విలన్ హస్బెండ్{2} -21
ఆ దొంగ అన్నయ్య మీద తిరగబడే లోగా అందరం ఆ దొంగ ను పైకి లేవకుండా చావ బాదాలి కమాన్ అంటూ…… !! ఫాస్ట్ గా గార్డెన్ వైపు పరిగెత్తి కర్రలు చేత్తో పట్టుకుని వచ్చి అందరికీ ఒక్కో కర్ర చేతికి ఇస్తూ …… !! కమాన్ గాయ్స్ మీ బలాన్ని మొత్తం ఆ దొంగ మీద చూపించండి…… !! అన్నయ్య ఆ దొంగ కదులుతూ ఉన్నట్టు ఉన్నాడు వాడ్ని కదలకుండా నువ్వు జాగ్రత్తగా పట్టుకో……. !! అంటూ అందరితో కలిసి రేణుక ను రౌండ్ అప్ చేసి చావ బాదుతుంది…… !! పాపం రేణుక కి అరవాలి అనున్నా రుద్ర గట్టిగా తన నోరు మూయడం వల్ల అది చేయలేక కుర్రో మొర్రో అంటూ లోలోపలే ఏడుస్తూ ఉంటుంది……. !!
ఇది కావాలనే చేస్తుందా ఏంటి….. ?? అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఈ ఆధ్య కావాలనే చేస్తున్నట్టు ఉంది…… !! అయ్యబాబోయ్ ఇలా కొడుతున్నారు ఏంటి కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నారు……. !! అని అందరూ కొట్టే దెబ్బలకు ఓపిక లేనట్టు అమ్మా అంటూ నేల మీదకు జారిపోయి స్పృహ తప్పి పడిపోతుంది ……… !!
దొంగ పడిపోయాడు ఇక మీరు ఆగండి అని కింద పడ్డా కొడుతున్న అందరినీ ఆపి బెడ్ షీట్ రేణుక నుండి తీసేస్తాడు జై …… !! స్పృహ కోల్పోయిన రేణుక చూసిన అందరూ షాక్ అయితే రుద్ర, ఆద్య మాత్రం లోలోపల నవ్వుకుంటూ అందరిలా వీళ్ళు కూడా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు……. !!
అయ్యో అత్తమ్మ మీరా అంటూ చేతిలోని కర్ర ను జై కాళ్ళ మీద కావాలని దెబ్బ తగిలేలా పడేసి రేణుక దగ్గరకు పరిగెడుతుంది…… !! చంపేసింది రా బాబు అని కాలు పట్టుకుని దీని మమ్మీ 😬😬 ఇది కావాలని చేస్తుందో ……. ?? అనుకోకుండా అలా జరుగుతుందో అర్థం అయ్యి చావట్లేదు అని ఆద్య ను కోపంగా చూస్తూ రుద్ర హెల్ప్ తో సరిగ్గా నుంచుంటాడు…… !!
అత్తమ్మ….. అత్తమ్మ మీరని తెలియక కొట్టాం లేవండి అత్తమ్మ అయ్యో ఏంటి అత్త లేవట్లేదు కొంపదీసి చచ్చిపోయావా అత్తమ్మ…… !! ఏయ్ నీ నోట్లో నుండి ఒక మంచి మాట కూడా రాదా ఫస్ట్ ఆ ఏడుపు ఆపు చాలా ఇరిటేటింగ్ గా ఉంది…… !!
హు 😏 అత్తమ్మ కళ్ళు తెరవట్లేదు అని నేను ఏడుస్తుంటే మధ్యలో మీరెంటాండీ అని కన్నీళ్ళు రాకపోయినా తుడుచుకుంటూ ……. !! ఏంటో అన్నీ అత్తమ్మ కే జరుగుతున్నాయి అని ఓవర్ యాక్షన్ చేస్తున్న ఆద్య వైపు వియర్డ్ లుక్స్ ఇస్తూ కాస్త ఆ నోరు మూసి……. !! పక్కకు జరుగు అని రేణుక ముందు నీస్ మీద కూర్చుని మామ్…. మామ్ అని పిలుస్తూ ఉన్నా రేణుక చలనం లేనట్టు పడుకుని ఉంటుంది…… !!
బయటకు తీసుకుని వెళ్ళమని చెప్పి పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎంత సేపటికి రాడేంటి నా చేతిలో అయిపోయావ్ హర్ష…… !! అని కోపంగా లోపలికి వచ్చిన మాయ కి హాల్ లో అందరూ గుంపుగా నుంచుని కనిపిస్తారు…… !! అందరూ పడుకోకుండా ఇక్కడ మీటింగ్ పెట్టారు ఏంటీ కొంపదీసి హర్ష నా కోసం వస్తూ మామ్ కి దొరికిపోలేదు కదా అని కంగారుగా అనుకుంటూ…… !! ముందుకు వచ్చి చూడగా రేణుక నేల మీద స్పృహలో లేకుండా పడి ఉండడం చూసి…… !! అయ్యయ్యో మామ్ అంటూ రేణుక పక్కకు వచ్చి కూర్చుని తన తలను వొళ్ళో పెట్టుకుని……. !! ఏమైంది వదిన మామ్ ఎందుకు ఇక్కడ పడుకుంది అని టెన్షన్ గా అడుగుతుంది…… !!
దాన్ని పడుకోవడం అనరు మాయ పడిపోవడం అంటారు 😌…… !! అనగానే జై పళ్ళు నూరుతూ ఆధ్య వైపు చూస్తూ పిచ్చి వాగుడు వాగితే పచ్చడి చేస్తా నోరు మూసుకుని కూర్చో…… !! అయ్యో రామా ఇప్పుడు నేనేం అన్నానండీ జరిగింది చెప్పడం కూడా తప్పేనా ఇది అస్సలు మంచిగా లేదండి అని ముక్కు చీదుతూ దాన్ని జై షర్ట్ కి తుడుస్తుంది…… !!
ఇడియట్ ఇది బ్రాండెడ్ షర్ట్ దీని కాస్ట్ ఎంతో తెలుసా….. !! అబ్బబ్బా మీ గొడవ ఆపి రేణుక మొహాన కొన్ని నీళ్లు కొట్టి లేపండి అసలు తను ఇక్కడ ఎందుకు ఉందో అర్థం కావట్లేదు…. !! ప్రతాప్ వాయిస్ కి రుద్ర టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని……. !! కొన్ని అర చేతిలో వేసుకుని రేణుక మొహం మీద కొట్టగానే అమ్మా అంటూ నీరసంగా కళ్ళు తెరుస్తుంది రేణుక…… !!
మామ్ ఆర్ యూ ఆల్రైట్ అంటూ రేణుక ను కష్టంగా పైకి లేపి సోఫా లో కూర్చో పెడతారు మాయ & జై……. !! అత్తమ్మ ఎలా ఉంది మీరు సడెన్ గా అలా పడిపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా……. ?? కర్ర తో కుళ్ళ పొడిచి ఎలా ఉంది అని ఎంత ఇన్నోసెంట్ గా అడుగుతుందో చూడు దీని అమాయకత్వం తగలెయ్య యాక్టింగ్ లో కమల్ హాసన్ ను మించిపోయింది అని ఆద్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది…… !!
నిన్నే మామ్ ఈ టైమ్ లో పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావ్….. ?? అందరం నిన్ను దొంగ అనుకుని కొడుతుంటే ఒక్క మాటైనా అక్కడ ఉంది నువ్వే అని చెప్పచ్చు కదా……. !! ఇంట్లోకి దొంగ పడ్డాడు అనుకుని అందరూ కర్ర లతో కొట్టేశారు పాపం బాగా నొప్పిగా ఉంటుంది కదూ…… !!
అది నేను మా….. లేదు ప్రూఫ్ లేకుండా మాయ & రుద్ర గురించి చెప్పినా ఎవరు నమ్మరు…… !! పైగా వినయ్ నన్ను అలా చెప్తే చంపేస్తాడు జై కూడా నన్ను మిస్ అండర్స్టాండ్ చేసుకునే ఛాన్స్ ఉంది…… !! కాబట్టి వీళ్ళు గురించి పక్కా ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నప్పుడే వీళ్ళ మ్యాటర్ ఓపెన్ చేయాలి…. !! అయినా ఈ ఆర్యన్ నా కూతురి కోసమే వెళ్ళాడు అని నాకు కూడా క్లారిటీ గా తెలియడం లేదు….. !! ఎదీ ఏమైనా ప్లాన్స్ అన్ని నాకే రివర్స్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి…… !!
అన్నయ్య అడుగుతుంటే అన్సర్ చెప్పకుండా దిక్కులు చూస్తూ కూర్చున్నావ్ ఏంటి మామ్…… ?? పడుకోకుండా ఈ టైమ్ లో ఇక్కడేం చేస్తున్నావ్… . ?? అది….. అదీ నేను నిద్రపట్టక ఇలా వచ్చాను వాటర్ తాగడానికి కిచెన్ లోకి వెళ్తుంటే…… !! ఎవరో నన్ను దొంగ అనుకుని బెడ్ షీట్ తో కప్పి నోరు మూసేశారు అని రుద్ర వైపు పళ్ళు నూరుతూ చూస్తూ చెప్తుంది…… !!
సో సారి ఆంటీ నిజంగా మీరు అని అనుకోలేదు అయినా మీరు లైట్ కూడా ఆన్ చేయకుండా అలా సైలెంట్ గా నక్కి నక్కి వెళ్తుంటే….. !! దొంగ అని ఫిక్స్ అయిపోయాను అని నవ్వు ఆపుకుంటూ చెప్తున్న రుద్ర ను చూసి రేణుక కోపంగా మొహం తిప్పుకుంటుంది …… !!
మన రూమ్ లో వాటర్ ఉన్నాయి కదా వాటర్ కోసం కిందకు ఎందుకు వచ్చావ్….. ?? ఎట్ లీస్ట్ నన్ను నిద్ర అయినా లేపాల్సింది….. !! నేను చూసుకోలేదు వినయ్ మీరు మంచి నిద్రలో ఉన్నారు డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు….. !!
ఉఫ్ 🤦 సరిపోయింది సరే సరే బాగా లేట్ అయిపోయింది ఇక వెళ్ళి ఎవరి రూమ్ లో వాళ్ళు పడుకోండి….. !! బంగారం లాంటి నిద్ర చెడి పోయింది మళ్ళీ నిద్ర రావాలి అంటే స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సిందే అని విసుగ్గా స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్ కి వెళ్ళిపోతాడు ప్రతాప్…… !!
అందరూ కూడా వెళ్ళి పడుకోండి ప్రొద్దున్నే లేవాలి అని మహిదర్ వినయ్ ను వీల్ చైర్ లో నెట్టుకుంటూ వెళ్తే….. !! శైలు కూడా తన రూమ్ కి వెళ్తూ ఆధ్య ♥️ జై లను త్వరగా నిద్రపోమని చెప్పి వెళ్ళిపోతుంది….. !! గుడ్ నైట్ ఆల్ అని రుద్ర కూడా సైలెంట్ గా తన రూమ్ వైపు వెళ్తూ అక్కడి నుండి జారుకోవడం చూసి…… !! రేణుక రుద్ర వెళ్తున్న వైపే ఏదో ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది…… !!
మాయ నువ్వు కూడా నీ రూమ్ కి వెళ్ళు మామ్ ను నేను జాగ్రత్తగా తన రూమ్ కి తీసుకుని వెళతాను… !! ఒకే అన్నయ్య టేక్ కేర్ మామ్ అంటూ మాయ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాక…… !! అవును నేను స్లీపింగ్ పిల్స్ కలిపిన మిల్క్ వీళ్ళు ఇద్దరూ తాగలేదా ఏంటి ఇద్దరూ ఇలా మేలుకునే ఉన్నారు అని ఇద్దరినీ అనుమానంగా చూస్తూ ఉంటుంది రేణుక…… !!
జై రైట్ సైడ్ రూమ్ లో ఫస్ట్ ర్యాక్ లో పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ ఉంటాయి……. !! వెళ్ళి తీసుకుని రా పాపం అత్తమ్మ కి బాగా వొళ్ళు నొప్పులుగా ఉంటాయి అనగానే…… !! జై ఆ రూమ్ వైపు వెళ్తే రేణుక ఆద్య ను టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ …… !! ఇన్ని తన్నులు తిన్నందుకు కూడా నాకు బాధగా లేదే ఎందుకో తెలుసా నీ 3 ర్డ్ నైట్ ఇలా అయినా ఆగిపోయింది అని చాలా సంతోషంగా ఉంది…… !!
ఆధ్య రేణుక ను చూసి నవ్వుతూ అయ్యో నా పిచ్చి అత్తమ్మ ఇప్పుడు జరగకపోతే ఏంటి…… ?? రూమ్ లోకి వెళ్ళాక జరగకుండా ఎవరు ఆపుతారు చెప్పు….. !! అయినా నేను ఆపాలి అనుకున్నా నీ కొడుకు ఆగే రకం కాదు……. !! కరెక్ట్ గా మేము కలవబోయే టైమ్ కి ఈ గొడవ జరిగి ఆగిపోయింది కానీ …… !! లేకపోతే ఈ పాటికి నేను స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉండేదాన్ని నీ కొడుకు బలే అల్లరోడు అత్తమ్మ నన్ను రాత్రంతా అస్సలు వదిలి పెట్టడు…… !!
ఛీ అంటూ మొహాన్ని చిరాగ్గా పక్కకు తిప్పుకున్న రేణుక మొహాన్ని తన వైపు తిప్పుకుంటూ…… !! నీకో సంగతి చెప్పనా అని రేణుక దగ్గరకు జరిగి నా బాడీ లో నీ కొడుకు కిస్ చేయని & బైట్ చేయని ప్లేస్ అంటూ లేదు తెలుసా…… !! నా బాడీ లో ఎక్కడెక్కడ పుట్టు మచ్చలు ఉన్నాయో నా కంటే బాగా జై కే తెలుసు….. !! ఇంకో వన్ వీక్ లో మేము బాలీ కోసం హనీమూన్ కూడా వెళ్తున్నాం అని సిగ్గు పడుతూ…… !! నేను వద్దు అంటున్నా జై నే 25 డేస్ ప్యాకేజ్ బుక్ చేసాడు సో ఈ 25 డేస్ మేము ప్రపంచానికి దూరంగా ఇద్దరమే మా లోకం లో మేము హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు….. !! నీ కొడుకు స్పీడ్ చూస్తుంటే నాకు సింగిల్ ప్రమోషన్ కాదు డబుల్ ప్రమోషన్ ఇచ్చేలా ఉన్నాడు……. !! అని సిగ్గుతో రేణుక బుజం మీద తల వాల్చి మోహాన్ని చేతుల్లో దాచుకుంటుంది …… !!
రేణుక పళ్ళు నూరుతూ వీళ్ళు నాకు తెలియకుండా చాలా దూరం వెళ్ళి చచ్చినట్టు ఉన్నారు…… !! వీళ్ళను హానీ మూన్ కి వెళ్లకుండా చేయాలి వాడు దీని మాయలో పూర్తిగా పడక ముందే అన్నయ్య ను కలిసి ఏదైనా కన్నింగ్ ఐడియా ఇవ్వమని అడగాలి అనుకుంటూ…… !! ఆద్య వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది ఈ లోగా జై వచ్చి రేణుక కి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి…… !! తను మెడిసిన్స్ వేసుకున్న తర్వాత ఆధ్య హెల్ప్ తో ఇద్దరూ రేణుక ను తన రూమ్ లో జాగ్రత్తగా పడుకో బెట్టి తమ రూమ్ కి వెళ్ళిపోతారు…… !!
✨✨✨✨✨✨✨✨✨
చుట్టూ చీకటి గా ఉన్న రూమ్ లో సోఫా లో ముడుక్కుని కూర్చున్న రితిక ఏడుస్తూ…… !! ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ఛాన్స్ లేకుండా వాడు నన్ను లాక్ చేసి వెళ్ళిపోయాడు….. !! నా మొబైల్ కూడా కార్ లో ఎక్కడో పడిపోయింది ఇల్లంతా వెతికినా మొబైల్ కనిపించడం లేదు…… !!
ఇప్పుడు వీడు వస్తాను అని చెప్పాడు నాకు చాలా కంగారుగా ఉంది….. !! మహిదర్ సర్ కి కాల్ చేయడానికి కూడా లేకుండా పోయింది ఇప్పుడేం చేయాలి…… ?? వీడు నన్ను చంపేయడు కదా అని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న రితిక రూమ్ డోర్స్ ఒక్క సారిగా ఓపెన్ అవుతూ లైట్స్ ఆన్ అవ్వగానే రితిక కంగారుగా లేచి నుంచుంటుంది…… !!
ఒక చేతిలో వైన్ బాటిల్ పట్టుకుని తాగుతూ మరో చేత్తో బిర్యాని ప్యాకెట్ పార్సెల్ కవర్స్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పడేసి…… !! తన ఎదురుగా సోఫా లో క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుంటూ వైన్ బాటిల్ దించకుండా తాగుతున్న రాహుల్ ను చూసి రితిక కాళ్ళు వణుకుతూ ఉంటాయి…… !!
రాహుల్ వైన్ తాగుతూ రితిక వైపు చూసే సరికి తను భయం భయంగా తననే చూస్తూ కనిపించగానే……. !! తన వైపు రాక్షసంగా చూసి నవ్వుతూ కమ్ అంటూ తన చూపుడు వేలితో పిలవగానే రితిక భయంగా గోడకు అతుక్కుంటూ ప్లీస్ నన్ను వదిలేయ్ నాకు భయం వేస్తుంది……. !!
రాహుల్ కోపంగా వైన్ బాటిల్ పక్కన పడేసి రితిక దగ్గరకు వెళ్లి మొహం లో మొహం పెట్టి చూస్తూ……. !! ఒక్క సారి గా రితిక వేసుకున్న క్రాప్ టాప్ చింపి నేల మీదకు విసిరి తనను ఎత్తి సోఫా లో పడేసి తను పైకి లేవకుండా తన మీదకు చేరిపోయి వూపిరి ఆడకుండా బలవంతంగా తన పెదాలు కలిపేస్తాడు …… !!