విలన్ హస్బెండ్{2} -31
గెస్ట్ హౌస్ ముందు ఆగిన కార్ నుండి నాలుగు డోర్స్ ఓపెన్ చేసుకుని కిందకు దిగుతారు జై, రుద్ర, అమర్ & మహిదర్ వెనుకే వచ్చిన గౌతం కూడా తన బైక్ పార్క్ చేసి వీళ్ళ వెనుకే ఫాలో అవుతాడు…… !! జై డైరెక్ట్ గా అందరినీ తీసుకుని హరీష్ ఉన్న రూమ్ లోకి వెళతాడు అప్పటికే నైట్ నుండి కాళ్ళు, చేతులు & నోరు కూడా కట్టేయడం వల్ల నీరసంగా కనిపిస్తున్న హరీష్ ను చూసి నవ్వుతూ…… !! ఏంట్రా నైట్ బాగా నిద్ర పట్టిందా నీకు ఇబ్బందిగా ఎమ్ అనిపించలేదు కదా అని అడుగుతూ హరీష్ కి ఎదురుగా చేర్ లో కూర్చుంటూ నోటికి ఉన్న ప్లాస్టర్ తీస్తాడు……. !!
జై లీవ్ మీ చెప్తున్నా కదా నేనేం చేయలేదు అసలు నన్ను ఎందుకు తీసుకుని వచ్చావ్…… ?? నన్ను నా ఫ్యామిలీ ను ఆల్రెడీ రోడ్ మీద కు లాగేసావ్ ఇంకా ఇంకా ఎమ్ చేయాలి అనుకుంటున్నావ్ ……. ??
అన్ని చేసినా మీకు ఇంకా బుద్ధి రాలేదు కదరా అయినా కుక్క తోక వంకర అన్నట్టు మీరు ఈ జన్మకు మారరు…… !! మీకు ఏదైనా గ్రడ్జ్ ఉంటే నన్ను టార్గెట్ చేయండి అంతే కానీ నా చుట్టూ ఉన్న మనుషుల ను ఎందుకు టార్గెట్ చేశారు…… ?? ఇదంతా కాదు హరీష్ నేను నిన్ను వదిలేయాలి అంటే నాకు రితిక ఎక్కడుందో తెలియాలి …….. !!
రితిక ఓ నో అసలు ఆ రితిక ఎవరో కూడా నాకు ఐడియా లేదు ప్లీస్ జై నేను చెప్పేది నిజం….. !! ప్రామిస్ గా చెప్తున్నా ఐ రియల్లీ డోంట్ నోహ్ అబౌట్ రితిక అయిన ఏదైనా చేయాలి అనుకున్నా…… !! నీ చెల్లిని ఎత్తుకుని వస్తాను కానీ ఎవరో తెలియని అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేస్తాను….. !!
హౌ డేర్ యూ నా ముందే నా చెల్లిని ఎత్తుకుని వెళ్తా అంటావా అంటూ హరీష్ చంప పగల కొట్టేలోగా…… !! రుద్ర కొట్టిన దెబ్బ కు హరీష్ కి రెండు పళ్ళు ఊడి నోట్లో నుండి బ్లడ్ వస్తుంది అది చూసిన అమర్ అబ్బో అన్నట్టు చూస్తాడు 🙄 ……. !! కానీ జై, మహీదర్ మాత్రం రుద్ర నుండి ఈ ఇన్స్టెంట్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయకపోవడం తో షాకింగ్ గా చూస్తూ ఉంటారు……. !!
మరో సారి నీ నోటి నుంచి మాయ అన్న పేరు వచ్చినా నిన్ను చంపి పాతేస్తా జాగ్రత్తా అని వార్నింగ్ ఇచ్చి జై వైపు చూసిన రుద్ర కి జై తన వైపే డౌబ్ట్ గా చూస్తూ కనిపిస్తాడు…… !! ఏంటిది జై తో పాటు డాడీ కూడా నా వైపు అనుమానంగా చూస్తున్నారు 🤔 ….. !! ఆ… షట్ 🤦 మాయ గురించి అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యి పీకల మీదకు తెచ్చుకున్నట్టు ఉన్నా ఏదోలా మ్యానేజ్ చేయాలి అనుకుంటూ……. !! మాయ మాత్రమే కాదు ఆద్య, మాన్య…… !! మా ఇంటి ఆడపిలు ఎవరి వైపు నీ చూపు పడ్డా చూడడానికి నీకు కళ్ళు ఉండవు జాగ్రత్తా……… !!
అబ్బబ్బా ఏమన్నా కవర్ చేసావా స్వామి అని మెల్లగా అంటున్న అమర్ ను చూసి…… !! ఎవరు చూడకుండా కన్ను కొడతాడు 😜 అది చూసిన అమర్ తల కొట్టుకుంటూ వీడికి నా మీద అడ్డమైన డౌట్స్ వస్తాయి……… !! ఆర్యన్ ఇంత క్లియర్ గా నీ చెల్లి మీద తనకు ఉన్న ఇంట్రెస్ట్ చూపిస్తున్న తెలుసుకోలేక పోతున్నాడు అని అనుకుంటూ జై వైపు గుర్రుగా చూస్తూ ఉంటాడు… !!
నాకు ఓపిక అస్సలు లేదు చెప్తున్నా మర్యాదగా రితిక ను ఎక్కడ దాచావో చెప్పు లేకపోతే ఇక్కడి నుండి ఇక్కడి నుంచి ప్రాణాలతో బయట పడవు…….. !!
నువ్వు ఎన్ని సార్లు అడిగినా నా నుండి వచ్చే అన్సర్ తెలియదు ఎందుకంటే ఆ అమ్మాయిని నేను నిజంగా కిడ్నాప్ చేయలేదు….. !! అయినా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే నాకేంటి యూస్ ఇంత చెప్పినా నువ్వు నమ్మక పోతే నీకు నచ్చింది చేసుకో……. !! అని సీరియస్ గా చెప్తున్న హరీష్ మాటల్లోని కాన్ఫిడెన్స్ కి అందరూ ఆలోచనలో పడతారు…… !!
జై నాకు ఎందుకో వీడికి నిజంగా రితిక ఎక్కడుందో తెలియదు అనుకుంటున్నా……. ?? మహిదర్ వాయిస్ కి రుద్ర, అమర్ కూడా మా ఒపీనియన్ కూడా అదే జై అని ముక్త కంఠం తో చెప్తారు…… !! జై విసుగ్గా హరీష్ ను వెనక్కి నెట్టి రూమ్ నుండి బయటకు నడవగానే వెనుకే అందుతూ వెళతారు…… !!
రేయ్ నన్ను వదిలేయండి జై….. జై…… అని అరుస్తున్న హరీష్ వాయిస్ కి వెనక్కి తిరిగి…… !! హరీష్ అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి రితిక బయటకు వచ్చాకే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళేది……. !! అప్పటి వరకు హాయిగా రెస్ట్ తీసుకో బాయ్ అంటూ వెళ్తున్న అమర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు హరీష్…… !!
వీడు కాకుండా రితిక ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది…… ?? అసలు రితిక ను ఎవరు కిడ్నాప్ చేసారు డబ్బు కోసమే అయ్యుంటే ఈ పాటికి కాల్స్ వచ్చేవి అవి రాలేదు అంటే సమ్థింగ్ ఇస్ హ్యాపెనింగ్ అనుకుంటూ…… !! గౌతమ్ రితిక కు ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా లైక్ తనంటే ఇష్టం లేని వాళ్ళు……. !! అలా ఎవరైనా ఉంటే జాగ్రత్తగా గుర్తు చేసుకుని చెప్పు…….. !!
రితిక చాలా మంచి అమ్మాయ్ సర్ తనకు ఎవరు ఎనిమీస్ లేరు…… !! తను అందరితో చాలా ఫ్రెండ్లీ గా మూవ్ అవుతుంది…… !!
ఒకే మరి తనను లవ్ చేయమని ఎవరైనా ఇబ్బంది పెడుతూ తన వెనుకే తిరుగుయూ ఇబ్బంది పెట్టేవాళ్ళ ఎవరైనా….. ??
గౌతమ్ జై క్వశ్చన్ కి ఆలోచిస్తూ నాకు తెలిసి అలాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు సర్….. !! అలాంటిది ఏమైనా ఉండుంటే తను కచ్చితంగా నాతో షేర్ చేసుకునేది….. !!
జై కి పిచ్చి పడుతోంది అసలు రితిక ను ఎవరు కిడ్నాప్ చేసారో కొంచెం కూడా అర్థం అవ్వక మైండ్ బ్లాక్ అయిపోయి క్లాంప్సీ గా అనిపిస్తోంది…… !! మావయ్య విత్ యువర్ పర్మిషన్ అంటూ సిగరెట్ చూపిస్తూ అడుగుతున్న జై వైపు చూస్తూ ఓన్లీ వన్ అంటూ పర్మిషన్ ఇస్తాడు మహిదర్…… !! థాంక్ యూ అని సిగర్ తీసుకుని తాగుతున్న జై ను చూసి నీ స్టైల్ తగలైయ్య ……. !! పిల్లను ఇచ్చిన మామ ఎదురుగా సిగరెట్ తాగుతున్నావ్ చూడు నిన్ను ఎలా పొగడాలో కూడా తెలియడం లేదు రా నాయనా… !!
సిగరెట్ కావాలంటే అడుగు ఎందుకింత పెద్ద కళ్ళు వేసుకుని చూస్తున్నావ్ రా అని అమర్ తల మీద మొట్టి…… !! ఇదో గుర్తొచ్చిన వాడిలా గౌతమ్ వైపు చూసి గౌతం ఎక్కడికి వెళ్ళినా నువ్వు, రితిక కలిసే వెళ్తాం…… !! అని చెప్పావ్ కదా మరి ఆ రోజు రితిక తో నువ్వు ఎందుకు బయటకు వెళ్లలేదు….. ??
సర్ యాక్చుఎల్లీ ఆ రోజు నాకు ఆఫీస్ లో చాలా హెక్టిక్ వర్క్ ఉంది…… !! రితిక కి ఆ రోజు అఫ్ సో తను ఫ్లాట్ లోనే ఉంది తనకు తెలిసిన అమ్మాయికి హెల్త్ అప్సెట్ అయ్యి హాస్పిటల్ లో అడ్మిట్ అయిందని హాస్పిటల్ కి వెళ్తున్నాను అని చెప్పింది…… !! అదే సర్ నేను తనతో మాట్లాడిన లాస్ట్ కాల్ అని చెప్తూ…….. !! లేదు సర్ దీని తర్వాత కూడా మాట్లాడాను హస్పిటల్ నుండి స్టార్ట్ అవుతూ…….. !! ఫ్లాట్ కి వెళ్తున్నట్టు చెప్పింది ఆ తర్వాత తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది…… !!
సో తను హస్పిటల్ నుండి ఫ్లాట్ కి వెళ్తున్నప్పుడే ఏదో జరిగింది….. !! నీకు తను ఏ హస్పిటల్ కి వెళ్ళిందో ఐడియా ఉందా……… !!
యా….. !! తెలుసు సర్ యశోద హాస్పిటల్
లెట్స్ మూవ్ అక్కడికి వెళ్తే మనకు ఏదైనా క్లూ దొరకచ్చు అంటూ సిగరెట్ కింద పడేస్తూ……. !! గెస్ట్ హౌస్ కి లాక్ చేస్తూ కార్ స్టార్ట్ చేస్తాడు జై మిగిలిన అందరూ ……. !! కూడా అక్కడికి వెళ్తే ఎమ్ క్లూ దొరుకుతుంది అని ఆలోచిస్తూనే హస్పిటల్ కి చేరుకుంటారు…… !!
హాస్పిటల్ పార్కింగ్ ప్లేస్ లో కార్ పార్క్ చేసిన జై రిసెప్షన్ లో సీసీ ఫుటేజ్ రూమ్ గురించి అడిగి అక్కడి వెళ్లడం చూసి అందరూ జై ను ఫాలో చేస్తారు….. !! హాయ్ నాకు టు 2 డేస్ బ్యాక్ మార్నింగ్ టూ ఈవెనింగ్ ఫుటేజ్ కావాలి…… !!
సడెన్ గా లోపలికి వచ్చి ఫుటేజ్ కావాలి అని అడుగుతున్న జై ను చూసి…… !! మీరు పోలీస్ ఆ కాదు కదా ఎవరికి పడితే వాళ్లకు మేము ఫుటేజ్ ఇవ్వం ఇక మీరు వెళ్ళచ్చు…… !! నెక్స్ట్ సెకండ్ జై కొట్టిన దెబ్బకు ఇస్ ప్యాక్ వాచిన చంప మీద పెట్టుకుని జై అడిగిన డేట్ & టైం సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూపిస్తాడు…… !!
10 తరువాత రితిక కాల్ మాట్లాడుతూ హస్పిటల్ కి రావడం చూసి అందరూ అలెర్ట్ అవుతూ చూస్తూ ఉంటారు….. !! కాసేపటికి అదే హాస్పిటల్ కి harini, రాహుల్ కూడా రావడం చూసి అందరూ షాకింగ్ గా ఒకరిని ఒకరు చూసుకుంటారు…… !! దాదాపు గంట సేపటి తర్వాత రితిక మొబైల్ లో ఏదో టైప్ చేస్తూ అక్కడి నుండి బయటకు వెళ్తూ ఉంటే తననే ఫాలో అవుతూ వెనుకే వెళతాడు రాహుల్…… !!
ఎవడ్రా వాడు…… ?? అమర్ క్వశ్చన్ కి రాహుల్ అని ఆన్సర్ ఇస్తాడు మహిదర్……. !! వాట్ అంటే వాడు హరిణి బాయ్ ఫ్రెండ్ ఆ అని ఫస్ట్ టైమ్ రాహుల్ ను చూడ్డం తో రాహుల్ పీక్ ను తన మొబైల్ లో క్యాప్చర్ చేసి జూమ్ చేస్తూ ఉంటాడు జై…… !!
అవును వాడిని స్పై చేయడానికే రితిక ను వాడి దగ్గరకు పంపాను కానీ…… !! వాడు అది మనసులో పెట్టుకుని రితిక ను కిడ్నాప్ చేస్తాడు అనుకోలేదు అంటూ తల పట్టుకుని బాదగా చెప్తాడు మహిదర్…… !!
రిలాక్స్ మావయ్య రితిక ను ఎవరు కిడ్నాప్ చేసారో తెలిసింది కదా……. !! 24 ఆర్స్ లో వాడు ఎక్కడున్నా పట్టుకుని మీ ముందు నిలబెడతాను అని పార్కింగ్ ఫుటేజ్ ఓపెన్ చేయమని చెప్తాడు జై…… !! సరిగ్గా అప్పుడే రితిక నుండి గౌతం కి కాల్ వస్తుంది అది ఆన్ నోన్ నంబర్ అనుకున్న గౌతమ్ ఆ కాల్ కట్ చేసి సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు…… !!
ఎన్ని సార్లు కాల్ చేసినా గౌతమ్ కట్ చేయడం తో రితిక మొబైల్ ను పట్టుకుని ఏడుస్తూ అలాగే వాష్ రూమ్ లో ఉండిపోతుంది…… !! పార్కింగ్ ఫుటేజ్ లో రాహుల్ కార్ నంబర్ నోట్ చేసుకున్న జై ఇక లేట్ చేయకుండా……. !! తనకు తెలిసిన పర్సన్ RTO లో వర్క్ చేస్తున్నాడని గుర్తొచ్చి వెంటనే ఆయనకు కాల్ చేసి విషయం బ్రీఫ్ గా చెప్పి డీటైల్స్ అడుగుతాడు…… !!
10 మినిట్స్ లో కాల్ చేస్తాను జై అని ఆయన కాల్ కట్ చేయడం తో ఇంకొక్క 10 మినిట్స్ లో రితిక ఎక్కడుందో తెలుస్తుంది అనగానే…… !! గౌతమ్ ఆనందంగా జై ను హత్తుకుంటూ మీరు చేస్తున్న ఈ హెల్ప్ ను ఈ లైఫ్ లో మర్చిపోలేను సర్ థాంక్ యూ సో మచ్…… !!
గౌతమ్ కూల్ ఇది నేను హెల్ప్ అనుకోవడం లేదు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఒకే ……. !! రితిక ఇస్ లైక్ మై సిస్టర్ తనను సేఫ్ గా నీ చేతుల్లో పెడతాను ట్రస్ట్ మీ అంటూ ధైర్యం చెప్పి తనకు నాన్సీ నుండి వచ్చిన కాల్స్ చూసి ఎక్స్క్యూస్ మీ అంటూ బయటకు వచ్చి నాన్సీ కి కాల్ బ్యాక్ చేస్తాడు…… !!
గౌతమ్ ఇట్స్ మీ రితిక ప్లీస్ సేవ్ మీ నాకు చాలా భయంగా ఉంది రా….. !! నన్ను రాహుల్ కిడ్నాప్ చేశాడు నాకు ఎక్కువ టైమ్ లేదు ప్లీస్ పిక్ ది కాల్ …….. !! రితిక నుండి వచ్చిన మెసేజెస్ చూసిన గౌతమ్ షాక్ అవుతూ సర్ రితిక మెసేజ్ చేసింది అని మెసేజెస్ అందరికీ చూపించి…… !! లేట్ చేయకుండా రితిక నుండి వచ్చిన మొబైల్ కి కాల్ బ్యాక్ చేస్తాడు…… !!