Login with OTP

విలన్ హస్బెండ్-61

aashyatech

Author

అవునవును చాలా ఇన్నోసెంట్ ఎంత ఇన్నోసెంట్ అంటే….. ?? అంటూ తన మొబైల్ ఓపెన్ చేసి మాదేష్ కి చూపించగానే మాదేష్ కి తన నుంచున్న చోట భూమి చీలిపోయినట్టు అనిపించి నుంచున్న వాడల్ల చైర్ లో కూలబడతాడు….. !! అది చూసిన మహిదర్ నవ్వుతూ ఏంటి మాదేష్ అలా పడిపోయావ్ షాక్ అయ్యేవా ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి అని తన మొబైల్ లో స్క్రోల్ చేస్తూ ఒక్కోటి చూపిస్తూ ఉంటే అప్పటి వరకు నవ్వుతున్న హరిణి కి నుదుటిన చమటలు పడుతుంటాయి అవన్నీ చూసిన రేణుక కూడా షాక్ అవుతుంది….. !!

తన గురించి మొత్తం తెలిసిపోయింది అని కన్ఫర్మ్ అవ్వడం తో హరిణి టెన్షన్ గా మాదేష్ వైపు చూస్తూ ఉంటే అప్పటికే మాదేష్ తన వైపు గుడ్లు ఉరిమి చూస్తూ ఉంటాడు….. !! నేను చెప్తూ నే ఉన్నాను నీకు జై తో మ్యారేజ్ అయ్యే వరకూ ఈ తిరుగుళ్ళు అన్ని తగ్గించి బుద్దిగా ఇంట్లో ఉండు అని విన్నావా ఇప్పుడు అనుభవించు అని హరిణి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది శ్వేత….. !!

అంతా అనుకున్నట్టు గానే జరుగుతుంది అనుకుంటుంటే ఇవి ఎక్కడ దొరికాయి వీళ్ళకు ఛా…!! ఇక అస్థి ఎక్కడికి పోతుంది అని ఆస్తి అరచేతికి వచ్చే టైం కి ఈ మహిదర్ దాన్ని కాళ్ళతో తన్నేసాడు అని మహిదర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు హరీష్….. !!

ఏంటి  మాదేష్ సైలంట్ అయిపోయావ్ చెప్పు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం…. !! అవును ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకోవాలి అంటే పురోహితుడు వరుడి పేరు అడుగుతాడు కదా అప్పుడు ఎవరి పేరు చెప్పాలి….. ?? జై పేరు చెప్పాలా లేక నీ కూతురి రహస్య ప్రేమికుడు రాహుల్ పేరు చెప్పాలా అంటూ కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు…. ??

మైండ్ యువర్ వర్డ్స్ మహిదర్ నా కూతురి గురించి తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను….. ?? అంటూ బుకాయించడానికి ట్రై చేస్తున్న మాదేష్ ను చూసి నవ్వుతూ అబ్బబ్బా ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావా మాదేష్ మూవీస్ లోకి వెళ్తే ఆస్కార్ అవార్డ్ నడుచుకుంటూ వచ్చేస్తుంది నీ ఇంటికి…. !! తప్పు నీ వైపు ఉందని తెలిసినా తల ఎత్తుకుని సమాధానం చెప్తున్నావ్ చూడు నిన్ను ఎమ్ అనాలో కూడా నాకు అర్థం కావడం లేదు….. !! నిన్ను తిట్టడానికి నాకు భూతులు కూడా రానందుకు ఫస్ట్ టైమ్ ఫీల్ అవుతున్నా….. !!

మహిదర్  అంటూ కోపంగా అరిచిన మాదేష్ వైపు చూస్తూ యస్ మహిదర్ నే మాట్లాడుతున్నా నువ్వు వాయిస్ రైస్ చేస్తే నేను చెయ్ రైస్ చేయాల్సి వస్తుంది అంటూ మాదేష్ వాయిస్ కి ఏమాత్రం తగ్గకుండా ఆన్సర్ ఇచ్చిన మహిదర్ ను చూసి మాదేష్ నే సైలెంట్ అవుతాడు….. !!

మహి ఏంట్రా ఇదంతా అసలేం జరుగుతుంది ఇక్కడ….. ?? ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తూ ఉంటే నాకేం అర్థం కావడం లేదు…. !! ఏంటీ గొడవ ఎందుకు మాదేష్ తో గొడవ పడుతున్నావ్…. ?? ఇప్పటి వరకూ గట్టిగా మాట్లాడిన వాడు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యాడు…. ?? నువ్వేం చూపించావు నీ మొబైల్ లో & కొత్తగా ఈ రాహుల్ ఎవరు అని అడుగుతూ మాదేష్ మహిదర్ ల గొడవని అవుతాడు….. !!

దానికి అన్సర్ నేను చెప్తాను వినయ్ అంటూ ప్రతాప్ వర్మ అందరి వైపు చూస్తూ హరిణి మీరు అందరూ అనుకున్నట్టు జై ను ట్రూ గా లవ్ చేయలేదు కేవలం ఆస్తి కోసమే జై ను పెళ్ళి చేసుకోవాలి అనుకుంది….. !! నిజానికి తను ప్రేమించింది రాహుల్ ని అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ & వింటున్నారు….. !!

రాహుల్ హరిణి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు అది తన ఫ్యామిలి మొత్తానికి తెలుసు….. !! బట్ ఆ రిలేషన్ ను మన ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ జై తో పెళ్ళి చేయాలి అని ప్లాన్ చేసారు….. !! నాకు తెలిసి ఈ ప్రెగ్నెన్సీ కి రీసన్ కూడా ఆ అబ్బాయే అయ్యుంటాడు ఎమ్మా హరిణి అంతేనా అంటున్న ప్రతాప్ వర్మ ను చూసి హరిణి కి టెన్షన్ తో మాటలు కూడా రావు….. !!

లేదు ఇదంతా అబద్ధం నా కూతురు నీకు కోడలు అవ్వడం ఇష్టం లేక వీళ్ళు కావాలని నా కూతురిని బ్యాడ్ చేస్తున్నారు….. !! నా కూతురు నిప్పు బావ గారు దయచేసి వీళ్ళ మాటలు నమ్మకండి & పిక్స్ కూడా మార్ఫింగ్ చేసుకుంటారు….. !! ఈ మహిదర్ మామూలోడు కాదు తన కూతురుని ఈ ఇంటికి కోడలు చేయడానికి అన్యాయంగా హరిణి మీద తన క్యారెక్టర్ మీద చెడుగా చెప్తున్నారు బావ ….. !!

చూడండి అంకుల్ మా డాడ్ గురించి రాంగ్ గా మాట్లాడకండి ఆయన మావయ్య కి ట్రూ ఫ్రెండ్…. !! నన్ను జై కి ఇచ్చి పెళ్ళి చేయాలి అన్న థాట్ ఆయనకు లేదు అనవసరంగా నన్ను మధ్యలోకి లాగకండి అంటూ సీరియస్ గా చెప్తుంది ఆద్య…. !!

అమ్ము!! నువ్వు ఆగరా అంటూ చూడు మాదేష్ నాది నీ లాంటి చీప్ మెంటాలిటీ కాదు & నేను ఎప్పుడూ ఆ థాట్ కూడా చేయలేదు అండ్ చేయను కూడా…. !! ఇంకేంటి అన్నావ్ నీ కూతురివి మార్ఫింగ్ పిక్స్ అని కదా ఒకే కూల్… !! నువ్వు ఇందాక ఎలా అయితే జై గురించి చెప్పడానికి తన ఫ్లాట్ వాచ్ మెన్ ను తీసుకుని వచ్చావో నేను అలాగే నీ గురించి నిజాలు చెప్పడానికి ఒక మనిషి ను తీసుకుని వచ్చాను జస్ట్ 10 మినిట్స్ వెయిట్ చెయ్ ఆ మనిషి ఆన్ ది వే లో ఉన్నారు అంటూ వాచ్ వైపు చూస్తూ చెప్తాడు….. !!

ఎంగేజ్మెంట్ జరిగిన ఇంట్లో ఈ గోల ఏంటి అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో అని జగదీశ్వర్ బార్య అసహనంగా రూమ్ లోకి వెళ్లిపోతే సింధు వాళ్ళను కూడా తన మదర్ అనిత బలవంతంగా వాళ్ళను వాళ్ళ రూమ్స్ కి పంపిస్తుంది…. !!

మహిదర్ చెప్పినట్టు ఎక్సాక్ట్ 10 మినిట్స్ తర్వాత ఇంటి ముందు కార్ ఆగుతుంది….. !! కార్ ఆగిన సౌండ్ కి ఎవరు వస్తున్నారు అని అందరూ గుమ్మం వైపు చూడగా ట్రెడిషనల్ వేర్ లో లోపలికి వస్తూ కనిపిస్తుంది ఒక అమ్మాయి….. !!

ఆ అమ్మాయిని చూసిన హరిణి షాక్ అవుతూ ఇదేంటి ఇక్కడ…. ?? అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది….. !! వామ్మో ఇవాళ్టితో నా పని ఫినిష్ డాడ్ ఆ కైలాష్ కి అమౌంట్ ఇచ్చి తీసుకుని వచ్చినట్టు వీళ్ళు కూడా దీన్ని తీసుకుని వచ్చారు అనుకుంటా గాడ్ ఇప్పుడేం చేయాలి….. ??

మహిదర్ ముందుకు వచ్చి నుంచున్న ఆ అమ్మాయిని చూసి ఎవర్రా ఈ అమ్మాయి అంటూ వినయ్ మహిదర్ వైపు చూస్తాడు….. !!

వినయ్ నువ్వు జై గురించి నాతో కూడా చెప్పలేక నీలో నువ్వు బాధ పడుతూ ఉంటే అది చూడలేక అంకుల్ ను జై గురించి అడిగాను…. !! ఆయన జై గురించి మొత్తం చెప్పారు అలాగే మాదేష్ గురించి చెప్తూ హరిణి జై కి కరెక్ట్ కాదని చెప్పారు….  !! అప్పుడే నేను అంకుల్ కలిసి హరిణి, హరీష్ ల మీద ఫోకస్ చేశాం తర్వాతే తెలిసింది మాకు హరిణి ఎఫైర్ గురించి అది మీకు చెప్పినా ఈ మాదేష్ అందరినీ మాయ చేస్తారు అని ముందే గెస్ చేసి మాకు తెలిసిన అమ్మాయిని హరిణి బాయ్ ఫ్రెండ్ దగ్గరకు నర్స్ లా పంపించి మొత్తం ప్రూఫ్స్ అని కలెక్ట్ చేశాం….. !! ఇందులో మనం రితిక కి చాలా థ్యాంక్స్ చెప్పాలి రిస్క్ చేసి ప్రతీ ఎవిడెన్స్ మనకు షేర్ చేసిందీ….. !!

 

వాట్… ?? అంటే ఇది నర్స్ కాదనమాట దీన్ని చూసినప్పుడే నాకు డౌబ్ట్ vscvhinfhi అని రితిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది హరిణి….. !!

 

అయ్యో సర్ మీరు నాకు హెల్ప్ చేసిన దానితో కంపేర్ చేస్తే నేను చేసింది చాలా చిన్న హెల్ప్ చెప్పాను కదా సర్ మీ కోసం ప్రాణాలు కూడా నవ్వుతూ ఇచ్చేస్తాను అని అంటూ ఈ అమ్మాయికి రాహుల్ తో రిలేషన్ ఉంది అన్నది నిజమే సర్….. !! అపుడపుడు రాహుల్ ఫ్లాట్ కి వస్తూ ఉండేది….. !! జై దీర్ సర్ తో మ్యారేజ్ అయ్యాక ఆస్తి మొత్తం తన మీదకు షిఫ్ట్ చేయించుకుని మీ అందరినీ చంపేయాలి అని హరిణి ఫ్యామిలీ ప్లాన్ చేసారు అది నా చెవులతో విన్నాను….. !! కావాలంటే మీరు కూడా వినండి అని రాహుల్ హరిణి మాట్లాడుకున్న రికార్డింగ్ వినిపించడం తో అందరూ షాక్ అవుతూ హరిణి వైపు చంపేసేలా చూస్తూ ఉంటారు…. !!

యూ చీట్!! నీ కడుపులో ఇంత విషాన్ని దాచుకున్నావా అని ఆవేశంగా జై గొంతు పట్టుకోగానే ఉపిరి ఆడక దగ్గుతున్న హరిణి ను చూసి అటు వైపు హరీష్, మాదేష్ ఇటు వైపు మహీదర్, అమర్, ఆనంద్ జై ను వెనక్కి లాగాలి అని చూస్తున్నా జై హరిణి ను చంపేయాలి అన్నంత కసిగా గొంతు నొక్కుతూ ఊపిరి ఆడకుండా చేస్తాడు….. !!

జై!! అంటూ జై ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ టైమ్ జై మీద చెయ్ చేసుకుంటాడు ప్రతాప్ వర్మ…….. !! తాతయ్య అంటూ కోపంగా పిలిచిన జై ను చూస్తూ షట్ అప్ చంపేస్తావా ఆ అమ్మాయిని ముందు వెనుక ఆలోచించకుండా ఏంటీ ఆవేశం….. ?? పెద్ద వాళ్ళం మేము మాట్లాడుతున్నాం కదా నువ్వు కామ్ గా ఉండు …… !!

ఇంకా కామ్ గా ఉండడం ఏంటి తాతయ్య ఇట్స్ రేడిక్యులస్ వీళ్ళను మెడ పట్టి బయటకు గెంటేయండి వీళ్ళ నీడ కూడా మన మీద పడ్డానికి వీల్లేదు అంటూ కోపంగా అరుస్తుంది మాయ….. !!

ఊపిరి ఆడక దగ్గుతున్న హరిణి కి వాటర్ పట్టిస్తున్న మాదేష్ కోపంగా పైకి లేచి చాలు ఇక ఆపుతారా వీడిమైనా శ్రీరామ చంద్రుడు అనుకుంటున్నారా ?? జై గురించి తెలిసి తెలిసి ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుందా ఎవరి దాకో ఎందుకు నీ కూతురిని ఇచ్చి జై తో పెళ్ళి చేస్తావా అంటూ మహిదర్ వైపు చూస్తాడు….. !!

మాహిదర్ ఎమ్ చెప్పక ఆలోచనలో పడ్డం చూసిన మాదేష్ నవ్వుకుంటూ చూసావా బావ నీ కొడుకు ను పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాణ స్నేహితుడు కూడా ఆలోచనలో పడ్డాడు…. !! కానీ నేను జై ఎంత మంది అమ్మాయిలతో తిరిగినా నా కూతురితో పెళ్లి చేయడానికి సిద్ధ పడ్డాను….. !! నా కూతురు అయినా రాహుల్ ఒక్కడినే ఇష్టపడింది కానీ నీ కొడుకు రోజుకో అమ్మాయితో తిరుగుతాడు ఎలాంటి కొడుకు ను కన్నావ్ చీ….. !!

వాడికి అమ్మాయిల పిచ్చి ఉందని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడ్డ నా కూతురిని కళ్ళకు అద్దుకుని చూసుకోవాల్సింది పోయి దాన్నే చంపాలి అని చూస్తారా??? మీ అందరినీ అంత ఈజీగా వదలను అంటూ నీ కొడుకు గురించి తెలిసి కూడా ఇంకా ఎలా బ్రతికున్నావ్ వినయ్ వర్మ నేనైతే ఈ పాటికి చచ్చిపోయి ఉండే వాడిని…. !! వాడో కొడుకు నువ్వో తండ్రి & నీది ఒక పెంపకం అంటూ అసహ్యంగా నోటికి వచ్చింది మాట్లాడుతూ వినయ్ ను మానసికంగా చంపేస్తాడు….. !!

నీకు ఏ మాత్రం పౌరుషం ఉన్నా ఈ క్షణమే చచ్చిపో నీ ప్లేస్ లో నేను ఉంటే ఎప్పుడో చచ్చిపోయే వాడిని అయినా కొడుకునే కంట్రోల్ లో పెట్టలేని నీకు ఎందుకు బిసినెస్ లు అని ఇంకా ఏదో అనబోతు ఉంటే జై, రుద్ర కలిసి నలుగురిని మెడ పట్టి బయటకు గెంటేస్తారు
….. !! కింద పడ్డ మాదేష్ కోపంగా చూస్తూ రేయ్ మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చూస్తూ ఉండండి మిమ్మల్ని ఏ స్థితికి తీసుకుని వస్తానో అని కోపంగా చెప్పి తన ఫ్యామిలీ ను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు….. !!

 

కోపంగా ఉన్న జై ఫేస్ ను చూసి జై నీ మామ ఏంట్రా నిన్ను అడ్డంగా ఇలా బుక్ చేసాడు…. !! చూసావు కదా అంకుల్ ను ఎన్ని మాటలు అన్నాడో పాపం అంకుల్ నీ వల్ల ఎన్ని మాటలు పడ్డారో అని బాధగా చెప్తూ ఇప్పటికైనా నీ అలవాట్లు మానుకుని అంకుల్ కి నచ్చినట్టు ఉండరా….. !!

అమర్ వైపు ఒక లుక్ ఇచ్చి కోపంగా లోపలికి వెళ్తున్న జై ను చూసి అమర్, రుద్ర ఫాలో అవుతారు….. !! వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి హాల్ లో అందరూ వినయ్ చుట్టూ చేరి కంగారుగా వినయ్ ను పిలుస్తూ ఉండడం చూసి ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుని పరిగెడుతూ ముందుకు వెళ్ళి చూడగ వినయ్ వర్మ హార్ట్ దగ్గర చేయి పెట్టుకుని శ్వాస ఆడక ఊపిరి తీసుకుంటూ ఉంటారు….. !!

 

వినయ్ ను అలా చూసిన జై కంగారుగా డాడ్ అంటూ దగ్గరకు వెళ్తూ ఉంటే ఆగు…. !! నువ్వు నన్ను ముట్టుకుంటే నన్ను చంపుకు తిన్నట్టే మాదేశ్ చెప్పినట్టు నీ లాంటి కొడుకు ను కన్నందుకు సిగ్గుతో రోజు చచ్చి బ్రతికే కంటే ఒకే సారి చావడం బెటర్ అంటూ స్పృహ లేకుండా పడిపోగానే డాడ్ అంటూ అరుస్తూ మాయ, జై వినయ్ ముందు కూర్చుని ఏడుస్తున్నా వినయ్ లో చలనం ఉండదు అది చూసిన రేణుక కూడా ఏడుస్తూ మీ డాడ్ ను చంపేశావ్ కదా జై నేను ఎవరి కోసం బ్రతకాలి అని తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది….. !!

డాడ్ కళ్ళు తెరవండి ప్లీస్ నా మాట వినిపిస్తుందా ఒక సారి నేను చెప్పేది వినండి అంటూ వినయ్ చెయ్ పట్టుకున్న జై కి వినయ్ పల్స్ కూడా ఆగిపోయి చెయ్ చల్లగా అవ్వడం చూసి జై కి చమటలు పడితే మాయ ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసిన ఆద్య తనను పట్టుకుని వినయ్ వర్మ వైపు కన్నీళ్లతో చూస్తుంది…… !!