విలన్ హస్బెండ్{2} -19
అందరూ షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్ నూన్ 3 అవుతుంది…. !! రాగానే అందరూ సోఫా లో సెటిల్ అవ్వడం చూసిన శైలు అందరి చేతుల్లో ఉన్న షాపింగ్ కవర్స్ చూసి టెంపుల్ కి వెళ్ళి రండి అంటే షాపింగ్ చేసి వస్తున్నారా… ?? వెళ్ళి అందరూ ఫ్రెష్ అయి రండి లంచ్ వడ్డిస్తాను అని అందరినీ రూమ్స్ కి పంపి డైనింగ్ టేబుల్ మీద వీళ్ళ కోసం చేసిన డిషెస్ పెడుతూ ఉంటుంది….. !!
ఫ్రెష్ అయిన జై షర్ట్ వేసుకుంటూ మిర్రర్ ముందు నుంచుని హెయిర్ కూంబ్ చేసుకుంటున్న ఆద్య ను చూసి….. !! షాపింగ్ మాల్ లో నువ్వు చేసిన దానికి ఇప్పుడు కచ్చితంగా రివేంజ్ తీర్చుకుంటానే ….. !! నిన్ను అందరిలో ఎలా బుక్ చేస్తానో చూడు అని ఆద్య వైపు కోపంగా చూస్తూ అనుకుంటూ ఉంటాడు….. !!
ఆధ్య రెడీ అవుతూ మిర్రర్ లో చూస్తున్న తనకు ….. !! జై తన వైపు కన్నింగ్ గా చూస్తూ కనిపించగానే వీడేంటీ అరుంధతి మూవీ లో పశుపతి లా నన్ను ఇంత కోపంగా చూస్తున్నాడు…. !! వీడి వాలకం చూస్తుంటే నన్ను ఇరికించే చెత్త ప్లాన్ ఏదో వేసినట్టే ఉన్నాడు ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి…… !! అని బయటకు వెళ్ళడానికి డోర్ వైపు వెళ్తూ ఉండగా వీళ్ళు రూమ్ లో ఎమ్ చేస్తున్నారు….. !! అని డోర్ సందులో నుండి చూస్తూ కుక్కలా కాపలా కాస్తూ ఉంటుంది రేణుక….. !!
ఈవిడ ఒకత్తి నా ప్రాణానికి అని మొహాన్ని విసుగ్గా పెట్టుకొంటూ…… !! ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేయాలి ఛా అని కాలితో ఫ్లోర్ ను విసుగ్గా కొట్టి షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్న జై ముందుకు వెళ్ళి నుంచుంటుంది …… !!
వాట్ అని కళ్ళతో అడుగుతున్న జై ను చూసి నవ్వుతూ….. !! నేను ఇక్కడే ఉన్నాను కదా జై నన్ను పిలవచ్చు కదా సర్లే ముందుకు నువ్వు ఇలా కూర్చో…… !! అని జై ను బెడ్ మీద కు తోసి ఆధ్య వెళ్ళి జై వొళ్ళో కూర్చుంటుంది….. !! అది చూసిన రేణుక కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతూ ఇద్దరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది….. !!
ఏయ్ ఏంటిది ముందు పైకి లెగు అంటున్న జై కి తన కళ్ళతోనే డోర్ దగ్గరున్న రేణుక ను చూపించి నవ్వుతూ….. !! మీ అమ్మ కి డౌబ్ట్ వచ్చినట్టు ఉంది జాగ్రత్తగా మ్యానేజ్ చెయ్ అనగానే జై కూడా నవ్వుతూ తప్పుతుందా చచ్చినట్టు చేసి చస్తా అని కోపంగా చెప్తూ నవ్వుతాడు…. !!
అబ్బా ఏంటీ జై నువ్వు పగలు రాత్రి తేడా లేకుండా ఇలా నా వెనుకే తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఎమ్ అనుకుంటారు చెప్పు….. !! అంటూ తన నడుమును కొండ చిలువలా చుట్టేసిన జై చేతులను తియ్యడానికి చూస్తూ అంటుంది….. !!
అరే ఎవరు ఎం అనుకోరు అయినా కొత్తగా పెళ్లైన వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకు మాత్రం తెలియదా చెప్పు….. !! నువ్వు మరీ అల్లరి వాడివి అయిపోతున్నావ్ జై అని జై బుగ్గలు లాగుతూ …. !! షర్ట్ బటన్స్ పెడుతూ సడెన్ గా ఇలా మనల్ని ఎవరైనా చూస్తే బాగోదు జై పదా వెళ్దాం…… !!
కొత్తగా పెళ్ళైనా వాళ్ళ రూమ్ లోకి డోర్ నాక్ చేయకుండా బుద్దున్న ఏ ఎదవైనా వస్తాడా చెప్పు….. !! అదంతా కాదు ముందు అర్జంట్ గా నా కిస్ నాకు ఇవ్వు అని ఆద్య తల పట్టుకుని కిస్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు…… !! వెనుక నుండి చూస్తున్నా రేణుక కి ఇద్దరూ డీప్ లిప్ కిస్ లో ఉన్నట్టు కనిపించగానే చీచీ అని అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది…. !!
డోర్ క్లోజ్ చేసిన సౌండ్ కి ఇద్దరూ ఉఫ్ అని ఊపిరి తీసుకుంటూ…… !! ఆధ్య జై మెడ మీద తల పెట్టుకుని అలానే ఉండిపోవడం చూసి జై ఆద్య నడుము దగ్గర చెయ్ పట్టుకుని నొక్కగానే…. !! ఇడియట్ అని ఆద్య జై కి దూరంగా జరుగుతూ అక్కడి నుండి బయటకు వెళ్ళడం చూసి జై నవ్వుకుంటూ ఆద్య వెనుకే కిందకు వెళతాడు….. !!
💫💫💫💫💫💫💫💫💫💫💫
లంచ్ కి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన అందరినీ చూసి నవ్వుతూ….. !! కూర్చోండి మీ కోసం చాలా స్పెషల్స్ చేసాను అని శైలు చెప్పడం చూసి అందరూ కూడా చైర్స్ లో సెటిల్ అవుతారు …… !! ఆధ్య కూడా చైర్ లో కూర్చుంటూ ఉండగా తనను కిందకు పడేయడానికి జై తన చైర్ వెనక్కి లాగగానే….. !! ఆధ్య వెళ్ళి జై వడిలో పడుతుంది… !!
ఆ…. అంటూ తన వొళ్ళో పడ్డ ఆద్య ను చూసి దీన్ని కింద పడేద్దాం అనుకుంటే ఇది వచ్చి నా వొళ్ళో పడింది అని ఆద్య వైపు చూస్తూ…… !! అందరిలో ఉన్నాం ఆధ్య కొంచెం కంట్రోల్ లో ఉండు అంటున్న జై ను చూసి పళ్ళు నూరుతూ…… !! నన్నే కింద పడేయాలి అనుకుంటావా చెప్తా రా నీ పని అనుకుంటూ వెళ్ళి తన చైర్ లో కూర్చుంటూ…… !! తనను చూసి నవ్వుతున్న అందరినీ చూసి ఇబ్బందిగా నవ్వుతుంది….. !!
శైలు చిన్నగా నవ్వి అందరికీ సర్వ్ చేస్తూ ఆద్య కి ప్లేట్ లో ఫుడ్ పెట్టాక జై కి పెట్టబోతూ ఉంటే…… !! మామ్ స్టాప్ జై ఇవాళ ఉపవాసం అదేంటంటే మా పెళ్ళి మంచిగా జరిగితే ఉపవాసరం చేస్తాను అని మొక్కుకున్నాడు ఆట….. !! ఇందాక టెంపుల్ కి వెళ్ళినపుడు చెప్పాడు కాబట్టి 3 మంత్స్ ఎవ్రీ ఫ్రైడే జై ఫుల్ డే ఉపవాసరం ఉండాలి….. !!
ఇప్పుడు కూడా పాపం నాకు కంపెనీ ఇవ్వడం కోసం నా పక్కన కూర్చున్నాడు కానీ తినడానికి కాదు ఎంతైనా జై కి నేనంటే చాలా ప్రేమ….. !! మేము సంతోషంగా ఉండాలి అని నేను చేయాల్సిన ఉపవాసరం కూడా తనే చేస్తున్నాడు…. !! కదా జై 😉😉 అంటూ కన్ను కొట్టిన ఆద్య ను చంపేసేలా చూస్తూ తననే చూస్తున్న అందరినీ చూసి నవ్వుతూ 😁😁…… !! అవును అత్తయ్య నేను ఉపవాసం అంటూ ప్లేట్ ను తిప్పి పెడుతూ మీరు కానివ్వండి అని ఆద్య ను ఎన్ని తిట్లు తిట్టాలో అన్నీ తిట్టుకుంటూ ఉంటాడు…… !!
మేము ఎపుడైనా ఉపవాసరం చేస్తున్నా తిట్టే నువ్వు పెళ్ళయ్యాక ఆధ్య కోసం ఉపవాసరం ఉంటున్నావ్ అంటే నీలో చాలా మార్పు వచ్చింది జై…. !! ఏమైనా ఈ విషయం లో ఆధ్య ను మెచ్చుకోవాలి జై ను ఇంతలా మార్చేసినందుకు ….. !! అమర్ మాటలకు ఆద్య నవ్వుతూ చూస్తే అది చూసిన జై నవ్వవే నవ్వు నీ మీద నేను రివేంజ్ తీర్చుకోవాలి అనుకుంటే…… ?? నా కడుపు కొట్టావ్ కదే నీకు ఇవ్వాళ నా చేతిలో మూడింది అని ఫుడ్ ను లొట్టలేసుకుంటూ ….. !! అబ్బబ్బా వంటలు అదరకొట్టేశావ్ మమ్మీ ఈ బొబ్బట్లు ఉన్నాయి చూడు వీటి మీద ఇలా నెయ్యి పోసుకుని నోట్లో పెట్టుకుంటే ఇట్టే జరిగిపోతున్నాయి అంటూ ఉమ్…. ఉమ్…. అని సౌండ్స్ చేస్తూ తింటుంది….. !!
వదిన బొబ్బట్లు మాత్రమే కాదు ఈ జీడిపప్పు పాయసం కూడా చాలా టేస్టీ జై ఉంది ఒక సారి ట్రై చెయ్…… !! అవునా మాయ అంటూ మామ్ నాకు కూడా బౌల్ లో కొంచెం పాయసం వేయ్ అని దాన్ని కూడా టేస్ట్ చేస్తూ జై ను మరింత ఊరిస్తుంది….. !!
దీనికి లూజ్ మోషన్స్ కాను ఎలా తింటుందో చూడు అని టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ వైపు ఆశగా చూస్తూ…… !! నాలుక తో పెదాలు తడుపుకుంటూ కళ్ళతోనే తింటున్న జై ను చూసి ఆద్య తనలో తాను నవ్వుకుంటూ ఫుల్ గా లాగిస్తుంది…… !! అయ్యో జై నువ్వు ఎమ్ తినకూడదా పోనీ స్వీట్ అయినా తిను అంటున్న శైలు ను చూసి ఒకే అనబోతున్న జై నోరు నొక్కేస్తూ… !! అబ్బా మామ్ ఆయన ఎంతో నిష్టగా ఉపవాసం ఉంటుంటే ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేస్తావ్ చెప్పు….. !!
అయినా జై ను తక్కువ అంచనా వేటకు జై ఒక్క సారి ఉపవాసం ఉండాలి అనుకుంటే ఎంత కష్టం అయినా సరే ఉంటారు….. !! ఎమ్ అంటావ్ జై అనగానే యాహ్ అఫ్క్పోర్స్ అని యాటిట్యూడ్ గా చెప్తూ ఒక్క రోజేంటి…… ?? నేను ఉండాలిఅనుకుంటే వారం రోజులు & నెల అయినా ఉండగలను అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పి అడ్డంగా బుక్ అవుతాడు….. !!
చూసావా మామ్ అది మా ఆయన అంటే నువ్వు ఇంకో సారి అడిగితే రేపు కూడా ఉపవాసం చేసేలా ఉన్నాడు ….. !! అనగానే ఇది నన్ను అడ్డంగా బుక్ చేసేసింది రాక్షసి అని ఆద్య ను తిట్టుకుంటూ….. !! ఏవీ తినకపోయినా వాటి నుండి వస్తున్న స్మెల్ చూసి కడుపు నింపుకుంటూ ఆద్య ను కోపంగా చూస్తూ ఉంటాడు…… !!
అందరూ ఫుల్ గా లాగించి హాల్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే….. !! జై కి మాత్రం కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ పెట్టుకుంటునట్టు విపరీతంగా ఆకలి వేస్తూ ఉంటుంది… !! దేవుడా ఇప్పుడు ఏదో ఒకటి తినకపోతే చచ్చిపోయేలా ఉన్నాను అని కడుపు పట్టుకుని అందరి వైపు చూస్తాడు….. !!
అందరూ దేని గురించో డిస్కస్ చేస్తూ జై ను గమనించరు అది చూసిన జై ఇదే కరెక్ట్ టైమ్ అనుకుని పిల్లలా అక్కడి నుంచి మెల్లగా లేచి కిచెన్ లోకి దూరుతాడు…… !! జై వెళ్ళడం ఎవరూ చూడకపోయినా ఆధ్య చూసేయడం తో వీడేంటీ సైలెంట్ గా కిచెన్ లోకి దూరాడు….. !! ఓహ్ సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్ళి పొట్ట లోకి ఏదైనా వేస్తున్నాడా…… ?? ఆగరా నీకు దిమ్మ తిరిగేలా చేస్తా అనుకుంటూ కిచెన్ బ్యాక్ డోర్ నుండి ఆద్య కూడా కిచెన్ లోకి వెళుతుంది…… !!
ఆద్య కిచెన్ కార్నర్ లో నుంచుని జై ఎమ్ చేస్తాడా అని చూస్తూ ఉంటుంది….. !! కిచెన్ లో ఉన్న కుక్స్ ఆధ్య ను చూసి అమ్మాయి గారు మీరు అని అనబోతు ఉంటే…… ?? హుష్ 🤫 మీ వర్క్ మీరు చూసుకోండి అని చెప్తూ జై కి కనపడకుండా దాక్కుంటుంది….. !! జై కిచెన్ లోకి వచ్చి కుక్స్ ను చూసి గాడ్ వీళ్ళు ఇక్కడే ఉన్నారే వీళ్ళను ఫుడ్ కోసం అడిగితే బాగోదు …. !! ఎందుకంటే నా తింగరి పెళ్ళాం అందరి దగ్గర నన్ను ఉపవాసం పేరు తో బుక్ చేసింది కదా….. !!
ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ యస్ వీళ్ళందరినీ అత్తయ్య పిలుస్తుంది అని బయటకు పంపేసి…… !! వీళ్ళు వచ్చేలోగా ఏదో ఒకటి తినాలి అనుకుని మిమ్మల్ని అత్తయ్య పిలుస్తున్నారు వెళ్ళండి అందరూ వెళ్ళండి… !! అని చెప్తున్న జై ను చూసి ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఆద్య ♥️ జై రొమాన్స్ కి అడ్డుగా మేము ఎందుకు అన్నట్టు అందరూ బయటకు వెళ్ళిపోతారు…… !!
ఆధ్య సౌండ్ రాకుండా స్టవ్ మీదున్న కుక్కర్ తీసి గరిట మంట మీద పెట్టి ….. !! అది బాగా వేడిగా అయ్యాక జై డోర్ వైపు చూస్తూ తన చేతికి ఏమైనా దొరుకుతుందా ……. ?? అని ఇందాక చూసినపుడు కనిపించిన పాయసం బౌల్ కోసం చేత్తో తడుముతూ డోర్ వైపు ఎవరైనా వస్తున్నారా అని చూస్తూ ఉంటాడు….. !!
ఆల్మోస్ట్ పాయసం బౌల్ తన చేతికి తగులుతున్న టైం కి బాగా కాలిన గరిట తీసి జై చేతి మీద పెట్టి జై తో నొప్పికి కేక పెట్టిస్తుంది….. !! ఆ…. అమ్మా అని అరిచిన జై వాయిస్ కి ఫాస్ట్ గా గరిట పట్టుకుని బ్యాక్ డోర్ నుండి బయటకు పరిగెత్తి దాన్ని పక్కకు విసిరేసి ఎమ్ తెలియనట్టు హాల్ లోకి వస్తుంది….. !!
జై అరుపుకి అందరూ ఏమైందీ అంటూ కిచెన్ లోకి వచ్చి కాలిన చేతిని పట్టుకుని ఉఫ్.. ఉఫ్….. అని ఊదుకుంటున్న జై ను చూసి….. !! జై ఏమైంది ఎందుకలా అరిచావ్ హ్యాండ్ కి ఏమైంది అని జై చేతిని పట్టుకుని కాలిన తన చేతిని చూసి ఏయ్ ఏంటిది ఇలా కాలింది అని కంగారుగా అడుగుతారు……. !!
డోంట్ నో ఏదో కాలుతున్నది వచ్చి చేతికి తగిలినట్టు చాలా నొప్పిగా ఉంది….. ;! మాన్య స్టవ్ మీదున్న కుక్కర్ చూసి కుక్కర్ తగిలి ఉంటుంది జై అయినా అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావ్….. ?? అసలు నువ్వు కిచెన్ లోకి ఎందుకు వచ్చావ్ అన్నయ్య అని అడుగుతున్న మాయ ను చూసి జై దగ్గర అన్సర్ ఉండదు…… !!
చచ్చాడు ఇప్పుడేం చెప్పి తప్పించుకుంటాడో చూడాలి అని జరిగేది సినిమా చూస్తున్నట్టు చూస్తుంటుంది ఆద్య….. !! అన్నయ్య నిన్నే ఎందుకొచ్చావ్ అంటే మాట్లాడవు ఏంటీ జనరల్ గా నువ్వు కిచెన్ లోకి రావు కదా….. !! పైగా ఇది వదిన వాళ్ళ ఇల్లు ఇక్కడ ఏం ఉంటాయో కూడా నీకు తెలియదు మరి ఇక్కడికి ఎందుకు వచ్చావ్…. ??
మాయ అది….. అదీ నేను హా వాటర్ తాగడానికి వచ్చాను…. !! ఎంత పని చేసావ్ జై అని జై ముందుకు వస్తూ నువ్వు చేస్తున్న ఉపవాసం లో నువ్వు పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకూడదు మర్చిపోయావా ముందు లెంపలు వేసుకో…. !! అని చెంపలు గట్టిగా కొడుతూ నువ్వు ఉపవాసాన్ని బ్రేక్ చేయబోయావ్ అనే ఆ దేవుడు నీ చెయ్ కాలేలా చేశాడు…… !! ముందు నువ్వు పదా అని జై ను తీసుకుని హాల్ లోకి వస్తూ నీకేం అయినా కావాలి అనుకుంటే నన్ను అడుగు సరేనా….. !! అని కాలిన చోట బర్నాల్ రాస్తూ ప్రేమ చూపిస్తున్న ఆధ్య ను చూసి ఇదేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది….. ?? వీళ్ళు అందరూ ఉన్నారని ఇలా చేస్తుందా లేక నాకు అవ్వడానికి ఇదే రీసన్ ఆ అనుకుంటూ ఆద్య వైపు చూస్తూ ఉంటాడు……. !!
💫💫💫💫💫💫💫💫💫💫💫
హరిణి ఇంకో సారి ఆలోచించుకో నాకు ఎందుకో బేబీ ను చంపుకోవడం నచ్చడం లేదు….. !! ముందంటే జై తో మ్యారేజ్ కి బేబీ అడ్డుగా ఉంది అన్నావ్ కాబట్టి కోట్లు రాబోతున్నాయి అని ఒకే చెప్పా….. !! తర్వాత బేబీ ను జై బేబీ గా అందరికీ పరిచయం చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఇలా అబోర్ట్ చేయించడం ఎందుకు……. ??
నేను ఈ ప్రెగ్నెన్సీ కి రెడీగా లేను రాహుల్….. !! దట్ టూ నైట్ కొంచెం హార్ట్ గా బిహేవ్ చేసావ్ లిటరల్లీ మార్నింగ్ నుండి చాలా పెయిన్ గా ఉంది ఈ బేబీ మనం కలవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది రాహుల్…… !! మనం ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా బేబీ ను ప్లాన్ చేయొచ్చు….. !! బట్ టీనేజ్ లో ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేయాలి అందుకే ఈ బేబీ మనకు వద్దు అని డిసైడ్ అయ్యాను.. !!
నువ్వు చెప్పింది కూడా నిజమే ఈ బేబీ వల్ల మనం కూడా ఎక్కువ సార్లు కలవలేక పోతున్నాం……. !! అని మాట్లాడుకుంటూ వుండగానే డాక్టర్ హరిణి ను పిలవడం తో ఇద్దరూ డాక్టర్ ను మీట్ అయ్యి అబార్ట్ కి ఫినిష్ చేయాల్సిన ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తారు….. !! హరిణి ను తీసుకుని థియేటర్ కి వెళ్లగానే అక్కడే లాంజ్ లో కూర్చుని వెయిట్ చేస్తున్న రాహుల్ కి కాల్ లో మాట్లాడుతూ వెళ్తూ కనిపిస్తుంది రితిక ….. !!
రీతిక ను చూసిన రాహుల్ ఇది…. ఇదీ అని అనుకుంటూ ఎస్ రితిక దీని వల్లే నాకు రావాల్సిన కోట్లు అన్నీ మిస్ అయ్యాయి….. !! ఇవాళ దీన్ని వదిలి పెట్టకూడదు అనుకుంటూ జాగ్రత్తగా డౌబ్ట్ రాకుండా రితిక ను తన కార్ లో ఫాలో అవుతూ…… !! రితిక తన కార్ ను టర్న్ చేసి ఒక ఏరియా లో ఇంటి ముందు కార్ ఆపగానే ……. !! రాహుల్ ఫాస్ట్ గా కార్ దిగి రితిక ను కొట్టి బలవంతంగా తన కార్ లో ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు…… !!