విలన్ హస్బెండ్{2} -32
బ్రేక్ఫాస్ట్ చేయడానికి అందరితో పాటు కూర్చున్న నాన్సీ కి జై నుండి కాల్ రావడం తో ప్లేట్ లోని బ్రేక్ఫాస్ట్ తినేది కాస్త హ్యాండ్ వాష్ చేసుకుంటూ తన రూమ్ వైపు వెళ్తుంది…… !! అక్క ఏమైంది అని పిలుస్తున్న మంజు వాయిస్ కి నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని అన్సర్ ఇచ్చి తన రూమ్ డోర్ లాక్ చేసుకున్న నాన్సీ బిహేవియర్ చూసి అందరూ కన్ఫ్యూసింగ్ గా ఒకరిని ఒకరు చూసుకుంటారు …… !! రూమ్ లోకి వెళ్ళిన నాన్సీ ఆల్మోస్ట్ కట్ అవుతున్న కాల్ ను చిరు నవ్వుతో లిఫ్ట్ చేస్తూ బెడ్ మీద కూర్చుంటుంది…….. !!
హాయ్ నాన్సీ
హాయ్ జై బిజిగా ఉన్నావా……. ?? డిస్టర్బ్ చేయలేదు కదా….. ??
నథింగ్ లైక్ దట్ ఎలా ఉన్నావ్ నాన్సీ…… ??
హ్మ్మ్ గుడ్ నువ్వెలా ఉన్నావ్…… ?? ఎలా ఉంది కొత్త కాపురం….. ?? ఆధ్య ఎలా ఉంది……. ??
షి ఇస్ గుడ్….. !!
జై నేను నీతో మాట్లాడాలి అంటే కొంచెం ఎమర్జెన్సీ…… !! నువ్వు ఇపుడు ఫ్రీగా ఉన్నావా…… ??
మీట్ అవ్వడానికి ఇవాళ నేను బిజీగా ఉన్నాను నాన్సీ….. !! విషయం ఏంటో కాల్ లో చెప్పు…… !!
ఉహు ఇది కాల్ లో చెప్పాల్సిన మ్యాటర్ కాదు నేను నిన్ను డైరెక్ట్ గా మీట్ అవ్వాలి……. !! ఆది కూడా ఇవాళే కలవాలి ప్లీస్ జై నా కోసం నీ టైం ను అడ్జస్ట్ చేసుకో…… !!
జై కాసేపు ఆలోచించి సరే ఇపుడు ఒక వర్క్ లో బిజీగా ఉన్నాను…… !! అది అవ్వగానే నీకు కాల్ చేస్తాను ఎక్కడైనా మీట్ అవుదాం ఒకే నా…… !!
థాంక్ యూ జై నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను…… !! బై నాన్సీ టేక్ కేర్ అంటూ గౌతమ్ వాయిస్ విని ఫాస్ట్ గా కాల్ కట్ చేసి లోపలికి వెళతాడు…… !!
💥💥💥💥💥💥💥💥💥💥💥
ఆద్య తన శారీ చేంజ్ చేసుకుని జై పెట్టిన హీక్కీస్ మేకప్ తో కవర్ చేసుకుని కిందకు వెళ్ళేసరికి అభీర్ తో నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తారు మాన్య, మాయ….. !! వాళ్ళను అలా చూసిన ఆద్య ఏయ్ మాన్య నువ్వెప్పుడు వచ్చావే అని అడుగుతూ మాన్య పక్కన కూర్చుని హాయ్ అభీర్ అని చిరు నవ్వుతో తన వైపు చూస్తుంది…… !!
హాయ్ ఆధ్య 😍😍….. !!
ఏంటి సడెన్ గా ఇలా వచ్చావ్…… ??
ఎమ్ రాకూడదా…… ?? రాకూడదు అంటే చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను…… !!
ఓహ్ షట్ అప్ మ్యాన్ నేను అలా అనలేదు కాల్ కూడా లేకుండా ఏంటీ ఇలా సడెన్ గా అని అడుగుతున్నా అంతె…… !! ఆది సరే ఆ రోజు ఏంటి అలా వెళ్ళిపోయావ్ అట్లిస్ట్ పిలుస్తున్నా ఆగలేదు…… ??
ఆ…. అదీ ఇంపార్టెంట్ కాల్ సో అందుకే సడెన్ గా వెళ్ళాల్సి వచ్చింది…… !!
హో ఒకే సో చెప్పు ఎలా ఉన్నావ్….. ?? లైఫ్ ఎలా ఉంది….. ??
యాస్ యూష్వల్ ఇట్స్ గోయింగ్ ఆద్య….. !! హౌ ఇస్ యూర్ మ్యారీడ్ లైఫ్…… ??
ఇట్స్ వండర్ఫుల్ అంటూ ఫేక్ స్మైల్ తో చెప్తున్న ఆద్య వాయిస్ కి మాన్య, మాయ నవ్వుతూ చూస్తే…… ?? ఇదేంటి ఇలా అంటుంది ఆధ్య కి జై అంటే నచ్చడు కదా ఇప్పుడెందుకు ఇలా ఇంత హ్యాపీగా ఉంది……. ?? పెళ్ళయ్యాక ఇద్దరూ కానీ కలిసిపోయారా అసలేం జరుగుతుంది ఇద్దరి మధ్య అని ఆలోచిస్తూ ఉంటాడు……. !!
హేయ్ అభీర్ వాట్ హ్యాపెండ్……. ?? ఎంటలా ఆలోచిస్తూ కూర్చున్నావ్……. ??
ఆ….. నథింగ్ ఆద్య…… !! ఇంకేంటి ఇవాళ ప్లాన్స్ అవును నీ హస్బెండ్ జై ధీర్ ఎక్కడ……. ??
తను వర్క్ మీద బయటకు వెళ్ళాడు….. !! హాఫ్ ఆన్ ఆర్ ముందు వచ్చుంటే తను ఉండే వాడు…….. !!
వాడు వెళ్ళడం చూసే కదా నేను వచ్చింది అని తనలో తాను నవ్వుకుంటూ…… !! ఇట్స్ ఒకే ఇంకేపుడైనా మీట్ అవుతాను ఎనీ వే నీ మ్యారేజ్ అయ్యాక నువ్వు ఒక సారి ట్రీట్ ఇవ్వలేదు…… !! ఇవాళ నువ్వు నాకు ట్రీట్ ఇచ్చి తీరాలి కమాన్ లెట్స్ గో అవుట్ సైడ్…… !!
ఎలాగో జై రావడానికి లేట్ అవుతుంది తను వచ్చే లోగా నేను వచ్చేయచ్చు…… !! ఇంట్లో కాళిగా కూర్చుని ఎమ్ చేస్తాను అనుకుంటూ……. !! యాహ్ స్యూర్ వెళ్దాం అనగానే అభీర్ నవ్వుతూ ఒకే నా కార్ లో వెళ్దాం……. !! నేను బయట వెయిట్ చేస్తుంటాను కమ్ ఫాస్ట్ ఆధ్య అని ఆనందంగా గాల్లో డాన్స్ వేసుకుంటూ…….. !! అక్కడి నుంచి వెళ్తున్న అభీర్ ను డౌబ్ట్ గా చూస్తూ ఉంటుంది మాన్య…….. !!
ఓయ్ మీరు కూడా నాతో పాటు వస్తున్నారు వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పి…….. !! ఆద్య తన వాలెట్ తెచ్చుకోవడానికి తన రూమ్ కి వెళ్తుంది…… !! వదిన పదా రెడీ అవుదాం అని హుషారుగా చెప్తున్న మాయ వైపు చూస్తూ……. !! మాయ అభీర్ గురించి నీ ఒపీనియన్ ఏంటి…… ??
వాట్….. ?? సడెన్ గా అభీర్ గురించి నన్ను ఒపీనియన్ అడుగుతున్నావ్ ఏంటి వదిన…… ?? కొంపదీసి ఆ అబ్బాయిని నాకు అంతగడుదాం అనుకుంటున్నావా ఏంటి…… ??
ఉఫ్ అదేం లేదు కానీ నార్మల్ గా అడిగాను చెప్పు….. !!
అలా అయితే ఒకే….. !! అభీర్ ఇస్ సచ్ ఏ స్వీట్ పర్సన్ వదిన….. !! అందరితో త్వరగా మింగిల్ అవుతాడు & వదిన కు మంచి ఫ్రెండ్…… !!
హు 😏 నాకు మాత్రం చాలా తేడాగా కనిపిస్తున్నాడు…… !!
తేడా గానా….. ?? అంటే ….. ??
అభీర్ ఆధ్య మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది…… !! తన చూపు కూడా ఎప్పుడూ ఆధ్య మీద నే ఉంటుంది…… !! ఆధ్య ను ఒకలా మనల్ని ఒకలా ట్రీట్ చేస్తాడు మోర్ ఓవర్ ఆధ్య మీద చాలా కేర్ చూపిస్తాడు…… !!
అలాంటిదేం లేదు వదిన నువ్వు మరీ టూ మచ్ గా థింక్ చేస్తున్నావ్…… ?? అభీర్ వదిన ఫ్రెండ్ సో తనను కేర్ చేయడం లో తప్పేంటి ఎక్కువగా థింక్ చేయకుండా వెళ్ళి రెడీ అవ్వు……. !! అమర్ అన్నయ్య తో మాట్లాడక నీ బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అనుకుంటా అంటూ మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది…… !!! నిజంగా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా అనుకుంటూ మాన్య అప్పటికి సైలెంట్ అయిపోతుంది……. !!
కాసేపటికి అందరూ రెడీ అయ్యి అభీర్ కార్ లో మాల్ కి సరదా కబుర్లతో రీచ్ అవుతారు….. !! వదిన సరదాగా విండో షాపింగ్ చేద్దాం పదా ఫెస్టివ్ సీసన్ కదా కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చిందేమో నచ్చితే బై చేద్దాం అంటూ……. !! ఆధ్య చెయ్ పట్టుకుని లోపలికి లాక్కెళ్ళడం చూసిన అభీర్ ఆ ఆ 😬 😬 ఆధ్య తో సరదాగా టైం స్పెండ్ చేద్దాం అని వస్తే…… ?? వీళ్ళేంటి తోకల్లా తన వెనుకే తిరుగుతున్నారు అని విసుక్కుంటూ వెనుకే వెళతాడు…… !!
💫💫💫💫💫💫💫💫💫💫
రితిక కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే గౌతమ్ వాయిస్ విన్న రితిక గట్టిగా ఏడ్చేస్తుంది…… !! రితిక ఏడుపు విన్న గౌతమ్ కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతాయి రితిక అసలేం జరిగింది నువ్వు ఎక్కడున్నావ్…… ?? నీ కోసం పిచ్చోడిలా తిరుగుతున్నా రితిక చెప్పవే ఎక్కడున్నావ్…… ??
గౌతమ్ ఐ ఆమ్ సారి రా నీతో లైఫ్ షేర్ చేసుకునే లక్ ఆ దేవుడు నాకు ఇవ్వలేదు…… !! న….. నన్ను రాహుల్ అంటూ చెప్పలేక 5ఏడుస్తున్న రితిక వాయిస్ కి అందరూ కంగారుగా ఒకరిని ఒకరు చూసుకుంటారు……… !!
అమ్మా రితిక……. !! మహిదర్ వాయిస్ విన్న రితిక ఏడుస్తూ అయిపోయింది సర్ వీడు నా లైఫ్ కంప్లీట్ గా స్పాయిల్ చేసేసాడు ……. !! ఇప్పుడు నేను బ్రతికున్న శవం తో సమానం నేను ఎలాగో బ్రాతకను నేను లేకుండా ఆ పిచ్చోడు ఉండలేడు సర్…… !! ప్లీస్ సర్ నాది ఒకే ఒక్క రిక్వెస్ట్ గౌతమ్ ను కొంచెం చూసుకోండి సర్ నా కోసం ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాడు కానీ …. కానీ….. రితిక కి మాట్లాడడానికి నోట్లో నుండి మాటలు రావడం లేదు వెక్కిళ్లు తప్పా 🥹……. !!
రితిక ప్లీస్ అలా మాట్లాడకు పిచ్చి పనులు చేస్తే నేను కూడా చచ్చిపోతా చెప్తున్నా…… !! ఎక్కడున్నావో చెప్పవే నేను ఇప్పుడే వస్తాను ప్లీస్ నా చిన్ని వి కదూ చెప్పు రితిక ……. !! నేను నీకు కనిపించనంత దూరంగా ఉన్నాను గౌతమ్ రాహుల్ నన్ను కిడ్నాప్ చేసి సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉన్న తన గెస్ట్ హౌస్ లో పెట్టాడు…… !! అప్పుడే నాన్సీ కాల్ కట్ చేసి అది విన్న జై మొబైల్ లాక్కుని రితిక టైం లేదు…… !! ఫాస్ట్ గా నువ్వు ఉన్న అడ్రస్ లొకేషన్ షేర్ చెయ్యి క్విక్ అంటూ అందరి వైపు చూస్తూ లెట్స్ గో అని అరుస్తాడు…… !!
✨✨✨✨✨✨✨✨✨✨✨
తన వర్క్ కంప్లీట్ చేసుకుని అక్కడికి వచ్చిన రాహుల్ బెడ్ మీద మత్తుగా పడుకున్న తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ…… !! కనిపించని రితిక కోసం చుట్టూ చూస్తున్న తనకు రితిక ఏడుస్తూ ఎవరితోనో కాల్ మాట్లాడడం విని షాక్ అవుతూ…… !! రేయ్ అది ఎవరితోనో మాట్లాడుతుంది అని తన ఫ్రెండ్స్ కి అరిచి చెప్పి ఏయ్ డోర్ ఓపెన్ చేయవే రితిక …… రితిక….. అని డోర్ ను బుజం తో నెట్టడానికి ట్రై చేస్తూ అరుస్తాడు ……. !!
జై అడిగినట్టు లొకేషన్ షేర్ చేసిన రితిక …… !! రాహుల్ వాయిస్ కి భయపడుతూ సర్ వాడు వచ్చేశాడు……. !! నాకు భయంగా ఉంది వాడు నన్ను కచ్చితంగా చంపేస్తాడు అని ఏడుస్తూ చెప్తుంది…… !!!
రితిక కామ్ డౌన్ వాడు నిన్నేం చేయడు మేము స్టార్ట్ అయ్యాం ఇంకో 15 మినిట్స్ లో అక్కడ ఉంటాం……. !! మేము వచ్చే వరకూ నువ్వు వాడికి దొరకకుండా ఉండడానికి ట్రై చెయ్…… !! ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్……. ??
జై క్వశ్చన్ కి వా….. వాష్ రూమ్ లో ఉన్నాను సర్…… !! వాడు డోర్ పగల కొడుతున్నాడు సర్ అని క్రాక్ ఇస్తున్న డోర్ వైపు చూస్తూ భయపడుతూ చెప్తుంది…… !!
ఎట్టి పరిస్థితుల్లో వాడు లోపలికి రాకూడదు డోర్ కి అడ్డుగా ఏమైనా పెట్టు స్టే స్ట్రాంగ్…… !! కాల్ కట్ చేయకు అని చెప్తున్న జై వాయిస్ కి ధైర్యం తెచ్చుకుంటూ ఒకే సర్ అంటూ…… !! డోర్ కి అడ్డుగా పెట్టడానికి వాష్ రూమ్ లో ఎమ్ కనిపించక తనే నుంచుంటుంది …… !! రాహుల్ రాడ్ తీసుకుని డోర్ పగల కొడుతూ ఉంటాడు……… !! ఆ ప్రాసెస్ లో రితిక వీపుకు దెబ్బలు తగిలి బ్లీడింగ్ అవుతున్నా జై వాళ్ళు వస్తున్నారు అన్న ధైర్యం తో అలాగే నుంచుంటుంది……. !! కానీ రాహుల్ పశు బలం ముందు రితిక ఓడిపోయి రాహుల్ డోర్ ను బలంగా తన్నగానే ఆ ఫోర్స్ కి కింద పడుతుంది………!!
వాష్ రూమ్ లోకి వచ్చిన రాహుల్ కింద పడ్డ రితిక జుట్టు పట్టుకుని లాగి పెట్టి కొడుతూ…… !! ఎంత ధైర్యమే నీకు నా కళ్ళు కప్పి ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలి అని చూస్తావా చెప్పు ట్రై చేస్తావా….. ?? అంటూ పశువులా తనను కొడుతూ కింద పడేసి కడుపులో కిక్ ఇవ్వగానే……. !! ఆ నొప్పి భరించలేక రితిక పెట్టిన కేక విన్న జై కార్ ఒక్క సారిగా సడెన్ బ్రేక్ తో ఆగిపోతుంది…… !!
రేయ్ రాహుల్…… ??
జై కోపంగా అరిచిన అరుపు కి మొబైల్ పగిలిపోఏంత గట్టిగా వినిపించిన జై వాయిస్ కి మొబైల్ ఎక్కడుందో చూసి…… !! దాన్ని చేతిలోకి తీసుకున్న రాహుల్ ఎవర్రా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావ్……. ?? బ్రతకాలి అని ఆశ లేదా నీకు……. ??
జై…. జై దీర్ వర్మ….. !!
వావ్ జై దీర్ వర్మ….. !! హాయ్ మిస్టర్ జై నీతో ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది బై ది బై నైస్ టు మీట్ యూ ఐ ఆమ్ రాహుల్……. !! నిన్ను పెళ్ళి చేసుకోవాలి అనుకున్న హరిణి కి రాబోయే కాలంలో కాబోయే మొగుడ్ని……. !!
ఏయ్ నువ్వు అది ఎలా అయినా ఊరేగండి ఐ డోంట్ కేర్……. !! బట్ అభం శుభం తెలియని రితిక ను ఎందుకు కిడ్నాప్ చేసావ్…… ?? మర్యాదగా తనను వదిలి పెట్టు ఇంకొక్క దెబ్బ తన వంటి మీద పడ్డా…… ?? ఎందుకు బ్రతికున్నానా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను…… !!
ఏంట్రా దీన్ని కొడుతుంటే ఇంత ఫీల్ అవుతున్నావ్…… ?? కొంప దీసి ఇది కూడా నీ గర్ల్ ఫ్రెండ్ ఆ ఏంటి…… ?? అయినా ఎంత మందిని మెయింటైన్ చేస్తావ్ రా నువ్వు…… ?? లక్కీ ఫెలో వి రా నువ్వు ఇంట్లో కత్తిలాంటి పెళ్ళాం ఉన్నా ఇలాంటి కసక్ లాంటి గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నావ్……. !!
షట్ అప్ నా వైఫ్ గురించి వాగితే మాట్లాడడానికి నాలుక లేకుండా కట్ చేస్తాను యూ బ్లడీ……. ??
అబ్బబ్బా ఏమాటకు ఆ మాట రా నీ పెళ్ళాం ఉంది చూడు బలే సెక్సీగా ఉంది…… !! ఆ కలర్, హైట్, వెయిట్ అబ్బో కేక ఒక్క సారి దాన్ని అనుభవించాక చచ్చిపోయినా తప్పు లేదు అనిపించింది రా……. !! నీ పెళ్ళాం కోసం చచ్చిపోయినా పర్లేదు జై దీర్ వర్మ…….. !!
రాహుల్
ఒకే….. ఒకే…… కూల్ అరవకు ఇద్దరం ఒక డీల్ కి వద్దాం నీకు ఇది కావాలి నాకు నీ పెళ్ళాం కావాలి…… !! నువ్వు నాకు నీ పెళ్ళాన్ని అప్పగిస్తే నేను దీన్ని వన్ సెకండ్ కూడా లేట్ చేయకుండా వదిలేస్తా ఏంటి స్వాప్ చేసుకుందామా ……. ?? అని నవ్వుతున్న రాహుల్ వాయిస్ కి జై పిడికిలి గాలి కూడా దూరకుండా గట్టిగా బిగుడుకుంటుంది ……. !!