విలన్ హస్బెండ్{2} -14
జై & ఆద్య ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కి వెళ్ళి ఎంత సేపటికి బయటకు రాకపోయేసరికి ఎం చేస్తున్నారు వీళ్ళు….. ?? అని బెడ్ రూమ్ లోకి వచ్చిన రేణుక కి జై ఆద్య ను స్వీట్ వాయిస్ తో వాష్ రూమ్ నుండి పిలవడం చూసి….. !! జై వాయిస్ కి పళ్ళు పట పటా కొరుకుతూ ఆగరా నీ సంగతి చెప్తా అనుకుంటూ…… !! టవల్ వాడ్రాబ్ నుండి బయటకు తీసి హ్మ్మ్..!! అని ఆద్య టవల్ ఇస్తున్నట్టు నోటితో సౌండ్ చేసి డోర్ నాక్ చేస్తుంది….. !! వచ్చింది ఆధ్య అనుకున్న జై రేణుక చెయ్ పట్టుకుని తనను బలం కొద్ది వాష్ రూమ్ లోకి ఫోర్స్ గా లాగేస్తాడు….. !! ఆ ఫోర్స్ కి రేణుక తల వెళ్ళి గోడ కి తగలగానే అది చూసిన జై కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతాడు….. !!
అమ్మా అంటూ తల పట్టుకుని ఇటు వైపు తిరిగిన రేణుక ను చూసిన జై షాక్ నుండి తేరుకుని కంగారుగా రేణుక దగ్గరకు వచ్చి….. !! అయ్యో మామ్ నువ్వేంటి ఇక్కడ అరే బ్లడ్ వస్తుంది ఇలా రా ముందు…… !! అని రేణుక చెయ్ పట్టుకుని రూమ్ లోకి తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చో పెడతాడు….. !! ఫాస్ట్ గా వంటికి బాత్ రబ్ చుట్టుకుని కబోర్డ్ నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రేణుక తలకు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు….. !!
అమ్మా….!! నొప్పిగా ఉంది జై అని తల పట్టుకుని పెయిన్ కి బాధగా అరుస్తున్న రేణుక ను చూసి…… !! మామ్ బాధ పడకు ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో తగ్గిపోతుంది అని రేణుక టాబ్లెట్ వేసుకున్న తర్వాత …… !! నువ్వెందుకు వచ్చావ్ మామ్ నా రూమ్ కి అయినా ఆద్య ఉండాల్సిన ప్లేస్ లో నువ్వెందుకు ఉన్నావ్…. ??
వచ్చిన దానివి నా వాష్ రూమ్ ముందు ఎందుకు నుంచున్నావ్ మామ్ ….. ?? అని అడుగుతున్న జై వైపు చూస్తూ నా దరిద్రం కొద్దీ వచ్చాను 😏 అని జై ను తిట్టుకుంటూ అదీ….అదీ… నేను…. !! హా అదే జై నిన్ను ఆద్య ను టెంపుల్ కి వెళ్ళి రండి అని చెప్పడానికి వచ్చాను ….. !! తీరా చూస్తే ఆద్య రూమ్ లో లేదు నువ్వు వాష్ రూమ్ లో నుండి టవల్ అడుగుతున్నావ్ ….. ?? అందుకే టవల్ తీసి ఇచ్చాను కానీ నువ్వు నన్ను ఆద్య అనుకుని వాష్ రూమ్ లోకి లాగేసావ్…. !! అని పళ్ళు నూరుతూ పైకి మాత్రం పళ్ళు కనిపించేలా నవ్వుతుంది…. !!
జై ఇబ్బందిగా నవ్వుతూ సారి మామ్ నేను నిజంగా ఆద్య నే అనుకున్నాను …… !! అని ఇంకేదో మాట్లాడుతూ ఉండగా అపుడే రూమ్ లోకి వచ్చిన ఆద్య రేణుక తలకు చిన్న బ్యాండేజ్ చూసి… !! అయ్యయ్యో అత్తమ్మ ఏమైంది మీకు అని కంగారుగా అడుగుతూ రేణుక పక్కన సెటిల్ అయ్యి భుజాలు పట్టుకుని ఊపేస్తూ అడుగుతుంది…… !!
ఏయ్ ఆగవే అమ్మా అని తల పట్టుకుని నాకేం కాలేదు ఆద్య నువ్వు కంగారు పడకు సరేనా ….. !! అని ఆద్య వైపు కోపంగా చూస్తూ నవ్వుతూ అన్సర్ ఇచ్చి తన నుండి దూరంగా జరుగుతుంది….. !! జై అసలేం జరిగింది అని అడుగుతున్న ఆద్య ను చూసి జై కి జరిగింది ఎలా చెప్పాలో అర్థం అవ్వక ….. !! నేను ఇప్పుడే వస్తాను అని హ్యాండ్ వాష్ చేసుకుని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళతారు….. !!
ఏంటిది ఏమైందో చెప్పమంటే వీడు అలా వెళ్ళిపోతున్నాడు అని జై వైపు వియర్డ్ లుక్స్ ఇస్తూ….. !! ఎంటత్తా నా మొగుడు అంత సిగ్గు పడుతూ వెళ్తున్నాడు ఏం జరిగింది ఏంటీ …!! అంత సిగ్గు పడేలా ఎమ్ చేసాడేంటి ?? నవ్వు ఆపుకుంటూ అడుగుతున్న ఆద్య వైపు కోపంగా చూస్తూ ఏయ్ నీకు బాగా ఎక్కువైందే అత్తయ్య అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా మినిమం సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోసేస్తాను….. !!
అరే ఇప్పుడు నేనేం అన్నాను ముక్కు మీదే ఉంటుంది కోపం నీకు నీ కొడుక్కి హు 😏 మంచి వాళ్ళకు రోజులు లేవబ్బా…. !! ఇన్నోసెంట్ గా మొహాన్ని పెట్టుకున్న ఆద్య వైపు చూస్తూ చాలు ఆపు ఇక నీ డ్రామా ఎమ్ చేశావే జై ని వాడు నువ్వంటే ఇంతలా పడి చేస్తున్నాడు….. !!
ఛీ పాడు నేను చేయడం ఏంటి ఎవరైనా వింటే హవ్వా ఏమనుకుంటారు ముందు లెంపలు వేసుకో అత్తయ్య అని పనిలో పనిగా రేణుక చెంపలు పగల కొడుతుంది….. !! ఆ… అమ్మా ఒసేయ్ ఇప్పటికే తల నొప్పిగా ఉండి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ వాయింపులు ఏంటి చీచీ నీ దగ్గర ఇంత సేపు కూర్చోవడం నాది తప్పు….. !! అని పైకి లేవబోతుంది
ఎక్కడికి అత్తయ్య వెళ్ళేది…. ?? అని రేణుక ను పైకి లేవకుండా పట్టుకుంటూ ముందు ఎమ్ జరిగిందో చెప్పేవరకూ నేను నిన్ను వదలను చెప్పు ఎమ్ అయింది…… ?? నా బొంద అయిందే నా సార్ధం అయింది అని పళ్ళు నూరుతూ పాపం అనుకుని టవల్ ఇవ్వడానికి వెళ్తే ఇదిగో ఇలా తలకు దెబ్బ తగిలించుకుని ఏడుస్తున్నా చాలా…. ??
రేణుక కోపంగా చూస్తూ చెప్తుంటే ఆధ్య ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టుకుని పాపం అనుకుని టవల్ ఇవ్వడానికి వెళ్ళావా….. ?? ఎక్కడో అపశృతి పలుకుతుందే 🤔🤔 అని అలోచిస్తూ నిజం చెప్పు అత్త జై నన్ను పిలుస్తుంటే నువ్వు లా యాక్ట్ చేసి టవల్ ఇవ్వబోయావ్ …… !! వచ్చింది నేను అనుకుని జై నిన్ను వాష్ రూమ్ లోకి లాగుంటాడు అంతేనా…. ?? కళ్ళు ఎగరేస్తూ అడుగుతున్న ఆద్య ను చూసిన రేణుక దీనికి అన్నీ ఆ మహిదర్ బుద్దులే అని పళ్ళు నూరుతూ మొహం తిప్పుకుంటుంది….. !!
ఆధ్య ఇలాంటిది ఏదో జరుగుతుంది అనే ఇక్కడి నుండి మెల్లగా ఎస్కేప్ అయ్యింది బట్ జై కి రేణుక బలయ్యింది అని తెలుసుకుని తనలో తానే నవ్వుకుంటూ……. !! చూసావా అత్త జస్ట్ నిన్ను అలా లాగినందుకే నీకు హ్యాండ్ ఇంత పెయిన్ వస్తుంటే రోజు ఆ మనిషిని మోస్తున్న నాకు బాడీ ఇంకెంత పెయిన్ గా ఉంటుందో ఆలోచించు….. ??
నీ కొడుకు రొమాన్స్ కి అల్లాడిపోతున్నా అనుకో ఒక్క సారి స్టార్ట్ చేస్తే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడు….. !! అని రేణుక కి మరింత దగ్గరగా జరిగి ఏమాటకామాటే చెప్పుకోవాలి బెడ్ మీద నీ కొడుకు బలే యాక్టివ్ గా ఉంటాడు ఎంత పెయిన్స్ ఉంటాయో అంతే సుఖం కూడా ఉంటుంది….. !!
ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గం అనుకో అని వొళ్ళు విరుచుకుంటూ చెప్తున్న ఆద్య ను చూసి…… !! చిచీ నోరు ముయ్ ఫస్ట్ నాతో ఇలాగేనా మాట్లాడేది సిగ్గు లేకపోతే సరే అని విసురుగా అక్కడి నుండి బయటకు వెళ్తున్న రేణుక ను చూసి ఆద్య నవ్వుకుంటూ చూస్తుంటుంది ….. !!
మామ్ ఎక్కడ…. ?? డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన జై రూమ్ లో కనిపించని రేణుక కోసం చూస్తూ అడుగుతాడు… !! ఇప్పుడే వెళ్ళిపోయింది అంటున్న ఆధ్య ను చూసి సరే ఏమైనా రెడీ అవ్వాలి అనుకుంటే త్వరగా రెడీ అవ్వు టెంపుల్ కి వెళ్ళాలట మామ్ చెప్పింది …. !! అని చెప్పి మిర్రర్ ముందు నుంచుని హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు….. !!
ఆద్య ఆలోచిస్తూ ముందు వీడిని నా అత్త మాట వినకుండా చేయాలి అనుకుంటూ….. !! అది సరే కానీ ఏంటి అత్తయ్య ను వాష్ రూమ్ లోకి లాగావ్ ఆట దేనికి…… ?? సూటిగా వచ్చిన క్వశ్చన్ కి జై తడబడుతూ అది…. అదీ టవల్ తీసుకుంటుంటే రాలేదు అందుకే కొంచెం గట్టిగా లాగాను టవల్ తో పాటు మామ్ కూడా వచ్చేసింది….. !!
ఆధ్య జై ముందుకు వెళ్ళి నుంచోగానే జై ఆద్య వైపు తిరిగి తన కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోయాడు…… !! ఇలా నువ్వు నా కళ్ళ ముందు ఉంటే నా చేతులు వెళ్లాల్సిన దారి అవే వెళ్తున్నాయి అని ఆద్య నడుము వైపు చూస్తూ ఆద్య ను సడెన్ గా తన మీదకు లాక్కుని ….. !! ఫస్ట్ తన ముఖం మీద పడి అల్లరి చేస్తున్న హెయిర్ ను జై ముని వేళ్ళతో చెవి వెనుక పెట్టాక ……… !! తర్వాత ఆద్య చెంపని మధ్య వేలితో మెల్లిగా సుతారంగా తాకి ఆద్య కళ్ళల్లోకి చూస్తూ ….. !! నీ శ్వాస నాలో ఏకం అవుతున్న ప్రతి సారీ నా లోపల ఏదో జరుగుతోంది…. !!
ఆధ్య ను ఇంకా దగ్గరగా లాక్కుని తన వైపు చూస్తూ…… !! ఇదిగో ఇలా నీ నడుముని ఫోల్డ్ చేసిన క్షణం
నా heartbeat నా మాట విననంటూ నీ మాటే వింటాను అంటోంది…… !! “నీ మెడ వంపులో దాగి ఉన్న ఆ చిన్న ఫ్రాగ్రెన్స్ అని మత్తుగా ఆద్య మెడ దగ్గర స్మెల్ చేస్తూ……. !! ఓహ్ మై గాడ్ ఇదే నా వీక్నెస్ అది తగిలిన వెంటనే
నా లిప్స్ ఇదిగో ఇలా నీ మెడని టచ్ అవ్వాలని అడుగుతూనే ఉంటాయి.” అని ఆధ్య మెడ వంపుల్లో పెదాలు ఉంచుతాడు….. !! ఇలా ఎప్పటికీ నీ శ్వాస పూర్తిగా నాది అయ్యేంతదాకా ఉండిపోవాలి అనుంది….. !! ఆధ్య ❤️☺️
ఏయ్ ఏంటి ఏదో దెయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నావ్….. ?? ఆద్య పిలుపుకు ఉలిక్కిపడి తన వైపు చూసిన జై కి ఇదంతా తన భ్రమ అని అర్థం అవ్వగానే చిన్నగా తల పట్టుకుని తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు… !! అడుగుతుంటే అలా చూస్తావేంటి నిజం చెప్పు అత్త ను నేను అనుకునే లాగావ్ కదా….. ?? ఏంటి నీ గోల త్వరగా రెడీ అయ్యి రా ….. !! అని మెల్లగా రూమ్ నుండి బయటకు వెళ్తున్న జై ను చూసి కోపంగా జై వెనుకే వెళ్ళి జై కాలర్ పట్టుకుని తన వైపు తిప్పుకుంటుంది….. !!
మర్యాదగా నిజం చెప్పు జై వాంటెడ్ గా ప్లాన్ చేసావ్ కదా వాష్ రూమ్ లో చెప్పు ఎమ్ చేయాలి అనుకున్నావ్….. ?? జై ఆద్య నడుము పట్టుకుని అక్కడే ఉన్న వాల్ కి లాక్ చేసి సూటిగా చూస్తూ…… !! నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు నువ్వు ఇంకోసారి పదే పదే ఇరిటేట్ చేశావో నిజంగానే ప్లాన్ చేయాల్సి వస్తుంది చెప్పు చేయనా….. ??
యూ అంటూ కోపంగా జై జుట్టు పట్టుకోబోతున్న ఆద్య కి అపుడే రేణుక అటుగా వస్తూ కనిపిస్తుంది….. !! అబ్బా జై ఏంటి నువ్వు మనం హాల్ లో ఉన్నాం అని కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కిస్ అడిగితే….. !! నేను ఎలా ఇవ్వాలి అని అప్పటికే జై తనను వదిలేయడం తో ఇప్పుడు జై ను వాల్ కి నెట్టి పూర్తిగా తన బరువు మొత్తం జై మీద వేసి తన చేతులు జై మెడలో హారం లా వేస్తుంది….. !!
జై ఆద్య వైపు విచిత్రంగా చూస్తూ ఏయ్ ఎమ్ చేస్తున్నావ్… ?? దూరం జరుగు అని ఆద్య ను విసుగ్గా వెనక్కు నెట్టబోతూ ఉంటే మీ అమ్మ చూస్తుంది అని కళ్ళతోనే రేణుక ను చూపిస్తుంది ఆద్య….. !! రేణుక ను చూసిన జై అబ్బా నాకు ఏంటి ఈ టార్చర్ ఇది ఇంత క్యూట్ గా ఇంత దగ్గరగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని తిట్టుకుంటూ….. !! పైకి మాత్రం నవ్వుతూ ఎమ్ చేయను స్వీట్ హార్ట్ నువ్వు అంత క్యూట్ గా ఉంటావు మరి త్వరగా నా కిస్ నాకు ఇస్తే కిందకు వెళ్దాం అని ఆద్య లిప్స్ ముని వేళ్ళతో లాగుతూ అడుగుతాడు….. !!
రేయ్ యాక్షన్ చెయ్ ఓవర్ యాక్షన్ కాదు అంటూ నవ్వుతూ కోపంగా చెప్తున్న ఆద్య మాటలు గాల్లోకి వదిలేసి …. !! ఆద్య అప్పర్ లిప్ ను ముందుకు లాగి తన రెండు పెదాల మధ్య లోకి తీసుకోబోతాడు ….. !! అప్పుడే రేణుక కోపంగా జై అని అరవగానే ఇద్దరూ రేణుక ను చూసి దూరం జరుగుతారు….. !!
మిమ్మల్ని టెంపుల్ కి వెళ్ళమని చెప్తే ఇక్కడేం చేస్తున్నారు…. ?? అని అప్పుడే వాళ్ళను చూస్తున్నట్టు అడుగుతున్న రేణుక ను చూసి ఆద్య అబ్బచ్చా ఇప్పుడే మమ్మల్ని చూస్తున్నట్టు ఎమ్ యాక్ట్ చేస్తున్నావ్ అత్త….. !! అయినా నీకు నేను థాంక్స్ చెప్పుకోవాలి….. !! ఎందుకో ప్రతీ సారి నా విలన్ హస్బెండ్ నుండి నువ్వే తెలియకుండా నన్ను చేస్తున్నావ్….. !!
వెళ్తున్నాం మామ్ అంటూ కంగారుగా అక్కడి నుండి వెళ్తున్న జై చెయ్ పట్టుకుంటూ….. !! వెళ్ళొస్తాం అత్తయ్య గారు అంటూ వయ్యారంగా నడుము ఊపుకుంటూ జై ను అతుక్కుని కిందకు వెళుతున్న ఆధ్య ను పళ్ళు నూరుతూ చూస్తుంటుంది రేణుక…. !!
💫✨💫✨💫✨💫✨💫
ఆధ్య ఇంటి ముందు కార్ ఆపిన అభీర్ మిర్రర్ లో తనను తాను చూసుకుని వాహ్ సూపర్ రా ఆని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకుని ఆద్య కి ఇష్టమైన వైట్ కలర్ బొకే మధ్య ఒకే ఒక రెడ్ కలర్ రోస్ బొకే పట్టుకుని ఇంటి లోపలికి నడుస్తాడు….. !!
ఏంటిది ఇల్లంతా ఇంత బాగా డెకరేట్ చేశారు ఇంట్లో ఏదైనా అకేషన్ జరుగుతుందా….. ?? అని ఇంటిని చూస్తూ లోపలికి వెళ్ళిన అభీర్ హాల్ లో కూర్చుని మొబైల్ చూసుకుంటున్న రుద్ర ను చూసి ఎవరు వీడు …… ?? నాకు కాంపిటీషన్ అయితే కాదు కదా అనుకుంటూ లొపలికి అడుగులు వేస్తాడు ….. !!
తన ముందుకు వచ్చి నుంచుని చుట్టూ ఎవరి కోసమో వెతుకుతున్న అభీర్ ను చూసి….. !! ఎక్స్క్యూస్ మీ మీరెవరు….. ?? అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్న రుద్ర బిహేవియర్ నచ్చడం తో హాయ్ ఐ ఆమ్ అభీర్ ఆధ్య ఫ్రెండ్ అని తనని పరిచయం చేసుకుని రుద్ర గురించి అడుగుతాడు….. !!
ఓహ్ !! హాయ్ ప్లీస్ సిట్ అని అభీర్ సోఫా లో కూర్చున్నాక ఐ ఆమ్ ఆర్యన్ ఆధ్య బ్రదర్ అని తనను కూడా పరిచయం చేసుకుంటాడు….. !! టైం గాడ్ అన్నయ్య అవుతాడా నేను ఇంకేదో అని కంగారు పడ్డా ……. !! అని రిలాక్స్ అవుతూ ఆద్య ను మీట్ అయ్యి చాలా డేస్ అవుతుంది సో అందుకే కలవడానికి వచ్చాను తను ఇంట్లోనే ఉందా… ??
యాహ్ ఉంది అని అటు ఇటు చూస్తున్న రుద్ర కి ఎదురుగా స్టెప్స్ దిగుతూ కనిపిస్తారు జై ❤️ ఆధ్య…. !! అదిగో వస్తుంది అనగానే అభీర్ ఆనందంగా అటు వైపు చూసి ఆధ్య చెయ్ పట్టుకుని నవ్వుతూ స్టెప్స్ దిగుతూ ఉన్న జై వైపు చూస్తూ తను….. ?? అంటూ అయోమయంగా చూస్తూ అడుగుతాడు….. !!
ఆధ్య హస్బెండ్ జై ధీర్ అని నవ్వుతూ చెప్తున్న రుద్ర ను చూసి అప్పటి వరకు నవ్వుతున్న అభీర్ మొహం లో నవ్వు మాయం అవ్వడం తో పాటు కళ్ళల్లో నీళ్ళు కూడా తిరుగుతాయి….. !! తన చేతిలోని బొకే జారి నేల మీద పడిపోయి అభీర్ కూడా షాకింగ్ గా సోఫా లో కూలబడి ఆధ్య వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటాడు…. !!
గాయ్స్ అభీర్ ఎవరో గుర్తు పట్టారా 😜 గెస్ చేసుంటే కామెంట్స్ లో చెప్పండి 😌 !!