Login with OTP

విలన్ హస్బెండ్ {2}-17

aashyatech

Author

జై ను షాపింగ్ మాల్ లో చూసిన నాన్సీ ఓహ్ షట్ జై ఏంటి ఇక్కడ అని జై తనను చూడక ముందే వెళ్ళిపోవాలి అనుకుంటూ….. !! జై చూపుల నుండి తప్పించుకుంటూ వంగి వంగి అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్న నాన్సీ ఎదురుగా వచ్చి నుంచుంటాడు జై…… !! జై ను అక్కడ చూసిన నాన్సీ కంగారుగా చూస్తూ ఉంటే నా నుండి ఎందుకు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావ్ నాన్సీ….. ?? అంటూ సూటిగా అడిగిన జై క్వశ్చన్ కి నాన్సీ లో కంగారు మొదలవుతుంది ….. ??

నిన్నే అడుగుతుంది అన్సర్ టు మీ నాన్సీ 3 డేస్ నుండి కాల్ లేదు మెసేజ్ లేదు….. ?? ఎట్లీస్ట్ నా పెళ్ళికి కూడా రాలేదు నువ్వు కచ్చితంగా రావాలి అని మరీ మరీ చెప్పాక కూడా ఎందుకని నువ్వు నా మ్యారేజ్ కి రాలేదు….. ?? నువ్వు నన్ను ఎలా అయితే చూడాలి అనుకున్నావో ఇప్పుడు నేను అలాగే ఉన్నాను కదా….. !! ఎందుకు నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నావో చెప్పు…. !! అంటూ నాన్సీ బుజాలు పట్టుకొని కోపంగా అడుగుతాడు….. !!

హేయ్ లుక్ ఎట్ దేర్ అక్కడుంది జై దీర్ వర్మ కదా మొన్నే కదా పెళ్లయింది….. ?? కానీ తన వైఫ్ ఈ అమ్మాయి కాదు…. !! యూ నో వాట్ జై దీర్ కి చాలా మంచి అమ్మాయితో రిలేషన్ ఉంది…. ?? వాట్ డు యూ మీన్ మ్యారేజ్ అయ్యాక కూడా ఇలా పబ్లిక్ గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడా….  ?? చిల్ యాహ్ అలాంటి బిగ్ షాట్స్ కి ఇదంతా కామన్…. !!

తన గురించి & జై గురించి గాసిప్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళ వైపు విసుగ్గా చూస్తూ…. !! జై లీవ్ అందరూ ఇటే మనల్నే చూస్తున్నారు నీకు పెళ్లైందని మర్చిపోయావా….. !? ఉన్న రూమర్స్ చాలు మళ్ళీ కొత్తవి అక్కర్లేదు అంటూ అక్కడి నుండి వెళ్లబోతున్న నాన్సీ చెయ్ పట్టుకుంటూ….. !! తమ గురించి మాట్లాడుతున్న వాళ్ల వైపు జై సీరియస్ గా చూడగానే అందరూ భయంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు….. !!

మంజూష నువ్వు నీ షాపింగ్ ఫినిష్ చేసి కేఫరేటియా లో వెయిట్ చెయ్ మీ అక్క హాఫ్ ఆన్ ఆర్ లో వస్తుంది….. !! అని నాన్సీ చెయ్ పట్టుకుని పార్కింగ్ లాట్ వైపు జై తీసుకుని వెళ్ళడం చూసి….. !! ఇద్దరికీ ఏమైనా గొడవ అయిందా అని ఆలోచిస్తూ మంజూష తన షాపింగ్ కంటిన్యూ చేస్తుంది….. !!

✨✨✨✨✨✨✨✨✨✨✨✨

జై నాన్సీ ను తన కార్ వైపు తోసి కోపంగా సిగరెట్ వెలిగిస్తాడు….. !! ఎర్రగా మారిన జై ఫేస్ ను చూసి నాన్సీ కంగారు పడుతూ ఎమ్ చెప్పి జై నుండి తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది….. !!

నాకు కొంచెం కూడా ఓపిక లేదు నాన్సీ నిన్ను నేను రెండే రెండు క్వశ్చన్స్ అడుగుతాను స్ట్రెయిట్ గా అన్సర్ ఇవ్వు….. !! ఆ తర్వాత నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు ఇక నేను ఆపను అంటూ నోట్లోని పొగ గాల్లోకి వదులుతూ….. !! నువ్వు నా మ్యారేజ్ కి వచ్చావా లేదా…. ?? నేను పిలిచాకా నువ్వు రాకుండా ఉండవ్ అన్న విషయం నాకు తెలుసు బట్ నా క్వశ్చన్ అది కాదు మ్యారేజ్ కి వచ్చి నన్ను కలవకుండా ఎందుకు వెళ్ళిపోయావ్….. ??

మాయ ఆపింది అని చెప్పడం ఇష్టం లేక అది…. అదీ అర్జంట్ గా ఇంటికి రమ్మని నాన్న కాల్ చేశాడు జై అందుకే వెళ్ళిపోయాను….. !! ఓహ్ అలాగా…. !! మరి నాకు కాల్ చేసి కూడా ఎందుకు విష్ చేయలేదు …….. ?? కొత్తగా పెళ్లైన నిన్ను డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు జై అయినా ఇప్పుడు నీకంటూ ఒక భార్య ఉంది ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదు తన గురించి….. ?? నా లాంటి వాళ్ళు మధ్యలో వచ్చారు మధ్యలో వెళ్ళిపోతారు కానీ ఆధ్య అలా కాదు తనే నీ ప్రపంచం అవ్వాలి మీ ఇద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి జై… !!

ఎందుకు ఏడుస్తున్నావ్ నాన్సీ…. ?? అంటూ చేతిలోని సిగరెట్ కింద పడేసి నాన్సీ చిన్ పట్టుకుని తల పైకి ఎత్తి చూస్తున్న జై కి నాన్సీ కళ్ళల్లో నీళ్లు కనిపించగానే …… !! ఏమైందమ్మా ఎదీ నాతో కూడా చెప్పవా అని ఆప్యాయంగా అడుగుతున్న జై వాయిస్ కి గుండెల్లో నుండి పొంగుకొస్తున్న కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేక….. !! జై అంటూ తన గుండెల మీద వాలిపోయి ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చేస్తుంది…. !!

ఏమైంది నాన్సీ ఎవరైనా ఏమైనా అన్నారా….. ?? చూడు నా దగ్గర నువ్వు ఎదీ దాచలేవు కాబట్టి ఏమైందో చెప్పు ఎందుకు నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నావ్ ….. ?? నాన్సీ కన్నీళ్ళు తుడుచుకుంటూ జై నుండి దూరం జరుగుతూ జై ఎవరు ఏమనుకున్నా నీతో నా రిలేషన్ చాలా ప్యూర్ & నాకు ఎవరున్నా లేకున్నా నువ్వు నా పక్కన ఉంటే చాలు అనుకునేంత ఇష్టం నాకు…… !!

నీ కోసం చావడానికి కూడా నేను రెడీగా ఉంటాను ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నా అంటే అది నువ్వు నాకు పెట్టినా బిక్షే… !! నాన్సీ అలా మాట్లాడద్దు అని చెప్పాను కదా ఇప్పుడు ఇదంతా కాదు నిన్ను ఎవరేం అన్నారో ఆది చెప్పు… !!

జై నువ్వు ఇప్పుడిప్పుడే నీ పాత లైఫ్ వదిలేసి మీ డాడ్ కోసం అన్ని మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేసావ్ అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను….. !! నా లాంటి దాని వల్ల నీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు నువ్వు ఆద్య సంతోషంగా ఉండాలి….. !! నేను నీ లైఫ్ లో ఉంటే నీకు కచ్చితంగా లేని పోనీ ప్రాబ్లమ్స్ వస్తాయి …… !!

 

అందుకే నీకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా కానీ అది నా వల్ల కావడం లేదు…. !! ఎమ్ చేస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావ్ నువ్వు నాకు దేవుడి తో సమానం జై నీ నుండి నేను దూరం అవ్వాలి అంటే ఈ ప్రాణం పోయాకే….. !! అలా అని నీ లైఫ్ లో ఉండి నిన్ను ఇబ్బంది పెట్టలేను అందుకే ఎమ్ చేయాలో తెలియక పిచ్చి పడుతుంది…. !!

 

జై నాన్సీ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని లుక్ నాన్సీ నీతో ఎవరు నాకు దూరంగా ఉండమని చెప్పారో నాకు తెలియదు కానీ….. ?? నువ్వు నా లైఫ్ లో నాకు చాలా స్పెషల్ ఇన్ఫాక్ట్ నన్ను అందరి కంటే ఎక్కువ అర్థం చేసుకుంది నువ్వే….. !! బాధ లో ఉన్నప్పుడు అమ్మ లా అక్కున చేరుకున్నావ్ నా ప్రాబ్లెమ్ తెలుసుకుని ఏ
అమ్మాయి చేయలేని పని నువ్వు నా కోసం చేసావ్….. !!
నా వల్ల నీకు ఎంత పెయిన్ గా ఉన్నా అన్ని బరించావ్ నువ్వు నిజంగా బంగారం నాన్సీ….. !!

నా లైఫ్ లో నువ్వు లేకుంటేనే నేను ఎక్కువ ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తానేమో….. !! నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ నాన్సీ ఇంకెప్పుడు నా నుండి దూరంగా వెళ్ళడానికి ట్రై చేయకు…. !! అర్థం అవుతుందా అంటున్న జై ను చూసి నాన్సీ ఏడుస్తూ లవ్ యూ జై అంటూ గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటే…… !!!జై తన వీపు నిమురుతూ ఓదారుస్తూ నాన్సీ ని ఎవరు తనకు దూరంగా ఉండమని చెప్పారా అని ఆలోచిస్తూ ఉంటాడు….. !!

 

💫💫💫💫💫💫💫💫💫💫💫

 

అన్నయ్య బయటకు రావడం సేల్స్ గర్ల్ చూసాను అని చెప్పింది కానీ ఎక్కడ…. ?? అని జై ను వెతుకుతూ పార్కింగ్ సైడ్ వచ్చిన మాయ కి నాన్సీ ను జై కౌగిలిలో చూసి ఉన్న చోటు నే ఆగిపోతుంది….. !! నాన్సీ జై కి ఐ లవ్ యు అని చెప్పడం విని కోపంగా చూస్తూ ఉంటుంది……. !! జై నాన్సీ కన్నీళ్ళు తుడుస్తూ ఫోర్హెడ్ కిస్ చేయడం చూసి ఇక అక్కడ ఉండలేక పక్కకు వెళ్ళిపోయి ఒక చోట కూర్చుని కన్నీళ్ళు పెట్టుకొంటూ ఉంటుంది….. !!

 

మ్యారేజ్ అయ్యాక అయినా నువ్వు చేంజ్ అవుతావు అని చాలా ఆశ పడ్డాను అన్నయ్య….. !! కానీ యూ నెవెర్ చెంజ్డ్ నువ్వు మారాలి అనుకున్నా ఇలాంటి బిచ్ లు నిన్ను మారనివ్వరు….. !! నిన్ను ఇలా చూసి నేనే ఇంతలా ఏడుస్తున్నా అదే వదిన చూసుంటే ఇప్పుడే విచ్చుకుంటున్న మీ ప్రేమ మొగ్గలోనే వాడిపోయి చచ్చిపోయేది… !!

వదిన తో హ్యాపీగానే ఉన్నావ్ కదా మళ్ళీ ఎందుకు ఇలాంటి వాళ్ళను దగ్గరకు రాణిస్తున్నావ్ అన్నయ్య….. ?? దీనికి అంతలా చెప్పినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నిన్ను వెతుకుతూ వచ్చింది దీన్ని అంత ఈజీగా వదలను ….. !! అని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది….. !!

సడెన్ గా తన బుజం మీద పడ్డ చేయికి ఉలిక్కిపడి తల పైకి ఎత్తి చూసిన మాయ కి ఎదురుగా కనిపిస్తాడు రుద్ర….. !! జై ని తీసుకుని వస్తానని చెప్పి ఇక్కడేం చేస్తున్నావే అని అడుగుతూ మాయ కళ్ళల్లో నిలిచిన నీటిని చూసి ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు…… ?? అని అడుగుతూ మాయ పక్కన కూర్చుంటాడు…. !!

హర్ష అంటూ రుద్ర ను చూడాగానే ఏడుపు రావడం తో రుద్ర బుజం మీద తల పెట్టుకుని అన్నయ్య ఇప్పటికీ మారలేదు రా….. !! అని బాధగా చెప్తున్న మాయ తల నిమురుతూ ఏమైంది పొట్టి జై ఏమైనా అన్నాడా అని అడుగుతూ మాయ కన్నీళ్ళు తుడుస్తాడు…… !!

ఉహు అది కాదు యూ నో ఇట్ కదా అన్నయ్య కి పాస్ట్ లో కొన్ని రిలేషన్స్ ఉన్నాయి అని …… !! హ్మ్మ్ అవును తెలుసు అయితే ఏంటి ఇప్పుడు అది తన పాస్ట్ కదా నౌ హి ఈజ్ హ్యాపీ విత్ ఆద్య….. !! అవన్నీ థింక్ చేసి ఎందుకు ఏడుస్తున్నావ్ ….. ??

అవి పాస్ట్ లో ఉంటే నేను ఎందుకు ఏడుస్తాను హర్ష అవి ప్రెసెంట్ కూడా కంటిన్యూ అవుతున్నాయి…. !! ఇందాక అన్నయ్య ను పిలవడానికి వెళ్ళాను కదా అక్కడ పార్కింగ్ లాట్ లో అన్నయ్య నాన్సీ అని అన్నయ్య వన్ ఆఫ్ ది గర్ల్ ఫ్రెండ్ ను హగ్ చేసుకుని కనిపించాడు… !! అన్నయ్య చేంజ్ అయ్యాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ అంటూ వచ్చే కన్నీళ్లు తుడుచుకుంటుంది ….. !!

నాకున్న ప్రాబ్లెమ్ గురించి ఇప్పుడు నీకు & నాన్సీ కి తప్పా ఎవరికి తెలియదు…… !! అని చెప్పిన జై మాటలు గుర్తొచ్చి అయ్యో పొట్టి అదేం లేదు అసలు ఏం జరిగింది అంటే….. ?? వద్దు హర్ష నాకేం చెప్పకు ఈ టాపిక్ గురించి మాట్లాడడం కూడా నాకు చిరాగ్గా ఉంది….. !! అని తన మాటలు వినకుండా విసుగ్గా వెళ్తున్న మాయ ను చూసి రుద్ర తల పట్టుకుంటాడు…… !!

💫💫💫💫💫💫💫💫💫💫💫

చుట్టూ ఎవరు లేని నిర్మానుష్యపు ప్రదేశం లో అభీర్ కార్ ఆగుతుంది….. !! వేగంగా కార్ దిగిన అభీర్ చేతిలో స్కాచ్ పట్టుకుని కార్ దిగుతూ మండుతున్న స్కాచ్ ను గొంతు లో పోసుకుంటూ…… !! నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా పెళ్ళి చేసుకున్నావ్ ఆధ్య…… ?? నువ్వు లేని లైఫ్ ను నేను ఇమాజిన్ కూడా చేసుకోలేక పోతున్నాను…… !!

నిన్ను నేను ఎంతలా ప్రేమించానో మండుతున్న నా గుండెకు మాత్రమే తెలుసు….. !! నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు ఆద్య అంటూ కోపంగా స్కాచ్ బాటిల్ పగల కొట్టేసి దిక్కులు పిక్కటిల్లేలా ఆధ్య ఐ వాంట్ యూ & ఐ లవ్ యూ అంటూ గట్టిగా అరుస్తాడు….. !!

నేల మీద కు జారిపోయి జుట్టు పట్టుకుని పీక్కుంటూ నో ఆద్య…… !! నిన్ను నేను దూరం చేసుకుని బ్రతకలేను…. !! అయినా జై అంటేనే మండి పడే నువ్వు వాడిని ఎందుకు పెళ్లి చేసుకుని నాకు అన్యాయం చేసావ్…… ?? తెలుసుకుంటాను ఆధ్య నువ్వు వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావో ఎలాంటి పరిస్థితి లో చేసుకున్నావో అన్ని తెలుసుకుంటాను … !!

 

నువ్వు వాడిని ఇష్టపడే పెళ్ళి చేసుకుని ఉండుంటే ఒకే నిన్ను దూరం నుండి చూసి ఆరాధిస్తూ బ్రతికేస్తా ….. !! లేదు నువ్వు వాడిని అయిష్టంగా పెళ్ళి చేసుకుని ఉండుంటే మాత్రం నువ్వు ఎప్పటికైనా నా దానివే….. !! యస్ నువ్వు ఈ అభీర్ కి మాత్రమే దక్కాలి అభీర్ వెడ్స్ ఆధ్య….. !! ఆధ్య నాది నాది మాత్రమే అంటూ ఆద్య మీదున్న పిచ్చి ప్రేమతో తనలోని మరో కోణాన్ని పరిచయం చేస్తాడు అభీర్ 😈… !!

అభీర్ 😈 vs జై దీర్ 😈 …… ?? మీకు ఈ స్టోరీ నచ్చిన క్యారెక్టర్ ఎవరు….. ?? ఎవరో ఒక్కరే చెప్పాలి అలాగే రీసన్ కూడా ఎందుకు నచ్చారో చెప్పాలి…… ??