Login with OTP

విలన్ హస్బెండ్-56

aashyatech

Author

జై ను కాసేపటి ఊరి వాళ్ళు కిందకు దింపగానే ఊరి పెద్ద అందరి ముందు జై కి శాలువా తో చిన్నపాటి సన్మానం చేసి మా ఊరి పరువు నిలబెట్టారు చాలా థాంక్స్ బాబు అని జై గురించి తెలుసుకుని మైక్ లో జై గురించి గొప్పగా చెప్పి పనిలో పనిగా జై తో ఫోటోస్ కూడా దిగి జై వాళ్ళ దగ్గర నుండి మన బ్యాచ్ దగ్గరకు వస్తాడు…..

 

జై ను చూసిన మాయ అన్నయ్య అంటూ జై ను హగ్ చేసుకుంటూ నీకేం అవ్వలేదు కదా నీళ్ళు నిండిన కన్నులతో అడుగుతున్న మాయ వైపు చూస్తూ తన కన్నీళ్లను తుడుస్తూ ఏంట్రా ఇది ఈ జై సిస్టర్ అంటే ఎలా ఉండాలి మన వల్ల ఒకరు ఎడవాలి కానీ ఎవరి వళ్ళో మనం ఎప్పటికీ ఎడవకూడదు అని సున్నితంగా మాయ ఫోర్హెడ్ కిస్ పెడుతూ నాకేం అవ్వలేదు చూడు అని నవ్వుతూ చెప్పి దూరం జరుగుతాడు…..

యూ ఆర్ మై హీరో అన్నయ్య అని జై ను మరో సారి హత్తుకుని వదిలి ఆద్య వైపు గర్వంగా దట్ ఈజ్ జై అన్నయ్య అన్నట్టు లుక్ ఇవ్వగానే హు 😏 దీనికే ఇంత ఓవర్ చేయాలా అన్నట్టు మూతి తిప్పుతున్న ఆద్య ను చూసి జై కి మండుతుంది…..

దీని సంగతి తర్వాత చెప్తా అని అందరూ ఉండడం తో అప్పటికి సైలెంట్ అవుతారు….. రుద్ర కూడా జై ను అప్రిశియేట్ చేయడం తో పాటు సైడ్ హగ్ చేసుకుని నువ్వెంత డేరింగ్ పర్సన్ అనేది కళ్ళారా చూసాను వెరీ ఇంప్రెసివ్ అంటూ కాంప్లిమెంట్ చేస్తున్న రుద్ర ను చూసి చిన్న స్మైల్ ఇచ్చి అమర్ ను హత్తుకుని ఆనంద్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇందు, సింధు లను చూసి నవ్వి చందు వైపు చూస్తూ కాసేపు అక్కడే టైమ్ స్పెండ్ చేసి లంచ్ టైమ్ అవ్వడం తో అందరితో పాటు ఎడ్ల బండి లో తిరిగి ఇంటికి రిటర్న్ అవుతారు……

🤍💙🤍💙🤍💙🤍💙🤍💙🤍

 

యంగ్ బ్యాచ్ లంచ్ అయ్యాక కాసేపు ఎవరి రూమ్స్ లో వాళ్ళు రెస్ట్ తీసుకుని ఈవెనింగ్ అయ్యేసరికి ఒక్కొక్కరిగా హాల్ లోకి వెళ్ళేసరికి అప్పటికే ఇల్లంతా రక రకాల పూలతో డెకరేట్ చేస్తూ కనిపిస్తారు ఈవెంట్ ప్లానర్ & వర్కర్స్….. ఏంటిది ఇల్లంతా ఇలా డెకరేట్ చేస్తున్నారు రేపు ఏమైనా ఫెస్ట్ ఉందా అని ఆలోచిస్తూ వెళ్ళి సోఫా లో అమర్ పక్కన కూర్చుని హాయ్ అమర్ గుడ్ ఈవెనింగ్ అంటూ చిరు నవ్వుతో చెప్పి తనకు వచ్చిన ఇంపార్టెంట్ మెయిల్స్ ఏమైనా వచ్చాయా అని చెక్ చేస్తూ ఉంటుంది……..

వెరీ గుడ్ ఈవెనింగ్ ఆద్య ఇప్పుడే లేచావా అని ఆద్య మొహం చూస్తూ అడుగుతున్న అమర్ ను చూసి యాహ్ బాగా నిద్రొచ్చింది సో అందుకే అసలు మెలకువ రాలేదు అని చెప్తూ ఉండగానే వెనుక ముందు ఒక్కొక్కరూ స్టెప్స్ దిగుతూ కనిపిస్తారు…..

అందరూ కూడా విశాలంగా ఉన్న హాల్ లో సోఫా లో సెటిల్ అవుతూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చందు మదర్ అనిత, శైలు ట్రే లో అందరి కోసం టీ ఇంకా స్నాక్స్ తీసుకుని వచ్చి ఇచ్చి హడావిడిగా ఏదో మాట్లాడుకుంటూ హాల్ లో అటు ఇటు తిరుగుతూ వర్క్స్ వర్కర్స్ తో చేయిస్తూ ఫ్లవర్స్ అక్కడక్కడ చేంజ్ చేయిస్తూ ఉంటారు…..

ఏంటీ వీళ్ళ హడావిడి అని ఆద్య వాళ్ళ వైపు చూస్తూ మామ్ ఏంటి స్పెషల్ టుమారో ఏమైనా ఫెస్ట్ ఉందా అని అడుగుతుంది….. ఫెస్ట్ కాదు ఆద్య రేపు చందు, సింధు & ఇందు ల ఎంగేజ్మెంట్ అందుకే ఈ హడావిడి అని చెప్పి బయట డెకరేషన్ ఎంత దాకా వచ్చిందో చూడ్డానికి వెళుతుంటే వాట్….?? ఎంగేజ్మెంట్ ఆ….?? ఆది కూడా రేపా అని షాక్ అవుతూ తీరిగ్గా టీ తాగుతున్న ముగ్గురిని చూసి రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని మీరెంటీ ఇంత సింపుల్ గా ఉన్నారు అని ఆశ్చర్యంగా చూస్తూ క్వశ్చన్ చేస్తుంది…????

ఎంగేజ్మెంట్ రేపు కదా ఆధ్య రేపు ఉదయాన్నే లేచి హెడ్ బాత్ చేసి న్యూ సారీస్ కట్టుకుని రెడీ అవుతాం అని సింపుల్ గా చెప్తున్న చందు ను చూసి ఓహ్ గాడ్….!! మీరు ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారు చందు ఎంగేజ్మెంట్ అంటే న్యూ శారీ మాత్రమే కాదు చాలా ఉంటాయి జస్ట్ వెయిట్ అంటూ ఆన్లైన్ లో వెంటనే మేక్ అప్ ఆర్టిస్ట్ & మెహందీ ఆర్టిస్ట్ లను బుక్ చేసి ఎక్స్ట్రా పేమెంట్ కూడా చేసి 2 అవర్స్ లో వాళ్ళను ఊరికి పిలిపిస్తుంది…..

ఎవరు ఆద్య వీళ్ళు అని అడుగుతున్న చందు వైపు చూస్తూ సీ చందు మీ ముగ్గురును చూస్తుంటే ఎట్లిస్ట్ ఫేషియల్ కూడా ఎప్పుడూ చేయించు కోలేదు అని అర్థం అవుతుంది & మీకు అవసరం కూడా లేదు అనుకోండి మీరు కూడా నా లాగే న్యాచురల్ బ్యూటీస్ అంటూ ఆద్య నవ్వగానే చీచీ….!! ఏంట్రా బిస్కెట్స్ మరీ పాతవి అయ్యాయి కొత్తవి చెప్పరా అని వెనుక నుండి సెటైర్ వేసిన జై వాయిస్ కి అందరూ నవ్వితే ఆద్య కోపంగా చూస్తూ తన చేతిలో ఉన్న బిస్కెట్ కోపంగా జై వైపు విసరగానే అది కరెక్ట్ గా తన నోట్లో పడేలా చేసుకున్న జై ను చూసి అందరూ క్లాప్స్ కొట్టగానే అందరూ వీడికి చంచాల్లా తయారు అయ్యారు అని రుస రుసలాడుతూ ఆద్య గర్ల్స్ బ్యాచ్ ను తీసుకుని తన రూమ్ కి వెళ్ళబోతుంది……..

 

అబ్బో జాగ్రత్తగా నడువు మిర్చి వూడిపోయేలా ఉంది అని వెనుక నుంచి రోస్ ఫ్లవర్ విసిరి మరీ అంటున్న జై వాయిస్ కి వెనక్కి తిరిగి వాట్….?? అని తన వైపు చురుగ్గా చూస్తున్న ఆద్య ను చూసి అదేనే ఓ…. తెగ తిప్పుకుంటూ వెళ్తున్నావ్ కదా నడుము అది లూస్ అయ్యి ఊడిపోయేలా ఉంది జాగ్రత్త అంటున్న అంటూ నవ్వుతున్న జై ను చూసి యూ అంటూ పక్కనే కనిపించిన స్టిక్ తీసుకుని కొట్టడానికి వస్తున్న ఆద్య ను చూసి జై పరుగు పెడతాడు…..

ఆగరా చెప్తా అని జై ను తరుముతూ వెళ్తున్న ఆద్య ను చూసి రుద్ర, ఆనంద్ లతో పాటు నవ్వుతూ చూస్తున్న అమర్ జుట్టు లాగి ఏంట్రా తెగ నవ్వుతున్నావ్ ఇంకో సారి నా ఫ్రెండ్ ను చూసి నవ్వితే జుట్టు కట్ చేస్తా అని బెదిరిస్తున్న మాన్య ను చూసి అయిపోయావే అనవసరంగా నన్ను గెలికావ్ అని తనను పట్టుకోవడానికి వస్తున్న అమర్ ను చూసి మాన్య పరుగు అందుకుంటుంది…….

ఉఫ్ 🤦 వీళ్ళు ఈ జన్మకు మారరు మారుతారు అనుకోవడం నా బుద్ధి తక్కువ అని రెండు జంట లను చూసి ఫ్రస్ట్రేట్ అవుతూ వచ్చిన ఆర్టిస్ట్ లను సింధు, చందు, ఇందు లను తీసుకుని తన రూమ్ కి వెళ్ళి వాళ్ళు వద్దు ప్లీస్ అంటున్నా బలవంతంగా ముగ్గురికి ఫస్ట్ ఫేషియల్ చేయిస్తుంది & అలాగే తను కూడా చేయించుకుంటుంది……

రేయ్ ఆగరా ఊస కల్లోడా అని తిడుతున్న ఆధ్య ను చూసి జై కి కోపం రావడం తో దీనికి మామూలు బలుపు లేదు అని ఆద్య ను అలాగే ఇల్లు మొత్తం తిప్పిస్తూ ఆయాసం తెప్పించి గడ్డి వాము వైపు పరుగు పెడతాడు……. అబ్బా నా వల్ల కాదు ఆగరా అని ఆయాస పడుతూ వచ్చి ఆగిన జై మీద పడగానే జై ఆద్య అలా గడ్డి వాము లో దొర్లుకుంటూ ఒక చోట ఆగుతారు…..

కింద జై ఉంటే తన మీద ఆద్య ఉంటుంది భారంగా ఊపిరి తీసుకుంటూ కనిపిస్తున్న ఆద్య వైపు చూస్తున్న జై చూపు మెడ కింద తన ఎద బాగం వైపు పడుతుంది….. లైట్ గా కనిపిస్తున్న క్లీవేజ్ వైపు చూస్తున్న జై కి ఆద్య టచ్ లోనే ఫీలింగ్స్ స్టార్ట్ అవ్వడం తో ఆద్య ను పక్కకు దొర్లించి తను ఆద్య మీదకు చేరి ఆద్య మెడ దగ్గర లిక్ చేస్తూ ఆద్య వేసుకున్న షర్ట్ బుజం మీదుగా తప్పిస్తూ తన ఎంగిలి రాస్తూ ఉంటాడు…..

జై వాట్ యూ ఆర్ డూయింగ్ అని అరుస్తున్న ఆధ్య వైపు చూసి హోల్డ్ మీ ఫర్ సమ్ టైం ప్లీస్ డెవిల్ కాదు అనకు అని పాలరాతి బొమ్మ లా మెరుస్తున్న ఆద్య మెడ మొత్తం ఎంగిలి రాస్తూ తమకపు ముద్దులు పెడుతూ ఉంటాడు….. ఆఆ……!! ఇడియట్ జస్ట్ లీవ్ మీ అని అరుస్తున్న ఆధ్య అరుపు జై ఇస్తున్న ముద్దు తో ఆగిపోతుంది జై తన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేయలేక ముందుగా అసలే అక్కడ గాయం అయ్యి బాధ పడుతున్న ఆద్య లోయర్ లిప్ ను కొరికి బ్లడ్ లిక్ చేస్తూ ఆద్య గుండెల మీద కు చేరి అక్కడ షర్ట్ తప్పించపోతూ ఉంటే ఆద్య కోపంగా జై ను నెట్టేసి ఈ ఫంక్షన్ అయ్యాక చెప్తా నీ సంగతి అని జై వైపు అసహ్యపు చూపులు చూస్తూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోవడం చూసి జై తనేం చేశాడో గుర్తు చేసుకుంటూ తల పట్టుకుంటాడు……

(  వీళ్ళ గొడవ ఏ ప్రళయానికి దారి తీస్తుంది అంటారు 😌 నాకు ఏదో గట్టిగా కొడుతుంది మరి మీకు 🥱? )

నీకు రన్నింగ్ రేస్ వచ్చు అని నాకు ఎందుకు చెప్పలేదే దెయ్యం ఏదో రన్నింగ్ రేస్ జరుగుతున్నట్టు అలా పరిగెడుతున్నావ్ అని 15 నిమిషాలుగా అటు ఇటు తిప్పుతూ ఇంటి వెనుక వైపు ఉన్న తోట లోకి పరుగు పెడుతున్న మాన్య ను వదలకుండా పట్టుకోవడానికి పరుగులు తీస్తూ అరుస్తాడు అమర్…..

రేయ్ మాటలు మాట్లాడడం కాదు రా దమ్ముంటే నన్ను పట్టుకో అని ఆ తోట మొత్తం తిప్పిస్తూ అమర్ కు అందకుండా పరిగెడుతూ ఆ తోట చివర ఉన్న ఓపెన్ బావి దగ్గరకు వచ్చేస్తుంది మాన్య…..

ఇక నా వల్ల కాదే బాబు అని మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని ఆయాస పడుతున్న అమర్ ను చూసి మాన్య కూడా బావి చివరకు వెళ్ళి ఇటు వైపు తిరుగుతూ గర్వంగా నవ్వుతూ చెప్పాగా నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు నీకు అందనంత దూరం లో ఉంటాను నేను అని మాన్య కూడా తన అలుపు తీర్చుకుంటూ ఉంటుంది…..

మాన్య అన్న మాటలకు తను లైఫ్ లో మాన్య ను చేరుకోలేడు అన్నట్టుగా అమర్ కి వినిపించడం తో ఆగినట్టే ఆగి తన వైపు ఫాస్ట్ గా పరిగెడుతూ వస్తున్న అమర్ ను చూసిన మాన్య కంగారుగా పక్కకు తిరిగి పరిగెత్తబోయి తడిగా ఉన్న నేల మీద రాయి మీద కాలు వేసి స్లిప్ అయ్యి వెనక్కి బావి లోకి పడిపోతుంది అది చూసిన అమర్ మాన్య అని అరుస్తూ ఉండగానే మాన్య బావి లోకి పడి నీళ్లలో మునిగిపోతుంది……

బ్లీడింగ్ అవుతున్న లిప్ ను బయటే వాటర్ తో వాష్ చేసుకుని హాల్ లో కూర్చున్న రుద్ర కి ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ నార్మల్ గా పైకి వెళ్ళిపోతుంది….. ఆనంద్, రుద్ర ఏదో మాటల్లో ఉండి ఆద్య వచ్చింది కూడా అబ్జర్వ్ చేయరు & రూమ్ లోకి వెళ్ళిన ఆద్య అరగంట తర్వాత ఫ్రెష్ అయి బయటకు వచ్చి మాయ రూమ్ లోకి వెళ్ళి వీళ్ళతో పాటు తను కూడా జాయిన్ అవుతుంది…..

🤍🧡🤍🧡🤍🧡🤍🧡🤍🧡

 

హలో సర్ గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ తనకు కాఫీ కప్ అందిస్తున్న రితిక ను చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ హాటీ అని నవ్వుతూ రితిక చేతిలోని కప్ తీసుకుని మెల్లగా టీ సిప్ చేస్తూ టీవీ చూస్తూ ఉంటాడు…….

సర్ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా…..??

చెప్పేది అయితే కచ్చితంగా చెప్తాను కానీ ఏంటో అడుగు రితిక ….!!

మీకు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సర్….?? నిన్న వచ్చిన మేడం మీకేం అవుతారు…..??

హ్మ్మ్….!! గర్ల్ ఫ్రెండ్స్ అంటే పెద్ద లిస్ట్ నే ఉంది రితిక బట్ అందులో మెయిన్ వన్ హరిణి తనే నిన్న వచ్చిన అమ్మాయి & మేము త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నాం….

ఓహ్ అయితే హరిణి మేడం మిమ్మల్ని లవ్ చేస్తున్నారా అని నవ్వుతూ అడుగుతుంది……!!

యాహ్ హరిణి లవ్స్ మీ బట్ ఐ లవ్ ఎవ్రీ గర్ల్ ఇన్క్లూడింగ్ యూ అని రితిక ను మీదకు లాక్కుని తనను కిస్ చేయబోతాడు….. ఎలా  రాహుల్ నుండి తప్పించుకోవాలి అని చూస్తున్న రితిక కు అప్పుడే భరత్ వాయిస్ వినిపించడం తో ఊపిరి తీసుకుంటూ సర్ ఎవరో వచ్చారు అని ఫాస్ట్ గా దూరం జరిగి అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్లి డోర్ లాక్ చేస్తుంది…..

ఛా….!! మంచి టైం కి వచ్చి డిస్టర్బ్ చేశాడు స్టుపిడ్ అని లోపలికి వస్తున్న భరత్ ను తిట్టుకుని తనతో మాట్లాడుతూ ఉంటాడు….. డోర్ బోల్ట్ పెట్టిన రితిక తను  రాహుల్కి తెలియకుండా రికార్డ్ చేసింది మొత్తం తను ఎవరికి పంపాలో వాళ్లకు పంపి తన మొబైల్ లో డిలీట్ చేసి వీలైనంత త్వరగా తను ఎందుకు వచ్చిందో ఆ వర్క్ ఫినిష్ చేసి ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యి  రాహుల్తో ఎలా తనకు రావాల్సిన నిజాలు రాబట్టాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది…..

🤍💚🤍💚🤍💚🤍💚🤍💚

 

జై ఊరికి వెళ్ళినప్పటి నుండి కాల్స్ కూడా తగ్గించేసాడు అని జై నుండి కాల్స్ తగ్గిపోవడం తో బోర్ ఫీల్ అవుతున్న నాన్సీ తను పక్కన పెట్టిన వయొలిన్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది….. తను వయలిన్ ప్లే చేస్తూ ఉంటే తన తండ్రి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాడో తను గొప్ప పొజిషన్ కి రావాలని తను ఎంత కష్టపడ్డాడో గుర్తు రాగానే నాన్సీ కళ్ళు వర్షించే మేఘాలు అవుతాయి……

మీరు కోరిన విధంగా నే మీకు ఇష్టమైన కూతురులా నేను బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నా నాన్న అలాగే కష్టపడి చదివాను కూడా కానీ ఒక్కడి వల్ల నా జీవితం అనుకోని విధంగా టర్న్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడే కనుక నా లైఫ్ లోకి రాకపోయి ఉంటే నేను ఈ పాటికి మీతో సంతోషంగా ఉండే దాన్ని మిస్ యూ నాన్న అని ఏడుస్తూ సాడ్ మ్యూజిక్ ప్లే చేస్తున్న నాన్సీ కి సడెన్ గా కాలింగ్ బెల్ వినిపించడం తో నా ఫ్లాట్ కి ఎవరోస్తారు అని ఆలోచిస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వ్యక్తి ను చూసి చేతిలోని వయోలిన్ వదిలేస్తుంది…..

 

ఆధ్య జై మీద కోపంతో ఎమ్ చేయబోతోంది 👿👿 వీళ్ళ గొడవ ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తుంది…..?? నీళ్ళల్లో పడ్డ మాన్య ను అమర్ సేవ్ చేయగలడా లేక మాన్య ను సేవ్ చేసే లోపే మాన్య చనిపోతుందా…..?? నాన్సీ ఫ్లాట్ కి వచ్చింది ఎవరు & వాళ్ళను చూసి నాన్సీ ఎందుకు షాక్ అయింది….?? నాన్సీ లైఫ్ లో ఉన్న ఆ విలన్ ఎవరు 👿🥱 రితిక   రాహుల్    హరిణి ల సీక్రెట్ ఎఫైర్ బయట పెట్టగలదా….??