విలన్ హస్బెండ్{2} -20
రాహుల్ ను చూసిన రితిక భయపడుతూ న…. నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావ్ లీవ్ మీ రాహుల్ అని అరుస్తూ….. !! కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది బట్ అది లాక్ చేసి ఉండడం వల్ల కార్ డోర్ ఓపెన్ అవ్వదు……. !! భయంగా రాహుల్ వైపు చూస్తూ ప్లీస్ నన్ను వదిలేయ్ అని ఏడుస్తున్న రితిక జుట్టు పట్టుకుని లాగి తన మొహం లోకి మొహం పెట్టి చూస్తూ……. !! ఎంత బాగా నటించి నన్ను వెధవని చేశావే నిన్ను ఎంత నమ్మానో తెలుసా……. ??
అలాంటిది నా మీదే స్పై చేసి నేను దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నానో అది నా చేతిలోకి వచ్చే టైమ్ కి అది చెయ్ జారిపోయేలా చేసావ్…… !! నిన్ను అంత ఈజీగా వదులుతానా అని రితిక బుగ్గలు పట్టుకుని నొక్కుతూ ఈ అందాన్ని చూసే కదే నీకు పొగరు …… !! ఇవాళ నీ పొగరు దించకపోతే నా పేరు రాహుల్ నే కాదు అని విసురుగా రితిక ను సీట్ లోకి నెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు…… !!
రాహుల్ మాటల్లో & తన మొహం లో తన మీద ఎంత కోపంగా ఉన్నాడో క్లియర్ గా అర్థం అవ్వడం తో రితిక భయపడుతూ…… !! వీడు నన్ను కచ్చితంగా చంపేస్తాడు కానీ వీడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎలా అయినా వీడి నుండి తప్పించుకోవాలి…… ?? అని ఆలోచిస్తూ రాహుల్ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో గమనిస్తుంది…… !! తనను సిటీ కి దూరంగా ఉన్న ఒక ఫార్మ్ హౌస్ కి తీసుకుని రావడం చూసిన రితిక కార్ డోర్ ఓపెన్ చేయగాగే…… !! అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేసి రాహుల్ చేతికి చిక్కుతుంది….. !!
అనవసరంగా పరిగెత్తి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు డార్లింగ్ నువ్వు ఇక్కడి నుండి బయటపడ్డం జరగని పనీ పదా లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం …… !! రాహుల్ ప్లీస్ నన్ను వదులు నీకు కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను అని ఏడుస్తున్న రితిక జుట్టు పట్టుకుని…… !! లోపలికి లాక్కుని వెళ్ళినట్టే తీసుకు వెళ్ళి కింద పడేసి ఈ ఏడుపు నాతో గేమ్స్ ఆడడానికి ముందే ఆలోచించుకుని ఉండాల్సింది…… !!
ఇట్స్ టూ లేట్ రితిక నువ్వు ఎలా అయితే ఆడుకుని నన్ను పిచ్చి వెధవని చేశావో సేమ్ వే నేను కూడా నీతో ఆడుకుంటాను…… !! బట్ చిన్న చేంజ్ ఇక్కడ నేను ఆడుకునేది నీ బాడీ తో అని రితిక జుట్టు పట్టుకుని బలవంతంగా లిప్ కిస్ ఇచ్చి వదులుతూ…… !! నీ లిప్స్టిక్ ఫ్లేవర్ బావుంది రితిక నువ్వు ఏ లిప్స్టిక్ యూస్ చేస్తున్నావో చెప్పే హరిణి కి కూడా అదే యూస్ చేయమని చెప్తాను….. !!
రితిక సైలెంట్ గా ఏడుస్తూ ఉండడం చూసిన రాహుల్ కన్నింగ్ గా నవ్వుకుంటూ…… !! సరే చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయ్ అంటూ నాకు ఇక్కడ నిన్ను ఇలా వదిలి వెళ్లాలని లేదు డార్లింగ్…… !! బట్ అక్కడ హస్పిటల్ లో నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది …… !! తనను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నైట్ కి వచ్చేస్తాను నైట్ మొత్తం ఇద్దరం ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం….. !! అని కన్ను కొడుతూ డోర్ లాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్…… !!
రాహుల్ వెళ్ళిపోయాక మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి…… !! అని ఆలోచిస్తూ చుట్టు భయంగా చూస్తూ ఉంటుంది రితిక…… !!
✨✨✨✨✨✨✨✨✨
జై & ఆద్య ల 2 నైట్స్ ఆపలేక పోయాను బట్ ఇవాళ జరుగుతున్న 3 ర్డ్ నైట్ మాత్రం ఎలా అయినా ఆపాలి …… !! ఇది కూడా ఆపకపోతే ఇక నేను ఉండి కూడా వేస్ట్ అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రేణుక…… !! అబ్బా ఐడియాస్ ఎమ్ రావట్లేదు ఏంటి వీళ్ళ 3ర్డ్ నైట్ ఎలా ఆపాలి అని ఆలోచిస్తున్న రేణుక మెదడు లోకి ఎదో ఐడియా తళుక్కున మెరుస్తుంది…… !!
ఎస్ జై తాగబోయే మిల్క్ లో స్లీపింగ్ పిల్స్ వేస్తే అది తాగి వాడు మొద్దు లా నిద్రపోతాడు అపుడు వీళ్ళ 3 ర్డ్ నైట్ కచ్చితంగా ఆగిపోతుంది…… !! అని నవ్వుకుంటూ అవును ఇప్పుడు స్లీపింగ్ పిల్స్ ఎలా అని ఆలోచిస్తున్న రేణుక కి ప్రతాప్ వర్మ నిద్ర రాకపోతే ఎప్పుడైనా స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకుంటాడు అని గుర్తొస్తుంది…. !!
మావయ్య మెడిసిన్ బాక్స్ లో కచ్చితంగా స్లీపింగ్ పిల్స్ ఉంటాయి అవి ఇప్పుడు ఎలా అయినా మావయ్య కి తెలియకుండా కొట్టేయాలి ….. !! అని ఫిక్స్ అయ్యి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రతాప్ ఉన్న రూమ్ లోకి వెళ్తుంది….. !!
తన టైం బావుండి రూమ్ లో ప్రతాప్ కనిపించకపోయేసరికి హమ్మయ్య మంచి టైం కి వచ్చాను మావయ్య రూమ్ లో లేరు….. !! ఫాస్ట్ గా స్లీపింగ్ పిల్స్ తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుని ప్రతాప్ మెడిసిన్ బాక్స్ కోసం రూమ్ మొత్తం వెతుకుతూ….. !! ఆఖరికి బాక్స్ కనిపించగానే హ్యాపీగా అందులో నుండి స్లీపింగ్ పిల్స్ తీసుకుని డౌబ్ట్ రాకుండా …… !! మెడిసిన్ బాక్స్ అక్కడే పెట్టేసి ఎవరు చూడక ముందే కిచెన్ లోకి వెళ్ళి మిల్క్ గ్లాస్ లో ఆ మెడిసిన్స్ కలిపేస్తుంది…. !!
ఇవాళ మీరు ఎలా కాలుస్తారో నేను చూస్తా ఇవాళ ఒకటే గడిస్తే రేపు ఈవెనింగ్ ఎలాగో మా ఇంటికి వెళ్ళిపోతాం….. !! అక్కడికి వెళ్ళాక దీని ఆటలకు ఎలా అయినా ఎండ్ కార్డ్ వేయాలి అనుకుంటూ కామ్ గా ఎవరికి డౌబ్ట్ రాకుండా …… !! తనను ఎవరు చూడకముందే కిచెన్ నుండి బయటకు వచ్చేసి హాల్ లో కూర్చుని నవ్వుకుంటూ ఉంటుంది…. !!
మామ్ ఎవ్రీ నైట్ ఇలా రెడీ అవ్వాలంటే చిరాగ్గా ఉంది పైగా ఈ జ్యూలరీ ఒకటి 😏…. !! చాలా ఇబ్బందిగా ఉంది మామ్ అంటూ శైలు మీద అరుస్తూ ఉంటుంది ఆధ్య…… !! అబ్బా గోల చేయకు అమ్ము ఇవాళ ఒకటే అడ్జస్ట్ అవ్వు రేపటి నుంచి నీ ఇష్టం కాస్త బుద్దిగా కూర్చో అని ఆద్య ను రెడీ చేసాక తన చేతికి మిల్క్ గ్లాస్ ఇస్తుంది…… !!
ఉపవాసం అని జై ఎమ్ తినలేదు అందుకే మీ రూమ్ లో ఉన్న ఫ్రూట్స్ అయినా తినమని చెప్పు…… !! పాపం తనకు ఆకలేస్తూ ఉంటుంది పైగా రేపు మన ఇంటి దేవుడు అయిన నరసింహ స్వామి టెంపుల్ కి వెళ్ళాలి……. !! అక్కడ మీరు స్వామి కి మీ చేత్తో అభిషేకం చేసే వరకు వాటర్ కూడా తీసుకోకూడదు ఇందాక ఈ విషయం చెప్పడం మర్చిపోయాను ….. !!
ఆధ్య ఏదో ఆలోచిస్తూ అవునా మామ్ అక్కడ అభిషేకం ఫినిష్ అయ్యే సరికి ఏ టైం అవుతుంది…….. ?? ఆఫ్టర్ నూన్ అవ్వచ్చు అమ్ము ఎందుకంటే ఇక్కడి నుంచి ఆ టెంపుల్ చాలా దూరం పైగా స్వామి కొండ మీద ఉంటారు….. !!
దొరికాడు అయితే వీడికి ఈ విషయం గురించి చచ్చినా చెప్పకూడదు అనుకుని నవ్వుకుంటూ……. !! ఒకే మామ్ చెప్తాను అని గ్లాస్ తీసుకుని చిరు నవ్వుతో అక్కడి నుంచి వెళ్తున్న ఆద్య ను చూసి….. !! శైలు ఆనందంగా చూస్తూ అప్పటికే లేట్ అవ్వడం తో తన రూమ్ కి వెళ్ళి పడుకుంటుంది…… !!
💫💫💫💫💫💫💫💫💫💫💫
బాబోయ్ ఏంటిది ఆఫ్టర్ నూన్ & నైట్ మీల్ స్కిప్ చేస్తే ఇంతలా ఆకలేస్తుందా …… !! ఇది అనవసరంగా నన్ను అందరి ముందు అడ్డంగా ఇరికించింది లేకపోతే ఈ పాటికి హాయిగా తినేసి పడుకునే వాడిని….. !! ఆఫ్టర్ నూన్ నుండి ఈ ఆకలి గురించి మర్చిపోయి హ్యాపీగా పాడుకుందాం అన్నా నిద్ర పట్టడం లేదు ఇప్పుడేం చేయాలి అని రూమ్ లో అటు ఇటు విసుగ్గా తిరుగుతూ ఉంటాడు జై……. !!
అవును ఇది ఇంకా రావట్లేదు ఏంటి కనీసం అది తీసుకుని వచ్చే మిల్క్ అయినా తాగుదాం అని వెయిట్ చేస్తుంటే ఇది ఇంకా రాదేంటి…… !! నాకు తెలిసి ఇది కావాలనే వెయిట్ చేస్తూ ఉంటుంది దొంగ మొహం ది అని ఆద్య ను తిట్టుకుంటూ బెడ్ మీద కూర్చున్న…… !! జై కి బెడ్ పక్కనున్న టేబుల్ మీద ఫ్రూట్ & స్వీట్స్ కనిపించగానే తన కళ్ళు ఆనందంగా మెరుస్తాయి…… !!
ఆకలి గొడవలో పడి నా పక్కనే స్వీట్స్ ఉన్నాయన్న విషయం కూడా గమనించలేదు …… !! ఎలాగో ఇది కూడా రూమ్ లో లేదు అది వచ్చేసరికి హ్యాపీగా వీటిని లాగించాలి అని నవ్వుకుంటూ…… !! స్వీట్స్ తీసుకుని తినబోతూ బాబోయ్ స్వీట్స్ లో చాలా క్యాలరీస్ ఉంటాయి ……. !! ఒక్క లడ్డు లోనే ఆల్మోస్ట్ 150 క్యాలరీస్ ఉంటాయి అన్ని క్యాలరీలు బర్న్ చేయాలంటే నేను హాఫ్ డే జిమ్ చేయాలి…… !!
ఈ స్వీట్స్ బదులు ఫ్రూట్స్ తినడం బెస్ట్ అనుకుని చేతిలోని లడ్డు ను ప్లేట్ లో పెడుతూ యాపిల్ చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకోబోతూ….. !! జై అని ఆద్య అరిచిన అరుపుకి అబ్బా ఇది వచ్చేసింది అని తల కొట్టుకుంటూ ఆద్య వైపు సీరియస్ గా చూస్తూ ఉంటాడు……. !!
ఎమ్ చేస్తున్నావ్ జై…… ?? అని ఫాస్ట్ గా జై ముందుకు వచ్చి తన చేతిలోని యాపిల్ లాగేసుకుంటున్న ఆద్య ను కోపంగా చూస్తూ …… !! అందరి ముందు బుక్ చేసి నన్ను ఫుడ్ తినకుండా చేసావ్ ఇప్పుడు ఈ యాపిల్ కూడా తిననివ్వవా ఫస్ట్ నా యాపిల్ నాకు ఇవ్వు…… !! అరే ముందు నేను చెప్పేది విను రేపు మనం ఎక్కడికో వెళ్ళాలట సో ఇప్పటి నుంచి మనం ఎమ్ తినకూడదు అని మామ్ చెప్పింది…… !!
వాట్ రేపు ఎక్కడికో వెళ్ళడానికి ఇప్పటి నుంచి ఎమ్ తినకూడదా ….. ?? ఎంటే మరీ అంత వెర్రి వెధవ లా కనిపిస్తున్నానా నీ కంటికి అయినా నేను ఎక్కడికి రావడం లేదు కావాలంటే నువ్వేళ్ళు రేపు నాకు ఆఫీస్ లో వర్క్స్ ఉన్నాయి….. !! ఆహా అదేదో నువ్వే చెప్పు మామ్ కి నువ్వు మాత్రం ఎమ్ తినకూడదు అంతే అని యాపిల్ తీసుకుని ప్లేట్ లో పెట్టేసి బెడ్ మీద కూర్చుంటుంది…… !!
నీ…… మళ్ళీ ఎమ్ చేశావే అని గట్టిగా అరిచి అబ్బా అరవడానికి కూడా ఒంట్లో ఓపిక లేదే అట్లీస్ట్ మిల్క్ అయినా ఇవ్వవే…… !! నో నో జై మిల్క్ కూడా తాగకూడదు యాక్చుయల్లీ ఇవి నా కోసం తెచ్చుకున్నా…… !! అదేంటో నువ్వు మాత్రమే తినకూడదు అట నేను శుభ్రంగా అరిగే దాకా తినచ్చు & తాగచ్చట హహ నాకే ఈ బంపర్ ఆఫర్ అని నవ్వుకుంటూ…… !! మిల్క్ గ్లాస్ నోటి దగ్గర తాగుతూ ఉంటే జై కోపంగా ఆ గ్లాస్ లాగేసుకుంటాడు ……. !! అది నాది అని ఆద్య కాదు నాది అని జై ఇలా ఇద్దరూ వాదులాడుతూ సక్సెస్ఫుల్ గా గ్లాస్ లోని పాలు మొత్తం ఫ్లోర్ మీద పడేలా చేసి…… !! ఒకరిని ఒకరు కోపంగా చూస్తూ ఉంటారు…… !!
✨✨✨✨✨✨✨✨✨
వీళ్ళు రూమ్ లోకి వెళ్ళి అరగంట దాటింది ఇద్దరూ ఆ మిల్క్ తాగేసి మొద్దులా నిద్రపోతూ ఉంటారా…….?? లేదా జై ఆ మిల్క్ తాగే ఛాన్స్ కూడా ఇవ్వలేదా …… !! అబ్బా ఎలా తెలుసుకోవడం వీళ్ళు చూస్తే డోర్ లాక్ చేశారు లోపల ఎమ్ జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి…… ?? పోనీ వెళ్ళి డోర్ నాక్ చేస్తే వద్దు లే అస్సలు బావుండదు జై కూడా లోపలే ఉన్నాడు మళ్ళీ నా గురించి ఏమైనా అనుకోవచ్చు…… !!
ఏం జరుగుతుందో తెలియక పోతే టెన్షన్ తో చచ్చేలా ఉన్నాను అని జై రూమ్ ముందుకు వచ్చి నుంచుని…… !! డోర్ హోల్ లో నుండి ఏదైనా కనిపిస్తుందేమో అని చూడ్డానికి ట్రై చేసినా ఎమ్ కనిపించక పోయేసరికి విసుగ్గా అదే ఫ్లోర్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది…… !!
ఓయ్ నేను ఆల్రెడీ నీ కోసం పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నా….. !! ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాలి త్వరగా రా మళ్ళీ ఎవరైనా చూస్తారు….. !! అని కాల్ కట్ చేసిన మాయ ను తలచుకుని ఇది నన్ను ఎదోటి చేసే దాకా నిద్రపోయేలా లేదు….. !! అని రుద్ర ఫాస్ట్ గా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి అదే ఫ్లోర్ లో రేణుక అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుంది…… !!
ఓహ్ షట్ అని ఫాస్ట్ గా రేణుక ను చూసి పిల్లర్ వెనుక దాక్కుంటూ….. !! సరిపోయింది నా అత్త ఏంటి ఈ టైం లో నిద్రపోకుండా ఇక్కడ గుర్కా డ్యూటీ చేస్తుంది…… ?? అసలు ఎందుకు ఇక్కడ తిరుగుతుంది అని రేణుక వైపు చూసిన రుద్ర కి రేణుక జై రూమ్ వైపు చూస్తూ డోర్ హోల్ లో నుండి లోపలికి చూడ్డానికి ట్రై చేస్తూ కనిపిస్తుంది….. !!
ఇదా విషయం ఈవిడకు ఎంత చెప్పినా బుద్ధి రాదు ఇలా కాదు నా అందరితో మరో సారి గట్టిగా కుళ్ళబొడిపించేయాలి ……. !! ఇప్పుడేం చేసి అత్త ని నా వైపు డైవర్ట్ చేయాలి అని ఆలోచిస్తూ 🤔🤔 కాసేపటికి ఏదో ఒక ఐడియా రాగానే నవ్వుకుని రేణుక వైపు చూస్తూ……. !! మొబైల్ ను పాకెట్ నుండి తీసి స్విచ్ ఆఫ్ చేసి హలో … హలో యాహ్ ఇపుడే వస్తున్నా ….. !! అరే ఎవరైనా ఉన్నారా లేదా అని చూడాలి కదా మళ్ళీ ఎవరైనా మనల్ని చూస్తే ప్రాబ్లెమ్ కదా బేబీ…… !!
హా చూసాను ఎవరు లేరు అందరూ పడుకున్నట్టు ఉన్నారు 10 మినిట్స్ లో నీ ముందు ఉంటాను ఒకే అని నవ్వుకుంటూ…… !! స్టెప్స్ దిగుతూ వెళ్తున్న రుద్ర ను చాటు నుంచి చూస్తున్న రేణుక డౌబ్ట్ లేదు వీడు కచ్చితంగా నా కూతురుని కలవడానికే వెళ్తున్నాడు……. !! ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అప్పుడు చెప్తా ఇద్దరి సంగతి అని కోపంగా అనుకుంటూ రుద్ర వెనుకే 5 నిమిషాల గ్యాప్ తో కిందకు వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటుంది……. !!
కిందకే కదా వచ్చాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు అని చుట్టూ చూస్తు…… !! చిచీ ఈ చీకట్లో ఎదీ ఎక్కడుందో కూడా తెలియడం లేదు ఇక వీడేం కనిపిస్తాడు 😏…… !! ముందు లైట్ ఆన్ చేయాలి అనుకుని ఆన్ చేయబోతూ అమ్మో వద్దులే లైట్ ఆన్ చేస్తే ఇద్దరూ ఎస్కేప్ అవుతారు… !! ఏదోలా తిప్పులు పడైనా ఇద్దరినీ వెతకాలి అనుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న రేణుక మొహం మీద …… !! బెడ్ షీట్ తో ముసుగు వేసి……. !! దొంగ…..దొంగ …… అందరూ రండి మన ఇంట్లో దొంగలు పడ్డారు అని గట్టిగా అరిచి అందరినీ హాల్ లోకి వచ్చేలా చేస్తాడు రుద్ర ….. !!
రుద్ర వాయిస్ కి నిద్రలో ఉన్న అందరూ కంగారుగా నిద్ర లేచి హాల్ లోకి వస్తూ లైట్ ఆన్ చేస్తూ…… !! రుద్ర చేతిలో ఉన్న మనిషిని చూసి షాక్ అవుతూ చూస్తూ ఉంటే ఆద్య ఆ ముసుగు కింద లైట్ గా కనిపిస్తున్న చీర అంచు గుర్తు పడుతూ…… !! అత్త నా అంటూ రుద్ర కి మాత్రమే కనిపించేలా సైగ చేస్తుంది…… !!
అవును అని రుద్ర కన్ను కొట్టి నవ్వగానే ఆద్య రేణుక ను చూసి నవ్వుతూ…… !! ఇవాళ నా చేతిలో చచ్చావ్ అత్త అని మనసులో అనుకుంటూ అయ్యో అందరూ బొమ్మల్లా అలా చూస్తూ ఉన్నారేంటి…… !! ఆ దొంగ చేతిలో కత్తో, కర్రో ఉంటే అన్నయ్య కి ఎంత ప్రమాదం…… !!
ఆ దొంగ అన్నయ్య మీద తిరగబడే లోగా అందరం ఆ దొంగ ను చావ బాదాలి కమాన్ అంటూ…… !! ఫాస్ట్ గా గార్డెన్ వైపు పరిగెత్తి కర్రలు చేత్తో పట్టుకుని వచ్చి అందరికీ పంచుతూ…… !! కమాన్ గాయ్స్ మీ బలాన్ని మొత్తం ఆ దొంగ మీద చూపించండి…… !! అన్నయ్య ఆ దొంగ కదులుతూ ఉన్నాడు నువ్వు జాగ్రత్తగా పట్టుకో……. !! అంటూ అందరితో కలిసి రేణుక ను రౌండ్ అప్ చేసి చావ బాదుతుంది…… !! పాపం రేణుక అరవాలి అనున్నా రుద్ర గట్టిగా తన నోరు మూయడం వల్ల అది చేయలేక కుర్రో మొర్రో అంటూ లోలోపలే ఏడుస్తూ ఉంటుంది……. !!