విలన్ హస్బెండ్-57
వదినా!! ఏంటి వచ్చేశావ్ ఇంత త్వరగా అయిపోయిందా మీ గొడవ నేను ఇంకా రేపు మార్నింగ్ వరకూ ఇంటి చుట్టూ తిరుగుతూ కొట్టుకుంటూ ఉంటారు అనుకున్నా అని నవ్వుకుంటూ అడుగుతుంటే ఉప్చ్ స్టాప్ ఇట్ మాయ నా మూడ్ బాలేదు అనవసరంగా నీ అన్న టాపిక్ తీసుకుని వచ్చి మరింత మూడ్ స్పాయిల్ చేయకు అని సీరియస్ గా చెప్పి తను కూడా ఫేషియల్ చేయించుకోవడానికి హెయిర్ మొత్తం పైకి పెట్టేసి దానికి క్లక్చర్ పెడుతుంది…… !!
ఎవరు గొడవ పడమన్నారు ఇలా మూడ్ ఆఫ్ లో ఉండమన్నారు ఏంటో మీరు నాకు ఎప్పటికీ అర్థం అవ్వరు అంటూ తనకు ఫేషియల్ తో పాటు పెడిక్యూర్ కూడా చేయించుకుంటుంది…… నేను కావాలని ఏ రోజు నీ అన్న తో గొడవ పడలేదు వాడే అనవసరంగా నాతో పెట్టుకొంటూ వచ్చాడు ఈ సారి మాత్రం వాడు కోలుకొని విధంగా దెబ్బ కొడతాను మాయ అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకుని తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఫేషియల్ చేయించుకుంటుంది ఆద్య…..అపుడే
ఆద్య వెనుకే ఆధ్య కి సారి చెప్పడానికి వచ్చిన జై ఆద్య ఎక్కడుందా అని ఆద్య తన రూమ్ లో లేకపోయేసరికి అన్ని రూమ్స్ వెతుకుతూ వచ్చిన జై కి ఆద్య అందరితో పాటు ఫేషియల్ చేయించుకుని కళ్ళు మూసుకుని చైర్ లో వెనక్కి వాలి కనిపించడం తో అక్కడ అందరినీ చూసి ఎమ్ మాట్లాడలేక సైలంట్ గా తన రూమ్ కి వెళ్ళి డోర్ లాక్ చేసి విసుగ్గా బెడ్ మీద కూర్చుంటాడు……..
ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాను ఇష్టం లేకుండా ఏ అమ్మాయిని టచ్ కూడా చేయను అలాంటిది ఆధ్య విషయం లో తనకు ఇష్టం లేకపోయినా తనతో ఎందుకంత హార్ష్ గా బిహేవ్ చేస్తున్నా…..?? వాట్ హ్యాపెండ్ టు మీ డ్యామిడ్ అంటూ కోపంగా పైకి లేచి వొళ్ళంతా చమటలు పడుతూ ఉంటే హై స్పీడ్ లో తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూసి ఇంకా స్పీడ్ పెంచినా జై లో వేడి తగ్గదు…… షట్ ఆధ్య టచ్ తో నాలో మళ్ళీ హై ఫీలింగ్స్ స్టార్ట్ అయినట్టు ఉన్నాయి అని ఎర్రగా మారిన తన ఫేస్ ను చూసి తన బ్యాగ్ లో ఉన్న టాబ్లెట్స్ తీసుకుని వేసుకుని డ్రెస్ మొత్తం తీసేసి బాత్ టబ్ లో కూర్చుంటాడు…..
అరగంట వరకూ తను మాములు మనిషి అవ్వలేక పోతాడు కాసేపటికి తను నార్మల్ స్టేట్ కి వచ్చాక తన వంటి మీద నరాలు పైకి ఉప్పొంగి కనిపించడం తో ఇప్పుడు తను నార్మల్ కావాలి అంటే తనకు అమ్మాయి కావాలి కానీ ఇప్పుడు ఇక్కడ ఎలా పాజిబుల్ అవుతుంది అని జుట్టు పీక్కుంటూ దీనంతటికి కారణం అయిన మనిషి తలచుకుని మరింత కోపంగా మారిపోతాడు…..
కాసేపటికి జై కళ్ళ ముందు వినయ్ వర్మ కనిపించడం తో భారంగా శ్వాస తీసుకుంటూ కళ్ళు మూసుకుని ఐ ఆమ్ సారి డాడ్ అంటూ ఆ బాత్ టబ్ లో తన ఫీలింగ్స్ నార్మల్ అయ్యే వరకూ బయటకు రాడు…….
🤍💚🤍💚🤍💚🤍💚🤍💚🤍
మాన్య అంటూ అరిచిన అమర్ సడెన్ గా జరిగిన ఇన్సిడెంట్ కి తనకు షాక్ లో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వదు…… కాసేపటికి షాక్ నుండి తేరుకుని నీళ్లలో మునిగిపోతున్న మాన్య ను చూసి క్షణం కూడా లేట్ చేయకుండా బావి లోకి దూకేస్తాడు….. అప్పటికే అండర్ వాటర్ లోకి వెళ్ళిపోయి చాలా నీళ్ళు తాగేసిన మాన్య ను కష్టంగా అందుకుని తనను రెండు చేతులతో ఎత్తుకుని పైకి తీసుకుని వచ్చి స్పృహ లో లేని మాన్య బుగ్గలు తడుతూ పిలుస్తాడు…..
మాన్య నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోయేసరికి మాన్య పొట్ట దగ్గర చేతులు ఉంచి తన చేతులు ప్రెస్ చేస్తూ మాన్య తాగిన వాటర్ అన్ని నోట్లో నుండి కక్కించి అప్పటికి స్పృహ లో రాని మాన్య వైపు చూస్తూ తన గుండె దగ్గర తల పెట్టిన అమర్ కి గుండె స్లోగా కొట్టుకోవడం విని సారీ మాన్య అంటూ మాన్య మౌత్ ఓపెన్ చేసి తన లిప్స్ తో శ్వాస ఆడని మాన్య కి తనే శ్వాస అందిస్తూ ఉంటాడు….
అయిదు నిమిషాల తరువాత హా…!!! అంటూ కళ్ళు తెరచిన మాన్య ను చూసి దూరం జరిగిన అమర్ ఊపిరి ఆడక దగ్గుతున్న మాన్య ను పైకి లేపి తన వీపు నిమురుతూ మాన్య ఇట్స్ ఒకే నీకేం కాలేదు భయపడకు అంటూ తనకు ధైర్యం చెప్తూ ఉంటాడు….. కాసేపటికి నార్మల్ అయిన మాన్య అమర్ ను కొడుతూ ఇడియట్ నీ వల్లే రా నేను బావి లోకి పడిపోయాను నిజంగా చచ్చిపోయాను అనుకున్నా అని ఏడుస్తూ ఊపిరి ఆడక చచ్చిపోయింటే నువ్వు హ్యాపీగా ఉండే వాడివి కదా…..?? అయినా నేనంటే నీకు ఇష్టం లేదు కదా ఎందుకు రా సేవ్ చేసావ్ అంటూ ఏడుస్తూ అడుగుతుంది…..
మాన్య….. మాన్య అంటూ తన రెండు చేతులు పట్టుకుంటూ ఐ ఆమ్ సారి ఇంకెప్పుడు నీతో ఇలా రిస్కీ పనులు చేయించను ఒకే ఇక భయపడకు & అడిగావ్ కదా చచ్చిపోయుంటే ఎమ్ చేసే వాడిని అని నిజంగా అలా అయ్యుంటే నేను నీ వెనుకే క్షణం కూడా లేట్ చేయకుండా దూకేసే వాడిని అంటూ మాన్య చేతులు వదిలి పైకి లేచి ఇంట్లోకి వెళ్ళబోతూ ఆగి తన వైపు అయోమయంగా చూస్తూ నుంచున్న మాన్య ను చూసి ఈ విషయం ఎప్పుడో చెప్పాలి అని చెప్పకుండా ఆగిపోతున్నా బట్ ఇప్పుడు చెప్పాలి అనిపిస్తుంది ……. నువ్వంటే నాకు చాలా ఇష్టం మాన్య ఎంతంటే నువ్వు నాతో మాట్లాడితే చాలు అని నీతో కావాలని గొడవ పెట్టుకుని నీతో మాట్లాడే వాడిని ఐ లవ్ యూ మాన్య❣️ నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను అంత ఇష్టం నువ్వంటే అని చెప్పి ఆగకుండా వెళ్తున్న అమర్ ను చూసి మాన్య కి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు…..
🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍
కాలింగ్ బెల్ వినిపించడం తో నా ఫ్లాట్ కి ఎవరొస్తారు జై కూడా ఊర్లో లేడు కదా అని ఆలోచిస్తూ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసిన నాన్సీ ఎదురుగా ఉన్న మనిషి ని చూసి షాక్ అవుతూ చేతులోకి వయొలెన్ వదిలేస్తుంది……… అక్కా అని ఏడుస్తూ పిలుస్తున్న మంజు వాయిస్ కి తన వైపు చూస్తూ మంజు అంటూ ఒక్క ఉదుటున మంజూష ను హగ్ చేసుకుంటూ నువ్వు నిజంగా వచ్చావా మంజు అంటూ మంజు మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఫోర్హెడ్ కిస్ పెడుతూ ఆనందంగా అడుగుతుంది……
మంజు ఏడుస్తూ నాన్సీ ను గట్టిగా హగ్ చేసుకుంటూ నిన్ను ఆ రోజు రెస్టారెంట్ లో చూసినప్పటి నుండి నిన్ను ఎప్పుడెప్పుడు మీట్ అవ్వాలా అని వెయిట్ చేస్తూ ఉన్నా అక్క లక్కీలీ నువ్వు నిన్న భరత్ కి హాస్పిటల్ లో కనిపించావు అంట నీకు తెలియకుండా నిన్ను ఫాలో అవుతూ నీ అడ్రస్ తెలుసుకుని ఇదిగో ఇవాళ నన్ను నాన్న కి తెలియకుండా తీసుకుని వచ్చాడు అంటూ వెనక్కి తిరిగి చూడగా భరత్ అక్కడికి వస్తూ కనిపిస్తాడు……
నాన్సీ మంజు నుండి దూరం జరుగుతూ ఇద్దరూ వచ్చారా కమ్ లోపలికి రండి అని కింద పడ్డ వయొలిన్ ను చేత్తో పట్టుకుని మరో చేత్తో మంజు చెయ్ పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తుంది…..
ఇద్దరూ కూర్చోండి ఇప్పుడే వస్తాను అని ఫాస్ట్ గా కిచెన్ లోకి వెళ్ళి మంజు కి ఇష్టమైన అటుకుల పాయసం ఫాస్ట్ ఫాస్ట్ ప్రిపేర్ చేసి సర్వింగ్ బౌల్స్ లో సర్వ్ చేసాక ట్రే లో 3 బౌల్స్ పట్టుకుని హాల్ లోకి ఇద్దరికీ ఇచ్చాక తను కూడా ఒకటి తీసుకుని మంజు పక్కన కూర్చుంటుంది…..
మంజు తన బౌల్ వైపు చూసి అక్కా 🥺 నీకు ఇంకా నా ఇష్టాలు గుర్తున్నాయా అని ఎమోషనల్ అవుతూ అడుగుతున్న మంజు చెయ్ పట్టుకుని నేను మీ అందరికీ ఫిజికల్లీ దూరంగా ఉన్నానే కానీ మెంటల్లీ మీరు ఎప్పుడూ నాకు దగ్గరగా నే ఉంటారు మంజు అంటూ తన బౌల్ లోని పాయసం ప్రేమగా మంజు కి తినిపిస్తూ ఉంటే మంజు తన కన్నీళ్లను తుడుచుకుంటూ నాన్సీ పెట్టేది తింటూ ఉంటుంది……
మంజు, నాన్సీ ల బాండింగ్ ను చిరు నవ్వుతో చూస్తున్న భరత్ వదిన మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది యూ నో మంజు కి మీరంటే ఎంత ఇష్టమో తన మాటల్లో తెలుసుకున్నా బట్ మీకు మంజు అంటే ఇంత ఇష్టం అని ఇప్పుడే తెలిసింది…… మంజు ని ఇంతలా ప్రేమించే మీరు ఎందుకు వదిన అలాంటి ప్రొఫెషన్ ఎంచుకుని ఫ్యామిలీ కి దూరం అయ్యి మావయ్య దృష్టిలో అలా అంటూ చెప్పలేక సైలెంట్ అవుతాడు…..
భరత్ నీకేం చెప్పాను అక్క ను ఇబ్బంది పెట్టేలా ఎమ్ మాట్లాడకు అని చెప్పా కదా అంటూ సీరియస్ అవుతున్న మంజు ను ఆపుతూ తను ఇప్పుడు మన ఇంట్లో మెంబర్ మంజు తనకు అడిగే హక్కు ఉంది యూ జస్ట్ కామ్ డౌన్ అంటూ మంజు ను ఆపుతూ నేను కావాలి అని అలాంటి ప్రొఫెషన్ చూస్ చేసుకోలేదు భరత్…… నేను కూడా అందరి ఆడపిల్లలాగే అమ్మ నాన్న & చెల్లి ను జాబ్ చేసి మంచిగా చూసుకోవాలి అని ఆ తర్వాత మంచి వ్యక్తి ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకున్నాను కానీ నేను ఒకటి అనుకుంటే ఆ దేవుడు నా రాత వేరేలా రాశాడు అని పైకి లేస్తూ నా గతం గురించి జై కి తప్పా ఇప్పటి వరకూ ఎవరికి చెప్పలేదు అంత చేదుగా ఉంటుంది నా గతం అంటూ తన గురించి చెప్పడం మొదలు పెడుతుంది……
🤍💖🤍💖🤍💖🤍💖🤍💖🤍
అమ్మాయిలు అందరూ మెహందీ పెట్టుకుని కిందకు వస్తూ హాల్ లో కూర్చుంటూ అక్కడే కూర్చున్న మహిదర్ ను చూసిన ఆద్య ఆ ఆర్టిస్ట్ లు మా కోసం చాలా దూరం నుండి వచ్చారు….. ఈ నైట్ కి ఇక్కడే స్టే చేస్తారు ఎలాగో రేపు ఎంగేజ్మెంట్ కదా సో వాళ్లకు ఏదైనా రూమ్ అలాట్ చేయమని కమల్ అంకుల్ కి చెప్పండి అనగానే అలాగే ఆద్య అంటూ సింధు ఫాదర్ తో ఆ అమ్మాయిలు ఇద్దరికీ ఒక రూమ్ చూయించి అందులో ఉండమని చెప్తారు…. ఆ అమ్మాయిలు ఆద్య కి థాంక్స్ అంటూ లిప్ మూమెంట్ ఇచ్చి వాళ్ళు కూడా అక్కడే కూర్చుని మొబైల్ లో తమకు వచ్చిన అపాయింట్మెంట్స్ చూస్తూ ఉంటారు…….
డిన్నర్ చేసాక మెహందీ పెట్టుకోవాల్సింది కదా ఆధ్య అంటున్న మహీదర్ తో బాగా రెడ్ గా అవ్వాలి అని ముందే పెట్టుకున్నాం డాడ్ అయినా నో ప్రాబ్లెమ్ మీరు ఉన్నారు కదా మీ చేత్తో తిని చాలా డేస్ అవుతుంది…… నాకు ఇవాళ మీరే తినిపించాలి అని ఆద్య నవ్వుతూ చెప్పగానే మహిదర్ నవ్వుతూ అంత కంటే అదృష్టమా అని సినిమా డైలాగ్ వేయగానే ఆద్య చిరు కోపంగా చూస్తూ కాసేపటికి సీరియస్ గా ఉండలేక నవ్వుతుంది…..
ఆద్య చిరు నవ్వును మైమరపుగా చూస్తూ స్టెప్స్ దిగుతున్న జై ఆద్య ను అలా చూస్తూ ఉంటే జై ను చూసిన మాయ అలా అయితే నాకు మా అన్నయ్య తినిపిస్తాడు కదా అన్నయ్య అంటూ జై పక్కకు వచ్చి నుంచుంటుంది…..
మాయ మాటలకు ఆద్య కోపంగా జై వైపు చూస్తూ ఉంటే జై మాయ తల నిమురుతూ తప్పకుండా బంగారం అంటూ మాయ తో పాటు వచ్చి సోఫా లో ఆద్య ఎదురుగా కూర్చుంటాడు…..
సైలెంట్ గా కూర్చున్న మాన్య ను చూసి నవ్వుతూ ఏంట్రా మీ డాడ్ లేడు అని ఫీల్ అవుతున్నావా నేనున్నా కదా నాకు ఆద్య ఎలానో నువ్వు అంతే నీకు కూడా నేనే తినిపిస్తా ఒకే అంటూ మాన్య బుగ్గలు మహిదర్ చిరు నవ్వుతో లాగుతూ చెప్పగానే అమర్ గురించి ఆలోచిస్తున్న మాన్య చిన్న స్మైల్ ఇస్తూ ఒకే అంకుల్ అంటూ నవ్వుతుంది……
సింధు, చందు & ఇందు లకు తన ఫాదర్, మదర్ & నానమ్మ తినిపిస్తాను అని చెప్పడం తో అమ్మాయిలు అందరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కూడా అలా సరదా కబుర్లతో ఫినిష్ చేస్తారు…. మీరు ఈ ఇంటికి వచ్చాకే మళ్ళీ నా ఇల్లు ముందు లా కళ కళ లాడుతూ ఉంది బావ అని నవ్వుతూ చెప్తున్న జగదీశ్వర్ ను చూసి ప్రతాప్ వర్మ చిన్న నవ్వు నవ్వుతాడు……
జై ను చూసినప్పటి నుండి మెహందీ ఆర్టిస్ట్ జై వైపు తినేసేలా చూస్తూ కావాలని జై ను టచ్ చేస్తూ జై తో మాటలు కలుపుతూ తన ఇంటెన్షన్ జై కి అర్థం అయ్యేలా చేస్తుంది….. ఆ అమ్మాయి వైపు చూస్తూ అందరూ పడుకున్న తర్వాత తన రూమ్ కి రమ్మని జై కూడా సిగ్నల్ ఇవ్వడం తో ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి…..
రేపు ఫంక్షన్ అవ్వడం తో అందరూ త్వరగా పడుకోండి అని పెద్దవాళ్ళు వాళ్ళ డిన్నర్ అవ్వగానే ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు…… యంగ్ బ్యాచ్ కూడా గుడ్ నైట్ అని తమ రూమ్స్ కి వెళ్ళిపోతారు ఆధ్య కూడా తన రూమ్ కి వెళ్తూ ఉండగా తనకు లాస్య నుండి కాల్ రావడం తో ఏంటి ఇది ఈ టైమ్ లో చేస్తుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి అలా మాట్లాడుతూ అదే ఫ్లోర్ లో ఉన్న బాల్కనీ వైపు వెళ్ళి లాస్య తో మాట్లాడి తన రూమ్ కి వెళ్ళడానికి వస్తున్న ఆద్య కి మెహందీ ఆర్టిస్ట్ అడుగులో అడుగు వేసుకుంటూ అటు ఇటు చూస్తూ ఎవరు తనను చూడలేదు అని కన్ఫర్మ్ చేసుకుని జై రూమ్ డోర్ నాక్ చేస్తుంది….
ఈ అమ్మాయి ఏంటి ఈ టైం లో ఆ కాట్రాజ్ రూమ్ కి వెళ్తుంది??? అక్కడ ఈ అమ్మాయికి ఎమ్ పని అని చూస్తున్న ఆద్య కళ్ళు పెద్దవి అయ్యేలా జై ఆ అమ్మాయి నడుము పట్టుకుని రూమ్ లోకి లాగి డోర్ లాక్ చేయడం చూసి ఆద్య షాక్ అవుతుంది……
జై కి ఉన్న ప్రాబ్లెమ్ ఏంటి ఆద్య టచ్ కి జై ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడు…..?? మాన్య అమర్ లవ్ ను యాక్సెప్ట్ చేస్తుందా…..?? నాన్సీ పాస్ట్ లో ఉన్న విలన్ గురించి తెలుసుకున్న భరత్ ఎమ్ చేయబోతున్నాడు…..?? ఆధ్య జై ను మరింత అసహ్యించుకాబోతుందా????