Login with OTP

విలన్ హస్బెండ్-64

aashyatech

Author

క్షమించండి అంకుల్ నాకు ఇష్టం లేదు అంటూ ప్రతాప్ వర్మ చేతుల్లో నుండి తన చేతిని వెనక్కి తీసుకున్న మహిదర్ వైపు చూస్తున్న ప్రతాప్ వర్మ మొహం లో అప్పటి వరకు ఉన్న నవ్వు మాయం అవుతుంది….. !! మహిదర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అర్థం అయింది మహిదర్ నువ్వు కూడా అందరి ఫాదర్స్ లాగే అలోచిస్తూ క్యారెక్టర్ లేని నా మనవడిని నీ కూతురికి ఇచ్చి పెళ్ళి చేయడానికి ఇష్ట పడ్డం లేదు అంతే కదా అని పేలవంగా నవ్వుతూ….. !! ఇందులో నిన్ను నేను తప్పు పట్టడం లేదు మహిదర్ మా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది నువ్వు ఎందుకు వద్దు అంటున్నావో ఆ మాత్రం అర్థం చేసుకోగలను ఇట్స్ ఒకే వెళ్దాం పదా ఎలా జరగాలి అనుంటే అలానే జరుగుతుంది…… !!

అంకుల్ అంటూ ప్రతాప్ వర్మ చెయ్ పట్టుకుని ఆపేస్తూ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంకుల్….. !! జై కి క్యారెక్టర్ లేకపోవడం ఏంటి అంకుల్ ప్లీస్ ఇంకెప్పుడు జై ని తక్కువ చేయకండి వాడు బంగారం…… !! నేను వద్దు అన్నది జై అమ్మాయిలతో రిలేషన్ లో ఉంటాడని ఏమాత్రం కాదు …… !! జై కి ఆద్య అంటే ఇష్టం లేదు అలాగే ఆద్య కి కూడా జై అంటే నచ్చడు ఇన్ఫాక్ట్ ఆద్య కి పెళ్ళంటే ఇష్టం లేదు ఆ విషయం మీకు తెలుసా కదా….. !! ఇష్టం లేకుండా బలవంతంగా ఇద్దరికీ పెళ్లి ఎలా చేస్తాం చెప్పండి …. ?? అయినా వాళ్ళు ఈ పెళ్ళికి ససేమిరా ఒప్పుకోరు ఒకవేళ ఒప్పుకున్నా పెళ్లి తర్వాత కలిసుంటారు అన్న నమ్మకం నాకు లేదు….. !!

ఆద్య ను పెళ్ళి చేసుకుని జై బాధ పడ్డం కంటే ఈ పెళ్లి జరగక పోవడమే మంచిది….. !! జై కోసం మంచి అమ్మాయిని వెతికి మ్యారేజ్ చేద్దాం….. !! ట్రస్ట్ మీ అంకుల్ నేను ఆ ఉద్దేశం తో నాకు ఇష్టం లేదు అన్నాను కానీ మరో ఆలోచన నాకు లేదు….. !! వినయ్ నా ప్రాణం అంకుల్ అలాంటి నా ప్రాణ స్నేహితుడు వియ్యంకుడు అవ్వబోయే ఛాన్స్ నేను వదులుకుంటానా ….. ?? పిల్లల వల్ల మన మధ్య రిలేషన్ పెరగాలి కానీ దూరం అవ్వకూడదు అనే వద్దు అంటున్నా అంకుల్….. !!

మహిదర్ మాటలకు ప్రతాప్ ఆనందంగా నవ్వుతూ లోకం లో అందరూ పెళ్ళిళ్ళు ఇష్టపడే చేసుకుంటున్నారా మహిదర్…… ?? పెళ్లి అయ్యాక సిచుయేషన్స్ బట్టే వాళ్ళు కూడా మారుతారు….. !! అంత దాకా ఎందుకు మన వినయ్ కూడా రేణుక ను ఇష్టం లేకుండానే మన బలవంతం మీద మ్యారేజ్ చేసుకున్నాడు బట్ పెళ్లయ్యాక రేణుక తన మీద చూపిస్తున్న ప్రేమ కి వాడిలో మార్పు మొదలై మాయ కి తండ్రి అయ్యాడు….. !!

 

జై విషయం లో కూడా అదే జరుగుతుంది కాకపోతే కొంచెం టైమ్ పట్టొచ్చు అంతే నాకు పూర్తి నమ్మకం ఉంది మహిదర్ ఆద్య మాత్రమే జై ను పూర్తిగా మార్చగలదు అని అంటూ మహిదర్ చెయ్ పట్టుకుని నిన్ను ఒక సారి అడిగాను గుర్తుందా నాకు అవసరం అన్నప్పుడు ఒక హెల్ప్ అడుగుతాను అది నువ్వు చేయాలి అని ….. ?? అది ఇప్పుడు అడుగుతున్నా జై, ఆద్య ల పెళ్ళికి నువ్వు మనస్పూర్తిగా ఒప్పుకుని వినయ్ ను ఒప్పించు మహీదర్ అంటూ రిక్వెస్టింగ్ గా అడుగుతున్న ప్రతాప్ ను చూసి ఒప్పుకోక తప్పదు మహీదర్ కి దాంతో చిన్నగా నవ్వుతూనే తన ఆన్సర్ చెప్తాడు….. !!

మహిదర్ అంటూ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ మహీదర్ ను హగ్ చేసుకుంటూ ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది….. !! ఈ రోజు కోసమే నేను, మాయ చాలా డేస్ గా వెయిట్ చేస్తున్నాం అంటూ మహిదర్ కి దూరంగా జరిగి నీకు తెలుసా మహిదర్ ఆద్య ను ఎప్పుడైతే నా ఇంట్లో చూసానో అప్పుడే అనుకున్నాను ఎప్పటికైనా నా మనవడికి ఆద్య తోనే పెళ్లి జరిపించాలి అని ….. !! అందుకే జై కోసం ఎంతో మంది అమ్మాయిల ఫోటోస్ నాకు మ్యారేజ్ బ్రోకర్ చూపెట్టిన నాకు ఎవరు నచ్చలేదు….. !! ఆధ్య అయితేనే నా ఇంటిని ఇంట్లో వాళ్ళను మార్చగలదు అంటూ ఆనందంగా చెప్తాడు…. !!

ప్రతాప్ వర్మ మాటలకు ఆనందంగా ఉన్నా ఇప్పుడు ఆద్య ను పెళ్ళికి ఒప్పించడం తలకు మించిన భారం…. !! దాని గురించే అలోచిస్తూ ముందు ఈ విషయాన్ని వినయ్ కి చెప్పి ఒప్పించి కొంత వినయ్ పడుతున్న బాధ ను తగ్గించాలి అని ఇద్దరూ తిరిగి హస్పిటల్ కి స్టార్ట్ అవుతారు…… !!

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

హలో  శ్రియ ఎక్కడున్నావ్….. ?? నువ్వు ఎక్కడున్నా సరే ఇంకో గంటలో Aroma Avenue రెస్టారెంట్ కి వచ్చెయ్….. !! నేను నీ కోసం అక్కడ వెయిట్ చేస్తుంటాను నీతో అర్జంట్ గా మాట్లాడాలి అని అపర్ణ కాల్ కట్ చేసి వెంటనే శ్రియ కి చెప్పిన రెస్టారెంట్ కి స్టార్ట్ అవుతుంది….. !!

ఎందుకు ఇంత అర్జంట్ గా రెస్టారెంట్ కి రమ్మంది అని ఆలోచిస్తూనే అపర్ణ చెప్పిన టైమ్ కి రెస్టారెంట్ ముందు కార్ పార్క్ చేసి లోపలికి నడుస్తుంది శ్రియ….. !!

ఐ ఆమ్ హియర్ అని హ్యాండ్ రైస్ చేసిన అపర్ణ వైపు చూసి తన కోసమే వెతుకుతున్న శ్రియ డైరెక్ట్ గా వెళ్ళి తన ఎదురుగా కూర్చుంటూ చెప్పండి ఆంటీ దేనికి అంత అర్జంట్ గా పిలిచారు……. ??

ఇప్పుడేగా వచ్చావ్….. ?? ఎంటా తొందర….. ?? ముందు కూల్ గా ఈ కోల్డ్ కాఫీ తాగు అని తాను ఆర్డర్ చేసిన కాఫీ రాగానే ఒకటి శ్రియ వైపు నెడుతూ ఇంకోటి తను సిప్ చేస్తూ ఉంటుంది…. !!

 

కమాన్ ఆంటీ!! మీ అంత కూల్ గా నేను ఉండలేను….. !! అక్కడ ఎమ్ జరుగుతుందో ఏంటో అని తలచుకుంటేనే నాకు పిచ్చెక్కుతుంది…. !! ఎట్ ఎనీ కాస్ట్ రుద్ర్ నాకు కావాలి అని కోపంగా చెప్తున్న శ్రియ వైపు చూస్తూ హ్మ్మ్!! దాని గురించి చెప్పడానికే పిలిచాను…… !! ఈ అపర్ణ మాట ఇస్తే ఎప్పటికీ తప్పదు అంటూ తన హ్యాండ్ బ్యాగ్ నుండి ఒక ఫోటో తీసి టేబుల్ మీద శ్రియ ముందు పెడుతుంది….. !!

పర్పుల్ కలర్ శారీ లో చేతిలో బొకే పట్టుకుని నవ్వుతున్న మాయ ఫోటో వైపు చూస్తూ హు ఇస్ షి….. ?? అంటూ మాయ ఫోటో ను చేతిలోకి తీసుకుంటూ అడుగుతుంది….. !! రుద్ర ప్రేమిస్తున్న అమ్మాయి పేరు మాయ & నువ్వు అన్నది నిజమే ప్రెసెంట్ రుద్ర మాయ కోసమే ఇండియా వెళ్ళాడు & తన ఇంట్లోనే ఉంటున్నాడు….. !!

శ్రియ మాయ ఫోటో వైపు ఎర్రటి కళ్ళతో చూస్తూ దీని వల్లే నా రుద్ర్ నన్ను దూరం పెడుతున్నాడు అసలు ఇదే లేకపోతే రుద్ర్ ఎప్పటికైనా నా సొంతం అవుతాడు….. !! యస్ ఇది బ్రతికుండకూడదు అని ఫోటో వైపు కసిగా చూస్తూ అపర్ణ వైపు చూస్తుంది…. !!

నువ్వేం చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్లాన్ చెయ్ శ్రియ….. !! రుద్ర ఇండియా లోనే ఉన్నాడని మర్చిపోకు & మీ అంకుల్ ను మాటల్లో పెట్టి ఆ మాయ అడ్రస్ తెలుసుకున్నాను ఆయన కూడా మంచి మూడ్ లో ఉండి అడ్రస్ చెప్పారు లేదా చెప్పేవారు కాదు …… !! అంటూ మాయ అడ్రస్ కూడా శ్రియ మొబైల్ కి షేర్ చేస్తూ కేర్ఫుల్ అంటూ నువ్వు ఇండియా వెళ్లగానే 2 డేస్ లో నాకు గుడ్ న్యూస్ చెప్పాలి & ఎప్పటికైనా నువ్వే నా ఇంటికి కోడలు అవ్వాలి అందుకే ఈ రిస్క్ తీసుకున్నా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది….. !!

 

అపర్ణ వెళ్ళిపోయాక తప్పకుండా చెప్తాను ఆంటీ ఇప్పుడే ఇండియా కి స్టార్ట్ అవుతా అని ఇమ్మిడియట్ గా ఇండియా కి టికెట్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి తన డ్రెస్సెస్ తో పాటు తన లైసెన్స్ గన్ కూడా ప్యాక్ చేస్తూ నో!! దీన్ని తీసుకుని వెళ్తే ఎయిర్ పోర్ట్ లో ప్రాబ్లెమ్ అవుతుంది అని ఆలోచిస్తూ దాన్ని జాగ్రత్తగా తన వాడ్రాబ్ లోనే దాచి తన లగేజ్ ప్యాకింగ్ అవ్వగానే ఫ్రెష్ అయి ఎయిర్ పోర్ట్ కి స్టార్ట్ అవుతుంది…… !!

✨✨✨✨✨✨✨✨✨

అక్కా 🥹 !! అని మంజూష నాన్సీ బుజం మీద చేయి వేయగానే నాన్సీ చిన్నగా నవ్వి నేను బానే ఉన్నాను మంజు ఏడవకు అని మంజు కన్నీళ్ళు తుడుస్తూ జై దగ్గరకు నేను వచ్చాక తనే నాకు సపోర్టివ్ గా నిలబడ్డాడు….. !! నా ఫ్యామిలీ కి నేను దూరంగా ఉన్నా ఇవాళ నేను ఇలా నిల్చున్నా అంటే రీసన్ జై & నేను కంప్లీట్ గా క్యూర్ అయ్యాక వెంటనే ఊరికి వెళ్ళి నాన్న కి జరిగిన విషయం చెప్పాలి అనుకున్నా కానీ నాన్న వినే స్టేజ్ లో లేడు….. !!

నన్ను ఎన్ని మాటలు అన్నా పడ్డాను కానీ నేను చచ్చిపోయాను & తనకు ఉంది ఒక్క కూతురే అని ఎపుడైతే చెప్పాడో ఆ రోజు నిజంగా చచ్చిపోయాను….. !! ఏడుస్తున్న నన్ను అమ్మ లా అక్కున చేర్చుకుని నన్ను ఓదార్చి ఎప్పటికైనా మీ అందరూ కలుస్తారు అని ధైర్యం చెప్పాడు జై….. !! ఆ రోజు నుండి ఆ ఆశ తోనే బ్రతుకుతున్నా కానీ రోజు రోజుకు ఆ ఆశ పూర్తిగా చచ్చిపోతుంది….. !! నేను చచ్చిపోతే తప్పా నాన్న కి నా మీద కోపం తగ్గదు అనుకుంటా అని నేల మీద కు జారిపోయి మొహాన్ని చేతుల్లోకి దాచుకుని ఏడుస్తుంది నాన్సీ….. !!

ఎవరో తన తల మీద చెయ్ వేసి నిమురుతూ ఉన్నట్టు అనిపిస్తూ కళ్ళు పైకి ఎత్తి చూసిన నాన్సీ కి ఎదురుగా తన తండ్రి కన్నీళ్లతో కనిపించగానే షాక్ అవుతూ నా….. నాన్న అని పిలుస్తున్న నాన్సీ ముందు నీల్ డౌన్ చేసి కూర్చుంటూ నాన్సీ నన్ను క్షమించమ్మా !! అని అడుగుతున్న తండ్రిని చూసి నాన్సీ ఏడుస్తూ ఆయనను మరింత గట్టిగా హగ్ చేసుకుంటూ గుండెలో బరువు దిగి పోయే వరకూ ఏడుస్తూనే ఉంటుంది….. !! అది చూస్తున్న ముగ్గురు కన్నీళ్లతో చూస్తూ జై తమ ఇంటికి రావడం గుర్తు చేసుకుంటూ ఉంటారు…… !!

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

నెమ్మదిగా స్పృహ లోకి వచ్చిన మాయ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే తననే చూస్తూ కూర్చున్న ఆద్య, మాన్య తను కాన్షియస్ లోకి రావడం చూసి మాయ అంటూ నవ్వుతూ పిలుస్తూ చెరో వైపు కూర్చుంటారు…… !! మాయ ఆద్య వైపు చూస్తూ వదిన అంటూ సడెన్ గా వినయ్ గుర్తు రాగానే డాడీ అంటూ ఏడుస్తూ సెలైన్ పెట్టిన చేతికి ఉన్న నీడిల్ తీస్తూ డాడీ కి ఎలా ఉంది వదిన డాడీ ఎక్కడ….. ??

మాయ ఎమ్ చేస్తున్నావ్….. ?? కామ్ డౌన్ మాయ మామ కి ఎమ్ అవ్వలేదు అని బలవంతంగా మాయ ను బెడ్ మీద కూర్చో పెడుతూ హి ఈజ్ ఒకే నౌ….. !! రెస్ట్ తీసుకుంటున్నారు ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు అంతా బానే ఉంది అని చెప్తున్న ఆద్య వైపు చూసి నేను అర్జంట్ గా డాడీ ను చూడాలి ప్లీస్ నన్ను తీసుకుని వెళ్ళు వదిన అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అప్పుడే ఆ రూమ్ లోకి వస్తున్న అమర్ ను చూసి అన్నయ్య అంటూ ఏడుస్తూ పిలుస్తుంది….. !!

మాయ కామ్ డౌన్ రా అంకుల్ బానే ఉన్నాడు అని ప్రేమగా కన్నీళ్ళు తుడుస్తూ పదా నిన్ను అంకుల్ దగ్గరకు తీసుకుని వెళ్తాను అని మాయ ను వినయ్ రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు….. !! వినయ్ ను అలా బెడ్ మీద చూసిన మాయ ఏడుస్తూ డాడీ అని పిలవగానే మెల్లగా కళ్ళు తెరిచి మాయ….. ?? నాకేం కాలేదు ఏడవకు బంగారం అని మాయ కి ధైర్యం చెప్తూ మాట్లాడుతూ ఉండగా అపుడే మాస్క్ వేసుకున్న ఒక డాక్టర్ అక్కడి వచ్చి పేషెంట్ ను డిస్టర్బ్ చేయకండి…… !! జరా బయటకు నడవండి పేషెంట్ కి ఇంజెక్షన్ జేయాలి అని చెప్పగానే అమర్ మాయ ను తీసుకుని రూమ్ బయట ఉన్న చైర్ లో కూర్చుంటాడు….. !!

డాక్టర్ నన్ను ఎపుడు డిశ్చార్జ్ చేస్తారు….. ?? తన పాకెట్ లో ఉన్న ఇంజెక్షన్ తీస్తున్న డాక్టర్ వినయ్ వైపు చూస్తూ ఇంకో గంట లో శాశ్వతంగా డిశ్చార్జ్ చేస్తాం….. !! కళ్ళు మూసుకుని సప్పుడు సేయకుండా పడుకోండి అని చెప్తున్న డాక్టర్ వైపు డౌబ్ట్ గా చూస్తూ మీ లాంగ్వేజ్ ఏంటి డాక్టర్ అలా ఉంది & నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వాయిస్ కూడా ఇది కాదు అసలు ఎవరు మీరు….. ??

ఆ డాక్టర్ రౌండ్స్ కి పోయిండు అందుకే నేను వచ్చినా జరా నోరు బంద్ చేసి పడుకో అంటూ ఇంజెక్షన్ చేయబోతున్న డాక్టర్ చెయ్ పట్టుకుని మొహానికి వేసుకున్న మాస్క్ లాగేసిన వినయ్ షాక్ అవుతాడు….. !! మొహం నిండా కత్తి గాట్లు & గుబురుగా పెరిగిన గడ్డం, ఎర్రటి కళ్ళతో చూస్తేనే వామిట్ వచ్చేలా ఉన్న ఆ వ్యక్తి వైపు చూస్తూ ఏయ్ ఎవరు నువ్వు….. ?? నువ్వు డాక్టర్ కాదు నాకు తెలుసు ఎవర్రా నువ్వు అని అరుస్తున్న వినయ్ నుండి చేతులు విడిపించుకుంటూ చావబోయే ముందు నేను ఎవరో తెలుసుకుని ఎమ్ చేస్తావ్ బే ……. !! అంటూ నేను నిన్ను చంపడానికి వచ్చిన నీ మృత్యువుని అంటూ బలంగా తన చేతిలోని ఇంజెక్షన్ తీసుకుని వినయ్ మెడ దగ్గర ఇంజెక్ట్ చేయగానే బయట కూర్చున్న అమర్ వినయ్ అరుపు కి కంగారుగా లోపలికి వచ్చి ఎదురుగా కనిపించిన విజువల్ చూసి షాక్ అవుతాడు…… !!

 

నెక్స్ట్ అప్డేట్ లో స్టోరీ ఫినిష్ అవ్వబోతుంది అదే సీజన్ 1 …. !! మీరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు & మాకు కూడా మీ ఇంట్రెస్ట్ చూసి చాలా బాధగా ఉంది….. !! చాలా ఎక్స్పెక్టేషన్స్ తో మేము దీన్ని స్టార్ట్ చేశాం….. !! బట్ మీరు కొంచెం కూడా దీని వైపు చూడ్డం లేదు వ్యూస్, కామెంట్స్, హైప్ ఏవీ కూడా లేవు 🥹 ….. !! ఇక ఎలా రాయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి…. ?? అందుకే నెక్స్ట్ ఎపిసోడ్ తో దీన్ని ఆపేయాలి అని ఫిక్స్ అయ్యాం…. !! మీ ఎంకరేజ్మెంట్ చూసి మాకు జోష్ రావాలి కానీ నీరసం కాదు