Login with OTP

విలన్ హస్బెండ్{2} -24

aashyatech

Author

జై పూజారి చెప్పినట్టు జంటగా ప్రదక్షణలు పూర్తి చేసేసరికి ఫుల్ గా అలసిపోతాడు…… !! తన చేతుల్లో ఉన్న ఆద్య ను కిందకు దించుతూ ఇంత బరువు ఉన్నావేంటే బాబు అమ్మో నా వల్ల కాదు అని నడుము పట్టుకుని ఒక చోట నీరసంగా కూర్చుంటాడు…… !! అప్పుడే అలా అలసిపోతే ఎలా జై ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయని మామ్ చెప్పింది కదా పదా వెళ్దాం….. !! అని హుషారుగా అంటున్న ఆధ్య ను చూసి ఒసేయ్ నిజం చెప్పవే నిజంగా ఇవన్నీ చేయాలా లేదా కావాలనే నీ ఫ్యామిలీ తో డ్రామా ఆడుతూ నన్ను అడ్డంగా బుక్ చేసావా…… ??

హలో డ్రామా లు సీరియల్ లు ఆడాల్సిన అవసరం నాకు నా ఫ్యామిలీ కి లేదు…. !! ఇవన్నీ నిజంగా మా ఇంటి అల్లుడు చేయాల్సిన పనులే ఇందులో నా హ్యాండ్ ఎమ్ లేదు….. !! ఇన్ఫాక్ట్ ఇందులో నాకు సగం మాత్రమే తెలుసు ఇప్పటి వరకూ తెలుసుకోవాల్సిన అవసరం రాలేదు…… !! ఇదిగో ఇప్పుడు వచ్చింది ఆ టైమ్ ఇక నీ క్వశ్చన్స్ అయిపోతే టెంపుల్ లోకి వెళ్దాం అని మూతి తిప్పుతుంది…… !!

ఇంటికి వెళ్ళాక చెప్తేనే నీ సంగతి అని పళ్ళు నూరుతూ….. !! సరే పదా అని టెంపుల్ లోకి వెళ్తున్న ఇద్దరికీ ఎదురుగా వస్తూ కనిపిస్తుంది శైలు…… !! అమ్ము ఇద్దరూ ఈ తడిచిన బట్టల్లో ఎంత సేపు ఉంటారు అక్కడ రూమ్స్ ఉన్నాయి ఇద్దరూ వెక్కి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తే పూజ స్టార్ట్ చేద్దాం…… !! అంటూ ఇద్దరినీ వేరు వేరు రూమ్స్ లోకి పంపి వాళ్లు వచ్చాక ఇద్దరిని తీసుకుని టెంపుల్ లోకి వెళ్తుంది… !!

ఫ్రెష్ గా కనిపిస్తున్న ఇద్దరినీ చూసిన పూజారి గారు చూడండి బాబు మీరు చేయాల్సిన పనులు అన్ని అయిపోయాయి అనగానే జై మొహం లో హమ్మయ్య అన్న ఫీలింగ్ కనిపిస్తుంది…… !! అది చూసిన ఆద్య నీ మొహం లో కనిపిస్తున్న ఈ స్మైల్ కాసేపట్లో ఎగిరిపోతుంది జై అని నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది…… !! కాకపోతే ఇంకొక్క పని మిగిలి ఉంది అది కూడా చేసేస్తే ఇక మీరు ప్రశాంతంగా ఉండచ్చు…… !!

వాట్ ఇంకా బ్యాలెన్స్ ఉందా ఏంటి పూజారి గారు అది అని అంటున్న జై వైపు చూస్తూ…… !! పెద్ద పని ఎమ్ కాదు నాయనా ఇదిగో ఈ నరసింహ స్వామి విగ్రహానికి 108 బిందెల తో నీళ్ళతో అభిషేకం చేయాలి అనగానే జై నోరు తెరిచి షాక్ అవుతూ 108 బిందెలా అంటాడు…… !!

అవును బాబు మీరు ఎంత త్వరగా నేను చెప్పింది పూర్తి చేస్తే అంత త్వరగా నేను పూజ స్టార్ట్ చేస్తాను అంటూ…… !! బిందె తెచ్చారా అని అడుగుతున్న పూజారి వైపు చూస్తూ కంగారులో మర్చిపోయాం పూజారి గారు ఇక్కడ బిందె ఉందా లేక తెప్పించమంటారా….. ?? అక్కర్లేదు శైలజ కొలను దగ్గర ఉంటాయి అనగానే నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని హుషారుగా వెళ్తున్న ఆద్య ను చూసి…..  !! నన్ను బుక్ చేసి ఇది మాత్రం ఎంత సంతోషంగా ఉందో దీనితో చేయించాల్సినవి అన్నీ నాతో చేయిస్తున్నారు …… !! ఇప్పుడు నేను నో అని చెప్పి వెళ్లిపోతే డాడ్ అప్సెట్ అవుతారు ఈయన కోసం అన్ని భరించాల్సి వస్తుంది…… !! నేను ఎన్ని చేసినా ఈయన కోపం మాత్రం తగ్గదు ఇంకా నాతో ఎన్ని ఇయర్స్ కి మాట్లాడతారు డాడ్ అని వినయ్ వైపు బాధగా చూస్తూ ఉంటాడు…..  !!

కొలను దగ్గరకు వెళ్ళి బిందె కోసం చూస్తున్న ఆద్య కి అన్నిటి కంటే పెద్ద సైజ్ బిందె కావాలని తీసుకుని వచ్చి అక్కడ ఈ బిందె మాత్రమే ఉంది అని ఇన్నోసెంట్ గా మొహాన్ని చెప్పుకుంటూ చెప్తుంది…… !! ఏయ్ అంత పెద్ద బిందె తో 108 బిందె లు మోస్తే నేను ఉండాలా పోవాలా అంటూ కోపంగా చూస్తాడు జై…… !! అక్కడ ఇదే ఉంది జై నన్నేం చేయమంటావ్…… ?? నేను కూడా చిన్న బిందె కోసం చూసాను బట్ కనిపించలేదు …… !!

బాబు జై ఇక మొదలు పెడదామా అన్న పూజారి వైపు చూస్తూ నీరసంగానే తల ఊపుతూ పూజారి చెప్పినట్టు గానే 108 బిందెల నీళ్ళతో దేవుడికి అభిషేకం చేసి నీరసంగా కూలబడతాడు….. !! అయ్యో ఏమండీ మీరు బానే ఉన్నారు కదా అని చీర కొంగు తోక జై నుదుటిన పట్టిన చెమట తుడుస్తూ…… !! చూసావా నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది సో ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు అని అంటున్న ఆద్య ను తిట్టడానికి కూడా ఓపిక లేక పూజారి గారు చెప్పినట్టు ఆధ్య తో పాటు పూజ చేస్తూ ఉంటాడు జై…… !!

✨✨✨✨✨✨✨✨✨✨✨

 

తన మీదకు వస్తున్న రాహుల్ ను చూసి వెనక్కి జరుగుతూ ప్లీస్ రాహుల్ నాకు కొంచెం ఓపిక లేదు & కళ్ళు కూడా తిరుగుతున్నాయి ప్లీస్ నన్ను వదిలేయ్…….. !! అంటూ భయపడుతున్న రితిక ను చూసి నేను ఫుల్ మూడ్ తో వచ్చా డార్లింగ్ డిసప్పాయింట్ చేయకు జస్ట్ వన్ ఆర్ తర్వాత నేను వెళ్ళిపోతాను ఒకే అంటూ రితిక మీదకు ఓరుగుతూ…… !! తన మెడ మీద నాలుక తో ఎంగిలి రాస్తూ తనను కొడుతున్న రితిక రెండు చేతులు బెడ్ కి అదిమి పట్టుకుని తనను కదలకుండా లాక్ చేస్తాడు…… !!

రాహుల్ ప్లీస్ అంటున్న రితిక ను లాగి పెట్టీ కొడుతూ ఎంటే మంచిగా చెప్తుంటే అర్థం కావడం లేదా……. ?? చెప్తున్నా కదా వన్ ఆర్ అని నాకు మూడ్ వచ్చినప్పుడు నువ్వు నా పక్కలోకి రావాలి నాతో బెడ్ షేర్ చేసుకోవాలి అర్థం అవుతుందా…… ?? అని బుగ్గలు నొక్కుతూ కోపంగా చెప్తాడు….. !!

నన్ను ఇలా రోజూ టార్చర్ చేయడం కంటే ఒక్క సారిగా చంపెయ్ ఈ నరకాన్ని భరించడం నా వల్ల కావట్లేదు….. !! అంటూ ఏడుస్తున్న రితిక ను చూసి అరెరే అప్పుడే ఎలా చంపేస్తాను చెప్పు నీతో నాకు చాలా పనుంది ……. !! నన్ను ట్రాప్ చేస్తున్నపుడు ఒక్క సారి నీ గురించి ఆలోచించుకుని ఉండుంటే ఇవాళ నీ లైఫ్ నీకు నచ్చినట్టు హ్యాపీగా ఉండేది….. !! చూడు అనవసరంగా నీ జీవితం స్పాయిల్ అయిపోయింది ఇప్పటికైనా మించి పోయింది లేదు……. !!  నేను చెప్పినట్టు చేసి నా దగ్గరే నా గర్ల్ ఫ్రెండ్ లా పడుంటాను అని చెప్పు ఇప్పుడే నిన్ను వదిలేస్తాను కానీ నేను ఎప్పుడూ పిలిస్తే అప్పుడు రావాలి…… !!

మహిదర్ సర్ కోసం చావడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నాను…… !! నీకు శిక్ష పడుతుంది అంటే నేను హ్యాపీగా చచ్చిపోతాను…….. !!  నేను చచ్చిపోతే నిన్ను కూడా మహిదర్ సర్ & జై సర్ వదిలి పెట్టరు గుర్తు పెట్టుకో ఇప్పుడు కూడా నేను కనిపించడం లేదు అని తెలిసిన మరుక్షణం వెతకడం మొదలు పెడతారు….. !! నీ మీద కొంచెం డౌబ్ట్ వచ్చినా నువ్వు నన్ను చంపడం కాదు నా కంటే ముందు నువ్వే వాళ్ళ చేతుల్లో చస్తావ్ అంటూ కోపంగా చెప్తుంది……. !!

నువ్విలా పొగరుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా నచ్చేశావ్ అని రితిక గుండెలు చేత్తో నలుపుతూ & ఇష్టం వచ్చినట్టు తనను కొరికి తనను ఆట వస్తువు లా ఆడుకుని…… !! తన కోరిక తీరగానే తనను విసురుగా బెడ్ మీద కు నెట్టి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతే రితిక కంటి నుండి నీళ్లు నిశబ్దంగా కారుతూ ఉంటాయి…….. !!

💫💫💫💫💫💫💫💫💫💫

మార్నింగ్ అనగా గుడికి వెళ్ళిన అందరూ ఈవెనింగ్ కి ఇంటికి రీచ్ అవుతారు…… !! ఇంటికి రాగానే జై కి హాల్ లో కూర్చునే ఓపిక కూడా లేక లిఫ్ట్ లో తన రూమ్ కి వెళ్ళిపోతాడు అది చూసిన శైలు…… !! అమ్ము జై బాగా టైర్డ్ అయిపోయినట్టు ఉన్నాడు వెళ్ళి హాట్ వాటర్ తో బాత్ చేయించు నేను మీ కోసం ఏదైనా వేడి వేడి గా కుక్ చేసి తీసుకుని వస్తాను…… !!

ఏంటి బాత్ చేయించాలా…… ?? అది కూడా వాడికి అబ్బా నాకు ఏంటి ఈ టార్చర్ అనుకుంటూ…… !! జై చేసేస్తాడు లే మామ్ తనకు బాత్ చేయించడానికి తనేం చిన్న పిల్లాడు కాదు కదా 😏…… !! నేను కూడా బాగా టైడ్ అయ్యాను కాసేపు నన్ను వదిలేయ్ అంటూ మహిదర్ పక్కన కూర్చోబోతుంది….. !!

అమ్ము చెప్పేది విను మీ అత్తయ్య చూడు ఎలా చూస్తుందో ఫస్ట్ నువ్వు పదా…… !! అని ఆద్య ను బలవంతంగా రూమ్ లోకి పంపించి తను కిచెన్ లోకి వెళ్తుంది….. !! ఆధ్య రూమ్ లోకి వెళ్ళేసరికి జై బాత్ చేసి మత్తుగా కళ్ళు మూసుకుని నిద్రపోతూ కనిపిస్తాడు….. !!  టైమ్ గాడ్ వీడు నిద్రపోయాడు లేకపోతే వీడి ఓవర్ యాక్షన్ నేను భరించ లేక పోయేదాన్ని అనుకుంటూ తను ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది…… !!

తను కూడా ఫ్రెష్ అయ్యి జై పక్కనే బెడ్ మీద అలసిపోయి నిద్రపోతుంది….. !! ఇద్దరి కోసం ఫుడ్ తీసుకుని వచ్చిన శైలు వాళ్లను అలా చూసి నవ్వుతూ ఫుడ్ పట్టుకుని కిందకు వెళ్ళిపోతుంది…… !! వినయ్ తో మాట్లాడుతున్న మహిదర్ కి గౌతం నుండి కాల్ రావడం తో వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు….. !!

హాయ్ సర్ నేను గౌతమ్ గుర్తొచ్చానా…… ??

యాహ్ గౌతం గుర్తున్నావ్….. !! హౌ ఆర్ యూ మ్యాన్….. ??
సర్ మీతో మాట్లాడాలి ఆర్ యూ ఫ్రీ నౌ…… ??

గౌతం వాయుస్ లోని టెన్షన్ కి కారిడార్ వైపు నడుస్తూ యాహ్ గౌతం టెల్ మీ ఏంటీ ఎందుకో కంగారుగా ఉన్నట్టు ఉన్నావ్…… ?? అంతా బానే ఉంది కదా….. ??

నో సర్ సమ్థింగ్ ఇస్ రాంగ్ 24 ఆర్స్ నుండి రితిక కనిపించడం లేదు…. !! తన ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేసాను తన కార్ కూడా వేరే ఏరియా లో దొరికింది బట్ తను మిస్సింగ్…… !! మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు ఎమ్ చేయాలో తెలియడం లేదు సర్ ఇప్పుడు నాకున్న హోప్ మీరే ప్లీస్ హెల్ప్ మీ సర్….. !!

గౌతం రిలాక్స్ అసలేం జరిగిందో క్లియర్ గా చెప్పు….. !! కార్ కనిపించింది అంటున్నావ్ మరి రీతిక ఎక్కడ…….. ?? నీకు ఎవరి మీదైనా డౌబ్ట్ ఉందా….. ??

నో సర్ రితిక అందరితో చాలా ఫ్రెండ్లీ గా ఉంటుంది…. !! నిన్న నేను కాల్ చేసినపుడు తన ఫ్రెండ్ కి జాండిస్ అటాక్ అయిందని చూడ్డానికి హస్పిటల్ వెళ్తున్నా అని మాత్రమే చెప్పింది….. !! వచ్చాక కలుద్దాం అంటే ఒకే అంది నిన్న అంతా వెయిట్ చేసాను తన కాల్ కోసం బట్ రితిక నుండి కాల్ రాలేదు…… !! తన కోసం వెతుకుతూ ఉంటే తన జార్ పక్కన ఏరియా లో కనిపించింది పైగా డోర్స్ కూడా ఫ్రంట్ ఓపెన్ లో ఉన్నాయి…… !! తనకేం అయిందో ఏంటో అని నాకు చాలా టెన్షన్ గా ఉంది సార్…… !!

మహిదర్ కాసేపు ఆలోచించి సరే రేపు మార్నింగ్ మా ఇంటికి వచ్చెయ్ ఇక్కడ నెక్స్ట్ ఎమ్ చేయాలో ఆలోచిద్దాం…… !! పోలీస్ హెల్ప్ కూడా తీసుకుందాం కమిషనర్ నాకు బాగా తెలుసు సో ఆయన మనకు కచ్చితంగా హెల్ప్ చేస్తాడు…… !! యూ డోంట్ వర్రీ గౌతం రితిక కి ఏం కాదు తనను సేఫ్ జై నీ చేతుల్లో పెడతాను టెస్ట్ మీ…… !!

థాంక్ యూ సర్ అంటూ కన్నీళ్ళతో కాల్ కట్ చేసి….. !! రితిక ఫొటో వైపు చూస్తూ నువ్వు సేఫ్ గా ఉన్నావ్ కదా రితిక అంటూ ఫోటో ను గుండెలకు బాధగా హట్టుకుంటాడు…… !!

✨✨✨✨✨✨✨✨✨✨✨✨

 

ఈవెనింగ్ 8 అవుతూ ఉండగా డోర్ నాక్ చేస్తున్న సౌండ్ కి మంట పుడుతున్న కళ్ళను కస్టంగా తెరిచి చూస్తూ…… !! లేవడానికి ట్రై చేస్తున్న ఆద్య ను పైకి లేవనివ్వకుండా బలంగా చుట్టేస్తాయి జై చేతులు…… !! అబ్బా వీడు మారడు అసలే బాడీ అంతా బద్దకంగా ఉంటే వీడు ఉడుములా పట్టేసాడు అని జై ను కష్టంగా విడిపించుకుని ఆధ్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది….. !!

వదిన డిన్నర్ కి రావాలట అత్త పిలవమంది కమ్ ఫాస్ట్ అని చెప్పి వెళ్తున్న మాయ ను చూసి నవ్వుతూ…… !! డోర్ ముందుకు వేసి బెడ్ మీద బోర్లా పడుకుని నిద్రపోతున్న జై ను చూసి ఆహహా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావ్ రా ఆగు నీ పని చెప్తా అనుకుంటూ……. !! బెడ్ మీద నీస్ మీద కూర్చుని అలాగే మెల్లగా పాకుతూ వెళ్ళి జై చెవిలో గట్టిగా జయ్ …య్……..య్ అంటూ గట్టిగా కేక పెడుతుంది………. !!

ఆధ్య అరుపు ఉలిక్కిపడి నిద్ర లేచిన జై ను చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ జై అని పిచ్చిగా నవ్వుతున్న ఆద్య ను చూసి….. !! యూ నన్ను పీస్ఫుల్ గా నిద్ర కూడా పోనివ్వవా ఆగవే దెయ్యం అని పారిపోవడానికి ట్రై చేస్తున్న ఆద్య ను ఎత్తుకుని వాష్ రూమ్ లోకి వెళ్ళి బాత్ టబ్ లో పడేస్తాడు…… !! ఇడియట్ అని అరుస్తున్న ఆద్య ను చూసి నవ్వుకుంటూ మంచిగా బాత్ చేసి రా అని చెప్పి వెళ్తున్న జై ను తిట్టుకుంటూ ఫ్రెష్ అయి బాత్ రబ్ కట్టుకుని రూమ్ లోకి వెళ్తుంది ఆధ్య…… !!

అప్పటికే జై తాను వేసుకోవాలి అనుకున్న నైట్ వేర్ ను బెడ్ మీద పెట్టేసి వెళ్ళుంటాడు అది చూసిన ఆద్య మెదడులో కన్నింగ్ ఐడియా రాగానే…… !! వాహ్ ఆధ్య వాహ్ సూపర్ ఐడియా అని తన భుజాన్ని తనే శభాష్ అని కొట్టుకుంటూ…… !! ఫాస్ట్ గా సీజర్ ఎక్కడుందో వెతికి మరీ తెచ్చి జై ప్యాంట్ బ్యాక్ సైడ్ కట్ చేసి యాస్ ఇట్ ఇస్ ఎలా ఉంది అలాగే అక్కడే పెట్టేసి తను రెడీ అవుతుంది…… !!

ఫ్రెష్ అయి వచ్చిన జై కాల్ మాట్లాడుతూ ప్యాంట్ ఎలా ఉందో కూడా సరిగ్గా చూసుకోకుండా డ్రెస్ అప్ అయ్యి రెడీ అవుతాడు….. !! జై ను అలా చూసిన ఆద్య నవ్వుకుంటూ జై వెనుకే ఫాలో అవుతూ నవ్వుకుంటూ…… !! జై ఇవాళ నీ పరువు అందరిలో హుష్ పటాక్ అని తనలో తాను నవ్వుకుంటూ……. !!! రుద్ర కి జై ను బ్యాక్ సైడ్ నుండి చూపించగానే రుద్ర ముందు షాక్ అయినా తర్వాత నవ్వుకుంటాడు…… !! తన వెనక నవ్వుతున్న ఇద్దరినీ చూసి ఏయ్ ఎందుకలా నవ్వుతున్నారు అని అడుగుతున్న జై ను చూసి ఇద్దరూ సైలెంట్ అయితే….. !! అటు వైపు నుంచున్న అమర్ జై ను చూసి పడి పడి నవ్వుతాడు అది చూసిన జై మొహాన్ని విసుగ్గా పెడతాడు…… !!