Login with OTP

విలన్ హస్బెండ్{2} -27

aashyatech

Author

మామ్ ఏమైంది…… ?? అని అడుగుతున్న జై ను చూసి కోపంగా ఉన్న తన ఫేస్ లోని ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తూ…… !! అదీ చెయ్ జారింది జై మీకు కాఫీ తీసుకుని వచ్చాను బట్ చెయ్ జారి కింద పడ్డాయి అంటూ కంగారు నటిస్తూ చెప్తున్న రేణుక ను చూసి ఆద్య కళ్ళు చిన్నవి చేసి చూస్తూ…… !! నా అత్త మొహం చూస్తేనే తెలుస్తుంది కావాలని పగల కొట్టిందని కానీ ఎందుకు….. ?? ఓహ్ మమ్మల్ని ఇలా క్లోజ్ గా చూసి డిస్టర్బ్ చేయడానికి ఇలా చేసుంటుంది అనుకుని అయ్యో ఇంత చిన్న దానికి సారి ఎందుకు అత్తయ్య…… !! అయినా కాఫీ మీరు తీసుకుని రావడం ఏంటి మెయిడ్ కి చెప్తే తనే తీసుకుని వచ్చేది కదా అంటూ బెడ్ దిగుతూ రేణుక వైపు చూస్తుంది…… !!

నా కొడుకు, కోడలికి నా చేత్తో కాఫీ చేసి ఇవ్వాలి అనుకున్నాను ఆధ్య అందుకే నేనే కాఫీ ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చాను….. !! యూ ఆర్ సో స్వీట్ అత్తమ్మ అని రేణుక ను హత్తుకుంటూ అయితే రోజు మీరే నాకు కాఫీ ఇస్తారు అనమాట ……. !! మాయ చెప్పింది ఎవ్రీ సండే మీరే దగ్గరుండి అందరికీ నచ్చినవి కుక్ చేస్తారట కదా……. !! ఇప్పటి నుంచి డెయిలీ బ్రేక్ఫాస్ట్ & డిన్నర్ కూడా మీరే కుక్ చేయరా ప్లీస్ మీరు ఏ డిష్ అయినా బాగా కుక్ చేస్తారని మాయ చెప్పింది ప్లీస్ అత్తమ్మ…… !!

ఇదేంటి నేను ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యేలా ఉంది…… !! ఇది నన్ను కిచెన్ కే అంకితం చేయాలని చూడట్లేదు కదా అయినా నేను ఎందుకు కుక్ చేయాలి ఇంట్లో కుక్స్ ఉన్నది దేనికి…… ?? అని కోపంగా అనుకుంటూ అదే ఆధ్య తో చెప్పబోతూ ఉండగా…… !! ఆధ్య చెప్పింది నిజం మామ్ నేను కూడా నీ కుకింగ్ బాగా మిస్ అవుతున్నా మన ఇంటికి వెళ్లిపోయాక రోజు నువ్వే కుక్ చెయ్ మామ్….   !!

ఆ…. అది కాదు రాదు మనకు కుక్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా బానే కుక్ చేస్తారు….. !! వాళ్ళు ఉండగా నేను కుక్ చేయడం ఏంటీ పైగా మీ డాడ్ ను కూడా చూసుకుంటూ ఉండాలి కదా నాకు అస్సలు టైం అడ్జస్ట్ అవ్వదు…… !! అయ్యో అత్తయ్య అది అసలు మ్యాటర్ ఏ కాదు అయినా మీ చేత్తో కుక్ చేస్తే స్ టేస్ట్ ఏ వేరు మీరు ఉండగా ఇంట్లో 4 కుక్స్ ఎందుకు అందుకే మీకు హెల్ప్ గా ఒక్క కుక్ ను మాత్రమే ఉంచి ముగ్గురినీ తీసేద్దాం …… !!  మావయ్య వర్క్స్ చేయడానికి ఒక కేర్ టేకర్ ను అపాయింట్ చేద్దాం ఎమ్ అంటావ్ జై….. !!

యాహ్ ఆధ్య చెప్పినట్టు చేద్దాం మామ్ ఎలాగో నువ్వు కూడా ఇంట్లో నాకు బోర్ కొడుతుంది అని అంటూ ఉంటావ్ కాబట్టి…… !! కుకింగ్ లో బిజీ అయితే నీకు అస్సలు బోర్ ఫీల్ అనిపించదు…… !! అంటూ తన మొబైల్ రింగ్ అవ్వడం తో లిఫ్ట్ చేస్తూ బాల్కనీ వైపు వెళతాడు….. !!

ఛా….. !! అనవసరంగా ఇటోచ్చి ఇరుక్కున్నా ఇప్పుడు చూడు నా బతుకు కేర్ ఆఫ్ కిచెన్ ప్లాట్ఫారం అయింది…… !! అయినా ఇది నా ఇంట్లోకి రాకానే నన్ను కిచెన్ కి అంకితం చేసింది ఇక ఇంటికి వస్తే ఇంకేం చేస్తుందో ఏంటో…     ?? నేను దీన్ని టార్చర్ పెడదాం అనుకుంటే రివర్స్ లో ఇదే నన్ను పెడుతుంది అంతా నా కర్మ….. !!

ఎంటత్త ఎలా నన్ను నీ కొడుకును విడదీయాలా అని ఆలోచిస్తున్నావా …… ?? ఆ…. లే….. లేదు అయినా నేను ఎందుకు అలా అనుకుంటాను నువ్వు నా కొడుకు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కదా నేను కోరుకుంటాను …… !!

హ్మ్మ్….. !! ఇలాంటి డైలాగ్స్ అన్ని నువ్వేం చెప్పినా గంగిరెద్దు లా తల ఊపే నీ కొడుక్కి చెప్పు నాకు కాదు…… !! అయినా నేను వచ్చాను కదా ఇక నుండి నీ ఆటలు ఏవీ నా ముందు పని చేయవు చూస్తూ ఉండు నీ వాల్యూ ఎలా తగ్గిస్తానో…… ?? నిన్ను ఎక్కడ ఎలా ఎప్పుడు నొక్కాలో అక్కడ నొక్కుతా అంటూ యాటిట్యూడ్ గా నవ్వుకుంటూ ……. !! వాష్ రూమ్ లోకి వెళ్తున్న ఆద్య ను చూసి పళ్ళు నూరుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేణుక…… !!

✨✨✨✨✨✨✨✨✨✨✨

 

రుద్ర మిర్రర్ ముందు నుంచుని హెయిర్ సెట్ చేసుకుంటూ…… !! అవునా నైట్ అమర్ మాయ నన్ను లవ్ చేస్తుందని చెప్పాడు…… ?? అసలు మా లవ్ గురించి అమ్ములు కి తప్పా ఎవరికి తెలియదు కదా మరి అమర్ కి ఎలా తెలిసింది…… ?? నేను నిన్న హరీష్ గురించిన టెన్షన్ లో దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు …… !!

ఆ విషయం నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అదేంటో అమర్ నే అడగాలి & దీని గురించి ఎక్కడ మాట్లాడద్దు……… !! అని కూడా చెప్పాలి ముఖ్యంగా జై కి మా లవ్ గురించి తెలియకూడదు అని చెప్పాలి అనుకుంటూ……. !! అక్కడి నుండి బయటకు వెళ్తూ ఉండగా తన మొబైల్ రింగ్ అవుతుంది…… !! అబ్బా ఈ టైం లో ఎవరూ అనుకుంటూ మొబైల్ వైపు చూసిన రుద్ర కి అపర్ణ నుండి కాల్ రావడం చూసి కాల్ లిఫ్ట్ చేస్తాడు…… !!

హలో రుద్ర

హాయ్ మామ్ హౌ ఆర్ యూ హౌ ఇస్ డాడ్…… ??

వుయ్ ఆర్ గుడ్ రుద్ర నువ్వెలా ఉన్నావ్….. ??

ఐ ఆమ్ అల్సో గుడ్ మామ్….. !! ఏంటి ఇంత మార్నింగ్ కాల్ చేసావ్ ఎనీ థింగ్ ఇంపార్టెంట్……. ??

ఇంకా ఎన్ని మంత్స్ దూరంగా ఉంటావ్ రుద్ర నీకు తెలుస్తుందా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి 3 మంత్స్ దాటి పోయింది…    !! వన్ మంత్ బిజినెస్ టూర్ అని చెప్పి వెళ్ళావ్ ఇక్కడ మేము నిన్ను ఎంత మిస్ అవుతున్నామో తెలుసా ఎప్పుడొస్తావ్ రుద్ర…… ??

మామ్ నేను ఇప్పుడే రావడం కుదరదు అని ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఇక్కడ చాలా వర్క్స్ ఉన్నాయి…… !! నేను రావడం ఇప్పట్లో అవ్వదు నా ప్రాజెక్టు కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు…… ??

ఇంకా ఎందుకు రుద్ర అబద్ధాలు చెప్తున్నావ్ ….. ?? నువ్వు వెళ్ళింది బిజినెస్ ట్రిప్ కాదు నీ పేరెంట్స్ గురించి వెళ్ళావ్…… ?? వాళ్ళను కలిశావ్ & ఇప్పుడు వాళ్ళతోనే ఉంటుంటున్నావ్ నీ పేరెంట్స్ ను కలవగానే మేము అక్కర్లేదు అనిపించిందా …… ??

మామ్ ఇపుడు దీనికి ఏడుస్తున్నావ్ …… ?? నేను నా పేరెంట్స్ తో ఉన్నది నిజమే బట్ నా గురించి వాళ్ళకు నిజం తెలియదు & చెప్పాలి అని కూడా నేను అనుకోవడం లేదు…… !! నేను అనుకున్న వర్క్స్ అవ్వగానే నేను డెఫినెట్ గా వచ్చేస్తాను నా లైఫ్ మీతోనే అర్థం అవుతుందా…… !! నేను ఎప్పటికీ నీ కొడుకునే ఇక నీ ఏడుపు ఆపు ప్లీస్……… !!

రుద్ర మాటతో అపర్ణ మనసు తేలిక పడ్డం తో కన్నీళ్ళు తుడుచుకుంటూ…… !! నువ్వు అక్కడే ఉంటే ఎక్కడ నాకు దూరం అవుతావో అని నాకు చాలా కంగారుగా ఉంది రుద్ర…… !! ప్లీస్ కమ్ బ్యాక్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ ……. !!

షూర్ మామ్ తప్పకుండా వచ్చేస్తాను….. !! డాడ్ ఎలా ఉన్నాడు …… ?? ఆనంద్ అక్కడే ఉన్నాడు కదా మీకేం కావాలి అన్నా వాడికి కాల్ చెయ్….. !!

ఒకే రుద్ర ఆ అన్నట్టు శ్రియ నీకేమైనా కాల్ చేసిందా…… ?? శ్రియ మిస్ అయ్యి 3 మంత్స్ అవుతుంది నువ్వు కొప్పడతావు అని చెప్పలేదు…… !! రుద్ర తను నిన్ను వెతుక్కుంటూ నీ కోసం ఇండియా కి వచ్చి మిస్ అయింది……. !! తన పేరెంట్స్ శ్రియ గురించి అడుగుతూ ఉంటే నీ దగ్గరే ఉంది అని ఏదో ఒక రీసన్ చెప్తూ వచ్చాను…… !! ఎంత ట్రై చేస్తున్నా శ్రియ ఏమైందో తెలియడం లేదు……. !!

నేను మళ్ళీ కాల్ చేస్తాను మామ్ అని సడెన్ గా రుద్ర కాల్ కట్ చేయడం తో శ్రియ గురించిన టాపిక్ వచ్చిన ప్రతీ సారి రుద్ర దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్ట పడ్డం లేదు….. !! శ్రియ ఎక్కడున్నావ్ నిన్ను ఎక్కడని నేను వెతకాలి అని నిట్టూర్చి తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది……. !?

కాల్ కట్ చేసిన రుద్ర మొబైల్ ను కోపంగా కోచ్ లోకి విసిరి కొడుతూ…… !! శ్రియ చేసిన పనికి నెల రోజుల పాటు నేను నరకం చూసాను మామ్ తనకు ఎంత ధైర్యం ఉంటే మాయ నే చంపాలి అనుకుంటుంది……. !! అందుకే తనను 3 మంత్స్ గా ప్రపంచం తో సంబంధం లేకుండా అందరికీ దూరంగా ఉంచాను….. !! తను మారితే తప్పా తనను నేను వదిలి పెట్టను అని కోపంగా అనుకుంటూ అక్కడి నుండి అమర్ రూమ్ వైపు వెళతాడు…… !!

 

💫💫💫💫💫💫💫💫💫

 

బాత్ కంప్లీట్ అవ్వగానే డ్రెస్ కోసం చూసిన ఆద్య కి రేణుక తో మాట్లాడుతూ డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయింది అని అర్థం అవ్వగానే…… !! తల కొట్టుకుంటూ ఎందుకే నీకు అంత తొందర అరే డ్రెస్ తీసుకున్నానా లేదా అని కూడా చూసుకోవా ఇప్పుడు ఈ టవల్ కట్టుకుని ఎలా వెళ్లాలి…… ?? పైగా నా విలన్ హస్బెండ్ కూడా రూమ్ లోనే చచ్చాడు వాడి ముందుకు నువ్వు ఇలా టవల్ లో వెళ్తే నిన్ను ఇస్ క్రీమ్ లా కళ్ళతోనే తినేస్తాడు …… !!

అబ్బా ఇప్పుడెలా అని ఆలోచిస్తూ వంటికి టవల్ చుట్టుకుని రూమ్ లో నుండి సౌండ్స్ ఎమ్ రావడం లేదు……. !! వీడు బయటకు కానీ వెళ్ళాడా అనుకుంటూ వాష్ రూమ్ డోర్ నుండి తల బయటకు పెట్టి చూసిన ఆద్య కి రూమ్ లో జై కనిపించడు…… !!

హమ్మయ్య టైమ్ గాడ్ వీడు రూమ్ లో లేడు వీడు వచ్చేలోగా డ్రెస్సింగ్ రూం లోకి పారిపోవాలి…… !! కమాన్ లేట్ చేయకు అనుకుని ఫాస్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తూ బాల్కనీ నుండి వస్తున్న జై కి డ్యాష్ ఇచ్చి కింద పడిపోబోతుంది…… !! సరిగ్గా అదే టైమ్ కి జై ఆధ్య నడుము పట్టుకుని మీదకు లాక్కోవడం తో ఆద్య మెల్లగా కళ్ళు తెరిచి జై వైపు చూస్తూ ఉంటుంది…… !!

ముత్యాల్లా ఆధ్య వంటి మీద మెరుస్తున్న నీటి చుక్కలను అప్పుడే తల స్నానం చేయడం వల్ల జుట్టు నుండి నీళ్ళు కారుతూ రెప్పలు కూడా నీటితో అతుక్కుని ఆద్య తన కళ్ళకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది…….. !! బుగ్గల మీద కారుతున్నా నీటి చుక్కలను తన పెదాలతో తుడుస్తూ అలాగే ముక్కు, పెదాలు ఇంకొంచెం కిందకు జారి…… !! మెడ మీద కారుతున్న నీటిని తన పెదవులతో రుచి చూస్తున్న జై ఇంకొంచెం కిందకు జారుతూ ఉండగా……. !! ఆద్య ఫాస్ట్ గా జై ను దూరం నెట్టి ఫాస్ట్ గా ఊడిపోతున్న టవల్ ను చేత్తో గట్టిగా పట్టుకొని అదురుతున్న గుండె తో డ్రెస్సింగ్ రూమ్ లోకి పరిగెడుతుంది…… !!

దేవుడా ఏంటిది వొళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు ఇలా అయిపోయాను…… !! అవును నా కాళ్ళు ఎందుకు ఇలా వణుకుతున్నాయి అని వణుకుతున్న తన కాళ్ళ వైపు చూస్తూ…… !! వాటర్ బాటిల్ దించకుండా తాగేసి వీడు దగ్గరకు వస్తే చాలు ఏదేదో అయిపోతుంది…….. !!

అయినా వీడు రాత్రి వీడి గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళాడు కదా ఎప్పుడొచ్చాడు మళ్ళీ…… ?? ఇంతకీ నైట్ ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూనే డ్రెస్ అప్ అయి ఇంకా బెడ్ మీదే పడుకున్న జై వైపు సీరియస్ గా చూస్తూ నైట్ ఎక్కడికి వెళ్ళావ్ అని కోపంగా అడుగుతుంది…… !!