Login with OTP

విలన్ హస్బెండ్{2} -28

aashyatech

Author

ఆధ్య డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది…… !! అయినా వీడు రాత్రి వీడి గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళాడు కదా ఎప్పుడొచ్చాడు మళ్ళీ…… ?? ఇంతకీ నైట్ ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూనే ఫాస్ట్ గా డ్రెస్ అప్ అయి రూమ్ లోకి వస్తుంది…… !! ఇంకా బెడ్ మీదే పడుకున్న జై వైపు సీరియస్ గా చూస్తూ నడుము మీద రెండు చేతులు పెట్టుకుని నైట్ ఎక్కడికి వెళ్ళావ్ అని కోపంగా అడుగుతుంది…… !!

ఏంటి….. ?? అంటూ లేచి కూర్చున్న జై వైపు చూస్తూ డోంట్ యాక్ట్ స్మార్ట్ నువ్వు నైట్ అందరూ పడుకున్న తర్వాత బయటకు వెళ్ళడం నేను చూశాను…….. ;! నిజం చెప్పు జై నైట్ ఎక్కడికి వెళ్ళావ్ & ఎపుడు వచ్చావ్……. ?? అంత రాత్రి బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటి…… ??

అబ్బా ఎంటే నీ గోల వర్క్ మీద బయటకు వెళ్ళాను ఎమ్ తప్పా….. !! అయినా నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకు అక్కడికి నువ్వేదో అన్నీ నాకు చెప్పే చేస్తున్నట్టు & ఎక్కడికి వెళ్ళినా నా పర్మిషన్ తీసుకుని వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావ్….. ?? ఫస్ట్ తప్పుకో నేను ఫ్రెష్ అవ్వాలి….. !!

ఓహ్ హెలో ఆగు ఇంకా నువ్వు నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేదు నాకు అన్సర్ ఇచ్చి అప్పుడు వెళ్ళు…… !! అంత మిడ్ నైట్ వర్క్ ఏంటి నీకు అవును నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పాలి వై బికాస్ ఐ ఆమ్ యువర్ వైఫ్ …. ?? అంటూ ఆగిపోతుంది…… !!

హా కంప్లీట్ చేయ్ వై అంటే అందులో నేను ఎమ్ ఫిల్ చేసుకోవాలి మేడం అని కళ్ళు ఎగరేస్తూ బెడ్ దిగి ఆధ్య వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉంటాడు….. !! జై తన మీదకు వస్తూ ఉంటే ఆద్య ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఏ…. ఏంట్రా మీదకు వస్తున్నావ్ దూరం జరుగు అంటూ…… !! మిర్రర్ రాగానే దానికి అతుక్కుపోయి జై గుండెల మీద రెండు చేతులు అడ్డు పెడుతూ తనను వెనక్కి నెట్టటానికి ట్రై చేస్తూ ఉంటుంది…… !!

అమ్మాయి అంటేనే అనుమానం అని మళ్ళీ ప్రూవ్ చేశావే అయినా నేను వెళ్ళింది నువ్వు అనుకుంటున్నట్టు నా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరకు కాదు లే……. !! ఆ అవసరం కూడా ఇప్పుడు నాకు లేదు అని టెన్షన్ గా తన వైపు చూస్తున్న ఆద్య ను నడుము పట్టుకుని మీదకు లాక్కుంటూ……. !! ఒక వేళ కంట్రోల్ చేసుకోలేని ఫీలింగ్స్ వచ్చినా అన్ని నీ దగ్గరే చూపిస్తాను కానీ కకృత్తి పడి వేరే అమ్మాయి దగ్గరకు వెళ్ళను….. !!

జై హస్కీ వాయిస్ కి ఆద్య చేతులు వణుకుతూ ఉంటాయి….. !! జై చిన్నగా నవ్వుతూ అది కూడా నువ్వు ఒప్పుకుంటేనే టెన్షన్ పడకు దానికి మనకు చాలా టైమ్ ఉంది అంటూ…… !! అక్కడే ఉన్న కుంకుమ తీసుకుని ఆధ్య నుదుటిన పెడుతూ చిన్నగా బుగ్గ మీద తడుతూ అక్కడి నుంచి టవల్ తీసుకుని వాష్ రూమ్ లోకి వెళ్తూ…… !! వెనక్కి తిరిగి తన వైపు కన్ఫ్యూజ్ గా చూస్తున్న ఆద్య వైపు పెదాలు రౌండ్ గా చుట్టి ఫ్లైయింగ్ కిస్ 💋 వదులుతూ డోర్ లాక్ చేసుకుంటాడు…… !!

ఆ ఆ 😬😬 అని కోపంగా అక్కడే ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్ తీసుకుని విసరబోయి….  !! ఉహు వద్దు లే ఇది నేను దుబాయ్ లో ఇష్టపడి కొనుకున్న పెర్ఫ్యూమ్ అని దాన్ని జాగ్రత్తగా అక్కడే పెడుతూ……. !! వీడి మమ్మీ కాదు కాదు వీడి అమ్మమ్మ అసలు వీడి గురించి వీడేం అనుకుంటున్నాడు…… ??

 

ఫస్ట్ నైట్ రోజు నాకు ఎమ్ చెప్పాడు ఇప్పుడు ఎమ్ చేస్తున్నాడు…… ?? అయినా వీడికి ఫీలింగ్స్ వస్తే నా దగ్గర చూపిస్తాను అంటాడేంటి ఎలా కనిపిస్తున్నా వీడి కంటికి అని జై ను తిట్టుకుంటూ……. !! మావయ్య & డాడ్ కోసం పెళ్లికి ఒప్పుకుంటే వీడు టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నాడు అని ఫ్రెష్ అయి వచ్చిన జై ను చూస్తూ…… !! యూ స్టుపిడ్ అసలు మనం అనుకున్నది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటీ…….. ?? అని కోపంగా జై మీదకు వెళ్తూ ఫ్లోర్ మ్యాట్ మీద కాలు వేసి జారుతూ వెళ్ళి జై మీద పడుతుంది…… !!

ఏ…..ఏయ్ ……. !! అంటూ జై ఆద్య తో సహా బెడ్ మీద పడిపోతాడు…… !! ప్రొద్దున్నే ఎందుకే నాతో ఈ సర్కస్ ఫీట్స్ చేయిస్తున్నావ్ …….. ?? నువ్వు నా నుండి రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఐ ఆమ్ సారి……… !! ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది కావాలంటే లిప్ కిస్ తో అడ్జస్ట్ అవ్వు అంటూ ….. !! జై తన పెదాలను ఆధ్య లిప్స్ దగ్గరకు తీసుకుని వస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే……. !! జై అంటూ అక్కడికి వచ్చిన అమర్ వాళ్ళను అలా చూసి షాక్ అవుతూ వెనక్కి తిరిగి నేనేం చూడలేదు నేనేం చూడలేదు అని మొహాన్ని చేతుల్లో దాచుకుంటాడు …… !!!

అమర్ వాయిస్ కి ఆద్య జుట్టు లాగి మరీ ఇడియట్ నీ నుండి నేను ఎక్స్ పెక్ట్ చేసేది రొమాన్స్ కాదు……. !! దానికి వేరే వాళ్లు ఉన్నారు నీ దగ్గర ఉన్నారు కదా అంటూ దూరం జరిగి ఫాస్ట్ గా రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతుంది…… !! కరెక్ట్ టైమ్ కి వచ్చి డిస్టర్బ్ చేసి చచ్చావ్ కదా రా దున్నపోతా ఒక్క 10 నిమిషాలు లేట్ గా వచ్చున్నా హ్యాపీగా కిస్ పెట్టేవాడిని అంటూ కోపంగా అమర్ మీదకు పిల్లో విసురుతాడు ….. !!

ఆధ్య వెళ్లగానే ఇటు వైపు తిరిగిన అమర్ దాన్ని క్యాచ్ పట్టుకుంటూ…… !! లేకపోతే నన్ను మాన్య ను దూరం చేసి నువ్వు మాత్రం నీ పెళ్ళాం తో కింద మీద పడుతూ ఎంజాయ్ చేస్తావా…… ?? మిత్ర ద్రోహి నీకు ఇలాగే కావాలి అయినా నైట్ మొత్తం అతుక్కునే ఉండుంటారు గా ప్రొద్దునే మాకు ఈ ఏ సర్టిఫికెట్ సినిమా చూపించడమ్ అంత అవసరమా…… ??

హు 😏 నీకు అలా అర్థం అయిందా స్వామి…….. ?? అంత సినిమా లేదమ్మా అక్కడ…… ??

ఎవరికి చెప్తావ్ రా నీ కథలు నాకు ఎక్కడో చిన్న 🧐 డౌబ్ట్ ఉండేది…… ?? పెళ్ళికి ముందు వరకూ పిచ్చి కుక్కల్లా కొట్టుకునే వాళ్ళు అసలు మీరు కలిసే ఉంటున్నారా అని ….. ?? బట్ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది ఇద్దరూ ఫెవికల్ లా అతుక్కు పోయారని……. !! అయినా లైఫ్ అంటే నీదేరా పెళ్ళికి ముందు అలాగే ఎంజాయ్ చేసావ్ పెళ్లి తర్వాత అంతే ఎంజాయ్ చేస్తున్నావ్…….. ??

మొబైల్ కోసం అక్కడికి వచ్చిన ఆద్య ఆది విని జై వైపు చిరాగ్గా & కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది…… !!

అయ్యో ఆద్య విన్నట్టు ఉంది జై నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందేమో ఆగు సారి చెప్పి అదేం లేదు అని చెప్తాను….. !! అది నాకు కొత్త ఎమ్ కాదు కానీ ఆగు అవును ఎందుకు అంత సడెన్ గా రూమ్ లోకి వచ్చావ్ రెడీ అయ్యి కిందకు వస్తాను అని చెప్పా కదా…… ??

నీ గొడవ లో పడి నేను ఎందుకు వచ్చానో మర్చిపోయా 🤦 …… !! రితిక బాయ్ ఫ్రెండ్ గౌతం వచ్చాడు అంకుల్ నిన్ను రమ్మంటున్నారు త్వరగా రా అని చెప్పి అమర్ వెళ్ళిపోగానే…… !! జై ఫాస్ట్ గా డ్రెస్ అప్ అయ్యి కిందకు అమర్ వెనుకే వెళతాడు…… !!

💫💫💫💫💫💫💫💫💫

గార్డెన్ లో గౌతమ్ తో మాట్లాడుతున్న మహిదర్ అక్కడికి వస్తున్న జై ను చూసి…… !! గౌతమ్ తనే జై దీర్ నా కూతురు ఆధ్య హస్బెండ్ అంటూ గౌతం కి జై ను పరిచయం చేస్తాడు…… !! హాయ్ సర్ అంటూ చేర్ నుండి పైకి లేచి జై కి షేక్ హ్యాండ్ ఇస్తూ తనను తాను పరిచయం చేసుకుంటాడు గౌతమ్……. !!

హాయ్ గౌతం కూర్చో అంటూ తన ఎదురుగా కూర్చుని సో యూ ఆర్ గౌతం రైట్….. ??

ఎస్ సర్… !!

ఎమ్ చేస్తుంటావ్ నువ్వు….. ??

ఎమ్. ఎన్. సీ కంపెనీ లో IT గా వర్క్ చేస్తున్నాను సర్..!!

ఓహ్ నైస్ నీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి…….??

ఐ ఆమ్ ఎన్ ఆర్ఫన్ సర్….. !!

ఐ ఆమ్ సారీ…… !! ఒకే లెట్స్ కమ్ టు ది పాయింట్ నువ్వు రితిక ఎన్ని ఇయర్స్ గా లవ్ చేసుకుంటున్నారు ……. ?? తనకు నీతో ఎలా పరిచయం…… ??

సర్ నేను రితిక ఒకే కాలేజ్ లో చదువుకున్నాం సో తనకు నాకు అలాగే పరిచయం అయింది….. !! ఫస్ట్ లో ఇద్దరం ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళం బట్ స్లోలీ తన వే ఆఫ్ బిహేవియర్, హెల్పింగ్ నేచర్ చూసి నేనే తనకు అట్రాక్ట్ అయ్యాను…… !! తనతో నా బాండింగ్ అట్రాక్షన్ నుండి లవ్ వరకూ వచ్చింది ఆది తనకు కూడా చెప్పాను బట్ రితిక నన్ను నొప్పించకుండా రిజెక్ట్ చేసింది…… !!

అవునా…….?? ఎందుకు….. ??

రితిక కూడా నా లాగే ఆర్ఫన్ సర్….. !! తను చిన్నప్పటి నుండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది సర్ …… !! సో తనకు కొన్ని డ్రీమ్స్ ఉండేవి బాగా చదివి మంచి పొజిషన్ లో ఉండి ఒక అర్ఫనేజ్ స్టార్ట్ చేసి తన లాగ ఎవరు ఇబ్బంది పడకూడదు అని అలాగే అందరూ చదువుకోవాలి అని తను చాలా గట్టిగా కోరుకుంటూ ఉండేది… !!

మన దగ్గర డబ్బులు ఇవాళ ఉంటాయి బట్ రేపు ఉండకపోవచ్చు…… !! కానీ చదువు ఎవరు దొంగలించలేని గొప్ప నిధి సో అందరూ చదువుకోవాలి అని ఎప్పుడూ చెప్తూ ఉండేది…… !! తన గోల్స్ రీచ్ అయ్యేవరకూ ఎలాంటి డైవర్షన్స్ లేకుండా తన కెరీర్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటుందని తెలిసి…… !! నేను కుడా తనకు సపోర్ట్ గా పక్కనే నుంచున్నా ఎందుకంటే ఆ పెయిన్ నాకు కూడా బాగా తెలుసు…… !!

అలా ఇద్దరం కెరీర్ మీద ఫోకస్ పెట్టి మంచి పర్సంటేజ్ తో స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకున్నాం…… !! మా స్టడీస్ కి హెల్ప్ చేసింది మహిదర్ సర్ ఆయనే లేకపోతే మేము ఈ స్టేజ్ లో ఉండే వాళ్ళం కాదు అందుకే రితిక ఎప్పుడూ మహిదర్ సర్ రుణం ఎలాగైనా తీర్చుకోవాలి అని చెప్తూ ఉండేది…… !? మాకు వచ్చిన సాలరీ ను ఆర్గనైజ్ కోసం సేవింగ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం…… !! అనుకున్నట్టుగానే మా సేవింగ్స్ & మహిదర్ సర్ ఇచ్చిన అమౌంట్ తో ఇంకో 2 మంత్స్ లో అర్ఫనైజ్ ఓపెన్ చేయాలి అనుకుంటూ ఉండగా…… !! మహిదర్ సర్ ఒక రోజు మమ్మల్ని కలవాలని చెప్పి ఒక ప్లేస్ కి రమ్మన్నారు….. !!

 

అక్కడికి వెళ్ళాక రితిక నర్స్ లా ఒకరి దగ్గరకు వెళ్లాలని & అది కొంచెం రిస్క్ అని కూడా చెప్పారు కానీ రితిక క్షణం కూడా ఆలోచించకుండా …… !! ధైర్యంగా ఒకే చెప్పి సర్ రుణం ఎలా అయినా తీర్చుకోవాలి అని ఒక రాక్షసుడి దగ్గరకు వెళ్ళింది సర్ 🥺……. !! కానీ అదే ఇవాళ తనను నాకు దూరం చేస్తుంది అనుకోలేదు అంటూ కన్నీళ్ళతో చెప్తున్న గౌతం ను చూసి అందరికీ బాదేస్తుంది…….. !!