విలన్ హస్బెండ్ {2}-6
అబ్బా జై వదులు…… ఆ…..!! నన్ను వదులు జై అంటూ జై నుండి తప్పించుకోవడానికి కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆపసోపాలు పడుతూ ఉంటుంది….. !! వీళ్ళ ను బ్రేక్ఫాస్ట్ కి పిలవడానికి పైకి వస్తున్న రేణుక వీళ్ళను చూసి షాక్ తో నోరు తెరుస్తుంది….. !! చిచీ వీళ్ళకు పగలు రాత్రీ తేడా లేదా పట్టపగలు అందరూ ఇంట్లో ఉన్నారు అని కూడా లేకుండా పోయింది వీళ్ళకు….. ?? అని జై & ఆధ్య లను అలా చూసి హాల్ లో సరసాలు ఆడుతున్నారు అనుకుంటుంది రేణుక 😜🤭…… !! జై ❤️ ఆద్య కూడా అప్పుడే అక్కడ రేణుక చూసి షాక్ అవుతూ ఒకరిని ఒకరు చూసుకుంటారు……. ??
ప్చ్ ..!!! చెప్తుంటే అర్థం కావడం లేదా లీవ్ మీ జై అంటూ అరుస్తూ తల పక్కకు తిప్పిన ఆద్య కి తమనే కళ్ళు పెద్దవి చేసి బుసలు కొడుతూ చూస్తూ కనిపిస్తుంది రేణుక…. !! నా కన్నింగ్ అత్త ఎపుడు వచ్చింది అనుకుంటూ 32 పళ్ళు కనిపించేలా నవ్వుతూ జై తలను కూడా రేణుక వైపు తిప్పుతుంది….. !! అలా ఇద్దరూ రేణుక వైపు చూసి షాక్ అవుతూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుతూ జై ఆద్య ను కిందకు దింపగానే రేణుక ను సిగ్గు పడుతూ నుంచుంటారు….. !!
రేణుక కి కోపం వస్తున్నా జై ముందు అనవసరంగా సీన్ చేయడం ఇష్టం లేక ఇద్దరి వైపు చూసి రేణుక కూడా నవ్వుతూ ఉండగా…… !! అప్పుడే అక్కడికి ఎంత సేపు మామ్ అన్నయ్య, వదిన ఎక్కడ అని అడుగుతూ అక్కడికి వచ్చిన మాయ, అమర్ వీళ్ళను చూసి గట్టిగా నవ్వుతారు….. !!
జై అప్పుడు చూసుకుంటాడు తనను …… !! తాను షర్ట్ లెస్ గా ఉండడం చూసి జై ఫాస్ట్ గా ఆద్య చీర కొంగు ను చుట్టుకుని తన గుండెల్లో మొహాన్ని దాచేస్తూ తన మొహం మీద లిప్స్టిక్ మార్క్స్ ఎవరికి కనిపించకుండా దాచేస్తాడు….. !! బట్ అప్పటికే వాళ్ళు జై ను చూసేయడం తో ఏయ్ అన్నయ్య ఏయ్… ఏయ్…. అని అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ జై & ఆధ్య ను రౌండ్ అప్ చేసి పాట పాడుతూ అల్లరి పెడుతూ ఉంటారు…… !!
ఆ…. !! 😬😬 జై ఎమ్ చేస్తున్నావ్…. ?? లీవ్ మీ అని అరుస్తున్న ఆద్య నడుమును గట్టిగా చుట్టేస్తూ అరవకే నా పొజిషన్ చూస్తున్నావ్ గా సేవ్ మీ అంటూ దీనంగా మొహాన్ని పెట్టిన జై ను చూసి ఆద్య కి నవ్వొస్తుంది….. !! తనే కదా జై ను అలా రెడీ చేసింది అనుకుని ఉఫ్ నువ్విలా ఉడుములా చుట్టేస్తే మన రూమ్ కి ఎలా వెళ్తాం దూరం జరుగు …… !! అని కోపంగా చెప్తున్న ఆద్య ను చూసి జై తన కౌగిలి లూస్ చేయగానే ఆద్య జై అలాగే చీర కొంగు చుట్టుకుని పరిగెడుతూ ……. !! తమ రూమ్ కి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడం చూసి అందరూ నవ్వుకుని వీళ్ళను బ్రేక్ఫాస్ట్ రమ్మని డోర్ నాక్ చేసి చెప్పి వీళ్ళు హాల్ లోకి వెళతారు….. !?
కాసేపటికి ఫ్రెష్ అయి కిందకు వెళ్ళిన వీళ్లను చూసి మాయ, అమర్ మొహాలకు ప్లేట్స్ అడ్డు పెట్టుకుని నవ్వుతూ ఉంటే ఇద్దరూ ఒకరిని ఒకరు ఇబ్బందిగా చూసుకుని నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు….. !!
శైలు, రేణుక అందరికీ సర్వ్ చేస్తూ ఆద్య & జై లకు మాత్రం ఒకే ప్లేట్ పెట్టి ఇద్దరికీ ఫస్ట్ స్వీట్స్ పెట్టి మీ ఇద్దరూ 3 డేస్ ఒకే ప్లేట్ లో మాత్రమే తినాలి అని చెప్పిన శైలు వాయిస్ కి ఇద్దరూ లోలోనా తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుతారు….. !!
అన్నయ్య కమాన్ నువ్వే ఫస్ట్ వదిన కి తినిపించాలి అంటున్న మాయ వాయిస్ కి మొహాన్ని చిరాగ్గా పెట్టుకొంటూ…… !! ఇది తిన్నది నేను తింటే నేను వామిట్ చేసుకోవడం కన్ఫర్మ్ అనుకుని తమ వైపు నవ్వుతూ చూస్తున్న వినయ్ ను చూసి …… !! తన ఫాదర్ హ్యాపీనెస్ కోసం ఆద్య కి తినిపించడానికి రెడీ అవుతూ ఆద్య కి ఇష్టం లేని స్వీట్ రసగుల్లా తీసుకుని ఆద్య నోటి నిండా కుక్కేస్తాడు….. !!
ఉమ్మ్….. ఉమ్మ్…. అని ఆ స్వీట్ ను అందరి ముందు కక్కలేక నవ్వుతూ చూస్తూ దాన్ని ఎలాగోలా నమిలేసి జై వైపు కోపంగా చూస్తూ…… !! కావాలనే ఇది పెట్టావ్ కదా ఆగరా నీ సంగతి చెప్తా అనుకుంటూ జై కి నచ్చని లడ్డూస్ జై నోట్లోకి 1 కి 2 కలిపి మూడు తినిపించి జై పడేయకుండా చేత్తో నోటిని మూసేసి అందరి వైపు చూస్తూ సిగ్గు నటిస్తుంది….. !!
ఆధ్య ను నోట్లో తిట్టుకుంటూ ఆ లడ్డు ను ఇష్టంగా తింటున్నట్టు యాక్ట్ చేస్తూ పని లో పనిగా ఆద్య చెయ్ కూడా కొరికేస్తాడు జై…. !! గట్టిగా అరవబోయి తయామించుకుని జై వైపు గుడ్లు ఉరిమి చూస్తూ ఉంటుంది ఆద్య….. !!
తాతయ్య చూసావా అన్నయ్య కి లడ్డు అంటే అసలు ఇష్టం ఉండదు కదా బట్ వదిన పెట్టగానే 1 కాదు 3 తినేసాడు అంటూ అలిగినట్టు అంటున్న మాయ ను చూసి పెద్ద వాళ్ళు నవ్వితే రేణుక ఇద్దరి వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది…… !! ఆధ్య & జై కూడా అందరినీ చూసి నవ్వుతూ కక్కుతూ మింగుతూ ఎలాగోలా నోట్లో ఉన్న స్వీట్ తినేసి ఇక మాకు చాలు అని ఇద్దరూ ఒకే సారి చైర్స్ నుండి లేవడం చూసి అందరూ వాళ్ళ వైపు చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు….. !!
ఇద్దరూ రూమ్ కి వెళ్ళి ప్రైవేట్ గా ముద్దులు పెట్టుకొంటూ తినాలి అని ప్లాన్ చేసినట్టు ఉన్నారు అని ఇద్దరి వైపు సీరియస్ గా చూస్తూ…… !! ఇప్పుడు నేను ఆపకపోతే జై దృష్టిలో ఈ ఆద్య నే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అలా నేను ఎందుకు జరగనిస్తాను అనుకుని అయ్యయ్యో అదేంటి జై అపుడే లేచావ్ కూర్చో నాన్న …….. !! అంటూ జై ను మళ్ళీ చైర్ లోకి తోసి అమ్మా ఆద్య నువ్వు కూడా కూర్చో 😬😬 అని పళ్ళు నూరుతూ అపుడే లేచారేంటి మీరు మా కళ్ళ ముందు భోజనం చేస్తేనే కదా మాకు సంతోషం…… !!
నేను, వదిన మీ కోసం కష్టపడి కుక్ చేశాం తినండి అంటూ ఆ స్వీట్ ప్లేట్ తీసి ఇద్దరికీ అన్ని వెరైటీస్ సరిపోయేంత ప్లేట్ లో అన్ని కొంచెం కొంచెం పెడుతుంది…… !? ఛా తప్పించుకోవడానికి చాన్స్ లేకుండా చేసింది నా కన్నింగ్ అత్త అని ఏడుపు మొహం పెట్టుకుంటూ జై కి నచ్చని కర్రీస్ ఆద్య పెడితే ఆద్య కి నచ్చనివి జై పెట్టి ఒకరి మీద ఒకరు అలా రివెంజ్ తీర్చుకుంటారు ……. !?
అందరూ తినేసి అక్కడి నుండి వెళ్ళాక మాయ కావాలనే లేట్ గా తింటూ రుద్ర ప్లేట్ లో మిగిల్చిన రైస్ ఇష్టంగా తినడం అప్పుడే అక్కడికి వాటర్ బాటిల్ కోసం వచ్చిన అమర్ చూసి షాక్ అవుతూ అటు నుండి అటే వెళ్ళిపోతాడు…… !!
✨✨✨✨✨✨✨✨
ఎక్కడికి వెళ్తున్నాం మహి….. ?? బయటకు వెళ్తున్నాం అని చెప్పి తీసుకుని వచ్చి ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే చెప్పవేంట్రా అయినా మనం మీ ఇంటికి వెళ్ళాలి కదా…… ?? ఇప్పుడు ఈ వర్క్స్ అన్ని అవసరమా అక్కడ వర్క్స్ ఎంత దాకా వచ్చాయి…… ??
ఏవీ ఆగడం లేదు వినయ్ అన్నీ టైం కి అవుతాయి నువ్వు కంగారు పడకు….. !! ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాం ఇక నువ్వు మాటలు ఆపి తల తిప్పి చూడు…… !! మనం ఎక్కడికి వచ్చామో నీకు తెలుస్తుంది అన్న మహిదర్ వాయిస్ కి తల తిప్పిన వినయ్ కి సెంట్రల్ జైల్ అన్న నేమ్ బోర్డ్ చేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటాడు…… !!
రేయ్ ఇంపార్టెంట్ ప్లేస్ అని జైల్ కి ఎందుకు తీసుకుని వచ్చావ్….. ?? శుభమా అని పిల్లలకు పెళ్లి చేసి హ్యాపీగా ఉంటే ఇప్పుడెందుకు రా ఇక్కడికి తీసుకు వచ్చావ్…. ??
చెప్తాగా ఎందుకంత కంగారు అని కార్ పార్క్ చేసి వెనుక పెట్టిన వినయ్ చైర్ ను తీసుకుని అందులోకి వినయ్ ను కూర్చో పెట్టాక …… ?! జైల్ లోపలికి నడిచి తను ఆల్రెడీ స్పెషల్ గా తీసుకున్న పర్మిషన్ లెటర్ ను ఆ జైలర్ కు చూపెట్టగానే…….. !! వీళ్ళను ఒక రూమ్ లో వెయిట్ చేయమని చెప్పి అక్కడున్న కానిస్టేబుల్ తో ఏదో చెప్పి పంపిస్తాడు జైలర్……. !!
కాసేపటికి ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక వ్యక్తికి బ్లాక్ క్లాత్ కప్పి రెండు చేతులు వెనక్కి కట్టేసి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి తమ ముందు నుంచో పెడతారు….. !! ఆ వ్యక్తి ఎవరా అని చూస్తున్న వినయ్ కి ఆ బ్లాక్ క్లాత్ తీయగానే కనిపించిన మాదేష్ ను చూసి షాక్ అవుతూ మహీదర్ వైపు చూస్తాడు …… !!
మహిదర్ వినయ్ ఎక్స్ప్రెషన్ కి చిన్నగా నవ్వి ఎలా ఉన్నావ్ మాదేష్ జైల్ భోజనం బాగా వంటబట్టి ఉంది …… !! మంచి కలర్ వచ్చావ్ అని వెటకారంగా అంటున్న మహిదర్ ను చూసి మాదేష్ సీరియస్ లుక్స్ ఇస్తాడు…. !! ఉఫ్ నువ్విలా కళ్ళు పెద్దవి చేసి చూసినా మీసం మెలేసి డైలాగ్స్ చెప్పినా తొడలు కొట్టి ఛాలెంజ్ లు చేసినా నువ్వు పీకేదేం లేదు మాదేష్…… !! ఎందుకంత ఇక నీ జీవితం ఇదిగో ఇలా నాలుగు గోడల మధ్యే నువ్వు బయటకు రావడం అనేది జరగదు….. !!
సర్లే అవన్నీ నీకు మాత్రం తెలియదా ఏంటీ అయినా నేను ఇప్పుడు వచ్చింది ఇవి మాట్లాడడానికి కాదు నీకో శుభ వార్త చెప్పడానికి అది వింటే నువ్వు ఎగిరి గంతులు వేస్తావ్….. ??
నువ్వు చచ్చావ్ అన్న వార్త నాకు గుడ్ న్యూస్ అది జరిగిన రోజు నువ్వు కోరుకున్నట్టు నీ శవం ముందు కచ్చితంగా డాన్స్ వేస్తా మిస్టర్ మహిదర్ 😬😬 …… !!
మాదేష్ అని కోపంగా అరిచిన వినయ్ వైపు చూపు తిప్పుతూ ఎమ్ బావా కోపంగా ఉందా….. ?? నీకున్న ఒక్కగానొక్క బావమరిదిని నేను అలాంటి నేను జైల్ లో ఉంటే ఒక్క సారైనా చూడ్డానికి వచ్చావా ఈ మూడు నెలల్లో…… ?? మరి నాకు ఎంత బాధ ఉంటుంది & వాడు ఏదో వాగితే అది నిజం అని నమ్మి నేను నిన్ను చంపడానికి ట్రై చేశాను అని కేస్ పెట్టావ్…… ??
నమ్మి తీరుతాను చెప్పింది ఎవరు నా మహి వాడు చెప్తే ఏదైనా నమ్ముతాను దేవుడి మాటల్లో అయినా తప్పుంటుందేమో కానీ నా మహి ఎప్పుడూ తప్పు చేయడు……. !! నువ్వు నన్ను చంపడానికి ట్రై చేసావ్ అన్నది పచ్చి నిజం ఇది నువ్వు పంపిన రౌడీ నే చెప్పాడు ఎలా చంపాలి అనుకున్నావ్ రా నన్ను …… ?? ఎంతలా నమ్మాను నేను నీ మాటలకు విలువ ఇచ్చి నా కొడుకుని కూడా తప్పుగా అర్థం చేసుకుని వాడ్ని దూరం పెట్టాను…… !! అందుకే నేను చేసిన తప్పుని నేనే సరి చేసుకుంటా నా జై తో నేను ముందు లాగే సంతోషంగా ఉంటాను ఎమ్ చేస్తావ్….. ?? ఎమ్ చేయగలవ్…. ??
వినయ్ రిలాక్స్ మాదేష్ కామెడీ చేస్తున్నాడు నువ్వెందుకు ఎమోషనల్ అవుతావ్ రిలాక్స్ అంటూ…… !! వినయ్ బుజం మీద చేయి వేసి తన ఎమోషన్స్ కంట్రోల్ చేసాక నువ్వు ఏ ముహూర్తం లో నా కూతురికి వాడి కొడుక్కి పెళ్ళి చేయాలి……. !! అని నేను అనుకుంటున్నాను అని అన్నావో నీ మాటే నిజం అయ్యి ప్రాణ స్నేహితులు గా ఉన్న మేము వియ్యకులుగా మారి మా బంధాన్ని మరింత గట్టిగా మార్చుకున్నాం…… !! అన్న మహిదర్ వాయిస్ కి మాదేష్ కి ఒక పెద్ద బండ రాయి వచ్చి నెత్తి మీద పడ్డట్టు అవుతుంది…… !!
షాక్ తో రెండు అడుగులు వెనక్కి వేసిన మాదేష్ వైపు చూస్తూ నువ్వు నమ్మవని తెలుసు అందుకే వెడ్డింగ్ కార్డ్ కూడా తీసుకుని వచ్చాను అని వెడ్డింగ్ కార్డ్ చూపించగానే అది చూసిన మదేష్ ……. !! పళ్ళు కొరుకుతూ కోపంగా మహీదర్ గొంతు పట్టుకోవడానికి చేతులు వెనక్కి కట్టేసిన మీద మీదకు వస్తూ ఉంటే …….. !! అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ మాదేష్ మోకాళ్ళ మీద గట్టి గట్టిగా లాటి లతో కొట్టడం తో అమ్మా……..మ్మా …..!! అని బాధ తో నేల మీదకు ఒరిగిపోతాడు…… !!
వినయ్ కోపంగా నేల మీద పడ్డ మాదేష్ చంపలు పగల కొడుతూ ఇంకో సారి నా ఫ్రెండ్ జోలికి వస్తే డబ్బులు ఇచ్చైనా సరే నిన్ను ఇక్కడే చంపిస్తాను ….. !! అని వార్నింగ్ ఇచ్చి పదరా మహి నేను అర్జంట్ గా నా కొడుకు ను చూడాలి అనగానే ఆ…… అని పిచ్చి పట్టిన వదిలా అరుస్తూ మీ అందరినీ సంతోషంగా బ్రతకనివ్వను అంటున్న మాదేష్ ను తన్ని అక్కడి నుంచి వినయ్ ను తీసుకుని వెళ్తున్న మహిదర్ ను సూటిగా చూస్తూ ఉంటాడు మాదేశ్ 😈😈..??
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
మమ్మీ మా ఫస్ట్ నైట్ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఇంత హెవీ గా రెడీ చేస్తున్నారు…… ?? గాడ్ ఇట్స్ టూ ఇరిటేటింగ్ మమ్మీ నేను వాగుతుంటే ఆన్సర్ ఇవ్వవేంటీ నువ్వు ….. ?? అని కట్టుకున్న చీర తీసి బెడ్ మీద కు విసిరి శైలు చేతులు రెండు గట్టిగా పట్టుకుని కోపంగా చూస్తుంది…… !!
ఏయ్ ఏంటి నీ అల్లరి ఫస్ట్ నైట్ 1 డే కాదు 3 డేస్ ఉంటుంది నువ్వు కాస్త కుదురుగా ఉండు అని శైలు మళ్ళీ చీర తీసుకుని కడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ నేను స్లీపింగ్ పిల్స్ కలపాలా 🤦 …… ?? అయినా వాడు ఈ సారి నేను ఇచ్చిన మిల్క్ చచ్చినా తాగడు అలా అని ఆ విలన్ ని నమ్మడానికి లేదు ఇంకేదైనా ప్లాన్ ఆలోచించాలి ……. ?? అని తన ఆలోచనలో తను ఉంటే మాన్య, శైలు కలిసి ఆధ్య ను ముందు రోజు కంటే అందంగా రెడీ చేస్తారు….. !!
మాన్య ఆ హిప్ చైన్ తీసుకో అని ఆద్య సన్నటి నడుముకి ఆ హిప్ చైన్ పెడుతూ ఉంటుంది శైలు……. !! పాపం ఆంటీ వీళ్ళ ఆయనకు ఈ జ్యువలరీ తీయడానికే తెల్లారి పోయేలా ఉంది అని నవ్వగానే ఆద్య తనకు తెలియకుండానే ……. !! ఆ మాటకు చిన్నగా సిగ్గు పడుతుంది అది చూసిన శైలు కి ఎక్కడో ఆధ్య జై హ్యాపీగా ఉన్నారు అని చిన్న ఆశ పుడుతుంది…… !!
వీళ్ళను అందుకే ఇవాళ త్వరగా రూమ్ లోకి పంపించకుండా మాయ ఏవో గేమ్స్ ప్లాన్ చేసింది మాన్య…… !! ఇవాళ వీళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండ్ తెలిసిపోతుంది పదండి వెళ్దాం అని ఆద్య ను తీసుకుని హాల్ లోకి వచ్చేసరికి అమర్, మాయ & రుద్ర కలిసి వీళ్ళు ఆడుకోవడానికి పూలతో నీట్ గా సెట్ చేస్తూ ఉంటారు…… !!
పెద్ద వాళ్ళు అందరూ సగం జై వైపు ఇంకొంత మంది ఆద్య వైపు డివైడ్ అయ్యి కూర్చుంటారు……!! అప్పుడే వైట్ కలర్ కుర్తా లో జై అక్కడికి ఎంటర్ అవ్వడం చూసి జై & ఆద్య క్షణం పాటు ఒకరిని ఒకరు చూసుకుంటారు…… !! ఉహ్….!! ఉహ్…. అని దగ్గుతున్న మాన్య & మాయ వాయిస్ కి ఇద్దరూ కంగారుగా చూపును తిప్పేసి పక్కకు చూడ్డం చూసి అందరూ నవ్వుకుంటారు…….. !!
వీళ్ళ ఇద్దరినీ చూస్తుంటే చాలా దూరం పోయి చచ్చినట్టు ఉన్నారు….. !! వీడ్ని నా చేతుల్లో పెట్టుకుని కీ ఇచ్చిన బొమ్మ లా ఆడిద్దాం అని నేను అనుకుంటే ఇది నా ప్లాన్ మొత్తాన్ని నాశనం చేసేలా ఉంది…… !! ఎమ్ చేసైనా సరే వీళ్ళ సెకండ్ నైట్ జరగకూడదు అని ఇద్దరినీ ఈర్ష నిండిన కళ్ళతో చూస్తూ ఉంటుంది రేణుక….. !!
జై & ఆద్య లను ఎదురెదురుగా కూర్చోబెట్టి ముందు పూల బంతి తో ఒకరిని ఒకరికి విసరమని చెప్పి ఎవరు క్యాచ్ పట్టుకోకుండా మిస్ చేస్తారో వాళ్ళు లూజర్స్ అని చెప్పి బంతి ను విసురుతుంది మాన్య….. !! ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు ఒక్క ఛాన్స్ కూడా వేస్ట్ చేయకుండా ఇద్దరూ గేమ్ విన్ అవుతారు….. !! ఇప్పుడు ఈ బిందె లో రింగ్ వేస్తున్నా దీన్ని ఎవరైతే ఫస్ట్ తీస్తారో వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అంటూ అమర్ చేతిలోని రింగ్ లాగి మరీ బిందె లోకి వేస్తుంది మాయ….. !!
ఉప్చ్…. !! చిన్న పిల్లల్లా ఈ గేమ్స్ ఏంటి మాయ నాకు ఇంట్రెస్ట్ లేదు మీరే ఆడుకోండి అంటూ విసుగ్గా చెప్పి కూర్చున్న జై ను చూసి ……. !! ఎంతైనా పెళ్ళాం చేతిలో ఓడిపోతాడు అని ముందే డ్రాప్ అవుతున్నట్టు ఉన్నాడు మాయ పాపం వదిలేయ్ అంటూ……. !! కావాలనే జై ను రెచ్చ కొడతాడు అమర్….. !!
అన్నయ్య ప్రెస్టేజ్ ఇష్యూ కమాన్ మనమే గెలవాలి అంటూ మాయ చీర్ అప్ చేయడం తో ఈగో హార్ట్ అయిన జై గేమ్ ఆడడానికి రెడీ అవుతాడు…… !!
ఇక్కడ మీకో బంపర్ ఆఫర్ ఏంటంటే ఆ రింగ్ 3 టైమ్స్ ఎవరైతే తీస్తారో వాళ్ళకే ఈ రింగ్ అంటూ తన రింగ్ ఇస్తున్నట్టు బిల్డ్ అప్ ఇచ్చి పెద్ద మనసుతో అమర్ రింగ్ ఇచ్చేస్తుంది మాన్య……. !! ఒసేయ్ అది నా రింగ్ పెద్ద నీ రింగ్ ఇస్తున్నట్టు ఎనౌన్స్ చేస్తున్నావ్…… ?? ఉహు నేను ఇవ్వను అది నా రింగ్ పైగా నా సెంటిమెంట్ కూడా…….. !!
ఫ్రెండ్ కోసం ఆ మాత్రం ఇవ్వలేవా ….. ?? పైగా బెస్ట్ ఫ్రెండ్ అని డబ్బా కొడతావ్ 😏…… ?? నిదేం పోయిందే పోయేది నా రింగ్ కదా 😒 !! ఎన్నైనా చెప్తావ్……. !!
అబ్బబ్బా ఆపుతారా మీ గోల అన్నయ్య & వదిన రెడీ 1…..2…..3…. !! అని కౌంట్ చేస్తూ రింగ్ బిందె లో వేయగానే ఇద్దరూ ఫాస్ట్ గా చెయ్ పెట్టేసి బిందె లో ఆ రింగ్ కోసం వెతుకుతుంటారు …… !! అదేంటో 3 సార్లు ఆద్య నే రింగ్ తీయడం తో జై మొహం మాడిపోతుంది…… !! అది చూసిన ఆద్య నవ్వుతూ కళ్ళు ఎగరేస్తూ ఆ 💍 రింగ్ జై చేత్తోనే తన ఫింగర్ కు పెట్టించుకుని రేణుక కడుపు లో మరింత అగ్గి రాజేస్తుంది……. !!
దీని కొంగు పట్టు లైఫ్ మొత్తం తిరుగుతాను నీ సింబాలిక్ గా చెప్తున్నట్టు ఉన్నాడు అని రేణుక ఆద్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది…… !!
మాయ ఒక బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తూ ఇదిగో ఇప్పుడు ఈ స్వీట్ కిళ్ళీ పాన్ ఉంది కదా ……. !! దీన్ని వదిన పంటి కింద పెడతాను & నువ్వు ఆ హాఫ్ స్వీట్ కిళ్ళీ జాగ్రత్తగా వదిన నోటి నుండి తీసుకోవాలి ……. !! అని ఆద్య పెదవుల మధ్య ఆ కిల్లి పెడుతుంది…… !!
జై అదురుతున్న ఆద్య పెదవుల వైపు చూస్తూ ఆ కిళ్ళీ తీసుకోవడానికి ముందుకు వంగి తీయబోతూ ఉంటే …… !! వెనుక నుండి రుద్ర వాంటెడ్ గా తన డిక్కీ తో జై డిక్కీ ను ఎదో తీసుకుంటున్నట్టు తీసుకుంటూ నెట్టడం తో జై ఆ ఫోర్స్ కి వెళ్ళి ఆద్య పెదవులతో తన పెదాలను కలిపేస్తాడు……. !! అలా ఇద్దరి పెదవులు కలవడం తో పాటు జై వెళ్ళి ఆద్య మీద బోర్లా పడతాడు…… !!
అది చూసిన ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ మీకే ఒదిలేస్తున్నా ముఖ్యంగా రేణుక ఎక్స్ప్రెషన్ 😜😎!? హార్ట్ ఎటాక్ వచ్చేసింది అంటారా గాయ్స్ 🤭