Login with OTP

విలన్ హస్బెండ్-59

aashyatech

Author

ఎంగేజ్మెంట్ మార్నింగ్ 11 కి అయినా అందరూ 4 కి లేచి ఎవరు ఏ వర్క్స్ చేయాలో ముందు రోజు నైట్ నే డిసైడ్ అవ్వడం తో ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజీగా ఉంటారు……. చీచీ ప్రొద్దున్న ఏంటీ గోల ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు వెధవ సంత అని చిరాకు పడుతూనే నిద్ర లేచిన రేణుక తప్పక ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది…… తనకు ఎలాంటి వర్క్ చేసే ఇష్టం & ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్లకపోతే వినయ్ దృష్టిలో బ్యాడ్ అవ్వాలి అని అయిష్టంగా నే రెడీ అయ్యి కిచెన్ లోకి వెళుతుంది…… !!

ఇంట్లో జరుగుతున్న హడావిడికి నిద్ర లేచిన ఆద్య వొళ్ళు విరుచుకుంటూ తన రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా జై తన రూమ్ నుండి ఎర్రటి కళ్ళతో నిద్రలేని మొహం తో చాలా టైర్డ్ గా రావడం చూసి ఆద్య అసహ్యంగా చూస్తూ వెంటనే డోర్ క్లోజ్ చేస్తుంది….. నైట్ అంతా నిద్రలేదు అనుకుంటా వీడికి ఛా!! వీడ్ని చూస్తే చాలు ఎక్కడ లేని చిరాకు, అసహ్యం వచ్చేస్తున్నాయి అని మొహాన్ని అసహనంగా పెట్టుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది……

కిందకు వెళ్ళిన జై సోఫా లో కూర్చుని నుదురు రుద్దుకుంటూ గాడ్ ఎందుకింత హెడేక్ గా అనిపిస్తుంది అని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటూ అటుగా వెళ్తున్న రేణుక ను చూసి మామ్ కాస్త హెడేక్ గా అనిపిస్తుంది కొంచెం కాఫీ కావాలి అని అడగ్గా అబ్బా…. !! జై చాలా విసుగ్గా ఉంది ఒక్క 10 మినిట్స్ జై అంటూ అలసటగా సోఫా లో కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉంటుంది…… !!

జై తన కళ్ళను రేణుక వైపు తిప్పి చూస్తూ కళ్ళు మూసుకోవడం చూసిన ప్రతాప్ అక్కడ జై హెడేక్ అంటూ కాఫీ అడిగితే ఎంత రిలాక్స్డ్ గా మొబైల్ చూస్తుంది అని రేణుక వైపు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రతాప్ సీరియస్ గా చూస్తూ రేణుక అంటూ పిలిచే లోగా జై ముందు చిరు నవ్వుతో కాఫీ కప్ తో నుంచుంటుంది శైలు…… !!

శైలు ను చూసిన ప్రతాప్ కి తన కోపం కొంచెం లో కొంచెం తగ్గడం తో ఇప్పుడు అనవసరంగా రేణుక ను తిట్టి రచ్చ చేయలేక అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోతాడు….. !! కాఫీ అరోమా స్మెల్ కి కళ్ళు తెరచిన జై తన ముందున్న కప్ తీసుకుంటూ థాంక్ యూ ఆంటీ అంటూ చిన్న స్మైల్ తో కాఫీ సిప్ చేస్తూ వాహ్ చాలా బాగుంది కాఫీ అంటూ నవ్వుతూ చెప్పిన జై ను చూసి చిన్నగా నవ్వి హెడేక్ గా ఉన్నప్పుడు ఆయిల్ మసాజ్ చేస్తే త్వరగా తగ్గుతుంది జై ఆగు నీకు ఇప్పుడే ఆయిల్ తో మసాజ్ చేస్తాను….. !!

నో నీడ్ ఆంటీ కాఫీ తాగుతున్నా కదా కాసేపటికి తగ్గిపోతుంది దట్ టూ అందరూ ఎవరి వర్క్స్ లో వాళ్ళున్నారు నేను అడగకపోయినా కాఫీ తెచ్చారు థాంక్స్ ఏ లాట్ అంటూ కాఫీ సిప్ చేస్తుంటాడు…… జై నాకేం ప్రాబ్లం లేదు కాస్త ఆగు అంటూ ఆయిల్ తీసుకుని కిచెన్ లోకి వెళ్ళి దాన్ని కొంచెం చిన్న బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి లైట్ గా హీట్ చేసుకుని వచ్చి జై వద్దు అంటున్నా హెడ్ మసాజ్ చేస్తూ జై కి కొంచెం లో కొంచెం హెడేక్ తగ్గేలా చేస్తుంది శైలు….. !!
ఆంటీ మీ చేతుల్లో నిజంగా మ్యాజిక్ ఉందా ఏంటి నా హెడేక్ నిజంగా కాసేపటికే తగ్గిపోయింది థాంక్ యూ అని చెప్తున్న జై ను చూసి చిన్న స్మైల్ ఇస్తూ ఇప్పుడు కొంచెం అయినా రిలీఫ్ గా ఉంది కదా అందుకే మసాజ్ చేసాను & నాకు థాంక్స్ ఏం వద్దు కానీ అత్త అని పిలువు చాలు ……. నువ్వు ఆంటీ అంటుంటే ఎందుకో చాలా దూరంగా అనిపిస్తుంది అదే అత్త అని పిలిస్తే బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది…… !!

శైలు ను చూసి జై చిన్నగా నవ్వుతూ ఒకే అత్త ఇప్పటి నుంచి ఇలాగే పిలుస్తాను ఒకే నా అనగానే శైలు నవ్వుతూ ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అంటూ జై హెడ్ ను బాగా మసాజ్ చేసి కాసేపు అయ్యాక వెళ్ళి హెడ్బాత్ చెయ్ అప్పుడు ఇంకా రిలీఫ్ ఫీల్ అవుతావు అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది….. !!

తను టీ అడిగినా రెస్పాండ్ అవ్వకుండా ఇంకా మొబైల్ నే చూస్తున్న రేణుక వైపు చూస్తున్న జై కి గల్ గల్ మంటూ వినిపించిన పట్టీల చప్పుడుకి స్టెప్స్ వైపు చూసిన జై కి పర్పుల్ కలర్ డిజైన్ శారీ వన్ ప్లీట్ వేసుకుని తన హెయిర్ మొత్తం ఒక వైపుకు వేసుకుని చేతులకు గాజులు వేసుకుంటూ కిందకు దిగుతున్న ఆద్య ను చూసి గుండె వేగం పెరుగుతుంది…… !!

ఫుల్ స్పీడ్ తో కొట్టుకుంటున్న హార్ట్ ను గట్టిగా పట్టుకుని ఇంకాసేపు ఆద్య ను అలాగే చూస్తే మళ్ళీ ఎక్కడ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయో అని ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ కి వెళ్ళబోతూ ఆధ్య కి ఎదురు వెళ్తాడు…… మాన్య, మాయ లు ఎక్కడ కనిపించక వాళ్ళ కోసం చూస్తున్న ఆద్య ఎదురుగా వచ్చిన జై ను చూసి కోపంగా మొహాన్ని తిప్పుకుని వెళ్లిపోవడం చూసి ఆద్య కి ఇంకా కోపం తగ్గలేదు అని తర్వాత ఫంక్షన్ అయ్యాక ఆద్య తో మాట్లాడాలి అనుకుని జై ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ కి వెళతాడు….. !!
మాన్య ను వెతుకుతూ ఉన్న అమర్ కి మాన్య బయట ముగ్గుకి రంగులు వేస్తూ కనిపిస్తుంది……. విలేజ్ కి వచ్చినప్పటి నుండి కంప్లీట్ విలేజ్ గర్ల్ లా చేంజ్ అయిన లుక్ కి అమర్ చిన్నగా నవ్వుకుని దూరం నుండే మాన్య వైపు రెప్ప వేయడం కూడా మరిచి చూస్తూ ఉంటాడు….. అమర్ అక్కడ ఉన్నాడు అని తెలిసిందో ఏంటో మాయ తో నవ్వుతూ మాట్లాడుతున్న మాన్య తన కళ్ళను అటు ఇటు తిప్పుతూ అమర్ కోసం చూసిన మాన్య కు అమర్ లెఫ్ట్ సైడ్ తననే నవ్వుతూ చూస్తూ కనిపిస్తాడు….. !!

అమర్ ను అలా చూసిన మాన్య వెంటనే చూపు తిప్పేసి తనకే తెలియకుండా తనలో తనే నవ్వుకుంటూ ఒక కలర్ వేయాల్సింది ఇంకో కలర్ వేస్తూ అపుడపుడు అమర్ ను చూస్తూ ఉంటుంది….. వదిన విలేజ్ నుండి వెళ్ళాక ఫ్రీ టైం చూసుకుని ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దాం ఏమంటావ్ అని అడుగుతూ మాన్య వైపు చూసిన మాయ కి మాన్య ముగ్గు ను చేతబడి ముగ్గులా తయారు చేయడం చూసి అయ్యో వదిన ఏం చేస్తున్నావ్…..?? ఛా లుక్ మొత్తం పోయింది అని అరుస్తూ మాన్య తన మాటలు వినకుండా ఎటో చూస్తూ ఉండడం గమనించి ఏముంది అక్కడ అని చూసిన మాన్య కి అమర్ కనిపిస్తాడు….. !!

ఓహ్!! ఇదా విషయం ఒకే… ఒకే…. !! మొత్తానికి అమర్ అన్నయ్య అనుకున్నది సాధించాడు అనమాట గుడ్ గుడ్ జై అన్నయ్య ఉన్నాడు ఎందుకు వీళ్ళ స్టోరీ ఓ కొలిక్కి వచ్చింది వాళ్లేం అయ్యారో అని మాయ మెల్లగా అక్కడి నుండి జారుకుని అటుగా వస్తున్న ఆద్య ను కూడా లోపలికి లాక్కుని వెళ్తుంది….. !!

మాయ అక్కడి నుండి వెళ్ళడం మాన్య అబ్జర్వ్ చేయకపోయినా అమర్ చూడ్డం తో మెల్లగా మాన్య వైపు వస్తాడు….. వామ్మో వీడు ఇక్కడికే వస్తున్నాడు అని వెంటనే చూపును ముగ్గు వైపు తిప్పిన మాన్య కి ముగ్గు తేడా రావడం చూసి అయ్యో ఏంటిది మాయ కొంచెం ఇది చూడు అని మాయ వైపు చూసేసరికి అక్కడ ఎవరు కనిపించరు….. !!
ఇది ఎక్కడికి మయం అయిపోయింది?? సర్లే ఇదేదో నేనే చూస్తాను అని చెయ్ ముగ్గు మీద కు పెట్టిన మాన్య చెయ్ పట్టుకుని తన వెనుక కూర్చుంటూ అలా చేస్తే ఇంకా కరాబ్ అవుతుంది అంటూ అమర్ నే మాన్య చెయ్ పట్టుకుని ముగ్గు ను సెట్ చేస్తూ పనిలో పనిగా మాన్య బుగ్గకు తగిలీ తగలనట్టు తన లిప్స్ తాకిస్తూ ఎర్లీ మార్నింగ్ రొమాన్స్ షురూ చేస్తాడు….. !! విచిత్రంగా మాన్య కూడా ఎమ్ సీరియస్ అవ్వకుండా కామ్ గా ఉండే సరికి మనోడు మరింత అడ్వాన్స్ అవుతాడు…… !!

🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍

చందు, సింధు, ఇందు ల ఎంగేజ్మెంట్ అతి కొద్ది మంది సమక్షం లోనే ఎలాంటి ప్రాబ్లెమ్ లేకుండా అనుకున్న టైమ్ కే చాలా బాగా ఎంగేజ్మెంట్ ఫినిష్ అవుతుంది….. జగదీశ్వర్ కి తన మనవరాళ్ల ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా చేయాలి అనున్నా రేణుక ఎక్కడ దాన్ని స్పాయిల్ చేస్తుందో అని సింపుల్ గా జరిగినా తన మనవరాళ్లు హ్యాపీగా ఉంటే చాలని సింపుల్ గా జరిపించి వచ్చిన గెస్ట్స్ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు….. !!

రేణుక ఇక్కడైనా బుద్దిగా ఉండకుండా ఏదో ఒక పుల్ల విరుపు మాటలు మాట్లాడుతూనే చందు ను హర్ట్ చేస్తూ ఉంటుంది…. అదంతా ఆద్య పక్క నుండి అబ్జర్వ్ చేస్తూ టైమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది…… !! ఎంగేజ్మెంట్ అయ్యాక మగ పెళ్లి వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోయాక గెస్ట్స్ కూడా ఒక్కొక్కరిగా అందరూ వెళ్తారు…… !!

ఇంట్లో అందరూ కూడా బాగా టైడ్ అవ్వడం తో ఒక టూ డేస్ బాగా అందరూ రెస్ట్ తీసుకుంటారు….. !! నెక్స్ట్ డే హైదరాబాద్ కి స్టార్ట్ అవ్వాలి అని అందరూ హాల్ లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా అపుడే ఆ ఇంటి ముందు రెండు కార్లు వచ్చి ఆగుతాయి…..

సడెన్ గా వచ్చిన ఆ కార్స్ ను చూసి అందరూ గుమ్మం బయటకు వచ్చి చూస్తూ ఉంటారు….. అప్పుడే కార్ డోర్ ఓపెన్ చేసుకుని మాదేష్ పక్కన సీట్ నుండి శ్వేత కార్ దిగుతారు….. !! ఉరుము లేని మెరుపులా వీళ్ళేంటి ఇలా సడెన్ ఎంట్రీ ఇచ్చారు అని మహిదర్, ప్రతాప్ వర్మ ఒకరి మొహాలు ఒకరు డౌబ్ట్ గా చూసుకుంటూ వీళ్ల వైపు చూస్తారు….. !!

 

వెనుక కార్ లో స్టిక్ పట్టుకుని బ్యాక్ సీట్ నుండి దిగుతున్న హరీష్ ను చూసిన రుద్ర కి అది రేణుక బ్రదర్ ఫ్యామిలీ అని అర్థం అవుతుంది కానీ వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో అర్థం అవ్వక తను కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ తో ఎమ్ జరుగుతుందో చూద్దాం అన్నట్టు చూస్తూ ఉంటాడు….. !!

మాదేష్ అందరి వైపు చూస్తూ వెనుక కార్ లో కూర్చుని కిందకు దిగకుండా ఏడుస్తున్న హరిణి ను లాక్కొచ్చి అందరూ చూస్తూ ఉండగా లాగి పెట్టీ కొడతాడు…… !! అన్నయ్య అంటూ కింద పడుతున్న హరిణి ను పట్టుకుని ఏమైంది నీకు ఎందుకలా కొడుతున్నావ్ అని అప్పటికే ఏడ్చినట్టు కనిపిస్తున్న హరిణి ను గుండెలకు హత్తుకుంటూ ఏమైంది రా అని అడుగుతుంది….. !!

అత్తయ్య అంటూ రేణుక ను హగ్ చేసుకుంటూ ఏడుస్తూ ఉన్న హరిణి ను చూసిన గర్ల్స్ ఓరి దీని వేషాలో ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చినట్టు ఉంది 🤦 సర్లే కాసేపు ఫ్రీ ఎంటర్టైన్మెంట్ చూద్దాం అని ఎక్స్సైటింగ్ గా చూస్తూ ఉంటారు బట్ మాయ కి మాత్రం ఎక్కడో ఏదో తేడా కొడుతూ ఉంటే ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వచ్చి జై పక్కన నుంచుంటుంది…. !!

మాదేష్ బయట ఎందుకు గొడవ…..?? ముందు ఇంట్లోకి పదండి అందరూ చూస్తున్నారు ఎమ్ జరిగిందో చెప్పకుండా నువ్విలా అమ్మాయిని కొడుతూ ఉంటే మాకు ఎలా తెలుస్తుంది….. ?? రేణుక హరిణి ను తీసుకుని లోపలికి పదా అంటూ వినయ్ వర్మ సీరియస్ గా చెప్పడం తో ముందు రేణుక హరిణి ను లోపలికి తీసుకుని వెళ్ళాక ఒక్కొక్కరిగా అందరూ లోపలికి వెళ్తారు…. !!

రేణుక హరిణి ను పక్కనే కూర్చో పెట్టుకుని ముందు ఈ వాటర్ తాగు అంటూ వాటర్ తాగించాక ఇప్పుడు చెప్పవే అసలేం జరిగింది….?? అన్నయ్య ఎందుకంత కోపంగా ఉన్నాడు….. ?? మీరందరూ సడెన్ గా ఇక్కడికి ఎలా వచ్చారు & ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు అసలేం జరిగిందో ముందు చెప్పు హరిణి అన్నయ్య తో నేను మాట్లాడుతాను….. !!
అవును హరిణి భయపడకుండా అసలేం జరిగిందో చెప్పమ్మా అంటూ వినయ్ వర్మ కూడా మరో వైపు అడుగుతాడు….. !!

మీ మావయ్య అడుగుతున్నాడు కదా హరిణి నోరు తెరిచి ఇప్పుడైనా మీ మావయ్య కు నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పు అంటూ శ్వేత అంటున్నా హరిణి తల కూడా ఎత్తకుండా ఏడుస్తూనే ఉంటుంది….. !!

మనం అందరం ఎంత గొంతు చించుకుని అరిచినా వేస్ట్ అది నిజం చెప్పదు అందుకే నేనే చెప్తున్నా అంటూ హరిణి పెళ్లి కాకుండానే కడుపులో బిడ్డ ను మూస్తోంది….. !! యస్ షి ఇస్ ప్రెగ్నెంట్ అది నాకు ఇవాళే అది కూడా హరిణి హస్పిటల్ లో అబోర్ట్ చేయించుకోవడానికి వెళ్ళి నా కళ్ళకు కనిపించింది లేకపోతే మనకు ఎవరికీ ఈ నిజం తెలిసేది కాదు….. !!  అంటూ హరిణి వైపు చూస్తూ చేసినందంతా చేసి ఇప్పుడు ఎందుకే తల వంచుకున్నావ్??

బావ నువ్వు కాస్త ఆగు అంటూ హరిణి ఏంటి ఇదంతా?? నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి…. ?? ఎవర్నైనా ప్రేమించావా అలా అయితే మాతో చెప్పుంటే మేమే మీ పెళ్లి చేసేవాళ్ళం కదా సరే ముందు ఆ అబ్బాయి ఎవరో చెప్పు నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను…. !!

మాయ ఇది నీ అన్న ను పెళ్ళి చేసుకోవాలి అనుకుంది కదా మరి ఇప్పుడేంటి ప్రెగ్నెంట్ అంటూ ఇంకేదో కొత్త స్టోరీ ఓపెన్ అయింది ఇక్కడ….. ?? అయినా మాయ ప్రెగ్నెంట్ అయితే ఇక్కడికి తీసుకుని వచ్చి మరీ కొట్టాలా….?? సమ్థింగ్ ఇస్ రాంగ్….. !!

నాకు సేమ్ డౌబ్ట్ వదిన ఇందులో ఎదో ఒక ఫిట్టింగ్ ఉండే ఉంటుంది అని మాయ టెన్షన్ గా జరిగేది చూస్తూ ఉంటుంది….. !!

మావయ్య ప్లీస్ మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా ?? నేను ప్రేమించింది & ప్రేమించేది ఎప్పటికీ బావ ను మాత్రమే & నా ప్రెగ్నెన్సీ కి రీసన్ కూడా బావే అంటూ ఏడుస్తూ చెప్పడం విని అందరూ షాక్ అయితే జై కోపంగా వచ్చి హరిణి చంప పగల కొట్టడం మరింత షాక్ కి గురి చేస్తుంది….. !!
ఇప్పుడే కథ కొత్త టర్న్ తీసుకోబోతోంది …. ?? ఎంత మంది కి నెక్స్ట్ ఎమ్ జరగబోతుందో అర్థం అయింది…… ?? ఇప్పుడు వినయ్ ఎమ్ చేయబోతున్నాడో గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండి 😌 మీరెలాగో చెప్పరు లేండి అరే….. !! కనీసం 10 కామెంట్స్ కూడా రావడం లేదు ఎలా అనిపిస్తుందో చెప్తే కదా మీకు ఎంత వరకూ నేను అనుకున్నది మీ వరకూ రీచ్ అవుతుందో లేదో నాకు తెలుస్తుంది….. !! 😑 ఫుల్లీ డిసప్పయింటేడ్ 😶