Login with OTP

విలన్ హస్బెండ్-60

aashyatech

Author

హరిణి ఏడుస్తూ తన ప్రెగ్నెన్సీ కి జై నే రీసన్ అని చెప్పడం విని అందరూ షాక్ అయితే హరిణి తనను టార్గెట్ చేయడం చూసిన జై కోపంగా వచ్చి హరిణి చంప పగల కొట్టడం చూసి అందరికీ మరింత పెద్ద షాక్ తగులుతుంది….. !! అది చూసిన అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటే జై ఎమ్ చేస్తున్నావ్?? ఆడపిల్ల ను అలా కొట్టచ్చా అంటూ మళ్ళీ హరిణి మీదకు వెళ్ళబోతున్న జై ను కష్టంగా ఆపుతుంది రేణుక…… !!

డోంట్ స్టాప్ మీ మామ్ ఇవాళ నన్ను అపద్దు దీన్ని చంపేస్తాను ఎంత ధైర్యం ఉంటే తన ప్రెగ్నెన్సీ కి నన్ను రీసన్ గా ఇలా అందరి ముందు చూపెడుతుంది అంటూ ఆవేశంగా హరిణి మీదకు వెళ్ళబోతున్న జై ను అమర్, ఆనంద్ కంట్రోల్ చేస్తూ గట్టిగా పట్టుకుంటారు….. !!

లీవ్ మీ అంటూ హరిణి వైపు కోపంగా చూస్తూ మ్యారేజ్ కి నో అన్నానని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అనుకుంటావా చంపేస్తాను….. ?? చెప్పు ఆది అబద్ధమని అందరికి వినిపించేలా చెప్పు అంటూ హరిణి వైపు కోపంగా చూస్తూ అరుస్తాడు….. !!

ఎలా కనిపిస్తున్నాను బావ నువ్వు మ్యారేజ్ కి ఒప్పుకోలేదు అని నా మీద ఇలాంటి నింద వేసుకుంటానా ….. ?? ఏ ఆడపిల్ల పెళ్లి కాకుండా కడుపుతో ఉన్నానని ఇలా అందరిలో చెప్పుకోదు నేను కూడా ఆడపిల్ల నే బావ అందుకే ఇలా అందరిలో చెప్పాల్సి వస్తున్నందుకు సిగ్గుతో చచ్చిపోతున్నా అంటూ ఏడుస్తూ మొహాన్ని చేతుల్లో దాచుకుంటుంది….. !!

అమర్, ఆనంద్ లను బలం మొత్తం చేతిలోకి తీసుకుని వెనక్కి తోసి నా పేషెన్స్ ను టెస్ట్ చేయకు హరిణి మర్యాదగా ఇదంతా డ్రామా అని చెప్పు…. ?? లేదా నేను ఎమ్ చేస్తానో నాకే తెలియదు…. !!

బావ ప్లీస్ ఇప్పటికే మానసికంగా చచ్చిపోయాను ఇలా మాట్లాడి ఉన్న కాస్త ప్రాణాన్ని కూడా తీయకు…… !! నిజంగానే నేను ప్రెగ్నెంట్ బావ కావాలంటే హస్పిటల్ లో చెక్ చేయించు నా కడుపులో నీ బేబీ పెరుగుతుంది అంటూ ఏడుపు మరింత పెంచుతుంది….. !!

ఏయ్ నిన్ను అంటూ హరిణి మీదకు వెళ్ళబోతున్న జై కి అడ్డుగా నుంచుని నా కూతురి మీద ఇంకో సారి చెయ్ పడితే బాగోదు జై….. !! దాన్ని అమాయకురాలిని చేసి మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఇప్పుడు అందరీ ముందు హరిణి ను తల దించుకునేలా చేసి దానిదే తప్పు అంటున్నావా….. ?? హరిణి తో నీకు రిలేషన్ ఉందా లేదా నిజం చెప్పు అంటూ కోపంగా అడుగుతాడు మాదేష్….. !!

అవును ఉంది….. !! అని అన్సర్ ఇచ్చిన జై ను చూసిన వినయ్ వర్మ షాక్ అవుతూ మాటలు రాని బొమ్మ లా చూస్తూ ఉంటాడు అది చూసిన మాదేష్ కన్నింగ్ గా నవ్వుకుంటూ మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని చూసావా రిలేషన్ ఉందని నువ్వే ఒప్పుకున్నావ్….. !! అలా రిలేషన్ లో ఉన్నారు కాబట్టే ఇవాళ నా కూతురి కడుపులో నీ బిడ్డ పెరుగుతున్నాడు….. !! బావ నువ్వు ఇప్పటికీ నమ్మకపోతే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అంటూ జై ఫ్లాట్ వాచ్ మెన్ ను కార్ లో నుండి లాక్కొచ్చి చెప్పరా జై ఫ్లాట్ కి నా కూతురు ఎపుడైనా వచ్చిందా….. ?? నువ్వు వాళ్ళు ఇద్దరూ క్లోజ్ గా ఉన్నప్పుడు చూసావా….. ?? అని అడుగుతాడు….. !!

కోపంగా ఉన్న జై ఫేస్ ను చూసి భయపడుతూ వెనక్కి అడుగులు వేస్తున్న వాచ్ మెన్ చెయ్ పట్టుకుంటూ చూడు నువ్వు ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు….. !! నేనున్నా కదా నిజాన్ని నిర్భయంగా అందరి ముందు ధైర్యంగా చెప్పు నీకు అండగా నేనే కాదు దేవుడి లాంటి మా బావ గారు కూడా ఉన్నారు అని వినయ్ వర్మ చూపిస్తూ చెప్తాడు….. !!

మాదేష్ అప్పటికే వాచ్ మెన్ కి అమౌంట్ ఇవ్వడం తో వాచ్ మెన్ భయపడుతూనే సర్ నా పేరు కైలాష్ నేను జై సర్ ఉంటున్న ఫ్లాట్స్ కి వాచ్ మెన్ నాకు జై సర్ 2 ఇయర్స్ గా తెలుసు….. !! హరిణి వైపు చూపిస్తూ ఈ మేడం జై సర్ కోసం చాలా సార్లు ఫ్లాట్ కి వచ్చారు…… !! ఒక్కో సారి అక్కడే పడుకుండి పోయేవారు వాళ్ళు ఇద్దరూ క్లోజ్ గా అంటే మేడం జై సర్ కి ఫుడ్ తినిపిస్తూ వొళ్ళో కూర్చోవడం నేను ఒక సారి చూసాను & ఇంకో సారి కార్ లో కూడా కిస్ పెట్టుకోవడం చూసాను అంటూ చెప్పి జై చూపులు వేడికి తట్టుకోలేక సర్ నేను బయట ఉంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు…… !!

ఇప్పుడేం అంటారు బావ ఇప్పుడు కూడా నా కూతురు చెప్పేది అబద్దం అంటారా మీరే న్యాయం చెప్పండి….. !! అన్యాయంగా నా కూతురి జీవితాన్ని నాశనం అవ్వకుండా మీరే ఏదైనా నిర్ణయం తీసుకోండి బావ గారు ప్లీస్ అంటూ రెండు చేతులు జోడిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న మాదేష్ వైపు చూస్తూ ఏయ్ బంద్ చేయండి మీ ఫ్యామిలీ యాక్టింగ్ ఇప్పటి వరకూ చాలా పేషెన్స్ తో ఇది నానమ్మ పుట్టిల్లు నా వల్ల ఇక్కడ గొడవ అవ్వకూడదు అని మౌనంగా ఉన్నాను ఇక యాక్టింగ్ నేను బేర్ చేయను నోరు మూసుకుని నీ ఫ్యామిలీ ను తీసుకుని బయటకు దొబ్బెయ్ అంటూ సీరియస్ గా చూస్తూ చెప్తాడు….. !!

జై…. !! మావయ్య అన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఆయనతో ఇలానేనా మాట్లాడేది ముందు మావయ్య కి సారీ చెప్పి హరిణి ను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పు…. !!

మామ్ అంటూ కోపంగా తన పక్కనున్న ఫ్లవర్ వాజ్ విసిరి కొట్టి దీంట్లో నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వకు నీ అన్న ను చూసి ఇన్నోసెంట్ అనుకోకు అని మాదేష్ వైపు నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆపి ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్ అంటూ స్టెప్స్ వైపు వెళ్తున్న జై ను ఆపి ఇంత చెప్తున్నా నీకు డ్రామా లా ఉందా… ?? ఒకే ఫైన్ లుక్ ఎట్ దిస్ అంటూ ఒక ఫైల్ తీసుకుని వెళ్ళి జై చేతిలో పెడుతూ మరి దీనికేం అన్సర్ ఇస్తావ్….. ??

వాట్ ఇస్ దిస్…. ?? అని ఆ ఫైల్ ఓపెన్ చేసిన జై కి హస్పిటల్ లో డాక్టర్ హరిణి కన్సీవ్ అయిందని కన్ఫర్మ్ చేసిన రిపోర్ట్స్ కనిపిస్తాయి…. !! బుల్ షీట్ నీ కూతురు కొవ్వెక్కి ప్రెగ్నెంట్ అయితే నాకేంటి సంబంధం…. ?? నాకు నీ కూతురితో రిలేషన్ ఉంది కాదు అనను అందరి అమ్మాయిలతో ఎలా రిలేషన్ మెయింటైన్ చేశానో నీ కూతురి తో కూడా అంతే & మా రిలేషన్ స్టార్ట్ అయ్యే ముందే తనకు అన్ని క్లియర్ గా చెప్పాను…. !!

ఈ మ్యారేజ్, ప్రేమ లాంటివి నా లైఫ్ లో లేవు & ఉండవు అని అండ్ షి సేడ్ ఒకే….. !! నేను ఎవ్రీ టైమ్ ప్రొటెక్షన్ యూస్ చేసాను సో ఈ ప్రెగ్నెన్సీ కి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇస్ ఇట్ క్లియర్…. !!

బావ 🥹 ఎప్పటికైనా నువ్వు నా ప్రేమ ను అర్థం చేసుకుంటావు అనే నీతో అంత దూరం వచ్చాను….. !!

షట్ అప్ !! నువ్వు ఇంకేం చెప్పకు ఈ చెత్త టాపిక్ గురించి నేను ఇంకేం డిస్కస్ చేయాలి అనుకోవడం లేదు అని జై పైకి వెళ్ళబోతూ ఉండగా ఆగు జై అని గంభీరంగా వినిపించిన వినయ్ వర్మ వాయిస్ కి జై పైకి ఎక్కేవాడు కాస్త తన కాలు వెనక్కి తీసుకుని తన తండ్రి వైపు చూస్తాడు….. !!

జై గురించి ఒక్కోటి తెలుస్తూ ఉంటే రుద్ర బుర్ర గిర్రున తిరుగుతుంది….. !! జై కి హరిణి తో రిలేషన్ ఉంటే మరి ఆద్య ను ఎలా లవ్ చేస్తున్నాడు….. ?? జై కి చాలా మంది తో ఎఫైర్ ఉన్నట్టు ఉంది అని తల పట్టుకుంటూ జై గురించి తెలిసి ఆద్య ఏమైనా ఏడుస్తుందా అని ఆద్య వైపు చూసిన రుద్ర కి ఆద్య చాక్లెట్ తింటూ జరిగేది ఇంట్రెస్టింగ్ గా చూస్తూ కనిపించడం చూసి కళ్ళు పెద్దవి చేసి ఏంటిది?? ఆధ్య ను ఎలా కంట్రోల్ చేయాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే ఆద్య ఏంటి సినిమా చూస్తున్నట్టు చూస్తుంది…. ??

తన మొహం లో ఎక్కడ కూడా బాధ, కంగారు & భయం కనిపించడం లేదు అని అయోమయంగా ఫీల్ అవుతూ వెళ్ళి ఆద్య పక్కన నుంచుంటాడు…. !!

ఆధ్య నీకు కొంచెం కూడా బాధ లేదు ఏంటి…. ?? ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ జై గురించి?? అయినా నీలో కొంచెం కూడా కంగారు లేదు ఏదో సినిమా
చూస్తున్నట్టు అంత హ్యాపీగా చూస్తున్నావ్…. ??

బాధ…. ?? వాడు ఇలా అందరిలో ఇరుక్కున్నాడు అని నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే బాధ లేదా అంటావేంటి అన్నయ్య…. !! ఇప్పుడు ఉంటుంది చూడు మామ చేతుల్లో వీడికి లేకపోతే రోజుకి ఒక అమ్మాయితో తిరుగుతాడు వీడి & నువ్వే చూస్తున్నావ్ కదా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్తున్నా ఎలా కాకి లా అరుస్తున్నాడో….. !!

నువ్వే చెప్పు !! నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నయ్య…. !! హరిణి అంత కచ్చితంగా చెప్తుంది అంటే వీడు నిజంగా తన బేబీ కి ఫాదర్ అయ్యుంటాడు….. !! వీడికి హరిణి మాత్రమే కాదు చాలా మంది తో ఎఫైర్ ఉంది తెలుసా అంటూ ఎవరికి వినిపించకుండా చిన్నగా రుద్ర చెవిలో చెప్తుంది….. !!

వాట్… ?? జై అఫైర్స్ గురించి నీకు ముందే తెలుసా అని షాకింగ్ గా చూస్తూ అన్ని తెలిసి కూడా జై ను ఎలా లవ్ చేసావ్ మరి…. ?? అంటూ రుద్ర కూడా అంతే మెల్లగా & సీరియస్ గా అడుగుతాడు…. !!

ఏంటి… ?? లవ్ ఆ!! అది కూడా వాడ్ని నాకు వాడికి క్షణం కూడా పడదు అలాంటి వాడిని నేను లవ్ చేయడం ఏంటి నీకేమైనా పిచ్చా…. !! అంటూ ఆద్య సీరియస్ అవుతుంది…. !!

ఓహ్ అయితే నువ్వు లవ్ చేయట్లేదా మరి జై ఎందుకు అలా చెప్పాడు అని ఆలోచిస్తూ రుద్ర సైలెంట్ అవుతాడు….. !!

ఆధ్య కూడా జై వైపు సీరియస్ గా చూస్తూ ఇప్పుడు వినయ్ వర్మ ఎమ్ చెప్తాడా అని చూస్తూ ఉంటుంది….. !! మాయ మాత్రం టెన్షన్ గా గోళ్ళు కొరికేస్తూ చేతులు నలుపుకుంటూ చూస్తుంది…. !! మాన్య కూడా అందరితో పాటు అసలు ఇందులో ఎవరు నిజం చెప్తున్నారు అనుకుంటూ చూస్తూ ఉంటుంది….. !!

వినయ్ వర్మ పిలుపుకు జై పైకి వెళ్ళే వాడు కాస్త ఆగి కిందకు స్టెప్స్ దిగుతూ వచ్చి వినయ్ వర్మ ముందు నుంచుంటాడు….. !! వినయ్ వర్మ జై వైపు చూస్తూ నీకు నేనంటే ఏమాత్రం గౌరవం ఉన్న హరిణి ను మ్యారేజ్ చేసుకో జై అని అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న వినయ్ వర్మ జై వైపు సీరియస్ గా చూస్తూ చెప్తాడు….. !! వినయ్ వర్మ వాయిస్ లోని బేస్ ఎలా ఉందంటే హార్ట్ పేషంట్ ఎవరైనా అక్కడుంటే ఆ బేస్ కి చచ్చిపోయే వాళ్ళు….. !! వినయ్ వర్మ మాట్లాడడం చాలా తక్కువ బట్ మాట్లాడితే మాత్రం తన మాటలు బుల్లెట్స్ లా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి…. !!

జై కి హరిణి తో మ్యారేజ్ చేయడం వినయ్ వర్మ కి ఏమాత్రం ఇష్టం లేదు….. !! కానీ ఇప్పుడు జై చేసిన పనికి వినయ్ వర్మ కి మరో ఆప్షన్ లేకుండా పోయింది అందుకే తనకు ఇష్టం లేకపోయినా హరిణి తో జై కి మ్యారేజ్ చేయాలి అని డిసైడ్ అవుతాడు….. !! వినయ్ వర్మ డెసిషన్ కి అందరూ షాక్ అయితే మాదేష్ ఫ్యామిలీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకరిని ఒకరు చూసుకుని ప్లాన్ సక్సెస్ అని ఇండెక్స్ ఫింగర్ చూపించుకుని నవ్వుకుంటారు….. !!

డాడ్ అన్నయ్య కి హరిణి తో పెళ్ళి ఏంటి…. ?? మనకు అన్నయ్యగా గురించి తెలుసు కదా అందరితో ఉన్నట్టే హరిణి తో కూడా ఉన్నాడు….. !! వాళ్ళు ప్లాన్ చేసుకుని అన్నయ్య ను బ్లేమ్ చేస్తున్నారు…. !!

మాయ చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు నీకు మీ అమ్మ లాగా అన్న పిచ్చి ఉందని నాకు తెలుసు అంటూ కంగుమని వినిపించిన తండ్రి వాయిస్ కి మాయ భయపడుతూ సైలెంట్ అయిపోతుంది…. !!

చాలా కరెక్ట్ గా చెప్పారు మావయ్య ఇప్పటికైనా మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు…. !! జై కి పెళ్లి చేస్తే తప్పా తను ఈ అలవాట్లను వదిలేయడు…… !! జై కి హరిణి తో మ్యారేజ్ చేయడమే న్యాయం ఎందుకంటే తను జై బేబీ ను కడుపులో మోస్తుంది కదా…. !! అంటూ జై వైపు కోపంగా చూస్తూ అప్పటి వరకు సైడ్ కి నుంచున్న ఆద్య ముందుకు వచ్చి హరిణి చేయి పట్టుకుని వచ్చి జై పక్కన నుంచో పెడుతూ ఇద్దరూ చక్కగా ఉన్నారు అని నవ్వుతూ జై వైపు చూస్తూ కళ్ళు ఎగరేస్తుంది…. !!

నిన్ను 😬😬 అంటూ పళ్ళు నూరుతూ తన వైపు గుర్రుగా చూస్తున్న జై ను చూసి నువ్వు చూడ్డం తప్పా ఇంకేం చేయలేవు రా అని రెక్లెస్ గా నవ్వుతుంది ఆద్య….. !! ఆధ్య ఎక్కడ తన కూతురికి కాంపిటీషన్ గా వస్తుందో అని బయపడ్డ  మాదేష్ , శ్వేత లకు తనే జై, హరిణి లకు మ్యారేజ్ చేయడం కరెక్ట్ అంటూ సపోర్టివ్ గా మాట్లాడడం షాకింగ్ గా అనిపిస్తుంది….. !!

ఆధ్య హరిణి కి సపోర్ట్ చేయడం మాయ కి అసలు నచ్చదు దాంతో మాయ వైపు అసహనంగా చూస్తూ ఇంత జరుగుతున్న ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూస్తున్న ప్రతాప్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది….. !!

ఇప్పటికైనా ఒక తండ్రి గా నా కూతురి బాధ ను అర్థం చేసుకుని జై తో హరిణి మ్యారేజ్ చేయాలి అని నిర్ణయించుకున్నందుకు చాలా థాంక్స్ బావ గారు అని ఆనందంగా చెప్తూ హరిణి వైపు చూస్తాడు మాదేష్….. !!

మావయ్య అంటూ వెళ్ళి వినయ్ కాళ్ల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని ఇప్పటికైనా నా ప్రేమ నిజమైంది అని మీకు అర్థం అయింది….. !! బావ ను ఎలా అయినా మార్చి మీ ముందు నుంచో పెడతాను మావయ్య అని కన్నీళ్ళు తుడుచుకుంటూ బావ ను ప్రాణంగా ప్రేమించా అందుకే ఇంతలా బావ కోసం ఏడుస్తున్నా అని నవ్వుతూ చెప్పి రేణుక ను ఆనందంగా హగ్ చేసుకుంటుంది….. !!

జరిగే డ్రామా చూస్తున్న జై వినయ్ వర్మ తో ఏదో చెప్పబోతూ ఉంటే అప్పటి దాకా సైలెంట్ గా మొబైల్ చూస్తూ కూర్చున్న మహిదర్ పైకి లేచి జై!! కాస్త ఆగు నేను మాట్లాడాలి అంటూ అందరికీ మిడిల్ లో నుంచుంటూ సో నీ కూతురు జై ను ప్రాణంగా ప్రేమిస్తుంది అంటావ్ అంతే కదా మాదేష్….. ??

మహిదర్ వైపు డౌబ్ట్ గా చూస్తూ వీడేదో నా కొంప కి నిప్పు పెట్టేలా ఉన్నాడుగా…. !! జాగ్రత్తగా డీల్ చేయాలి అని అనుకుంటూ హా…. !! అదేగా మహిదర్ చెప్తున్నాను నా కూతురు ఇన్నోసెంట్ కాబట్టే జై ప్రేమించడు
అని తెలిసినా తన ప్రేమతో మార్చాలి అని జై తో లివింగ్ కి ఒప్పుకుంది… !!

అవునవును చాలా ఇన్నోసెంట్ ఎంత ఇన్నోసెంట్ అంటే….. ?? అంటూ తన మొబైల్ ఓపెన్ చేసి మాదేష్ కి చూపించగానే మాదేష్ కి తన నుంచున్న చోట భూమి చీలిపోయినట్టు అనిపించి నుంచున్న వాడల్ల చైర్ లో కూలబడతాడు….. !!

మాదేష్ ఎందుకంత షాక్ అయ్యాడో ఎవరైనా గెస్ చేయగలరా 👿😌 ??