విలన్ హస్బెండ్{2} -12
వెచ్చగా తన మొహాన్ని తాకిన సూర్య కిరణాలకు మొహానికి చేతులు అడ్డు పెట్టుకొంటూ హా…. అంటూ ఆవలిస్తూ కళ్ళు తెరిచి టాబ్లెట్స్ వేడుకోవడం వల్ల తగ్గిన బాడీ పెయిన్స్ కి బద్దకంగా లేచి కూర్చుంటూ…… !! సన్ రైజెస్ ను ఆస్వాదిస్తూ తల తిప్పిన రేణుక కి బుర్ర గిర్రున తిరుగుతుంది……. !! జై వెలికిల్లా పడుకుని ఉంటే ఆద్య పూర్తిగా జై మీదే ఉందా అన్నట్టుగా పూర్తిగా జై మీద పడుకున్న ఆద్య ను జై తన బలమైన చేతులతో గాఢంగా హగ్ చేసుకుంటే ఆద్య జై టీ షర్ట్ ను పిడికిలి లో బంధించి ముద్దుగా నిద్రపోతూ ఉంటుంది….. !!
ఆ ఆ ఆ 😬😬 ..!! నేను ఏదో చూడాలి అనుకుంటే నా కళ్ళకు ఇంకేదో కనిపిస్తున్నాయి ….. !! ప్రొద్దు ప్రొద్దున్నే వీళ్ళను చూసాను ఏంటి అయినా అందరిలో పడుకున్నప్పుడు అయినా కాస్త దూరంగా పడుకుని ఏడవచ్చు కదా 😏…. !! మరీ ఐస్కాంతం లా ఇలా ఒకరిని ఒకరు గాలి కూడా దూరడానికి వీల్లేకుండా అంత గట్టిగా హగ్ చేసుకుని పడుకోవాలా 🙄😒 …… ??
వీళ్ళ స్పీడ్ చూస్తుంటే నన్ను నానమ్మ చేసే దాకా నిద్రపోయేలా లేరు 😬…. !! జై కి ఆద్య కి క్షణం కూడా పడేది కాదు కానీ అసలు ఎలా ఇంత డీప్ గా కలిసిపోయారు….. !! జై గురించి తెలిసి కూడా ఆద్య పెళ్లి చేసుకోవడమే నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేక పోతుంటే ……. ?? వీళ్ళ అన్యోన్యత చూసి బీపీ పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది అని ఇద్దరినీ కోపంగా చూస్తూ ఉంటుంది….. !!
💫✨💫✨💫✨💫✨💫✨💫
తన చేతి కింద ఉన్న మొబైల్ వైబ్రేట్ అవుతూ ఉంటే స్పృహ లోకి వచ్చిన రుద్ర తన గుండెల్లో గువ్వ పిట్ట లా ఒదిగిపోయి….. !! క్యూట్ పప్పీ లా పడుకున్న మాయ ను చూసి నవ్వుతూ ఫోర్హెడ్ మీద ప్రేమగా కిస్ చేసి ఈ మార్నింగ్ నాకు చాలా బాగా నచ్చింది పొట్టి లవ్ యూ రా….. !! అంటూ పక్కకు చూసిన రుద్ర కి రేణుక రాక్షసి లా జుట్టు లీవ్ చేసుకుని జై వాళ్ళ వైపు చూస్తూ కనిపిస్తుంది……. !!
ఓరి నాయనో నా రాక్షసి అత్త నిద్ర లేచినట్టు ఉంది ఇప్పుడు కానీ మమ్మల్ని ఇలా చూస్తే రచ్చ రచ్చే అని ….. !! మాయ ను దూరం జరపబోతాడు కానీ అప్పటికే స్పృహ లోకి వచ్చిన మాయ రుద్ర వైపు నవ్వుతూ చూస్తూ గుడ్ మార్నింగ్ హర్ష అని క్యూట్ స్మైల్ తో విష్ చేస్తుంది….. !!
ఒసేయ్ పొట్టి రాక్షసి అక్కడ చూడే మీ అమ్మ లేచింది ఇద్దరినీ ఇలా కానీ చూస్తే ఇంట్లో పంచాయితీ షురూ చేస్తుంది అవసరమా చెప్పు….. !! అంటూ మాయ చేతుల్లో నుండి తన షర్ట్ విడిపించుకుంటూ మెల్లగా చెప్తాడు…. !!
చూస్తే ఎమ్ చేస్తుంది ఎంచక్కా మన మ్యాటర్ అఫిషియల్ అయిపోతుంది ఆ తర్వాత వెంటనే మన ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డైరెక్ట్ గా మన ఫస్ట్ నైట్….. !! నీ ఆత్రం తగలెయ్య మధ్యలో మ్యారేజ్ ని లేపేసావా అదంతా కాదు వదలవే దెయ్యం అంటూ తన షర్ట్ ను మాయ చేతుల్లో నుండి విడిపించుకుంటాడు …. !!
ఇప్పుడు నిన్ను వదలాలి అంటే ఈ రోజు నన్ను షాపింగ్ కి తీసుకుని వెళ్ళాలి చెప్పు తీసుకుని వెళ్తావా…. ?? అలాగే లే వదిలి చావ్ విసుగ్గా మాయ ను వదిలించుకుని 20 సెకండ్స్ రేణుక చూసే గ్యాప్ లో పక్క బెడ్ మీదకు షిఫ్ట్ అయ్యి నిండా ముసుగు కప్పేస్తాడు….. !! అది చూసిన మాయ నవ్వుకుంటూ తిరిగి మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రపోతుంది….. !!
రేణుక ఆద్య వైపు చూస్తూ తన పక్కన పడుకున్న మాయ కనిపించకపోయేసరికి ఇటు వైపు చూడగా….. !! మాయ నిద్రపోతూ కనిపించగానే అక్కడ పడుకుందా అని రిలాక్స్ అవుతూ మాయ పక్కన ఫుల్ గా బెడ్ షీట్ కప్పుకుని పడుకున్న శాల్తీ ఎవరా అని చూస్తూ ఉంటుంది….. !! కానీ ఫుల్ గా బెడ్ షీట్ ఉండడం తో అక్కడ ఉన్నది ఎవరో రేణుక కి కనిపించదు….. !!
పక్కన మాన్య నే అయ్యుంటుంది లే అని లైట్ తీసుకుని ఇంకా అక్కడే ఉండి ఆధ్య ❤️ జై లను అలా చూస్తూ ఉండలేక పడుతూ లేస్తూనే ఒక్కో స్టెప్ పట్టుకుని కిందకు వెళ్ళిపోతుంది….. !! రేణుక కిందకు వెళ్ళడం ట్రాన్స్పరెంట్ బెడ్ షీట్ నుండి క్లియర్ గా కనిపిస్తూ ఉంటే తను వెళ్లగానే రుద్ర లేచి తిరిగి అమర్ పక్కన పడుకుంటూ….. !! ఈ పొట్టి దాని వల్ల టెర్రస్ మొత్తం రౌండ్ వేయాల్సి వస్తుంది అని ముద్దుగా మాయ ను తిట్టుకుని మొబైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు….. !!
💫✨💫✨💫✨💫✨💫✨💫
అబ్బా నిద్రపోతుంటే మొహం మీద ఎవర్రా లైట్ వేసింది….. ?? అని సూర్య కిరణాల వేడికి మొహానికి చెయ్ అడ్డు పెట్టుకొని కళ్ళు తెరచిన ఆద్య కి సూర్యని వెలుగు కళ్ళకు తాకగానే ఓహ్ సూర్యా నా….. !! అని రిలాక్స్ అవుతూ అవును ఏంటిది అంటూ కళ్ళు పైకి ఎత్తి చూసిన ఆద్య కి బలంగా ఉన్న చేతులు కనిపించి……. !! నా చేతులు నా దగ్గరే ఉన్నాయి కదా మరి ఎవరివి ఈ చేతులు అనుకుంటూ…… ?? మొహం వైపు చూసి ఆ అని కెవ్వున కేక పెట్టి తన అరుపుకి ప్రశాంతంగా నిద్ర పోతున్న అందరూ కూడా ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు….. !!
ఆద్య అరుపుకి జై కూడా కంగారుగా కళ్ళు తెరిచి ఆద్య ఎందుకు అరుస్తుందో అర్థం చేసుకుని ఫాస్ట్ గా ఆధ్య బెడ్ షీట్ నుండి దూరం జరిగి …… !! పైకి లేచి ఆద్య కు అందకుండా కిందకు పరిగెత్తడం చూసి ఆద్య కూడా కోపంగా జై ఆగు…… !! అంటూ జారిపోతున్న చీర ను నడుము కి చుట్టుకుంటూ వెనుకే పరిగెడుతుంది….. !!
అబ్బా హాట్ వాటర్ తో ఫ్రెష్ అయితే కానీ బాడీ పెయిన్స్ తగ్గలేదు ముందు వేడి వేడిగా టీ తాగాలి…… !! అని నిమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ హాల్ లోకి వచ్చిన రేణుక ను జై మామ్ …… !! అంటూ ఆద్య తనను కొట్టడానికి వస్తూ ఉంటే తనను అడ్డు పెట్టుకొని ఆధ్య నుండి తప్పించుకుంటూ ఉంటాడు….. !!
ఆ…. !! అని అరుస్తూ జై మర్యాదగా ముందుకు రా లేకపోతే చంపేస్తాను అని అడ్డుగా ఉన్న రేణుక ను పక్కకు నెట్టి సక్సెఫుల్ గా మరో సారి నడుము విరగ్గొట్టి……. !! వెనక్కి కూడా తిరిగి రేణుక ఉందా పోయిందా అని చూడకుండా జై కోసం పరిగెత్తిన ఆద్య వైపు కోపంగా చూస్తు చంపేసింది రా బాబు…… !! ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండ్రా మీ దుంప తెగ చచ్చిపోయేలా ఉన్నాను…… !! అని ఏడుస్తున్న రేణుక ను అప్పుడే కిందకు వస్తూ చూస్తారు మాన్య & మాయ…. !!
మామ్ మళ్ళీ ఏమైంది కింద కూర్చున్నావ్ ఏంటి…. ?? ముందు పైకి లే అని ఇద్దరూ రేణుక ను అతి కష్టం గా మీద పైకి లేపి సోఫా లో కూర్చో పెడుతూ అసలేమైందో చెప్పు ….. !! ఎవర్ని అలా కింద కూర్చుని తిడుతున్నావ్ అని మెయిడ్ తో కాఫీ & వాటర్ తెప్పించి రేణుక కి ఇస్తూ అడుగుతుంది…… !!
ఇంకెవరు మాయ ఆద్య & మీ అన్నయ్య వాళ్ళ సరసానికి అడ్డొచ్చానని ఇదిగో నన్నిలా నెట్టేసి కనీసం దెబ్బ తగిలిందా అని కూడా అడగకుండా వెళ్లిపోయారు…… !! అని ముక్కు చీదుతున్న రేణుక ను చూసి చిన్నగా నవ్వి అవునా మేము కూడా వాళ్ళను వెతుకుతూ వచ్చాం…. !! వదిన పదా అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారో చూద్దాం అని మాయ మాన్య ను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళడం చూసి….. !! చీ నా బ్రతుకు పెంచిన వాడికే కాదు కడుపున పుట్టిన కూతురికి కూడా నేను అక్కర్లేదు ఇక కట్టుకున్న వాడు అని నిట్టూర్చి చల్లగా అయిపోయిన కాఫీ ని ఉఫ్…. ఉఫ్….. అని ఊదుతూ ఆధ్య & జై ల మధ్య ఎలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా అని బుర్రకు పదును పెడుతూ ఉంటుంది….. !!
💫✨💫✨💫✨💫✨💫✨💫
జై నువ్వుగా దొరికితే బావుంటుంది నేను పట్టుకుంటే మామూలుగా కొట్టను చెప్తున్నా అని జై ను పట్టుకోవడానికి చూస్తూ ఉంటే….. !! జై ఆద్య ను గార్డెన్ మొత్తం తిప్పిస్తూ దొరకకుండా పరుగులు పెడుతూ ఉంటాడు….. !! ఎట్ లాస్ట్ జై ఆధ్య కి దొరగ్గానే ఏయ్ దొరికిపోయావ్ అని జై షర్ట్ పట్టుకుని లాగుతూ స్లిప్ అయ్యి జై తో పాటు అక్కడే ఉన్న స్విమ్మింగ్ ఫూల్ లో కి పడిపోతుంది….. !!
యూ ఇడియట్ , స్టుపిడ్ చంపేస్తా రా నిన్ను నాకు దూరంగా ఉండమని చెప్పినా కూడా అతుక్కుని పడుకుంటావా ….. ?? ఐ విల్ కిల్ యూ అని జై జుట్టు పట్టుకుని లాగుతూ నేను ఎవరికి డౌబ్ట్ రాకూడదు అని యాక్ట్ చేస్తుంటే….. !! అది అడ్వాంటేజ్ గా తీసుకుని నన్ను హగ్ చేసుకుంటూ కిసెస్ పెడుతూ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా….. ??
జై ఆద్య ను మీదకు లాక్కుని అడ్వాంటేజ్ అంటే అలా కాదు ఇలా అంటూ ఆద్య ను అండర్ వాటర్ లోకి తీసుకుని వెళ్ళి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు…… !! అసలే అండర్ వాటర్ లోకి తీసుకుని వెళ్ళడం తో భయపడుతున్న ఆద్య కి జై వెచ్చటి ఊపిరి తన ఊపిరి లో కలవడం తో పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్టు అవుతుంది……. !! కానీ కాసేపటికి ఊపిరి ఆడక కాళ్ళు చేతులు ఆడిస్తూ జై ను కొడుతూ ఉంటుంది…. !!
ఆద్య ను అలా చూసిన జై 2 మినిట్స్ కి వదిలేస్తూ ఆధ్య ను పైకి తీసుకుని వచ్చి ఎలా ఉంది నా కిస్ నచ్చిందా అని ఐ వింక్ చేస్తున్న జై వైపు కొట్టేలా చూస్తూ…… !! నీకేమైనా పిచ్చా ప్రాణం పోతున్నట్టు అనిపించింది కిస్ చేయకు అంటుంటే మళ్ళీ కిస్ చేస్తావ్ ఏంట్రా మన మధ్య జరిగిన కాన్వర్జేషన్ మర్చిపోయావా ……. ??
కొన్ని విషయాలు నీతో చెప్పలేను కానీ ఒక్కటి చెప్పనా నిన్న ఆ క్షణం నిన్ను కిస్ చేయకపోతే ప్రాణం పోతున్నట్టు అనిపించింది….. !! ఇదిగో ఇలాగే అంటూ 5మళ్ళీ అండర్ వాటర్ లోకి తీసుకుని వెళ్తాడు….. !! అప్పుడే అక్కడికి వచ్చిన మాయ & మాన్య ఎక్కడా కనిపించని వీళ్ళ కోసం వెతుకుతూ ఉంటే సడెన్ గా అండర్ వాటర్ నుండి పైకి వచ్చిన వీళ్లను చూసి షాక్ అవుతారు…. !!
ఇద్దరూ లోపలేం చేస్తున్నారు…. ?? అని అడుగుతున్న వాయిస్ కి ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని అదీ కలిసి స్విమ్ చేస్తున్నాం….. !! శారీ తో స్విమ్ చేస్తున్న ఫస్ట్ గర్ల్ నువ్వే అనుకుంటా ఆద్య కమ్ అంటూ…….. !! ఆద్య కి హ్యాండ్ ఇచ్చి ఆధ్య పైకి వచ్చాక ఆద్య తో కలిసి పైప్ తో వాటర్ పడుతూ ఆడుకుంటూ ఉంటారు వాళ్ళతో జాయిన్ అవుతారు రుద్ర, అమర్……. !!
మాయ పైప్ పట్టుకుని అందరికీ వాటర్ పడుతూ ఆల్రెడీ తడిచిన ఆద్య ను మరింత తడుపుతుంది….. !! స్టాప్ ఇట్ మాయ అని ఆద్య అక్కడి నుండి పక్కకు వచ్చి తడిచిన తన చీర కొంగు ను వంగి పిండుకుంటూ ఉంటుంది….. !! ఆద్య ను అలా చూసిన జై కి గుండె స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంటే ఆద్య ను అలాగే చూస్తూ నుంచున్నాడు….. !! ఆధ్య ఎత్తైన ఎద సంపద రెండు కొండల మధ్య నీటి చుక్కలు దారి చూసుకుని వెళ్తూ లోతుగా ఉన్న నాభి లో చేరడం చూసి జై మనసులో తుంటరి ఆలోచన వస్తుంది…. !!
దాన్ని అమలు చేయడానికి ఆద్య వైపు వెళ్తున్న జై కి ఆద్య ను గార్డెన్ లెఫ్ట్ సైడ్ నుండి ఇంటిని డెకరేట్ చేయడానికి వచ్చిన వెడ్డింగ్ ప్లానర్ …… !! తడిచిన చీర లో ఉన్న ఆద్య ను జూమ్ చేసి మరీ ఫోటోస్ తీస్తున్న వాడిని చూసి టెంపర్ లేచుద్ది….. !!
ఆద్య తో రొమాన్స్ చేయాలి అనుకున్న తన మూడ్ మొత్తం కోపంగా మారిపోవడం తో జై సీరియస్ గా ఆ వెడ్డింగ్ ప్లానర్ దగ్గరకు వెళ్లి ……. !! తన చేతిలోని మొబైల్ లాక్కుని అందులో ఆద్య ఫోటోస్ బ్యాక్ అప్ ఆప్షన్ లేకుండా డిలీట్ చేసి మొబైల్ ను కోపంగా పగల కొడతాడు….. !!
జై ను చూసిన ఆ వెడ్డింగ్ ప్లానర్ భయపడుతూ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి చూస్తుంటే…… !! జై వాడి మెడ పట్టుకుని వెనక్కి లాగి ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ పిక్స్ తీస్తావ్….. ?? అని వాడి బట్టలతో పాటు డొక్క కూడా చించి వాడ్ని మూట విసిరినట్టు పక్కకు విసిరేసి ఆధ్య వైపు కోపంగా వెళతాడు…… !!
తన కళ్ళ ముందు నుంచున్న జై ను చూసి గుండెల మీద చీర కొంగు కప్పుకుంటున్న ఆధ్య వైపు కోపంగా చూస్తూ…… !! మన రూమ్ లో నీ ఇష్టం వచ్చినట్టు ఉండు డ్రెస్ వేసుకోకపోయినా నేను ఎమ్ ఫీల్ అవ్వను కానీ ఇంకోసారి ఇలా అందరికీ కనిపించేలా నా ముందు ఎక్స్పోజ్ చేస్తే మాత్రం ప్రాణం తీస్తాను జాగ్రత్తా… !! పో లోపలికి అని అరవగానే జై అరుపుకి బయపడి అక్కడి నుండి ఆ తడి చీర తో వెళ్ళలేక కుచ్చిళ్ళు కాళ్ళకు అడ్డు పడి పడిపోతున్న ఆద్య ను ఎతుకుంటాడు జై….. ?!
ఆద్య అందుకే ఆ తడి చీర తో ఇంట్లోకి వెళ్ళేలేక ఇక్కడే ఆర్పుకుంటుంది అని అర్థం చేసుకున్న జై ఆద్య ను ఎత్తుకుని అలాగే ఇంట్లో కి తీసుకుని వెళ్తుంటే….. !! ఆద్య జై మెడ చుట్టూ చేతులు వేసి హాల్లో ఉన్న రేణుక ను చూసి తనను మరింత రెచ్చగొట్టడానికి జై కళ్ళల్లోకి చూస్తూ జై బుగ్గన ముద్దు పెట్టడం చూసి రేణుక ఆద్య వైపు గుర్రుగా చూస్తూ ఉంటుంది….. !! అది చూసిన చూడనట్టు జై గుండెల్లో తల పెట్టుకున్న ఆధ్య ను చూసి రేణుక ఆలోచిస్తూ ఉంటుంది….. !!