Login with OTP

విలన్ హస్బెండ్-63

aashyatech

Author

అక్కా 🥹…… !! అంటూ తనను హగ్ చేసుకుని ఏడుస్తున్న మంజూష ను హగ్ చేసుకుంటూ నిజం మంజు ఆ క్షణం నిజంగా చచ్చిపోవాలి అనిపించింది….. !! నా లైఫ్ గురించి నేను ఎన్నో కళలు కన్నాను అవన్నీ నా కళ్ళ ముందే కూలి పోతూ ఉంటే ఎమ్ చేయలేని నిస్సహాయత & రాక్షసుడిలా నా మీద పడి కోరిక తీర్చుకుంటున్న వాడ్ని ఎమ్ చేయలేక పోతున్నాను అన్న కోపం……!! మీ అందరినీ ఎంతో బాగా చూసుకోవాలి అన్న నాకు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మీ ముందుకు రావాలి అన్న భయం….. !! ఇవన్నీ నన్ను చిత్రవాద చేశాయి అంటూ మంజు కి దూరం జరుగుతూ ఆ రాత్రి మొత్తం వాడు నన్ను అరగంట కూడా వదలకుండా పశువులా వాడి కోరిక తీర్చుకున్నాడు….. !! నేను నార్మల్ అవ్వడానికి 3 రోజులు పట్టింది తెలుసా 🥹….. !!

 

ఎర్లీ మార్నింగ్ ఆ పశువు నా మీద నుండి లేచి బెడ్ మీద పడుకుని మత్తుగా నిద్రపోయాడు….. !! చేతులు కూడా కదపలేని స్థితిలో ఉన్నాను….. !! పది గంటలకు నాకు మెల్లగా స్పృహ వస్తూ ఉంది కళ్ళు తెరిచి చూసిన నాకు నా వంటి మీదే కాదు వాడి వంటి మీద కూడా బట్టలు లేవని అర్థం అవ్వడం తో కంగారుగా లేవడానికి చూసినా నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదు….. !!

కష్టంగానే పైకి లేచి కింద పడ్డ నా డ్రెస్ తీసుకుని అడుగులో అడుగు వేస్తూ వాష్ రూమ్ వైపు వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి వాడి వైపు ఒక సారి చూసి ఏడుస్తూ వాష్ రూమ్ కి వెళ్ళిపోయాను…. !! ఫ్రెష్ అయి వచ్చి అదే రూమ్ లో ఒక మూల కూర్చుని గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న నా ఏడుపు విన్న వాడు కోపంగా పైకి లేచి వాడి నిద్ర డిస్టర్బ్ చేసాను అన్న రీసన్ తో నన్ను కొట్టి బలవంతంగా మళ్ళీ నన్ను ఆక్రమించుకున్నాడు …… !!

వాడి కోరిక తీరే దాక వాడు నన్ను వదిలి పెట్టలేదు…… !! వాడు అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ నా ముందు 50 తౌసండ్ పెట్టేసి నువ్వు నాకు బాగా నచ్చావ్ వీక్లీ వీక్లీ నీ కోసం అయినా వస్తా అని నాతో అసహ్యంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు….. !! నాకు 0.0001% కూడా శక్తి లేదు కానీ లేని శక్తిని తెచ్చుకుని మరీ నా ముందున్న ఆ డబ్బును ఏడుస్తూ విసిరి కొట్టాను….. !!

అప్పుడే అక్కడికి నిన్న నాకు ఫుడ్ ప్లేట్ తీసుకుని వచ్చిన ఆవిడ వచ్చింది….. !! ఆ డబ్బును క్యాచ్ పట్టుకుంటూ లక్ష్మీ ని అలా దూరంగా విసిరేయకూడదు అమ్మాయి అంటూ బెడ్ పక్కకు చైర్ లాక్కుని కూర్చుని చూడు అమ్మాయి!! అన్నట్టు నీ పేరేంటి వాడేదో చెప్పాడే….. ?? నవ్య, నిత్య ….. ?? హా గుర్తొచ్చింది నాన్సీ కదూ….. !! నీ లాగే నీ పేరు కూడా చాలా సెక్సీగా ఉంది నాన్సీ అంటూ నవ్వుతూ నాన్సీ వైపు చూస్తుంది….. !!

 

ఆంటీ ప్లీస్ 🥺….. !! నన్ను వదిలేయండి నేను మీరు అనుకునే లాంటి అమ్మాయిని కాదు నేను జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను….. !! నా కోసం లోకేష్ అన్నయ్య వచ్చి ఉంటాడు ప్లీస్ నేను అన్నయ్య తో వెళ్ళిపోతాను అని ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తున్న నాన్సీ ను చూసి నవ్వుతూ నీకు ఇంకా నిజం ఏంటో అర్థం కావడం లేదు అనుకుంటా నాన్సీ నువ్వు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నావో వాడు ఇక ఎప్పటికీ రాడు ఎందుకంటే వాడు నిన్ను నాకు 15 లక్షలకు అమ్మేశాడు….. !!

ఎక్కడో చిన్న ఆశ తను స్పృహ లో లేనప్పుడు తను విన్న మాటలు నిజం కాదు అని కానీ ఇప్పుడు కామిని చెప్పిన మాటలకు నాన్సీ ఒక్క సారిగా షాక్ అవుతుంది….. !! ఇక్కడి నుండి నువ్వు ఎప్పటికీ తప్పించుకుని పారిపోలేవు నాన్సీ ఎందుకంటే ఇది నా సామ్రాజ్యం నన్ను కాదని నిన్ను ఎవరు సేవ్ చేయడానికి ముందుకు రారు కాబట్టి నేను చెప్పింది వినడం తప్పా నీకు మరో ఆప్షన్ లేదు….. !!

నువ్వు నేను చెప్పింది విని నాకు కోపరేట్ చేసావో అనుకో వచ్చిన అమౌంట్ లో నీకు 40% ఇస్తాను…. !! దాన్ని నువ్వు హ్యాపీగా ఖర్చు పెట్టుకో డబ్బు ఏమైంది అని కూడా నిన్ను క్వశ్చన్ చేయను….. !! నువ్వు షాపింగ్, సినిమా, టూర్ ఎక్కడికైనా వెళ్ళడానికి నేను పెర్మిషన్ ఇస్తాను బట్ నేను చెప్పినట్టు వింటూ నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నేను చెప్పిన వాళ్ళతో నైట్ స్పెండ్ చేయాలి….. !!

నా గొంతు లో ప్రాణం ఉండగా నేను అలాంటి పాడు పని చేయను నన్ను మా నాన్న చాలా ఉన్నతంగా పెంచారు…. !! ఇలాంటి నీచపు పని చేసి దాని ద్వారా వచ్చిన డబ్బులు నాకు అవసరం లేదు అని చెప్తున్న నాన్సీ గొంతు పట్టుకుంటూ ఎంటే కొత్త కదా అని మంచిగా చెప్తుంటే నాకే ఎదురు చెప్తున్నావ్ నీ లాంటి వాళ్ళను ఎలా లొంగదీసుకోవాలో నాకు బాగా తెలుసు అని నాన్సీ ను అలాగే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది…… !!

ఆ రోజు నుండి నాన్సీ ఇష్టం తో పని లేకుండా రోజుకి 5 మందిని తన రూమ్ కి పంపించేది….. !! నాన్సీ కోపరేట్ చేయకపోతే కొట్టమని చెప్పి &  తను వాళ్ళను అడ్డుకోకుండా తనకు డెయిలీ ఇంజెక్షన్స్ ఇస్తూ నాన్సీ కి వారం పాటు కేవలం వాటర్ మాత్రమే ఇస్తూ నాన్సీ కి నరకం చూపిస్తారు….. !!

అప్పటికే తను అక్కడికి వచ్చి 10 డేస్ అవుతుంది….. !! రోజు ఒక్క ఇడ్లీ తప్పా ఎమ్ తినకపోవడం తో విపరీతమైన ఆకలి మరో వైపు వొళ్ళంతా పంటి గాట్లు, గోళ్ళ గుర్తుల తో విపరీతమైన పెయిన్స్ & ఫీవర్….. !! తన కోసం తన వాళ్ళు ఎంతలా ఏడుస్తూ ఉంటారో గుర్తు చేసుకుంటూ రోజూ కుమిలి కుమిలి ఏడ్చేది నాన్సీ….. !!

తన వాళ్ళ కోసం అయినా తను బ్రతకాలి & ఇక్కడి నుంచి ఎలా అయినా బయట పడాలి కానీ అది అంత ఈజీ కాదు….. !! ముందు కామిని దృష్టిలో తనను పూర్తిగా నెమ్మేలా చేయాలి అని డిసైడ్ అవుతుంది….. !! అందుకోసం తప్పక ఆ వర్క్ చేయడానికి తన ఆత్మాభిమానాన్ని చంపుకుని తన ఫ్యామిలీ కోసం ఒప్పుకుంటుంది…… !!

దాంతో ముందుగా నాన్సీ కి ట్రీట్మెంట్ ఇప్పించి తను క్యూర్ అయ్యేంత వరకూ మంచి ఫుడ్ పెడుతూ నాన్సీ ను బాగా చూసుకుంటుంది కామిని….. !! వన్స్ నాన్సీ క్యూర్ అయ్యాక తనతో కామిని కొన్ని రోజుల్లోనే లక్షల్లో సంపాదిస్తుంది….. !! నాన్సీ ను అందరి కంటే స్పెషల్ గా చూసుకుంటూ ఉన్న టైం లో అక్కడికి నాన్సీ రిలేటివ్స్ లో ఒకరు రావడం నాన్సీ ను అక్కడ చూడ్డం అది నాన్సీ ఇంటికి వెళ్లి కూతురిని అడ్డు పెట్టుకుని బానే సంపాదిస్తున్నావ్ అని అప్పటికే నాన్సీ మంత్లీ వీళ్ళకు జాబ్ చేస్తున్నట్టు మనీ పంపిస్తూ ఉంటే వీళ్ళు అదే నిజం అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు….. !!

నాన్సీ పంపిస్తున్న డబ్బు వల్లే వీళ్ళ పొజిషన్ చాలా బెటర్ గా ఉంది….!! నాన్సీ అలాంటి పని చేస్తుందని తెలిసి మంజు తో పాటు తన పేరెంట్స్ కూడా గుండె పగిలేలా ఏడుస్తారు….. !! ఆ రోజు నుంచి తన ఫాదర్ కి నాన్సీ అంటే అసహ్యం & తను పంపే డబ్బు కూడా తీసుకోకుండా రిటర్న్ చేస్తూ మంజు ను మాత్రమే తన కూతురిగా చూసుకుంటూ ఉంటాడు…. !!

తప్పించుకోవడానికి మంచి ఛాన్స్ కోసం చూస్తున్న నాన్సీ ఒక రోజు పాణి పూరి తినాలని బయటకు రావడం తో కామిని తనకు తోడుగా ఇద్దరు మనుషులను పంపుతుంది….. !! వాళ్లకు మస్కా కొట్టి నాన్సీ అర్ద రాత్రి పరిగెడుతూ వస్తూ అనుకోకుండా జై కార్ కి డ్యాష్ ఇవ్వడం తో స్పృహ లేకుండా పడిపోతుంది….. !! స్పృహ లేకుండా పడిపోయిన నాన్సీ ను కార్ లో పడుకో బెట్టి జై అక్కడి నుంచి హస్పిటల్ కి తీసుకుని వెళ్ళిపోతాడు బట్ చీకట్లో రౌడీలు నాన్సీ ను మిస్ అయిపోతారు …… !!

అలా ఆ నరకం నుండి తప్పించుకుని జై లాంటి మంచి మనిషి దగ్గరకు చేరాను….. !! అంటూ ఇద్దరి వైపు చూస్తుంది…… !! జై నే లేకపోయి ఉంటే ఈ పాటికి నేను ఇంకా ఆ నరకం లోనే ఉండే దాన్ని….. !! ముక్కు మొహం తెలియని నా కోసం జై ఆ కామిని కి 75 లాక్స్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ నా వైపు చూడకుండా చేసిన దేవుడు జై అంటూ కన్నీళ్లు తుడుచుకుంటుంది ….. !!

✨✨✨✨✨✨✨✨✨✨

వినయ్ ను రూమ్ షిఫ్ట్ చేశాక తనకు స్పృహ వచ్చిందని సిస్టర్ చెప్పడం తో మహిదర్, ప్రతాప్, రేణుక, జగదీశ్వర్ తనను చూడడానికి రూమ్ లోకి వెళతారు…… !! అప్పటికే కాన్షియస్ లోకి వచ్చిన వినయ్ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఎదురుగా కనిపించిన అందరి వైపు చూస్తూ తనకు ఉంచిన ఆక్సిజన్ మాస్క్ తీస్తూ కూర్చోవడానికి ట్రై చేస్తాడు….. !!
వినయ్ కేర్ఫుల్ అంటూ బెడ్ ను అడ్జస్ట్ చేస్తూ ఎలా ఉంది రా అంటూ వినయ్ చెయ్ పట్టుకుని ఆప్యాయంగా అడుగుతున్న మహిదర్ వైపు చూస్తూ ఇంకా ఎందుకు బతికానా అని బాధగా ఉంది రా అంటూ ఎమోషనల్ అవుతున్న వినయ్ ను సైడ్ హగ్ చేసుకుంటూ ప్లీస్ రా కంట్రోల్ నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు అది నీకు చాలా ప్రమాదం అని డాక్టర్ చెప్పారు….. !!

నేను ఉండి కూడా ఎమ్ లాభం వినయ్ కళ్ల ముందే కొడుకు జీవితం నాశనం అవుతూ ఉంటే అది చూస్తూ బ్రతికి ఉండడం కంటే చావడం బెటర్….. !! వాడి వల్ల ఎన్నో మాటలు పడ్డాను & ఇక ఆ మాటలు విని భరించే శక్తి నాకు లేదురా….. !! వాడు ఎలాగో మారడు ఇక నేను ఉండి మాత్రం చేసేది ఏముంది అందుకే చచ్చిపోయి నా సంధ్య దగ్గరకు వెళ్ళిపోతాను అంటూ చిన్న పిల్లాడిలా తన బాధ మొత్తం చెప్తూ బరస్ట్ అయిపోయిన వినయ్ ను చూసి అక్కడున్న అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది….. !!

వినయ్ అని బాధగా తండ్రి పిలుపు విని అటుగా చూసిన తనకు తన పక్కన కూర్చుంటూ నీకు ప్రామిస్ చేస్తున్నా జై ను పెళ్ళికి ఒప్పించే బాధ్యత నాది నువ్వు దాని గురించి మర్చిపోయి ప్రశాంతంగా పడుకుని రెస్ట్ తీసుకో….. !!
వాడు పెళ్ళికి ఒప్పుకోడు నాన్న అందుకే నేను చావుకు రెడీగా ఉన్నాను అని బాధగా చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకున్న వినయ్ కన్నీళ్ళు తుడుస్తూ నేను చెప్తున్నా కదా జై ను ఎలా అయినా పెళ్ళికి ఒప్పించే తీరుతాను & వాడే నీతో నేను పెళ్ళికి రెడీ అని చెప్పేలా చేస్తా ఇప్పుడు నీకు సంతోషమే కదా….. !!

జై గురించి తెలిసి కూడా ఎవరు నాన్న పెళ్లి చేసుకుంటారు….. ?? వాడి చేతులతో వాడే తన లైఫ్ ను స్పాయిల్ చేసుకున్నాడు….. ??

అదంతా నాకు వదిలేయ్ మన ఇంటికి ఎలాంటి మంచి అమ్మాయి రావాలి అనుకున్నామో అలాంటి అమ్మాయినే కోడలిగా తీసుకుని వస్తాను సరేనా అని కాన్ఫిడెంట్ గా చెప్పి నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఎక్కువ సేపు మాట్లాడితే మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతాడు అని అందరినీ తీసుకుని రేణుక ను అక్కడే ఉంచి బయటకు వచ్చేస్తాడు….. !!

మాయ కి ఎలా ఉందో చూద్దాం అని మాయ ఉన్న రూమ్ వైపు వెళ్తున్న మహిదర్ చెయ్ పట్టుకుని మహి నీతో మాట్లాడాలి కమ్ అంటూ మహిదర్ ను తీసుకుని ఇద్దరూ కార్ లో అందరికీ దూరంగా ఎవరు లేని ప్లేస్ కి వెళ్ళి కార్ నుండి దిగుతారు….. !!

అంకుల్ ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు అని ఆలోచిస్తూనే కార్ దిగిన మహిదర్ అందరూ హస్పిటల్ లో ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చాం అంకుల్ అంటూ ప్రతాప్ వర్మ ఎదురుగా నుంచుంటాడు….. !!

వినయ్ మాటలు విన్నావ్ కదా మహిదర్ జై మ్యారేజ్ తన కళ్ళ ముందు జరిగితే తప్పా వాడు నార్మల్ అయ్యేలా లేడు….. ?? ఇప్పుడు జై ను మ్యారేజ్ కి ఒప్పించడం నాకు పెద్ద విషయం కాదు వాడికి ఒక మంచి అమ్మాయిని వెతకడమే చాలా కష్టం….. !! వినయ్ ముందు వాడు డిప్రెస్డ్ అవ్వకూడదు అని అలా అంత నమ్మకంగా చెప్పానే కానీ జై గురించి తెలిసి ఏ అమ్మాయి ముందుకు వస్తుంది చెప్పు….. ??

అంకుల్ మీరు కూడా ఎందుకు ఇలా నెగటివ్ గా మాట్లాడుతున్నారు ….. ?? అయినా జై కి ఎమ్ తక్కువ చెప్పండి….. ?? వెతికితే ప్రతీ మనిషి లో ఒక లోపం ఉంటుంది ఎందుకంటే లోపం లేకపోతే వాడు మనిషే కాడు…… ?? జై ఇప్పుడు ఎలా ఉన్నాడన్నది కాదు ఫ్యూచర్ లో ఎలా ఉంటాడు అన్నది ఇంపార్టెంట్….. !! ఇప్పటి నుంచి జై మారడానికి ట్రై చేస్తే తను నిజంగా మరో సారి అటుగా వెళ్ళడు…… !! నేను చెప్తున్నా కదా జై ను పెళ్ళి చేసుకోవాలి అంటే ఆ అమ్మాయి అదృష్టం చేసుకుని ఉండాలి….. !! తప్పకుండా జై కి మంచి అమ్మాయిని వెతికి మరీ పెళ్లి చేద్దాం సరేనా…… ??

ఆ అమ్మాయి నీ కూతురు ఆద్య ఎందుకు అవ్వకూడదు మహిదర్….. ??

ప్రతాప్ వర్మ మాటలకు మహిదర్ షాక్ అవుతూ రెండు అడుగులు వెనక్కి వేస్తూ వాట్…. ?? ఆద్య నా…. !! ఎమ్ మాట్లాడుతున్నారు అంకుల్ అంటూ షాక్ అవుతాడు…… !!

ఆద్య లాంటి అమ్మాయి జై లైఫ్ లోకి వస్తేనే వాడి లైఫ్ బావుంటుంది….. !! నాకు గట్టి నమ్మకం ఉంది ఆధ్య అయితేనే జై ను మంచి దారిలో నడిపించగలదు అని పైగా మా అందరికీ ఆధ్య బాగా నచ్చింది….. !! ఇది నా కోరిక కూడా ఏమంటావ్ మహిదర్ అంటూ తన వైపు చూస్తూ ఉంటే క్షమించండి అంకుల్ నాకు ఇష్టం లేదు అంటూ ప్రతాప్ చేతుల్లో నుండి తన చేతిని వెనక్కి తీసుకోగానే అప్పటి వరకు నవ్వుతున్న ప్రతాప్ మొహం లో నవ్వు మాయం అవుతుంది ….. !!