Login with OTP

విలన్ హస్బెండ్{2} -11

aashyatech

Author

ఆద్య వైపు చూసి కేర్ఫుల్ అని తన చెయ్ వదులుతూ రేణుక కోసం చూసిన జై కి రేణుక కింద పడి నడుము విరగ్గొట్టుకుని ఏడుస్తూ కనిపిస్తుంది….. !! అయ్యో మామ్ ఏంటి అలా పడిపోయావ్….. ?? అని రేణుక ను కష్టంగా పైకి లేపుతూ అడుగుతున్న జై వైపు సీరియస్ గా చూస్తూ….. !! నీ పెళ్ళాన్ని పట్టుకోబోతూ తల్లిని కిందకు వదిలేశావ్ కదా నాన్న అందుకు కింద పడి ఏడుస్తున్నా ….. ?! అని పళ్ళు నూరుతూ చెప్తున్న రేణుక ను చూసి ఆద్య నవ్వుతూ ఉంటే జై కి ఎమ్ ఆన్సర్ ఇవ్వాలో అర్థం అవ్వదు….. !?

సారీ మామ్ ఆద్య ను పట్టుకోబోతూ నిన్ను వదిలేసా కేర్ఫుల్ అంటూ రేణుక బుజం చుట్టూ చేతులు వేస్తూ….. !! మెల్లగా నడువు పవర్ కూడా లేదు కదా లిఫ్ట్ లో వెళ్ళడానికి నెమ్మదిగా నడువు స్టెప్స్ ఉన్నాయి అంటూ ఆద్య ఫ్లాష్ ఆన్ చెయ్….. !!

యాహ్ ఒకే అంటూ ఆద్య ఫ్లాష్ ఆన్ చేయగానే జై ఆ వెలుగులో రేణుక ను జాగ్రత్తగా ఒక్కో స్టెప్ ఎక్కిస్తూ మొత్తానికి టెర్రస్ మీదకు తీసుకుని వస్తాడు…. !! డోర్ దగ్గర వెయిట్ చేస్తున్న రుద్ర & అమర్ చమట పట్టిన జై మొహాన్ని చూస్తూ వాళ్ళు రేణుక ను పట్టుకుని జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్తుంటే….. !! గాడ్ మామ్ ఏంటీ ఇంత ఓవర్ వెయిట్ ఉంది అని నడుము స్ట్రెచ్ చేస్తూ అలాగే మెడ ను వెనక్కి బెండ్ చేస్తూ ఉంటే ….. !!

 

ఆద్య అపుడే అక్కడికి వచ్చి ఏయ్ స్టాప్ అంటూ జై నడుము పట్టుకుని నీతో పాటు వెనకున్న నన్ను కూడా పడేసేలా ఉన్నావ్ ….. !! అంటూ జై వైపు చూస్తుంది సరిగ్గా అప్పుడే జై కూడా ఆద్య వైపు చూస్తాడు ….. !! అలా ఇద్దరి కళ్ళు ఆ చీకట్లో కూడా చందమామ వెలుగులో ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు…. !!

 

మామ్ కేర్ఫుల్ అంటూ రేణుక కోసం అరేంజ్ చేసిన మెత్తటి బెడ్ మీద తనను జాగ్రత్తగా పడుకోపెడుతూ……. !! రేణుక పడుకున్న తర్వాత మామ్ డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చాడు వేసుకో అంటూ మాన్య, అమర్ హెల్ప్ తో రేణుక కి టాబ్లెట్స్ ఇచ్చి పడుకో మామ్…. !! నేను పక్కనే ఉంటాను ఏమైనా నీడ్ ఉంటే పిలువు ఒక్కటే ఎటు వెళ్ళకు అంటూ రేణుక పక్కనే పడుకుంటుంది….. !!

బాడీ అంతా ఫుల్ పెయిన్స్ ఇరగ్గొట్టేశాడు వీడు అని రుద్ర వైపు కోపంగా చూస్తూ మెడ తిప్పి చూసిన రేణుక కి ఆద్య & జై పొజిషన్ చూసి….. !! చిచీ వీళ్ళను తిట్టి నాకు నోరు పడిపోతుంది తప్పా వీళ్ళు మారేలా లేరు అని ఇద్దరి వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది…. !!

 

 

టెర్రస్ చుట్టూ ఎంత గోల ఉన్నా…… ఇద్దరికీ ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినిపిస్తూ ఉంది…… !! నోటితో చెప్పలేని ఎన్నో మాటలను కళ్ళతో చెప్పుకుంటూ ఉండిపోయారు….. !! ఇద్దరి మధ్య  “మాటలు ఏవీ లేవు… కానీ వాళ్ల చూపుల్లో ఎన్నో వేల కథలు తిరుగుతున్నాయి……!!”

 

“టెర్రస్ మీద ఫ్యామిలీ మొత్తం అందరూ ఉన్నా…… !! వాళ్ల మధ్య నిశ్శబ్దం మాత్రమే మాట్లాడుతోంది………..!! జై కళ్ళు ఆధ్య ను పట్టుకుని ఆ చూపుల్లోని బావాలు వెతుకుతూ ఉంటే ఆద్య చూపుకు జై గుండెల్లో దాగిపోయాయి…… !! అలా  ఒకరినొకరు చూసుకుంటూ సర్వం మర్చిపోయి చూసుకుంటూ ఉన్నారు…… !!

 

“ఇద్దరి చూపులు కలిసిన క్షణం…….!! మిగతా ప్రపంచం మొత్తం వీళ్ళకు దూరంగా వెళ్ళిపోయింది…… !?
ఆ ఒక్క eye-lock లో జై చెప్పేశాడు— ‘I’m here… only for you.’అని….. !! అందుకు ఆధ్య కళ్ళతో
‘Don’t look away… ever.’  మాటలు లేకపోయినా తన ప్రేమ కళ్ళల్లో కనిపిస్తుంది…… !!

“తమ మధ్య నిశ్శబ్దమే ప్రేమకి భాష అయింది……!! ఎవరు మాట్లాడలేదు కానీ  ఇద్దరి కళ్లల్లో మాత్రం కొండంత ప్రేమ కనిపిస్తోంది….. !! “మాటలు అవసరం లేకుండా ఇద్దరి చూపులు ‘I like you… more than you think’ అని నిశ్శబ్దంగా ఒప్పుకుంటున్నాయి……. !!  కేవలం ఒక చూపే వాళ్ల ఇరు హృదయాలను దగ్గర చేసింది.”!!

ఇద్దరూ సిగ్గు , శరం లేకుండా ఎలా చూసుకుంటున్నారో చూడు చీ…!! కళ్ళతోనే కాపురం చేసుకునేలా ఉన్నారు అని ఇద్దరినీ కోపంగా చూస్తూ ఉంటుంది….. !! పక్కన నవ్వుతున్న మాన్య, మాయ & అమర్, రుద్ర ల నవ్వులకు స్పృహ లోకి వచ్చిన ఆద్య వాళ్ళను చూసి దూరం జరగబోతూ….. !! తన వైపు బుసలు కొడుతున్న పాములా చూస్తున్న రేణుక ను చూసి చూసావా….. ?? నా మొగుడు నన్ను చూడకుండా నిమిషం కూడా ఉండలేడు అన్నట్టు చూడ్డం చూసి జై అంటూ కోపంగా పిలుస్తుంది రేణుక…. !!

రేణుక అరుపుకి ఆద్య ❤️ జై  ఒకరికి ఒకరు దూరంగా జరిగి నుంచుని రేణుక వైపు చూస్తారు….. !! నాన్న జై అందరూ ఉన్నారు కదా కొంచెం ఇలా వచ్చి పడుకోండి అని జై ముందు కోపం చూపించే ధైర్యం లేక 32 పళ్ళు కనిపించేలా నవ్వుతూ అంటుంది….. !! జై పడుకోవడానికి వెళ్తూ ఉంటే ఆద్య కావాలని అబ్బా జై కాలు బాగా నొప్పిగా ఉంది అని జై మెడ చుట్టూ చేతులు వేస్తూ అమ్మా…..!! అని నొప్పికి ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ రేణుక వైపు చూసి ఇప్పుడు చూడు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది….. !!

ఆధ్య ఊహించినట్టే జై తనను రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ మీద పడుకోపెట్టడం చూసి ఆ 😬😬😬 అని ఫ్రస్ట్రేట్ అవుతూ మొహానికి బెడ్ షీట్ కప్పుకోవడం చూసి ఆద్య హాయిగా నవ్వుకుంటూ ఉండగా….. !! వెనుక నుంచి తన నడుము చుట్టేసి తనను జై బలంగా అదుముకోవడం చూసి ఆద్య కోపంగా జై వైపు చూస్తుంది…… !!

మీ మామ్ మనల్ని చూస్తుంది సో తప్పదు బరించు అంటున్న జై మాటలు ఆద్య నిజం అనుకుని….. !! శైలు ను ఇంకొంచెం నమ్మించాలి…… !! అని జై చేతిని తీసుకుని తన నడుము మీద పెట్టుకొంటూ ….. !! ఇప్పుడు ఇంకా బాగా నమ్ముతుంది అని చెప్పి కళ్ళు మూసుకుని పడుకోవడం చూసి జై కి నవ్వొస్తుంది….. !!

నిజానికి శైలు వాళ్లు ఎపుడో అటు వైపు తిరిగి హ్యాపీగా నిద్రపోయారు కానీ జై కి ఆధ్య ను అలా హగ్ చేసుకుని నిద్రపోవాలి అనుంది కానీ చెప్తే ఆద్య చంపేస్తుంది కాబట్టి ఇలా శైలు మీదకు చెప్పాడు….. !! బట్ ఆద్య కి అప్పటికే ఫుల్ గా నిద్ర వస్తూ ఉండడం తో ఇద్దరికీ బెడ్ షీట్ ఉన్నా జై చెయ్ తన నడుము మీద వేసుకుని పడుకుంటుంది…. !!

జై వెచ్చగా ఆద్య మెడ వంపుల్లో మొహాన్ని దాచుకుని అక్కడ సున్నితంగా తన పెదవులతో కిస్ చేస్తూ …… !! ఈ రౌడీ ఎందుకో ఈ మధ్య నవ్వేస్తుంది అని తనలో తనే నవ్వుకుని కాసేపటికి తను కూడా డీప్ స్లీప్ కి వెళ్ళిపోతాడు….. !!

అలా ఒక్కొక్కరిగా మాట్లాడుతూనే అందరూ నిద్రపోవడం చూసిన మాయ సడెన్ గా ఒక కన్ను తెరిచి పక్కకు చూస్తుంది…… !! రేణుక ఫుల్ గా గుర్రు పెట్టి పడుకోవడం చూసి హమ్మయ్య మామ్ పడుకుంది అని మెల్లగా పిల్లిలా పాక్కుంటూ వెళ్ళి …… !! ఎవరు చూడకుండా రుద్ర బెడ్ షీట్ లో దూరి తనను గట్టిగా హగ్ చేసుకుంటుంది…… !!

ఏయ్ పొట్టి నువ్వంటే ఇక్కడ…..?? ఇంకా పడుకోకుండా ఎమ్ చేస్తున్నావ్ అంటూ గుస గుస గా అడుగుతున్న రుద్ర ను చూసి నవ్వుతూ…… !! ఎందుకో ఇలా నీతో పడుకోవాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నా హర్ష ఇంత దగ్గరగా నువ్వున్నా దూరంగా ఉండలేక పోయాను అందుకే రిస్క్ చేసి వచ్చేశా ☺️…. !!

మీ అమ్మ గానీ నిన్ను నన్ను ఇలా చూస్తే గుండాగి చస్తుందే పాపం అసలే ఇప్పుడే పెద్ద ప్రమాదం నుండి బయట పడింది …… !! మళ్ళీ నువ్వు ఇలాంటి షాక్ ఇస్తే ఆ పసి గుండె తట్టుకోలేదు పాపం 🤪🤭…. !! అంత వెటకారం ఎందుకోయ్ అయినా ఎప్పటికైనా తెలియాల్సిందే కదా తెలిస్తే తెలియనివ్వు…… ?? నువ్వు నా పక్కన ఉండగా నేను దేనికి & ఎవరికి భయపడను అంటూ రుద్ర ను మరింత గట్టిగా తన గుండెలకు అదుముకుని నవ్వుతుంది….. !!

ఇదిగో నువ్వు ఇలా నన్ను అనవసరంగా టెంప్ట్ చేస్తే హస్బెండ్ & వైఫ్ కంటే ముందు మమ్మా & డాడ్ అవుతాం చెప్తున్నా…. !! అందుకు నేను ఎప్పుడో రెడీ అని కన్ను కొడుతున్న మాయ ను చూసి నవ్వుతూ నాకు తెలుసే నువ్వు పెద్ద కంత్రీ అని అయినా అది నిజం అయితే మీ అమ్మ నన్ను బ్రతనిస్తుందా ….. ?? ఏడ్చి ఏడ్చి హైదరాబాద్ లోకి సముద్రం వచ్చేలా చేయదు….. !!

నువ్వు ఎప్పుడూ ఇంతే హర్ష మామ్ మీద ఎందుకంత నెగెటివ్ ఫీలింగ్ చూపిస్తావ్ షి ఇస్ సో స్వీట్ కాకపోతే కొంచెం పొగరు అంతే కదా….. !! అది కొంచెం కాదమ్మా మీ అమ్మ కి వై ఫై లా ఎప్పుడూ చుట్టూ ఉంటుంది అయినా మీ అమ్మ గురించి ఎందుకు లే కానీ ….. !! ఇక పడుకో అందరూ నిద్రపోయారు నువ్వు నేనే ఇలా దెయ్యాల్లా మేలుకున్నాం….. ?!

ఒక కిస్ ఇవ్వు పడుకుంటాను అని పెదాలు రౌండ్ గా చుట్టి ఉమ్మ్ అంటూ మూతి ముందుకు పెట్టిన మాయ పెదాలకు అరచేయి అడ్డు పెడుతూ….. !! ముద్దు పిచ్చి పట్టిందా ఎంటే నీకు ముద్దు లేదు ఎమ్ లేదు పడుకో అని మరో వైపు తిరుగుతున్న రుద్ర కాలర్ పట్టుకుని మర్యాదగా ముద్దు పెడతావా లేక అరిచి గోల చేయనా….. ??

అమ్మనీ నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా….. ?? బాగా ముదిరి పోయావే అయినా సరే నేను పెట్టను నీకు దమ్ముంటే అరవ్వే అంటున్న రుద్ర వైపు చూస్తూ…… !! ఆమ్…. @ అని అరవబోతున్న మాయ నోరు రుద్ర ఇస్తున్న ముద్దుకి క్లోజ్ అవ్వడం తో రుద్ర ను మరింతగా అల్లుకుపోతూ ఇద్దరికీ కలిపి బెడ్ షీట్ కప్పేస్తుంది….. !?

( నాకెందుకో వీళ్ళు పెళ్లి వరకూ ఆగేలా లేరు అనిపిస్తుంది 🤪 రుద్ర ఆగాలి అనుకున్నా మన అల్లరి పిల్ల నిగ్రహంగా ఉండనిచ్చేలా లేదు 🤭 మీరేం అంటారు గాయ్స్ కామెంట్స్ లో చెప్పండి 😌)

అందరూ నిద్రపోయినా మాన్య కి మాత్రం నిద్ర రావడం లేదు అటు ఇటు ప్లేసెస్ చేంజ్ అవుతూ పడుకోవాలి అని ట్రై చేసి అది అవ్వక దిగ్గున లేచి కూర్చుంటూ…… !! తల పట్టుకుంటుంది ఎంత ట్రై చేస్తున్నా నిద్ర వచ్చి చావడం లేదు అమర్ మాటలే రీల్ లా తలంతా తిరుగుతూ ఉన్నాయి …… !! అని విసుగ్గా తల తిప్పి అమర్ వైపు చూసిన మాన్య కి కుంభకర్ణుడి కజిన్ బ్రదర్ లా నిద్రపోతూ కనిపించడం తో మాన్య కి చంపేయాలి అనిపిస్తుంది…. !!

దరిద్రుడు, నీచుడు , నికృస్టూడు , అమావాస్య లో పుట్టినోడు అని అమర్ ను నోటికి వచ్చిన భూతులు అన్ని తిట్టుకుంటూ….. !! వీడెబ్బ నాకు నిద్ర లేకుండా చేసి పందిలా ఎలా పడుకున్నాడో చూడు అని చుట్టూ చూస్తున్న మాన్య కి తన పక్కనే రాగి గ్లాస్ కనిపించగానే….. !! దాన్ని కిస్ చేసి వెళ్ళి వాడి తలకు తగిలితే నిన్ను గోల్డెన్ గ్లాస్ గా చేంజ్ చేస్తా జై మహిష్మతి అని ప్రభాస్ రేంజ్ లో గురి చూసి కొట్టి అమర్ తల పగల కొడుతుంది….. !!

చచ్చాన్ రోయ్ …!! అని గావు కేక తో అరిచిన అమర్ వాయిస్ కి యస్ అని నవ్వుకుని ఫాస్ట్ గా పడుకుని ఫుల్ గా బెడ్ షీట్ కప్పేసి నిద్రపోతున్నట్టు కలరింగ్ ఇస్తుంది….. !! తల పట్టుకుని లేచి కూర్చున్న అమర్ బొప్పి కట్టిన తల రుద్దుకుంటూ …… !! ఈ గ్లాస్ ఎక్కడి నుండి వచ్చింది అని చుట్టూ చూసిన తనకు అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తారు….. !!

అరే అందరూ పడుకున్నారు కదా మరి ఈ గ్లాస్ ఎక్కడి నుండి వచ్చి పడింది అని దాని వైపు చూస్తూ…… !! ఎవరో కావాలని కొట్టినట్టు ఇంత గట్టిగా తగిలింది వీళ్లలో ఎవరై ఉంటారు అని ఆలోచిస్తున్న అమర్ కి మాన్య స్ట్రైక్ అవ్వగానే….. !! నో డౌబ్ట్ ఇది నా అమ్మోరి పనే అయ్యుంటుంది ఆగవే చెప్తా నీ పని అని……. !! కోపంగా మాన్య వైపు వెళ్తూ ఉంటే అప్పుడే నిద్రలో దగ్గుతూ లేచి కూర్చున్న మహిదర్ ను చూసి కంగారు పడుతూ వెళ్ళి మాన్య బెడ్ షీట్ లో దూరుతాడు….. !!

మాహిదర్ పైకి లేచి కూర్చుని వాటర్ బాటిల్ తీసుకుని తాగి మళ్ళీ పడుకోవడం చూసి….. !! టైం గాడ్ అంకుల్ పడుకున్నారు అని పైకి లేవబోతూ కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తున్న మాన్య ను కొట్టాలి అని వచ్చి కొట్టలేక….. !! ఇంత అందంగా పుట్టి తప్పు చేశావే అని మాన్య ను అపురూపంగా చూసుకుంటూ ….. !! నీ విషయం లో నా రివేంజ్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తా గెట్ రెడీ బేబ్ అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు….. !! వీడేంటీ కొడతాడు అనుకుంటే సైలెంట్ గా వెళ్తున్నాడు అని అమర్ నుండి ఆ దూరం కూడా బరించలేక బాధగా చూస్తూ ఆలోచనలో పడుతుంది….. !!

హోప్ మీకు 3 పెయిర్స్ సీన్స్ నచ్చాయి అనుకుంటున్నాం ….. !! మీకు ఏ పెయిర్ బాగా నచ్చింది & క్యూట్ గా అనిపించిందో కామెంట్స్ చేయండి….. !! మెయిన్ గా ఆధ్య రేణుక ను ఆడుకునే సీన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా చెప్పండి 😌