Login with OTP

విలన్ హస్బెండ్{2}-7

aashyatech

Author

జై అదురుతున్న ఆద్య పెదవుల వైపు చూస్తూ ఆ కిళ్ళీ తీసుకోవడానికి ముందుకు వంగి తీయబోతూ ఉంటే …… !!  వెనుక నుండి రుద్ర వాంటెడ్ గా తన డిక్కీ తో జై డిక్కీ ను ఎదో తీసుకుంటున్నట్టు తీసుకుంటూ ……. !! నెట్టడం తో జై ఆ ఫోర్స్ కి వెళ్ళి ఆద్య పెదవులతో తన పెదాలను కలిపేస్తాడు……. !! అలా ఇద్దరి పెదవులు కలవడం తో పాటు జై వెళ్ళి ఆద్య మీద బోర్లా పడతాడు…… !!

సడెన్ గా జై వచ్చి తన మీద పడ్డం తో జై వెయిట్ ను బ్యాలెన్స్ చేయలేక ఆద్య అలాగే వెనక్కి పడిపోతుంది….. !! నిన్నటి నుంచి కష్టంగా తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్న జై కి ఆద్య పెదవుల రుచి తగలగానే ఒక్కసారిగా జై కి వొళ్ళంతా కరెంట్ పాస్ అవుతుంది….. !!

జై హార్ట్ బీట్ ఆమాంతం పెరిగిపోవడమే కాకుండా వంట్లోని రక్తం ఉవ్వెత్తున ఉరకలు వేస్తూ జై ను పూర్తిగా కంట్రోల్ తప్పేలా చేసింది ఆ క్షణం….. !! జై నెమ్మదిగా కళ్ళు పైకి ఎత్తి ఆద్య వైపు చూస్తాడు…… !! కంగారుగా చూస్తున్న కలువ రేకుల్లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, లిప్స్టిక్ అవసరం లేకపోయినా ఎర్రగా ఉన్న పెదవులతో ఆధ్య తన కంటికి ఎంతో అందంగా కనిపిస్తుంది….. !!

ఆధ్య శ్వాస తన పెదవులకు ఎంత దగ్గరగా ఉందో రైస్ అవుతున్న జై హార్ట్ బీట్ నే చెప్తుంది….. !! ఇంత దాకా వచ్చాక జై వెనక్కి వెళ్ళలేడు ఇది తప్పని తెలుస్తున్నా తనకున్న డిసార్డర్ కి ఆ పని చేయలేక ఆద్య కి కళ్ళతోనే సారి చెప్పి ఆద్య పెదవులు అందుకుంటాడు….. !?

జై ను తన మీద నుండి వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తున్న ఆద్య కి జై ఇస్తున్న కిస్ కి ఒక్కసారిగా షాక్ అవుతూ చుట్టూ చూసిన ఆద్య కి అక్కడ తన పేరెంట్స్ తో పాటు జై పేరెంట్స్ , తన అన్నయ్య రుద్ర & మాన్య, మాయ & అమర్ ఇంకొంత మంది రిలేటివ్స్ అందరూ ఉండడం చూసి ఆద్య లో మరింత కంగారు ఎక్కువ అవుతుంది…… !!

జై కి ఈ క్షణం చుట్టూ ఎవరున్నారు అన్నది కూడా మైండ్ లో లేదు ఇప్పుడు ఆధ్య ను కిస్ చేయకపోతే తన ప్రాణం పోయేలా ఉంది అన్నట్టుగా ఉంది తన పరిస్థితి……. !! పెద్ద వాళ్ళు అందరూ వీళ్ళను చూసి సిగ్గుతో మొహాలకు చేతులు అడ్డు పెట్టుకుంటే….. !! కళ్ళు పెద్దవి చేసి జై ఆద్య పెదవులను జుర్రేస్తూ ఉండడం చూసిన మాయ మాత్రం రెప్ప వేయకుండా చూస్తుంటుంది….. !?

రుద్ర మాయ కళ్ళు మూసి తను కూడా కళ్ళు మూసుకుని తను అనుకున్నది అయినందుకు లోలోనా నవ్వుకుంటూ ఉంటాడు….. !! మాన్య, అమర్ కూడా సిగ్గుతో మొహాన్ని చేతుల్లో దాచుకుని నవ్వుకుంటూ ఉంటారు….. !!

చిచీ వీళ్ళకు బెడ్ రూమ్ కి హాల్ కి కూడా తేడా తెలియడం లేదా ఏంటి….. ?? ఇంత మంది ఉన్నారు అని కూడా లేకుండా సిగ్గు లేకుండా ఒకరి మీద ఒకరు ఎలా ఉన్నారో చూడు అని ఇద్దరినీ కోపంగా చూస్తూ…… !! వీళ్ళను ఆపకపోతే ఇక్కడే కాపురం కూడా చేసేలా ఉన్నారు….. !! అని అందరి వైపు చూసిన రేణుక కి అందరూ కళ్ళు మూసుకోవడం చూసి తల కొట్టుకుంటూ అబ్బా వీళ్ళను ఎలా కంట్రోల్ చేయాలి….. ??  అని చుట్టు చూసిన రేణుక కి తనకు కాస్త దూరం లో ఫ్లవర్ వాజ్ కనిపిస్తుంది…… !!

తన పక్కన ఉన్న స్వీట్ బాక్స్ తీసుకుని ఆ ఫ్లవర్ వాజ్ కి తగిలేలా విసరగానే ఆది గల్కున సౌండ్ చేస్తూ ముక్కలు అవుతుంది….. !! దాంతో అందరితో పాటు జై & ఆద్య లు కూడా తామున్న పొజిషన్ చూసుకుని దూరం జరుగుతారు….. !! జై ఆద్య మీద నుండి లేవగానే ఆద్య జై ను చంపేసేలా చూస్తూ …… !! తన శారీ కొంగు తో లిప్స్ తుడుచుకుంటూ పైకి లేచి కూర్చుంటూ చీర సర్దుకుని అందరీ వైపు చూడలేక తల వంచుకుని కూర్చుంటుంది….. !!!

జై కి కూడా అంత మందిలో తను అలా ఆద్య ను కిస్ చేయడం చాలా అమ్బారసింగ్ గా అనిపించి అక్కడి నుంచి వెళ్ళడానికి లేవబోతాడు….. !! ఆ..!! ఆ..!! ఆగు అన్నయ్య అప్పుడే ఎక్కడికి ఇంకా అవ్వలేదు కానీ కూర్చో అప్పుడే అంత తొందర అయితే ఎలా చెప్పు….. ?? నిన్న ముహూర్తం కి టైమ్ అవుతోందని త్వరగా వదిలేశాం…    !! బట్ ఇవాళ అంత త్వరగా వదిలేది లేదు కూర్చో అంటూ జై ను ఆద్య మీదకు నెట్టి నవ్వుతుంది….. !! అది చూసిన అందరూ కూడా ఇద్దరినీ చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు…    !!

ఆధ్య కోపంగా జై తొడ మీద తోలు ఊడొచ్చేలా గిచ్చి ఇంకో సారి మీద పడ్డావో చెక్కేస్తా అని తన ముందున్న ఫ్రూట్ బోల్ లోని కత్తి చూపించడం తో జై ఆద్య ను తిట్టుకుంటూ దూరం జరిగి కూర్చుంటాడు….. !? అన్నయ్య ఇప్పుడు నువ్వు వదిన మా అందరి ముందు ఈ గ్లాస్ మిల్క్ హాఫ్ – హాఫ్ షేర్ చేసుకోవాలి కమాన్ హావ్ ఇట్….. !!

వాట్ మిల్క్ షేర్ చేసుకోవాలా ….. ?? ఇది నిన్నటి లాగే ఇవాళ కూడా ఇందులో ఎదో ఒకటి కలిపే ఉంటుంది…… !! చచ్చినా ఈ మిల్క్ తాగకూడదు అని మనసులో అనుకుంటూ జై ఆ గ్లాస్ తీసుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు….. !! జై ఎమ్ ఆలోచిస్తూ ఉంటాడో అర్థం అయిన ఆధ్య కి అంత కోపంలో కూడా జై ను మిల్క్ అంటే భయపడేలా చేసాను అని నవ్వుకుంటుంది ….. !!

అన్నయ్య గ్లాస్ తీసుకో అంటే ఎంటలా చూస్తున్నావ్….. ?? తీసుకో అన్నయ్య పాలు చల్లారి పోతున్నాయి…… !! ఇదయ్యాక ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి కమాన్ క్విక్….. !!

ప్చ్ మాయ నాకు ప్లెయిన్ మిల్క్ అంటే ఇష్టం ఉండదు అయినా నిన్న షేర్ చేసుకున్నాం కదా మళ్ళీ ఎందుకు….. ?? అయినా ఈ ట్రెడిషన్ ఎవడు కనిపెట్టాడో కానీ వాడ్ని తన్నాలి….. !!

రేయ్ ఎవరైనా పెళ్ళాం తో మిల్క్ నే షేర్ చేసుకోవాలి బ్రాందీ, విస్కీ లు షేర్ చేసుకోవాలి అనుకుంటే పెళ్ళైనా నెక్స్ట్ డే నే విడాకులు తీసుకోవాలి…… !!

జై అమర్ వైపు సీరియస్ లుక్స్ ఇస్తూ అసలు మిల్క్ ఎందుకు షేర్ చేసుకోవాలో చెప్పరా అప్పుడు కచ్చితంగా షేర్ చేసుకుంటాం….. ??

అమర్ తల గోక్కుంటూ మీ బీ కాఫీ అయితే చేదుగా ఉంటుంది కాబట్టి ప్లెయిన్ మిల్క్ అయితే టేస్టీ గా ఉంటుంది కాబట్టి మిల్క్ షేర్ చేసుకోవాలి అని చెప్పారు అనుకుంటా మన పెద్ద వాళ్ళు….. !!

అబ్బచ్చా అలా అయితే డైరెక్ట్ గా స్వీట్ నే షేర్ చేసుకోవచ్చు కదా పర్టికులర్ గా మిల్క్ నే ఎందుకు…… ?? అని అడిగినా జై క్వశ్చన్ కి యంగ్ బ్యాచ్ అందరూ ఆయిస్టిన్ లెవెల్ లో ఆలోచిస్తూ ఉంటారు….. !!

వాళ్ళను చూసిన అక్కడున్న ఒక పెద్దావిడ చిన్నగా నవ్వి దానికి నేను ఆన్సర్ చెప్తాను అంటూ….. చూడు బాబు జై ఒకే గ్లాస్‌లో ఇద్దరూ సగం పాలు తాగడం అంటే…… ?? “ఇప్పటి నుంచి మనం ఒక్కటే… ఏదైనా కలిసి ఇద్దరం షేర్ చేసుకుందాం” అని అర్థం….. !!

మీ బంధం ఎప్పటికీ తీయగా ఉండాలని పాలు మధురంగా ఉంటాయి కాబట్టి ….. !! అందుకే పాలు సగం – సగం తాగాలి అంటారు…… !! అలా మీ కొత్త జీవితం కూడా స్వీట్ గా మొదలవ్వాలని అలా చెప్పారు….. !! సిగ్గు తగ్గేందుకు మొదటి రోజు కొంచెం షై నెస్ ఉంటుంది….. కాబట్టి మీరు పాలు షేర్ చేసుకుంటూ చిన్నగా మీ మాటలు మొదలు పెట్టాలని పెద్దవాళ్ళు పాలు పంచుకోవాలి అని చెప్పారు…… !!

ఆవిడ చెప్పించి విని అందరూ క్లాప్స్ కొట్టగానే ఆధ్య నవ్వుతూ ముందు జై తాగాకే నేను తాగుతాను అని సిగ్గు పడుతూ చెప్తుంది….. !! దీన్ని చూస్తుంటే ఎక్కడో తేడాగా ఉందే 🤔🙄 నన్ను లేపేయడానికి ప్లాన్ కానీ చేసిందా….. ?? రిస్క్ ఎందుకు అనుకుంటూ ఈ గ్లాస్ లో పాలు చల్లగా అయిపోయాయి మాయ నాకు వేరే గ్లాస్ మిల్క్ నువ్వే కాంచీ తీసుకుని రా….. ?!

జై మాటలకు ఆధ్య చెయ్ అడ్డు పెట్టుకుని నవ్వుకుంటే 🤭 …… ?? మాయ కిచెన్ లోకి పరిగెత్తి జై కోసం పాలు కాంచీ వాటిని చల్లార్చి గ్లాస్ లో తీసుకుని వచ్చి జై చేతికి ఇవ్వగానే జై దాన్ని చిరు నవ్వుతో తీసుకుని కొంచెం తాగి ఆద్య చేతిలో పెడతాడు….. !!

ఇప్పుడు ఈ మిల్క్ తాగకపోతే అందరికీ డౌబ్ట్ వస్తుంది అనుకుని ఆద్య జై తాగి వైపు కాకుండా మరో వైపు కొంచెం సిప్ చేసి జై చేతిలో పెడుతుంది….. !! జై అందరినీ చూస్తూ ఆద్య తాగిన చోట లిప్స్టిక్ మార్క్స్ చూసి కావాలని అక్కడే తాగుతూ ….. !! మీ వదిన లిప్స్ తగలగానే మిల్క్ ఇంకొంచెం తియ్యగా ఉన్నాయి మాయ అనగానే ఆద్య కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది….. !!

ఆద్య చూపుకు జై తన కళ్ళను అందరి వైపు తిప్పి చూపెట్టగానే ఆధ్య తన మొహం లోని కోపాన్ని దాచేస్తూ స్టాప్ ఇట్ జై అంటూ జై భుజాన్ని కొడుతూ సిగ్గు పడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది….. !! ఓహో అన్నయ్య అంటూ మాయ ఇద్దరికీ గిలిగింతలు పెడుతూ ఇద్దరినీ నవ్విస్తూ సంతోషంగా ఇద్దరినీ హగ్ చేసుకుంటుంది…… !?

ఒకే… ఒకే కమింగ్ టు నెక్స్ట్ గేమ్ ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఇదే లాస్ట్ అంటూ యాపిల్ పండు ను చేత్తో ఎగరేస్తూ….. !! అన్నయ్య దీన్ని వదిన నోటితో పట్టుకుంటుంది నువ్వు కొంచెం బైట్ చేసి దీన్ని తినాలి …… !!  అంటూ యాపిల్ పండు ను ఆధ్య నోటి దగ్గర పెట్టగానే జై ఈ సారి పూర్తి కాన్సంట్రేషన్ యాపిల్ మీదనే ఉంచి ……. !! మాయ చెప్పినట్టే యాపిల్ బైట్ చేస్తాడు….. !!

అలా యాపిల్, బనానా,  పైనాపిల్ అంటూ ఫ్రూట్స్ అయ్యాక స్వీట్స్ తీసుకుని లడ్డు,పూతరేకు, కాజా అంటూ అన్నీ అలాగే జై తో హాఫ్ హాఫ్ తినిపిస్తుంది…… !! అన్నయ్య ఇదిగో ఇదే లాస్ట్ అని అప్పటికే కోపంగా ఉన్న జై ఫేస్ ను చూసి రెడ్ కలర్ చెర్రీ ను ఆధ్య పెదవుల మధ్య పెడుతుంది….. !! జై చాలా జాగ్రత్తగా దాన్ని ఆద్య పెదవుల మధ్య నుండి తీసుకుంటాడు కానీ ఆ ప్రాసెస్ లో ఆధ్య లిప్స్ మరో సారి టచ్ అవ్వగానే ….. !! రెండు చేతులు గట్టిగా బిగించి ఫాస్ట్ గా అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్లిపోవడం చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు….. !!

ఇక మీ గేమ్స్ చాలు వెళ్ళి పడుకోండి అంటూ లేడీస్ అందరూ ఆద్య ను రూమ్ లోకి పంపి హాల్ లో కూర్చుని ముచ్చట్లు పెడతారు….. !! రేణుక గార్డెన్ లో అటు ఇటు తిరుగుతూ ఎలా అయినా ఈ ఫస్ట్ నైట్ ఆపాలి కానీ ఎలా అని ఆలోచిస్తున్న రేణుక బుర్ర లో ఏదో ఐడియా రావడం తో నవ్వుకుంటూ యస్ అదే చేయాలి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది…… !!

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

 

అక్కా….. ?? ఏమైంది నీకు 2 డేస్ నుండి చూస్తున్నా చాలా డల్ గా కనిపిస్తున్నావ్ ….. ?? ఫుడ్ కూడా సరిగ్గా తినడం లేదు అంతా ఒకే నా….. !! అని నాన్సీ కోసం డిన్నర్ ప్లేట్ లో డిన్నర్ ప్లేట్ తీసుకుని వచ్చి పక్కనే కూర్చుంటూ అడుగుతుంది మంజూష….. !!

అదేం లేదు మంజు నేను బానే ఉన్నాను అని మొహాన్ని నార్మల్ గా పెట్టుకొంటూ…. !! మంజు ప్లేట్ లోని ఫుడ్ ఫినిష్ చేసి ఆ ప్లేట్ మంజు చేతిలో పెట్టేసి కొంచెం హెడ్ ఏక్ గా ఉందంటే….. !! గుడ్ నైట్ మంజు అని చెప్పి పడుకున్న నాన్సీ వైపు చూస్తూ మంజూష మాట్లాడాలి అనుకున్నా కళ్ళు మూసుకుని పడుకున్న నాన్సీ ను డిస్టర్బ్ చేయలేక …… !! రేపు మాట్లాడాలి అనుకుని నాన్సీ కి బెడ్ షీట్ కప్పి అక్కడి నుండి డోర్ లాక్ చేసి వెళ్ళిపోతుంది …….. !!

డోర్ లాక్ చేసిన సౌండ్ కి కళ్ళు తెరచిన నాన్సీ తన పక్కనున్న మొబైల్ లో జై ఫోటో వైపు చూస్తూ నువ్వు నాతో మాట్లాడి 2 డేస్ అవుతుంది జై….. ?? అందుకు నాకు బాధగా లేదు బట్ నీ మ్యారేజ్ కి వచ్చినా నిన్ను మీట్ అయ్యి నీకు విష్ చేయనందుకు చాలా బాధగా ఉంది….. !! నేను వస్తాను అని చెప్పి రాలేదు అని నువ్వు ఫీల్ అయ్యుంటావ్ కదా అని జై ఫోటో ను తడుముతూ జై నంబర్ కి డైల్ చేస్తుంది….. !!

జై మొబైల్ హాల్ లోనే మర్చిపోవడం తో అక్కడే కూర్చున్న మాయ టేబుల్ మీద వైబ్రేట్ అవుతున్న మొబైల్ ను చూసి దాన్ని చేతిలోకి తీసుకుంటుంది….. !! నాన్సీ అని డిస్ప్లే మీద కనిపించిన వాయిస్ కి అప్పటి వరకు నవ్వుతున్న మాయ మొహం ఎర్రబడుతుంది ….. !!

దీనికి నేను మ్యారేజ్ లోనే అంత గట్టిగా చెప్పినా మళ్ళీ కాల్ చేస్తుంది ఏంటి….. ?? ఈ టైమ్ లో కాల్ చేసి అన్నయ్య ను కావాలనే రెచ్చగొట్టాలి అని చూస్తుందా అనుకుంటూ మొబైల్ తీసుకుని పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది….. !!

జై …. !! ఎలా ఉన్నావ్ 2 డేస్ అవుతుంది నీతో మాట్లాడి… !! చాలా లోన్లీ గా అనిపిస్తుంది జై అందుకే ఆగలేక పోయాను….. !! నువ్వు కూడా నా లాగే నన్ను మిస్ అవుతూ ఉంటావ్ కదా…… ?? మాట్లాడవేంటి జై నీ పెళ్ళికి రాలేదని నా మీద కోపంగా ఉన్నావా….. ??

నీకు కొంచెం కూడా సిగ్గనేది లేడా…. ?? అని వినిపించిన ఫిమేల్ వాయిస్ కి హ… హెలో ఎవరు….. ?? అని టెన్షన్ గా అడుగుతుంది….. ?? మాట్లాడేది ఆధ్య అయితే అనవసరంగా ఇద్దరి మధ్య తన వల్ల డిస్టర్బెన్స్ వస్తుందని….. !!

మాయ ని మాట్లాడుతున్నా …… !! మా అన్నయ్య కి దూరంగా ఉండమని చెప్పాక కూడా అర్ద రాత్రి కాల్ చేసి మిస్ యూ అంటావా….. ?? కొత్తగా పెళ్ళైనా వాడికి ఈ టైం లో కాల్ చేయకూడదు అన్న సెన్స్ కూడా లేదా నీకు….. ?? చీ నీతో మాట్లాడాలి అంటేనే అసహ్యంగా ఉంది నాకు……….. ?? నీకు కావాల్సింది డబ్బే కదా ఎంతైనా నీ మొహం మీద కొడతాను ఇంకెప్పుడు మా అన్నయ్య కి కాల్ చేయకు….. !? నువ్వు నిజంగా మనిషివి నిజాయితీగా బ్రతుకు లేదా ఎక్కడైనా పడి చావు…… !!  ఎట్ లీస్ట్ మా అన్నయ్య అయినా హ్యాపీగా ఉంటాడు అంటూ కోపంగా కాల్ కట్ చేసి నంబర్ బ్లాక్ చేస్తుంది…… !!

నాన్సీ కట్ అయిన కాల్ వైపు బాధగా చూస్తూ నా వల్ల ఎవరికి ఆనందం లేదు….. !! నన్ను నా పేరెంట్స్ కి దగ్గర చేసిన జై అయినా హ్యాపీగా ఉండాలి….. !! అలా ఉండాలంటే మాయ చెప్పినట్టు నేను జై కి దూరంగా ఉండాలి అనుకుంటూ తన మొబైల్ ను దూరంగా విసిరి కొట్టి ఏడుస్తూ పడుకుంటుంది …… !!

✨✨✨✨✨✨✨✨✨

హరిణి తన ముందున్న వైన్ గ్లాస్ తీసుకుని సిప్ చేస్తూ మరో వైపు చేతి మీద డ్రగ్ పౌడర్ వేసుకుని ……. !! దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని గుండెల నిండా స్మెల్ చేసి గాల్లో తేలిపోతున్నట్టు ఫీల్ అవుతూ డ్రింక్ సిప్ చేస్తూ ఉంటుంది…… !! హరిణి స్టాప్ ఇప్పటికే డ్రగ్ ఓవర్ డోస్ ఇన్హెల్ చేసావ్ ఇంతకు మించి చేస్తే చస్తావ్ అని ఆ డ్రగ్ పౌడర్ ను లాగేసుకుంటాడు …… !!

డోంట్ స్టాప్ మీ రాహుల్ ఆ జై ఫ్యామిలీ & ఆద్య ఫ్యామిలీ అందరూ ఒక్కటే అయ్యి నన్ను దారుణంగా దెబ్బ కొట్టారు…. !! వాళ్ళ వల్ల డాడ్ జైల్ లో ఉండాల్సి వచ్చింది & ఎంతో కష్టపడి వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసిన ఆస్తుల అన్నీ లాగేసుకుని మమ్మల్ని రోడ్ మీదకు వచ్చేలా చేశారు….. !!

మాకు ఇంత అన్యాయం చేసి వాళ్ళు మాత్రం పెళ్ళిళ్ళు, శ్రీమంతాలు చేస్తూ సంతోషంగా ఉన్నారు….. !! ఇది నేను తట్టుకోలేక పోతున్నాను డు సమ్థింగ్ రాహుల్ వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఎడవాలి అప్పుడే నేను ఆనందంగా ఉంటాను అని పిచ్చి దానిలా అరుస్తుంది…… !!

నాకు మాత్రం కోపం లేదనుకున్నావా హరిణి….. ?? ఆ రితిక మా నన్నెంత చీట్ చేసింది నాతో ఉంటూ నన్నే వెధవ ను చేస్తుందా……. ?? అది నా కంటికి కనిపించాలి అప్పుడు కానీ దాని సంగతి చెప్పను అని పిడికిలి బిగించి కోపంగా చెప్తాడు….. !!

హరిణి తన గ్లాసు ఫినిష్ చేసి దాని సంగతి తర్వాత కానీ ముందు నా సంగతి చూడు అని అప్పటికే ఫుల్ గా మత్తు ఎక్కడం తో అక్కడే న్యూడ్ గా మారి రాహుల్ వైపు మత్తుగా చూస్తూ లేచి నుంచుంటుంది …… !!

హరిణి ను అల చూసిన రాహుల్ పెదవి కొరుకుతూ తను కూడా డ్రెస్ తీసి హరిణి నడుము పట్టుకుని మీదకు లాక్కుంటాడు…… !! అలా ముద్దు తో మొదలైన వారు రిక్లైనర్ ను పుష్ చేసి బెడ్ లా చేంజ్ చేసి నాగు పాముల్లా ఒకరిని ఒకరు పెన వేసుకుని వంట్లోని వేడి చల్లారే దాకా కోరిక తీర్చుకుంటూ అది తీరగానే మత్తుగా అలాగే బెడ్ మీద పడిపోతారు…… !!

రేణుక జై & ఆధ్య ల సెకండ్ నైట్ ఆపడానికి ఎమ్ ప్లాన్ చేసింది….. ?? గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండి 😌…… !!