విలన్ హస్బెండ్{2} -26
జై ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే ఇలా కార్ లో తెచ్చి పడేసావ్ ఏంట్రా…… ?? నాకు బాగా నిద్రొస్తుంది హ్యాపీగా నిద్రపోతున్న వాడిని బలవంతంగా ఎత్తుకొచ్చి పడేశావ్ ఎక్కడికి రా ఇంత నైట్……. ?? అని ఆవలిస్తూ ఫ్రంట్ లో కూర్చున్న రుద్ర వైపు చూస్తూ నీకైనా చెప్పాడా రుద్ర ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో…… ?? రుద్ర నోరు తెరిచే లోగా రేయ్ నోరు తెరిచావో రోడ్ మీదకు విసిరేస్తా నోరు మూసుకుని కూర్చో వెళ్తున్నాం కదా అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుంది అంటూ మిర్రర్ నుండి అన్సర్ ఇస్తాడు జై …… !!
నాకు రేపు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి రా అయినా నీకేం తెలుసు నా బాధ 😏😏…… !! హ్యాపీగా పెళ్లి చేసుకుని నీ పెళ్ళాం తో బానే ఎంజాయ్ చేస్తున్నావ్….. !! మరి నేను ముడ్డి కిందకు పాతిక సంవత్సరాలు వచ్చినా నా మొహానికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు…… !! నచ్చక నచ్చక ఇన్ని ఇయర్స్ కి ఒక పిల్ల నచ్చింది రేపు సర్ప్రైజ్ చేసి ప్రపోజ్ చేద్దాం….. !! అని అన్ని రెడీ చేసుకుంటే నువ్వేంట్రా బాబు నా ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసేలా ఉన్నావ్….. ??
నువ్వు ఇప్పుడు ప్రపోజ్ చేయకపోతే కొంపలేం మునగవు & దేశానికి వచ్చే నష్టం ఎమ్ లేదు కానీ…… !! రేపు మనకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది సో మీకేమైనా వర్క్స్ ఉంటే ఇద్దరూ పోస్ట్ పోన్ చేసుకోండి….. !! అనుకున్నా ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అని 😬😬 పళ్ళు నూరుతూ…… !! ఏంటబ్బా నా లవ్ స్టోరీ ఎలాంటి ట్విస్ట్ లు బ్రేక్ లు లేకుండా హాయిగా సాగుతుంది అనుకున్నా పెట్టావ్ గా ఫిట్టింగ్……. !!
నన్ను మాన్య ను కలవకుండా అడ్డు కుంటున్నావ్ కదా నీకు కూడా ఇదే నా శాపం నేను మాన్య కలిసే వరకూ నువ్వు ఆధ్య కూడా కలవకూడదు…… !! అని కోపంగా చెప్పి మొహం తిప్పుకుంటున్న అమర్ ను చూసి వెటకారంగా నవ్వుతూ……. !! ఇప్పుడు మాత్రం మేము కలిసే ఉంటున్నామా ఏంటి అయినా ఈ విషయం మీకు చెప్పలేను కర్మ 🤦…… !! నువ్వు పెళ్లి కాకుండా ఇలా బ్యాచిలర్ గా ఉన్నావో పెళ్ళైనా సరే నేను కూడా బ్యాచిలర్ గానే బతుకుతున్నా ….. !! అది మీ అందరి దృష్టిలో దేవత నాకు మాత్రం కొరివి దెయ్యం అని ఆద్య ను తిట్టుకుంటూ డ్రైవింగ్ మీద ఫోకస్ పెడతాడు……. !!
కాసేపటికి జై కార్ సిటీ కి దూరంగా ఉన్న ఒక ఫార్మ్ హౌస్ దగ్గర ఆగుతుంది…… !! కార్ దిగిన అమర్ నిశబ్దంగా ఉన్న ఆ ప్లేస్ ను చూసి అబ్బా ఎంత పీస్ఫుల్ గా ఉంది అవును ఎవరిది రా గెస్ట్ హౌస్ బలే ఉంది అని నవ్వుతూ…… !! ఇక్కడేదైనా పార్టీ జరుగుతుందా అందుకే వచ్చామా పోనీ లే తాగి చాలా డేస్ అవుతుంది హ్యాపీగా నైట్ మొత్తం ఎంజాయ్ చేయాలి అనుకుంటూ…… !! సారీ జై ఇందాక ఏదేదో వాగేసా ఎనీ వే ఇంకెందుకు లేట్ పదండి లోపలికి వెళ్ళి కుమ్మేద్దాం ……. !! అని హుషారుగా చెప్పగానే జై రుద్ర ఒకరిని ఒకరు చూసుకుని లోపలికి నడుస్తారు…….. !!
అమర్ కూడా తన మొబైల్ ను సైలెంట్ లో పెడుతూ అనవసరంగా కాల్స్ చేసి ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు…..!! అందుకే మొబైల్ ను సైలెంట్ లో పెట్టేస్తే నేను ప్రశాంతంగా ఉండచ్చు అనుకుంటూ…… !! లోపలికి ఎంటర్ అయిన అమర్ కి ఎక్కడ చూసిన అమ్మాయిలే కనిపిస్తారు…… !!
ఏంట్రా ఇది ఒక్క మొగ పురుగు కూడా కనిపించడం లేదు ఇంత మంది అమ్మాయిల మధ్య మనమే అబ్బాయిలం అనుకుంటా…… !! అందరూ ఎందుకు రా అలా మనల్నే వింతగా చూస్తున్నారు అని జై వెనుకే నడుస్తూ అందరినీ అబ్జర్వ్ చేస్తాడు…… !! అక్కడున్న అమ్మాయిలు అందరూ తమ అందాలు కను విందు చేసేలా బాడీ ఎక్స్పోజ్ చేస్తూ చీరలు కట్టుకుని……. !! అందంగా మేక్ అప్ చేసుకుని తల నిండా పూలు పెట్టుకుని గుప్పుమంటున్న పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని వయ్యారంగా నుంచుని చూస్తూ ఉంటారు…… !!
జై ఆగరా నిజం చెప్పు ఇది నిజంగా పార్టీ జరిగే ప్లేస్ ఏనా ఇక్కడ అందరూ చాలా వియర్డ్ గా ఉన్నారు…… ?? ఎవర్రా వీళ్ళంతా అసలు ఇక్కడ ఎమ్ జరుగుతుంది అని తన వైపే సెక్సీ గా చూస్తున్న అమ్మాయిలని విసుగ్గా చూస్తూ…… !! జై వైపు కోపంగా చూస్తూ అడుగుతాడు….. !! ఇక్కడ పార్టీ జరుగుతుంది అని నేను చెప్పలేదే నీ అంతట నువ్వే డిసైడ్ అయ్యావ్ అది నా మిస్టేక్ కాదు….. !! ముందు నువ్వు నా షర్ట్ వదులు ఇక్కడికి మనం ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వచ్చాం……. !! అని చుట్టూ చూస్తు తనను చూసి నవ్వుతున్న అమ్మాయి దగ్గరకు వెళ్తాడు…… !!
జై….. జై….. రేయ్ ఛా…. !! వెళ్ళిపోయాడు అని విసుగ్గా తల తిప్పి రుద్ర ఎట్లిస్ట్ నువ్వైనా చెప్పు అసలు ఏంటి ఇదంతా…… ?? హుష్ 🤫 సైలెంట్ గా ఉండు నువ్వు అనుకుంటున్నది నిజమే ఇది సీక్రెట్ గా రన్ చేసే ప్రాస్టిట్యూషన్ హౌస్ ఇక్కడికి హై ప్రొఫైల్ పీపుల్స్, బిగ్ షాట్స్ & సెలబ్రిటీస్ మాత్రమే వస్తూ ఉంటారు ……. !!
ఏంటి అని నోరు తెరిచి షాక్ అవుతూ…… !! చిచీ వాడితో ఫ్రెండ్షిప్ చేసి నువ్వు కూడా చెడిపోయావా రుద్ర….. !! నిన్ను మార్చేశాడా వాడు అని కోపంగా చూస్తూ…… !! అయినా నిన్ను మాయ లవ్ చేస్తుంది ఆ విషయం మర్చిపోయి ఇక్కడికి వాడితో పాటు ఎంజాయ్ చేయడానికి వస్తావా….. ?? ఈ విషయం మాయ కి తెలిస్తే నిలువునా ఒక సారి అడ్డంగా ఒక సారి నరికేస్తుంది ఆగు ఇప్పుడే తనకు కాల్ చేసి చెప్తా…….. !!
ఏయ్ ఎమ్ చేస్తున్నావ్ నువ్వు అని అమర్ మొబైల్ కంగారుగా లాక్కుని……!! నిజం తెలుసుకోకుండా ఏంటి నువ్వు చేస్తుంది అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా…… ?? ఇక్కడికి అందరి మగవాళ్లు ఎందుకు వస్తారో మీరు అందుకే కదా వచ్చింది అని మొహాన్ని చిరాగ్గా పక్కకు తిప్పుకుంటాడు ….. !!
నీకు నువ్వు అన్నీ ఊహించుకోవద్దు స్వామి మనం ఇక్కడికి వచ్చింది హరీష్ కోసం అసలు ఎమ్ జరిగింది అంటే అని జై తనకు చెప్పింది మొత్తం అమర్ కి అర్థం అయ్యేలా చెప్తాడు రుద్ర…… !! ఓహ్ గాడ్ ఇంత జరిగిందా అయ్యో పాపం మన కోసం హెల్ప్ చేసి ఆ అమ్మాయి రిస్క్ లో పడింది మనం ఎలా అయినా ఆ అమ్మాయిని సేవ్ చేయాలి…… !!
హ్మ్మ్ అందుకే ఇక్కడికి వచ్చాం ఎలాగైనా వాడ్ని పట్టుకుని నాలుగు పీకితే వాడే చెప్తాడు…… !! అది సరే జై ఎక్కడ కనిపించడం లేదు దేనికైనా కనెక్ట్ అయ్యి రూమ్ లోకి వెళ్ళి ఎంజాయ్ కానీ చేయట్లేదు కదా వాడికి అసలే అమ్మాయిల వీక్నెస్…. !! అమర్ తల మీద మొట్టి అక్కడ చూడు అని ఎదురుగా చూపించగానే జై హరీష్ కాలర్ పట్టుకుని లాక్కుంటూ వస్తూ కనిపిస్తాడు జై…… !!
అమర్ నవ్వుతూ వీడి ఇంత ఈజీగా ఎలా దొరికేసాడు జై అని ఎదురు వెళ్తూ అడుగుతాడు…… !! వీడికి ఉన్న ఒకే ఒక పిచ్చి అమ్మాయిలు పైగా వీడు హైదరాబాద్ లో ఎక్కువగా ఇక్కడే వస్తుంటాడు…… !! అని నాకు తెలుసు అందుకే వీడి మొబైల్ ట్రాక్ చేసి ఎక్కడున్నాడో తెలుసుకున్నా ……. !! అని పారిపోవడానికి ట్రై చేస్తున్న హరీష్ చెంపలు పగల కొడతాడు…… !!!
రేయ్ అసలు ఎందుకు నన్ను తీసుకుని వెళ్తున్నారు మర్యాదగా నన్ను వదలండి ఇప్పటికే మీరు చాలా చేశారు….. !! అయినా నేను మీ జోలికి రాకుండా నా పని నేను చేసుకుంటుంటే మధ్యలో నన్ను కొట్టి బలవంతంగా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు…… ?? ఏంట్రా నువ్వు చేసే పని పదా ముందు అని జై హరీష్ ను చావ కొడుతూ నిన్ను తీసుకుని రావడానికి ఇప్పుడు నాకు లక్ష రూపాయలు బొక్క…… !! అని హరీష్ ను బ్యాక్ సీట్ లోకి తోసి వెనక కూర్చుని హరీష్ పారిపోకుండా తన గుండెల మీద కాళ్లు పెట్టుకుని సిగరెట్ తాగుతూ ఉంటాడు……. !!
అమర్ కార్ స్టార్ట్ చేయ్ అని సీరియస్ గా వినిపించిన జై వాయిస్ కి అమర్ డ్రైవింగ్ సీట్ లో రుద్ర పక్కన సీట్ లో కూర్చుంటూ…… !! ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం జై అని అడుగుతున్న రుద్ర వైపు చూస్తూ నా గెస్ట్ హౌస్ కి వెళ్దాం అది రీసెంట్ గానే కొన్నాను…… !! చాలా మంది కి దాని అడ్రస్ కూడా తెలియదు అని రింగ్ అవుతున్న హరీష్ మొబైల్ లాక్కుని దూరంగా విసిరి కొట్టగానే అది నాలుగు ముక్కలు అవుతుంది…… !! చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ మెడలో చైన్ & బ్రాస్లెట్ ఇలా అన్ని కూడా లాక్కుని దూరంగా విసిరి పడేస్తాడు…… !!
అనవసరంగా నాతో పెట్టుకున్నారు మిమ్మల్ని ఈజీగా వదలడు మా డాడీ తను బయటకు వచ్చాక మీ ఒక్కొక్కరికి నరకం చూపించకుండా వదిలి పెట్టడు…… !! ఏంట్రా నీ బాబు చూపించేది నీ బాబు బయటకు వచ్చే వరకు నువ్వు బతికుంటే కదా…… !! అయినా మగాడివి అయితే నేరుగా నన్ను టార్గెట్ చేయాలి కానీ అనవసరంగా అమ్మాయిని ఎందుకు రా ఎత్తుకుని వెళ్ళావు…… ??
నేను అమ్మాయిని ఎత్తుకుని వెళ్లడం ఏంటి అసలేం మాట్లాడుతున్నావ్ నువ్వు…… ?? ముయ్యరా నోరు అని హరీష్ నోరు తెరవకుండా కొట్టి అమర్ కి తన గెస్ట్ హౌస్ కి వెళ్ళడానికి డైరెక్షన్స్ చెప్తూ కాసేపటికి గెస్ట్ హౌస్ కి రీచ్ అవుతారు….. !! హరీష్ కాళ్ళు & చేతులు కట్టేసి తనని ఒక డార్క్ రూమ్ లో లాక్ చేసి వీడి నుండి ఎలా నిజాలు రాబట్టాలి…….. !! అని ముగ్గురు కాసేపు డిస్కస్ చేసి అన్ని రూమ్స్ లాక్ చేసి వాచ్ మెన్ తో జాగ్రత్త అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు……. !!
వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి మిడ్ నైట్ 2 అవుతుంది….. !! రూమ్ కి వెళ్ళిన జై కి టెడ్డి బేర్ ను హాగ్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది ఆధ్య….. !! తనను అలా చూసినా జై నవ్వుతూ తన బుగ్గ మీద చెయ్ వేయబోయి…… !! లేదు అలాంటి ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అవ్వకుండా అమ్ము ను టచ్ చేయకూడదు అని టవల్ తీసుకుని వాష్ రూమ్ లోకి దూరుతాడు…..!!!
కాసేపటికి ఫ్రెష్ అయిన చెయ్ డ్రెస్ అప్ అయి ఆధ్య ను దగ్గరకు లాక్కుని నుదుటిన ముద్దు పెడుతూ…….. !! నిన్ను ఇలా హగ్ చేసుకుంటూ పడుకుంటే చాలు అమ్ము నా బాడీ కి అమ్మాయి కావాలి అన్న థాట్ కూడా రావడం లేదు…… !! నువ్వు గమనించావా మన మ్యారేజ్ అయినప్పటి నుండి నేను నా ఫ్లాట్ వైపు వెళ్ళలేదు & ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు ఇదంతా నీ వల్లే…… !! నువ్వు నాకు దగ్గరగా ఉంటే చాలు నాకు ఎలాంటి థాట్స్ రావట్లేదు నువ్వంటే ఎంత కోపం ఉందో అంతే లస్ట్ కూడా ఉంది అని నవ్వుతూ…… !! లస్ట్ అన్నందుకు నీకు కోపం వచ్చినా సరే నాకు నీ బాడీ స్ట్రక్చర్ & నీ బాడీ నుండి నాచరల్ గా వచ్చే ఫ్రాగ్రెన్స్ అంటే చాలా ఇష్టం….!!
నువ్వంటే నాకు ఏదో తెలియని ఫీలింగ్ నువ్వు దగ్గరుంటే ఇదిగో ఇలాగే ఇంత డీప్ గా నిన్ను హగ్ చేసుకోవాలి అనిపిస్తుంది….. !! ఈ ఫీలింగ్ ఏంటో నాకు కూడా తెలియదు బట్ నాకు ఈ ఫీలింగ్ నచ్చింది అని మండుతున్న కళ్ళను అలాగే మూస్తూ కాసేపటికి నిద్రలోకి జారుకుంటాడు…… !! ఆధ్య కూడా అప్పటికే డీప్ స్లీప్ లో ఉండడం తో చలికి మరింతలా జై గుండెల్లో మొహాన్ని దాచేస్తూ హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది…. !!
💫💫💫💫💫💫💫💫💫💫💫
8 అవుతున్నా ఇద్దరూ రూమ్ లో నుండి బయటకు రావడం లేదు ఏంటి…… ?? అసలు రూమ్ లో ఎమ్ చేస్తున్నారు వీళ్ళు అని కాలు కాలిన పిల్లిలా అటు ఇటు అదే ఫ్లోర్ లో ఉన్న హాల్ లో తిరుగుతూ ఉంటుంది రేణుక…… !! గుడ్ మార్నింగ్ వదిన అని నవ్వుతూ విష్ చేస్తున్న శైలు ను చూసి పళ్ళు కనిపించేలా నవ్వుతూ గుడ్ మార్నింగ్ వదిన అంటూ తను తీసుకుని వచ్చిన కాఫీ కప్ తీసుకుని తాగుతూ ఉంటుంది…… !!
బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది వదిన మీరు లంచ్ అయ్యాక వెళ్తున్నారు కదా అందుకే మీ కోసం స్పెషల్స్ చేయిస్తున్నా…… !! పిల్లలు ఇంకా లేవలేదా అని ట్రే లో కాపీ కప్స్ పట్టుకుని ఆధ్య రూమ్ వైపు చూస్తూ అడుగుతుంది……. !!
ఆ…. లేచినట్టు ఉన్నారు వదిన వాళ్ళకు కాఫీ నేను ఇస్తాను కానీ మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ వర్క్ చూడండి……. !! అయ్యో మీకు ఎందుకు శ్రమ అంటున్నా శైలు చేతిలో నుండి ట్రే లాక్కుని ఇందులో శ్రమ ఎమ్ లేదు నా కొడుకు కోడలికి ఆ మాత్రం ఇవ్వలేనా ఇంకేం చెప్పకండి మీరు వెళ్ళండి వదిన ……. !! అని బలవంతంగా శైలు ను కిందకు పంపేసి ట్రే పట్టుకుని రేణుక ఆద్య రూమ్ వైపు వెళుతుంది…… !!
లక్కిగా నైట్ జై రూమ్ డోర్ లాక్ చేయకపోయేసరికి డోర్ హ్యాండిల్ మీద చెయ్ వేయగానే డోర్ ఓపెన్ అవుతుంది…… !! రూమ్ లోకి ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళిన రేణుక కి బెడ్ మీద నడుము వరకూ బెడ్ షీట్ కప్పుకుని……. !! టైట్ హగ్ తో నిద్రపోతున్న ఇద్దరినీ చూసి రక్తం ఉవ్వెత్తున కుత కుతా ఉడికిపోతూ ఉంటుంది…… !! వాళ్ళను అలా చూస్తూ ఊరికే ఉండలేక కోపంగా ట్రే ను నేల మీదకు విసిరి కొట్టి ఇద్దరినీ నిద్ర లేపేసి ఇద్దరి వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది…… !! కప్స్ పగిలిన శబ్దం కి నిద్ర లేచిన ఇద్దరూ అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుని రేణుక వైపు చూస్తారు…… !!
ఇప్పుడు రేణుక జై కి ఎమ్ ఆన్సర్ ఇవ్వనుంది….. ?? రేణుక కోపానికి జై రీసన్ తెలుసుకోగలడా…… ?? రితిక హరీష్ దగ్గర లేదని జై కి తెలిస్తే జై ఎమ్ చేయనున్నాడు ….. ?? హరిణి కి హరీష్ కిడ్నాప్ గురించి తెలిస్తే రితిక ను వదిలేస్తుందా ఇంకొంచెం టార్చర్ పెడుతుందా…… ?? ఇంతకీ మాదేశ్ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నాడు…… ??