విలన్ హస్బెండ్ {2} -1
అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుందక్కడ 🥁🥁!! ఆకాశమంత పందిరి భూదేవి అంత మండపం అని అంటూ ఉంటారు కదా ……. !! దానికి ఏమాత్రం తీసుకోకుండా వైభవంగా పెళ్లి జరుగుతూ ఉంది…. !! ఒక పెద్ద కళ్యాణ మండలం & ఆ మండపం చుట్టూ బంధువుల రాకపోకలతో చాలా సందడిగా కళ కళలాడుతూ ఉంది…… !!
జరుగుతున్న పెళ్లిని చూడ్డానికి బిజినెస్ మ్యాగ్నెట్స్ , పొలిటీషియన్స్ , యాక్టర్స్, క్రికెటర్స్ దగ్గర నుండి ఎంతో మంది పేరున్న ప్రముఖులు మ్యారేజ్ కి అటెండ్ అయ్యి…… !! ఫస్ట్ రో లో కూర్చుని జరిగే పెళ్లి ను అబ్బురంగా చూస్తున్నారు ఎందుకంటే అంత గ్రాండ్ గా జరుగుతుంది అక్కడి వెడ్డింగ్ & అక్కడి అరేంజ్మెంట్స్ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు కళ్ళు జిగేల్ మంటున్న లైట్స్ & మండపం డెకరేషన్, ఫుడ్ ఎవ్రీ థింగ్ చాలా గ్రాండ్ గా ఉంది….. !!
నార్మల్ పీపుల్ ఆ వెడ్డింగ్ చూడ్డానికి అలో లేదు….. !! ఎందుకంటే వెడ్డింగ్ చాలా రిచ్ గా వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంటేనే సెక్యూరిటీ లోపలికి ఎలో చేస్తున్నారు…… !! అక్కడ ఎవరిని చూసిన కాస్ట్లీ పట్టు చీరల్లో దగ దగ మెరిసిపోతూ గోల్డ్, ప్లాటినమ్ జ్యువలరీ వేసుకుని జిగేల్ మంటున్న వాళ్ళ జ్యువెలరీ తో అందంగా రెడీ అయ్యి అటు ఇటు సందడిగా తిరుగుతున్నారు …… !!
( వెయిట్ వెయిట్ మేము జై ❤️ ఆధ్య స్టోరీ గురించి చూస్తుంటే మీరేంటి ఇంకేదో కొత్త స్టోరీ గురించి చెప్తున్నారు అనే కదా మీ డౌబ్ట్….. ?? అసలు డౌబ్ట్ పడకండి ఎందుకంటే ఇది మీరు వెయిట్ చేస్తున్న స్టోరీ నే ముందు ముందు మీకే అర్థం అవుతుంది….. !! లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ 😌 )
వెడ్డింగ్ హాల్ ఎంట్రెన్స్ లో జై ధీర్ వర్మ వెడ్స్ ఆధ్య అన్న అందమైన నేమ్ బోర్డ్ వైపు చూస్తూ ఒక్కొక్కరు మ్యారేజ్ జరుగుతున్న వెడ్డింగ్ వెన్యూ లోకి వెళ్తూ ఉంటే …… !! ఎంట్రెన్స్ లో నుంచుని మ్యారేజ్ కి వస్తున్న గెస్ట్స్ కి నవ్వుతూ వెల్కమ్ చెప్తున్నారు మహిదర్, శైలు & వినయ్, రేణుక ( ఈవిడ పైకి నవ్వుతున్న లోపల ఉడికిపోతోంది ఎందుకో మరీ 😜) ……. !!
ప్రతాప్ వర్మ రాయల్ చైర్ లో కూర్చుని అందరితో మాట్లాడుతూ జరుగుతున్న పెళ్లిని ఎంతో సంతోషంగా చూస్తున్నాడు….. !! ఈ పెళ్లి జరుగుతున్నందుకు ఈ మినిట్ అందరి కంటే ఎక్కువ సంతోషంగా ఉంది ప్రతాప్ వర్మ మాత్రమే….. !!
ఇక్కడ ఇంత జరుగుతుంటే పెళ్లి కొడుకు, పెళ్ళి కూతురు ఎమ్ చేస్తున్నారో చూద్దాం పదండి 🥱!! ముందు ఎవరి దగ్గరకు వెళ్దాం 🤔🤔 సరే ఎపుడు లేడీస్ ఫస్ట్ అంటారు కదా మనం అచ్చు కొత్తగా ఫస్ట్ జెంట్స్ రూమ్ వైపు వెళ్దాం పదండి….. !!
మిర్రర్ ముందు నుంచుని హెయిర్ సెట్ చేసుకుంటున్న జై సీ గ్రీన్ కలర్ షెర్వాణి లో మగసిరి ఉట్టిపడేలా చూడగానే చూపు తిప్పుకోనంత అందంగా కనిపిస్తున్న జై ను చూసి అక్కడున్న తన ఫ్రెండ్స్ కూడా చూపు తిప్పుకోలేక పోతున్నారు….. !!
అందరూ తన అన్నయ్య వైపు చూపు కూడా తిప్పకుండా చూడ్డం చూసిన మాయ….. !! హు 😏 అన్నయ్య వీళ్ళందరి దిష్టి మొత్తం నీకు తగిలేలా ఉంది ఆగు అంటూ ….. !! జై బుగ్గన దిష్టి చుక్క పెడుతూ మా అన్నయ్య నిజంగా గ్రీకువీరుడే అని జై బుగ్గన ముద్దు పెడుతూ….. !! అమర్ అన్నయ్య ఆ బాసికం ఇటివ్వు అని జై బుజాలు పట్టుకొని మిర్రర్ ముందు కూర్చో బెట్టి …… !! నుదుటిన బాసికం కడుతూ చాలా బావున్నావ్ అన్నయ్య ఇన్నాళ్ల నా కళ ఇవాల్టితో ఫుల్ ఫిల్ అవ్వబోతుంది రియల్లీ వెరీ హ్యాపీ అంటూ జై మెడ చుట్టూ చేతులు వేస్తూ ముద్దుగా చెప్తుంది….. !!
జై మిర్రర్ లో కనిపిస్తున్న మాయ హ్యాపీనెస్ చూస్తూ నువ్వు హ్యాపీగా ఉన్నావ్ కదరా నాకు అది చాలు…… !! అని చెప్పి సైలెంట్ గా అక్కడి నుండి బాల్కనీ లోకి వెళ్ళడం చూసిన మాయ కి జై లోపల ఎంత సంఘర్షణ జరుగుతుందో తెలుస్తున్నా….. !! ఇప్పుడు తను జై గురించి ఆలోచించి బ్యాక్ స్టెప్ వేస్తే జై లైఫ్ ఎప్పటికీ తను అనుకున్నట్టు ఉండదు అని భారంగా నిట్టూర్చి అన్నయ్య …… !! జై అన్నయ్య ను చూసుకో అని లేహంగా ను రెండు చేతులతో పట్టుకుని ఆద్య ఉన్న రూమ్ వైపు వెళ్లబోతుంది….. !!
✨✨✨✨✨✨✨✨✨
ఆ లేహంగా చాలా బరువుగా ఉండడం తో రెండు చేతులతో పట్టుకుని నడుస్తున్న మాయ కి ఎవరో అడ్డుగా నుంచుని తనను వెళ్లనివ్వకుండా చేస్తూ ఉంటే…… ?? వాట్ ద హె …. అని కోపంగా అరవబోతూ ఎదురుగా కనిపించిన రుద్ర ను నవ్వుతూ చూస్తూ నువ్వా తప్పుకో అంటూ వస్తున్న నవ్వు ను దాచేసి మొహాన్ని నార్మల్ గా పెట్టుకుంటుంది….. !!
ఏంటి మేడం చాలా హ్యాపీగా ఉన్నారు & ఫేస్ కూడా వెలిగిపోతోంది ఏంటి మ్యాటర్ అంటూ కళ్ళు ఎగరేస్తూ అడుగుతున్న రుద్ర ను చూసి ….. !! మా అన్నయ్య పెళ్లి జరుగుతుంటే ఆ మాత్రం హ్యాపీగా ఉండదా ముందు నువ్వు తప్పుకో నేను స్ట్రేంజర్స్ తో అసలు మాట్లాడను 😏 !!
ఏంటి నేను స్ట్రేంజర్ ఆ …. ??
అవును ఆర్యన్ గారు మీరు మా అన్నయ్య బిసినెస్ పాట్నర్ అంతే కదా….. !! మీకు నాకు పరిచయం తక్కువే కదా ఆర్యన్ గారు …… !!
కావాలనే ఆడుకుంటున్నావ్ కదా ఆగవే నీ పని చెప్తా అని మాయ నడుము పట్టుకుని పక్క రూమ్ లోకి ఎత్తుకుని వెళ్ళి తనను వాల్ కి లాక్ చేసి….. !! ఇప్పుడు చెప్పు పొట్టి నేను నీకేం కానా అని సూటిగా చూస్తూ అడుగుతున్న రుద్ర ను చూసి మొహాన్ని పక్కకు తిప్పుకుని సైలెంట్ గా ఉంటుంది….. !!
మాయ ఫేస్ ను తన వైపు తిప్పుకుంటూ నీ సైలెన్స్ నాకు అన్సర్ కాదు చెప్పు నేను నీకు స్ట్రేంజర్ ఆ…… ??
అవును నువ్వు నాకు స్ట్రేంజర్ నే 😏 అలాగే కదా నాకు పరిచయం అయ్యావ్ … ??
అచ్ఛా అలా వచ్చావా సరే అయితే వెళ్ళిపోనా మళ్ళీ….. ?? ఇదిగో చెప్తున్నా ఇప్పుడు వెళ్తే మాత్రం మళ్ళీ తిరిగి రాను ఆలోచించుకుని చెప్పు….. ??
నాకు నువ్వు అక్కర్లేదు వెళ్ళు అంటూ రుద్ర ను గాలి కూడా దూరడానికి వీలు లేనంతగా గట్టిగా చుట్టేస్తూ ఐ హేట్ యూ 💔 బట్ ఐ లవ్ యు అంటూ క్యూట్ గా చెప్తున్న…… !! మాయ మొహాన్ని రెండు చేతులతో పట్టుకుని కళ్ళ నుండి జాలు వారుతున్న కన్నీటిని తుడుస్తూ పొట్టి లుక్ ఎట్ మై ఐస్….. !!
కళ్ళు మూసుకుని ఉన్న మాయ నెమ్మదిగా కళ్ళు తెరవగానే నిన్ను నన్ను చావు కూడా దూరం చేయలేదు లవ్ యూ పొట్టి ❤️❤️ అంటూ రుద్ర మాయ ను కిస్ చేయబోతూ ఉండగా….. !! మాయ అంటూ పిలుస్తున్న మాన్య వాయిస్ కి రుద్ర ను పక్కకు తోసి ఇన్నాళ్ళు నువ్వు ఎవరో చెప్పకుండా నన్ను ఏడిపించావు కదా ఇట్స్ మై టర్న్ అంటూ …… !! నవ్వుకుంటూ వెళ్ళిపోతున్న మాయ ను చూసి ఆగవే పొట్టిదానా అని తనను పట్టుకోవడానికి వస్తున్న రుద్ర ను చూసి పరుగు అందుకుంటుంది మాయ…. !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
వదిన అంటూ అందంగా నవ్వుతూ ఆద్య రూమ్ కి వచ్చిన మాయ కి గోల్డ్ కలర్ శారీ లో డైమండ్ జ్యువలరీ తో బంగారు బొమ్మ లా కూర్చున్న ఆద్య ను చూసి వావ్ అనుకోకుండా ఉండలేకపోయింది…… !!
ఓహ్ మై గాడ్ వదిన యూ ఆర్ లుకింగ్ గార్జియస్ & సో ప్రెట్టీ వదినా అంటూ ఆద్య ను హగ్ చేసుకుంటూ నవ్వుతూ చెప్పగానే ఆద్య కూడా చిన్న స్మైల్ ఇచ్చి రెడీ అవుతూ ఉంటుంది…… !! మాన్య ఆ చోకర్ కూడా వేయ్ & ఆ లిప్స్టిక్ ఇటివ్వు ఇది చాలా డల్ గా కనిపిస్తుంది….. !! అని మిర్రర్ లో తనను చూసుకుంటూ ఏంటో ఈ వడ్డాణం జారిపోతుందే కొంచెం సెట్ చెయ్ అంటూ మిర్రర్ లో చూసుకుని…… !! ఇంకొంచెం తన అందానికి మెరుగులు దిద్దుకుంటున్న ఆద్య ను చూసి మాయ & మాన్య ఒకరిని ఒకరు చూసుకుంటారు….. !!
ఎంటలా చూస్తున్నారు టైమ్ అవుతోంది క్విక్ అంటూ తొందర పెడుతున్న ఆద్య ను చూసి….. !! హా అంటూ అక్కడున్న అమ్మాయిలు ఆద్య ను కంప్లీట్ గా రెడీ చేస్తూ ఉంటారు…. !! అమ్ము రెడీ అయ్యావా అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన శైలు కూతురిని చూసి మెటికలు విరుస్తూ బంగారు బొమ్మ లా ఉన్నావ్ అమ్ము అంటూ నుదుటిన కిస్ చెయ్యగానే ఆధ్య అందంగా నవ్వుతూ సిగ్గు పడుతుంది….. !!
ఇది ఎమ్ చేస్తుంది అసలు….. ?? జై అంటే చాలు ఒంటి కాలు మీద లేచేది అలాంటిది తనతో మ్యారేజ్ కి ఒప్పుకోవడమే షాక్ అనుకుంటే…… ?? ఇంత హ్యాపీగా పెళ్లి కి ఎలా రెడీ అవుతుందో తెలియట్లేదు….. !! అసలు ఆద్య బ్రెయిన్ లో ఎమ్ రన్ అవుతుంది….. ?? ఇలా ఆలోచిస్తూ బొమ్మ లా నుంచుని ఉంటుంది మాన్య……. !!
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
మండపం నిండా హడావిడి అందమైన పూలతో రక రకాల లైట్స్ తో ఆ మండపాన్ని అత్యద్భుతంగా డెకరేట్ చేశారు….. !! పూల సువాసన, దీపాల వెలుగు & చుట్టాల నవ్వులతో మండపం కళ కళ లాడుతూ ఎంతో అందంగా ఉంది….. !! అప్పుడే పురోహితుడు పెళ్ళి కుమారుడిని తీసుకుని రండి అని పిలవగానే సీ గ్రీన్ కలర్ షెర్వాణి లో ఒక రాజ కుమారుడిలా మండపం లోకి అడుగు పెట్టాడు జై….. !!
జై మండపం లోకి రాగానే అక్కడున్న అన్ని కెమెరాస్ జై మీద ఫోకస్ చేశాయి…. !! కెమరాస్ క్లిక్ మనిపిస్తూ ఉంటే ఆ ఫ్లాష్ జై మీద పడి అందరి కళ్ళకు జై మరింత అందంగా కనిపిస్తున్నాడు …… !! జై ఆ షెర్వాణి లో కొత్తగా కనిపించడమే కాకుండా ప్రతీ అడుగులో ఎప్పటిలా గర్వం కాకుండా ఇంకేదో కొత్త అందం కనిపిస్తుంది…… !!
జై ను అలా చూసిన వినయ్ ఎంతో సంతోషంగా ప్రతాప్ వర్మ వైపు చూస్తే ప్రతాప్ వర్మ నవ్వుతూ వినయ్ చెయ్ పట్టుకుని తన హ్యాపీనెస్ తెలియచేస్తాడు ….. !! జై వెళ్ళి మండపం లో కూర్చున్న తర్వాత తనతో చేయించాల్సిన పూజ చేయించి అడ్డు తెర పెట్టాక ఆధ్య ను తీసుకుని వస్తారు….. !! అందమైన పుత్తడి బొమ్మ లా మండపం లోకి చిరు నవ్వుతో అడుగు పెట్టిన ఆధ్య తన ప్లేస్ లో కూర్చుని తన ఫాదర్ వైపు చూస్తుంది….. !!
ఎంతో సంతోషంగా కనిపిస్తున్న మహిదర్ ఫేస్ ను చూసి మిగిలిన రెచువల్స్ కంప్లీట్ చేస్తుంది….. !! మాంగల్య ధారణ కానివ్వండి అని పసుపు తాడు జై చేతిలో పెట్టగానే జై దాన్ని తీసుకొని పైకి లేచి అందరూ చూస్తూ ఉండగా ఆద్య మెడలో మూడు ముళ్ళు వేసి తనను భార్యగా చేసుకుంటాడు….. !!
అది చూసిన మాయ, రుద్ర ఆనందంగా అక్షింతలు ఇద్దరి మీద కురిపిస్తూ వస్తున్న హ్యాపీ టియర్స్ తుడుచుకుంటారు….. !! దీని తర్వాత కంప్లీట్ చేయాల్సినవి కూడా ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ వచ్చిన గెస్ట్స్ తో ఫోటోస్ కి ఫోజ్ ఇస్తూ ఉంటే…. !! మండపం మొత్తం హడావిడిగా అటు ఇటు తిరుగుతూ అన్ని దగ్గరుండి చేస్తూ ఉంటుంది మాయ…. !!
చేతిలో గిఫ్ట్ ప్యాక్ పట్టుకుని మండపం మీదకు వస్తున్న నాన్సీ ను చూసిన మాయ అసహనంగా కిందకు వెళ్ళి నాన్సీ చెయ్ పట్టుకుని తనను పక్కకు తీసుకుని వెళుతుంది…. !!
నీకసలు బుద్దుందా….. !! నిన్ను మా అన్నయ్య రూమ్ వైపు వెళ్తూ ఉంటే చూసి నిన్ను ఇక్కడి నుండి బయటకు వెళ్ళిపోమని చెప్తే ఇంకా సిగ్గులేకుండా ఇక్కడే తిరుగుతున్నావా …. ??
మాయ నువ్వు అనుకున్నట్టు కాదు నేను జై గుడ్ ఫ్రెండ్స్ యాక్చుయల్లీ నేను జై కి కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను…. !! నీకు ఇంకా నమ్మకం కుదరక పోతే అమర్ ను అడుగు….. !!
జస్ట్ షట్ అప్ ఇంకొక మాట మాట్లాడితే నేను నోటి తో కాదు చేత్తో అన్సర్ చెప్తాను….. !! ఇపుడిపుడే మీ లాంటి దరిద్రాలను వదిలేసి మా అన్నయ్య వదిన తో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని మీ అందరి నుండి మూవ్ ఆన్ అయ్యాడు….. !! మళ్ళీ మీరు అన్నయ్య లైఫ్ లోకి వచ్చి తనను డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకోను చెప్తున్నా
మాయ నేను చెప్పేది ఒక సారి విను….. ??
ఇంత చెప్పినా నాతో వాదిస్తావ్ ఏంటి వెళ్తావా సెక్యూరిటీ తో గెంటించనా …… ??
సీరియస్ గా ఉన్న మాయ మొహాన్ని చూసి తన వల్ల వాళ్ళ హ్యాపీనెస్ స్పాయిల్ అవ్వడం ఇష్టం లేని నాన్సీ ఒకే నేను వెళ్ళిపోతాను….. !! ఎట్ లీస్ట్ ఈ గిఫ్ట్ అయినా జై కి ఇవ్వు అని చెప్పి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను జై కి మంచి ఫ్రెండ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాన్సీ….. !!
నీ లాంటి వాళ్ళను చాలా మందిని చూసాను అని నాన్సీ గిఫ్ట్ బాక్స్ ను కోపంగా విసిరేసి అక్కడి నుంచి మండపం లోకి వెళ్ళి అందరితో పాటు నవ్వుతూ ఫోటోస్ కి పోస్ ఇచ్చేసి అందరూ కాసేపటికి జై మ్యాన్షన్ కి స్టార్ట్ అవుతారు….. !!
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
అమర్ డ్రైవ్ చేస్తుంటే పక్కన మాన్య వెనుక
జై ❤️ ఆద్య కూర్చున్నారు….. !! కార్ మొత్తం చాలా సైలెంట్ గా ఉంది ఎందుకంటే ఒకరి మనసులో ఎమ్ రన్ అవుతుందో మరొకరికి తెలియదు….. !! అలా నలుగురు ఆలోచనలతోనే మాన్షన్ కి రీచ్ అవుతారు….. !!
అరే ఆగండాగండి అలాగే వచ్చేస్తారా అంటూ మాయ గుమ్మం దగ్గర వీళ్ళను ఆపేసి ఇద్దరికీ దిష్టి తీస్తుంది…… !! ఇప్పుడు రావచ్చా అంటూ విసుగ్గా అడుగుతాడు జై ఎందుకంటే అప్పటికే జై లో విసుగు, చిరాకు & కోపం అన్ని వచ్చేశాయి …… !! అందుకే అప్పటి వరకు మొహం లో చిరు నవ్వు నటిస్తున్న జై ఇక యాక్ట్ చేయలేక పోయాడు…… !!
అప్పుడే కాదు అన్నయ్య ఇంకా చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే ఇద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పి లోపలికి రావాలి సో అన్నయ్య నువ్వే ఫస్ట్ నీతో పాటు మన ఇంటికి ఎవరిని తీసుకుని వచ్చావో చెప్పు….. ??
మీ అందరికీ తనకు తెలుసు కదా మాయ….. ??
అయినా చెప్పాలి అన్నయ్య కమాన్ చెప్పు అంటూ అందరూ కూడా చెప్పాలి లేకపోతే ఇంట్లోకి ఎలో లేదు అని గట్టిగా చెప్తారు….. !! ఉఫ్ ఒకే ఫైన్ నేను ఆద్య కలిసి వచ్చాం ఇక లోపలికి రావచ్చా….. ??
ఆధ్య నా…. ?? ఆధ్య అంటే ఎవరు అన్నయ్య…. ?? నేను నీ సిస్టర్ & మామ్, డాడ్, తాతయ్య ఇలా అందరికీ నీతో ఒక రిలేషన్ ఉంది మరి ఆద్య తో నీ రిలేషన్ ఏంటి….. ??
నేను నా భార్య ఆద్య కలిసి వచ్చాం శాటిస్ఫైడ్ ఆ….. ??
మా మంచి అన్నయ్య అని నవ్వుతూ వదిన ఇప్పుడు నువ్వు చెప్పాలి….. ??
వదిలేయ్ మాయ పాపం వాళ్ళ ఫేసెస్ చూడు మ్యారేజ్ లో బాగా టైడ్ అయిపోయారు….. ??
నథింగ్ డూయింగ్ వాళ్ళు నేమ్స్ చెప్పే రావాలి అని మాయ చెప్పేసరికి నేను మా ఆయన జై దీర్ వచ్చాం అని కొంచెం సిగ్గు పడుతూ చెప్పిన ఆధ్య వైపు జై తల తిప్పగానే ఆధ్య కూడా అదే టైమ్ కి జై వైపు చూస్తుంది….. !! కాసేపు ఇద్దరి చూపులు అలాగే లాక్ అవుతాయి పక్క నుండి వినిపించిన నవ్వులు విని ఇద్దరూ తలలు తిప్పుకుంటారు….. !!
వెరీ గుడ్ ఇప్పుడు లాస్ట్ వన్ అదేంటంటే అన్నయ్య నువ్వు మై డార్లింగ్ వదిన ను రెండు చేతులతో ఎత్తుకుని ఇంట్లోకి అడుగు పెట్టాలి అనగానే అందరూ ఓ ఓ ఓ….. అంటూ గట్టిగా క్లాప్స్ కొడుతూ నవ్వుతారు….. !?
నా వల్ల కాదు ముందు నువ్వు తప్పుకో అని జై కోపంగా చెప్పినా మాయ వినకపోయేసరికి జై సడెన్ గా ఆధ్య ను గాల్లోకి లేపి రెండు చేతులతో లిఫ్ట్ చేసి ఎత్తుకుని ఇంట్లోకి అడుగు పెడతాడు….. !!
ఆధ్య జై వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే జై ఆద్య ను దేవుడి గది ముందు దించాక ఇద్దరూ దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుని హాల్ లోకి వస్తారు….. !! జై ను ఫ్రెష్ అవ్వమని తన రూమ్ కి పంపేసి ఆద్య ను కూడా మరో రూమ్ లో ఫ్రెష్ అవ్వమని చెప్పి పెద్దవాళ్ళు ఈవెనింగ్ జరగబోతున్న సత్యనారాయణ స్వామి వ్రతం కి ఎరేంజ్మెంట్స్ చేస్తుంటారు…… !!
రూమ్ లోకి వెళ్ళిన జై అసహనంగా కౌచ్ లో కూర్చుంటాడు తన కళ్ళ ముందు ఏవేవో విజువల్స్ కనిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసి మెడలో ఉన్న పూల దండలు విసిరి కొట్టగానే అప్పుడే అక్కడికి వస్తున్న అమర్ వాటిని పట్టుకుని జై వైపు చూస్తాడు….. !!
ఎవరి మీద జై ఈ కోపం అయినా ఇప్పుడేం జరిగిందని అంత కోపంగా ఉన్నావ్….. ?? ఇష్టపడే కదా ఈ పెళ్లి చేసుకుంటున్నావ్…. ??
డోంట్ ఇరిటేట్ మీ అమర్ చాలా చిరాగ్గా ఉంది లీవ్ మీ ఎలోన్ ….. ??
అరెహ్ నీ కోపానికి రీసన్ చెప్పరా అంటే చిరాగ్గా ఉంది అంటావేంటి అసలేం అయిందని ఈ కోపం అని అడుగుతూ ఉండగా ఆ రూమ్ లోకి వస్తాడు మహీదర్….. ??
మహిదర్ ను చూసి ఇద్దరూ మాటలు ఆపి పైకి లేచి నుంచుంటే జై ఈవెనింగ్ వ్రతం ఉంది….. !! నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో & అమర్ నువ్వు నాతో రా కొన్ని అరేంజ్మెంట్స్ చూడాలి అని నవ్వుతూ చెప్పి వెళ్తున్న మహిదర్ ను పిలుస్తాడు జై….. ??
ఏంటి జై ఏమైనా కావాలా….. ??
మావయ్య మీకు మ్యారేజ్ కి ముందే నా గురించి చెప్పడానికి ట్రై చేసాను ….. !! బట్ నేను మాట్లాడాలి అనుకున్న ప్రతీ సారి ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేశారు….. !! ఇప్పుడు కూడా చెప్పక పోతే నాలో గిల్ట్ ఫీల్ ఎక్కువవుతుంది….. !!
జై ఇప్పుడు అవన్నీ ఎందుకు రా అని అమర్ కంగారుగా జై చెయ్ పట్టుకుని వద్దు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తాడు…. !?
జై అమర్ మాటలు పట్టించుకోకుండా మావయ్య నా పాస్ట్ గురించి మీకు చెప్పాలి ….. !! నా పాస్ట్ లో నాకు చాలా మంది అమ్మా…… ?? అని చెప్పకముందే
జై నీకోటి చెప్పనా వజ్రం మట్టిలో పడినా దానికి ఉన్న విలువ తగ్గదు …… !! నువ్వు కూడా అంతే జై నా దృష్టిలో నువ్వు చాలా గొప్ప వ్యక్తి వి అని నవ్వుతూ బుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతున్న మహీదర్ ను చూసి అమర్ హ్యాపీగా ఫీల్ అయితే మరి జై ….. !?
Continues ❤️☺️!!
సీజన్ 1 లో మీ రెస్పాన్స్ చూసి మేము చాలా అప్సెట్ అయ్యాం ఇప్పుడే దీన్నీ మళ్ళీ తీసుకుని రావాలి అనుకోలేదు…… !! బట్ మీలో చాలా మంది డెయిలీ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు అందుకే సెకండ్ సీజన్ ను ఇలా మీ ముందుకు తీసుకు వచ్చాం….. !! ఎట్ లీస్ట్ దీన్ని అయినా మా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా రీచ్ తీసుకుని వస్తారు అని ఆశిస్తున్నాం….. !!