Login with OTP

విలన్ హస్బెండ్ {2}-3

aashyatech

Author

ఆధ్య ను రెడీ చేస్తున్న మాన్య తనకు ఇయర్ రింగ్స్ పెడుతూ ఆద్య నిన్నో విషయం అడగనా……?  కొత్తగా ఈ పర్మిషన్ అడగడం ఎందుకు పాప ఏంటో అడుగు అని చేతులకు బ్యాంగిల్స్ వేసుకుంటూ చెప్తున్న ఆద్య వైపు చూసి నేను ఇప్పటికీ నీకు జరిగిన మ్యారేజ్ గురించి డైజెస్ట్ చేసుకోలేక పోతున్నానే….. !! జై అంటేనే చిరాకు పడే నువ్వు ఎలా మ్యారేజ్ కి ఒప్పుకున్నావ్ ఆద్య…… ?? తనకు వేరే గర్ల్స్ తో రిలేషన్ ఉందని తెలిసి కూడా నువ్వెలా యాక్సెప్ట్ చేసావ్….. ?? అసలు ఆ రోజు హాస్పటల్ లో ఎమ్ జరిగింది……. ??

ప్చ్…… !! మాన్య ఎంటే నువ్వు ఇపుడు నేను ఉన్న సిచుయేషన్ ఏంటి నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఎంటే………?? సరే అడిగావ్ కాబట్టి చెప్తున్నా విను మనిషి క్యారెక్టర్ ను బయటనుండి కాదు …… !! ఇంకొంచెం లోతుగా & డీప్ గా థింక్ చేసి క్యారెక్టర్ డిసైడ్ అవ్వాలని తెలుసుకున్నాను కాబట్టే జై తో మ్యారేజ్ కి ఇంత హ్యాపీగా ఒప్పుకున్నాను…… !!

ఆఫ్కోర్స్ జై కి వేరే అమ్మాయిలతో రిలేషన్ ఉంది ఒప్పుకుంటాను & అందరిలా జై సీక్రెట్ గా తన ఎఫైర్స్ ఉంచాలి అనుకోలేదు…… !! తన ఎఫైర్స్ గురించి ఓపెన్ గానే ఉన్నాడు & అది మావయ్య కు నచ్చలేదు అని ఓన్ గా ఫ్లాట్ తీసుకుని అందరికీ దూరంగా వచ్చాడు & అందుకు తన రీసన్స్ తనకు ఉన్నాయి వాటిని నేను క్వశ్చన్ చేయాలి అనుకోలేదు….. !! ఇవన్నీ తన బిఫోర్ మ్యారేజ్ బట్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా జై ఇవన్నీ కంటిన్యూ చేస్తే అప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను ……  !! అని నవ్వి డోంట్ వర్రీ జై టోటల్లీ చేంజ్ అయ్యాడు అని నేను నమ్మాకే మ్యారేజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను…… !?

ఆధ్య అంత స్ట్రాంగ్ గా చెప్పేసరికి తను ఇష్టపడే మ్యారేజ్ కి ఒప్పుకుందని మాన్య కూడా కాసేపటికి నార్మల్ అవుతూ…… !! సో హ్యాపీ ఫర్ ఆద్య జై తో నీ లైఫ్ ఎలా ఉండబోతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాను బట్ నీ మాటలు వింటుంటే కొంచెం రిలాక్సింగ్ గా ఉంది…….. !! మీ ఇద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఆధ్య ఏదైతే ఏంటి ఇప్పటికైనా నువ్వు లైఫ్ లో మూవ్ ఆన్ అయ్యావ్ & జై కూడా అన్ని వదిలేసి న్యూ లైఫ్ స్టార్ట్ చేశాడు కంగ్రాట్స్ బోథ్ ఆఫ్ యూ అని ఆద్య ను హగ్ చేసుకుంటూ నవ్వుతూ చెప్తుంది….. !!

ఆధ్య మాన్య వైపు చూసి నవ్వుతూ నా గురించి ఇక ఆలోచించడం ఆపి నీ లవ్ ట్రాక్ ను త్వరగా పట్టాలు ఎక్కిస్తే బావుంటుంది మేడమ్…… !! మా మామ్ లాగే మీ మామ్ కూడా నీ మ్యారేజ్ గురించి తెగ వెయిట్ చేస్తుంది అనగానే మాన్య కి అమర్ గుర్తు రాగానే బుగ్గలు ఎరుపెక్కుతాయి ….. !!

ఓహో సిగ్గు పడుతున్నావా కొంచెం పెళ్ళి దాకా దాచుకో మేడం అయినా ఫస్ట్ నైట్ నాకు పాప సిగ్గు పడాల్సింది నేను అంటూ …….. !! ఆద్య టీస్ చేయడం తో మాన్య నవ్వుకుంటూ అబ్బా చాలు ఆపవే ఛాన్స్ దొరికితే చాలు ఏడిపించడానికి ఫస్ట్ ఉంటావ్ అని ముద్దుగా కసురుకుంటూ ఆధ్య తలలో పూలు పెడుతుంది….. !!

ఆద్య కూడా మాన్య మాటలకు నవ్వి తన ఫస్ట్ నైట్ కి అందంగా రెడీ అవుతూ ఉంటుంది…… !!   వైట్ & రెడ్ కాంబినేషన్‌లో శారీ లో ఆధ్య దేవతలా పోత పూసిన బంగారు బొమ్మ లా కనిపిస్తుంది…… !! వైట్ చీర మీద లేత బంగారు జరీ అంచులు… !! ఆధ్య నడిచిన ప్రతీసారి చిన్న చిన్న చినుకుల్లా మెరుస్తున్నాయి….!! మగ్గం వర్క్ రెడ్ బ్లౌజ్ ఆధ్య చర్మపు అందాన్ని మరింత పెంచింది …….. !! చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది ఆధ్య…… !!

 

సన్నని గాజులు ఆధ్య చేతులపై మోగుతున్న ప్రతీ సారి … ఆ రాత్రి నిశ్శబ్దాన్ని మరింత రొమాంటిక్‌గా మార్చేస్తోందేమో అనేలా ఉన్నాయి…… !! మెడలో డైమండ్ సెట్ జ్యువలరీ , చెవుల్లో వేలాడే డైమండ్ జిమ్కీస్…… !! మొహాన లైట్ మేక్ అప్ తో రెడ్ కలర్ బింది, న్యూడ్ రెడ్ కలర్ లిప్‌స్టిక్ తో ఎంతో అందంగా ఒక్క మాట లో చెప్పాలంటే రతీ దేవిలా ఉంది…… !!

ఆద్య పైకి నవ్వుతూ &  సిగ్గు పడుతూ మాన్య తో మాట్లాడుతున్నా తనలో ఎక్కడో ఒక చిన్ని భయం,
మరొక చిన్ని కంగారు & ఆ చిన్న నవ్వులో దాగిన పెద్ద రహస్యం…… !!  ఇవన్నీ కలసి ఆధ్య ను అందంగా మార్చేశాయి……. !! ఎంత అంటే మాటల్లో చెప్పలేనంత &
కళ్ళు నిండిపోయేంత అందంగా…… !!

వావ్ ఆద్య ఎంత అందంగా ఉన్నావో తెలుసా నేను అబ్బాయిని అయ్యుంటే నిన్ను కిడ్నాప్ చేసైనా సరే రాక్షస వివాహం చేసుకునేదాన్ని అంటూ కన్ను కొడుతున్న మాన్య మాటలకు ఆద్య అందంగా సిగ్గు పడుతుంది….. !! నాది కూడా సేమ్ ఫీలింగ్ వదిన అన్నయ్య కంటే ముందు అది కూడా అబ్బాయిలా పుట్టుంటే లేపుకెళ్ళి పోయేదాన్ని వదిన అంటూ అపుడే అక్కడికి వస్తుంది మాయ….. !!

మొత్తానికి నేను ఆడపిల్ల లా పుట్టి ఇద్దరు విలన్స్ నుండి తప్పించుకున్నా అనమాట అంటూ గల గలా నవ్వుతుంది ఆద్య….. !! హహ 😅 అంత రిలాక్స్ అవ్వకు వదిన నువ్వు మా నుండి సేవ్ అయినా నీ కోసం మా అన్నయ్య అదే నీ విలన్ హస్బెండ్ వెయిటింగ్ అంటూ కన్ను గీటుతుంది…… !!

మాన్య, మాయ ఒకరికి ఒకరు హై ఫై ఇచ్చుకుని నవ్వుకోవడం చూసిన ఆద్య కూడా చిన్న స్మైల్ ఇస్తుంది……. !! ఏయ్ ఇంకా సేపు రెడీ చేస్తారు అని ఆ రూమ్ లోకి వచ్చిన శైలు, రేణుక & మౌనిక ఆద్య ను చూసి వావ్ అనకుండా ఉండలేకపోయారు…… !!

రెడీ చేసింది చాలు ఇక మీరు వెళ్ళి మీ రూమ్స్ లో నిద్రపోండి అంటున్న రేణుక ను చూసి ఉహు మేమే ఆధ్య ను రూమ్ లోకి పంపుతాం అని ముక్త కంఠం తో చెప్తున్న ఇద్దరినీ చూసి ఆద్య తనలో తానే నవ్వుకుంటుంది …… !!

ఏంటి మీరు పంపేది అవన్నీ చేయడానికి ఇక్కడ ముగ్గరం ఉన్నాం అయినా రూమ్ లోకి పంపేముందు కొన్ని సంప్రదాయాలు ఉంటాయి అవన్నీ మీకు తెలియదు సో బుద్దిగా వెళ్ళి పడుకోండి …… !!  అంటూ ముగ్గురు గట్టిగా చెప్పడం తో హు 😏 అని మూతి తిప్పుతూ ఆధ్య కి ఆల్ ది బెస్ట్ చెప్పి విస విస నడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మాన్య & మాయ…… !!
హాల్ లో వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికే వెయిట్ చేస్తున్న రుద్ర, అమర్ లను చూసి మొహం తిప్పుకుని వెళ్తున్న ఇద్దరినీ అబ్బాయిలు అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు…… !! మాయ, మాన్య వెనుకే వెళ్ళాలి అనున్నా తమ ఎదురుగా కూర్చున్న ప్రతాప్, మహిదర్, వినయ్ లను చూసి తప్పక అక్కడే కూర్చుంటారు….. !!

డోర్ ఓపెన్ చేసిన మాన్య లోపలికి నడుస్తూ మాయ ఒక విషయం అడుగుతాను ఉన్నది ఉన్నట్టుగా చెప్తావా….. ?? హా చెప్తా ఏంటో అడుగు వదిన అంటూ తన వంటి మీదున్న జ్యువలరీ ను తీస్తూ ఆన్సర్ ఇస్తుంది….. !!

మీ మామ్ కి ఎందుకని ఆద్య అంటే పడదు….. ?? ఇప్పుడు మాత్రమే కాదు మన పరిచయం అయినప్పటి నుండి చూస్తున్నా ఎందుకో ఆంటీ కి ఆద్య అంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తారు….. ??

ఓహ్ అదా నీ డౌబ్ట్ సింపుల్ వదిన అంటూ హాఫ్ శారీ కి ఉన్న పిన్స్ తీస్తూ డాడ్ మామ్ కంటే ఎక్కువ మహీదర్ మామ మాటకి వాల్యూ ఇస్తారు అది మామ్ కి నచ్చదు…. !! మామ్ కి మామ అంటే నచ్చడు సో అబ్బియస్లీ మామ కూతురు కాబట్టి ఆద్య వదిన అంటే కొంచెం హేట్ ఫీలింగ్ అంతే….. !! అని చెప్పి శారీ నుండి టవల్ లోకి మారి ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూమ్ కి వెళ్తే మాన్య ఆలోచిస్తూ కూర్చుంటుంది…… !!

✨✨✨✨✨✨✨✨✨✨

 

ఆధ్య అంటూ శైలు మిర్రర్ ముందు కూర్చున్న ఆధ్య ను పైకి లేపుతూ ముహూర్తం కి టైమ్ అవుతుంది……. !! నువ్వు దేవుడి ఆశీర్వాదం తీసుకుని తర్వాత తాతయ్య, మావయ్య & మీ డాడ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి పదా….. !! అంటూ ముందుగా ఆధ్య ను దేవుడి గది కి తీసుకుని వెళ్లి తర్వాత హాల్ లోకి తీసుకుని వచ్చి అందరి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఆధ్య శైలు, మౌనిక లను హగ్ చేసుకుని రేణుక బ్లెస్సింగ్స్ కోసం బెండ్ అవుతుంది….. !!
ఎప్పటికీ నీ జీవితం 😏 నా పాదాల దగ్గరే ఆధ్య రేపటి నుండి చెప్తా నీ సంగతి & నీ పుట్టింటి వారు వెళ్ళాక నీకు అసలైన సినిమా అంటే ఏంటో చూపిస్తా అని కన్నింగ్ గా నవ్వుకుంటూ …….. !! గాడ్ బ్లెస్ యూ ఆద్య జై కి అసలే దూకుడు ఎక్కువ నువ్వే వాడ్ని కంట్రోల్ చేయాలి & పాపం వాడిని ఎలా తట్టుకుంటావో ఏంటో….. ?? అని ఆద్య పక్కకు వచ్చి చెవిలో మెల్లగా వాడితో గడిపిన అమ్మాయిలు చెప్పారు జై కెపాసిటీ ను తట్టుకోవడం కష్టం అట కేర్ఫుల్ అంటూ నవ్వుతూ దూరంగా జరుగుతుంది…… !!

రేణుక ఇంటెన్షన్ అర్థం చేసుకున్న ఆధ్య కూడా నవ్వుతూ డోంట్ వర్రీ అత్త జై ను ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు & నీకు తెలుసు కదా నీ కొడుకు అసలే ఫాస్ట్ సో పాల గ్లాస్ తో లోపలికి వెళ్ళే నేను పాలు ఇచ్చే అమ్మ లా తిరిగొస్తానేమో ……. ??  అమ్మమ్మ అవ్వడానికి రెడీగా ఉండు అంటూ నవ్వుకుంటూ వెళ్ళడం చూసి రేణుక ఆద్య వైపు పళ్ళు నూరుతూ చూస్తుంటుంది….. !?

ఆధ్య చేతిలో పాల గ్లాస్ పెట్టిన శైలు చూడు అమ్ము ఇప్పటి వరకూ నువ్వు ఎలా ఉన్నా….. ?? ఇప్పుడు నువ్వు జై భార్యవి అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోకు & జై కి నచ్చినట్టుగా ఉండి ఇద్దరూ ఓపెన్ అయ్యి కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి ఇంతకు మించి నీకు అమ్మా లా ఇంకేం చెప్పలేను….. !! గుడ్ న్యూస్ చెప్తావన్న ఆశ తో వెయిట్ చేస్తూ ఉంటాను అని జై రూమ్ రాగానే మౌనిక, శైలు నవ్వుతూ ఆద్య ను రూమ్ లోకి తోసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ……. !!

రూమ్‌లోకి అడుగు పెట్టగానే ఒక తేలికపాటి రోజ్ & మల్లె పూల సువాసన గాల్లో కలిసిపోతూ కొత్త దాంపత్యాన్ని ఆహ్వానించినట్టుంది…….. !!  సాఫ్ట్‌గా వెలిగే వార్మ్ యెల్లో లైట్స్, గోడల మీద చిన్న చిన్న ఫెయిరీ లైట్స్ రొమాంటిక్‌గా మెరుస్తున్నాయి……. !! రూం మొత్తం బ్రైట్ లైట్స్ కాకుండా చాలా సాఫ్ట్ గోల్డెన్ ఫెయిరీ లైట్స్ గోడల మీద అల్లినట్లుగా వేలాడుతూ ఉన్నాయి…… !! వాటి వెలుగులో రూం కి ఒక warm & romantic glow వచ్చి ప్రతి మూల ఎంతో మధురంగా మెరుస్తోంది…… !! వాల్స్ కి కూడా రక రకాల రోజ్ ఫ్లవర్స్ స్టిక్ చేసి ఎంతో అందంగా డెకరేట్ చేశారు….. !!

బెడ్‌పై తెల్లటి షీట్ పరిచి, దానిపై రెడ్ & వైట్ రోజ్ ఫ్లవర్స్ తో హార్ట్ షేప్ వేశారు & బెడ్ షీట్ కూడా చాలా సాఫ్ట్ గా ముట్టుకుంటే చేతుల్లో నుండి జారిపోయేలా ఉన్నాయి……. !? హార్ట్ షేప్ మధ్యలో చిన్నగా “You & Me Forever” అన్నట్లు రెండు వింత candle holders నిదానంగా వెలుగుతూనే ఉన్నాయి…… !! పిల్లోస్‌పై కూడా కొంచెం పింక్–వైట్ petals చల్లి, అలా ఒక మబ్బుల పై పడుకున్న ఫీలింగ్ వచ్చేలా ఉంది…… !!

రెండు వైపులా ఉన్న మెసా టేబుల్స్ మీద చిన్న క్యాండిల్స్ వెలిగించడం వల్ల……. !! ఆ కాంతి తో గది మొత్తం ఒక అందమైన గ్లో వచ్చింది……. !!

 

రూం లో ఓ వైపు టూ చైర్స్ & ఒక చిన్న టేబుల్ మీద chocolate-coated strawberries, small cake & juice ఉంచారు…… !! వాళ్లు ఇద్దరూ మొదటిసారి కలిసి నవ్వుకుంటూ కూర్చునేలా చిన్న ప్రైవేట్ కార్నర్ ఎరేంజ్ చేశారు….. !! ఆ గదిలో అడుగు పెట్టిన నిమిషానికే  “ఈ రాత్రి మీ ఇద్దరిదే…”అని సుతి మెత్తని గాలి కూడా చెప్పకనే చెప్పినట్టే ఉంది…… !!

అధ్య డోర్ బోల్ట్ పెడుతూ లోపలికి వచ్చి ఆ రూమ్ ను నిశితంగా గమనిస్తూ ముందుకు వస్తున్న తనకు
బెడ్ ముందు ఉన్న చిన్న టేబుల్ మీద ✨ “Welcome My Love” అని రోస్ పేటల్స్ తో అందంగా రాసి అటు ఇటు సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించడం చూసిన ఆద్య మొహం లో రంగులు క్షణ క్షణానికి మారుతూ ఉంటాయి…… !!

ఆద్య రూమ్ డెకరేషన్ ను చూసి తన నీలి కళ్ళను చుట్టూ తిప్పుతూ జై కోసం వెతుకుతూ ఉంటుంది కానీ ఆ రూమ్ లో జై ఎక్కడ కనిపించడు ….. !! బాల్కనీ నుండి చల్లని గాలి తన మొహాన తాకగానే అటుగా చూసిన ఆధ్య కు బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి అటు వైపు నడుస్తుంది….. !!

జై బాల్కనీ లో నుంచుని ఫస్ట్ నైట్ రూమ్ డెకరేషన్ వాళ్ళ & సెంటెడ్ క్యాండిల్స్ స్మెల్స్ కి అదుపు తప్పిన తన మనసుకు విసుగ్గా బాల్కనీలోకి వెళ్ళి ……… !!  తన ఫీలింగ్స్ కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ పాకెట్ లో ఉన్న ట్యాబ్లెట్స్ వేసుకుని పున్నమి వెలుగులో అందంగా కనిపిస్తున్న జాబిలిని చూస్తూ నుంచుంటాడు…… !!
ఆధ్య నడుస్తుంటే లయబద్దంగా కదులుతున్న తన కాలి మువ్వల చప్పుడుకి తల తిప్పి చూసిన జై కి తన ప్రపంచం అక్కడే ఆగిపోతుంది….. !! ఆధ్య ను చూస్తూ జై రెప్ప వేయడం కూడా మరిచి బిగుసుకు పోయి మరీ చూస్తున్నాడు….. !! ఆధ్య ను ఇది వరకే శారీ లో చూసాడు కానీ ఇప్పుడు ఆధ్య మెడలో పచ్చగా చేరిన పసుపు తాడు వల్ల ఆద్య అందం 10 టైమ్స్ పెరగడం తో జై హార్ట్ బీట్ ఆమాంతం పెరుగుతుంది….. !!

ఉహ్…. ఉహ్…… !! అని దగ్గిన ఆధ్య ను చూసి జై వెంటనే చూపు తిప్పేస్తూ ఇది నన్ను టెంప్ట్ చేయడానికే కావాలని ఇంతలా రెడీ అయినట్టు ఉంది అని మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని చూస్తూ….. !! కంట్రోల్ రా జై నువ్వు దానికి దూరంగా ఉండాలి అనుకుంటూ ఆద్య వైపు చూస్తూ ఉంటాడు…… !!

ఆధ్య తనను జై అలాగే చూస్తూ ఉండడం గమనించి ఎమ్ చూస్తున్నాడు వీడు అని తనను తాను చూసుకుంటుంది ….. !! తను కట్టుకున్న చీర బొడ్డు కిందకు జారి తన అందమైన నడుము జై కి దర్శనం ఇస్తూ ఉండడం చూసి జై ను తిట్టుకుంటూ వెంటనే చీర సర్దుకొని……. !! ఇద్దరి మధ్య రాజ్యమేలుతున్న నిశ్శబ్దాన్ని చేధిస్తూ నేను నీతో మాట్లాడాలి అని చెప్పగానే జై కూడా నేను కూడా మాట్లాడాలి అలా కూర్చుందామా ……… !! అంటూ బాల్కనీ లోనే ఉన్న రెండు చైర్స్ లో కూర్చుంటూ ఇద్దరికీ మధ్యలో ఉన్న టేబుల్ మీద మిల్క్ గ్లాస్ పెడుతుంది….. !!

జై భారంగా శ్వాస తీసుకుని వదిలి లుక్ ఆధ్య మన మ్యారేజ్ ఎలా జరిగిందో & ఇద్దరం ఎలాంటి సిచుయేషన్ లో మ్యారేజ్ కి రెడీ అయ్యామో నీక్కూడా తెలుసు….. !! మన ఇద్దరికీ మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా మన పేరెంట్స్ కోసం తప్పక ఒప్పుకుని ఈ బంధం లోకి అడుగు పెట్టాం….. !! సో ఎవరి కోసం అయితే మనం మన ఇష్టాలు చంపుకుని మ్యారేజ్ చేసుకున్నామో అది అలాగే కంటిన్యూ చేయాలి …… !! అని నేను అనుకుంటున్నాను అలా చేయాలి అంటే నాకు నీ సపోర్ట్ కావాలి ఆధ్య…… ??

వాట్ డు యూ మీన్ నీతో మ్యారేజ్ కి యస్ అన్నాను కదా అని నీతో కమిట్ అవుతాను అనుకుంటున్నావా అది నా ప్రాణం ఉండగా జరగదు అంటూ ఆద్య కోపంగా చైర్ నుండి లేస్తుంది…. !!

షట్ అప్….. !! నీకే కాదు నాకు కూడా అలాంటి ఉద్దేశం లేదు….. !! నేను అంటుంది మనం మన పేరెంట్స్ కోసం హస్బెండ్ & వైఫ్ లా సొసైటీ లో యాక్ట్ చేస్తూ అందరినీ నమ్మించాలి….. !! ఈ రూమ్ లో నీకు నచ్చినట్టు నువ్వు ఉండచ్చు బట్ రూమ్ దాటితే నువ్వు జై ధీర్ వర్మ వైఫ్ లా ఉండాలి…. !! మనం ఇక్కడ స్ట్రేంజర్స్ & బయట బెస్ట్ కపుల్ లా కలరింగ్ ఇవ్వాలి….. ?? అంటూ జై కూడా పైకి లేచి నుంచుంటాడు…… !!

ఎక్సాక్లైటీ ఆధ్య ఏదైతో చెప్పాలి అనుకుందో అదే జై చెప్పడం తో జై కండిషన్స్ కి ఒప్పుకుని ఈ విషయం గురించి మూడవ వ్యక్తికి తెలియకూడదు అని ఇద్దరూ గట్టిగా అనుకుంటారు….. !! ఇప్పటి నుంచి ఈ రూమ్ లో ఉన్న ప్రతీ వస్తువు మీద నీకు సగం హక్కు ఉంటుంది & నువ్వు ఎమ్ చేయాలి అనుకున్నా……. !! నాకు చెప్పి చేయాలి అని నేను అనను బట్ చేసే ముందు బట్ చేసే ముందు ఒక్క సారి ఆలోచించు అది కూడా ఈ ఇంటి కోడలిగా దట్స్ ఇట్ అంటూ జై రూమ్ లోకి వెళ్ళిపోతాడు…… !!

ఆధ్య ఆలోచనలతో కాసేపు బాల్కనీ లోనే ఉండి తిరిగి బెడ్ రూమ్ లోకి వచ్చేసరికి జై బెడ్ మీదున్న ఫ్లవర్స్ అన్ని ఫ్లోర్ మీద పడేసి నుదుటిన చెయ్ పెట్టుకుని సీలింగ్ చూస్తూ ఉంటాడు….. !! హెలో నిన్నే అంటూ విచిత్రంగా పిలిచిన ఆద్య వాయిస్ కి తల తిప్పి ఆద్య వైపు చూస్తూ నా పేరు జై ధీర్ వర్మ అని చెప్పి కళ్ళు మూసుకుని పడుకున్న జై ను తిట్టుకుంటూ…… !! జై బుగ్గలు నొక్కి గ్లాస్ లోని మిల్క్ మొత్తం జై నోట్లోకి వంపేసి నాకు నీతో మిల్క్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు ….. !! అందుకే నీతోనే మొత్తం తాగించా ఇప్పుడు గుడ్ నైట్ అంటూ నడుము ఊపుతూ వెళ్ళి బెడ్ కి మరో వైపు పడుకున్న ఆధ్య ను చూసి రాక్షసి ఇలా కూడా మిల్క్ తాగిస్తారా……. ?? అని షర్ట్ మీద పడ్డ మిల్క్ స్టెయిన్స్ కి చిరాకు పడుతూ లేచి కూర్చుని షర్ట్ తీసి విసిరి అలాగే బోర్లా తిరిగి పడుకుంటాడు …… ??

ఆధ్య ❤️ జై ల గిల్లి గజ్జాలు మొదలు 😌☺️ ….. !! సరి కొత్తగా మీ ముందుకు ఈ కథ ను తీసుకుని రావాలి అన్న నా ప్రయత్నాన్ని వృధా చేయకుండా మా కష్టాన్ని గుర్తించి కామెంట్స్ చేస్తూ హైప్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం….. !! సరి కొత్తగా మొదలైన వీరి ప్రయాణం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలని మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం….. !! ఇంకెందుకు ఆలస్యం మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి 🙂 కొన్ని రీజన్స్ వల్ల అప్డేట్స్ లేట్ అయ్యాయి సారి ఫర్ దట్……. !!