విలన్ హస్బెండ్ – 62
మహిదర్ ఇంకా అలా చూస్తూ ఉంటావేంటి పదండి !! వినయ్ ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం….. !! అంటూ కంగారుగా చెప్తున్న ప్రతాప్ వైపు కు చూసిన మహిదర్ వెంటనే వినయ్ వర్మ ను లిఫ్ట్ చేయబోతాడు బట్ తన స్త్రెంగ్త్ సరిపోకపోయేసరికి జై వైపు చూస్తాడు….. !! జై ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ స్పృహ లేకుండా పడున్న వినయ్ వర్మ ను రెండు చేతులతో ఎత్తుకుని బయటకు నడవగానే అమర్ ఫాస్ట్ గా కార్ స్టార్ట్ చేస్తాడు పక్కనే ఆనంద్ కూడా కూర్చుంటాడు …. !!
మాయ ను వెనుకే రుద్ర తన చేతుల్లోకి తీసుకుని వెనుక ఇంకో కార్ లో బ్యాక్ సీట్ లో కూర్చో గానే ఆద్య డ్రైవింగ్ సీట్ లో పక్కన మాన్య కూర్చుంటారు…. !! అమర్ కార్ ను ఫాలో అవుతూ ఆద్య కూడా తన కార్ ను రోడ్ మీద పరుగులు పెట్టిస్తుంది….. !! వీళ్ళ వెనుక మహిదర్ డ్రైవింగ్ సీట్ లో పక్కనే ప్రతాప్ వర్మ వెనుక శైలు, రేణుక సెటిల్ అవుతారు….. !! ఆఖరిగా మరో కార్ లో జగదీశ్వర్ తన కొడుకు & కోడలితో మహిదర్ కార్ ను ఫాలో చేస్తాడు….. !!
అమర్ త్వరగా వెళ్ళరా అంటూ అప్పటికే పల్స్ రేట్ పూర్తిగా డౌన్ అయిపోవడం తో వెనుక సీట్ లో కూర్చున్న జై చాలా కంగారుగా చెప్తాడు….. !! టెన్షన్ అవ్వకు జై ఇంకో 10 మినిట్స్ రా వెళ్ళిపోతాం అంటూ అమర్ మరింత స్పీడ్ పెంచేసి 100 క్రాస్ చేస్తాడు…… !! కాసేపటికి హస్పిటల్ ముందు ఆగుతాయి 4 కార్స్…. !! కార్ ఆగిన మరు క్షణం జై ఫాస్ట్ గా కిందకు దిగి స్ట్రెచర్ తీసుకుని వచ్చేదాక కూడా వెయిట్ చేయకుండా వినయ్ వర్మ ను పసి పిల్లాడిలా ఎత్తుకుని డాక్టర్….. డాక్టర్ అని అరుస్తూ హస్పిటల్ లోకి వెళతాడు ….. !!
వాట్ హ్యాపెండ్ అంటూ జై అరుపులు విన్న డాక్టర్ తన క్యాబిన్ నుండి బయటకు వస్తూ అడగ్గా డాక్టర్ మా డాడ్ కి సడెన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది….. !! ప్లీస్ త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఆయనకు ఇలా రావడం ఫస్ట్ టైమ్ అంటూ టెన్షన్ గా చెప్తాడు….. !!
రిలాక్స్ మిస్టర్ జై ధీర్ అంటూ బాయ్స్ అని అరువగానే రెండు నిమిషాల్లో వార్డ్ బాయ్స్ స్ట్రెచర్ లో వినయ్ వర్మ ను తీసుకుని ఐ. సి. యూ. లోకి తీసుకుని వెళ్లగా వెనుకే డాక్టర్ కూడా వెళ్ళి డోర్స్ లాక్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు….. !!
గ్లాస్ డోర్ నుండి వినయ్ వర్మ కు ట్రీట్మెంట్ ఇస్తూ ఉండడం చూసిన జై గుండె ఉప్పొంగే సంద్రం లా ఉంది…… !! తనకు వినయ్ వర్మ అంటే చాలా ఇష్టం అలాంటిది ఇప్పుడు ఇలా స్పృహ లేకుండా పడుకున్న తండ్రి ను అలా చూడలేక వెనక్కి తిరిగి కన్నీళ్లను ఆపుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు…… !!
జై!! డాక్టర్స్ ఏమన్నారు అని పరిగెడుతూ వచ్చి ఆయాసపడుతున్న అమర్ వైపు చూస్తూ ట్రీట్మెంట్ జరుగుతుంది రా అని ఒక్క మాట చెప్పి సైలెంట్ గా ఎటో చూస్తూ నుంచున్న జై కి ఎవరి మాటలు చెవికి చేరడం లేదు….. !! చిన్నప్పటి నుండి తనను గుండెల మీద ఎత్తుకుని పెంచిన వినయ్ వర్మ నే గుర్తు వస్తూ ఉంటే బాధగా కళ్ళు తెరిచి చూస్తున్న జై చంప చల్లుమని పగల కొడతాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రతాప్….. !!
తాతయ్య !! అని చంపన చెయ్ పెట్టుకుని పిలుస్తున్న జై ను చూసి చీ!! నన్నలా పిలవకు నీ గురించి ఆలోచించి ఆలోచించి ఇవాళ వినయ్ ను హాస్పిటలైజ్ అయ్యేలా చేసావ్ కదరా ఇడియట్…… !! నీ కోసం వాడు ప్రతీ రోజు ప్రతీ క్షణం అందరితో మాటలు పడుతూ నరకం చూసాడు…… !! సంధ్య చనిపోయినపుడే నువ్వు చచ్చున్నా ఇవాళ మాకు ఇంత బాధ ఉండేది కాదు అని ఆవేశంగా జై మీదకు వెళ్తున్న ప్రతాప్ ను అంకుల్ ప్లీస్ కంట్రోల్ అంటూ ఆయనను అక్కడి నుండి బలవంతంగా పక్కకు తీసుకుని వెళతాడు మహిదర్ ….. !!
మాయ ను వినయ్ వర్మ ఉన్న రూమ్ పక్కనే మరో రూమ్ లో ఉంచిన రుద్ర తనకేం అవ్వలేదని స్ట్రెస్ ఎక్కువ అవ్వడం తో ఆన్ కాన్షియస్ అయిందని డాక్టర్ చెప్పడం తో రిలాక్స్ అవుతూ ప్రతాప్ అరుపులు విని కంగారుగా ఇటు వైపు వచ్చి మొత్తం వింటాడు….. !!
జై అంటూ బాధగా చెయ్ వేసిన అమర్ చేతిని విడిపించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న జై ను చూసి అమర్ కన్నీళ్లతో చూస్తూ ఉంటే రుద్ర జై వెనుకే ఫాలో అవుతాడు….. !!
కాసేపటికి వినయ్ వర్మ ను ట్రీట్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి నథింగ్ టు వర్రీ దేనికో ఆయన చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు అందుకే మైల్డ్ స్ట్రోక్ వచ్చింది….. !! ప్రెసెంట్ ఆయన సిచుయేషన్ అవుట్ ఆఫ్ డేంజర్ అనే చెప్తాను….. !! బట్ కొద్ది రోజులు ఆయనకు దేనికి బాధ పడకుండా నవ్వుతూ చాలా ప్రశాంతంగా ఉండాలి….. !! ఏమాత్రం ఆయన బాధ పడ్డా దేనికైనా ఓవర్ థింకింగ్ చేసి స్ట్రెస్ ఫీల్ అయినా మళ్ళీ స్ట్రోక్ వచ్చే చాన్సెస్ 75% ఉన్నాయి….. !! కాబట్టి ఆయనను వీలైనంత ప్రశాంతంగా దేనికి ఆలోచించకుండా పీస్ఫుల్ గా ఉండమని చెప్పండి….. !!
అనుస్థిషియా ఇవ్వడం వల్ల ఆయన ఇంకా కాన్షియస్ లోకి రాలేదు….. !! ఇంకో 2 అవర్స్ లో రూమ్ కి షిఫ్ట్ చేస్తాం అప్పుడు వెళ్ళి మీరు ఆయనను చూడచ్చు….. !! నేను తర్వాత వచ్చి వినయ్ వర్మ గారిని చూస్తాను డోంట్ వర్రీ అంటూ డాక్టర్ తను చెప్పాల్సింది చెప్పి మరో పేషెంట్ ను చూడ్డానికి వెళ్లగానే ప్రతాప్ బాధగా చైర్ లో కూర్చోగానే మహిదర్ ఓదార్పుగా బుజం మీద చేయి వేసి ఆయనకు ధైర్యం చెప్తూ ఉంటాడు…… !!
మరో వైపు గ్లాస్ డోర్ నుండి మొహానికి ఆక్సిజన్ పెట్టుకుని స్పృహ లో లేకుండా పడుకున్న వినయ్ ను చూసి రేణుక ఏడుస్తూ ఉంటే శైలు ధైర్యం చెప్తూ ఉంటుంది….. !! ఇంకా స్పృహ లో రాని మాయ ను చూసి ఆద్య, మాన్య కూడా బాధగా తన పక్కనే కూర్చుని వినయ్ వర్మ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు….. !!
✨ ✨ ✨ ✨ ✨ ✨ ✨✨
తన ఇంటి ముందు కార్ ఆగడం తో కోపం గా ఇంట్లోకి వెళ్తున్న మాదేష్ ను చూసి మిగిలిన వాళ్లు కూడా ఫాలో అవుతూ ఇంట్లోకి వెళ్లి హాల్ లో కూర్చుంటారు….. !! ఇన్ని ఇయర్స్ నేను కన్న కళ కళలా మోగిపోయింది & వాడు ఆ జై గాడు నన్ను ఎన్ని మాటలు అన్నాడు అని ఆవేశంగా ఊగిపోతూ ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని పగల కొడుతూ ఉంటాడు….. !!
డాడ్ ఏంటి ఆవేశం…… ?? మీరు కోపంతో మన వస్తువులు పగల కొడితే నష్టం మనమే ఇప్పుడు ఆవేశం కాదు ఆలోచన ముఖ్యం….. !! ఇప్పుడేం చేయాలో ఆది ఆలోచించండి అంటున్న హరిణి చంప కోపంగా పగల కొడతాడు మాదేష్….. !!
డాడ్ 🥹 …… !! ఏడుస్తూ పిలిచిన హరిణి వైపు చూస్తూ నోరు ఎత్తావంటే చంపేస్తాను అని మరో వైపు కూడా కొట్టి ముందు నుండి మొత్తుకుంటునే ఉన్నా ఆ రాహుల్ గాడితో పబ్లిక్ గా తిరగకు అని విన్నావా నా మాట….. ?? నువ్వు వాడితో తిరగడం అదేవరో చూసి చెప్పింది కాబట్టే ఇవాళ నాకు రావాల్సిన కోట్లు నా చెయ్ జారిపోయాయి అంతా నీ వళ్ళేనే అంటూ కొట్టడానికి ముందుకు వస్తున్న మాదేష్ ను చూసి హరిణి భయంగా శ్వేత వెనుక దాక్కుంటుంది…… !!
ఏంటి నిజమా…… !! వావ్ సూపర్ థాంక్స్ ఒకే మళ్ళీ కాల్ చేస్తా అని తనకు వచ్చిన కాల్ రిసీవ్ చేసుకుని వాళ్లు చెప్పింది విని డాడ్ గుడ్ న్యూస్ అంటూ హరీష్ నవ్వడం చూసి మాదేష్ కి మండుతుంది…… !!
ఇల్లు కాలి నేను ఏడుస్తుంటే గుడ్ న్యూస్ అంటావెంట్రా అని అరుస్తున్న మాదేష్ ను చూసి అబ్బా ముందు నేను చెప్పేది వింటే నువ్వు ఎగిరి గంతేస్తావ్ …… !! అంటూ వినయ్ వర్మ కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారంట అని ఆనందంగా చెప్తున్న హరీష్ ను చూసిన మాదేశ్ నవ్వుతూ నిజమా అంటూ హస్పిటల్ లో జాయిన్ అయిన వాడిని శాశ్వతంగా పైకి పంపించాలి……. !! అప్పుడు కానీ నా పగ చల్లారదు అని నవ్వుకుంటూ రేయ్ ఆ ధూల్పేట్ మస్తాన్ కి కాల్ చేసి రమ్మను వాడితో పని ఉంది అని నవ్వుకుంటూ ఒరేయ్ వినయ్ వర్మ ఇంతటితో నీ చాప్టర్ ఫినిష్ అని కన్నింగ్ గా నవ్వుకుంటూ మొహాన్ని సీరియస్ గా పెడతాడు ……. !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
ఆంటీ!! ఎక్కడున్నారు అని రుద్ర విల్లా కి వచ్చిన శ్రియ హాల్ మిడిల్ లో నిలబడి అపర్ణ ను గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది….. !! శ్రియ అరుపులకు తన రూమ్ లో బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్న అపర్ణ బయటకు వస్తూ శ్రియ ఏంటీ అరుపులు ఏమైంది అని అడుగుతూ శ్రియ చెయ్ పట్టుకుని సోఫా లో కూర్చో పెడుతూ తన పక్కనే కూర్చుంటుంది….. !!
రుద్ర ఎక్కడికి వెళ్ళాడు ఆంటీ….. ?? ఎన్ని సార్లు కాల్ చేస్తున్నా నా కాల్ ఆన్సర్ చేయడం లేదు….. !! ఆనంద్ కి చేసినా పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు…… !! రుద్ర మనకు తెలియకుండా ఏదో హైడ్ చేస్తున్నాడు….. !!
ఓవర్ థింకింగ్ ఆపేయ్ అని అప్పుడే చెప్పాను అయినా నువ్వు ఆపలేదు…. ?? రుద్ర బిసినెస్ ట్రిప్ వెళ్ళాడు శ్రియ…. !! ఇందులో హైడ్ చేయడానికి ఏముంది….. ?? నువ్వు నీ ఓవర్ థింకింగ్ తప్పా….. ??
అలా అని మీకు చెప్పాడు బట్ రుద్ర వెళ్ళింది ఇండియా కి అది కూడా తను లవ్ చేసిన అమ్మాయిని మీట్ అవ్వడం కోసం ఆ విషయం మీకు తెలుసా….. ?? రిటర్న్ వస్తూ ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు….. !! బట్ అదే జరిగితే నేను చూస్తూ ఊరుకోను ఆంటీ రుద్ర పక్కన నేనే ఉండాలి అలా కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళను చంపేస్తాను అంటూ కోపంగా చెప్తుంది….. !!
ఏంటి శ్రియ నువ్వు చెప్పేది రుద్ర ఇండియా లో ఉన్నాడా….. ?? బట్ నాకు బిసినెస్ ట్రిప్ మీద ఫారిన్ వెళ్తున్నా అని చెప్పాడు….. !!
అలా చెప్పక పోతే మీరు గొడవ చేస్తారు అని అలా చెప్పుంటాడు….. !! ఈ విషయం నాకు ఆనంద్ క్లోజ్ ఫ్రెండ్ ద్వారా తెలిసింది….. !! ఇప్పుడు నాకు తెలియాల్సింది రుద్ర లవ్ చేస్తున్న అమ్మాయి గురించి మీరేం చేస్తారో ఏంటో నాకు ఆ అమ్మాయి డిటైల్స్ ఫుల్ గా కావాలి దట్స్ ఇట్….. !! మీకు రేపటి వరకూ టైం అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్తున్న శ్రియ ను చూసి అపర్ణ తల పట్టుకుంటుంది …… !!
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
నాన్సీ భరత్, మంజూష ల వైపు చూస్తూ నా పాస్ట్ గురించి ఇప్పటి వరకు జై కి మాత్రమే తెలుసు బట్ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా అంటే మీరు నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది మీకే తెలియాలి అంటూ నేను కూడా అందరి అమ్మాయిల లానే మంచిగా చదువుకుని జాబ్ చేసి అమ్మ, నాన్న & చెల్లిని బాగా చూసుకోవాలి & వాళ్ళను విలేజ్ నుండి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాలి అంటూ చాలా కలలు కనేదాన్ని…… !! దానికి తగ్గట్టు డే & నైట్ కష్టపడి ప్రతీ ఇయర్ మంచి మార్క్స్ తో నా స్టడీస్ కంప్లీట్ చేశాను….. !!
నేను ఊర్లో ఉండగానే నాకు ముంబై లో ఒక పెద్ద కంపెనీ లో ఇంటర్వ్యూ గురించి కాల్ వచ్చింది….. !! నాకు చాలా భయం వేసింది అంత దూరం వంటరిగా ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు & నాన్న ను తోడు రమ్మని చెప్పాలి అనుకున్న టైం లో మంజు ఎగ్జామ్స్ కోసం నాన్న మంజు ను రోజూ దాన్ని ఎగ్జామ్ సెంటర్ కి తీసుకు వెళ్ళి రావాలి అని చెప్పారు….. !! దాంతో ఇక నేను నాన్న ను అడగలేక పోయాను అప్పుడే నా ఫ్రెండ్ తన కజిన్ బ్రదర్ కి ముంబై బాగా తెలుసు అని చెప్పి నన్ను బలవంతంగా ఒప్పించి ఆ దుర్మార్గుడి తో నన్ను ముంబై పంపింది…… !!
నా ఫ్యూచర్ గురించి ఎన్నో డ్రీమ్స్ తో వాడిని ఒక బ్రదర్ లా ఫీల్ అయ్యి ఆనందంగా వెళ్ళిన నన్ను వాడు 15 లాక్స్ కి ఆశ పడి ఇంటర్వ్యూ కి తీసుకు వెళ్తాను అని గుడ్డిగా నమ్మించి నన్ను బ్రోతల్ హౌస్ లో అమ్మేశాడు 🥹….. !! అది తన ఫ్రెండ్ ఇళ్ళని కొంచెం వర్క్ ఉందని దాన్ని ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను అని చెప్పి నన్ను ఒక రూమ్ లో ఉంచి వెళ్ళిపోయాడు….. !!
నన్ను హాఫ్ ఆన్ అవర్ లో తీసుకుని వెళ్తాను అని చెప్పిన వాడు 1అవర్…. 2 అవర్స్ అలా వెయిట్ చేస్తూ ఆఫ్టర్ నూన్ అయినా రాలేదు….. !! ఒక వైపు ఆకలి మరో వైపు భయం అప్పట్లో నా దగ్గర మొబైల్ కూడా మంచిది ఉండేది కాదు….. !! కీ ప్యాడ్ యూస్ చేస్తూ ఉండే దాన్ని….. !! దానికి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోవడం తో అది స్విచ్ ఆఫ్ అయిపోయింది…… !! ఎమ్ చేయాలి అని ఆలోచిస్తున్న నాకు ఒక 45 ఇయర్స్ ఉన్న ఆవిడ వచ్చి తను వచ్చేస్తాడు చాలా నీరసంగా కనిపిస్తున్నావ్ ముందు భోజనం చెయ్ అమ్మా అంటూ నాతో చాలా ఆప్యాయంగా తెలుగు లో మంచిగా మాట్లాడేసరికి నేను ఆవిడ మాటలు నమ్మి ఆవిడ ఇచ్చింది తిన్నాను….. !!
అది తిన్న 10 నిమిషాలకే నాకు మెల్లగా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి….. !! కళ్ళ ముందు బ్లర్ గా కనిపిస్తూ అలాగే తల పట్టుకుని బెడ్ మీద పడిపోయాను….. !! అప్పటి వరకు నా ముందు మంచిగా కూర్చున్న ఆవిడ నవ్వుతూ రేయ్ అని పిలవగానే బయట నుంచున్న ఇద్దరు అబ్బాయిలు లోపలికి వచ్చారు….. !!
సర్ చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నారు ఇది అసలే కొత్త పిల్ల అందుకే ముందు సర్ నే టెస్ట్ చేయాలి…… !! దీని కోసం 15 లక్షలు ఖర్చు పెట్టాను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి రూమ్ లో పడేయండి అని చెప్పి ఆవిడ చెప్పగానే వాళ్ళు నన్ను తీసుకుని పైన ఉన్న రూమ్ లోకి తీసుకుని వెళ్తున్నారు….. !! నాకు ప్రతీది క్లియర్ గా కనిపిస్తూనే ఉంది కానీ నోరు తెరిచి మాట్లాడలేక పోతున్నా….. !! కాసేపటికి ఒకడు నేను ఉన్న రూమ్ లోకి వచ్చి నన్ను నగ్నంగా మార్చి నా జీవితాన్ని లాగేసుకున్నాడు …… !! ఒక మనిషిని ఎన్ని రకాలుగా టార్చర్ చేయచ్చో అన్ని రకాలుగా చేసాడు…… !! చెప్పలేని చోట కొరుకుతూ పంటి గాట్లు పెడుతూ దీని కంటే చావు చాలా బావుంటుంది అని అనిపించేలా నరకం చూపెట్టాడు అని చెప్పి వెక్కుతూ మొహాన్ని చేతుల్లో దాచుకుంటుంది అది చూసిన మంజు కళ్ళు ఆగకుండా వర్షిస్తునే ఉన్నాయి….. !!