Login with OTP

విలన్ హస్బెండ్{2} -18

aashyatech

Author

మాయ ఎటు వెళ్ళావ్ చూడు నీకు ఈ శారీ చాలా బావుంటుంది అని మాయ కోసం సెలెక్ట్ చేసిన శారీ తన వంటి మీద వేస్తూ….. !! వావ్ నేను అనుకున్న దాని కంటే ఇంకా చాలా బావుంది కదా మాన్య….. !! హా ఆధ్య నిజంగానే మాయ కి శారీ బాగా సెట్ అయ్యింది అంటూ ఇద్దరూ శారీస్ గురించి మాట్లాడుతూ ఉంటే….. !! మాయ ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి…… !!

 

ఐ ఆమ్ సారి వదిన స్టిల్ అన్నయ్య నిన్ను చీట్ చేస్తూ….. !! తన ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ తో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు బట్ ప్రామిస్ వదిన అన్నయ్య లైఫ్ లో నువ్వు మాత్రమే ఉండాలి…. !! అలా ఉండాలి అంటే అన్నయ్య లైఫ్ లో ఉన్న స్క్రాప్ ను ఎమ్ చేసైనా దూరం చేస్తాను….. !! అని నవ్వుతున్న ఆద్య మొహాన్ని చూస్తూ నీ మొహం లో ఈ బ్యూటిఫుల్ స్మైల్ మాత్రం దూరం అవ్వనివ్వను….. !!
మాయ ఏమైంది నీకు ఎందుకలా డల్ గా ఉన్నావ్….. ?? శారీ నచ్చలేదా పోనీ నీకు ఇందులో ఎదీ నచ్చిందో చెప్పు…. !! ఆ… అదేం లేదు వదిన నేనేదో ఆలోచిస్తూ ఉన్నాను శారీ చాలా బావుంది వదిన అంటూ చిరు నవ్వుతో చెప్తున్న మాయ ను చూసి….. !! అంతేనా ఇంకా నీకు శారీ ఎక్కడ నచ్చలేదో అనుకున్నాను…… !!

నీ సెలెక్షన్ ఎపుడు టూ గుడ్ వదిన అంటూ మళ్ళీ ఎప్పటిలా అల్లరి పిల్ల లా మారిపోయి ఆధ్య, మాన్య లతో అల్లరి చేస్తూ తన షాపింగ్ కంటిన్యూ చేస్తుంది మాయ…… !! ఈ లోగా అబ్బాయిలు కూడా రావడం తో వీళ్ళ శారీ సెలెక్షన్ అవ్వగానే జెంట్స్ సెక్షన్ వైపు వెళ్తూ అబ్బాయిలకు సెలెక్ట్ చేస్తూ ఉంటారు….. !!

జై రెండు షర్ట్స్ పట్టుకుని చూస్తూ ఆధ్య ఈ రెండిటిలో ఎదీ బావుందో చెప్పు….. ?? వీడేంటీ ఎప్పుడూ లేనిదీ నన్ను సెలెక్ట్ చేయమని అడుగుతున్నాడు అని డౌబ్ట్ గా చూస్తున్న ఆద్య కి పక్కనే షర్ట్స్ చూస్తూ కనిపిస్తారు మాన్య, మాయ….  !! ఓహ్ వీళ్ళు ఉన్నారని యాక్ట్ చేస్తున్నాడా  😏 ఈ సారి యాక్టింగ్ కాకుండా ఓవర్ యాక్టింగ్ కానీ చేయాలి అపుడు చెప్తా వీడి పని అని జై వైపు గుర్రుగా చూస్తూ ఉంటుంది….. !!
హలో మరీ దిష్టి తగిలేలా చూడకు ఐ నో నీ కంటే నేనే అందంగా ఉంటాను బట్ ఎం చేస్తాం అడ్జస్ట్ అవ్వక తప్పట్లేదు ☹️….. !! నువ్వు ఏ జన్మ లోనూ గట్టిగా పూజ చేసుంటావ్ అందుకే నా లాంటి హ్యాండ్సం &  డైనమిక్ గాయ్ ను హస్బెండ్ గా కొట్టేశావ్….. !!

నేను పూజ చేయడం కాదు రా నా శత్రువులు ఎవరో నా మీద గట్టిగా చేతబడి చేసినట్టు ఉన్నారు…… !! అందుకే నువ్వు హస్బెండ్ గా నా లైఫ్ లోకి లెఫ్ట్ లెగ్ తో అడుగు పెట్టావ్ అనుకుంటూ….. !! నీ సెల్ఫ్ డబ్బా అయిపోతే షర్ట్స్ చూద్దాం అని కోపంగా చెప్పి జై కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే బ్లాక్ సెలెక్ట్ చేస్తుంది….. !!

కానీ జై ఆద్య సెలెక్ట్ చేసింది కాకుండా పక్కనున్న చాక్లెట్ అల్ట్రా వైన్ కలర్ షర్ట్ తీసుకుని ఇది పెర్ఫెక్ట్ అని నవ్వుతాడు….. !! నీ…!! ఆల్రెడీ అదే తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాక నన్ను ఎందుకు రా సెలెక్ట్ చేయమని అడిగావు…… ?? అని పళ్ళు నూరుతూ చూస్తుంటుంది…… !!

నీ సెలెక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నా బట్ నీ సెలెక్షన్ మరీ ఇంత వరస్ట్ గా ఉంటుంది అనుకోలేదు  😏…… !! నీ కంటే నేనే బెటర్ గా సెలెక్ట్ చేసుకున్నా చూసావా ఈ షర్ట్ ఎంత బావుందో అని యాటిట్యూడ్ గా చెప్తాడు….. !!

హ్మ్మ్…. !! నిజమే నా సెలెక్షన్ వరస్ట్ గా ఉంటుంది అందుకే గా హస్బెండ్ గా నిన్ను సెలెక్ట్ చేసుకున్నా 😎 ….. !! అని జై పంచ్ ఇచ్చి జై నోరు క్లోజ్ అయ్యేలా చేసిన ఆద్య ను చూసి జై కోపంగా చూస్తూ ఉంటాడు….. !!

✨✨✨✨✨✨✨✨✨✨

 

మాన్య ఇది ఎలా ఉంది అంటూ ఫుల్ స్లీవ్ బ్లూ డెనిమ్ జాకెట్ వేసుకుని అడుగుతున్న అమర్ వైపు విసుగ్గా చూస్తూ…… !! ఎహే ఎన్ని ట్రై చేస్తావ్ అప్పటి నుంచి చూస్తున్నా అది బావుందా ఇది బావుందా అని విసిగిస్తున్నావ్ ….. ?? నీకు నచ్చింది తీసుకో అయినా పెళ్లి చూపులకు రెడీ అవుతున్నట్టు ఎందుకు ఈ హడావిడి 😏 నవ్వు ఎలా ఉన్నా అలాగే జిడ్డు ఫేస్ తో తగలడ్తావ్ కానీ ఎదోటి తీసుకో…… !!

 

అబ్బా నీకు నా ప్రాబ్లం అర్థం కావట్లేదు మాన్య….. !! నీకు చెప్పాను కదా నచ్చిన అమ్మాయితో డేట్ కి వెళ్తున్నా & అక్కడే ఆ అమ్మాయికి ప్రపోస్ చేయబోతున్నా అని మరి అలాంటి అకేషన్ కి ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా చెప్పు….. !! ఉండు ఇది అంత బాలేదు అనుకుంటా వేరేది ట్రై చేస్తాను అంటూ మళ్ళీ ట్రైల్ రూమ్ లోకి దూరుతాడు….. !!

వీడి మమ్మీ 😬 😬 అని పళ్ళు కొరుకుతూ రెడీ అవుతావా అవ్వు అవ్వు నీ సంగతి చెప్తా అనుకుంటూ….. !! బయటకు వచ్చిన అమర్ చెయ్ పట్టుకుని నాకు ఒక శారీ సెలెక్ట్ చేద్దువు కానీ పదా….. !!  అని కావాలని అమర్ ను ఒక్కటే శారీ సెక్షన్ వైపు తీసుకుని వెళుతుంది…. !!

ఎక్స్క్యూస్ మీ డిజైనర్ శారీస్ చూపించండి అని సేల్స్ గర్ల్ కి చెప్పగానే….. !! సేల్స్ గర్ల్ పై రాక్ లో ఉన్న శారీస్ తీస్తూ ఉంటుంది అది చూసిన మాన్య అమర్ వైపు చూడగా తను మొబైల్ చూస్తూ కనిపిస్తాడు….. !! ఇదే ఛాన్స్ అనుకున్న మాన్య కావాలని ఆ సేల్స్ గర్ల్ నడుము తోడు ఊడోచ్చేలా ఇచ్చి కామ్ గా ఏదో శారీ చూస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటుంది….. !!

ఆ సేల్స్ గర్ల్ నడుము దగ్గర ఆ… అని నొప్పికి చేత్తో రుద్దుకుంటూ వెనక్కి తిరిగి అమర్ వైపు కోపంగా చూస్తుంది….. !! కరెక్ట్ గా అదే టైమ్ కి అమర్ కూడా సేల్స్ గర్ల్ వైపు చూస్తూ చిన్నగా స్మైల్ ఇవ్వగానే ఆ సేల్స్ గర్ల్ అమర్ చంప పగల కొట్టి కోపంగా అక్కడి నుండి వెళ్లిపోవడం …… !! చూసి అమర్ బిక్క మొహం వేస్తే మాన్య మొహానికి చీర అడ్డు పెట్టుకొని మరీ నవ్వుకుంటుంది 🤭…… !!

 

అమర్ ఎమ్ జరిగింది ☹️☹️ అని మొహాన్ని అమాయకంగా పెట్టుకుని అడుగుతున్న మాన్య ను చూసి…… !! ఎమ్ జరిగిందో తెలియదు కానీ ఏదో జరిగింది అని మాత్రం అర్థం అయింది 😒…. !! ఇక్కడ శారీస్ బాలేవు వేరే చోటుకు వెళ్దాం పదా అని అమర్ ముందుకు వెళ్ళడం చూసి ఎస్ అని నవ్వుకుంటూ…. !! ఇప్పుడు వెళ్ళి ప్రపోజ్ చేయరా వెంటనే ఒప్పుకుంటుంది అని తనలో తాను నవ్వుకుంటూ అమర్ వెనుకే వెళ్తుంది….. !!

💫💫💫💫💫💫💫💫💫💫💫

 

రుద్ర తనకు నచ్చినవి కొన్ని షర్ట్స్ & ట్రవ్సర్స్ తీసుకుని ట్రయల్ రూమ్ కి వెళ్ళడం చూసి మాయ కూడా ఎవరూ చూడకుండా వెనుకే వెళ్తుంది….. !! డోర్ క్లోజ్ చేస్తున్న రుద్ర ను నెట్టుకుంటూ లోపలికి వెళ్ళి ఏయ్ నువ్వంటే అని అడుగుతున్న…… !!  రుద్ర ను వాల్ కి లాక్ చేస్తూ రుద్ర గుండెల మీద మోచేతిని ఆనిస్తూ…… !! నీకు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే చాలా మరి నాకు ఎవరు సెలెక్ట్ చేస్తారు చెప్పు….. !!

నేను రాకనే నీ సెలెక్షన్ అయిపోయింది కదా పొట్టి….. !! కావాలంటే మళ్ళీ సెలెక్ట్ చేస్తాను కానీ ముందు నువ్వు బయటకు వెళ్ళు….. !! అందరూ ఇక్కడే ఉన్నారు ఇలా మనల్ని చూస్తే ఇంకేమైనా ఉందా బయటకు వెళ్లవే ప్లీస్….. !! నీ అన్నా కానీ మనల్ని ఇలా చూస్తే కొంప మునుగుతుంది….. !!

మా అన్నయ్య కి నేనంటే చాలా ఇష్టం ఒకవేల చూసిన కూడా మన లవ్ ను నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తాడు…… !!

అంత లేదు పాప అన్న లు ఏ విషయం లో అయినా చెల్లిళ్ళకు సపోర్ట్ చేస్తారు ఒక్క పెళ్ళి విషయం లో తప్పా…… !! నీ అన్న నీ కోసం ఏ హాలీవుడ్ హీరో ను తీసుకొచ్చి పెళ్లి చేయాలి అని చూస్తున్నాడు …. !!

ఎమ్ కాదు మా అన్నయ్య చాలా మంచోడు అది నీకు త్వరలోనే తెలిసేలా చేస్తాను….. !! అవును ఇందాక ఏంటి అందరూ అన్న లు అంతే అన్నావ్ కదా మరి నువ్వెందుకు నీ చెల్లిని నా అన్న తో పెళ్ళికి ఒప్పించావ్ అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది….   !!

నా సిచుయేషన్ వేరు పాప అయినా టైం వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం కానీ ముందు నువ్వు వెళ్ళు…. !! ఇప్పుడిప్పుడే అందరూ అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం తో హ్యాపీగా ఉన్నారు….. !!  ఈ టైమ్ లో మన గురించి తెలిసి ఫ్యామిలీ లో డిస్టర్బెన్స్ రావడం నాకు ఇష్టం లేదు…   !! ఇంకో 3 ఇయర్స్ దాకా మన విషయం ఎవరికి తెలియకూడదు ….. !!

అప్పుడు కూడా ఎందుకు ఒకే సారి  షస్టీపూర్తి చేసుకుందాం అప్పుడు అందరికీ చెప్దాం అని వెటకారంగా అంటూ…… !! మన పెళ్లి గురించి తర్వాత ఇప్పుడు మాత్రం నాకు ఒక ప్రామిస్ చెయ్… !! షాపింగ్ కి తీసుకుని వెళ్ళు అంటే ఇలా అందరితో ప్లాన్ చేసావ్ బట్ నైట్ మాత్రం నన్ను ఎవరికి తెలియకుండా & ఎవరూ చూడకుండా నన్ను మిడ్ నైట్ బైక్ మీద బయటకు తీసుకుని వెళ్ళాలి ….. !!

ఒసేయ్ మీ అమ్మ కానీ చూసిందంటే నాకు బ్రతికుండగానే పోస్ట్ మార్టం చేసేస్తుంది….. !! అయినా మన కొంప ఇప్పుడే ప్రశాంతంగా ఉంది అంటుంటే మళ్ళీ కొరివి పెడతావ్ ఎందుకే….. ?? నా పొట్టి కదా నా మాట వినమ్మా కావాలంటే ఇప్పుడు నీకు ఫ్యామికీ ప్యాక్ కొని పెడతాను…… !!

హు 😏 నాకేం అక్కర్లేదు నన్ను నైట్ బయటకు తీసుకొని వెళ్తావా….. ??  అన్నయ్య దగ్గర మన లవ్ స్టోరీ ఓపెన్ చేయమంటావా ….. ??

ఆ ఆ 😬 సరే తీసుకుని వెళ్ళి చస్తా అని ఫ్రస్ట్రేట్ అవుతున్న రుద్ర బుగ్గలు లాగుతూ చో క్యూట్…… !! ఇప్పుడు వెళ్తా అని డోర్ ఓపెన్ చేయబోయి అప్పుడే బయట డోర్ లాగుతున్న జై ను వెనుకే వస్తున్న ఆద్య మీద పడేలా చేసి కంగారుగా అక్కడి నుండి మాయం అవుతుంది…… !!

✨✨✨✨✨✨✨✨✨✨

 

జై వెళ్ళి ఆద్య మీద పడగానే ఇద్దరి పెదాలు కలుసుకుంటాయి ….. !! ఆద్య జై వైపు షాకింగ్ గా చూస్తే జై దొరికిందే చాన్స్ అన్నట్టు ఆధ్య పెదాలను గాఢంగా ముడి పెడతాడు …… !! అది చూసిన అందరూ సిగ్గు తో మొహాలు తిప్పేస్తే ఆధ్య విసురుగా పక్కకు నెట్టి కోపంగా పైకి లేచి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే…… !! జై ఆద్య ను లాక్కుని పక్కనే ఉన్న ట్రైలర్ రూమ్ లోకి దూరుతాడు…… !!

యూ వదులు అంటూ బయటకు వెళ్ళబోతున్న ఆధ్య కు అడ్డుగా నుంచుని…… !! తన హిప్ పట్టుకుని మీదకు లాక్కుని ఇన్నాళ్ళు కోయిన్సిడెంట్ గా మన ముద్దు సీన్స్ జరిగాయి అనుకున్నా బట్ నువ్వు వాంటెడ్ గా చేస్తున్నావ్ అని తెలుసుకోలేక పోయాను…… !! యూ నాటీ నీకు నా మీద క్రష్ ఉందని చెప్పడానికి ఎందుకు ఇంత బెట్టు చేస్తున్నావ్….. ?? నా లాగ నువ్వు కూడా ఓపెన్ గా ఉండచ్చు కదా….. !! ఓహ్ అర్థం అయింది వెంటనే ఒప్పేసుకోకూడదు అని బెట్టు చేస్తున్నావ్ రైట్….. !!

ఆధ్య జై వైపు సీరియస్ గా చూస్తూ నుంచునే పట్ట పగలు కలలు కంటున్నావా….. ?? నీ మొహానికి అంత సీన్ లేదు అంటూ జై ను దూరం నెడుతూ ఈ ఆధ్య ఎప్పటికీ నీకు పడదు….. !! ఇంకో సారి నా మీద పడితే కట్ చేస్తాను అని జై ను పై నుండి పై నుండి కింద దాకా చూస్తూ కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది….. !!

ఏంటిది కిందకు చూసి కట్ చేస్తాను అంటుంది అని తనను తాను క్లియర్ గా చూసుకున్న జై కి ఆద్య అన్నది అర్థం అవ్వగానే….. !! ఓసినీ నన్ను అంత మాట అంటావా అయిపోయావే అని ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేసి……. !! వెళ్తున్న ఆద్య చెయ్ పట్టుకుని లోపలికి లాగి గట్టిగా హగ్ చేసుకోబోతాడు…… !!

అయ్యో సర్ నేను అలాంటి వాడిని కాదు అని అరిచిన సేల్స్ బాయ్ వాయిస్ కి ఉలిక్కిపడి ఆ అబ్బాయిని చూసి…… !! ఏయ్ చిఛీ ఎవర్రా నువ్వు నేను కూడా ఆ టైప్ కాదు అని విసురుగా డోర్ ఓపెన్ చేసి బయటకు రాగానే….. !! ఆధ్య జై ను అలా చూసి నాతో పెట్టుకోకు అని స్టైల్ గా హెయిర్ ను బుజం మీద కు తోసి నడుచుకుంటూ వెళ్ళడం చూసి జై పళ్ళు నూరుతూ చూస్తూ ఉంటాడు…… !!