అదే జరుగుతుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు సిటీ లో ఎపుడు చూసి ఉండరు వెళ్దామా…..??
రియల్లీ వుయ్ వాంట్ టు సీ అని అమ్మాయిలు ముగ్గురు జోష్ గా అరవడం తో మూడు ఎడ్ల బండ్లు అటు వైపు యూ టర్న్ తీసుకుని వెళ్తాయి….. అందరూ జాగ్రత్తగా ఎడ్ల బండ్ల నుండి దిగి అక్కడ జరుగుతున్న కర్ర సాము విద్య ను చాలా ఇంట్రెస్టింగ్ గా క్లాప్స్ కొడుతూ అక్కడున్న చైర్స్ లో సెటిల్ అయ్యి చూస్తూ ఉంటారు…..
బాహుబలి మూవీ రాణా కి డబుల్ సైజ్ లో ఉన్న ఒకడు వాడితో పోటీ పడి గెలవడానికి ఎవరు వెళ్లినా నిమిషం లో వాళ్ళను కింద పడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి నాతో ఆడి గెలవడానికి ఈ ఊర్లో మగాడే లేడా అని కావాలనే రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటాడు…..
(ఇక్కడ కాంపిటీషన్ రెండు ఊర్ల మధ్య జరుగుతూ ఉంది అందుకే వాడు కావాలని వాడి మాటలతో రెచ్చ కొట్టి వచ్చిన వాళ్ళను వచ్చినట్టే కింద పడేసి కొడుతూ రాక్షస ఆనందం పొందుతూ ఉంటాడు మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి చెప్తున్నా లెట్స్ మూవ్ టు ది స్టోరీ)
వాడి మాటలకు ఆ ఊర్లో ఉన్న అందరూ వాడిని ఎదిరించే దమ్ము ఎవరికి లేక పోవడం తో తల వంచుకుని మౌనంగా ఉంటే అది చూసిన ఇంకో ఊరి వాళ్ళు మాత్రం వాళ్ళ మీద సెటైర్ వేస్తూ వాళ్ళను ఇన్సల్టంగ్ గా మాట్లాడుతూ ఉంటారు…..
అవన్నీ వింటున్న ఆధ్య ప్చ్…..!! టూ మచ్ గా వాగుతున్నాడు వీడు పాపం అందరూ చాలా డల్ అయిపోయారు వీడ్ని కొట్టే వాడు ఎవడు అని చుట్టూ చూస్తున్న ఆద్య కి తన పక్కన కూర్చున్న జై జరిగేది పట్టించుకోకుండా ఎవరో అమ్మాయితో చాటింగ్ చేస్తూ హార్ట్ సింబల్స్ పంపిస్తూ ఉండడం చూసి 😬😬 ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే ఎట్ లీస్ట్ రియాక్ట్ అవ్వకుండా కి కి…. అని నవ్వుకుంటూ పులిహోర కలుపుతున్నావా ఆగరా ఇవాళ నీ పని చెప్తా అని జై వైపు చూస్తూ నేరుగా స్టేజ్ మీద కు వెళ్తుంది……
ఆధ్య….. ఆద్య ఎక్కడికి అని అందరూ పిలుస్తున్నా ఆద్య ఎవరి మాట వినకుండా నేరుగా స్టేజ్ ఎక్కి అక్కడున్న మైక్ తీసుకుని హెలో ఆల్ మీరు ఎవరు డిజప్పాయింట్ అవ్వకండి ఎందుకంటే ఈ ఊరి వాళ్ళంతా తల పైకి ఎత్తి తిరిగేలా ఈ ఊరు పరువు నిలబెట్టడానికి & వాడిని ఓడించడానికి ఒక గొప్ప వ్యక్తి బరిలోకి దిగబోతున్నారు అని ఆద్య క్లాప్స్ కొట్టగానే అది విన్న ఊరు వాళ్లందరూ కూడా ఆనందం తో విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు…..
ఆద్య వాయిస్ కి తల పైకి ఎత్తి చూసిన జై ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది…..?? అయినా ఈ మిర్చి కి ఈ ఊర్లో ఎవరు తెలియదు కదా అని బ్లాంక్ ఫేస్ తో ఆద్య వైపు చూస్తూ ఉంటాడు & ఆల్మోస్ట్ మన యంగ్ బ్యాచ్ కూడా సేమ్ రియాక్షన్ తో ఆద్య ఎవరి గురించి మాట్లాడుతుంది అని క్యూరియాసిటి తో చూస్తూ ఉంటారు…….
ఇంతకీ ఎవరమ్మా అతను అని ఒక వ్యక్తి అడగడం తో ఆద్య నవ్వుతూ తన వేలిని జై వైపు చూపించడం తో చూసి అందరి చూపు జై మీద పడుతుంది…… అమ్మ దీనమ్మ ఇరికించేసింది 😦🙆 అని జై అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని పైకి లేవగానే ఊరు వాళ్లందరూ కలిసి జై ను ఎత్తుకుని గ్రౌండ్ లోకి తీసుకుని వచ్చి వాడి ఎదురుగా నుంచోబెట్టి మన ఊరి పరువు నిలబెట్టడానికి వచ్చిన దేవుడు బాబు మీరు తీసుకోండి కర్ర అని ఒక కర్ర జై చేతికి ఇచ్చి కత్తితో వేలు కట్ చేసుకుని మరీ రక్తం తో జై నుదుటిన వీర తిలకం దిద్దుతారు……
ఆధ్య జై గురించి అలా చెప్పడం తో అందరూ షాక్ అవుతూ పైకి లేచి నుంచుని జై వైపు చూస్తూ ఉంటే ఆద్య నవ్వుకుంటూ స్టేజ్ దిగి వీళ్ళ వైపు వచ్చి స్టైల్ గా చైర్ లో కూర్చుంటూ ఉంటే ఎమ్ చేసావ్ వదిన నువ్వు…..?? వాడేమో అడవి పంది లా ఉన్నాడు చూసావ్ కదా కర్ర సాము బాగా వచ్చిన వాళ్ళనే ఎలా కొట్టి పడేశాడో…..?? అలాంటిది కర్ర సాము అంటే ఏంటో కూడా అన్నయ్య కి తెలియదు ఇప్పుడు వాడు అన్నయ్య ను ఎమ్ చేస్తాడో ఏంటో….?? నాకు చాలా కంగారుగా ఉంది…..
అరే….!! చిల్ మాయ ఎమ్ అవ్వదు లెట్స్ వాచ్ ది ఫన్ అని చాలా కేర్ లెస్ గా అంటున్న ఆద్య ను చూసి మాయ ఎమ్ అనలేక జై వైపు కంగారుగా చూస్తూ ఉంటుంది….. ఈ కర్ర తో ఏం చేయాల్రా బాబు అని తన ముందు ఉన్న వాడి వైపు చూస్తూ హలో అంటూ షేక్ హ్యాండ్ ఇస్తున్న జై ను రెండు చేతులతో ఎత్తి గిర గిరా తిప్పి మూట లా విసిరి పడేయగానే జై వెళ్ళి పది అడుగుల దూరం లో కుండల మీద పడతాడు……
జై కింద పడగానే అందరూ జై అంటూ కంగారుగా పిలిచినా ఆధ్య మాత్రం గట్టిగా విజిల్ వేసి క్లాప్స్ కొట్టడం చూసిన జై తనకు అంటిన మట్టిని దులుపుకుంటూ ఆద్య వైపు కోపంగా చూస్తూ పైకి లేచి నుంచుని 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ఉండడం చూసిన వాడు నవ్వుకుంటూ జై మీదకు కాలు ఎత్తుతాడు……
సరిగ్గా అప్పుడే కళ్ళు తెరిచిన జై ఎత్తిన కాలిని అలాగే పట్టుకుని తనకు వచ్చిన మార్షల్ ఆర్ట్స్ యూస్ చేసి ఒక్క దెబ్బ తో ఆ కాలు విరిచేస్తాడు…. కాలు విరిగిన సౌండ్ బట్టి చెప్పచ్చు ఆ కాలు ఇక జీవితం లో సెట్ అవ్వదు అని అది చూసిన ఊరు వాళ్ళు గట్టిగా విజిల్స్ వేస్తూ ఉంటే అప్పటి వరకు నవ్వుతున్న ఆద్య కోపంగా చైర్ లో నుండి పైకి లేస్తే నుంచున్న మన బ్యాచ్ మొత్తం నవ్వుతూ అప్పుడే చైర్స్ లో కూర్చుంటారు…..
జై సైడ్ స్మైల్ తో ఆద్య వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం చూసిన ఆద్య 😬😬 యూ అంటూ ఇంగ్లీష్ లో తనకు తెలిసిన బూతులు తిడుతూ ఉంటే అది చూసిన జై నవ్వుకుంటూ తనతో పోటీ కి రెడీగా ఉన్న వాడిని పిచ్చి కొట్టుడు కొట్టి వాడి ఇంకో కాలితో పాటు కుడి చేయ్ కూడా విరిచి లైఫ్ లాంగ్ ఈ ఒక్క చేత్తోనే సర్వైవ్ అవ్వరా అని పైకి లేచి వాడి నడుము మీద ఎగిరి మోకాళ్ళ మీద కూర్చుని వాడితో గావు కేక పెట్టించి స్పృహ తప్పేలా చేస్తాడు…..
స్పృహ కోల్పోయిన వాడిని చూసి నవ్వుకుంటూ పైకి లేచి నుంచున్న జై ను చూసి ఊరి వాళ్ళు ఎత్తుకుని పూలు చల్లుతూ యువరాజు లా జేజేలు కొడుతూ ఉంటే ఆద్య సీరియస్ గా చూస్తూ మొహం తిప్పుకుంటుంది అది చూసిన జై ను నవ్వుకుంటూ కన్ను కొట్టడం చూసిన ఆద్య మరింత ఉడికిపోతుంది……