విలన్ హస్బెండ్{2} -25
తన వైపు చూస్తూ నవ్వుతున్న అమర్ వైపు విసుగ్గా చూస్తూ అరే ఏమైందీ మీ అందరికీ ఎందుకలా పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నారు అని తన వెనుక నుంచున్న రుద్ర, ఆద్య వైపు చూసి అసహనంగా అడుగుతాడు…… !! జై వాయిస్ కి రుద్ర తన నవ్వు కంట్రోల్ చేసుకుంటూ నీకు ఫ్యాషన్ సెన్స్ ఉందని తెలుసు కానీ మరీ ఇంత యూనిక్ గా ఆలోచిస్తావ్ అని ఐ డిడ్ న్ట్ ఎక్స్పెక్ట్ జై…… !!
అంత యూనిక్ గా ఇప్పుడు నేనేం చేసాను & దేనికి మీరు నవ్వుతున్నారో చెప్పండి ఫస్ట్…… !! నీకు నీ బాడీ లో ఏమైనా డిఫరెన్స్ కానీ డ్రెస్ డిస్ కంఫర్ట్ గా కానీ ఏమైనా అనిపిస్తుందా జై…… ?? డిస్ కంఫర్ట్ ఆ 🙄 అలాంటిదేం లేదు ఐ ఆమ్ ఒకే అని తనను తాను చూసుకుంటూ చెప్తున్న జై ను చూసి ఆద్య నవ్వుకుంటూ……. !! జై చెయ్ పట్టుకుని తనను హాల్ లో ఉన్న బిగ్ సైజ్ మిర్రర్ ముందు నిలబట్టి తన బ్యాక్ కనిపించేలా జై ను టర్న్ చేసి చూపెట్టగానే…… !! తన బ్యాక్ ప్యాంట్ కట్ చేయడం వల్ల కనిపిస్తున్న తన బాడీ ను ఆ ఆ 😬😬 అని అరిచి రెండు చేతులు వెనక్కి అడ్డు పెట్టుకొని వెనక్కి వెనక్కి నడుస్తూ…… !! తన రూమ్ కి పరిగెత్తిన జై ను చూసి హాల్ లో ఉన్న అందరూ నవ్వుతూ ఉంటారు…… !!
డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న జై కి ఆది ఆధ్య పని అని అర్థం అవ్వగానే…… !! నైట్ రూమ్ లోకి వచ్చాక చెప్తా దీని సంగతి అని పళ్ళు నూరుతూ డ్రెస్ అప్ అయ్యి అందరితో పాటు డిన్నర్ కి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు….. !! తనను చూసి నవ్వుతున్న ఆద్య ను శైలు గుడ్లు ఉరిమి చూడడంతో ఆధ్య కామ్ గా డిన్నర్ ఎంజాయ్ చేస్తూ తింటుంది….. !!
జై కూడా డిన్నర్ చేస్తూ తన ఎదురుగా ఏదో ఆలోచిస్తూ తింటున్న మహిదర్ ను కళ్ళు చిన్నవి చేసి చూస్తూ…… !! మావయ్య ఏంటి ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నట్టు ఉన్నాడు పైగా వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అని చూస్తూ ఉంటాడు…… !!
మహీ……. ?? ఏమైంది రా ఈవెనింగ్ నుండి డల్ గా ఉన్నావ్….. ?? ఇప్పుడు కూడా డిన్నర్ చేయకుండా ఏదో ఆలోచిస్తున్నావ్ హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా…… ?? డాక్టర్ ను పిలిపించనా అని అడుగుతున్న వినయ్ వర్మ మాటలకు అందరూ మహిదర్ వైపు చూస్తారు… . !!
అదేం లేదు వినయ్ నేను బానే ఉన్నాను అంతే అంటూ డిన్నర్ చేస్తున్న మహిదర్ ను చూసి…… !! రేపు ఆధ్య మనతో పాటు మన ఇంటికి వచ్చేస్తుంది కదా వినయ్ అందుకే ఆధ్య ను మిస్ అవుతున్నట్టు ఉన్నాడు……. !! ఇది ఏ తండ్రి కి అయినా ఉండే ఫీలింగ్ నే కదా అని మహిదర్ వైపు చూస్తూ…. !! ఆద్య గురించి నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు మహిదర్…. !! తను ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంటుందో అక్కడ కూడా అంతే హ్యాపీగా ఉంటుంది ఎమ్మా ఆధ్య అంతే కదా……. !!
కరెక్ట్ గా చెప్పావ్ తాతయ్య నేను అక్కడ కూడా ఇంతే హ్యాపీగా & ఫ్రీడం గా ఉంటాను……. !! డాడ్ నువ్వు అసలు నా గురించి వర్రీ అవ్వకు నీకు నన్ను ఎపుడు చూడాలి అనిపిస్తే అప్పుడు వచ్చెయ్ అని నవ్వుతూ చెప్తున్న ఆద్య ను చూసి మహిదర్ మొహం ఆనందం తో నిండిపోతుంది…… !!
అమ్ము మీ ఇంట్లో ఉంటే నా ఇంట్లో ఉన్నట్టే అంకుల్ నేను దాని గురించి అసలు కంగారు పడ్డం లేదు……. !! అమ్ము అక్కడ ఉంటే సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం నాకు వచ్చాకే నేను ఆధ్య & జై ల పెళ్ళి గురించి ఆలోచించాను….. !! అమ్ము కి ఎలాంటి కష్టం వచ్చినా తన ముందు అండగా జై ఉంటాడు ఆ నమ్మకం నాకు చాలా ఉంది అనగానే జై చిన్నగా స్మైల్ ఇస్తాడు…… !!
రేపు ఆధ్య తన అత్తారింటికి వెళ్తుంది అని గుర్తు రాగానే శైలు మొహం లో డల్నెస్ కనిపించినా…… !! ఆది ఎవరికి తెలియకుండా మొహాన్ని నార్మల్ గా పెట్టుకొంటూ అందరికీ నవ్వుతూ సర్వ్ చేస్తూ ఉంటుంది ….. !! నా ఇంటికి వెళ్ళాక చెప్తానే నీ సంగతి నీ ఇంట్లో సాగినట్టు అక్కడ నీ ఆటలు నేను సాగనివ్వను 😏 అని ఆధ్య ను కోపంగా చూస్తూ డిన్నర్ చేస్తూ ఉంటుంది రేణుక…… !!
రుద్ర & మాయ ఎవరు చూడకుండా ఒకరిని ఒకరు టేబుల్ కింద ఒకరి కాళ్ళతో ఒకరు ఆడుకుంటూ…… !! నవ్వుతూ డిన్నర్ చేస్తూ ఉంటారు అది ఎవరు గమనించరు…… !! ఇంకో వైపు సడెన్ గా ఇంటికి వెళ్ళిపోయినా మాన్య గురించే ఆలోచిస్తూ రేపు రెస్టారెంట్ లో తన ప్లాన్ ఎలా చేయాలి అని థింక్ చేస్తూ ఉంటాడు అమర్…… !! ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్లు డిన్నర్ కంప్లీట్ చేసి హాల్ లో సెటిల్ అవుతారు…… !!
💫💫💫💫💫💫💫💫💫💫💫
తన రూమ్ కి పడుకోవడానికి వెళ్తున్న మహిదర్ ను వెనుక నుంచి పిలుస్తాడు జై…… !! ఏంటి జై ఇంకా పడుకోలేదా అని అడుగుతున్న మహిదర్ వైపు చూస్తూ…… !! మావయ్య మీతో కొంచెం మాట్లాడాలి అని అదే ఫ్లోర్ లో ఉన్న హాల్ వైపు నడుస్తాడు జై…. !! మహిదర్ కూడా జై వెనుకే నడుస్తూ జై ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుని జై వైపు చెప్పు అన్నట్టు చూస్తాడు……. !!
మావయ్య నేను డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తున్నాను ఈవెనింగ్ నుండి మీ బిహేవియర్ చాలా వియర్డ్ గా అనిపిస్తుంది….. !! ఐ థింక్ మీరు దేని గురించో వర్రీ అవుతున్నారు అది ఆధ్య గురించే అయితే నా మీద నమ్మకం ఉంచి ప్రశాంతంగా వెళ్ళి పడుకోండి……. !! ఆధ్య రెస్పాన్సిబిలిటీ పూర్తీగా నాది తనతో ఎప్పుడైతే ఏడు అడుగులు వేశానో అప్పుడే డిసైడ్ అయ్యాను తన పూర్తి బాధ్యత నాదని…… !!
పర్సనల్ లైఫ్ గురించి కాదు మీ ప్రొఫెషన్ లైఫ్ ఐ మీన్ ఆఫీస్ లో ఏదైనా ఇష్యూ అయ్యుంటే అదేంటో చెప్పండి దాన్ని డెఫినెట్ గా నేను సార్ట్ అవుట్ చేస్తాను……. !! నేను మీకు అల్లుడిని మాత్రమే కాదు కొడుకుని కూడా నా గురించి అన్ని విషయాలు తెలిసి కూడా……. !! ఆద్య లాంటి మంచి అమ్మాయిని నాకు ఇచ్చి మ్యారేజ్ చేయాలి అనుకున్నప్పుడే మీరెంత మంచి మనిషో నాకు అర్థం అయ్యింది…… !! మీరు బెస్ట్ ఫాదర్ మాత్రమే కాదు బెస్ట్ హస్బెండ్ & బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు బెస్ట్ మామ కూడా అని నవ్వుతూ…… !! నా మీద ట్రస్ట్ ఉంటే ఎమ్ జరిగిందో చెప్పండి మావయ్య ప్లీస్ అనవసరంగా టెన్షన్ తీసుకోకండి….. !!
మహిదర్ జై చేతిని తన చేతులతో హోల్డ్ చేసి…… !! నీ మీద నాకు నమ్మకం ఉన్నా ఎక్కడో చిన్న డౌబ్ట్ ఉండేది జై నువ్వు మాతో కలవగలవా నీతో అమ్ము హ్యాపీగా ఉంటుందా అని …… ?? బట్ ఇవాళ నీ మాటలతో నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది….. !! నేను నా కూతురికి ఇప్పటి వరకు అన్ని ది బెస్ట్ నే ఇచ్చాను నీతో సహా అని నవ్వుతూ ….. !! ఆధ్య ఇప్పటి దాకా నీతో ఎలా ఉన్నా త్వరలోనే నిన్ను అర్థం చేసుకుంటుంది జై…… అంటూ హార్ట్ఫుల్ గా చెప్తాడు !!
ఆధ్య మాత్రమే కాదు మావయ్య నేను కూడా ట్రూలీ బ్లెస్డ్ మమ్మల్ని ఇంతలా లవ్ చేసే ఫాదర్స్ ఉన్నందుకు వుయ్ ఆర్ లక్కి అంటూ…….. !! ఇప్పుడు చెప్పండి ఏమైంది ఎందుకలా ఉన్నారు ఫ్యామిలీ తో కూడా షేర్ చేసుకోలేని ప్రాబ్లెమ్ ఏంటి….. ?? మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయి కదా………. ??
ఎదీ క్లియర్ అవ్వలేదు జై మనకు మళ్ళీ కొత్త ప్రాబ్లెమ్ స్టార్ట్ అయింది……. !!
ఏమంటున్నారు మావయ్య…… ??
నిజం చెప్తున్నాను జై….. !! మనకు తెలియకుండా మన చుట్టూ ఏదో జరుగుతోంది & నా వల్ల ఇప్పడు ఒక అమ్మాయి ప్రాణాలు రిస్క్ లో పడ్డాయి…… !! మన కుటుంబం సేవ్ అవ్వడం కోసం తను బలయ్యేలా ఉంది…….. !!
అసలేం అంటున్నారు మీరు…… ?? ఎవరి గురించి మీరు చెప్తోంది…. ??
నీకు గుర్తుందా జై………. !! హరిణి బాయ్ ఫ్రెండ్ రాహుల్ గురించి నిజాలు బయట పెట్టేలా చేసి ……. !! హరిణి ప్లాన్ కూడా మనకు తెలిసేలా చేసింది రితిక …….. !! ఇప్పుడు ఆ అమ్మాయి కనిపించడం లేదని తనను ప్రేమిస్తున్న గౌతం కాల్ చేసి చెప్పాడు & తను చెప్పాక నేను కూడా ఎంక్వైరీ చేయించాను అక్కడ నాకు తెలిసింది ఏంటంటే తను నిజంగానే కిడ్నాప్ అయింది……. !! ఎవరు చేశారో & ఎందుకు చేసారో తెలియదు కానీ వాళ్ళు కావాలనే రితిక ను ఎత్తుకుని వెళ్ళిపోయారు…….. !!
వాట్…… ?? కానీ ఎందుకు ఆ అమ్మాయికి ఎనిమీస్ ఎవరుంటారు మావయ్య…… !! తనో అర్ఫన్ అని చెప్పారు కదా అలాంటి అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది…… ?? ఒకవేళ డబ్బు గురించే అయ్యుంటే ఈ పాటికి గౌతం కి వార్నింగ్ కాల్ వచ్చేది సో ఇది డబ్బు గురించి చేసిన కిడ్నాప్ కాదు…… !!
ఇది వాంటెడ్లీ చేశారని అర్థం అవుతుంది జై….. !! బట్ ఎవరు చేశారో తెలియడం లేదు పైగా ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఎవరి గురించి తను పట్టించుకోదు తన వర్క్ తను చూసుకుంటుంది …… !! నో మావయ్య ఏదో జరిగింది లెట్ మీ థింక్ అని ఆలోచిస్తున్న జై కి హరీష్ స్ట్రైక్ అవుతాడు వెంటనే మహిదర్ వైపు చూస్తూ…… !! నాకు ఎందుకో హరీష్ మీద డౌబ్ట్ గా ఉంది మావయ్య వాడికే రితిక ను కిడ్నాప్ చేసే నీడ్ ఉంది…… !! ఎందుకు అంటారా రితిక వల్లే హరిణి ప్లాన్ లీక్ అయింది కాబట్టి వాడు రితిక ను కిడ్నాప్ చేసి ఉండచ్చు…… !! వెంటనే కిడ్నాప్ చేస్తే మనకు డౌబ్ట్ వస్తుందని మనం అందరం మన లైఫ్స్ లో బిజీగా ఉన్నాం అని కన్ఫర్మ్ చేసుకుని ఇప్పుడు కిడ్నాప్ చేసుంటాడు…… !!
ఆర్ యూ స్యూర్ జై…… ?? నాకు ఎందుకో వాడు కాదు అనిపిస్తుంది……. !!
నో మావయ్య కచ్చితంగా వాడే రితిక ను అడ్డు పెట్టుకొని వాడి బాబు ను బయటకు రప్పించే ప్లాన్ కూడా అయ్యుండచ్చు….. !! మనం ఛాన్స్ తీసుకోకూడదు మావయ్య ఈ టైం లో వాడు ఎక్కడ ఉంటాడో నాకు బాగా తెలుసు మీరు వెళ్ళి పడుకోండి వాడి సంగతి నేను చూసుకుంటాను……. !! అని మొబైల్ లో ఎవరికో మెసేజ్ చేస్తూ వెళ్ళడానికి పైకి లేచి నుంచుంటాడు….. !!
ఆగు జై నువ్వు ఒంటరిగా వెళ్ళకు నేను కూడా వస్తాను…… !! నో నీడ్ మావయ్య అమర్, ఆర్యన్ ఉన్నారు కదా వాళ్ళు కూడా వస్తున్నారు ముగ్గురం వెళ్ళి వాడ్ని ఈడ్చుకొని వస్తాం…… !! రేపు మార్నింగ్ నా గెస్ట్ హౌస్ లో రితిక ఎక్కడుందో వాడి నోటితో చెప్పిస్తాను……… !! బై మావయ్య అని హడావిడిగా పరిగెడుతున్న జై ను చూసి మహిదర్ గుండె ఆనందంతో ఉప్పొంగుతుంది …… !!
ఫాస్ట్ గా డ్రెస్ అప్ అయి వెళ్తున్న జై ను చూసిన ఆద్య ఏంటిది వీడు ఇంత హడావిడి గా వెళ్తున్నాడు…… ?? ఇంత నైట్ ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆలోచిస్తూ హు 😏 ఇంకెక్కడికి అయ్యుంటుంది పాపం పెళ్ళి అయినప్పటి నుండి బాగా గ్యాప్ వచ్చింది కదా…… !! ఆ విరహ వేదన మొత్తం తీర్చుకునేందుకు వీడి గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నట్టు ఉన్నాడు… !! చిచీ వీడు జన్మకు మారడు అయినా వీడు ఎక్కడికి పోతే నాకు ఎందుకు లే అని లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది కానీ ఆధ్య కి ఎంత సేపటికి నిద్ర పట్టదు…….. !!!
ఆ ఆ ఆఆ 😬😬 ఏంటిది నిద్ర అస్సలు వచ్చి చావడం లేదు వాడు హాయిగా తన గర్ల్ ఫ్రెండ్ కౌగిలిలో కరిగిపోతూ ఉంటాడు…… !! నేను మాత్రం వాడి గురించి ఆలోచిస్తూ ఇలా పిచ్చి దానిలా మేలుకున్నాను ఐ హేట్ యూ జై అని పిల్లో విసిరేస్తూ అరుస్తుంది……. !!