Login with OTP

విలన్ హస్బెండ్ {2}-9

aashyatech

Author

రేణుక ను అలా చూసిన అందరూ షాక్ అయితే ముందుగా రియాక్ట్ అయిన జై మామ్ అంటూ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే….. !! ఏయ్ ఆర్ యూ మ్యాడ్ మీ మామ్ ఏమైనా సాల్సా డాన్స్ చేస్తుంది అనుకుంటున్నావా నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అవ్వడానికి….. !! అత్తయ్య ను టచ్ చేస్తే నీకు కూడా షాక్ కొడుతుంది అంటూ జై వెళ్లకుండా చెయ్ పట్టుకుని కంగారుగా ఆపేస్తుంది ఆధ్య….. !!

ఆద్య వాయిస్ కి జై తన వైపు అలాగే చూస్తూ ఉంటే ఆద్య కూడా జై కళ్ళల్లోకి చూస్తూ తను ఎందుకు అలా రియాక్ట్ అయిందో అర్థం అవ్వక వెంటనే జై చేతిని వదిలేస్తుంది….. !!

అన్నయ్య మమ్మీ అని ఏడుస్తూ ఎదోటి చెయ్ మమ్మీ చచ్చిపోయేలా ఉంది….. !! అంటూ తన పక్కనే తాపీగా నుంచున్న రుద్ర నడుము గిచ్చి డు సమ్థింగ్ అంటూ ఏడుస్తున్న మాయ ను చూసి సరే సరే ఏడవకు ……. !! అంటూ కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళను చెప్పుతో కొడితే షాక్ వదిలేస్తుంది అని అంటారు కదా ….. !!  మీ అందరూ మీ చెప్పులతో ఒక్కో దెబ్బ వేయండి మే బీ షాక్ వదిలేయచ్చు …… !!

ఏంటి మమ్మీ ను చెప్పు తో కొడతారా….. ?? నో నేను దీనికి ఒప్పుకోను అని చిన్న పిల్లలా ఏడుస్తున్న మాయ ను హగ్ చేసుకుంటూ…… !! మాయ రిలాక్స్ అన్నయ్య చెప్పింది నిజమే ఇది నేను కూడా ఎక్కడో విన్నాను …… !!  అని మాయ ను ఓదారుస్తూ డాడ్ చూస్తారేంటి అది నిజమే కదా చెప్పండి అంటూ మహిదర్ వైపు చూస్తుంది ఆద్య ….. !!

అవును అమ్ము ఆది నిజమే కానీ పాపం చెల్లెమ్మ ఫీల్ అవుతారేమో అలా కొడితే….. !! అందుకే ఆలోచిస్తూ ఉన్నాను….. !! ఇంకేదైనా వే ఉంటే ఎవరైనా త్వరగా చెప్పండి…. !!

మీ దుంప తెగ మీరు డిబేట్ పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ నా ప్రాణం పోయేలా ఉంది వినయ్ ప్లీస్ సేవ్ మీ అంటూ ఏడుస్థూ షాక్ కి అటు ఇటు బౌన్స్ అవుతూఆ…ఆ ….ఆ ..ఆ….!! అని అరుస్తుంది రేణుక….. !!

ఇది ఆలోచించాల్సిన టైం కాదు కమాన్ గాయ్స్ మీ దగ్గరున్న చెప్పులతో ఆంటీ ను కొట్టండి….. !! అంటూ రుద్ర తొందర పెట్టడం తో అందరూ కంగారు లో కాళ్ళకు ఉన్న చెప్పులు తీసి రేణుక మొహం మీదకు విసురుతారు…… !! అది చూసిన ఆద్య, మాన్య మొహానికి చెయ్ అడ్డు పెట్టుకుని ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు 😅🤭…!!
అయ్యయ్యో నేను కొట్టమంది అలా కాదు అని రేణుక ను చూసి నవ్వుకుని మీ దగ్గర ఉన్న చెప్పు ఒకటి ఇలా ఇవ్వండి నేను ఐతే బాగా కొడతాను…… !! అని రేణుక వైపు చూస్తూ షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటున్న రుద్ర కి మాతో ఎవరి దగ్గర చెప్పులు లేవు…… !!  అని ఆన్సర్ రావడం తో ఇప్పుడెలా అని అటు ఇటు చూస్తూ దేనితో కొట్టాలి అని చూస్తూ ఉంటాడు….. !!

అయినా అన్నయ్య ఆ బాడీ కి చెప్పు తో కొడితే మాత్రం ఎలా తగులుతుంది చెప్పు…. !! పట్టు చీర కూడా నలగకుండా తిని కూర్చుని బాగా పెంచిన వొళ్ళు కదా….. !! అనగానే జై ఆద్య వైపు సీరియస్ గా ఏయ్ ఎంటే వాగుతున్నావ్….. ??

అయ్యో రామా అంత తప్పు మాట నేనేం అన్నానండీ అత్తయ్య కొంచెం బొద్దుగా ఉంటారు అన్నాను అది కూడా తప్పేనా మీరు మరీ అని మూతి తిప్పేస్తూ…… !! అన్నయ్య జై మాటలకేం కానీ ఏదైనా ఒక మంచి కర్ర తీసుకుని కొడితే బెటర్….. !!  అని నా ఒపీనియన్ ఇంకా లేట్ చేస్తే పావురం లాంటి అత్త కాకి లా కావ్ అంటూ మాడిపోయేలా ఉంది ప్చ్ పాపం…. !!

కరెక్ట్ గా చెప్పావ్ ఆధ్య అంటూ రుద్రసన్నగా ఉన్న కర్ర కాకుండా లావుగా బలంగా కొడితే ఎముకలు కూడా విరిగి పోయేలా దృఢంగా ఉన్న కర్ర ను స్టైల్ గా చేత్తో తిప్పుతూ రేణుక వైపు కన్నింగ్ గా నవ్వుతాడు….. !!

అమ్మో దానితో కొడితే చచ్చిపోతా వద్దు నన్ను కొట్టదు అని అరుస్తున్న రేణుక వైపు చూస్తూ….. !! కాసేపు ఓర్చుకో అత్త దాంతో కొట్టక పోయినా చస్తావ్ అదే దాంతో కొడితే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి….. !! కొంచెం కోపరేట్ చెయ్ అన్నయ్య నువ్వు కానివ్వు…… !! అంటూ ఆపడానికి ముందుకు వెళ్తున్న వాళ్ళను కూడా ఆపేస్తూ రుద్ర కి కన్ను కొడుతూ సైగ చేస్తుంది…. !!

ఒకే డన్ అన్నట్టు రుద్ర కూడా లెఫ్ట్ ఐ వింక్ చేసి రేణుక ను పచ్చడి పచ్చడి కింద రోట్లో వేసి కారం కొట్టినట్టు కొట్టగానే చచ్చాన్ రా బాబు అంటూ రేణుక కింద పడిపోతుంది….. !! వావ్ అన్నయ్య నువ్వు ఒక ప్రాణాన్ని రక్షించావ్ మా అత్త లైఫ్ లాంగ్ దేవుడి రూమ్ లో నీ ఫోటో పెట్టుకుని పూజించాలి…. !!
ఏయ్ నీ ఓవర్ యాక్షన్ ఆపు….. !! అంటూ స్పృహ లేకుండా పడున్న రేణుక ను కంగారుగా బుగ్గలు తడుతూ పిలుస్తున్నా రేణుక లో ఎలాంటి చలనం ఉండదు…… !! ఓహ్ మై గాడ్ మామ్… !! మామ్ కళ్ళు తెరువు అని ఎంత పిలిచినా రేణుక కళ్ళు తెరవదు…. !!

జై ఫాస్ట్ గా రేణుక ను రెండు చేతులతో లిఫ్ట్ చేయాలి అనుకున్నా ఆ విగ్రహాన్ని కొంచెం కూడా కదపలేక పోతాడు….  !! అత్తయ్య ను లేపడానికి మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు మీరు కూడా హెల్ప్ చేయండి అన్నయ్య అంటూ రుద్ర, అమర్ లను కూడా ఆద్య ముందుకు నెడుతుంది…. !!

ముగ్గురూ కలిసి ఎలాగోలా ఎనబై కేజీలా రేణుక ను కష్టంగా మోసుకుని వెళ్ళి హాల్ మిడిల్ లో నేల మీద పడుకోబెడతారు….. !! వాటర్ అంటూ జై అడగ్గానే మాన్య కిచెన్ లోకి ఫాస్ట్ గా పరిగెత్తి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి జై చేతికి ఇస్తుంది…. !! జై రేణుక మొహం మీద వాటర్ అరచేత్తో తీసుకుని స్ప్రింకిల్ చేసినా రేణుక లో మూమెంట్ లేకపోవడం తో జై వినయ్ వైపు & మహిదర్ వైపు కంగారుగా చూస్తాడు….. !!

ఏంటిది నా అత్త షాక్ తో చచ్చిందా ఏంటీ……?? అయినా అంత త్వరగా పోయే ప్రాణం కాదే అని ఆలోచిస్తూ రేణుక ముక్కు దగ్గర చూపుడు వేలు పెట్టి చూస్తూ ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేస్తుంది….. !! అది చూసిన మాయ ఏడుస్తూ వదిన ఏమైంది అని టెన్షన్ గా అడుగుతూ ఉంటే అత్తయ్య కి శ్వాస ఆడడం లేదు…….. !! మాయ అంటూ కన్నీళ్లు రాకపోయినా ఏడుస్తూ ఉంటుంది ……. !! అది విన్న మాయ నిజంగా రేణుక చచ్చిపోయింది అనుకుని మమ్మీ అంటూ గట్టిగా ఏడ్చేస్తుంది….. !!

అమర్ కంగారుగా రేణుక హ్యాండ్ పట్టుకుని ఓహ్ గాడ్ పల్స్ కూడా వర్క్ చేయట్లేదు….. !! అది విన్న అందరూ కూడా నిజంగా షాక్ తో రేణుక పోయింది అని డిసైడ్ అయిపోయి శోకాలు పెడుతూ ఏడుస్తూ ఉంటారు…… !! మరి హార్ట్ బీట్ అని అడిగిన శైలు వాయిస్ కి మాన్య రేణుక గుండెల మీద తల పెట్టుకుని చూసి నో ఆంటీ హార్ట్ బీట్ కూడా లేదు అనగానే ఏడుపులు మరింత పెద్దవి అవుతాయి….. !!

ఆ…. !! ఆల్ ఆఫ్ యూ షట్ యువర్ మౌత్స్ అని కోపంగా అరిచిన జై వాయిస్ కి అందరూ నోటి మీద చెయ్ వేసి చూస్తుంటే….. !! జై టెన్షన్ గా రేణుక జై చెయ్ పట్టుకుని పల్స్ చెక్ చేసి అందరి వైపు చూస్తూ పల్స్ ఉంది బట్ చాలా లోగా ఉంది అని వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేస్తాడు….. !!

ఇదేంటయ్యా అందరూ ఫ్లాష్ లైట్స్ పట్టుకుని అలా ఉన్నారు అని లోపలికి వచ్చిన డాక్టర్ రేణుక చుట్టూ ఫ్లాష్ లైట్స్ పట్టుకుని కూర్చున్న అందరిని చూసి…… !! శవం చుట్టూ కూర్చున్నట్టు ఏంటీ అలా కూర్చున్నారు……. ?? పేషెంట్ కి కొంచెం గాలి ఆడనివ్వండి మూవ్ అనగానే అందరూ ఒక సైడ్ కి వెళ్ళిపోయి డాక్టర్ ఎమ్ చెప్తాడా అని చూస్తూ ఉంటారు……  !!

నథింగ్ టు వర్రీ షాక్ తగలడం వళ్ళ కొంచెం బయటపడ్డారు ఇంజెక్షన్ చేస్తాను…… !! ఇంకో హాఫ్ ఆన్ ఆర్ లో మెలకువ వచ్చేస్తుంది అంటూ ఇంజెక్షన్ చేస్తున్న డాక్టర్ వైపు చూస్తూ….. !! అంటే షాక్ తగిలినా మా అత్త బతికేసిందా అని అడుగుతున్న ఆద్య వైపు జై కొట్టేలా చూస్తూ ఉంటాడు….. !!

అదే జై అత్త కి ఎమ్ అవ్వలేదు అని కొంచెం హ్యాపీగా & రిలాక్సింగ్ గా ఉంది అని కవర్ చేసి రేణుక కాన్షియస్ లోకి ఎపుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ…… !! ఒక రకంగా నీకు థాంక్స్ చెప్పాలి అత్త నా విలన్ హస్బెండ్ నుండి ఎస్కేప్ అయ్యేలా చేసావ్…… !?  ఎలాగో పవర్ కూడా లేదు కాబట్టి ఇవాళ నేను సేఫ్ …… !! అని బెడ్ రూమ్ లో జై ఎమ్ చేశాడో గుర్తు రాగానే జై వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది….. !!

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

మామ్ ఐ ఆమ్ బ్యాక్ అంటూ తన మదర్ ను బ్యాక్ హగ్ చేసుకుంటూ నవ్వుతూ ఆవిడ మెడ చుట్టూ చేతులు వేస్తూ చెప్తున్న అభీర్ ను చూసి తన మదర్ హ్యాపీగా ఫీల్ అవుతూ….. !! అభీర్ ఎప్పుడొచ్చావ్ రా ఇంకో వన్ మంత్ దాకా నీ బిజినెస్ ట్రిప్ ఉంది కదా……. ?? ఇలా సడెన్ గా ఎట్ లీస్ట్ వస్తున్నట్టు ఇన్ఫార్మ్ కూడా చేయకుండా వచ్చావ్ ఏంటి నాన్న అంటూ ఇటు వైపు తిరుగుతూ కొడుకును హ్యాపీగా హాగ్ చేసుకుంటూ అడుగుతుంది….. !!

ఫ్రెష్ అయి వచ్చి అన్నీ క్లియర్ గా చెప్తాను ఆఫ్టర్ 3 మంత్స్ ఇండియా వచ్చాను కాబట్టి నాకు ఫాస్ట్ ఫాస్ట్ గా నా ఫేవరేట్ డిషెస్ కుక్ చెయ్…. !! నేను తింటూ నా సింగపూర్ టూర్ విషయాలు చెప్తూ ఇక్కడ విషయాలు తెలుసుకుంటాను అని చెప్పి తన రూమ్ కి విజిల్ వేస్తూ వెళ్తున్న కొడుకుని చూస్తూ కుక్ చేయడానికి వెళ్తుంది అభీర్ మదర్…. !!

అభీర్ ఫ్రెష్ అయ్యి డ్రెస్ అప్ అయ్యాక తన వాలెట్ లో ఉన్న ఆద్య పిక్ వైపు చూస్తూ మిస్ యూ ఆద్య ❣️…..?? అసలేమైంది నీకు ఎన్ని కాల్స్, మెసేజెస్ చేసినా నీ నుండి రిప్లై లేదు మెయిల్స్ కి కూడా రెస్పాండ్ అవ్వడం లేదు….. ?? ఇన్ఫాక్ట్ నేను ఇండియా కి ఇంత సడెన్ గా రావడానికి రీసన్ కూడా నువ్వే ఎందుకో బాగా గుర్తిస్తున్నావ్….. !!

నాకు కావాల్సింది ఏదో నాకు దూరం అవుతున్న ఫీలింగ్ అందుకే ఇంక అక్కడ ఉండలేక పోయాను….. !! ఇక లేట్ చేయను బంగారం నీ మీద నాకున్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి నిన్ను నా దాన్ని చేసుకుని మన ఇంటికి ఎత్తుకొచ్చేస్థా …… !! అని నవ్వుకుంటూ వాలెట్ పాకెట్ లో పెట్టుకుని కిందకు వెళ్ళేసరికి తన మదర్ తనకు నచ్చిన డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది…… !!

మామ్ ఐ ఆమ్ రెడీ అంటూ చైర్ లో కూర్చుంటున్న అభీర్ ను చూసి నవ్వుతూ…… !! ఐ ఆమ్ అల్సో రెడీ కన్నా అని అభీర్ ప్లేట్ లో ఫుడ్ సర్వ్ చేస్తూ ఇన్నాళ్ళు నా వంట బాగా మిస్ అయ్యుంటావ్ కదా…… !! అందుకే ఇవాళ నేనే తినిపిస్తాను ఎదీ ఆ ‘ అను అంటూ అభీర్ కడుపు నిండా తినిపిస్తూ ఇపుడు చెప్పు ఎందుకింత సడెన్ గా వచ్చావ్…… ??

టు బీ ఫ్రాంక్ ఆధ్య ను బాగా మిస్ అయ్యాను మామ్….. !! తను కూడా 3 మంత్స్ గా నాకు టచ్ లో లేదు అందుకే ఇక అక్కడ ఉండలేక వచ్చేశా…. !! ఇక లేట్ చేయకుండా రేపు మార్నింగ్ ఆద్య ఇంటికి వెళ్ళి తనను బయటకు తీసుకొని వెళ్ళి నా లవ్ స్టోరీ ను ఆధ్య ముందు ఓపెన్ చేయబోతున్నా ….. !! అందుకు కావాల్సిన అరేంజ్మెంట్స్ చూసుకోవాలి బై మామ్ అంటూ వాటర్ తాగి వెళ్తున్న కొడుకు వైపు చూస్తూ….. !! కన్నా…!! అది కాదు నీతో మాట్లాడాలి..!! ఛా ఇలా వెళ్ళిపోయాడు ఏంటి…… ?? ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది అని వీడికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది….. !!